04-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 30.11.2008


‘‘ఫుల్ స్టాప్ పెట్టి, సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి, మనసా సకాష్ ద్వారా సుఖ-శాంతుల అంచలిని ఇచ్చే సేవ చెయ్యండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న మహాన్ పిల్లలను చూస్తున్నారు. ఏ మహానతను చేసారు? దేనినైతే ప్రపంచము అసంభవము అంటుందో, దానిని సహజముగా సంభవము చేసి చూపించారు, అదే పవిత్రతా వ్రతము. మీరందరూ పవిత్రతా వ్రతాన్ని ధారణ చేసారు కదా! బాప్ దాదా నుండి పరివర్తన అనే దృఢ సంకల్పము యొక్క వ్రతాన్ని తీసుకున్నారు. వ్రతము తీసుకోవడము అనగా వృత్తిని పరివర్తన చేసుకోవడము. ఏ వృత్తిని పరివర్తన చేసుకున్నారు? మేమందరమూ పరస్పరము సోదరులము అని సంకల్పము చేసారు, ఈ వృత్తి పరివర్తన కోసము భక్తిలో కూడా ఎన్ని విషయాలలో వ్రతము తీసుకుంటారు కానీ మీరందరూ బాబా వద్ద దృఢ సంకల్పము చేసారు, ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాది పవిత్రత మరియు పవిత్రత ద్వారానే పరమాత్మ ప్రేమ మరియు సర్వ పరమాత్మ ప్రాప్తులు కలుగుతున్నాయి. మహాత్ములు దేనినైతే కఠినమని భావిస్తున్నారో, అసంభవమని భావిస్తున్నారో, మీరు ఆ పవిత్రతను స్వధర్మముగా భావిస్తున్నారు. బాప్ దాదా చూస్తున్నారు, కొంతమంది మంచి-మంచి పిల్లలు సంకల్పము చేసారు మరియు వారు దృఢ సంకల్పము ద్వారా ప్రాక్టికల్ గా పరివర్తనను చూపిస్తున్నారు. నలువైపులా ఉన్న ఇటువంటి మహాన్ పిల్లలకు బాప్ దాదా చాలా-చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలను ఇస్తున్నారు.

మీరందరూ కూడా మనసా, వాచా, కర్మణా, వృత్తి, దృష్టి ద్వారా పవిత్రతను అనుభవము చేస్తున్నారు కదా! పవిత్రతా వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన, శుభ కామన కలిగి ఉండటము. దృష్టి ద్వారా ప్రతి ఆత్మను ఆత్మిక స్వరూపములో చూడటము, స్వయాన్ని కూడా సహజముగా సదా ఆత్మిక స్థితిలో అనుభవము చేయటము. బ్రాహ్మణ జీవితపు మహత్వము మనసా, వాచా, కర్మణాలో పవిత్రత. పవిత్రత లేకపోతే బ్రాహ్మణ జీవితానికి గాయనమేదైతే ఉందో - సదా పవిత్రతా బలముతో స్వయానికి స్వయము కూడా ఆశీర్వాదాలు ఇచ్చుకుంటారు అని, ఏ ఆశీర్వాదాలను ఇస్తారు? పవిత్రత ద్వారా సదా స్వయము కూడా సంతోషాన్ని అనుభవము చేస్తారు మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని ఇస్తారు. పవిత్ర ఆత్మకు మూడు విశేష వరదానాలు లభిస్తాయి - ఒకటి, స్వయానికి స్వయమే వరదానము ఇచ్చుకుంటారు, దాని వలన సహజముగా బాబాకు ప్రియముగా అవుతారు. రెండు - వరదాత అయిన బాబాకు నియరెస్ట్ మరియు డియరెస్ట్ (సమీపమైన మరియు ప్రియమైన) పిల్లలుగా అవుతారు, అందుకే బాబా ఆశీర్వాదాలు స్వతహాగా ప్రాప్తిస్తాయి మరియు సదా ప్రాప్తిస్తాయి. మూడవది, బ్రాహ్మణ పరివారములో విశేషముగా ఎవరైతే నిమిత్తమయ్యారో, వారి నుండి కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ముగ్గురి ఆశీర్వాదాలతో సదా ఎగురుతూ ఉంటారు మరియు ఎగిరిస్తూ ఉంటారు. మీరందరూ కూడా స్వయాన్ని ప్రశ్నించుకోండి, స్వయాన్ని చెక్ చేసుకోండి - పవిత్రత బలాన్ని మరియు పవిత్రత ఫలాన్ని సదా అనుభవము చేస్తున్నారా? సదా ఆత్మిక నషా, హృదయములో శుద్ధ నషా ఉంటున్నాయా? అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు అమృతవేళ మిలనము చేసుకునేటప్పుడు, ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు, ఏమంటారో తెలుసా? పవిత్రత ద్వారా ఏదైతే అతీంద్రియ సుఖము అనే ఫలము లభిస్తుందో, అది సదా ఉండటము లేదు, ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండటము లేదు అని అంటారు. ఎందుకంటే పవిత్రతకు ఫలమే అతీంద్రియ సుఖము. కావున స్వయాన్ని ప్రశ్నించుకోండి, నేను ఎవరిని? సదా అతీంద్రియ సుఖపు అనుభూతిలో ఉంటున్నానా లేక అప్పుడప్పుడు ఉంటున్నానా? స్వయాన్ని ఏమని పిలుచుకుంటారు? అందరూ మీ పేరును వ్రాసేటప్పుడు ఏమని వ్రాస్తారు? బి.కె. ఫలానా... దానితో పాటు స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివాన్ అని చెప్పుకుంటారు. అందరూ మాస్టర్ సర్వశక్తివంతులే కదా! ఎవరైతే స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతులుగా భావిస్తున్నారో, సదా భావిస్తున్నారో, అప్పుడప్పుడు కాదో, వారు చేతులెత్తండి. సదానా? చూడండి, ఆలోచించండి, సదా అలా ఉంటున్నారా? డబుల్ విదేశీయులు చేతులెత్తడము లేదు. కొద్దిమందే ఎత్తుతున్నారు. టీచర్లు చేతులు ఎత్తండి, సదా అలా ఉంటున్నారా? ఊరికే అలా ఎత్తకండి, ఎవరైతే సదా ఉంటున్నారో వారు ఎత్తండి. చాలా కొద్దిమంది ఉన్నారు. పాండవులు చేతులు ఎత్తండి. వెనుక ఉన్నవారు ఎత్తండి, చాలా కొద్దిమంది ఉన్నారు. పూర్తి సభ ఎత్తడము లేదు. అచ్ఛా, మాస్టర్ సర్వశక్తివంతులు కదా, ఆ సమయములో శక్తులు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? మాస్టర్ కదా, దాని అర్థము ఏమిటంటే, మాస్టర్ అంటే తండ్రికన్నా కూడా ఉన్నతముగా ఉంటారు. కావున చెక్ చేసుకోండి - తప్పకుండా పవిత్రత పునాదిలో కొంత బలహీనముగా ఉన్నారు. ఏ బలహీనత ఉంది? మనసులో అనగా సంకల్పాలలో బలహీనత ఉందా, మాటలలో బలహీనత ఉందా లేక కర్మలలో బలహీనత ఉందా లేక స్వప్నాలలోనైనా బలహీనత ఉందా ఎందుకంటే పవిత్ర ఆత్మ యొక్క మనసు, మాటలు, కర్మలు, సంబంధ-సంపర్కాలు, స్వప్నాలు స్వతహాగా శక్తిశాలిగా ఉంటాయి. వృత్తిని మార్చుకోవాలి అన్న వ్రతాన్ని తీసుకున్నప్పుడు అప్పుడప్పుడూ ఎందుకు మరి? సమయాన్ని చూస్తున్నారు, సమయము యొక్క పిలుపును, భక్తుల పిలుపును, ఆత్మల పిలుపును వింటున్నారు మరియు అకస్మాత్తుగా అనే పాఠమైతే అందరికీ పక్కాగానే ఉంది. మరి పునాదిలో బలహీనత అనగా పవిత్రతలో బలహీనత ఉండటము. ఒకవేళ మాటలలో కూడా శుభ భావన, శుభ కామన లేనట్లయితే, మాటలు పవిత్రతకు విరుద్ధముగా ఉన్నట్లయితే, అప్పుడు కూడా సంపూర్ణ పవిత్రతలో ఏదైతే సుఖము ఉందో, అతీంద్రియ సుఖము, దానిని అనుభవం చేయలేరు, ఎందుకంటే బ్రాహ్మణ జీవితము యొక్క లక్ష్యమే అసంభవాన్ని సంభవము చెయ్యటము. అందులో ఎంత మరియు అంత అన్న మాటలు ఉండవు. ఎంత కావాలంటే అంత అని ఉండదు. కావున రేపు అమృతవేళ విశేషముగా ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి, ఇతరుల గురించి ఆలోచించకండి, ఇతరులను చూడకండి, స్వయాన్ని చెక్ చేసుకోండి - ఎంత శాతములో పవిత్రతా వ్రతాన్ని పాటిస్తున్నాను? నాలుగు విషయాలను చెక్ చేసుకోండి - ఒకటి - వృత్తి, రెండు - సంబంధ, సంపర్కాలలో శుభ భావన, శుభ కామన. వీరింతే అని అనుకోకండి, అలా కాదు. ఆ ఆత్మ పట్ల కూడా శుభ భావనను ఉంచండి. మీరందరూ స్వయాన్ని విశ్వ పరివర్తకులుగా భావించారు కదా, అలానే ఉన్నారు కదా? మేము విశ్వ పరివర్తకులము అని స్వయాన్ని భావిస్తున్నారా? చేతులెత్తండి. ఇందులోనైతే చాలా బాగా చేతులెత్తారు, ఇందుకు అభినందనలు. కానీ బాప్ దాదా మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న అడగమంటారా? మీరు విశ్వ పరివర్తకులైనప్పుడు మరి విశ్వ పరివర్తనలో ఈ ప్రకృతి, 5 తత్త్వాలు కూడా వస్తాయి, వాటిని పరివర్తన చెయ్యగలరు కానీ స్వయాన్ని, మీ తోటివారిని, పరివారాన్ని పరివర్తన చెయ్యలేరా? విశ్వ పరివర్తకులు అనగా ఆత్మలను, ప్రకృతిని, అందరినీ పరివర్తన చెయ్యడము. కావున మీరు చేసిన ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకోండి. అందరూ బాబా వద్ద ఎన్నో సార్లు ప్రతిజ్ఞను చేసారు కానీ బాప్ దాదా ఇదే చూస్తున్నారు, సమయము చాలా వేగముగా వస్తుంది. అందరి పిలుపులు చాలా పెరుగుతున్నాయి. మరి పిలుపును వినే, పరివర్తన చేసే ఉపకారి ఆత్మలు ఎవరు? మీరే కదా!

బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించి ఉన్నారు, పర ఉపకారి మరియు విశ్వ ఉపకారిగా కావడానికి మూడు పదాలను సమాప్తము చెయ్యవలసి ఉంటుంది - తెలుసు కదా. తెలుసుకోవడములోనైతే తెలివైనవారే, అందరూ తెలివైనవారే అని బాప్ దాదాకు తెలుసు. మొదటి పదము పరచింతన, రెండవది పరదర్శన మరియు మూడవది పరమతము. ఈ మూడు ‘పర’ అన్న పదాలను సమాప్తము చేసి పర ఉపకారిగా అవుతారు. ఈ మూడు పదాలే విఘ్న రూపముగా అవుతాయి, గుర్తున్నాయి కదా! ఇది కొత్త విషయము కాదు. కావున రేపు చెక్ చేసుకోండి. అమృతవేళ బాప్ దాదా కూడా చుట్టూ తిరుగుతారు, ఏమి చేస్తున్నారు అని బాబా చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు అవసరమైనది ఏమిటంటే - సమయమనుసారముగా, పిలుపుల అనుసారముగా ప్రతి ఒక్క దుఃఖీ ఆత్మకు మనసా సకాష్ ద్వారా సుఖ-శాంతుల అంచలిని ఇవ్వడము. కారణమేమిటి? బాప్ దాదా అప్పుడప్పుడు పిల్లలు ఏమి చేస్తున్నారు అని అకస్మాత్తుగా చూస్తుంటారు. ఎందుకంటే పిల్లలపై ప్రేమ అయితే ఉంది కదా, అంతేకాక పిల్లలతో పాటు కలిసి వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళేది లేదు. నాతో పాటు వస్తారు కదా! నాతో పాటు వస్తారా? ముందు కూర్చున్నవారు చేతులెత్తడము లేదు? నాతో పాటు రారా? రావాలి కదా! బాప్ దాదా కూడా పిల్లల కారణముగా ఎదురుచూస్తున్నారు, అడ్వాన్స్ పార్టీలోని మీ దాదీలు, మీ విశేష పాండవులు, మీ అందరి కోసము కూడా ఎదురుచూస్తున్నారు. వారు కూడా హృదయములో పక్కా ప్రతిజ్ఞను చేసారు - మేమందరమూ కలిసే వెళ్తాము అని. కొద్దిమందే కాదు, అందరికందరూ కలిస్తే వెళ్తాము. కావున రేపు అమృతవేళ స్వయాన్ని చెక్ చేసుకోండి - ఏ విషయములో బలహీనత ఉంది? మనసాలో ఉందా, వాణిలో ఉందా లేక కర్మణాలోకి వచ్చేటప్పుడు బలహీనత ఉందా? బాప్ దాదా ఒకసారి అన్ని సెంటర్లను చుట్టి వచ్చారు. ఏమి చూసారో చెప్పమంటారా? ఏ విషయములో లోపము ఉంది? ఒక్క క్షణములో పరివర్తన చేసి ఫుల్ స్టాప్ పెట్టడము - ఇందులో లోపము ఉంది. ఫుల్ స్టాప్ పెట్టే లోపు ఏమేమి జరిగిపోతుందో తెలియదు. బాప్ దాదా వినిపించారు - అంతిమ సమయములో ఒక్క చివరి క్షణము ఉంటుంది, ఆ క్షణములో ఫుల్ స్టాప్ పెట్టవలసి ఉంటుంది. కానీ ఏమి చూసారు? పెట్టవలసింది ఫుల్ స్టాప్ కానీ కామా వచ్చేస్తుంది. ఇతరుల విషయాలను గుర్తు చేసుకుంటారు, ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఏంటి జరుగుతుంది, ఇందులో ఆశ్చర్యార్థకము వచ్చేస్తుంది. అప్పుడు ఫుల్ స్టాప్ పడదు కానీ కామా, ఆశ్చర్యార్థకము మరియు ఎందుకు అనే ప్రశ్నల క్యూ ఏర్పడుతుంది. దీనిని చెక్ చేసుకోండి. ఒకవేళ ఫుల్ స్టాప్ పెట్టే అలవాటు లేకపోతే అంతిమ సమయములోని స్థితి బట్టి లభించే గతి శ్రేష్ఠముగా ఉండదు, ఉన్నతముగా ఉండదు. అందుకే బాప్ దాదా హోమ్ వర్క్ ఇస్తున్నారు, ప్రత్యేకముగా రేపు అమృతవేళ చెక్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడిక జనవరి 18 కల్లా క్షణములో ఫుల్ స్టాప్ పెట్టే విషయములో పదే-పదే అభ్యాసము చెయ్యండి. జనవరి మాసములో అందరికీ బాబా సమానముగా అవ్వాలి అనే ఉత్సాహము కలుగుతుంది కదా, మరి 18వ తారీఖు కల్లా రిజల్టు ఏమిటి అన్నదానిని 18 జనవరి నాడు అందరూ తమ చీటి వ్రాసి బాక్సులో వేయాలి. ఫుల్ స్టాప్ పెట్టడము జరిగిందా లేక మిగిలిన గుర్తులు పెట్టడము జరిగిందా? ఇష్టమేనా? ఇష్టమేనా? తల ఊపండి ఎందుకంటే బాప్ దాదాకు పిల్లల పట్ల చాలా ప్రేమ ఉంది. వారికి ఒంటరిగా వెళ్ళాలని లేదు. మరి ఏమి చేస్తారు? ఇప్పుడు వేగముగా తీవ్ర పురుషార్థము చేయండి. ఇప్పుడు ఢీలా-ఢాలా పురుషార్థము సఫలతను అందించలేదు.

పవిత్రతను పర్సనాలిటీ, రియాల్టీ, రాయల్టీ అని అనడము జరుగుతుంది. మరి మీ రాయల్టీని గుర్తు తెచ్చుకోండి. అనాది రూపములో కూడా ఆత్మలైన మీరు తండ్రితో పాటు మీ దేశములో విశేష ఆత్మలుగా ఉన్నారు. ఏ విధముగా ఆకాశములో విశేషమైన సితారలు మెరుస్తూ ఉంటాయో, అలాగే మీరు అనాది రూపములో విశేషమైన సితారలుగా మెరుస్తున్నారు. మీ అనాది కాలము యొక్క రాయల్టీని గుర్తు చేసుకోండి. సత్యయుగములోకి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు దేవతా రూపములోని రాయల్టీని గుర్తు చేసుకోండి. అందరి శిరస్సుపైన రాయల్టీ యొక్క ప్రకాశ కిరీటము ఉంది. అనాది, ఆదిలో ఎంత రాయల్టీ ఉంది. ఆ తర్వాత ద్వాపరములోకి రండి. అక్కడ కూడా మీ చిత్రాలలోని రాయల్టీ ఇంకెవ్వరికీ లేదు. నేతలు, అభినేతలు (యాక్టర్స్), ధర్మాత్మల చిత్రాలు తయారవుతాయి కానీ మీ చిత్రాల పూజ మరియు మీ చిత్రాల విశేషత ఎంత రాయల్ గా ఉంది! చిత్రాలను చూసే అందరూ సంతోషపడిపోతారు. చిత్రాల నుండే ఎన్ని ఆశీర్వాదాలను తీసుకుంటారు! ఈ రాయల్టీ అంతా పవిత్రతకు సంబంధించినదే. పవిత్రత బ్రాహ్మణ జీవితము యొక్క జన్మ సిద్ధ అధికారము. పవిత్రతా విషయములో ఉన్న లోపము సమాప్తమవ్వాలి. అయిపోతుందిలే, ఆ సమయములో వైరాగ్యము వస్తే అయిపోతుందిలే అని కాదు, మాటలు చాలా మంచి-మంచివి వినిపిస్తూ ఉంటారు. బాబా, మీరు చింతించకండి, అయిపోతుందిలే అని అంటారు, కానీ బాప్ దాదాకు ఈ జనవరి మాసములో విశేషముగా పవిత్రతలో ప్రతి ఒక్కరినీ సంపన్నము చేసేది ఉంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే కాదు, వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతయే. వ్యర్థ మాటలు, అధికార దర్పానికి చెందిన వ్యర్థ మాటలు, దానినే క్రోధము యొక్క అంశమైన అధికార దర్పము అని అంటారు, అది కూడా సమాప్తమైపోవాలి. సంస్కారాలను ఎలా తయారుచేసుకోండి అంటే, దూరము నుండే మిమ్మల్ని చూసి పవిత్రత వైబ్రేషన్లను తీసుకోవాలి ఎందుకంటే మీ అంతటి పవిత్రతకు ఫల స్వరూపముగా ఆత్మ కూడా పవిత్రముగా ఉంటుంది, శరీరము కూడా పవిత్రముగా ఉంటుంది, డబుల్ పవిత్రత ప్రాప్తిస్తుంది.

ఎప్పుడైనా ఎవరైనా పిల్లలు మొదటిసారిగా వస్తే బాబా నుండి ఏ వరదానము లభించేది? గుర్తుందా? పవిత్ర భవ, యోగీ భవ. రెండు విషయాలు ఉన్నాయి - ఒకటి పవిత్రత, రెండు ఫుల్ స్టాప్, యోగి. ఇష్టమేనా? బాప్ దాదా అమృతవేళ చుట్టూ తిరుగుతారు, సెంటర్లను కూడా చుట్టి వస్తారు. బాప్ దాదా అయితే ఒక్క సెకండులో నాలుగు వైపులను చుట్టి రాగలరు. మరి ఈ జనవరి అవ్యక్త మానముకు ఏదైనా కొత్త ప్లాన్ ను తయారుచేయండి. మనసా సేవ, మనసా స్థితి మరియు అవ్యక్త కర్మలు మరియు మాటలు, వీటిని పెంచండి. మరి 18 జనవరి నాడు బాప్ దాదా అందరి రిజల్టును చూస్తారు. ప్రేమ ఉంది కదా, 18 జనవరి నాడు అమృతవేళ నుండి ప్రేమతో కూడిన మాటలనే మాట్లాడుతూ ఉంటారు. బాబా ఎందుకు అవ్యక్తమయ్యారు అని అందరూ ఫిర్యాదు చేస్తారు. మరి బాబా కూడా ఫిర్యాదు చేస్తున్నారు - సాకారములో ఉంటూ బాబా సమానముగా ఎప్పటి కల్లా అవుతారు?

ఈ రోజు కొద్దిగా విశేషమైన అటెన్షన్ ను ఇప్పిస్తున్నారు. ప్రేమ కూడా చేస్తున్నారు, కేవలం అటెన్షన్ ను మాత్రమే ఇప్పించడము లేదు, ప్రేమ కూడా ఉంది, ఎందుకంటే బాబా ఇదే కోరుకుంటున్నారు - నా పిల్లలు ఒక్కరు కూడా మిగిలిపోకూడదు అని. ప్రతి కర్మలోని శ్రీమతాన్ని చెక్ చేసుకోండి, అమృతవేళ నుండి మొదలుకుని రాత్రి వరకు ప్రతి కర్మకు ఏదైతే శ్రీమతము లభించిందో, దానిని చెక్ చేసుకోండి. శక్తవంతముగా ఉన్నారు కదా! కలిసి వెళ్ళాలి కదా! వెళ్ళాలి అంటే చేతులెత్తండి. వెళ్ళాలా? అచ్ఛా, టీచర్లు? వెనుకవారు, కుర్చీలోనివారు, పాండవులు చేతులెత్తండి. మరి సమానముగా అయినప్పుడే చేతిలో చేయి వేసి కలిసి వెళ్ళగలరు కదా! చెయ్యాల్సిందే, తయారవ్వాల్సిందే అని దృఢ సంకల్పము చెయ్యండి. 15-20 రోజులు ఈ దృఢత్వము ఉంటుంది, ఆ తర్వాత మెల్లమెల్లగా కాస్త నిర్లక్ష్యము వచ్చేస్తుంది. కనుక నిర్లక్ష్యాన్ని సమాప్తము చెయ్యండి. ఎక్కువలో ఎక్కువ ఒక నెల రోజులు ఫుల్ ఉత్సాహము ఉంటుంది, దృఢత్వము ఉంటుంది, మళ్ళీ ఒక నెల తర్వాత కొద్దికొద్దిగా నిర్లక్ష్యము మొదలవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరము సమాప్తము కావస్తోంది, మరి మీరు ఏమి సమాప్తము చేస్తారు? కేవలం సంవత్సరాన్ని సమాప్తము చేస్తారా లేక సంవత్సరముతో పాటు సంకల్పములో, ధారణలో ఏదైతే బలహీనత ఉందో, దానిని కూడా సమాప్తము చేస్తారా? చేస్తారు కదా! చేతులెత్తడము లేదు? ఆటోమేటిక్ గా హృదయములో ఈ పాట మ్రోగాలి - ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. కేవలం వెళ్ళడమే కాదు, కానీ రాజ్యములోకి కూడా రావాలి. అచ్ఛా, ఎవరైతే బాప్ దాదాను కలవడానికి మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి, లేచి నిలబడండి.

మొదటిసారి వచ్చినవారికి విశేషమైన అభినందనలను ఇస్తున్నాము. లేట్ గా వచ్చారు కానీ టూ లేట్ గా రాలేదు. కానీ తీవ్ర పురుషార్థము యొక్క వరదానాన్ని సదా గుర్తుంచుకోండి. తీవ్ర పురుషార్థము చెయ్యాల్సిందే. చేస్తాములే, లే, లే అని అనకండి. చెయ్యాల్సిందే. లాస్ట్ సో ఫాస్ట్ మరియు ఫస్ట్ రావాలి. అచ్ఛా!

నలువైపులా ఉన్న మహాన్ పవిత్ర ఆత్మలకు బాప్ దాదా యొక్క విశేషమైన హృదయపూర్వక ఆశీర్వాదాలు, హృదయపూర్వక ప్రేమ మరియు హృదయములో ఇమిడిపోయినందుకు అభినందనలు. బాప్ దాదాకు తెలుసు - ఎప్పుడెప్పుడైతే బాబా అవతరణ జరుగుతుందో, అప్పుడు ఈ-మెయిల్స్ లేక ఉత్తరాలు భిన్న-భిన్న సాధనాల ద్వారా నలువైపులా ఉన్న పిల్లలు ప్రియస్మృతులను పంపిస్తారు. బాప్ దాదాకు ఎవరైనా వచ్చి వినిపించేకంటే ముందే అందరి ప్రియస్మృతులు చేరుకుంటాయి ఎందుకంటే ఇటువంటి ప్రియమైన పిల్లలు, స్మృతి చేసే పిల్లలు ఎవరైతే ఉంటారో, వారి సంబంధము చాలా త్వరగా చేరుకుంటుంది. మీరందరూ మూడు, నాలుగు రోజుల తర్వాత వచ్చి సమ్ముఖములో కలుస్తారు, కానీ సత్యమైన, పాత్రులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆ పిల్లల ప్రియస్మృతులు ఆ క్షణములోనే బాప్ దాదా వద్దకు చేరుకుంటాయి. కావున ఎవరెవరైతే హృదయములోనైనా గుర్తు చేసారో, సాధనాలు లభించలేదో, వారి ప్రియస్మృతులు కూడా లభించాయి. బాప్ దాదా ప్రతి బిడ్డకు పదమాల, పదమాల, పదమాల రెట్లు ప్రియస్మృతుల యొక్క రెస్పాన్స్ ను ఇస్తున్నారు.

ఇకపోతే ఇప్పుడు నలువైపులా రెండు పదాల పట్ల అత్యంత శ్రద్ధ పెట్టండి - ఒకటి ఫుల్ స్టాప్ మరియు రెండు సంపూర్ణ పవిత్రత, వీటిని మొత్తము బ్రాహ్మణ పరివారములో వ్యాపింపజేయాలి. ఎవరైతే బలహీనముగా ఉన్నారో, వారిని కూడా సహయోగము ఇచ్చి తయారుచెయ్యండి. ఇది పెద్ద పుణ్యము. వదిలేయకండి, వీరింతే, వీరు మారనే మారరు అని శాపము ఇవ్వకండి, పుణ్య కర్మ చెయ్యండి. మారి చూపిస్తాము, మారాల్సిందే. వారి ఆశలను పెంచండి. పడిపోయిన వారిని ఇంకా పడేయకండి, ఆధారాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి. నలువైపులా ఉన్న అదృష్టవంతులకు, ప్రసన్నచిత్తులకు, సంతోషాన్ని పంచే పిల్లలకు చాలా-చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
చెకింగ్ చేసుకునే విశేషతను తమ నిజ సంస్కారముగా చేసుకునే మహాన్ ఆత్మ భవ

ఏ సంకల్పాలు చేసినా, మాటలు మాట్లాడినా, కర్మలు చేసినా, సంబంధ-సంపర్కములోకి వచ్చినా, కేవలము ఇదే చెకింగ్ చేసుకోండి - ఇది బాబా సమానముగా ఉందా! మొదట సమానముగా చేసుకోండి, ఆ తర్వాత ప్రాక్టికల్ లోకి తీసుకురండి. ఏ విధముగా స్థూలముగా కూడా కొంతమంది ఆత్మల సంస్కారాలు ఎలా ఉంటాయంటే - మొదట చెక్ చేసుకుంటారు, ఆ తర్వాత స్వీకరిస్తారు. అదే విధముగా మీరు మహాన్ పవిత్ర ఆత్మలు, కావున చెకింగ్ యొక్క మెషినరీని వేగవంతము చేయండి. దీనిని మీ నిజ సంస్కారముగా చేసుకోండి - ఇదే అన్నింటికన్నా గొప్ప మహానత.

స్లోగన్:-
సంపూర్ణ పవిత్రముగా మరియు యోగీగా అవ్వడమే స్నేహానికి రిటర్న్ ఇవ్వడము.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

ఇప్పుడు ఏయే పరిస్థితులైతే వస్తున్నాయో లేదా రానున్నాయో, ప్రకృతి యొక్క పంచ తత్వాలు బాగా కదిలించేందుకు ప్రయత్నిస్తాయి, కానీ జీవన్ముక్త, విదేహీ అవస్థ కల అభ్యాసము చేసే ఆత్మలు స్థిరముగా-దృఢముగా పాస్ విత్ ఆనర్ అయ్యి అన్ని విషయాలను సహజముగా దాటి వేస్తారు, అందుకే నిరంతర కర్మయోగీ, నిరంతర సహజయోగీ, నిరంతర ముక్త ఆత్మ యొక్క సంస్కారాలను ఇప్పటినుండే అనుభవములోకి తీసుకురావాలి.