‘‘పూర్తి సంవత్సరమంతా - సంతుష్టమణులుగా అయ్యి సదా
సంతుష్టముగా ఉండండి మరియు అందరినీ సంతుష్టము చేయండి’’
ఈ రోజు మనోభిరాముడైన బాప్ దాదా తమ నలువైపులా ఉన్న అనగా
ఎదురుగా ఉన్నవారిని కూడా మరియు దూరముగా ఉంటూ కూడా సమీపముగా
ఉన్న రాకుమారులైన, అతి ప్రియమైన పిల్లలు ప్రతి ఒక్కరినీ చూసి
హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ రాజానే, అందుకే
రాజకుమారులు. ఈ పరమాత్మ ప్రేమ, అనురాగము విశ్వములో చాలా
కొద్దిమంది ఆత్మలకే ప్రాప్తిస్తుంది, కానీ మీరందరూ పరమాత్మ
ప్రేమకు, పరమాత్మ అనురాగానికి అధికారులు. ప్రపంచములోని ఆత్మలు
రండి, రండి అని వారిని పిలుస్తూ ఉన్నారు, కానీ మీరందరూ పరమాత్మ
ప్రేమను అనుభవము చేస్తున్నారు, పరమాత్మ పాలనలో
పాలింపబడుతున్నారు. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవము
చేస్తున్నారా? బాప్ దాదా పిల్లలందరినీ డబల్ రాజ్య అధికారులుగా
చూస్తున్నారు. ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారము కల రాజులు మరియు
భవిష్యత్తులోనైతే రాజ్యము మీ జన్మసిద్ధ అధికారము. కనుక డబల్
రాజులు. అందరూ రాజులే కదా, ప్రజలైతే కాదు కదా! రాజయోగులేనా లేక
కొంతమంది ప్రజాయోగులు కూడా ఉన్నారా? ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా,
వెనుక ఉన్నవారు రాజయోగులేనా? ప్రజాయోగులు ఎవ్వరూ లేరు కదా!
పక్కా? ఆలోచించి అవును అని చెప్పండి! రాజ్య అధికారి అనగా సర్వ
సూక్ష్మ మరియు స్థూల కర్మేంద్రియాలకు అధికారులు, ఎందుకంటే
స్వరాజ్యము ఉంది కదా? మరి అప్పుడప్పుడు రాజులుగా అవుతారా లేక
సదా రాజులుగా ఉంటారా? ముఖ్యమైన మీ మనస్సు-బుద్ధి-సంస్కారాలకు
కూడా అధికారులేనా? సదా అధికారులేనా లేక అప్పుడప్పుడూనా? స్వ
రాజ్యము అనేది సదా స్వరాజ్యముగానే ఉంటుందా, లేదా ఒక రోజు ఉండి,
మరొక రోజు ఉండదా? రాజ్యమనేది సదా ఉంటుంది కదా? కనుక సదా
స్వరాజ్య అధికారులు అనగా సదా మనస్సు-బుద్ధి-సంస్కారాలపై
అధికారులు. సదా అలా ఉంటున్నారా? సదా ఉంటుందా అంటే అవును అని
చెప్పటం లేదు? ఒక్కోసారి మనసు మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు
మనసును నడిపిస్తారా? ఒక్కోసారి మనసు అధికారిగా అవుతుందా?
అవుతుంది కదా! మరి సదా స్వరాజ్య అధికారులే విశ్వ రాజ్య
అధికారులు.
సదా చెక్ చేసుకోండి - ఎంత సమయము మరియు ఎంత శక్తితో మీ
కర్మేంద్రియాలపై, మనసు-బుద్ధి-సంస్కారాలపై ఇప్పుడు అధికారులుగా
అవుతారో, అంతగానే భవిష్యత్తులో రాజ్య అధికారము లభిస్తుంది.
ఒకవేళ ఇప్పుడు పరమాత్మ పాలన, పరమాత్మ చదువు, పరమాత్మ శ్రీమతము
ఆధారముపై ఈ ఒక్క సంగమయుగ జన్మలో సదా అధికారులుగా ఉండకపోతే, ఇక
21 జన్మలు ఎలా రాజ్య అధికారులుగా అవుతారు? ఇది లెక్క కదా! ఈ
సమయములోని స్వరాజ్యమనేది, స్వయముపై రాజుగా అవ్వటము ద్వారానే 21
జన్మలకు గ్యారంటీ ఉంటుంది. నేను ఎవరిని మరియు ఎలా అవుతాను అన్న
మీ భవిష్యత్తును ఈ వర్తమాన అధికారము ద్వారా స్వయమే తెలుసుకోగలరు.
ఆలోచించండి, విశేష ఆత్మలైన మీ అనాది, ఆది పర్సనాలిటీ మరియు
రాయల్టీ ఎంత ఉన్నతమైనది! అనాది రూపములో కూడా చూడండి, ఆత్మలైన
మీరు పరంధామములో ఉన్నప్పుడు ఎంతటి మెరుస్తున్న ఆత్మలుగా
కనిపించేవారు! ఆ మెరుపుకు ఉన్న రాయల్టీ, పర్సనాలిటీ (హుందాతనము,
వ్యక్తిత్వము) ఎంత గొప్పది! అది కనిపిస్తుందా? మరియు
బాబాతోపాటుగా ఆత్మ రూపములో కూడా ఉంటారు, సమీపముగా ఉంటారు. ఏ
విధంగా ఆకాశములో కొన్ని-కొన్ని నక్షత్రాలు చాలా ఎక్కువగా
మెరుస్తూ ఉంటాయి కదా, అదే విధంగా ఆత్మలైన మీరు కూడా విశేషముగా
బాబాతోపాటు ఉంటారు మరియు విశేషముగా మెరుస్తున్న నక్షత్రాలుగా
ఉంటారు. పరంధామములో కూడా మీరు బాబాకు సమీపమైనవారు మరియు తర్వాత
ఆదికాలమైన సత్యయుగములో కూడా దేవాత్మలైన మీ పర్సనాలిటీ, రాయల్టీ
ఎంత ఉన్నతమైనది. మొత్తము కల్పమంతా చుట్టి రండి, ధర్మాత్మలు
వచ్చి వెళ్ళారు, మహాత్ములు వచ్చి వెళ్ళారు, ధర్మపితలు వచ్చి
వెళ్ళారు, నేతలు వచ్చి వెళ్ళారు, అభినేతలు (యాక్టర్లు) వచ్చి
వెళ్ళారు, కానీ సత్యయుగములో దేవాత్మలైన మీకు ఉన్న పర్సనాలిటీ
వారెవరికైనా ఉందా? మీ దేవ స్వరూపము ఎదురుగా వస్తుంది కదా?
వస్తుందా లేక మేము అలా తయారవుతామో, లేదో తెలియదు అని అంటారా.
పక్కాయే కదా! మీ దేవ స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి మరియు
చూడండి, ఆ పర్సనాలిటీ ఎదురుగా వచ్చిందా? ఎంత రాయల్టీ ఉంది.
ప్రకృతి కూడా పర్సనాలిటీ కలిగినదిగా అవుతుంది. పక్షులు, చెట్లు,
ఫలాలు, పూలు అన్నీ పర్సనాలిటీ కలిగినవిగా ఉంటాయి, రాయల్ గా
ఉంటాయి. అచ్ఛా, ఇప్పుడు కిందకు రండి, మీ పూజ్య స్వరూపాన్ని
చూసారా? మీ పూజ జరుగుతుంది! డబల్ విదేశీయులు పూజ్యులుగా అవుతారా
లేక ఇండియావారు అవుతారా? మీరు దేవీలు, దేవతలుగా తయారయ్యారా?
తొండము కలవారిగా, తోక కలవారిగా కాదు. దేవీలలో కూడా ఆ కాళీ రూపము
కలవారిగా కాదు. దేవతల మందిరాలలో చూడండి, మీ పూజ్య స్వరూపానికి
ఎంత రాయల్టీ ఉంది, ఎంత పర్సనాలిటీ ఉంది? మూర్తి 4 అడుగులు, 5
అడుగులే ఉంటుంది, కానీ మందిరాలను ఎంత పెద్దవిగా తయారుచేస్తారు.
ఇదే రాయల్టీ మరియు పర్సనాలిటీ. ఈ రోజుల్లో ఎంత ప్రధానమంత్రి
అయినా లేక రాజు అయినా కానీ పాపం, వారి విగ్రహాన్ని తయారుచేసి
ఎండలో పెట్టేస్తారు. ఆ విగ్రహాలకు ఏదైనా జరగవచ్చు. కానీ మీ
పూజ్య స్వరూపము యొక్క పర్సనాలిటీ ఎంత ఉన్నతమైనది. ఉన్నతమైనదే
కదా! కుమారీలు కూర్చుని ఉన్నారు కదా! మీలో రాయల్టీ ఉంటుంది కదా?
మళ్ళీ అంతిమములో సంగమయుగములో కూడా మీ అందరి రాయల్టీ ఎంత
ఉన్నతమైనది. బ్రాహ్మణ జీవితములోని పర్సనాలిటీ ఎంత గొప్పది!
డైరెక్టుగా భగవంతుడే మీ బ్రాహ్మణ జీవితములో పర్సనాలిటీని మరియు
రాయల్టీని నింపారు. బ్రాహ్మణ జీవితము యొక్క చిత్రకారుడు ఎవరు?
స్వయంగా తండ్రి. బ్రాహ్మణ జీవితములోని పర్సనాలిటీ మరియు రాయల్టీ
అంటే ఏమిటి? పవిత్రత. పవిత్రతయే రాయల్టీ. అంతే కదా! బ్రాహ్మణ
ఆత్మలందరూ ఎవరైతే ఇక్కడ కూర్చుని ఉన్నారో, వారిలో పవిత్రతకు
చెందిన రాయల్టీ ఉంది కదా! ఉంది, తల ఊపండి. వెనుకవారు చేతులు
ఎత్తుతున్నారు. మీరు వెనక లేరు, ఎదురుగా ఉన్నారు. చూడండి,
వెనుక వైపుకు స్వతహాగా దృష్టి వెళ్తుంది. ముందు వైపుకైతే
ప్రత్యేకముగా చూడవలసి వస్తుంది కానీ వెనుకవైపుకు ఆటోమేటిక్ గా
వెళ్తుంది.
కనుక చెక్ చేసుకోండి - పవిత్రత యొక్క పర్సనాలిటీ సదా ఉంటుందా?
మనసా-వాచా-కర్మణా, వృత్తి-దృష్టి మరియు కృతి, అన్నింటిలోనూ
పవిత్రత ఉందా? మనసా పవిత్రత అనగా సదా మరియు సర్వుల పట్ల శుభ
భావన, శుభ కామన - సర్వుల పట్ల. ఎదుటి ఆత్మ ఎటువంటివారైనా సరే,
పవిత్రతా రాయల్టీ కల మనసా ఎలా ఉంటుందంటే - సర్వుల పట్ల శుభ
భావన, శుభ కామన, కళ్యాణ భావన, దయా భావన, దాతాతనపు భావన. మరియు
దృష్టి ద్వారా సదా ప్రతి ఒక్కరిలో ఆత్మిక స్వరూపమైనా కనిపించాలి
లేక ఫరిశ్తా రూపమైనా కనిపించాలి. వారు ఫరిశ్తాగా అవ్వకపోయినా
కానీ, నా దృష్టిలో ఫరిశ్తా రూపము మరియు ఆత్మిక రూపమే ఉండాలి
మరియు కృతిలో అనగా సంపర్క, సంబంధాలలో, కర్మలలోకి రావటములో, సదా
సర్వులకు స్నేహాన్ని ఇవ్వటము, సుఖాన్ని ఇవ్వటము. ఇతరులు
స్నేహాన్ని ఇచ్చినా, ఇవ్వకపోయినా కానీ నా కర్తవ్యము -
స్నేహాన్ని ఇచ్చి స్నేహీగా తయారుచెయ్యటము, సుఖాన్ని ఇవ్వటము.
దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి అన్న స్లోగన్ ఉంది
కదా. ఇవ్వకూడదు కూడా, తీసుకోకూడదు కూడా. ఇచ్చేవారు ఎప్పుడైనా
మీకు దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీరు వారిని సుఖము యొక్క
స్మృతితోనే చూడండి. పడిపోయినవారిని ఇంకా పడేయరు, పడిపోయినవారిని
సదా పైకి లేపుతారు. వారు పరవశులై దుఃఖాన్ని ఇస్తున్నారు. వారు
పడిపోయారు కదా! కావున వారిని ఇంకా పడేయకూడదు. పాపం వారిని ఇంకా
కాలితో తన్నడం కాదు. వారిని స్నేహముతో పైకి లేపండి. అందులో కూడా
ముందు దానము ఇంటి నుండే ప్రారంభమవుతుంది. మొదటైతే దానము ఇంటి
వద్దనే ప్రారంభమవుతుంది కదా, మీ సహచరులందరినీ, సేవా సహచరులను,
బ్రాహ్మణ పరివారములోని సహచరులను, ప్రతి ఒక్కరినీ పైకి లేపండి.
వారు తమలోని చెడును చూపించినా కూడా, మీరు మాత్రం వారిలోని
విశేషతను చూడండి. నంబరువారుగా అయితే ఉన్నారు కదా! చూడండి, మాల
మీ స్మృతిచిహ్నము. మరి అందరిదీ ఒకటే నంబరు కాదు కదా! 108 మంది
ఉన్నారు కదా! కనుక నంబరువారుగా ఉన్నారు మరియు ఉంటారు, కానీ నా
కర్తవ్యము ఏమిటి? ఇలా ఆలోచించకండి - అచ్ఛా, నేను 8 రత్నాలలోనైతే
లేనే లేను, 108 లోకి బహుశా వస్తానేమో, ఆ 108లో చివరివానిగా కూడా
ఉండవచ్చు, మరి నాలో కూడా కొన్ని సంస్కారాలు ఉంటాయి కదా, ఇలా
ఆలోచించకండి. ఇతరులకు సుఖాన్ని ఇస్తూ-ఇస్తూ, స్నేహాన్ని
ఇస్తూ-ఇస్తూ మీ సంస్కారాలు కూడా స్నేహీగా, సుఖీగా అయిపోతాయి.
ఇది సేవ మరియు ఈ సేవ మొదట ఇంటి నుండే ప్రారంభమవుతుంది.
బాప్ దాదాకు ఈ రోజు ఒక విషయములో నవ్వు వస్తుంది, చెప్పమంటారా.
చూడండి, మీకు కూడా నవ్వు వస్తుంది. బాప్ దాదా అయితే పిల్లల
ఆటలను చూస్తుంటారు కదా! బాప్ దాదా ఒక్క క్షణములో ఒక్కోసారి
ఒక్కో సెంటరు యొక్క టి.వి.ని తెరుస్తారు, ఒక్కోసారి
విదేశమువారిది, ఒక్కోసారి ఇండియావారిది స్విచ్ ఆన్ చేస్తారు,
అప్పుడు వారు ఏం చేస్తున్నారు అన్నది తెలిసిపోతుంది ఎందుకంటే
బాబాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా. పిల్లలు కూడా అంటారు -
సమానముగా అవ్వాల్సిందే అని. పక్కా కదా, సమానముగా అవ్వాల్సిందేనా!
ఆలోచించి చెయ్యి ఎత్తండి. మరణించాల్సి వచ్చినా, వంగాల్సి
వచ్చినా, సహనము చెయ్యాల్సి వచ్చినా, వినాల్సి వచ్చినా కానీ,
సమానముగా అయ్యే చూపిస్తాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు
చేతులెత్తండి. కుమారీలు ఆలోచించి చెయ్యి ఎత్తండి. వీరి ఫోటో
తియ్యండి. కుమారీలు చాలామంది ఉన్నారు. మరణించాల్సి వస్తుంది,
వంగాల్సి వస్తుంది. పాండవులు చేతులెత్తండి. విన్నారా, సమానముగా
అవ్వాల్సిందే. సమానముగా అవ్వకపోతే మజా రాదు, పరంధామములో కూడా
సమీపముగా ఉండరు, పూజ్యులుగా అవ్వడములో కూడా తేడా వస్తుంది,
సత్యయుగ రాజ్యభాగ్యములో కూడా తేడా వస్తుంది.
బ్రహ్మాబాబాపై మీకు ప్రేమ ఉంది కదా, డబుల్ విదేశీయులకు
అందరికంటే ఎక్కువ ప్రేమ ఉంది. ఎవరికైతే బ్రహ్మాబాబాపై చాలా
గాఢమైన, మనస్ఫూర్వకమైన ప్రేమ ఉందో వారు చేతులెత్తండి. అచ్ఛా,
పక్కా ప్రేమ ఉంది కదా? ఇప్పుడు ప్రశ్న అడుగుతాము, ఎవరిపైనైతే
ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమకు గుర్తు ఏమిటంటే - ఏదైతే వారికి
ఇష్టమనిపిస్తుందో, అది ప్రేమించేవారికి కూడా ఇష్టమనిపిస్తుంది,
ఇరువురి సంస్కారాలు, సంకల్పాలు, స్వభావము అన్నీ కలుస్తాయి,
అందుకే వారు ప్రియమనిపిస్తారు. మరి బ్రహ్మాబాబాపై ప్రేమ
ఉన్నట్లయితే 21 జన్మలూ, మొదటి జన్మ నుండి మొదలుకుని,
రెండవ-మూడవ జన్మ నుండి వస్తే బాగుండదు, కానీ మొదటి జన్మ నుండి
మొదలుకుని చివరి జన్మ వరకు తోడుగా ఉంటారు, రకరకాల రూపాలలో
తోడుగా ఉంటారు. మరి తోడుగా ఎవరు ఉండగలరు? సమానముగా ఉన్నవారు.
వారు నంబర్ వన్ ఆత్మ. మరి తోడుగా ఎలా ఉంటారు? నంబర్ వన్ గా
అయినప్పుడే తోడుగా ఉంటారు కదా, అన్నింటిలోనూ నంబర్ వన్, మనసాలో,
వాణిలో, కర్మణాలో, వృత్తిలో, దృష్టిలో, కృతిలో, అన్నింటిలోనూ.
మరి నంబర్ వన్ గా ఉన్నారా లేక నంబరువారుగా ఉన్నారా? మరి ఒకవేళ
ప్రేమ ఉంటే ఆ ప్రేమ కోసము దేనినైనా బలిహారము చేయడము
కష్టమనిపించదు. చివరి జన్మలో, కలియుగ అంతిమములో కూడా
దేహాభిమానపు ప్రేమ కలవారు ప్రాణాలను కూడా బలిహారము చేసేస్తారు.
మరి ఒకవేళ మీరు బ్రహ్మాబాబాపై ఉన్న ప్రేమకు మీ సంస్కారాలను
పరివర్తన చేసుకుంటే, అదేమంత పెద్ద విషయము! అదేమైనా పెద్ద విషయమా?
కాదు. మరి ఈ రోజు నుండి అందరి సంస్కారాలు మారిపోయాయా! పక్కా?
రిపోర్ట్ వస్తుంది, మీతోటివారు వ్రాస్తారు, పక్కా? దాదీలూ,
వింటున్నారు కదా! సంస్కారాలు మారిపోయాయి అని అంటారా లేక సమయము
పడుతుందా? ఏమిటి? మోహినీ (న్యూయార్కు) చెప్పండి, మారిపోతారు కదా!
వీరంతా మారిపోతారు కదా? అమెరికావారైతే మారిపోతారు. నవ్వు వచ్చే
విషయము చెప్పటం మిగిలిపోయింది.
నవ్వు వచ్చే విషయము ఏమిటంటే - పురుషార్థమైతే చాలా
చేస్తున్నాము అని అందరూ అంటారు మరియు బాప్ దాదాకు వారిని చూస్తే
దయ కూడా కలుగుతుంది, పురుషార్థము చాలా చేస్తారు, అప్పుడప్పుడు
చాలా శ్రమ చేస్తారు, కానీ తర్వాత ఏమంటారు - ఏం చెయ్యాలి, నా
సంస్కారాలే అలా ఉన్నాయి. సంస్కారాల వంక పెట్టి తమను తాము తేలిక
చేసేసుకుంటారు కానీ బాబా ఈ రోజు ఏం చూసారంటే, నా సంస్కారము అని
మీరు ఏదైతే అంటారో, వాస్తవానికి అది మీ సంస్కారమా? మీరు ఆత్మ,
ఆత్మే కదా! శరీరమైతే కాదు కదా! మరి ఆత్మ సంస్కారాలు ఏమిటి?
మరియు మీ అసలైన సంస్కారాలు ఏవి? నా సంస్కారాలు అని ఈ రోజు మీరు
ఏదైతే అంటున్నారో అవి మీవా లేక రావణుడివా? ఎవరివి? మీవా? కాదా?
మరి నావి అని ఎందుకంటారు! నా సంస్కారము ఇలా ఉంది అనే అంటారు కదా?
మరి ఈ రోజు నుండి నా సంస్కారము అని అనకండి. వద్దు. అప్పుడప్పుడు
అక్కడి నుండి, ఇక్కడి నుండి, చెత్త అంతా ఎగిరి వస్తుంది కదా!
అలాగే ఈ రావణుడి వస్తువులు మీ దగ్గరకు వస్తే, వాటిని నావి అని
ఎలా అంటారు! అవి మీవా? కాదు కదా? కనుక ఇక ఎప్పుడూ ఇలా అనకండి,
నాది అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు నేను ఎవరిని మరియు నా
సంస్కారము ఏమిటి అన్నది గుర్తు తెచ్చుకోండి. దేహాభిమానములో
ఉన్నప్పుడు అది నా సంస్కారము, ఆత్మాభిమానములో ఈ సంస్కారము లేదు.
కనుక ఇప్పుడు ఈ భాషను కూడా పరివర్తన చేసుకోండి. నా సంస్కారము
అని అంటూ నిర్ల్యక్షులైపోతారు. అటువంటి భావము లేదు కానీ అది నా
సంస్కారము అని అంటారు. అచ్ఛా, మరొక మాట ఏమంటారు? నా స్వభావము.
ఇప్పుడు స్వభావము అన్న పదము ఎంత బాగుంది. స్వ అయితే ఎప్పుడూ
మంచిగానే ఉంటుంది. నా స్వభావము, స్వయము యొక్క భావము మంచిగా
ఉంటుంది, చెడుగా ఉండదు. కనుక నా స్వభావము, నా సంస్కారము అని ఈ
పదాలేవైతే ఉపయోగిస్తారో, ఇప్పుడు ఈ భాషను మార్చుకోండి. నాది
అన్న పదము ఎప్పుడు వచ్చినా, నా అసలైన సంస్కారము ఏమిటి
అన్నదానిని గుర్తు తెచ్చుకోండి. ఇలా ఎవరు అంటారు? ఇది నా
సంస్కారము అని ఆత్మ అంటుందా? ఇది ఆలోచించినప్పుడు మీపై మీకే
నవ్వు వస్తుంది, వస్తుంది కదా నవ్వు? నవ్వు వస్తే ఏదైతే గొడవ
చేస్తుంటారో అది సమాప్తమైపోతుంది. దీనినే భాషను పరివర్తన చేయటము
అని అంటారు అనగా ప్రతి ఆత్మ పట్ల స్వమానము మరియు గౌరవముతో
ఉండటము. స్వయము కూడా సదా స్వమానములో ఉండండి, ఇతరులను కూడా
స్వమానముతో చూడండి. స్వమానముతో చూసినప్పుడు ఏ విషయాలు జరిగినా,
అవి మీకు కూడా ఇష్టం లేని విషయాలే, ఎప్పుడైనా ఏదైనా గొడవ
జరిగితే ఇష్టమనిపిస్తుందా? అనిపించదు కదా? కనుక ఒకరినొకరు
చూడటమే స్వమాన దృష్టితో చూడండి. వీరు విశేష ఆత్మ, వీరు బాబా
పాలనలో ఉన్న బ్రాహ్మణ ఆత్మ, వీరు కోట్లలో కొందరు, కొందరిలో కూడా
కొందరిలో ఉన్న ఆత్మ అని స్వమాన దృష్టితో చూడండి. కేవలం ఒక పని
చెయ్యండి - మీ నయనాలలో బిందువును ఇముడ్చుకోండి, అంతే. ఒక
బిందువుతోనైతే చూస్తున్నారు, రెండవ బిందువును కూడా
ఇముడ్చుకున్నట్లయితే ఇక ఏమీ జరగదు, శ్రమ చెయ్యాల్సిన అవసరం
ఉండదు. ఆత్మ, ఆత్మను చూస్తున్నట్లు ఉంటుంది. ఆత్మ, ఆత్మతో
మాట్లాడుతున్నట్లు ఉంటుంది. ఆత్మిక వృత్తిని, ఆత్మిక దృష్టిని
తయారుచేసుకోండి. ఏం చెయ్యాలో అర్థమైందా? ఇప్పుడు ఇక నా
సంస్కారము అని ఎప్పుడూ అనకండి. స్వభావము అని అన్నట్లయితే స్వయము
యొక్క భావములో ఉండండి. సరేనా!
బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ఈ పూర్తి సంవత్సరమంతా,
సీజన్ 6 నెలలే నడిచినా కానీ పూర్తి సంవత్సరమంతా అందరినీ ఎప్పుడు
కలిసినా, ఎవరిని కలిసినా, పరస్పరములోనైనా లేక ఇతర ఆత్మలతోనైనా
ఎప్పుడు కలిసినా, ఎవరిని కలిసినా, వారికి సంతుష్టతా సహయోగాన్ని
ఇవ్వండి. స్వయము కూడా సంతుష్టముగా ఉండండి మరియు ఇతరులను కూడా
సంతుష్టము చేయండి. ఈ సీజన్ యొక్క స్వమానము - సంతుష్టమణి. సదా
సంతుష్టమణి. సోదరులు కూడా మణియే, మణ అని ఉండదు, మణి అనే ఉంటుంది.
ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి సమయము సంతుష్టమణిగా ఉండాలి. మరియు స్వయం
సంతుష్టముగా ఉంటే ఇతరులను కూడా సంతుష్టపరుస్తారు. సంతుష్టముగా
ఉండండి మరియు సంతుష్టము చెయ్యండి. సరేనా, ఇష్టమేనా? (అందరూ
చేతులెత్తారు) చాలా మంచిది, అభినందనలు, అభినందనలు. అచ్ఛా. ఏం
జరిగినా కానీ, మీ స్వమానమనే సీట్ పై ఏకాగ్రులై ఉండండి, ఒకసారి
ఒక సీట్ పైకి, మరోసారి మరో సీట్ పైకి, ఇలా భ్రమించకండి. మీ
స్వమానమనే సీట్ పై ఏకాగ్రులై ఉండండి. మరియు ఏకాగ్రత అనే సీట్
పై సెట్ అయినప్పుడు ఒకవేళ ఏదైనా విషయము వస్తే, దానిని ఒక
కార్టూన్ షో లా చూడండి. కార్టూన్ చూడటం మంచిగా అనిపిస్తుంది కదా.
కనుక ఇది సమస్య కాదు, కార్టూన్ షో నడుస్తూ ఉంది. సింహము
వస్తుంది, మేక వస్తుంది, తేలు వస్తుంది, అశుద్ధమైన బల్లి
వస్తుంది - అది కార్టూన్ షో. మీ సీట్ నుండి అప్సెట్ అవ్వకండి.
మజా వస్తుంది. అచ్ఛా.
నలువైపులా ఉన్న రాజకుమార పిల్లలకు, సర్వ స్నేహీ, సహయోగీ,
సమానులుగా తయారయ్యే పిల్లలకు, సదా తమ శ్రేష్ఠ స్వ భావము మరియు
సంస్కారాలను స్వరూపములో ఇమర్జ్ చేసుకునే పిల్లలకు, సదా సుఖాన్ని
ఇచ్చే, సర్వులకు స్నేహాన్ని ఇచ్చే పిల్లలకు, సదా సంతుష్టమణిగా
అయ్యి సంతుష్టతా కిరణాలను వ్యాపింపజేసే పిల్లలకు బాప్ దాదాల
ప్రియస్మృతులు మరియు నమస్తే.