04-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీ వ్యాపారము మనుష్యులను మేలుకొలపడము,
మార్గాన్ని తెలియజేయడము, ఎంతగా మీరు దేహీ-అభిమానులుగా అయి తండ్రి పరిచయాన్ని
వినిపిస్తారో, అంతగా కళ్యాణము జరుగుతుంది’’
ప్రశ్న:-
పేద
పిల్లలు తమకున్న ఏ విశేషత ఆధారముగా షావుకారుల కంటే ముందుకు వెళ్తారు?
జవాబు:-
పేదవారిలో
దాన-పుణ్యాల పట్ల చాలా శ్రద్ధ ఉంటుంది. పేదవారు భక్తిని కూడా ప్రేమతో, తపనతో
చేస్తారు. సాక్షాత్కారాలు కూడా పేదవారికి కలుగుతాయి. షావుకారులకు తమ ధనము యొక్క నషా
ఉంటుంది, వారి ద్వారా పాపాలు ఎక్కువగా జరుగుతాయి. అందుకే పేద పిల్లలు వారి కంటే
ముందుకు వెళ్ళిపోతారు.
పాట:-
ఓం నమః శివాయ...
ఓంశాంతి
నీవు తల్లివి, తండ్రివి, మేము నీ పిల్లలము... ఈ మహిమ తప్పకుండా పరమపిత పరమాత్మునికి
గానము చేయడము జరిగింది. ఇది స్పష్టమైన మహిమ ఎందుకంటే వారు రచయిత. లౌకిక
తల్లిదండ్రులు కూడా పిల్లలకు రచయితలు. పారలౌకిక తండ్రిని కూడా రచయిత అని అంటారు.
వారికి బంధువు, సహాయకుడు... అని చాలా మహిమను పాడుతారు. లౌకిక తండ్రికి ఇంతటి మహిమ
లేదు. పరమపిత పరమాత్ముని మహిమయే వేరు. జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని పిల్లలు కూడా
మహిమ చేస్తారు. వారిలో మొత్తము జ్ఞానముంది. ఈ జ్ఞానము శరీర నిర్వహణ కోసం చదువుకునేది
కాదు. వారిని జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. కావున తప్పకుండా వారి వద్ద
జ్ఞానముంది, కానీ అది ఏ జ్ఞానము? ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానముంది.
కావున వారే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. శ్రీకృష్ణుడిని ఎప్పుడూ పతిత-పావనుడని,
జ్ఞానసాగరుడని అనరు. వారి మహిమ పూర్తిగా అతీతమైనది. ఇరువురూ భారత్ యొక్క నివాసులే.
శివబాబాకు కూడా భారత్ లో మహిమ ఉంది. శివజయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు.
శ్రీకృష్ణుని జయంతిని కూడా జరుపుకుంటారు. గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. మూడు
జయంతులు ముఖ్యమైనవి. ఇప్పుడు మొదటి జయంతి ఎవరిది అయి ఉంటుంది, శివునిదా లేక
శ్రీకృష్ణునిదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మనుష్యులైతే పూర్తిగా తండ్రిని
మర్చిపోయారు. శ్రీకృష్ణుని జయంతిని చాలా ఘనముగా, ప్రేమగా జరుపుకుంటారు. శివజయంతి
గురించి అంతగా ఎవరికీ తెలియదు, అంతగా గాయనము కూడా లేదు. శివుడు వచ్చి ఏమి చేసారు?
వారి జీవితచరిత్ర గురించి ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుని గురించైతే చాలా విషయాలు
వ్రాసారు. గోపికలను ఎత్తుకుపోయారని, ఇది చేసారని వ్రాసారు. శ్రీకృష్ణుడు చేసిన పనుల
గురించి ప్రత్యేకముగా ఒక మ్యాగజీన్ కూడా వెలువడుతుంది. శివుడు చేసిన పనుల మొదలైనవాటి
గురించి అటువంటిదేదీ లేదు. శ్రీకృష్ణుని జయంతి ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత గీతా
జయంతి ఎప్పుడు జరిగింది? శ్రీకృష్ణుడు పెద్దవాడైన తర్వాతనే జ్ఞానాన్ని వినిపించగలరు.
శ్రీకృష్ణుని బాల్యము గురించైతే చూపిస్తారు, అతడిని ఒక బుట్టలో పెట్టి ఆవలి తీరానికి
తీసుకువెళ్ళినట్లుగా చూపిస్తారు. పెద్దవాడైన తర్వాత రథముపై నిలబడినట్లుగా, సుదర్శన
చక్రాన్ని తిప్పినట్లుగా చూపిస్తారు. అప్పుడు 16-17 ఏళ్ళు ఉండవచ్చు. మిగిలిన
చిత్రాలు చిన్నప్పటివి చూపించారు. మరిప్పుడు, గీతను ఎప్పుడు వినిపించినట్లు. ఆ
సమయములోనైతే వినిపించి ఉండకపోవచ్చు. ఫలానావారిని ఎత్తుకుపోయారు, ఇది చేసారు అని
వ్రాసినప్పుడు, మరి ఆ సమయములో జ్ఞానము శోభించదు కూడా. జ్ఞానాన్ని అయితే వృద్ధులుగా
అయినప్పుడు వినిపిస్తారు. గీతను కూడా కొంత సమయము తర్వాత వినిపించి ఉంటారు. ఇప్పుడు,
శివుడు ఏమి చేసారు అన్నది ఏమీ తెలియదు. అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. తండ్రి
అంటారు, నా జీవిత చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. నేను ఏమి చేసాను? నన్నే
పతిత-పావనుడని అంటారు. నేను వచ్చినప్పుడు నాతో పాటు గీత ఉంటుంది. నేను సాధారణ వృద్ధ
అనుభవజ్ఞుని తనువులోకి వస్తాను. శివ జయంతిని మీరు భారత్ లోనే జరుపుకుంటారు. శివ
జయంతి, శ్రీకృష్ణ జయంతి, గీతా జయంతి, ఈ మూడు ముఖ్యమైనవి. రాముని జయంతి అయితే తర్వాత
జరుగుతుంది. ఈ సమయములో ఏవైతే జరుగుతాయో, వాటిని తర్వాత జరుపుకుంటారు. సత్య,
త్రేతాయుగాలలో జయంతులు మొదలైనవి ఉండవు. సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులు
వారసత్వాన్ని తీసుకుంటారు, ఇంకెవ్వరి మహిమ ఉండదు. కేవలం రాజుల పట్టాభిషేకాన్నీ
జరుపుకుంటూ ఉండవచ్చు. జన్మదినాన్ని అయితే ఈ రోజుల్లో అందరూ జరుపుకుంటున్నారు. అది
సామాన్యమైన విషయమే. శ్రీకృష్ణుడు జన్మించారు, పెద్దవారైన తర్వాత రాజ్యము చేసారు,
ఇందులో మహిమ యొక్క విషయమైతే లేదు. సత్య, త్రేతాయుగాలలో సుఖమయమైన రాజ్యము కొనసాగుతూ
వచ్చింది. ఆ రాజ్యము ఎప్పుడు, ఎలా స్థాపనయ్యింది అనేది పిల్లలైన మీ బుద్ధిలో ఉంది.
తండ్రి అంటారు - పిల్లలూ, నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో వస్తాను.
కలియుగ అంతిమము, పతిత ప్రపంచము. సత్యయుగ ఆది, పావన ప్రపంచము. నేను తండ్రిని కూడా.
పిల్లలైన మీకు వారసత్వాన్ని కూడా ఇస్తాను. కల్పక్రితం కూడా మీకు వారసత్వాన్ని
ఇచ్చాను, అందుకే మీరు జరుపుకుంటూ వచ్చారు. కానీ పేరు మర్చిపోవడముతో శ్రీకృష్ణుని
పేరు వేసారు. అందరికన్నా గొప్పవారైతే శివుడు కదా. మొదట ఎప్పుడైతే వారి జయంతి
జరుగుతుందో, అప్పుడు ఇతర సాకార మనుష్యుల జయంతి జరుగుతుంది. వాస్తవానికి ఆత్మలన్నీ
పై నుండి దిగుతాయి. నేను కూడా అవతరిస్తాను. శ్రీకృష్ణుడు తల్లి గర్భము నుండి జన్మ
తీసుకున్నారు, పాలన పొందారు. అందరూ పునర్జన్మలలోకి రావాల్సిందే. శివబాబా పునర్జన్మలు
తీసుకోరు. వారు రావడమైతే వస్తారు కదా. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తున్నారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను త్రిమూర్తులుగా చూపిస్తారు కదా. బ్రహ్మా
ద్వారా స్థాపన జరుగుతుంది, ఎందుకంటే శివునికైతే తమదంటూ శరీరము లేదు. నేను వీరి
వృద్ధ తనువులోకి వస్తానని వారు స్వయంగా కూర్చుని చెప్తారు. వీరికి తమ జన్మల గురించి
తెలియదు. ఇది వీరి అనేక జన్మల అంతిమ జన్మ. శివజయంతి గొప్పదా లేదా శ్రీకృష్ణుని జయంతి
గొప్పదా అని మొట్టమొదట అర్థం చేయించవలసి ఉంటుంది. ఒకవేళ శ్రీకృష్ణుడు గీతను
వినిపించి ఉంటే గీతా జయంతి అనేది శ్రీకృష్ణుడు జన్మించిన చాలా సంవత్సరాల తర్వాత అనగా
శ్రీకృష్ణుడు పెద్దవాడైన తర్వాత జరగాలి. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. కానీ
వాస్తవానికి శివజయంతి తర్వాత వెంటనే గీతా జయంతి జరిగింది. ఈ పాయింట్లను కూడా
బుద్ధిలో ఉంచుకోవాలి. పాయింట్లు అయితే ఎన్నో ఉన్నాయి. నోట్ చేసుకోకపోతే గుర్తుండవు.
బాబా ఇంత సమీపముగా ఉన్నారు, ఇది వారి రథము, కానీ వీరు కూడా అంటారు, అన్ని పాయింట్లు
సమయానికి గుర్తు రావడము కష్టము అని. అందరికీ ఇద్దరు తండ్రుల రహస్యాన్ని అర్థం
చేయించండి అని బాబా చెప్పారు. శివబాబా జయంతిని జరుపుకుంటారు, తప్పకుండా వారు వస్తూ
ఉండవచ్చు. ఏ విధముగా క్రైస్టు, బుద్ధుడు మొదలైనవారు వచ్చి తమ ధర్మాన్ని స్థాపన
చేస్తారు. అక్కడ ఆ ఆత్మ కూడా వచ్చి, ప్రవేశించి ధర్మ స్థాపనను చేస్తుంది. బాబా
హెవెన్లీ గాడ్ ఫాదర్, సృష్టి రచయిత. కావున తప్పకుండా కొత్త సృష్టిని రచిస్తారు.
పాతది రచించరు. కొత్త సృష్టిని స్వర్గమని అంటారు, ఇప్పుడున్నది నరకము. బాబా అంటారు,
నేను కల్ప-కల్పము యొక్క సంగమములో వచ్చి పిల్లలైన మీకు రాజయోగ జ్ఞానాన్ని ఇస్తాను.
ఇది భారత్ యొక్క ప్రాచీన యోగము. ఎవరు నేర్పించారు? శివబాబా పేరునైతే మాయము చేసేసారు.
ఒకవైపు గీతా భగవానుడు శ్రీకృష్ణుడు అని అంటారు, మరోవైపు విష్ణువు మొదలైనవారి పేర్లు
కూడా తీసుకుంటారు. శివబాబా రాజయోగాన్ని నేర్పించారు. ఇది ఎవ్వరికీ తెలియదు. శివజయంతి
అని నిరాకారుని జయంతినే చూపిస్తారు. వారు ఎలా వచ్చారు, వచ్చి ఏమి చేసారు? వారు
సర్వుల సద్గతిదాత, ముక్తిప్రదాత, గైడ్. ఇప్పుడు సర్వాత్మలకు గైడ్ అయిన పరమాత్మ
కావాలి. వారు కూడా ఆత్మనే. ఏ విధముగా మనుష్యులకు, మనుష్యులే గైడ్ గా ఉంటారో, అదే
విధముగా ఆత్మలకు ఆత్మనే గైడ్ గా ఉండాలి. ఆత్మలకు గైడ్ అని సుప్రీమ్ ఆత్మనే అంటారు.
మనుష్యులైతే అందరూ పునర్జన్మలు తీసుకుని పతితులుగా అవుతారు. మరి వారిని పావనముగా
తయారుచేసి తిరిగి ఎవరు తీసుకువెళ్తారు? తండ్రి అంటారు, నేనే వచ్చి పావనముగా తయారయ్యే
యుక్తిని తెలియజేస్తాను. మీరు నన్ను స్మృతి చేయండి. దేహ సంబంధాలను విడిచిపెట్టండి
అని శ్రీకృష్ణుడైతే చెప్పలేరు. అతనైతే 84 జన్మలను తీసుకుంటారు. అన్ని సంబంధాలలోకి
వస్తారు. తండ్రికి తమదంటూ శరీరము లేదు. మీకు ఈ ఆత్మిక యాత్రను తండ్రి నేర్పిస్తారు.
ఇది ఆత్మిక పిల్లల కోసం ఆత్మిక తండ్రి యొక్క ఆత్మిక జ్ఞానము. శ్రీకృష్ణుడు ఎవరికీ
ఆత్మిక తండ్రి కాదు. అందరి ఆత్మిక తండ్రిని నేనే. నేనే గైడ్ గా అవ్వగలను.
ముక్తిప్రదాత, గైడ్, ఆనంద సాగరుడు, శాంతి సాగరుడు, సదా పవిత్రుడు, ఇవన్నీ నా గురించే
చెప్తారు. ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. తండ్రి అంటారు, నేను ఈ
శరీరము ద్వారా మీకు ఇస్తున్నాను. మీరు కూడా శరీరము ద్వారా జ్ఞానాన్ని
తీసుకుంటున్నారు. వారు గాడ్ ఫాదర్. వారి రూపము గురించి కూడా తెలియజేసారు. ఏ విధముగా
ఆత్మ బిందువో, అదే విధముగా పరమాత్మ కూడా బిందువే. ఇది సృష్టి అద్భుతము కదా.
వాస్తవానికి అన్నింటికన్నా పెద్ద సృష్టి అద్భుతము ఇదే. ఇంత చిన్నని నక్షత్రములో 84
జన్మల పాత్ర ఉంది. ఇది సృష్టి అద్భుతము. డ్రామాలో తండ్రి పాత్ర కూడా ఉంది. వారు
భక్తి మార్గములో కూడా మీ సేవ చేస్తారు. మీ ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర ఉంది,
దానిని సృష్టి అద్భుతము అని అంటారు, దానిని వర్ణన ఎలా చేయాలి. ఇంత చిన్నని ఆత్మ. ఈ
విషయాలను విని ఆశ్చర్యపోతారు. ఆత్మ ఉండటము కూడా నక్షత్రము వలె ఉంటుంది. 84 జన్మలను
ఏక్యురేట్ గా అనుభవిస్తుంది. సుఖాన్ని కూడా ఏక్యురేట్ గా అనుభవిస్తుంది. ఇది సృష్టి
అద్భుతము. తండ్రి కూడా ఆత్మనే, వారు పరమ ఆత్మ. వారిలో జ్ఞానమంతా నిండి ఉంది, అది
పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇవి కొత్త విషయాలు, కొత్తవారు విని - వీరి జ్ఞానము ఏ
శాస్త్రాలు మొదలైనవాటిలో కూడా లేదు అని అంటారు. అయినా సరే, ఎవరైతే కల్పక్రితము
విన్నారో, వారసత్వాన్ని తీసుకున్నారో వారే వృద్ధి చెందుతూ ఉంటారు. సమయము పడుతుంది.
ప్రజలు ఎంతోమంది తయారవుతారు. అది సహజమే. రాజుగా అవ్వడములో శ్రమ ఉంది. మనుష్యుల్లో
ఎవరైతే చాలా ధనాన్ని దానము చేస్తారో, వారు రాజ్య కుటుంబములో జన్మ తీసుకుంటారు.
పేదవారు కూడా తమ ధైర్యము అనుసారముగా ఏదైతే దానము చేస్తూ ఉంటారో, దాని ఆధారముగా వారు
కూడా రాజులుగా అవుతారు. ఎవరైతే పూర్తి భక్తులుగా ఉంటారో, వారు దానపుణ్యాలను కూడా
చేస్తారు. షావుకారుల ద్వారా పాపాలు ఎక్కువగా జరుగుతూ ఉండవచ్చు. పేదవారికి శ్రద్ధ
ఎక్కువ ఉంటుంది. వారు చాలా ప్రేమగా కొంచెం దానము చేసినా కానీ ఎక్కువ లభిస్తుంది.
పేదవారు భక్తిని కూడా చాలా చేస్తారు. దర్శనము ఇవ్వండి లేకపోతే మేము శిరస్సును
ఖండించుకుంటామని అంటారు. షావుకారులు అలా చేయరు. సాక్షాత్కారాలు కూడా పేదవారికి
కలుగుతాయి. వారే దాన-పుణ్యాలను చేస్తారు, రాజులుగా కూడా వారే అవుతారు. ధనము
ఉన్నవారికి అహంకారముంటుంది. ఇక్కడ కూడా పేదవారికి 21 జన్మల సుఖము లభిస్తుంది.
పేదవారు ఎక్కువగా ఉన్నారు. షావుకారులు చివరిలో వస్తారు. అంత ఉన్నతముగా ఉన్న భారత్
మళ్ళీ ఇంత నిరుపేదగా ఎలా అయ్యింది అనేది మీరు అర్థం చేసుకుంటారు. భూకంపాలు
మొదలైనవాటిలో మహళ్ళు మొదలైనవన్నీ పోతాయి కావున నిరుపేదగా అయిపోతుంది. రావణ రాజ్యము
ఏర్పడటముతో హాహాకారాలు జరుగుతాయి కావున అటువంటి వస్తువులు ఇక ఉండజాలవు. ప్రతి
వస్తువుకు ఒక ఆయుష్షు అనేది ఉంటుంది కదా. అక్కడ, ఎలాగైతే మనుష్యుల ఆయుష్షు ఎక్కువగా
ఉంటుందో, అలాగే భవనాల ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారముతో, పాలరాతితో
పెద్ద-పెద్ద భవనాలు తయారవుతూ ఉంటాయి. బంగారు భవనాలైతే ఇంకా దృఢముగా ఉంటాయి. నాటకాలలో
కూడా చూపిస్తారు కదా - యుద్ధాలు జరుగుతాయి, ఇళ్ళు కూలిపోతాయి... కానీ మళ్ళీ
తయారవుతాయి. వాటిని ముందే ఆ విధముగా తయారుచేసుకుని ఉంచుకుంటారు. నాటకాలలో స్వర్గ
మహళ్ళు మొదలైనవేవైతే తయారుచేస్తారో, వాటిని మేస్త్రులు ఎలా తయారుచేస్తారు అనేది
చూపించరు. అలాంటి భవనాలే ఉంటాయని భావిస్తారు. మున్ముందు మీకు సాక్షాత్కారము
కలుగుతుంది. వివేకము ఆ విధముగా చెప్తుంది. ఈ విషయాలతో పిల్లలకు ఏ సంబంధము లేదు.
పిల్లలైతే చదువు చదువుకోవాలి, స్వర్గానికి యజమానులుగా అవ్వాలి. స్వర్గము మరియు నరకము
అనేక సార్లు గతించాయి. ఇప్పుడు రెండూ గతించిపోయాయి. ఇప్పుడిది సంగమము. సత్యయుగములో
ఈ జ్ఞానము ఉండదు. ఈ సమయములో పిల్లలైన మీకు పూర్తి జ్ఞానముంది. లక్ష్మీ-నారాయణులకు ఈ
రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు ఈ వారసత్వాన్ని ఎవరి
నుండి పొందారు. ఇక్కడ చదువు చదువుకుని స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఆ తర్వాత
అక్కడకు వెళ్ళి మహళ్ళు మొదలైనవి తయారుచేస్తారు. సర్జన్లు కూడా పెద్ద-పెద్ద
ఆసుపత్రులను తయారుచేస్తారు కదా.
పిల్లలైన మీకు తండ్రి ప్రతి రోజూ మంచి-మంచి పాయింట్లను వినిపిస్తున్నారు. మీ
వ్యాపారమే మనుష్యులను మేలుకొలపడము, వారికి మార్గాన్ని తెలియజేయడము. తండ్రి ఎంత
ప్రేమగా కూర్చుని అర్థం చేయిస్తారో అలా అర్థం చేయించాలి. దేహాభిమానము అవసరము లేదు.
తండ్రికి ఎప్పుడూ దేహాభిమానము ఉండదు. మీకు శ్రమంతా దేహీ-అభిమానిగా అవ్వడములోనే
కలుగుతుంది. ఎవరైతే దేహీ-అభిమానులుగా అయ్యి కూర్చుని తండ్రి పరిచయాన్ని ఇస్తారో,
వారు అనేకుల కళ్యాణము చేస్తారు. మొదట దేహాభిమానము రావడముతో మిగతా వికారాలు వస్తాయి.
కొట్లాడటము, గొడవపడటము, నవాబులా నడుచుకోవడము, ఇదంతా దేహాభిమానము. మనది రాజయోగమే కానీ
మనము చాలా సాధారణముగా ఉండాలి. చిన్న విషయానికి అహంకారము వచ్చేస్తుంది. ఫ్యాషనబుల్
గా ఉన్న గడియారాన్ని చూస్తే, అది ధరించాలని మనసు కలుగుతుంది. ఆలోచన నడుస్తూ ఉంటుంది.
దీనిని కూడా దేహాభిమానము అని అంటారు. మంచి ఖరీదైన వస్తువు ఉంటే దానిని జాగ్రత్తగా
చూసుకోవలసి ఉంటుంది. అది మాయమైతే ఆలోచనలు నడుస్తాయి. అంతిమ సమయములో ఏదైనా
గుర్తుకొస్తే పదవి భ్రష్టమైపోతుంది. ఇవి దేహాభిమానపు అలవాట్లు. ఇక అప్పుడు సర్వీస్
కు బదులుగా డిస్సర్వీస్ కూడా తప్పకుండా చేస్తారు. రావణుడు మిమ్మల్ని దేహాభిమానులుగా
తయారుచేసాడు. బాబా ఎంత సాధారణముగా ఉంటున్నారు అనేది మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరి
సర్వీస్ చూడడము జరుగుతుంది. మహారథులైన పిల్లలు తమ ప్రభావాన్ని చూపించాలి. మీరు ఫలానా
స్థానానికి వెళ్ళి భాషణ ఇవ్వండి అని మహారథులకే వ్రాయడము జరుగుతుంది. ఒకరినొకరు
పిలుచుకుంటారు. కానీ పిల్లల్లో దేహాభిమానము చాలా ఉంటుంది. భాషణ ఇవ్వడములో బాగున్నా
కానీ పరస్పరములో ఆత్మిక స్నేహము ఉండటము లేదు. దేహాభిమానము ఉప్పునీరులా చేసేస్తుంది.
ఏ విషయములోనైనా వెంటనే డిస్టర్బ్ అవ్వడము అనేది కూడా జరగకూడదు, అందుకే బాబా అంటారు,
ఎవరినైనా అడగాలనుకుంటే వచ్చి బాబాను అడగండి. ఎవరైనా - బాబా, మీకు ఎంతమంది పిల్లలు
ఉన్నారు అని అడిగితే నేను అంటాను, పిల్లలైతే లెక్కలేనంత మంది ఉన్నారు కానీ కొందరు
కుపుత్రులు, కొందరు మంచి-మంచి సుపుత్రులు ఉన్నారు. ఇటువంటి తండ్రికి ఆజ్ఞాకారులుగా,
నమ్మకస్థులుగా అవ్వాలి కదా. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. దేహాభిమానములోకి వచ్చి ఏ విధమైన ఫ్యాషన్లు చేయకూడదు. ఎక్కువ అభిరుచి
ఉంచుకోకూడదు. చాలా-చాలా సాధారణముగా నడుచుకోవాలి.
2. పరస్పరములో చాలా-చాలా ఆత్మిక స్నేహముతో నడుచుకోవాలి, ఎప్పుడూ కూడా ఉప్పునీరులా
అవ్వకూడదు. బాబాకు సుపుత్రులుగా అవ్వాలి. అహంకారములోకి ఎప్పుడూ రాకూడదు.
వరదానము:-
తమ భాగ్యము మరియు భాగ్యవిధాత యొక్క గుణగానము చేసే సదా
ప్రసన్నచిత్త భవ
బ్రాహ్మణ పిల్లలందరికీ జన్మించగానే కిరీటము, సింహాసనము,
తిలకము జన్మ సిద్ధ అధికారము రూపములో ప్రాప్తిస్తాయి. కావున మెరుస్తూ ఉన్న భాగ్య
సితారను చూస్తూ తమ భాగ్యము మరియు భాగ్యవిధాత యొక్క గుణగానము చేస్తూ ఉండండి, అప్పుడు
గుణ సంపన్నులుగా అయిపోతారు. తమ బలహీనతల గుణగానము చేయకండి. భాగ్యము యొక్క గుణగానము
చేస్తూ ఉండండి, ప్రశ్నల నుండి దూరముగా ఉండండి, అప్పుడు సదా ప్రసన్నచిత్తులుగా ఉండే
వరదానము ప్రాప్తిస్తుంది. అప్పుడు ఇతరులను కూడా సహజముగా ప్రసన్నము చేయగలరు.
స్లోగన్:-
ఏకనామీ
మరియు ఎకానమీతో నడుచుకోవడమే బ్రాహ్మణ జీవితములో సఫలతకు ఆధారము.
అవ్యక్త సూచనలు -
‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’
నిశ్చయము సదా
నిశ్చింతగా చేస్తుంది మరియు ఎవరైతే నిశ్చింత స్థితిలో ఉంటూ ఏ కార్యమునైనా చేస్తారో
వారు ఆ కార్యములో తప్పకుండా సఫలురవుతారు ఎందుకంటే నిశ్చింత స్థితిలో బుద్ధి యథార్థ
నిర్ణయము తీసుకుంటుంది. యథార్థ నిర్ణయానికి ఆధారము - నిశ్చయ బుద్ధి, నిశ్చింత స్థితి,
ఇక అందులో ఆలోచించవలసిన అవసరము కూడా ఉండదు.
| | | |