04-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ అనంతమైన డ్రామాలో హీరో-హీరోయిన్ల
పాత్ర మీది, తండ్రిది కాదు. తండ్రి వద్ద కేవలం పతితులను పావనముగా తయారుచేసే కళ ఉంది’’
ప్రశ్న:-
బ్రహ్మా
చిత్రాన్ని చూసి ఎవరైతే ప్రశ్నలు అడుగుతారో, వారికి ఏ రహస్యాన్ని అర్థం చేయించాలి?
జవాబు:-
వారికి అర్థం
చేయించండి - వీరు ఆది ఆత్మ, వీరే ఇప్పుడు అంతిమములో ఉన్నారు. మొదటి రాకుమారుడైన
శ్రీకృష్ణుని యొక్క చివరి జన్మలోనే తండ్రి వస్తారు. ఇది పతిత తనువు, వీరే పావనముగా
అవ్వాలి. వీరు భగవంతుడేమీ కాదు. భగవంతుడు సదా పవిత్రుడు. వారు వీరి తనువును ఆధారముగా
తీసుకున్నారు.
పాట:-
ముఖాన్ని
చూసుకో ప్రాణీ...
ఓంశాంతి
తండ్రి
పిల్లలకు అర్థం చేయించారు - శాంతి కోసం బయట ప్రతి ముంగిట వద్ద భ్రమించకూడదు. గృహస్థ
వ్యవహారములో ఉంటే శాంతి లభించదని, శాంతి అనేది అడవిలో లభిస్తుందని హఠయోగ సన్యాసులు
భావిస్తారు. కానీ శాంతి అక్కడ కూడా లభించదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. దీని
గురించి ఒక కథను లేదా ఉదాహరణను వినిపిస్తారు - రాణి మెడలోనే హారము ఉంది కానీ ఆమె
దాని కోసం బయటంతా వెతికారు అని... ఈ విధముగా శాంతి అనేది మీ మెడలోనే ఉంది. దాని కోసం
బయట ఎక్కడ వెతుకుతారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఆత్మ అయిన మీ
స్వధర్మమే శాంతి, మీ ఈ శరీరము కర్మేంద్రియాలతో కూడినది, దీని ద్వారా మీరు పాత్రను
అభినయించాల్సి ఉంటుంది. ఆత్మ అయితే అవినాశీ. ఆత్మ ఏమీ చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు,
అలాగే వినాశనము కూడా అవ్వదు. అయితే, ఆత్మ పతితముగా అవుతుంది, ఆత్మయే పావనముగా
అవ్వాల్సి ఉంటుంది. ఆత్మకు ముందు కిశోర శరీరము లభిస్తుంది, ఆ తర్వాత అది యువత
శరీరముగా, వృద్ధాప్య శరీరముగా అవుతుంది. కానీ ఆత్మ అయితే ఏకరసముగా ఉంటుంది. ముందుగా
ఆత్మను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆత్మనైన నేనే బ్యారిస్టరు మొదలైనవారిగా అవుతాను.
దీనినే ‘ఆత్మాభిమానీ భవ’ అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు
దేహాభిమానులుగా అయ్యారు, అందుకే స్వయాన్ని శరీరముగా భావిస్తున్నారు. నేను ఆత్మను,
ఇది నా శరీరము అనే విషయాన్ని మర్చిపోతారు. అందుకే స్వయాన్ని రియలైజ్ అవ్వాలి. 84
జన్మలు కూడా ఆత్మయే తీసుకుంటుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు - ఎవరైతే
బ్రాహ్మణులుగా అయ్యారో, వారే తర్వాత దేవతలుగా అవుతారు. అలాగని అందరూ 84 జన్మలు
తీసుకుంటారని కూడా కాదు. కొంతమంది ముందు వస్తారు, కొంతమంది 50-100 సంవత్సరాల తర్వాత
కూడా వస్తూ ఉంటారు. కొంతమందికి 80-82 జన్మలు ఉంటాయి, కొంతమందికి మరోలా ఉంటాయి.
మనుష్యులైతే 84 లక్షల జన్మలని అంటారు. దానితో కూడా సంతృప్తి చెందకుండా కణకణములో
భగవంతుడు ఉన్నారని అంటారు. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారు - నేను మనుష్య తనువులోనే
లేను అన్నప్పుడు ఇక జంతువులలో, రాయి-రప్పలలో, కణకణములో ఎలా ఉంటాను. తండ్రి అర్థం
చేయించారు - నంబరువన్ ఆత్మనే చివరి నంబరులో తమోప్రధానముగా అవుతుంది. నేను స్వయంగా
చెప్తున్నాను - నేను అనేక జన్మల అంతిమములో సాధారణ తనువులోకి ప్రవేశిస్తాను. ఎవరైతే
పూర్తి 84 జన్మలు తీసుకున్నారో, వారు ఇప్పుడు తప్పకుండా పతితముగా అయి ఉంటారు,
పావనముగా అయితే ఉండలేరు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - మొదటి రాకుమారుడైన
శ్రీకృష్ణుడు మొదటి నంబరులో ఉన్నారు. వారు పెద్దవారైన తర్వాత శ్రీనారాయణునిగా
అవుతారు. అప్పటికి 20-25 సంవత్సరాలు గడిచిపోతాయి, అందుకే లక్ష్మీ-నారాయణుల విషయములో
పూర్తి 84 జన్మలు అని అనరు. నంబరువన్ శ్రీకృష్ణుడు. వారే స్వయంవరం తర్వాత
నారాయణుడిగా అవుతారు. కానీ పిల్లలే లెక్క తీయాలి కదా. పూర్తి 84 జన్మలు, 5000
సంవత్సరాలు అని శ్రీకృష్ణునికి మాత్రమే చెప్తారు. తండ్రి కూర్చుని అర్థం
చేయిస్తున్నారు - ఎవరికైతే ఆది నుండి అంతిమము వరకు పాత్ర ఉంటుందో, నేను కల్ప-కల్పము
వారి తనువులోకే వస్తాను. ఇతరులెవ్వరిలోనూ రాలేను. ఇది లెక్క కదా. బ్రహ్మాయే మొదటి
నంబరువారు. నేను ఇంకెవరిలోకైనా ఎలా రాగలను. చాలామంది మిమ్మల్ని, కేవలం బ్రహ్మాలోకే
ఎందుకు వస్తారని అడుగుతారు. కానీ ఇది లెక్క కదా. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు.
బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు అని అంటూ ఉంటారు. విష్ణువు లేక శంకరుని ద్వారా
స్థాపన చేయరు. ఇది ఇంకెవరి పని కాదు. మనుష్యులకు రచయిత మరియు రచనల గురించి తెలియదు.
ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉంది, అదే
ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు, జరగరానిది ఏదీ జరగదు
కావున చింతించాల్సిన అవసరమేమీ లేదు... ఇది ఇప్పటి విషయమే. ఏది జరిగేది ఉందో, అదే
జరుగుతుంది. అది మారదు. ఈ రోజు ఏదైతే జరుగుతుందో, అది మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత
జరుగుతుంది. బాబా అర్థం చేయించారు కూడా - ఏ విషయాన్ని చూసినా, ఇది కొత్త విషయమేమీ
కాదు, ఇది 5 వేల సంవత్సరాల క్రితం కూడా జరిగింది అన్నట్లు చూడండి. ఈ విషయాన్ని
స్పష్టముగా వ్రాయండి. వారు వచ్చి అడిగితే అడగనివ్వండి. వ్రాయడములో తప్పేమీ లేదు. ఈ
యుద్ధము ఇంతకుముందు కూడా జరిగింది, కొత్తేమీ కాదు. మహాభారత యుద్ధము 5 వేల సంవత్సరాల
క్రితం కూడా జరిగింది. క్రిస్టియన్లు భారత్ కు వచ్చి రాజ్యాన్ని లాక్కున్నారు, ఇది
కొత్తేమీ కాదు. మళ్ళీ కల్పము తర్వాత కూడా ఇలాగే జరుగుతుంది. ఈ ప్రపంచ
చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము
యొక్క స్థాపనవుతూ ఉంది. ఎవరికైతే 84 జన్మలు పూర్తి అయ్యాయో, వారే మొదటి నంబరులో
లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఈ రహస్యాలన్నింటినీ తండ్రియే కూర్చుని అర్థం
చేయిస్తారు. తండ్రి అంటారు - నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. దీనిని తలకిందులుగా
ఉన్న వృక్షమని అంటారు. ఈ కల్పవృక్షము యొక్క ఆయువు 5 వేల సంవత్సరాలు. స్వస్తిక్ లో
నాలుగు భాగాలు సమానముగా ఉండటాన్ని మీరు చూస్తారు. యుగాలు కూడా సమానముగా ఉన్నాయి,
ఇందులో తేడా ఉండదు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - ప్రపంచములో ఏమేమి జరుగుతుందో చూడండి. కొంతమంది
చంద్రునిపైకి వెళ్తారు, కొంతమంది అగ్నిపై నడవడం, కొంతమంది నీటిపై నడవడం
నేర్చుకుంటారు. ఇవన్నీ వ్యర్థమే, వీటి వలన లాభమేమీ లేదు. వీటితో మనుష్యులు పావనముగా
అయి ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్ళలేరు. ఇవేమి చేసినా కానీ తిరిగి ఇంటికి వెళ్ళలేరు.
ఆత్మ తన ఇంటిని మరియు తండ్రి ఇంటిని మర్చిపోయింది. ఆత్మ తనను తానే మర్చిపోయి
దేహాభిమానిగా అయిపోయింది. మళ్ళీ మందిరాలకు వెళ్ళి - మీరు సర్వగుణ సంపన్నులు, మేము
నీచులము, పాపులము అని మహిమను పాడుతారు. తమను తాము నిందించుకుంటారు. తండ్రి అయితే
ఎప్పుడూ పూజారిగా అవ్వరు. అచ్ఛా, రెండవ నంబరులో శంకరుడిని కూడా సదా పూజ్యుడు అని
అంటారు, అతను కూడా పూజారిగా అవ్వరు, అతని పాత్ర ఇక్కడ లేనే లేదు. ఈ స్టేజిపై బ్రహ్మా
మరియు విష్ణువుల పాత్ర ఉంది. బ్రహ్మా మరియు విష్ణువుల పాత్ర ఏమిటి అనేది ఈ
ప్రపంచములో ఎవరికీ తెలియదు. త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు, దీని అర్థాన్ని కొద్దిగా
కూడా తెలుసుకోరు. బ్రహ్మా ద్వారా స్థాపన అని కూడా అంటూ ఉంటారు కానీ ఎవరైతే స్థాపన
చేస్తారో, వారి చిత్రమే లేదు. నోటితో అంటారు కానీ వారు ఎక్కడ ఉన్నారు, అసలు శివుడంటే
ఎవరు అనేది కూడా తెలియదు. ఆత్మ గురించి, భృకుటి మధ్యలో ప్రకాశించే అద్భుతమైన
నక్షత్రము... అని అంటారు. ఆత్మనైన నేను అవినాశీ, ఈ శరీరము వినాశీ. ఆత్మ ఎన్ని
శరీరాలు తీసుకుంటుంది అనేది ఏమీ తెలియదు. మనుష్యులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. ఓ గాడ్
ఫాదర్, అని అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. దుఃఖము మొదలైనప్పటి నుండి పిలుస్తూ
వచ్చారు. ఈ విషయము కూడా అర్థం చేయించబడింది - భారత్ లో రావణ రాజ్యము మొదలైనప్పుడు
ఇతర ధర్మాలలో కూడా రావణ రాజ్యము ఉంటుందని కాదు, అలా కాదు, ఆ ధర్మాలు వాటి
సమయమనుసారముగా సతో, రజో, తమోలలోకి రావాల్సి ఉంటుంది. ఈ కథ అంతా భారత్ కు
సంబంధించినది. మిగిలినవి ఉపకథలు. తండ్రి మధ్యలోనే వస్తారు. భారత్ తమోప్రధానమైనప్పుడు
వృక్షమంతా తమోప్రధానముగా అయిపోతుంది. ఇతర ధర్మాల వారికి కూడా సుఖ-దుఃఖాలను
అనుభవించాల్సి ఉంటుంది. వృక్షములో కొత్త-కొత్త ఆకులు వెలువడతాయి, అవి చాలా
శోభాయమానముగా ఉంటాయి. కొత్తవారికి కూడా సతో, రజో, తమోలలోకి తప్పకుండా రావాల్సి
ఉంటుంది. చివరిలో ఎవరైతే వస్తారో, వారికి కొంత గౌరవముంటుంది. వారు ఒక్క జన్మలోనే సతో,
రజో, తమోలను దాటగలరు కానీ వారికి ఏ విలువ ఉండదు. ఎవరైతే హీరో-హీరోయిన్ల పాత్రను
అభినయిస్తారో, వారికి విలువ ఉంటుంది. అలాగని, బాబాయే హీరో-హీరోయిన్ పాత్రను
అభినయిస్తారని అనరు. బాబా గురించి అలా అనలేము. వారు వచ్చి పతితులను పావనముగా
తయారుచేస్తారు. వారు స్వయం పతితముగా అవ్వరు. మీరు పతితము నుండి పావనముగా అయ్యే
కృషిని చేస్తారు. శ్రీమతాన్ని అనుసరించి రాజయోగము ద్వారానే రాజ్యాన్ని తీసుకున్నారు.
ఇప్పుడు మీరు మళ్ళీ తీసుకుంటున్నారు. బాబా అంటారు - నేనైతే రాజ్యము చేయను, నేను
మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. ఇప్పుడు ప్రపంచములోని మనుష్యులైతే చాలా
మాటలు చెప్తూ ఉంటారు. భగవానువాచ - నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను.
కానీ దాని అర్థాన్ని మనుష్యులు స్వయమూ అర్థం చేసుకోరు, అలాగే ఇతరులకు కూడా అర్థం
చేయించలేరు. భగవానువాచ అని అంటున్నారంటే - తప్పకుండా భగవంతుడు వచ్చి ఉంటారు. అప్పుడే
కదా, ఓ పిల్లలూ అని సంబోధించి ఉంటారు. భారత్ లోనే శివ జయంతి, శివ రాత్రిని
జరుపుకుంటారు. తండ్రి రావడము కూడా భారత ఖండములోనే వస్తారు. భారత్ యే అవినాశీ ఖండము.
దానికి చాలా గొప్ప మహిమ ఉంది. ఎలాగైతే తండ్రి మహిమ అపారమైనదో, అలా భారత్ మహిమ కూడా
అపారమైనది. భారత్ లోనే పరమపిత పరమాత్మ వచ్చి మనుష్యమాత్రులందరికీ సద్గతినిస్తారు.
అందరికీ సుఖాన్ని ఇస్తారు. వారి జన్మస్థలం భారత్. భారత్ యే ప్రాచీన దేశము. భగవంతుడు
రాజయోగాన్ని నేర్పించడానికి భారత్ లోనే వచ్చారు. కానీ శ్రీకృష్ణుడిని భగవంతుడు అని
అనడముతో భగవంతుని మహిమ నిలవలేదు. భగవంతుడైతే ఒక్కరే, వారినే సద్గురువు అని అంటారు.
ఇకపోతే, గురువులైతే ఎంతోమంది ఉన్నారు. ఒక వ్యాపారాన్ని నేర్పించేవారిని కూడా గురువు
అని అంటారు. ఈ రోజుల్లోనైతే అందరినీ అవతారముగా భావిస్తున్నారు. ఏమీ అర్థం చేసుకోరు.
ఎప్పుడైతే పూర్తిగా పతితముగా అవుతారో, అప్పుడు - బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా
తయారుచేయండి అని పిలుస్తారు.
తండ్రియే వచ్చి సత్యాతి-సత్యమైన అమరకథను వినిపిస్తారు. మనం 84 జన్మలలోకి ఎలా వస్తాము
అనేది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ముందు మంచి జన్మలు తీసుకుంటారు, ఆ తర్వాత దిగుతూ
వస్తారు. ప్రపంచానికి కూడా దిగే కళ ఏర్పడుతుంది. మనుష్యుల బుద్ధి సతో, రజో, తమోగా
అవుతుంది. సత్యయుగము నుండి కొద్దికొద్దిగా దిగే కళ మొదలవుతుంది. మీరు ఎక్కే కళలోకి
వెళ్ళే సమయములో మీ కారణముగా సర్వులకు మేలు జరుగుతుంది. సర్వుల సద్గతిదాత అయితే ఒక్క
తండ్రియే కదా. ఆ గురువులైతే కేవలం శాస్త్రాలను వినిపిస్తారు. వాటిని వింటూ-వింటూ
పడిపోతూనే వచ్చారు. అనంతమైన తండ్రి వచ్చి పిల్లలను అడుగుతారు - నేను మిమ్మల్ని ఇంత
షావుకారులుగా తయారుచేసి వెళ్ళాను, ఇన్ని వజ్ర-వైఢూర్యాల మహళ్ళను ఇచ్చి వెళ్ళాను,
అవన్నీ ఏమయ్యాయి? లౌకిక తండ్రి పిల్లలకు ధనము ఇస్తారు కానీ పిల్లలు ఆ ధనాన్ని పాడు
చేస్తే, తండ్రి వారిని పిలిచి - నీవు ఇంత ధనాన్ని ఎక్కడ పోగొట్టావు? అని అడుగుతారు.
పిల్లల వద్ద ధనము ఉంటే దానిని చాలా వృధా చేస్తారు. తండ్రి చూస్తే ధర్మాత్మగా ఉంటారు,
పిల్లలేమో విదేశాలకు వెళ్ళి లక్షల రూపాయలను వృధా చేసి వస్తారు. తండ్రి ఏమీ
చేయలేకపోతారు. అలాగని ఆ తండ్రి తన పిల్లల నుండి వేరవ్వలేరు కూడా, ఎందుకంటే అది
తాతగారి ఆస్తి. కానీ లోలోపల అతను మథనపడుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఎంత చెడ్డగా
ఉంటారంటే, తండ్రి మరణించిన తర్వాత, 12 నెలల్లోనే మొత్తం ఆస్తినంతటినీ పోగొట్టేస్తారు.
అవి హద్దు విషయాలు. ఇది అనంతమైన విషయము. అనంతమైన తండ్రి అంటారు - మీరు ఎంత
ధనవంతులుగా ఉండేవారు, విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మరి నిరుపేదలుగా ఎందుకయ్యారు?
ఇంత ధనాన్ని ఏం చేసారు? తండ్రి పిల్లలను మాత్రమే అడుగుతారు - భారత్ ను ఇంత
షావుకారుగా తయారుచేసాను, ఆ ధనమంతా ఎక్కడ పోయింది? మళ్ళీ తండ్రియే కూర్చుని అర్థం
చేయిస్తారు. భక్తి మార్గములో ఎంత ఖర్చు చేస్తారు. శాస్త్రాలు మొదలైనవాటి వెనుక ఎంత
ఖర్చు చేస్తారు. తల వంచి నమస్కరిస్తూ వచ్చారు, నుదురు కూడా అరిగిపోయింది. ధనము
మొదలైనవన్నీ పోగొట్టుకుని కూర్చున్నారు. ఇది డ్రామా. నేను మిమ్మల్ని షావుకార్లుగా
చేస్తాను. రావణుడు మిమ్మల్ని నిరుపేదగా చేస్తాడు. భారతవాసులకే తండ్రి అర్థం
చేయిస్తారు కదా. భారత్ యే బంగారు పిచ్చుకగా ఉండేది. ఎంత ధనముండేదంటే, అది ఇతర
ధర్మాలవారు దోచుకుని వెళ్ళిపోయారు. భారత్ ఎలా ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఇది కూడా
డ్రామాలో రచించబడి ఉంది. భారత్ యే స్వర్గముగా ఉండేది, భారత్ యే నరకముగా ఉంది.
ఇప్పుడిది నరకము, కావుననే తాము పతితులము అని అర్థం చేసుకునే విధముగా బాబా మెట్ల
వరుస చిత్రాన్ని తయారుచేయించారు. చిన్న-చిన్న పిల్లలకు కూడా చిత్రాలపై అర్థం
చేయిస్తారు కదా. చిత్రాలు లేకుండా పిల్లలు ఏం అర్థం చేసుకోగలరు. తండ్రియే వచ్చి
పతితము నుండి పావనముగా తయారయ్యే సహజమైన యుక్తిని తెలియజేస్తారు. ఈ యుక్తి అతి
సులభమైనది, అలాగే అతి కష్టమైనది కూడా. సత్యయుగములో దేహీ-అభిమానులుగా ఉంటారు. అక్కడ
ఆత్మ ఈ విధముగా భావిస్తుంది - ఇప్పుడు శరీరము పెద్దదయ్యింది, ఈ పాత శరీరాన్ని వదిలి
మరొకటి తీసుకోవాలి అని. ఇప్పుడు వెళ్ళి బిడ్డగా అవ్వాలి అన్నట్లు సాక్షాత్కారము
అవుతుంది, ఇక పాత శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఏడుస్తారు కూడా.
బాజాలు మోగిస్తారు. సత్యయుగములోనైతే సంతోషముగా ఒక శరీరాన్ని వదిలి మరొకటి
తీసుకుంటారు, అక్కడ వేడుకలా జరుపుకుంటారు, ఇక్కడ ఎంతగా దుఃఖపడతారు. ఎవరైనా మరణిస్తే,
స్వర్గస్థులయ్యారని అంటారు అంటే వారు ఇప్పటివరకు నరకములో ఉన్నారని కదా! ఇప్పుడు మీరు
స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. తండ్రి మిమ్మల్ని
స్వర్గవాసులుగా తయారుచేస్తారు. తండ్రి జీవన్ముక్తిని ఇవ్వడానికే వస్తారు. రావణుడి
బంధనము నుండి విడిపించి జీవన్ముక్తులుగా చేస్తారు. తండ్రి అంటారు - నేను కల్పక్రితం
వలె వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తాను, కల్ప-కల్పము బ్రహ్మా తనువులోకే వస్తాను. మీరు
తప్పకుండా బ్రాహ్మణులుగా తయారవ్వాలి. యజ్ఞములో బ్రాహ్మణులైతే తప్పకుండా కావాలి కదా.
ఇది రాజస్వ అశ్వమేధ అవినాశీ జ్ఞాన యజ్ఞము. ఈ రథాన్ని స్వాహా చేయాలి. అశ్వము అని ఈ
రథాన్ని అంటారు. రాజస్వ అనగా స్వరాజ్యము కోసం ఈ అశ్వాలన్నీ (శరీరాలన్నీ) ఇందులో
స్వాహా కానున్నాయి. ఆత్మ అయితే స్వాహా అవ్వదు. ఆత్మలు లెక్కాచారాలు సమాప్తము
చేసుకుని వెళ్ళిపోతాయి. మళ్ళీ కొత్తగా అందరి పాత్ర మొదలవుతుంది. దీనినే
చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవ్వడము అని అంటారు. తండ్రి, కొత్త ప్రపంచాన్ని స్థాపన
చేసి పాత ప్రపంచాన్ని సమాప్తము చేసేందుకే వస్తారు. కేవలం ఈ మహాభారత యుద్ధము గురించి
మాత్రమే శాస్త్రాలలో చెప్తూ ఉంటారు. కనుక ఈ యుద్ధము ద్వారా ఈ స్వర్గ ద్వారాలు
తెరుచుకుంటాయని అర్థం చేయించాలి. అందుకే, దీని గురించి శాస్త్రాలలో గాయనముంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. గడిచిపోయిన విషయాల గురించి ఎప్పుడూ చింతన చేయకూడదు. ఏ విషయమైతే గడిచిపోయిందో,
దానిని నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు) అని భావిస్తూ మర్చిపోవాలి.
2. ఈ రాజస్వ అశ్వమేధ యజ్ఞములో మీ తనువు-మనసు-ధనము, అన్నింటినీ స్వాహా చేసి సఫలము
చేసుకోవాలి. ఈ అంతిమ జన్మలో సంపూర్ణ పావనముగా అయ్యేందుకు శ్రమించాలి.
వరదానము:-
శ్రేష్ఠ వృత్తి ద్వారా ప్రవృత్తిని ప్రగతికి సాధనముగా
చేసుకునే సదా సమర్థవాన్ భవ
ప్రవృత్తిలో మొదట వృత్తి ద్వారా పవిత్రముగా లేక
అపవిత్రముగా అవుతారు. ఒకవేళ వృత్తిని సదా ఒక్క తండ్రితో జోడించినట్లయితే, ఒక్క
తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఇటువంటి ఉన్నతమైన వృత్తిలో ఉన్నట్లయితే, ప్రవృత్తి
ప్రగతికి సాధనముగా అవుతుంది. వృత్తి ఉన్నతముగా మరియు శ్రేష్ఠముగా ఉన్నట్లయితే అది
చంచలమవ్వకుండా ఉంటుంది. ఇటువంటి శ్రేష్ఠ వృత్తి ద్వారా ప్రగతిని పొందుతూ
గతి-సద్గతులను సహజముగానే పొందుతారు. అప్పుడిక అన్ని ఫిర్యాదులు సమాప్తమైపోతాయి.
స్లోగన్:-
ఒకవేళ పవిత్రత
స్వప్నమాత్రమైనా కదిలినట్లయితే నిశ్చయము యొక్క పునాది కచ్చాగా (అపరిపక్వముగా)
ఉన్నట్లు.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
మెరుస్తున్న
నక్షత్రాలైన మీరు సూర్య, చంద్రుల వలె మీ సంపూర్ణ స్థితిలో మరియు మాస్టర్ దాతాతనపు
స్థితిలో స్థితులైనట్లయితే భ్రమిస్తున్న ఆత్మలు, వెతుకుతున్న ఆత్మలు దీపపు పురుగుల
వలె స్వతహాగానే పొందడానికని, కలవడానికని ఫాస్ట్ గతితో మీ వద్దకు వస్తారు మరియు మీరు
అందరికీ సెకండులో తండ్రి ద్వారా ముక్తి-జీవన్ముక్తుల అధికారాన్ని ఇప్పించేందుకు
తీవ్రగతితో సేవ చేయాల్సి ఉంటుంది.