05-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి శ్రీమతము ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు, గీతా జ్ఞానము మరియు రాజయోగము మిమ్మల్ని సంపూర్ణ పావనముగా తయారుచేస్తుంది’’

ప్రశ్న:-
సత్యయుగములో ప్రతి వస్తువు చాలా బాగా సతోప్రధానముగా ఉంటుంది, ఎందుకు?

జవాబు:-
ఎందుకంటే అక్కడ మనుష్యులు సతోప్రధానముగా ఉంటారు, మనుష్యులు బాగా ఉన్నప్పుడు సామాగ్రి కూడా బాగా ఉంటుంది మరియు మనుష్యులు చెడుగా ఉన్నప్పుడు సామాగ్రి కూడా నష్టము కలిగించేదిగా ఉంటుంది. సతోప్రధాన సృష్టిలో ఏ వస్తువు యొక్క అప్రాప్తి ఉండదు, ఎక్కడి నుండి ఏదీ తెప్పించవలసిన అవసరముండదు.

ఓంశాంతి
బాబా ఈ శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారు. దీనిని జీవము అని అంటారు, ఇందులో ఆత్మ కూడా ఉంది మరియు పరమపిత పరమాత్మ కూడా వీరిలో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయము మొట్టమొదట పక్కా అవ్వాలి. అందుకే వీరిని దాదా అని కూడా అంటారు. పిల్లలకు ఈ నిశ్చయము ఉంది. ఈ నిశ్చయములోనే రమించాలి. తప్పకుండా బాబా ఎవరిలోనైతే ప్రవేశించారో లేక అవతరించారో వారి గురించి స్వయముగా తండ్రి చెప్తున్నారు - నేను వీరి అనేక జన్మల అంతిమములో కూడా అంతిమములో వస్తాను. ఇది సర్వ శాస్త్ర శిరోమణి అయిన గీతా జ్ఞానమని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. శ్రీమతము అనగా శ్రేష్ఠమైన మతము. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతము ఉన్నతోన్నతమైన భగవంతునిది. వారి శ్రీమతము ద్వారా మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. మీరు భ్రష్ట మనుష్యుల నుండి శ్రేష్ఠమైన దేవతలుగా అవుతారు. మీరు రావడమే దాని కోసము వచ్చారు. తండ్రి కూడా స్వయంగా చెప్తున్నారు - నేను మిమ్మల్ని శ్రేష్ఠాచారులుగా, నిర్వికారీ మతానికి చెందిన దేవీ-దేవతలుగా తయారుచేయడానికి వచ్చాను. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము యొక్క అర్థాన్ని కూడా అర్థము చేసుకోవాలి. వికారీ మనుష్యుల నుండి నిర్వికారీ దేవతలుగా తయారుచేయడానికి వస్తారు. సత్యయుగములో మనుష్యులు ఉంటారు కానీ వారు దైవీ గుణాలు కలవారు. ఇప్పుడు కలియుగములో ఆసురీ గుణాలు కలవారు ఉన్నారు. వాస్తవానికి ఇదంతా మనుష్య సృష్టియే, కానీ అది ఈశ్వరీయ బుద్ధి, ఇది ఆసురీ బుద్ధి. అక్కడ జ్ఞానము, ఇక్కడ భక్తి. జ్ఞానము మరియు భక్తి వేర్వేరు కదా. భక్తి పుస్తకాలెన్ని ఉన్నాయి మరియు జ్ఞానము యొక్క పుస్తకాలెన్ని ఉన్నాయి. జ్ఞాన సాగరుడు తండ్రి. వారి పుస్తకము కూడా ఒక్కటే ఉండాలి. ఎవరెవరైతే ధర్మ స్థాపన చేస్తారో, వారి పుస్తకము ఒకటే ఉండాలి. దానిని రిలీజియస్ బుక్ (ధర్మ గ్రంథము)అని అంటారు. మొదటి రిలీజియస్ బుక్ గీత, శ్రీమద్భగవద్గీత. మొదట ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది, హిందూ ధర్మము కాదు అని ఇది కూడా పిల్లలకు తెలుసు. గీత ద్వారా హిందూ ధర్మ స్థాపన జరిగిందని మరియు గీతను శ్రీకృష్ణుడు వినిపించారని మనుష్యులు భావిస్తారు. ఎవరినైనా అడిగితే దీనిని పరంపరగా శ్రీకృష్ణుడే వినిపించారని అంటారు. ఏ శాస్త్రములోనూ శివ భగవానువాచ అని లేదు, శ్రీమత్ శ్రీకృష్ణ భగవానువాచ అని వ్రాసేశారు, ఎవరైతే గీతను చదివి ఉంటారో వారికి సహజముగా అర్థమవుతుంది. ఈ గీతా జ్ఞానము ద్వారానే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, దానిని ఇప్పుడు తండ్రి మీకు ఇస్తున్నారు. రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. పవిత్రతను కూడా నేర్పిస్తున్నారు. కామము మహాశత్రువు, దాని వలనే మీరు ఓటమి పొందారు. ఇప్పుడు మళ్ళీ దానిపై విజయాన్ని పొందడము ద్వారా మీరు జగత్ జీతులుగా అనగా విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా సహజము. అనంతమైన తండ్రి కూర్చుని వీరి ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు ఆత్మలందరి తండ్రి. వీరు మనుష్యుల యొక్క అనంతమైన తండ్రి. వీరి పేరే ప్రజాపిత బ్రహ్మా. బ్రహ్మా యొక్క తండ్రి పేరు చెప్పండి అని మీరు ఎవరినైనా అడిగితే వారు తికమకపడతారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు రచన. ఈ ముగ్గురికీ ఎవరైనా తండ్రి అయితే ఉంటారు కదా. ఈ ముగ్గురికీ తండ్రి నిరాకారుడైన శివుడని మీరు చూపిస్తారు. బ్రహ్మా-విష్ణు-శంకరులను సూక్ష్మవతనములోని దేవతలుగా చూపిస్తారు. వారి పైన శివుడు ఉన్నారు. శివబాబా పిల్లలైన ఆత్మలెవరైతే ఉన్నారో వారందరికీ తమ-తమ శరీరాలైతే ఉంటాయని పిల్లలకు తెలుసు. వారైతే సదా నిరాకారుడు, పరమపిత పరమాత్మ. నిరాకార పరమపిత పరమాత్మకు మనము పిల్లలమని పిల్లలకు తెలిసింది. ఆత్మ శరీరము ద్వారా - పరమపిత పరమాత్మ అని అంటుంది. ఇవి ఎంత సహజమైన విషయాలు. వీటినే అల్ఫ్, బే (భగవంతుడు మరియు వారు ఇచ్చే రాజ్యాధికార వారసత్వము) అని అంటారు. చదివించేది ఎవరు? గీతా జ్ఞానాన్ని ఎవరు వినిపించారు? నిరాకారుడైన తండ్రి. వారిపై కిరీటము మొదలైనవేవీ లేవు. వారు జ్ఞానసాగరుడు, బీజరూపుడు, చైతన్యమైనవారు. మీరు కూడా చైతన్యమైన ఆత్మలు కదా! అన్ని వృక్షాల యొక్క ఆదిమధ్యాంతాల గురించి మీకు తెలుసు. తోటమాలి కాకపోయినా కానీ బీజాన్ని ఎలా వేస్తారు, దాని నుండి వృక్షమెలా వెలువడుతుంది అనేది మీరు అర్థం చేసుకోగలరు. అవి జడమైన వృక్షాలు, ఇది చైతన్యమైనది. మీ ఆత్మలో జ్ఞానముంది, ఇంకెవ్వరి ఆత్మలోనూ జ్ఞానము లేదు. తండ్రి చైతన్య మనుష్య సృష్టికి బీజరూపుడు. కనుక వృక్షము కూడా మనుష్యులదే ఉంటుంది. ఇది చైతన్యమైన క్రియేషన్. బీజానికి మరియు క్రియేషన్ కు తేడా అయితే ఉంటుంది కదా! మామిడి విత్తనాన్ని నాటితే మామిడి పళ్ళు వస్తాయి, ఆ వృక్షము ఎంత పెద్దదిగా అవుతుంది. అలాగే మనుష్య బీజము నుండి ఎంతమంది మనుష్యులు వెలువడుతారు. జడ బీజములో జ్ఞానమేమీ ఉండదు. వీరైతే చైతన్య బీజరూపుడు. వారిలో మొత్తము సృష్టి రూపీ వృక్షము యొక్క జ్ఞానము ఉంది, ఉత్పత్తి, పాలన మరియు వినాశనమెలా జరుగుతాయి అనే జ్ఞానమంతా ఉంది. చాలా పెద్దగా ఉన్న ఈ వృక్షము సమాప్తమై మళ్ళీ వేరే కొత్త వృక్షము ఎలా వెలువడుతుంది అన్నది గుప్తము. మీకు జ్ఞానము కూడా గుప్తముగానే లభిస్తుంది. తండ్రి కూడా గుప్తముగానే వచ్చారు. ఇప్పుడు అంటు కట్టబడుతోందని మీకు తెలుసు. ఇప్పుడైతే అందరూ పతితముగా అయిపోయారు. అచ్ఛా, బీజము నుండి మొట్టమొదటి నంబరులో ఏ ఆకు అయితే వెలువడిందో వారెవరు? సత్యయుగపు మొదటి ఆకు అని శ్రీకృష్ణుడినే అంటారు, లక్ష్మీ-నారాయణులను అనరు. కొత్త ఆకు చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత పెద్దదిగా అవుతుంది. కనుక ఈ బీజానికి ఎంత మహిమ ఉంది. వీరు చైతన్యమైనవారు కదా. ఆ తర్వాత మిగిలిన ఆకులు కూడా వెలువడుతాయి. వారి మహిమ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు దేవీ-దేవతలుగా అవుతున్నారు. దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. మనము దైవీ గుణాలను ధారణ చేయాలి, వీరి వలె తయారవ్వాలి, ఇదే ముఖ్యమైన విషయము. చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాలు లేకపోతే బుద్ధిలోకి జ్ఞానమే రాదు. ఈ చిత్రాలు చాలా ఉపయోగపడతాయి. భక్తి మార్గములో ఈ చిత్రాలకు కూడా పూజ జరుగుతుంది మరియు జ్ఞాన మార్గములో ఈ చిత్రాల ద్వారా మీకు - ఈ విధముగా తయారవ్వాలి అనే జ్ఞానము లభిస్తుంది. భక్తి మార్గములో - మేమిలా తయారవ్వాలని భావించరు. భక్తి మార్గములో ఎన్ని మందిరాలు తయారవుతాయి. అందరికన్నా ఎక్కువగా ఎవరి మందిరాలు ఉంటాయి? తప్పకుండా శివబాబావే ఉంటాయి, వారు బీజరూపుడు. ఆ తర్వాత మొదటి క్రియేషన్ యొక్క మందిరాలు ఉంటాయి. మొదటి క్రియేషన్ ఈ లక్ష్మీ-నారాయణులు. శివుని తర్వాత అందరికన్నా ఎక్కువగా వీరి పూజ జరుగుతుంది. మాతలైతే జ్ఞానాన్ని ఇస్తారు, వారికి పూజ జరగదు, వారైతే చదివిస్తారు కదా. తండ్రి మిమ్మల్ని చదివిస్తారు. మీరు ఎవ్వరినీ పూజించరు. చదివించేవారిని ఇప్పుడు పూజించరు. మీరు ఎప్పుడైతే చదువుకుని మళ్ళీ చదువులేనివారిగా అవుతారో, అప్పుడు మళ్ళీ పూజ జరుగుతుంది. మీరే దేవీ-దేవతలుగా అవుతారు. ఎవరైతే మనల్ని ఆ విధముగా తయారుచేస్తారో మొదట వారి పూజ జరుగుతుంది, ఆ తర్వాత మన పూజ నంబరువారుగా జరుగుతుందని మీకే తెలుసు. మళ్ళీ పడిపోతూ, పడిపోతూ పంచ తత్వాలను కూడా పూజించడము మొదలుపెడతారు. శరీరము పంచ తత్వాలదే కదా. పంచ తత్వాలను పూజించడమన్నా లేక శరీరాలను పూజించడమన్నా, ఒకటే అవుతుంది. ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. ఈ లక్ష్మీ-నారాయణులు మొత్తము విశ్వానికి యజమానులుగా ఉండేవారు. ఈ దేవీ-దేవతల రాజ్యము కొత్త సృష్టిలో ఉండేది. కానీ అది ఎప్పుడు ఉండేది అనేది ఎవ్వరికీ తెలియదు, లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు లక్షల సంవత్సరాల విషయమైతే ఎప్పుడూ ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. ఇప్పుడు మీకు స్మృతి కలిగింది - నేటికి 5 వేల సంవత్సరాల క్రితము మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము అని. దేవీ-దేవతా ధర్మమువారు ఆ తర్వాత ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. హిందూ ధర్మమని అనలేము. కానీ పతితముగా ఉన్న కారణముగా స్వయాన్ని దేవీ-దేవతలుగా చెప్పుకోవడమనేది శోభించదు. అపవిత్రమైనవారిని దేవీ-దేవతలు అని అనలేరు. మనుష్యులు పవిత్రమైన దేవీలను పూజిస్తారు అంటే తప్పనిసరిగా వారు స్వయము అపవిత్రముగా ఉన్నారు, అందుకే పవిత్రమైనవారి ఎదురుగా తల వంచవలసి వస్తుంది. భారత్ లో విశేషముగా కన్యలకు నమస్కరిస్తారు. కుమారులకు నమస్కరించరు. స్త్రీలకు నమస్కరిస్తారు. పురుషులకు ఎందుకు నమస్కరించరు? ఎందుకంటే ఈ సమయములో జ్ఞానము కూడా మొదట మాతలకే లభిస్తుంది. తండ్రి వీరిలో ప్రవేశిస్తారు. తప్పకుండా వీరు జ్ఞానము యొక్క పెద్ద నది అని ఇది కూడా అర్థం చేసుకుంటారు. వీరు జ్ఞాన నది కూడా, ఇంకా పురుషుడు కూడా. వీరు అందరికన్నా పెద్ద నది. బ్రహ్మపుత్ర నది అన్నింటికన్నా పెద్దది, ఇది కలకత్తా వైపుగా వెళ్ళి సాగరములో కలుస్తుంది. మేళా కూడా అక్కడే జరుగుతుంది. కానీ ఇది ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మేళా అని వారికి తెలియదు. అదైతే నీటి నది, దానికి బ్రహ్మపుత్ర అన్న పేరు పెట్టారు. వారైతే బ్రహ్మతత్వమునే ఈశ్వరుడని అన్నారు, అందుకే బ్రహ్మపుత్రను చాలా పావనమైనదిగా భావిస్తారు. అది పెద్ద నది కనుక అది పవిత్రముగా కూడా ఉంటుంది. పతిత-పావని అని వాస్తవానికి గంగను కాదు, బ్రహ్మపుత్రను అనాలి. మేళా కూడా అక్కడే జరుగుతుంది. ఇది కూడా సాగరము మరియు బ్రహ్మా నదుల యొక్క మేళా. బ్రహ్మా ద్వారా దత్తత ఎలా తీసుకోవడము జరుగుతుంది - ఇవి అర్థం చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు, ఇవి కనుమరుగైపోతాయి. ఇదైతే పూర్తిగా సహజమైన విషయము కదా.

భగవానువాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, ఆ తర్వాత ఈ ప్రపంచమే సమాప్తమైపోతుంది. ఇక శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. ఆ తర్వాత భక్తి మార్గములో ఈ శాస్త్రాలు ఉంటాయి. జ్ఞాన మార్గములో శాస్త్రాలు ఉండవు. ఈ శాస్త్రాలు పరంపరగా కొనసాగుతూ వస్తాయని మనుష్యులు భావిస్తారు. జ్ఞానమైతే ఏమాత్రమూ లేదు. కల్పము ఆయువునే లక్షల సంవత్సరాలని అనేసారు, అందుకే పరంపర అని అంటారు. దీనినే అజ్ఞాన అంధకారమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ అనంతమైన చదువు లభిస్తుంది, దీని ద్వారా మీరు ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించగలరు. మీకు ఈ దేవీ-దేవతల చరిత్ర-భౌగోళికము గురించి పూర్తిగా తెలుసు. పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందిన వీరు పూజ్యులుగా ఉండేవారు. ఇప్పుడు పూజారులుగా, పతితులుగా అయ్యారు. సత్యయుగములో ఉన్నది పవిత్ర ప్రవృత్తి మార్గము, ఇక్కడ కలియుగములో అపవిత్ర ప్రవృత్తి మార్గము ఉంది. ఆ తర్వాత నివృత్తి మార్గము ఉంటుంది. అది కూడా డ్రామాలో ఉంది. దానినే సన్యాస ధర్మమని అంటారు. ఇళ్ళు-వాకిళ్ళను సన్యసించి అడవులలోకి వెళ్ళిపోతారు. అది హద్దు సన్యాసము. కానీ వారు ఉండేది ఈ పాత ప్రపంచములోనే కదా. మనము సంగమయుగములో ఉన్నామని, ఆ తర్వాత కొత్త ప్రపంచములోకి వెళ్తామని ఇప్పుడు మీరు భావిస్తారు. మీకు తిథి, తారీఖు, సెకెండు సహితముగా అన్నీ తెలుసు. ఆ మనుష్యులైతే కల్పము ఆయువునే లక్షల సంవత్సరాలని అనేస్తారు. దీని పూర్తి లెక్కను తీయగలరు. లక్షల సంవత్సరాల విషయాన్ని అయితే ఎవ్వరూ గుర్తు కూడా తెచ్చుకోలేరు. తండ్రి ఎవరు, ఎలా వస్తారు, ఏ కర్తవ్యాన్ని చేస్తారు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీకు అందరి కర్తవ్యాలు, జన్మ పత్రుల గురించి తెలుసు. ఇకపోతే వృక్షములో ఆకులైతే లెక్కలేనన్ని ఉంటాయి. వాటిని లెక్క పెట్టలేము. ఈ అనంతమైన సృష్టి రూపీ వృక్షానికి ఎన్ని ఆకులు ఉన్నాయి? 5 వేల సంవత్సరాలలో ఇన్ని కోట్లమంది అయ్యారు, మరి లక్షల సంవత్సరాలైతే ఎంత లెక్కలేనంతమంది మనుష్యులైపోతారు. భక్తి మార్గములో - సత్యయుగము ఇన్ని సంవత్సరాలు, త్రేతాయుగము ఇన్ని సంవత్సరాలు, ద్వాపరయుగము ఇన్ని సంవత్సరాలు అని వ్రాయబడి ఉన్నట్లుగా చూపిస్తారు. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు ఈ రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. మామిడి విత్తనాన్ని చూస్తే మామిడి వృక్షము ఎదురుగా వస్తుంది కదా! ఇప్పుడు మనుష్య సృష్టి యొక్క బీజరూపుడు మీ ఎదురుగా ఉన్నారు. వారు కూర్చుని మీకు వృక్షము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఎందుకంటే వారు చైతన్యమైనవారు. ఇది తలకిందులుగా ఉన్న మన వృక్షమని వారు తెలియజేస్తారు. ఈ ప్రపంచములో ఉన్నది ఏదైనా, అది జడమైనదైనా లేక చైతన్యమైనదైనా, అది యథావిధిగా రిపీట్ అవుతుందని మీరు అర్థం చేయించవచ్చు. ఇప్పుడు ఎంతగా వృద్ధి చెందుతూ ఉన్నారు. సత్యయుగములో ఇంత వృద్ధి జరగదు. ఫలానా వస్తువు ఆస్ట్రేలియా నుండి, జపాన్ నుండి వచ్చిందని అంటుంటారు. సత్యయుగములో ఆస్ట్రేలియా, జపాన్ మొదలైనవేవీ ఉండేవి కాదు. డ్రామానుసారముగా అక్కడి వస్తువులు ఇక్కడకు వస్తాయి. పూర్వము అమెరికా నుండి గోధుమ మొదలైనవి వచ్చేవి. సత్యయుగములో ఇలా ఎక్కడ నుండీ రావు. అక్కడ ఉన్నదే ఏక ధర్మము. అన్ని వస్తువులు నిండుగా ఉంటాయి. ఇక్కడ ధర్మాలు వృద్ధి చెందుతూ ఉంటాయి, దాని వలన అన్ని వస్తువులు తగ్గిపోతూ ఉంటాయి. సత్యయుగములో ఎక్కడి నుండీ తెప్పించరు. ఇప్పుడు చూడండి, ఎక్కడెక్కడి నుండి తెప్పిస్తున్నారు! మనుష్యులు తర్వతర్వాత వృద్ధి చెందుతూ వచ్చారు, సత్యయుగములోనైతే అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. అక్కడి ప్రతి వస్తువు సతోప్రధానముగా, చాలా బాగా ఉంటుంది. మనుష్యులే సతోప్రధానముగా ఉంటారు, మనుష్యులు బాగుంటే సామాగ్రి కూడా బాగుంటుంది. మనుష్యులు చెడ్డవారైతే సామాగ్రి కూడా నష్టము కలిగించేదిగా ఉంటుంది.

సైన్స్ యొక్క ముఖ్యమైన వస్తువులు అటామిక్ బాంబులు, వాటి ద్వారా ఇంతటి వినాశనము జరుగుతుంది. వాటినెలా తయారుచేస్తూ ఉండవచ్చు! తయారుచేసే ఆత్మలో డ్రామానుసారముగా ముందు నుండే జ్ఞానము ఉంటుంది. ఎప్పుడైతే సమయము వస్తుందో అప్పుడు వారిలోకి ఆ జ్ఞానము వస్తుంది, ఎవరిలోనైతే ఆ సెన్స్ (తెలివి) ఉంటుందో, వారే పని చేస్తారు మరియు ఇతరులకు నేర్పిస్తారు. కల్ప-కల్పము ఏ పాత్రనైతే అభినయించారో, దానినే అభినయిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎంత నాలెడ్జ్ ఫుల్ గా అవుతారు, దీనికంటే గొప్ప జ్ఞానము ఇంకేదీ ఉండదు. మీరు ఈ జ్ఞానముతో దేవతలుగా అవుతారు. దీని కంటే ఉన్నతమైన జ్ఞానము ఇంకేదీ ఉండదు. అది మాయా జ్ఞానము, దాని ద్వారా వినాశనము జరుగుతుంది. ఆ మనుష్యులు (వైజ్ఞానికులు) చంద్రునిపైకి వెళ్తారు, పరిశోధనలు చేస్తారు. మీ కొరకు ఏదీ కొత్త విషయము కాదు. ఇదంతా మాయ యొక్క ఆర్భాటము. చాలా షో చేస్తారు, అతి లోతుల్లోకి వెళ్తారు. ఏదైనా అద్భుతము చేసి చూపించాలని బుద్ధిని చాలా ఉపయోగిస్తారు. చాలా అద్భుతము చేయడము వలన ఇక నష్టము కలుగుతుంది. ఏమేమి తయారుచేస్తూ ఉంటారు. వాటి వలన వినాశనము జరుగుతుందని తయారుచేసేవారికి తెలుసు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. గుప్త జ్ఞానాన్ని స్మరణ చేస్తూ హర్షితముగా ఉండాలి. దేవతల చిత్రాలను ఎదురుగా చూస్తూ వాటికి నమస్కరించడము, వందనము చేయడానికి బదులుగా వారి వలె తయారయ్యేందుకు దైవీ గుణాలను ధారణ చేయాలి.

2. సృష్టికి బీజరూపుడైన తండ్రిని మరియు వారి చైతన్య రచనను అర్థం చేసుకుని నాలెడ్జ్ ఫుల్ గా అవ్వాలి, ఈ జ్ఞానానికి మించి ఇంకే జ్ఞానము ఉండదు, ఇదే నషాలో ఉండాలి.

వరదానము:-
‘‘ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు’’ - ఈ పాఠము యొక్క స్మృతి ద్వారా ఏకరస స్థితిని తయారుచేసుకునే శ్రేష్ట ఆత్మా భవ

‘‘ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు’’ - ఈ పాఠము నిరంతరము గుర్తున్నట్లయితే స్థితి ఏకరసముగా తయారవుతుంది ఎందుకంటే జ్ఞానమైతే మొత్తమంతా లభించింది, అనేక పాయింట్లు ఉన్నాయి, కానీ ఆ పాయింట్లన్నీ ఉంటూ కూడా పాయింట్ రూపములో ఉండగలగాలి - ఏ సమయములోనైతే ఎవరైనా లేక ఏదైనా కిందకు లాగుతుందో, ఆ సమయములో పాయింట్ రూపములో ఉండగలగాలి, అదే ఆ సమయములోని అద్భుతము. ఒక్కోసారి ఏదైనా విషయము కిందకు లాగుతుంది, ఒక్కోసారి ఎవరైనా వ్యక్తి, ఒక్కోసారి ఏదైనా వస్తువు, ఒక్కోసారి వాయుమండలము... ఇదైతే జరిగేదే ఉంది. కానీ ఒక్క క్షణములో ఈ విస్తారమంతా సమాప్తమై ఏకరస స్థితి ఉండాలి - అప్పుడే శ్రేష్ట ఆత్మా భవ అన్న వరదానులు అని ఉంటారు.

స్లోగన్:-
జ్ఞాన శక్తిని ధారణ చేసినట్లయితే విఘ్నాలు దాడి చేసేందుకు బదులుగా ఓడిపోతాయి.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

ఇప్పుడు మీరందరూ ఏ విధముగా ముక్తులుగా అయ్యి మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వండి అంటే సర్వాత్మలు, ప్రకృతి, భక్తులు ముక్తులైపోవాలి. ఇప్పుడు బ్రహ్మాబాబా ఈ ఒక్క విషయములోనే డేట్ కాన్షస్ గా ఉన్నారు, నా పిల్లలు ప్రతి ఒక్కరూ ఎప్పుడు జీవన్ముక్తులుగా అవుతారు అని. అంతిమములో జీవన్ముక్తులుగా అయిపోతాములే అని అనుకోకండి, అలా కాదు. బహుకాలపు జీవన్ముక్త స్థితి యొక్క అభ్యాసము బహుకాలపు జీవన్ముక్త రాజ్య భాగ్యానికి అధికారులుగా తయారుచేస్తుంది.