04-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు అనంతమైన తండ్రి వద్దకు వికారుల
నుండి నిర్వికారులుగా అయ్యేందుకు వచ్చారు, అందుకే మీలో ఎటువంటి భూతమూ ఉండకూడదు’’
ప్రశ్న:-
మొత్తం
కల్పమంతటిలోనూ చదివించనటువంటి ఏ చదువును తండ్రి ఇప్పుడు మీకు చదివిస్తున్నారు?
జవాబు:-
కొత్త
రాజధానిని స్థాపన చేసే చదువును, మనుష్యులకు రాజ్య పదవిని అందించే చదువును ఈ సమయములో
సుప్రీమ్ తండ్రే చదివిస్తారు. ఈ కొత్త చదువు మొత్తం కల్పమంతటిలోనూ చదివించడం జరుగదు.
ఈ చదువు ద్వారానే సత్యయుగ రాజధాని స్థాపన అవుతోంది.
ఓంశాంతి
మేము ఒక ఆత్మ అని, శరీరము కాదు అని పిల్లలకు తెలుసు. దీనినే దేహీ-అభిమానీ అని అంటారు.
మనుష్యులంతా దేహాభిమానులుగా ఉన్నారు. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము మరియు వికారీ
ప్రపంచము. ఇది రావణ రాజ్యము. సత్యయుగము గతించిపోయింది. అక్కడ అందరూ నిర్వికారులుగా
ఉండేవారు. పిల్లలకు తెలుసు - మేమే పవిత్రమైన దేవీ-దేవతలుగా ఉండేవారము, మేమే 84
జన్మల తర్వాత పతితులుగా అయ్యాము. అందరూ 84 జన్మలు తీసుకోరు. భారతవాసులే
దేవీ-దేవతలుగా ఉండేవారు, వారు 82, 83, 84 జన్మలను తీసుకున్నారు. వారే పతితులుగా
అయ్యారు. భారత్ యే అవినాశీ ఖండముగా మహిమ చేయబడింది. భారత్ లో లక్ష్మీ-నారాయణుల
రాజ్యమున్నప్పుడు దీనిని కొత్త ప్రపంచము, కొత్త భారత్ అని అనేవారు. ఇప్పుడు ఇది పాత
ప్రపంచము, పాత భారత్. వారైతే సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, వారిలో ఏ వికారాలు
ఉండేవి కాదు. ఆ దేవతలే 84 జన్మలు తీసుకొని ఇప్పుడు పతితులు అయ్యారు. కామము యొక్క
భూతము, క్రోధము యొక్క భూతము, లోభము యొక్క భూతము - ఇవన్నీ కఠినమైన భూతాలు. వీటిలో
ముఖ్యమైనది దేహాభిమానము యొక్క భూతము. ఇది రావణుడి రాజ్యము కదా. ఈ రావణుడు భారత్
యొక్క అర్ధకల్పపు శత్రువు, ఆ సమయములో మనుష్యుల్లో పంచ వికారాలు ప్రవేశిస్తాయి. ఆ
దేవతల్లో ఈ భూతాలుండేవి కావు. మళ్ళీ పునర్జన్మలను తీసుకుంటూ, తీసుకుంటూ వారి ఆత్మ
కూడా వికారాలలోకి వచ్చేసింది. మనం దేవీ-దేవతలుగా ఉన్నప్పుడు వికారాల భూతమేదీ ఉండేది
కాదని మీకు తెలుసు. సత్య-త్రేతాయుగాలను రామ రాజ్యమనే అంటారు, ద్వాపర-కలియుగాలను
రావణ రాజ్యమని అంటారు. ఇక్కడ స్త్రీ-పురుషులు ప్రతి ఒక్కరిలో పంచ వికారాలు ఉన్నాయి.
ద్వాపరము నుండి కలియుగము వరకు పంచ వికారాలు కొనసాగుతాయి. ఇప్పుడు మీరు పురుషోత్తమ
సంగమయుగములో కూర్చున్నారు. అనంతమైన తండ్రి వద్దకు వికారుల నుండి నిర్వికారులుగా
అయ్యేందుకు వచ్చారు. నిర్వికారులుగా అయి మళ్ళీ ఒకవేళ ఏదైనా వికారములో
పడిపోయినట్లయితే బాబా ఇలా వ్రాస్తారు - నీవు నల్ల ముఖము చేసుకున్నావు, ఇప్పుడిక
తెల్ల ముఖముగా చేసుకోవడం కష్టము. అది ఐదు అంతస్థుల నుండి కిందపడడం వంటిది. ఎముకలు
విరిగిపోతాయి. గీతలో కూడా భగవానువాచ - కామము మహాశత్రువు అని ఉంది. భారత్ యొక్క
వాస్తవిక ధర్మ శాస్త్రము గీతయే. ప్రతి ఒక్క ధర్మానికీ ఒకటే శాస్త్రముంటుంది.
భారతవాసులకైతే ఎన్నో శాస్త్రాలున్నాయి. దానిని భక్తి అని అంటారు. కొత్త ప్రపంచము
సతోప్రధానముగా, బంగారు యుగముగా ఉంటుంది, అక్కడ ఎటువంటి యుద్ధాలు, కొట్లాటలు ఉండేవి
కావు. ఎక్కువ ఆయుష్షు ఉండేది, వారు సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా ఉండేవారు.
దేవతలమైన మేము చాలా సుఖముగా ఉండేవారమని మీకు స్మృతి కలిగింది. అక్కడ అకాల మృత్యువు
సంభవించదు. మృత్యువు భయం ఉండదు. అక్కడ ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము అన్నీ ఉంటాయి.
నరకములో సంతోషము ఉండదు. ఏదో ఒక శారీరక రోగము ఉంటూ ఉంటుంది. ఇది అపారమైన దుఃఖాల
ప్రపంచము. అది అపారమైన సుఖాల ప్రపంచము. అనంతమైన తండ్రి దుఃఖాల ప్రపంచాన్ని రచిస్తారా.
తండ్రి అయితే సుఖ ప్రపంచాన్ని రచించారు. తర్వాత రావణ రాజ్యము రావడంతో దాని వల్ల
దుఃఖము-అశాంతి లభించింది. సత్యయుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము. వికారాలలోకి
వెళ్ళడము అనగా ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగించడము. మనుష్యులు దీనిని భగవంతుని
రచన కదా అని అంటారు కానీ అలా కాదు, ఇది భగవంతుని రచన కాదు, ఇది రావణుడి రచన.
భగవంతుడైతే స్వర్గాన్ని రచించారు. అక్కడ కామ ఖడ్గము ఉండదు. సుఖ-దుఃఖాలను భగవంతుడే
ఇస్తారని కాదు. అరే, భగవంతుడు అనంతమైన తండ్రి, వారు పిల్లలకు దుఃఖాన్ని ఎలా ఇస్తారు.
వారు ఏమంటారంటే, నేను సుఖ వారసత్వాన్ని ఇస్తాను, మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు
శ్రాపితం చేస్తాడు. సత్యయుగములో అయితే అపారమైన సుఖాలు ఉండేవి, సుసంపన్నులుగా
ఉండేవారు. ఒక్క సోమనాథుని మందిరములోనే ఎన్ని వజ్ర-వైఢూర్యాలు ఉండేవి. భారత్ ఎంత
సంపన్నముగా ఉండేది. ఇప్పుడైతే దివాలా తీసింది. సత్యయుగములో 100 శాతం సుసంపన్నము,
కలియుగములో 100 శాతం దివాలా - ఆట ఇలా తయారుచేయబడి ఉంది. ఇప్పుడు ఇది ఇనుపయుగము,
మలినాలు చేరుతూ-చేరుతూ పూర్తిగా తమోప్రధానముగా అయిపోయారు. ఎంతటి దుఃఖము ఉంది. ఈ
విమానాలు మొదలైనవి కూడా 100 సంవత్సరాలలోపే తయారయ్యాయి. దీనినంతా మాయ ఆర్భాటము అని
అంటారు. ఇది చూసి మనుష్యులు సైన్స్ అయితే స్వర్గాన్ని తయారుచేసింది అని భావిస్తారు.
కానీ ఇది రావణుడి స్వర్గము. కలియుగములో మాయ ఆకర్షణలను చూసి మీ వద్దకు కష్టం మీద
వస్తారు. మా వద్ద అయితే మహళ్ళు, మోటార్లు మొదలైనవి ఉన్నాయి అని భావిస్తారు. తండ్రి
అంటారు, స్వర్గము అని సత్యయుగాన్ని అంటారు, ఆ సమయములో ఈ లక్ష్మీ-నారాయణుల
రాజ్యముండేది. ఇప్పుడు ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యం ఎక్కడ ఉంది. ఇప్పుడిక కలియుగము
తర్వాత మళ్ళీ వీరి రాజ్యం వస్తుంది. మొదట భారత్ చాలా చిన్నదిగా ఉండేది. కొత్త
ప్రపంచములో కేవలం 9,00,000 మంది దేవతలే ఉంటారు. అంతే, ఆ తర్వాత వృద్ధి చెందుతూ
ఉంటారు. మొత్తం సృష్టి అంతా వృద్ధి చెందుతుంది కదా. మొట్టమొదట కేవలం దేవీ-దేవతలే
ఉండేవారు. అనంతమైన తండ్రి ప్రపంచపు చరిత్ర మరియు భౌగోళికాలను గురించి కూర్చొని అర్థం
చేయిస్తారు. తండ్రి తప్ప వాటి గురించి ఇంకెవరూ తెలియజేయలేరు. వారిని నాలెడ్జ్ ఫుల్
గాడ్ ఫాదర్ అని అంటారు. వారు సర్వాత్మలకూ తండ్రి. ఆత్మలందరూ పరస్పరం సోదరులు, మళ్ళీ
సోదరీ-సోదరులుగా అవుతారు. మీరందరూ ఒక్క ప్రజాపిత బ్రహ్మాకు దత్తత తీసుకోబడ్డ పిల్లలు.
ఆత్మలందరూ వారి సంతానమే. వారిని పరమపిత అని అంటారు, వారి పేరు శివ, అంతే. తండ్రి
అర్థం చేయిస్తారు - నాకు ఒక్క శివ అన్న పేరే ఉంది. మళ్ళీ భక్తి మార్గములో మనుష్యులు
ఎన్నో మందిరాలను తయారుచేసారు కావున ఎన్నో పేర్లు పెట్టేసారు. భక్తి సామాగ్రి ఎంత
ఎక్కువ ఉంది. దానిని చదువు అని అనరు. అందులో లక్ష్యము-ఉద్దేశ్యము ఏదీ లేదు. అది
కిందకు దిగే మార్గమే. కిందకు దిగుతూ-దిగుతూ తమోప్రధానముగా అయిపోతారు, మళ్ళీ అందరూ
సతోప్రధానముగా అవ్వాలి. మీరు సతోప్రధానముగా అయి స్వర్గములోకి వస్తారు, మిగిలినవారంతా
సతోప్రధానముగా అయి శాంతిధామములో ఉంటారు. దీనిని బాగా గుర్తుంచుకోండి. బాబా అంటారు,
మీరు నన్ను పిలిచారు - బాబా, పతితులైన మమ్మల్ని మీరు వచ్చి పావనులుగా చేయండి అని,
కావున ఇప్పుడు నేను మొత్తం ప్రపంచమంతటినీ పావనంగా తయారుచేయడానికి వచ్చాను. గంగా
స్నానాలు చేయడం ద్వారా పావనులుగా అయిపోతాము అని మనుష్యులు భావిస్తారు. గంగను
పతిత-పావనిగా భావిస్తారు. బావి నుండి నీరు వెలువడితే దానిని కూడా గంగా నీరుగా
భావించి స్నానాలు చేస్తారు. దానిని గుప్త గంగగా భావిస్తారు. తీర్థ యాత్రలకు లేక
ఏదైనా పర్వతము పైకి వెళ్తారు, దానిని కూడా గుప్త గంగ అని అంటారు. దీనిని అసత్యం అని
అంటారు. గాడ్ ఈజ్ ట్రూత్ (భగవంతుడు సత్యము) అని అంటారు. ఇకపోతే రావణ రాజ్యములో అందరూ
అసత్యం చెప్పేవారే. గాడ్ ఫాదరే సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు. అక్కడ అసత్యం యొక్క
విషయమేదీ ఉండదు. దేవతలకు నైవేద్యం కూడా శుద్ధమైనది అర్పిస్తారు. ఇప్పుడు ఇది ఆసురీ
రాజ్యము, సత్య-త్రేతాయుగాలలో ఈశ్వరీయ రాజ్యము ఉంటుంది, అది ఇప్పుడు స్థాపన అవుతోంది.
ఈశ్వరుడే వచ్చి అందరినీ పావనంగా తయారుచేస్తారు. దేవతలలో ఎటువంటి వికారము ఉండదు. యథా
రాజా రాణి, తథా ప్రజా, అందరూ పవిత్రముగా ఉంటారు. ఇక్కడ అందరూ పాపులుగా, కామ
వికారులుగా, క్రోధులుగా ఉన్నారు. కొత్త ప్రపంచాన్ని స్వర్గము అని, దీనిని నరకము అని
అంటారు. నరకాన్ని స్వర్గముగా తండ్రి తప్ప ఇంకెవరూ తయారుచేయలేరు. ఇక్కడ అందరూ
నరకవాసులుగా, పతితులుగా ఉన్నారు. సత్యయుగములో పావనమైనవారు ఉంటారు. అక్కడ మేము
పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు, స్నానాలు చేయడానికి వెళ్తాము అని అనరు.
ఇది వెరైటీ మనుష్య సృష్టి రూపీ వృక్షము. దీనికి బీజరూపుడు భగవంతుడు. వారే రచనను
రచిస్తారు. మొట్టమొదట దేవీ-దేవతలను రచిస్తారు. ఇక తర్వాత వృద్ధి చెందుతూ, చెందుతూ
ఇన్ని ధర్మాలు తయారవుతాయి. మొదట ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేవి. అంతా సుఖమే సుఖము
ఉండేది. విశ్వములో శాంతి ఉండాలి అని మనుష్యులు కోరుకుంటారు కూడా. దానిని ఇప్పుడు
మీరు స్థాపన చేస్తున్నారు. మిగిలినవారంతా అంతమైపోతారు. కొద్దిమంది మాత్రమే
మిగులుతారు. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది కలియుగాంతము మరియు సత్యయుగ
ఆదికి మధ్యన పురుషోత్తమ సంగమయుగము. దీనిని కళ్యాణకారీ పురుషోత్తమ సంగమయుగము అని
అంటారు. కలియుగము తర్వాత సత్యయుగము స్థాపన అవుతోంది. మీరు సంగమములో చదువుతారు, దీని
ఫలము సత్యయుగములో లభిస్తుంది. ఇక్కడ ఎంతగా పవిత్రముగా అవుతారో మరియు చదువుకుంటారో
అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇటువంటి చదువు ఇంకెక్కడా ఉండదు. మీకు ఈ చదువు యొక్క
సుఖము కొత్త ప్రపంచములో లభిస్తుంది. ఒకవేళ ఏదైనా భూతము ఉన్నట్లయితే, ఒకటేమో శిక్షలు
అనుభవించవలసి ఉంటుంది, ఇంకొకటి అక్కడ తక్కువ పదవిని పొందుతారు. ఎవరైతే సంపూర్ణముగా
అయి ఇతరులను కూడా చదివిస్తారో వారు ఉన్నత పదవిని కూడా పొందుతారు. ఎన్ని సెంటర్లు
ఉన్నాయి, లక్షల సెంటర్లు తయారవుతాయి. మొత్తం విశ్వమంతటిలో సెంటర్లు తెరుచుకుంటాయి.
పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవ్వవలసిందే. మీ లక్ష్యము-ఉద్దేశ్యము కూడా ఉంది.
చదివించేవారు ఒక్క శివబాబాయే. వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. తండ్రే వచ్చి
చదివిస్తారు. ఇతను చదివించరు, ఇతని ద్వారా వారు చదివిస్తారు. ఇతడిని భగవంతుని రథము,
భాగ్యశాలీ రథము అని అంటారు. మిమ్మల్ని ఎంతగా పదమాపదమ భాగ్యశాలులుగా తయారుచేస్తారు.
మీరు చాలా షావుకార్లుగా అవుతారు. ఎప్పుడూ రోగగ్రస్థులుగా అవ్వరు. ఆరోగ్యము,
ఐశ్వర్యము, సంతోషము అన్నీ లభిస్తాయి. ఇక్కడ ధనము ఉన్నా కానీ వ్యాధులు మొదలైనవి
ఉన్నాయి. ఆ సంతోషము ఇక్కడ ఉండదు. ఏదో ఒక దుఃఖము ఉంటుంది. దాని పేరే సుఖధామము,
స్వర్గము, ప్యారడైజ్. ఈ లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? ఇది ఎవరికీ
తెలియదు. వీరు భారత్ లో ఉండేవారు, విశ్వాధిపతులుగా ఉండేవారు. ఎటువంటి పార్టిషన్లు (విభజనలు)
మొదలైనవి ఉండేవి కావు. ఇప్పుడు ఎన్ని పార్టిషన్లు ఉన్నాయి. ఇది రావణ రాజ్యము. ఎంతగా
ముక్కలు, ముక్కలుగా అయిపోయింది. కొట్లాడుకుంటూ ఉంటారు. అక్కడైతే మొత్తం భారత్ లో ఈ
దేవీ-దేవతల రాజ్యముండేది. అక్కడ మంత్రులు మొదలైనవారు ఉండరు. ఇక్కడ ఎంతమంది మంత్రులు
ఉన్నారో చూడండి ఎందుకంటే తెలివితక్కువగా ఉన్నారు. మంత్రులు కూడా అలాగే
తమోప్రధానులుగా, పతితులుగా ఉన్నారు. పతితుల వద్దకు పతితులే వస్తారు, ఈ నాటి నాయకులు
పతితమై ఉన్న కారణంగా వారి వద్ద ఉండే మంత్రులు కూడా పతితమైనవారే ఉంటారు...
నిరుపేదలుగా అవుతూ ఉంటారు, అప్పులు తీసుకుంటూ ఉంటారు. సత్యయుగములో అయితే ధాన్యము,
ఫలాలు మొదలైనవి చాలా రుచికరంగా ఉంటాయి. మీరు అక్కడకు వెళ్ళి అన్నీ అనుభవం చేసుకుని
వస్తారు. సూక్ష్మవతనములోకి కూడా వెళ్తారు, అలాగే స్వర్గములోకి కూడా వెళ్తారు. సృష్టి
చక్రము ఎలా తిరుగుతుందో తండ్రి చెప్తారు. మొదట భారత్ లో ఒక్క దేవీ-దేవతా ధర్మమే
ఉండేది. ఇంకే ధర్మమూ ఉండేది కాదు. మళ్ళీ ద్వాపరములో రావణ రాజ్యము ప్రారంభమవుతుంది.
ఇప్పుడు ఇది వికారీ ప్రపంచము, మళ్ళీ మీరు పవిత్రముగా అయి నిర్వికారీ దేవతలుగా
అవుతారు. ఇది స్కూల్. భగవానువాచ - నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను.
మీరు భవిష్యత్తులో ఇలా తయారవుతారు. రాజ్యాధికారము యొక్క చదువు ఇంకెక్కడా లభించదు.
తండ్రే చదివించి కొత్త ప్రపంచము యొక్క రాజధానిని ఇస్తారు. సుప్రీమ్ తండ్రి,
శిక్షకుడు, సద్గురువు ఒక్క శివబాబాయే. తండ్రి అని అన్నప్పుడు తప్పకుండా వారసత్వము
లభించాలి. భగవంతుడు తప్పకుండా స్వర్గ వారసత్వాన్నే ఇస్తారు. ఏ రావణుడిని అయితే ప్రతి
సంవత్సరమూ కాలుస్తారో అతను భారత్ యొక్క నెంబర్ వన్ శత్రువు. రావణుడు ఎలాంటి
అసురులుగా చేసేసాడు. ఇతని రాజ్యము 2,500 సంవత్సరాలు కొనసాగుతుంది. మీతో తండ్రి
అంటారు - నేను మిమ్మల్ని సుఖధామానికి అధిపతులుగా చేస్తాను, రావణుడు మిమ్మల్ని
దుఃఖధామములోకి తీసుకువెళ్తాడు. మీ ఆయువు కూడా తగ్గిపోతుంది. అకస్మాత్తుగా అకాల
మృత్యువులు సంభవిస్తాయి. అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. అక్కడ ఇటువంటి విషయాలేవీ ఉండవు.
దాని పేరే స్వర్గము. ఇప్పుడు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు ఎందుకంటే
పతితులుగా ఉన్నారు. కావున దేవతలుగా పిలుచుకునేందుకు యోగ్యులుగా లేరు. తండ్రి
కూర్చొని ఈ రథము ద్వారా అర్థం చేయిస్తారు, మిమ్మల్ని చదివించేందుకు ఇతని పక్కకు
వచ్చి కూర్చుంటారు, కావున ఇతను కూడా చదువుకుంటారు. మనమందరమూ విద్యార్థులము. ఒక్క
తండ్రే టీచర్. ఇప్పుడు తండ్రి చదివిస్తున్నారు. మళ్ళీ వచ్చి 5000 సంవత్సరాల తర్వాత
చదివిస్తారు. ఈ జ్ఞానము, ఈ చదువు ఇక కనుమరుగైపోతుంది. మీరు చదువుకుని దేవతలుగా
అవుతారు. 2,500 సంవత్సరాలు సుఖ వారసత్వాన్ని తీసుకుంటారు, ఆ తర్వాత దుఃఖము ఉంటుంది,
అది రావణుడి శాపము. ఇప్పుడు భారత్ చాలా దుఃఖితముగా ఉంది. ఇది దుఃఖధామము. ఓ పతిత
పావనా రండి, వచ్చి పావనంగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా కదా. ఇప్పుడు మీలో
ఎటువంటి వికారమూ ఉండకూడదు కానీ అర్ధకల్పపు వ్యాధి అంత త్వరగా పోతుందా. ఆ చదువులో
కూడా ఎవరైతే బాగా చదువుకోరో వారు ఫెయిల్ అవుతారు. ఎవరైతే పాస్ విత్ హానర్ గా అవుతారో
వారు స్కాలర్షిప్ తీసుకుంటారు. మీలో కూడా ఎవరైతే బాగా పవిత్రముగా అయి ఇతరులను అలా
తయారుచేస్తారో వారు ఈ పైజ్ ను తీసుకుంటారు. మాల ఎనిమిది మందిది ఉంటుంది. వారు పాస్
విత్ హానర్లు. ఆ తర్వాత 108 మాల కూడా ఉంటుంది, ఆ మాల కూడా స్మరింపబడుతుంది.
మనుష్యులకు దీని రహస్యము గురించి తెలియదు. మాలలో పైన పుష్పము ఉంటుంది, ఆ తర్వాత మేరు
అనబడే జంట పూసలు ఉంటాయి. స్త్రీ, పురుషులు ఇరువురూ పవిత్రముగా అవుతారు. వీరు
పవిత్రముగా ఉండేవారు కదా. స్వర్గవాసులుగా పిలువబడేవారు. ఇదే ఆత్మ మళ్ళీ పునర్జన్మలను
తీసుకుంటూ, తీసుకుంటూ ఇప్పుడు పతితముగా అయిపోయింది. మళ్ళీ ఇక్కడి నుండి పవిత్రముగా
అయి పావన ప్రపంచములోకి వెళ్తారు. ప్రపంచపు చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి కదా.
వికారీ రాజులు, నిర్వికారీ రాజుల మందిరాలు మొదలైనవాటిని నిర్మించి వారిని పూజిస్తారు.
వారే మళ్ళీ పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. వికారులుగా అవ్వడంతో ఇక ఆ ప్రకాశ
కిరీటము కూడా ఉండదు. ఈ ఆట తయారై ఉంది. ఇది అనంతమైన అద్భుతమైన డ్రామా. మొదట ఒకే
ధర్మము ఉంటుంది, దానిని రామ రాజ్యము అని అంటారు, ఆ తర్వాత ఇతర ధర్మాలవారు వస్తారు.
ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉంటుంది అనేది ఒక్క తండ్రే అర్థం చేయించగలరు.
భగవంతుడైతే ఒక్కరే. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. స్వయంగా భగవంతుడే టీచరుగా అయి చదివిస్తారు, అందుకే బాగా చదువుకోవాలి.
స్కాలర్షిప్ తీసుకునేందుకు పవిత్రముగా అయి ఇతరులను పవిత్రముగా తయారుచేసే సేవను
చేయాలి.
2. లోలోపల కామము, క్రోధము మొదలైన భూతాలేవైతే ప్రవేశించి ఉన్నాయో వాటిని
తొలగించివేయాలి. లక్ష్యము-ఉద్దేశ్యాన్ని ఎదురుగా ఉంచుకొని పురుషార్థము చేయాలి.
వరదానము:-
మాయ నీడ నుండి బయటకు వచ్చి స్మృతి అనే ఛత్రఛాయలో ఉండే
నిశ్చింత చక్రవర్తి భవ
ఎవరైతే సదా తండ్రి స్మృతి అనే ఛత్రఛాయ కింద ఉంటారో, వారు
స్వయాన్ని సదా సురక్షితముగా అనుభవం చేసుకుంటారు. మాయ నీడ నుండి రక్షింపబడేందుకు
సాధనము - తండ్రి ఛత్రఛాయ. ఛత్రఛాయలో ఉండేవారు సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు.
ఒకవేళ ఏదైనా చింత ఉన్నట్లయితే సంతోషము మాయమైపోతుంది. సంతోషము మాయమైపోయి, బలహీనులుగా
అయినట్లయితే మాయ నీడ యొక్క ప్రభావము పడుతుంది ఎందుకంటే బలహీనతయే మాయను
ఆహ్వానిస్తుంది. మాయ నీడ స్వప్నములో పడినా కానీ అది చాలా అలజడిని కలిగిస్తుంది,
అందుకే సదా ఛత్రఛాయ కింద ఉండండి.
స్లోగన్:-
వివేకము అనే స్క్రూ డ్రైవర్
తో నిర్లక్ష్యము అనే లూజు స్క్రూను టైట్ చేసి సదా అలర్ట్ గా ఉండండి.
| | |