05-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు నామ-రూపాల వ్యాధి నుండి
స్వయాన్ని రక్షించుకోవాలి, తప్పుడు ఖాతాను తయారుచేసుకోకూడదు, ఒక్క తండ్రి స్మృతిలోనే
ఉండాలి’’
ప్రశ్న:-
భాగ్యవంతులైన పిల్లలు ఏ ముఖ్య పురుషార్థము ద్వారా తమ భాగ్యాన్ని తయారుచేసుకుంటారు?
జవాబు:-
భాగ్యవంతులైన
పిల్లలు అందరికీ సుఖాన్ని ఇచ్చే పురుషార్థము చేస్తారు. మనసా, వాచా, కర్మణా ఎవరికీ
దుఃఖము ఇవ్వరు. శీతలముగా ఉంటూ నడుచుకున్నట్లయితే భాగ్యము తయారవుతూ ఉంటుంది. ఇది మీ
విద్యార్థి జీవితము, మీరు ఇప్పుడు గుటకలు మింగకూడదు, అపారమైన సంతోషములో ఉండాలి.
పాట:-
నీవే తల్లివి,
తండ్రివి...
ఓంశాంతి
పిల్లలందరూ మురళిని వింటారు, మురళి ఎక్కడెక్కడికైతే వెళ్తుందో, అక్కడ వారందరికీ
తెలుసు, ఈ మహిమ ఎవరికైతే జరుగుతుందో, వారు సాకార వ్యక్తి కాదు, ఇది నిరాకారుని మహిమ.
నిరాకారుడు సాకారుని ద్వారా ఇప్పుడు సమ్ముఖముగా మురళిని వినిపిస్తున్నారు. ఇప్పుడు
ఆత్మ అయిన మనము వారిని చూస్తున్నాము అని కూడా అంటారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది, ఈ
కళ్ళకు కనిపించదు. ఆత్మ అయిన మనము సూక్ష్మముగా ఉంటాము అన్న విషయము భక్తి మార్గములో
కూడా తెలుసు. కానీ ఆత్మ అంటే ఏమిటి, అలాగే పరమాత్మను స్మృతి చేస్తున్నాము కానీ వారు
ఎవరు అన్నదానికి సంబంధించిన పూర్తి రహస్యము బుద్ధిలో లేదు. ఇది ప్రపంచానికి తెలియదు.
ఒకప్పుడు మీకు కూడా తెలియదు. వీరేమీ లౌకిక టీచరు లేక సంబంధీకుడు కాదని ఇప్పుడు
పిల్లలైన మీకు ఈ నిశ్చయము ఉంది. ఏ విధంగా సృష్టిలో ఇతర మనుష్యులు ఉన్నారో అలాగే ఈ
దాదా కూడా ఉండేవారు. మీరు త్వమేవ మాతాశ్చ పితా... అని మహిమ చేసినప్పుడు వారు పైన
ఉన్నారు అని భావించేవారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను ఇతనిలోకి ప్రవేశించాను, మీరు
మహిమ చేసిన ఆ నేనే వీరిలో ఉన్నాను. ఇంతకుముందు ఎంతో ప్రేమతో మహిమ పాడేవారు, భయము
కూడా ఉండేది. ఇప్పుడైతే వారు ఇక్కడ ఇతని శరీరములోకి వచ్చారు. నిరాకారుడైన వారు
ఇప్పుడు సాకారములోకి వచ్చారు. వారు కూర్చుని పిల్లలకు నేర్పిస్తున్నారు. వారు ఏమి
నేర్పిస్తున్నారు అన్నది ప్రపంచానికి తెలియదు. వారు శ్రీకృష్ణుడిని గీతా భగవానుడిగా
భావిస్తారు. అతను రాజయోగాన్ని నేర్పిస్తారు అని అంటారు. అచ్ఛా, మరి తండ్రి ఏమి
చేస్తారు? నీవే తల్లివి, తండ్రివి అని గానము చేసేవారు కానీ వారి నుండి ఏమి
లభిస్తుంది మరియు ఎప్పుడు లభిస్తుంది అనేదేమీ తెలియదు. గీత వినేటప్పుడు శ్రీకృష్ణుడి
ద్వారా రాజయోగాన్ని నేర్చుకున్నారు అని భావిస్తారు, మరి మళ్ళీ వారు ఎప్పుడు వచ్చి
నేర్పిస్తారు అన్న విషయము కూడా వారి ధ్యాసలోకి వస్తూ ఉండవచ్చు. ఈ సమయములో జరిగేది
అప్పటి ఆ మహాభారత యుద్ధమే కావున తప్పకుండా ఇది శ్రీకృష్ణుడి సమయము అవుతుంది.
తప్పకుండా అదే చరిత్ర, భూగోళము రిపీట్ అవ్వాలి. రోజురోజుకు అర్థం చేసుకుంటూ ఉంటారు.
తప్పకుండా గీతా భగవానుడు ఉండాలి. మహాభారత యుద్ధము కూడా తప్పకుండా కనిపిస్తుంది.
తప్పకుండా ఈ ప్రపంచము అంతమవుతుంది. పాండవులు పర్వతము పైకి వెళ్ళిపోయారు అని
చూపిస్తారు. కావున తప్పకుండా వినాశనము ఎదురుగా నిలబడి ఉంది అని వారి బుద్ధిలోకి
వస్తూ ఉండవచ్చు. ఇప్పుడు మరి శ్రీకృష్ణుడు ఎక్కడున్నారు? గీతా భగవానుడు శ్రీకృష్ణుడు
కాదు, శివుడు అని ఎప్పటివరకైతే మీ నుండి వినరో, అప్పటివరకు వారిని వెతుకుతూనే ఉంటారు.
మీ బుద్ధిలోనైతే ఈ విషయము పక్కాగా ఉంది. దీనిని మీరు ఎప్పుడూ మర్చిపోలేరు. గీతా
భగవానుడు శ్రీకృష్ణుడు కాదు, శివుడు అని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. పిల్లలైన
మీరు తప్ప ఈ విషయాన్ని ప్రపంచములో ఇంకెవరూ చెప్పరు. ఇప్పుడు గీతా భగవానుడు
రాజయోగాన్ని నేర్పించేవారు అంటే వారు నరుడి నుండి నారాయణుడిగా తయారుచేసేవారు అని
దీని ద్వారా నిరూపించబడుతుంది. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు
తెలుసు. తప్పకుండా నరుడి నుండి నారాయణుడిగా తయారుచేస్తున్నారు. స్వర్గములో ఈ
లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది కదా. ఇప్పుడు ఆ స్వర్గము కూడా లేదు, అలాగే
నారాయణుడు కూడా లేరు, అలాగే దేవతలు కూడా లేరు. చిత్రాలు ఉన్నాయి, వాటి ఆధారముగా వారు
ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారని అర్థం చేసుకుంటారు. వీరు ఇక్కడ రాజ్యము చేసి ఎన్ని
సంవత్సరాలయ్యింది అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. నేటికి 5 వేల సంవత్సరాల
క్రితం వీరి రాజ్యముండేది అని మీకు పక్కాగా తెలుసు. ఇప్పుడు ఇది అంతిమము. యుద్ధము
కూడా ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. అన్ని
సెంటర్లలోనూ చదువుకుంటారు కూడా, అలాగే ఇతరులను చదివిస్తారు కూడా. చదివించే ఈ యుక్తి
చాలా బాగుంది. చిత్రాల ద్వారా చాలా బాగా అర్థం చేయించగలరు. ముఖ్యమైన విషయమేమిటంటే -
గీతా భగవానుడు శివుడా లేక శ్రీకృష్ణుడా? వ్యత్యాసమైతే ఎంతో ఉంది కదా. స్వర్గాన్ని
స్థాపన చేసే సద్గతిదాత లేక ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేసేది
శివుడా లేక శ్రీకృష్ణుడా? ముఖ్యమైనది ఈ మూడు విషయాల స్పష్టీకరణయే. వీటికే బాబా
ప్రాధాన్యతను ఇస్తారు. ఇది చాలా బాగుంది అన్న అభిప్రాయాన్ని వ్రాసి ఇస్తారు కానీ
దాని వల్ల ఉపయోగమేమీ లేదు. మీ ముఖ్యమైన విషయమేదైతే ఉందో, దానికి ప్రాధాన్యతను
ఇవ్వాలి. మీ గెలుపు కూడా ఇందులోనే ఉంది. భగవంతుడు ఒక్కరే ఉంటారని మీరు నిరూపించి
చెప్తారు. గీతను వినిపించినవారు కూడా భగవంతుడే అని కాదు. భగవంతుడు ఈ రాజయోగము మరియు
జ్ఞానము ద్వారా దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసారు.
బాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లలపై మాయ దాడి జరుగుతూ ఉంటుంది, ఇప్పటివరకు ఇంకా
ఎవరూ కర్మాతీత అవస్థను పొందలేదు. పురుషార్థము చేస్తూ-చేస్తూ అంతిమములో మీరు ఒక్క
బాబా స్మృతిలో సదా హర్షితముగా ఉంటారు. ఏ విధమైన ఉదాసీనత కలగదు. ఇప్పుడైతే తలపై
పాపాల భారము ఎంతో ఉంది. అది స్మృతి ద్వారానే తొలగుతుంది. తండ్రి పురుషార్థపు
యుక్తులను తెలియజేశారు. స్మృతి ద్వారానే పాపాలు కట్ అవుతాయి. స్మృతిలో ఉండని
కారణముగా నామ-రూపాలు మొదలైనవాటిలో చిక్కుకునే బుద్ధిహీనులు ఎంతోమంది ఉన్నారు.
హర్షితముఖులై ఇతరులకు జ్ఞానాన్ని వినిపించడము కూడా వారికి కష్టముగా ఉంటుంది. ఈ రోజు
ఎవరికైనా అర్థం చేయిస్తారు, మళ్ళీ రేపు గుటకలు మింగితే ఆ సంతోషము మాయమైపోతుంది. మాయ
దాడి జరుగుతోందని అర్థం చేసుకోవాలి, అందుకే పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేయాలి.
అంతేకానీ ఏడవటము, రోదించటము చేయకూడదు, దిగులు చెందకూడదు. మాయ చెప్పుదెబ్బ కొడుతుందని
అర్థం చేసుకోవాలి. అందుకే పురుషార్థము చేసి తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి స్మృతితో
ఎంతో సంతోషము కలుగుతుంది. నోటి నుండి వెంటనే వాణి వెలువడుతుంది. నన్ను స్మృతి చేయండి
అని పతిత-పావనుడైన తండ్రి చెప్తున్నారు. రచయిత అయిన తండ్రి గురించిన పరిచయము
తెలిసిన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. మనుష్యులై ఉండి తండ్రి గురించి తెలుసుకోకపోతే
వారు జంతువుల కన్నా హీనమైనవారు. గీతలో శ్రీకృష్ణుని పేరును వేసేశారు కావున ఇక
తండ్రిని ఎలా స్మృతి చేయగలరు! ఇదే అన్నింటికన్నా పెద్ద పొరపాటు, మీరు దీని గురించే
అర్థం చేయించాలి. గీతా భగవానుడు శివబాబాయే, వారే వారసత్వాన్ని ఇస్తారు. ముక్తి,
జీవన్ముక్తిదాత వారే. ఇతర ధర్మాలవారి బుద్ధిలో ఈ విషయము కూర్చోదు. వారు తమ
లెక్కాచారాలను సమాప్తము చేసుకుని తిరిగి వెళ్ళిపోతారు. చివరిలో వారికి కొద్దిగా
పరిచయము లభించినా వారు మళ్ళీ తమ ధర్మములోకే వెళ్తారు. మీకు తండ్రి అర్థం
చేయిస్తున్నారు - మీరు దేవతలుగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ తండ్రిని స్మృతి చేయడము
ద్వారా మీరు మళ్ళీ దేవతలుగా తయారవుతారు. వికర్మలు వినాశనమైపోతాయి. అయినా మళ్ళీ
తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఈ రోజు మా అవస్థ వాడిపోయింది, తండ్రిని స్మృతి చేయలేదు
అని బాబాకు వ్రాస్తారు. స్మృతి చేయకపోతే తప్పకుండా వాడిపోతారు. ఈ ప్రపంచమే శవాల
ప్రపంచము. అందరూ మరణించే ఉన్నారు. మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున
మిమ్మల్ని తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు
వినాశనమైపోతాయి. ఈ శరీరము పురాతనమైనది, తమోప్రధానమైనది. అంతిమ సమయము వరకు ఏదో ఒకటి
జరుగుతూ ఉంటుంది. ఎప్పటివరకైతే తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీత అవస్థను చేరుకోరో
అప్పటివరకు మాయ కదిలిస్తూనే ఉంటుంది, అది ఎవరినీ వదలదు. మాయ ఎలా దెబ్బ తినేలా
చేస్తోంది అని పరిశీలించుకుంటూ ఉండాలి. భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు, ఈ
విషయాన్ని ఎందుకు మర్చిపోవాలి. ఆత్మ అంటుంది, నా ప్రాణము కన్నా ప్రియమైనవారు ఆ
తండ్రే. అటువంటి తండ్రిని మరి మీరెందుకు మర్చిపోతున్నారు! తండ్రి దానము చేసేందుకే
ధనమునిస్తున్నారు. ప్రదర్శనీలు, మేళాలలో మీరు అనేకులకు దానము చేయగలరు. మీకు మీరుగానే
అభిరుచితో పరుగెత్తాలి. ప్రస్తుతమైతే బాబా - మీరు వెళ్ళి అర్థం చేయించండి అని
ఉల్లాసము ఇప్పించవలసి వస్తుంది. అందులోనూ బాగా అర్థం చేసుకున్నవారు కావాలి.
దేహాభిమానములో ఉన్నవారి బాణము తగలదు. ఖడ్గాలు కూడా ఎన్నో రకాలవి ఉంటాయి కదా. మీది
కూడా యోగమనే ఖడ్గము చాలా పదునైనదిగా ఉండాలి. సేవ చేయాలనే ఉల్లాసము ఉండాలి. వెళ్ళి
ఎంతోమందికి కళ్యాణము చేయాలి. తండ్రి స్మృతిలో ఉండే అభ్యాసము ఎంతగా ఉండాలంటే ఇక
అంతిమములో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురాకూడదు, అప్పుడే మీరు రాజ్య పదవిని
పొందుతారు. అంతిమ సమయములో భగవంతుడిని స్మృతి చేయాలి మరియు నారాయణుడిని స్మృతి చేయాలి.
తండ్రిని మరియు నారాయణుడిని (వారసత్వాన్ని) మాత్రమే స్మృతి చేయాలి. కానీ మాయ
తక్కువైనదేమీ కాదు. ఎంతోమంది కచ్చాగానే మిగిలిపోతారు. ఎప్పుడైనా ఇతరుల నామ-రూపాలలో
చిక్కుకున్నప్పుడే తప్పుడు కర్మల ఖాతా తయారవుతుంది. అటువంటివారు ఒకరికొకరు
వ్యక్తిగతముగా ఉత్తరాలు వ్రాసుకుంటూ ఉంటారు. దేహధారులపై ప్రీతి ఏర్పడితే తప్పుడు
కర్మల ఖాతా తయారవుతుంది. బాబా వద్దకు సమాచారాలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక తప్పుడు పని
చేసి మళ్ళీ బాబా, తప్పు అయిపోయింది అని అంటారు. అరే, తప్పుడు ఖాతా అయితే
తయారైపోయింది కదా! ఈ శరీరమైతే పతితమైనది, దీనిని మీరు ఎందుకు స్మృతి చేస్తున్నారు.
తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే సదా సంతోషము ఉంటుంది. ఈ రోజు సంతోషముగా
ఉంటారు, రేపు మళ్ళీ శవాలుగా అయిపోతారు. జన్మ-జన్మాంతరాలుగా నామ-రూపాలలో చిక్కుకుంటూ
వచ్చారు కదా. స్వర్గములో ఈ నామ-రూపాలు వ్యాధి ఉండదు. అక్కడైతే మోహజీత కుటుంబాలు
ఉంటాయి. నేను ఒక ఆత్మను, శరీరము కాదు అని వారందరికీ తెలుసు. ఆ ప్రపంచమే ఆత్మాభిమాని
ప్రపంచము. ఇక్కడ ఉన్నది దేహాభిమాని ప్రపంచము. మళ్ళీ అర్ధకల్పము మీరు
దేహీ-అభిమానులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, దేహాభిమానాన్ని వదలండి.
దేహీ-అభిమానులుగా అయినట్లయితే చాలా మధురముగా, శీతలముగా అవుతారు. తండ్రి స్మృతిని
మర్చిపోకండి అని చెప్తూ పురుషార్థము చేయించేవారు చాలా తక్కువమంది ఉన్నారు. తండ్రి
ఆజ్ఞాపిస్తున్నారు - నన్ను స్మృతి చేయండి, చార్టు పెట్టండి. కానీ మాయ చార్టు కూడా
పెట్టనివ్వదు. ఇటువంటి మధురమైన తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. వీరు పతులకే పతి మరియు
తండ్రులకే తండ్రి కదా. తండ్రిని స్మృతి చేసి ఇతరులను కూడా తమ సమానముగా తయారుచేసే
పురుషార్థము చేయాలి. ఇందులో ఎంతో అభిరుచిని కలిగి ఉండాలి. సర్వీసబుల్ పిల్లలనైతే
తండ్రి ఉద్యోగము నుండి కూడా విడిపించేస్తారు. పరిస్థితులను చూసి - మీరు ఇక ఈ
వ్యాపారములో నిమగ్నమైపోండి అని చెప్తారు. లక్ష్యము-ఉద్దేశ్యమైతే ఎదురుగా నిలబడి ఉంది.
భక్తి మార్గములో కూడా చిత్రాల ఎదురుగా కూర్చుని తలచుకుంటూ ఉంటారు కదా. మీరైతే కేవలం
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మ తండ్రిని స్మృతి చేయాలి. విచిత్రులుగా అయి
విచిత్రుడైన తండ్రిని స్మృతి చేయాలి. ఇందులోనే కష్టపడవలసి ఉంటుంది. విశ్వానికి
యజమానులుగా అవ్వడము అంత సులువైన విషయమేమీ కాదు. తండ్రి అంటారు, నేను విశ్వానికి
యజమానిగా అవ్వను, మిమ్మల్ని అలా తయారుచేస్తాను. ఎంతగా కష్టపడవలసి వస్తుంది.
సుపుత్రులైన పిల్లలకైతే - సెలవు తీసుకుని అయినా సరే సేవలో నిమగ్నమవ్వాలి అని తమంతట
తమకే చింత ఉంటుంది. కొందరు పిల్లలకు బంధనాలు కూడా ఉన్నాయి, మోహము కూడా ఉంటుంది.
తండ్రి అంటారు, మీలో ఉన్న రోగాలన్నీ బయటికి వస్తాయి. మీరు తండ్రిని స్మృతి చేస్తూ
ఉండండి. మాయ మిమ్మల్ని పక్కకు తప్పించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. స్మృతే
ముఖ్యమైనది. రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము లభించింది, ఇంకేమి కావాలి.
భాగ్యవంతులైన పిల్లలు అందరికీ సుఖాన్ని ఇచ్చేందుకు పురుషార్థము చేస్తారు,
మనసా-వాచా-కర్మణా ఎవరికీ దుఃఖమివ్వరు, శీతలముగా ఉంటూ నడుచుకున్నట్లయితే భాగ్యము
తయారవుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోకపోతే వారి భాగ్యములో లేదు అని అర్థం
చేసుకోవడం జరుగుతుంది. ఎవరి భాగ్యములో అయితే ఉంటుందో వారు బాగా వింటారు. వాళ్ళు
ఏమేమి చేసేవారు అని తమ అనుభవాన్ని కూడా వినిపిస్తుంటారు కదా. ఇప్పటివరకు ఏదైతే
చేసామో, దాని వల్ల దుర్గతే లభించిందని ఇప్పుడు తెలిసింది. ఎప్పుడైతే స్మృతి చేస్తామో
అప్పుడే సద్గతిని పొందుతాము. ఎంతో కష్టము మీద ఒక గంట, అరగంట స్మృతి చేస్తూ ఉండవచ్చు.
లేదంటే గుటకలు మింగుతూ ఉంటారు. తండ్రి అంటారు, అర్ధకల్పము గుటకలు మింగారు, ఇప్పుడు
తండ్రి లభించారు. విద్యార్థి జీవితము కావున సంతోషము ఉండాలి కదా. కానీ తండ్రిని
ఘడియ-ఘడియ మర్చిపోతూ ఉంటారు.
తండ్రి అంటారు, మీరు కర్మయోగులు. ఆ వ్యాపారాలు మొదలైనవైతే చేయవలసిందే. నిద్ర కూడా
తక్కువగా నిద్రపోవడం మంచిది. స్మృతి ద్వారా సంపాదన జరుగుతుంది, సంతోషము కూడా ఉంటుంది.
స్మృతిలో కూర్చోవడము తప్పనిసరి. పగలు సమయములో ఖాళీ దొరకదు, అందుకే రాత్రివేళ సమయము
తీయాలి. స్మృతితో ఎంతో సంతోషము కలుగుతుంది. ఎవరికైనా బంధనము ఉంటే వారు ఇలా
చెప్పవచ్చు - మేమైతే తండ్రి నుండి వారసత్వము తీసుకోవాలి, ఇందులో ఎవరూ ఆపు చేయలేరు.
కేవలం వెళ్ళి ప్రభుత్వానికి అర్థం చేయించండి - వినాశనము ఎదురుగా నిలబడి ఉంది అని
తండ్రి తెలియజేస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి,
అంతేకాక ఈ అంతిమ జన్మలో పవిత్రముగా ఉండాలి అని వారు చెప్తున్నారు, అందుకే మేము
పవిత్రముగా అవుతాము. కానీ ఎవరిలోనైతే జ్ఞానము యొక్క ఆ నషా ఉంటుందో వారే ఈ విధంగా
చెప్పగలరు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ దేహధారులను స్మృతి చేస్తూ ఉండడము కాదు.
దేహాభిమానములోకి వచ్చి గొడవపడడము, కొట్లాడటము అంటే అది క్రోధ భూతము వంటిది. బాబా
క్రోధము చేసేవారి వైపు ఎప్పుడూ చూడను కూడా చూడరు. సేవ చేసేవారి పట్ల ప్రేమ
కలుగుతుంది. దేహాభిమానముతో కూడిన నడవడిక కనిపిస్తుంది. ఎప్పుడైతే తండ్రిని స్మృతి
చేస్తారో, అప్పుడే పుష్పాలుగా అవుతారు. ఇదే ముఖ్యమైన విషయము. ఒకరినొకరు చూస్తూ
తండ్రిని స్మృతి చేయాలి. సేవలోనైతే ఎముకలను సైతము స్వాహా చేయాలి. బ్రాహ్మణులు
పరస్పరము క్షీర ఖండములా (పాలు పంచదారలా కలిసి-మెలసి) ఉండాలి. ఉప్పు నీరులా ఉండకూడదు.
అర్థం చేసుకోని కారణముగా ఒకరి పట్ల ఒకరు మరియు తండ్రి పట్ల కూడా ద్వేషము తెచ్చుకుంటూ
ఉంటారు. ఇటువంటివారు ఏం పదవిని పొందుతారు! మీకు సాక్షాత్కారాలు కలుగుతాయి, అప్పుడు
ఆ సమయములో - నేను ఈ తప్పు చేశాను అన్న స్మృతి కలుగుతుంది. తండ్రి అంటారు,
భాగ్యములోనే లేకపోతే ఏం చేయగలము. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. నిర్బంధనులుగా అయ్యేందుకు జ్ఞానము యొక్క నషా ఉండాలి. దేహాభిమానపు నడవడిక
ఉండకూడదు. పరస్పరము ఉప్పు నీరులా అయ్యే సంస్కారాలు ఉండకూడదు. దేహధారుల పట్ల ప్రేమ
ఉన్నట్లయితే బంధనముక్తులుగా అవ్వలేరు.
2. కర్మయోగులుగా అయి ఉండాలి, తప్పకుండా స్మృతిలో కూర్చోవాలి. ఆత్మాభిమానిగా అయి
చాలా మధురముగా మరియు శీతలముగా అయ్యే పురుషార్థము చేయాలి. సేవలో ఎముకలను సైతము
ఇవ్వాలి.
వరదానము:-
శ్రీమతము ద్వారా మన్మతము మరియు జనమతము యొక్క కల్తీని సమాప్తము
చేసే సత్యమైన స్వకళ్యాణి భవ
తండ్రి పిల్లలకు అన్ని ఖజానాలను స్వకళ్యాణము మరియు
విశ్వకళ్యాణము కొరకు ఇచ్చారు కానీ వాటిని వ్యర్థము వైపు ఉపయోగించడము, అకళ్యాణ
కార్యములో ఉపయోగించడము, శ్రీమతములో మన్మతము మరియు జనమతము యొక్క కల్తీని కలపడము, ఇది
అప్పగించిన సంపదలో మోసము చేయడము వంటిది. ఇప్పుడు ఈ మోసాన్ని మరియు కల్తీని సమాప్తము
చేసి ఆత్మికతను మరియు దయను ధారణ చేయండి. స్వయం పట్ల మరియు సర్వుల పట్ల దయ చూపించి
స్వకళ్యాణిగా అవ్వండి. స్వయాన్ని చూడండి, తండ్రిని చూడండి, ఇతరులను చూడకండి.
స్లోగన్:-
ఎవరైతే
ఎక్కడా ఆకర్షితులవ్వరో వారే సదా హర్షితులుగా ఉండగలరు.
అవ్యక్త సూచనలు -
‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’
‘‘బాబా మరియు నేను’’
- కంబైండుగా ఉన్నాము, చేయించేవారు బాబా మరియు చేయడానికి నిమిత్తము ఆత్మనైన నేను -
దీనినే ఆలోచనా రహితము అని అంటారు అనగా ఒక్కరి స్మృతి. శుభచింతనలో ఉండేవారికి ఎప్పుడూ
చింత ఉండదు. ఏ విధంగా తండ్రి మరియు మీరు కంబైండుగా ఉన్నారో, శరీరము మరియు ఆత్మ
కంబైండుగా ఉన్నాయో, మీ భవిష్య విష్ణు స్వరూపము కంబైండుగా ఉందో, అలా స్వ-సేవ మరియు
సర్వుల సేవ కంబైండుగా ఉండాలి, అప్పుడు శ్రమ తక్కువ, ఫలితము ఎక్కువ లభిస్తుంది.
| | |