‘‘హృదయపూర్వకంగా నా బాబా అని అనండి మరియు సర్వ
అవినాశీ ఖజానాలకు యజమానులుగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా
అవ్వండి’’
ఈ రోజు భాగ్యవిధాత అయిన బాప్ దాదా తమ పిల్లలందరి మస్తకము
మధ్యలో భాగ్యపు రేఖలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి
మస్తకములో మెరుస్తున్న దివ్య సితారల యొక్క రేఖలు
కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి నయనాలలో స్నేహము మరియు శక్తి
యొక్క రేఖను చూస్తున్నారు. నోటిపై శ్రేష్ఠ మధుర వాణి యొక్క
రేఖను చూస్తున్నారు. పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ
మెరుస్తూ ఉంది. హృదయములో హృదయాభిరాముడి స్నేహములో లవలీనమై ఉన్న
రేఖను చూస్తున్నారు. చేతులపై సదా సర్వ ఖజానాల సంపన్నత యొక్క
రేఖను చూస్తున్నారు. పాదాలపై ప్రతి అడుగులో పదమాల రేఖను
చూస్తున్నారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము మొత్తము కల్పములో
మరెవ్వరికీ ఉండదు, పిల్లలైన మీకు ఈ సంగమయుగములో భాగ్యము
ప్రాప్తించింది. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవం చేస్తున్నారా?
ఇంతటి శ్రేష్ఠ భాగ్యము యొక్క ఆత్మిక నషాను అనుభవము చేస్తున్నారా?
హృదయములో స్వతహాగా - వాహ్ నా భాగ్యము! అనే పాట మ్రోగుతుంది. ఈ
సంగమయుగములోని భాగ్యము అవినాశీ భాగ్యముగా అయిపోతుంది. ఎందుకని?
అవినాశీ బాబా ద్వారా అవినాశీ భాగ్యము ప్రాప్తించింది. కానీ అది
ఈ సంగమములోనే ప్రాప్తిస్తుంది. ఈ సంగమయుగములోనే అనుభూతి
చేస్తారు, విశేషమైన ఈ సంగమయుగ ప్రాప్తి అతి శ్రేష్ఠమైనది. మరి
ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము యొక్క అనుభవము సదా ఇమర్జ్ అయ్యి
ఉంటుందా లేక అప్పుడప్పుడు మర్జ్ అయ్యి (గుప్తమై), అప్పుడప్పుడు
ఇమర్జ్ అయ్యి (ప్రత్యక్షమై) ఉంటుందా? అంతేకాక దీని కోసము చేసిన
పురుషార్థము ఏమిటి? ఇంతటి గొప్ప భాగ్యము యొక్క ప్రాప్తి కొరకు
పురుషార్థము ఎంత సహజమైనది. కేవలము హృదయపూర్వకముగా
తెలుసుకున్నారు, అంగీకరించారు మరియు ‘‘నా బాబా’’ అని తమవారిగా
చేసుకున్నారు. నేను బాబాకు చెందినవాడిని, బాబా నా వారు అని
హృదయపూర్వకముగా గుర్తించారు. నా వారు అని అంగీకరించటము అనగా
అధికారిగా అయిపోవడము. అధికారము కూడా ఎంత పెద్దది! ఆలోచించండి,
ఒకవేళ ఎవరైనా ఏమేమి లభించాయి అని అడిగితే, అప్పుడు ఏమంటారు?
పొందాల్సినదేదైతే ఉందో అది పొందేసాము. పరమాత్ముని ఖజానాలో
అప్రాప్తి అనే వస్తువు ఏదీ ఉండదు. ఇటువంటి ప్రాప్తి స్వరూపాన్ని
అనుభవము చేసారా లేక చేస్తూ ఉన్నారా? భవిష్యత్తు విషయము వేరు, ఈ
సంగమయుగములోని ప్రాప్తి స్వరూపముదే అనుభవము ఉంటుంది. ఒకవేళ
సంగమయుగములో అనుభవము చేయకపోతే భవిష్యత్తులో కూడా అనుభవము అవ్వదు.
ఎందుకని? భవిష్యత్తు ప్రారబ్ధము, కానీ ఆ ప్రారబ్ధము ఈ
పురుషార్థము యొక్క శ్రేష్ఠ కర్మల ద్వారా తయారవుతుంది. చివరిలో
అనుభవ స్వరూపులుగా అయిపోతాము అని కాదు. సంగమయుగములో బహుకాలము ఈ
అనుభవము ఉండాలి. జీవన్ముక్తి యొక్క విశేష అనుభవము ఈ సమయానిదే.
నిశ్చింత చక్రవర్తులుగా అయ్యే అనుభవము ఇప్పుడే ఉంది. మరి అందరూ
నిశ్చింత చక్రవర్తులేనా లేక చింత ఉందా? ఎవరైతే నిశ్చింత
చక్రవర్తులుగా అయ్యారో వారు చేతులెత్తండి. అయ్యారా లేక అవుతూ
ఉన్నారా? అయ్యారు కదా! ఏ చింత ఉంది? దాత పిల్లలుగా అయిన తర్వాత
ఇక ఏ చింత మిగిలి ఉంది? నా బాబా అని అంగీకరించారు మరియు చింత
యొక్క అనేక గంపల భారము దిగిపోయింది. ఏదైనా భారము ఉందా? ఉందా?
ప్రకృతి యొక్క ఆటను కూడా చూస్తారు, మాయ ఆటను కూడా చూస్తారు కానీ
నిశ్చింత చక్రవర్తులై, సాక్షీగా అయి ఆటను చూస్తారు.
ప్రపంచములోనివారైతే - ఏం జరుగుతుందో ఏమో తెలియదు అని భయపడతారు!
మీకు భయము ఉందా? భయపడతారా? ఏం జరిగినా అది చాలా, చాలా మంచిగానే
జరుగుతుంది అన్న నిశ్చయము ఉంది మరియు అది నిశ్చితము. ఎందుకని?
త్రికాలదర్శులుగా అయ్యి ప్రతి దృశ్యాన్ని చూస్తారు. ఈ రోజు
ఏమిటి, రేపు ఏమి జరగనున్నది, దీనిని బాగా తెలుసుకున్నారు, మీరు
నాలెడ్జ్ ఫుల్ కదా! సంగమము తర్వాత ఏం జరగనున్నది, అది మీ అందరి
ఎదురుగా స్పష్టముగా ఉంది కదా! నవ యుగము వచ్చేదే ఉంది.
ప్రపంచములోని వారు - ‘వస్తుందా?’ అని అంటారు, వారికి
‘వస్తుందా’ అన్న ప్రశ్న ఉంది. మరియు మీరేమంటారు? తప్పకుండా
వచ్చి తీరుతుంది అని అంటారు. అందుకే ఏం జరుగుతుంది అనే ప్రశ్నే
లేదు. స్వర్ణ యుగము వచ్చేదే ఉంది అన్నది తెలుసు. రాత్రి తర్వాత
ఇప్పుడు సంగమము ప్రభాత సమయము, అమృతవేళ, అమృతవేళ తర్వాత పగలు
రావాల్సిందే. నిశ్చయము ఎవరికైతే ఉంటుందో, వారు నిశ్చింతగా
ఉంటారు, ఏ చింత ఉండదు, నిశ్చింతగా ఉంటారు. విశ్వ రచయిత ద్వారా
రచన గురించిన స్పష్టమైన జ్ఞానము లభించింది.
పిల్లలందరూ స్నేహము, సహయోగము మరియు సంపర్కము యొక్క ప్రేమలో
బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు అన్నదానిని బాప్ దాదా
చూస్తున్నారు. బాప్ దాదా స్నేహీ పిల్లలకు, సహయోగీ పిల్లలకు,
సంపర్కములోని పిల్లలందరికీ తమ అధికారము తీసుకునేందుకు తమ ఇంటికి
చేరుకున్నందుకు అభినందనలను తెలుపుతున్నారు. అభినందనలు,
అభినందనలు. బాప్ దాదాకు పిల్లల పట్ల ఎక్కువ ప్రేమ ఉందా లేక
పిల్లలకు బాప్ దాదా పట్ల ఎక్కువ ప్రేమ ఉందా? ఎవరి ప్రేమ ఎక్కువ?
మీదా లేక బాబాదా? పిల్లల ప్రేమ ఎక్కువగా ఉంది అని బాబా అంటారు.
చూడండి, పిల్లలకు ప్రేమ ఉంది కావుననే ఎక్కడెక్కడి నుండో
చేరుకున్నారు కదా! ఎన్ని దేశాల నుండి వచ్చారు? (50 దేశాల నుండి)
50 దేశాల నుండి వచ్చారు. కానీ అందరికంటే ఎక్కువ దూరము నుండి
ఎవరు వచ్చారు? అమెరికావారు దూరము నుండి వచ్చారా? మీరు కూడా
దూరము నుండి వచ్చారు కానీ బాప్ దాదా అయితే పరంధామము నుండి
వచ్చారు. దానితో పోలిస్తే అమెరికా ఎంత! అమెరికా దూరమా లేక
పరంధామము దూరమా? అందరికంటే దూరదేశీ అయినవారు బాప్ దాదా. పిల్లలు
గుర్తు చేస్తారు మరియు బాబా హాజరైపోతారు.
ఇప్పుడు బాబా పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు? బాబా ఏం
కోరుకుంటారు అని అడుగుతారు కదా. మరి బాప్ దాదా మధురాతి-మధురమైన
పిల్లల నుండి ఇదే కోరుకుంటున్నారు - ఒక్కొక్క బిడ్డ స్వరాజ్య
అధికారీ రాజుగా అవ్వాలి. అందరూ రాజులే కదా? స్వరాజ్యము ఉందా?
స్వయముపై రాజ్యమైతే ఉంది కదా! స్వరాజ్య అధికారి రాజుగా అయ్యాను
అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చాలా మంచిది.
దుఃఖము, అశాంతి నుండి దూరం అవ్వాలని 63 జన్మలు చాలా శ్రమ చేసారు
అని బాప్ దాదాకు పిల్లలను చూసి ప్రేమ కలుగుతుంది. కావున బాబా
ఏం కోరుకుంటున్నారంటే, ప్రతి బిడ్డ ఇప్పుడు స్వరాజ్య అధికారిగా
అవ్వాలి, మనసు-బుద్ధి-సంస్కారాలకు యజమానిగా అవ్వాలి, రాజుగా
అవ్వాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా
కావాలంటే అలా, మనసు-బుద్ధి-సంస్కారాలను పరివర్తన చేసుకోగలగాలి.
టెన్షన్ ఫ్రీ జీవితము యొక్క అనుభవము సదా ఇమర్జ్ అయ్యి ఉండాలి.
కానీ అది అప్పుడప్పుడు మర్జ్ కూడా అయిపోతోంది అనేది బాప్ దాదా
చూస్తున్నారు. ఇది చెయ్యకూడదు, ఇది ఒప్పు, అది తప్పు అని
ఆలోచిస్తారు. ఆలోచిస్తారు కానీ స్వరూపములోకి తీసుకురారు.
ఆలోచించడము అనగా మర్జ్ అయి ఉండడము, స్వరూపములోకి తీసుకురావడము
అనగా ఇమర్జ్ అవ్వడము. సమయము కొరకైతే ఎదురుచూడడం లేదు కదా!
అప్పుడప్పుడు ఎదురుచూస్తూ ఉంటారు. ఆత్మిక సంభాషణ చేస్తారు కదా,
అప్పుడు చాలామంది పిల్లలు ఏమంటారంటే - సమయము వచ్చినప్పుడు
బాగైపోతాములే. కానీ సమయమనేది మీ రచన. మీరు మాస్టర్ రచయిత కదా!
మరి మాస్టర్ రచయిత, రచన యొక్క ఆధారముపై నడవరు. సమయము యొక్క
సమాప్తిని మాస్టర్ రచయితలైన మీరే సమీపముగా తీసుకురావాలి.
ఒక్క క్షణములో మనసుకు యజమానిగా అయ్యి మనసును ఆర్డర్ చేయగలరా?
చేయగలరా? మనసును ఏకాగ్రము చేయగలరా? ఫుల్ స్టాప్ పెట్టగలరా లేక
పెట్టడమేమో ఫుల్ స్టాప్ పెడతారు కానీ అక్కడ ప్రశ్నార్థకము
పడుతుందా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇదేంటి, అదేంటి, ఆశ్చర్యార్థకము
కూడా పెట్టకూడదు. ఫుల్ స్టాప్, క్షణములో పాయింట్ (బిందువు)
అయిపోండి. ఇంకే శ్రమ లేదు, ఒక్క పదాన్ని కేవలం అభ్యాసములోకి
తీసుకురండి ‘‘పాయింట్’’. పాయింట్ (బిందు) స్వరూపముగా అవ్వాలి,
వ్యర్థానికి పాయింట్ (బిందువు) పెట్టాలి మరియు మహావాక్యాలు
ఏవైతే వింటారో, ఆ పాయింట్లపై మననము చెయ్యాలి, వేరే ఏ కష్టమూ
లేదు. పాయింట్లు గుర్తు పెట్టుకోండి, ఫుల్ స్టాప్ పెట్టండి,
బిందువుగా అవ్వండి. ఈ అభ్యాసాన్ని రోజంతటిలో మధ్య-మధ్యలో చేయండి,
ఎంత బిజీగా ఉన్నా కానీ ఇది ప్రయత్నించండి, ఒక్క క్షణములో
పాయింట్ (బిందువు) గా అవ్వగలరా? ఒక్క క్షణములో పాయింటు
పెట్టగలరా? ఎప్పుడైతే ఈ అభ్యాసము పదే-పదే జరుగుతుందో, అప్పుడే
రాబోయే అంతిమ సమయములో ఫుల్ పాయింట్లు తీసుకోగలరు. పాస్ విత్
ఆనర్లుగా (గౌరవప్రదమైన ఉత్తీర్ణులుగా) అవుతారు. ఇదే పరమాత్ముని
చదువు, ఇదే పరమాత్ముని పాలన.
మరి ఎవరైతే వచ్చారో, మొదటిసారి వచ్చినవారు కావచ్చు,
మొదటిసారి మిలనాన్ని జరుపుకునేందుకు ఎవరైతే వచ్చారో వారు
చేతులెత్తండి. చాలామంది వచ్చారు. వెల్కమ్. ఏ విధంగా ఇప్పుడు
మొదటిసారి వచ్చారు కదా, అలా మొదటి నంబరు కూడా తీసుకోవాలి.
ఛాన్స్ ఉంది. మేమైతే ఇప్పుడిప్పుడే మొదటిసారి వచ్చాము, మా కంటే
ముందున్నవారు ఎంతోమంది ఉన్నారు అని మీరు ఆలోచిస్తారు, కానీ
డ్రామాలో నిశ్చితమై ఉన్న అవకాశము ఏమిటంటే - చివరిలో వచ్చినా
వేగముగా వెళ్ళగలరు మరియు వేగముగా వెళ్ళి మొదటి నంబరును
తీసుకోగలరు. ఛాన్స్ ఉంది మరియు ఛాన్స్ తీసుకునేవారిని బాప్ దాదా
ఛాన్సలర్ అని అంటారు. కనుక ఛాన్సలర్ గా అవ్వండి. ఛాన్సలర్ గా
అవ్వాలా? ఛాన్సలర్ గా అవ్వాలా? ఛాన్సలర్ గా అవుతాము అని ఎవరైతే
భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. ఛాన్సలర్ గా అవుతారా? వాహ్!
అభినందనలు. బాప్ దాదా చూసారు, ఇక్కడకు ఎవరైతే వచ్చారో వారందరూ
చేతులెత్తుతున్నారు, మెజారిటీ ఎత్తుతున్నారు, అభినందనలు,
అభినందనలు. వచ్చినటువంటి మధురాతి-మధురమైన, ప్రియాతి-ప్రియమైన
పిల్లలైన మీ అందరినీ బాప్ దాదా విశేషంగా గుర్తు చేసుకున్నారు,
ఎందుకు గుర్తు చేసుకున్నారు? (ఈ రోజు సభలో దేశ-విదేశాలకు
చెందిన చాలామంది వి.ఐ.పి.లు కూర్చుని ఉన్నారు) ఆహ్వానము ఎందుకు
ఇచ్చారు? తెలుసా? చూడండి, ఆహ్వానమైతే ఎంతోమందికి లభించింది,
కానీ మీరే చేరుకున్నారు. బాప్ దాదా ఎందుకు గుర్తు చేసుకున్నారు?
ఎందుకంటే బాప్ దాదాకు తెలుసు - ఎవరైతే వచ్చారో వారు స్నేహీ,
సహయోగీ నుండి సహజయోగీగా అయ్యే క్వాలిటీ కలవారు. ఒకవేళ ధైర్యము
పెట్టినట్లయితే మీరు సహజయోగులుగా అయ్యి, ఇతరుల కొరకు కూడా
సహజయోగము యొక్క మెసెంజర్లుగా అయ్యి మెసేజ్ ను ఇవ్వగలరు. మెసేజ్
ఇవ్వడము అనగా ఈశ్వరీయ మెసెంజర్లుగా అవ్వడము, ఆత్మలను దుఃఖము,
అశాంతుల నుండి విడిపించడము. ఎంతైనా వారు మీ సోదరీ-సోదరులే కదా!
కనుక మీ సోదరులకు లేక సోదరీలకు ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వడము అనగా
విముక్తులుగా చేయడము. ఇందుకు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఏ
ఆత్మనైనా దుఃఖము, అశాంతి నుండి విడిపించినందుకు ఆశీర్వాదాలు
చాలా లభిస్తాయి మరియు ఆశీర్వాదాలు లభించటము ద్వారా అతీంద్రియ
సుఖము, ఆంతరిక సంతోషము యొక్క ఫీలింగ్ ఎంతగానో కలుగుతుంది.
ఎందుకని? ఎందుకంటే సంతోషాన్ని పంచారు కదా, సంతోషాన్ని పంచటము
వలన సంతోషము పెరుగుతుంది. అందరూ సంతోషముగా ఉన్నారా? విశేషముగా
బాప్ దాదా అతిథులను కాదు, అధికారులను అడుగుతున్నారు. మిమ్మల్ని
మీరు అతిథిగా భావించకండి, మీరు అధికారులు. మరి అందరూ సంతోషముగా
ఉన్నారా? అయితే, వచ్చిన మీ అందరినీ అడుగుతున్నాము, అనటానికి
అతిథులు అని అంటారు కానీ మీరు అతిథులు కారు, మీరు మహానులుగా
అయ్యి మహానులుగా తయారుచేసేవారు. మరి సంతోషముగా ఉన్నారా? అని
ప్రశ్నించుకోండి. సంతోషముగా ఉన్నట్లయితే చేతులు ఊపండి. అందరూ
సంతోషముగా ఉన్నారు, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు? సంతోషాన్ని
పంచుతారు కదా! అందరికీ బాగా సంతోషాన్ని పంచండి. ఎంతగా పంచుతారో
అంతగా పెరుగుతుంది, సరేనా. అచ్ఛా - బాగా చప్పట్లు కొట్టండి. (అందరూ
బాగా చప్పట్లు కొట్టారు) ఏ విధంగా ఇప్పుడు చప్పట్లు కొట్టారో,
అలా సదా సంతోషపు చప్పట్లు ఆటోమేటిక్ గా మ్రోగుతూ ఉండాలి. అచ్ఛా.
బాప్ దాదా సదా టీచర్లకు చెప్తుంటారు, టీచర్స్ అనగా వారి
ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ కనిపించాలి (ముఖ కవళికల ద్వారా
భవిష్యత్తు కనిపించాలి). అటువంటి టీచర్లే కదా! మిమ్మల్ని చూసి
స్వర్గ సుఖము యొక్క ఫీలింగ్ కలగాలి, శాంతి యొక్క అనుభూతి కలగాలి.
నడుస్తూ-తిరుగుతున్న ఫరిశ్తాలుగా కనిపించాలి. అటువంటి టీచర్లే
కదా! మంచిది, ప్రవృత్తిలో ఉన్నవారైనా, సేవకు నిమిత్తముగా
ఉన్నవారైనా, అందరూ బాప్ దాదా సమానముగా అయ్యే నిశ్చయబుద్ధి
విజయులు. అచ్ఛా.
నలువైపులా ఉన్నవారు, సాకార రూపములో ఎదురుగా ఉన్నా లేక దూరంగా
కూర్చుని కూడా మనసుకు సమీపముగా ఉన్నవారు, ఇటువంటి సదా శ్రేష్ఠ
భాగ్యవంతులైన ఆత్మలకు, సదా నిమిత్తులుగా అయ్యి నిర్మాణ
కార్యాన్ని సఫలము చేసే విశేష ఆత్మలకు, సదా బాబా సమానముగా అయ్యే
ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటూ ముందుకు వెళ్ళే ధైర్యవంతులైన పిల్లలకు,
సదా ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే ప్రపంచములోకెల్లా
చాలా-చాలా పదమాల రెట్ల ధనవంతులకు, నిండుగా ఉన్న ఆత్మలకు బాప్
దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
నిమిత్తులైన డబుల్ విదేశీ పెద్ద అక్కయ్యలతో - సేవ యొక్క మంచి
ఋజువును ఇస్తున్నారు. దీని ద్వారానే శబ్దము వ్యాపిస్తుంది.
అనుభవము వినిపించడము ద్వారా ఇతరులకు కూడా అనుభవము పెరుగుతుంది.
కనుక బాప్ దాదా సంతోషిస్తున్నారు, విదేశీ సేవలో నిమిత్తమైనవారు
మంచి ఉల్లాస-ఉత్సాహాలతో సేవలో బిజీగా ఉంటారు. దేశము నుండే
వెళ్ళారు కానీ విదేశీయుల సేవను ఎలా నిమిత్తమై అయ్యి
చేస్తున్నారంటే అక్కడివారే అన్నట్లుగా చేస్తున్నారు. వీరు నా
వారు అన్న అనుభూతిని కలిగిస్తున్నారు, అంతేకాక వీరు
అన్నివైపులవారు, కేవలం ఒకవైపు వారే కాదు, లండన్ కు చెందినవారో
లేదా అమెరికాకు చెందినవారో కాదు, వీరు అనంతమైన సేవాధారులు అనే
అనుభూతిని కలిగిస్తున్నారు. బాధ్యత అయితే మొత్తము విశ్వము
యొక్క బాధ్యత ఉంది కదా. కావున బాప్ దాదా అభినందనలు
తెలుపుతున్నారు. చేస్తున్నారు, మున్ముందు ఇంకా చాలా బాగా
ఎగురుతూ మరియు ఎగిరేలా చేస్తూ ఉంటారు. అచ్ఛా.