05-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు సాహెబు పిల్లలు (ఈశ్వరీయ సంతానము) నుండి యువరాజులుగా అవ్వనున్నారు, మీరు ఏ వస్తువు పట్ల కోరిక పెట్టుకోకూడదు, ఎవరి నుండి ఏమీ అడగకూడదు’’

ప్రశ్న:-
ఆరోగ్యాన్ని సరిగ్గా ఉంచుకునేందుకు ఏ ఆధారము అవసరం లేదు?

జవాబు:-
కొంతమంది పిల్లలు - వైభవాల ఆధారముతో ఆరోగ్యము బాగుంటుందని భావిస్తారు. కానీ బాబా అంటారు - పిల్లలూ, ఇక్కడ మీరు వైభవాల పట్ల కోరిక పెట్టుకోకూడదు. వైభవాలతో ఆరోగ్యం బాగవ్వదు. ఆరోగ్యాన్ని బాగా ఉంచుకునేందుకు స్మృతియాత్ర కావాలి. సంతోషము వంటి ఔషధం లేదు అని అనడం జరుగుతుంది. మీరు సంతోషంగా ఉండండి, నషాలో ఉండండి. యజ్ఞములో దధీచీ ఋషి వలె మీ ఎముకలను ఇవ్వండి, అప్పుడు ఆరోగ్యం బాగవుతుంది.

ఓంశాంతి
తండ్రిని కరన్-కరావన్ హార్ (చేసేవారు-చేయించేవారు) అని అంటారు. మీరు సాహెబు పిల్లలు (ఈశ్వరీయ సంతానము). మీది ఈ సృష్టిలో ఉన్నతోన్నతమైన స్థానము. మనము సాహెబు పిల్లలము, ఆ సాహెబు యొక్క మతముపై ఇప్పుడు మళ్ళీ మన రాజ్యభాగ్యాన్ని స్థాపన చేసుకుంటున్నాము అన్న నషా పిల్లలైన మీకు ఉండాలి. ఇది కూడా ఎవరి బుద్ధిలోనూ గుర్తుండదు. బాబా అన్ని సెంటర్లలోని పిల్లల కోసము చెప్తారు. అనేక సెంటర్లు ఉన్నాయి, అనేకమంది పిల్లలు వస్తారు. మనము బాబా శ్రీమతముపై మళ్ళీ విశ్వములో సుఖ-శాంతుల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని ప్రతి ఒక్కరి బుద్ధిలో సదా గుర్తుండాలి. సుఖము మరియు శాంతి, ఈ రెండు పదాలనే గుర్తుపెట్టుకోవాలి. పిల్లలైన మీకు ఎంతటి జ్ఞానం లభిస్తుంది, మీ బుద్ధి ఎంత విశాలంగా ఉండాలి, ఇందులో మందబుద్ధి నడవదు. స్వయాన్ని సాహెబు పిల్లలు (ఈశ్వరీయ సంతానము)గా భావించినట్లయితే పాపాలు సమాప్తమైపోతాయి. రోజంతటిలో బాబా స్మృతి ఉండనివారు చాలా మంది ఉన్నారు. బాబా అడుగుతారు - మీ బుద్ధి డల్ గా ఎందుకు అయిపోతుంది? సెంటర్లకు ఎటువంటి పిల్లలు వస్తారంటే - మేము శ్రీమతముపై విశ్వములో మా దైవీ రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము అన్నది వారి బుద్ధిలో ఉండనే ఉండదు. లోలోపల ఆ నషా, శుద్ధ గర్వము ఉండాలి. మురళి వినేటప్పుడు రోమాలు నిక్కబొడుచుకోవాలి. ఇక్కడైతే బాబా చూస్తుంటారు - పిల్లల యొక్క రోమాలు ఇంకా డెడ్ అయినట్లు ఉంటాయి. మేము శ్రీమతముపై బాబా స్మృతితో వికర్మలను వినాశనం చేసుకొని మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నామని తమ బుద్ధిలో గుర్తు లేని పిల్లలు ఎందరో ఉన్నారు. ప్రతిరోజూ బాబా అర్థం చేయిస్తారు - పిల్లలూ, మీరు యోధులు, రావణునిపై విజయాన్ని పొందేవారు. తండ్రి మిమ్మల్ని మందిర యోగ్యులుగా తయారుచేస్తారు, కానీ అంతటి నషా లేక సంతోషము పిల్లలకు ఉంటుందా, ఏదైనా వస్తువు లభించకపోతే వెంటనే అలుగుతారు. బాబాకైతే పిల్లల అవస్థను చూసి ఆశ్చర్యమనిపిస్తుంది. మాయా సంకెళ్ళలో చిక్కుకుపోతారు. మీ గౌరవము, మీ కార్య వ్యవహారాలు, మీ సంతోషము అనేవి అద్భుతంగా ఉండాలి. ఎవరైతే మిత్ర-సంబంధీకులను మర్చిపోరో, వారెప్పుడూ తండ్రిని స్మృతి చేయలేరు, ఇక వారు ఏ పదవిని పొందుతారు! ఆశ్చర్యమనిపిస్తుంది.

పిల్లలైన మీలో ఎంతో నషా ఉండాలి. స్వయాన్ని సాహెబు పిల్లలుగా భావించినట్లయితే ఏదీ అడగాలి అన్న చింత ఉండదు. బాబా అయితే మనకు ఎంతటి అపారమైన ఖజానాను ఇస్తారంటే, ఇక 21 జన్మల వరకూ ఏదీ అడగవలసిన అవసరమే లేదు, అంతటి నషా ఉండాలి. కానీ బుద్ధి పూర్తిగా డల్ గా, మందబుద్ధి వలె ఉంది. పిల్లలైన మీ బుద్ధి అయితే ఏడు అడుగుల పొడవు ఉండాలి. మనుష్యుల పొడుగు ఎక్కువలో ఎక్కువ 6-7 అడుగులు ఉంటుంది. బాబా పిల్లలను ఎంతటి ఉల్లాసములోకి తీసుకువస్తారు - మీరు సాహెబ్ పిల్లలు, ప్రపంచములోని వారైతే ఏమీ అర్థం చేసుకోరు. మీరు వారికి ఏమని అర్థం చేయిస్తారంటే - మనం తండ్రి ఎదురుగా కూర్చున్నాము, తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని మీరు కేవలం ఈ విధంగా భావించండి. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, మాయ మీకు చాలా కఠినమైన శత్రువు, అది మీకు ఎంతటి శత్రువో, ఇతరులకు అంతటి శత్రువు కాదు. మనుష్యులకైతే తెలియనే తెలియదు, వారు తుచ్ఛబుద్ధి కలవారిగా ఉన్నారు. బాబా ప్రతి రోజు పిల్లలైన మీకు చెప్తారు - మీరు సాహెబు పిల్లలు, మీరు తండ్రిని స్మృతి చేయండి మరియు ఇతరులను మీ సమానంగా తయారుచేస్తూ ఉండండి. మీరు అందరికీ ఇది కూడా అర్థం చేయించవచ్చు - భగవంతుడైతే సత్యమైన సాహెబు కదా, కావున వారి పిల్లలమైన మనం ఈశ్వరీయ సంతానము. పిల్లలైన మీరు నడుస్తూ, తిరుగుతూ బుద్ధిలో ఇదే గుర్తుంచుకోవాలి. సేవలో దధీచి ఋషి వలె ఎముకలను కూడా ఇవ్వాలి. ఇక్కడ ఎముకలను ఇవ్వడం కాదు కదా, ఇంకా ఎదురు అపారమైన సుఖాలు, వైభవాలు కావాలని కోరుకుంటారు. ఆరోగ్యమేమైనా ఈ వస్తువులతో బాగవుతుందా. ఆరోగ్యం కోసం కావలసినది స్మృతి యాత్ర. ఆ సంతోషము ఉండాలి. అరే, మనమైతే కల్ప-కల్పమూ మాయతో ఓడిపోతూ వచ్చాము, ఇప్పుడిక మాయపై విజయాన్ని పొందుతాము. తండ్రి వచ్చి విజయాన్ని ఇప్పిస్తారు. ఇప్పుడు భారత్ లో ఎంతటి దుఃఖము ఉంది, అపారమైన దుఃఖాన్ని ఇచ్చేవాడు రావణుడు. వాళ్ళంతా - విమానాలు ఉన్నాయి, మోటార్లు, మహళ్ళు ఉన్నాయి, ఇక ఇదే స్వర్గమని భావిస్తారు. ఈ ప్రపంచమే అంతమైపోనున్నదని వారు అర్థం చేసుకోరు. లక్షలు, కోట్లు ఖర్చు చేస్తారు, ఆనకట్టలు మొదలైనవి నిర్మిస్తారు, యుద్ధ సామాగ్రి కూడా ఎంత తీసుకుంటున్నారు. అంతా ఒకరినొకరు హతమార్చుకుంటున్న వారు, అనాథలు కదా. ఎన్ని గొడవలు-కొట్లాటలు చేస్తారు, ఇక అడగకండి. ఎంత చెత్త పేరుకుపోయింది. దీనిని నరకము అని అంటారు. స్వర్గానికైతే ఎంతో మహిమ ఉంది. మహారాజు ఎక్కడికి వెళ్ళారు అని బరోడా మహారాణిని అడగండి? అప్పుడు ఆమె - అతను స్వర్గస్థుడయ్యారని చెప్తారు. స్వర్గము అని దేనినంటారు - ఇది ఎవ్వరికీ తెలియదు, ఎంతటి ఘోర అంధకారము ఉంది. మీరు కూడా ఘోర అంధకారములో ఉండేవారు, ఇప్పుడు తండ్రి అంటారు - మీకు ఈశ్వరీయ బుద్ధిని ఇస్తాను. స్వయాన్ని ఈశ్వరీయ సంతానముగా, సాహెబు పిల్లలుగా భావించండి. యువరాజులుగా తయారుచేయడం కోసం సాహెబ్ చదివిస్తారు. గొర్రెకు ఏమి తెలుసు సురమండలం యొక్క స్వరాలు... (గొర్రె ఏం అర్థం చేసుకోగలదు) అన్న నానుడిని బాబా వినిపిస్తారు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - మనుష్యులందరూ కూడా మేకలు, గొర్రెలు వలె ఉన్నారు, వారికి ఏమీ తెలియనే తెలియదు, కూర్చొని ఏదేదో మహిమను చేస్తూ ఉంటారు. మీ బుద్ధిలో ఆదిమధ్యాంతాల రహస్యముంది. మేము విశ్వములో సుఖ-శాంతులను స్థాపన చేస్తున్నాము అన్నది మంచి రీతిలో గుర్తు చేసుకోండి. ఎవరైతే సహాయకులుగా అవుతారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. అందులోనూ ఎవరెవరు సహాయకులుగా అవుతారు అన్నది మీరు చూస్తారు. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి - మేము ఏమి చేస్తున్నాము? మేము మేకలు, గొర్రెలులా అయితే లేము కదా? మనుష్యులలో అహంకారం ఎంత ఉందో చూడండి, గుర్రు-గుర్రుమంటూ ఉంటారు. మీకైతే తండ్రి స్మృతి ఉండాలి. సేవలో ఎముకలను ఇవ్వాలి, ఎవరినీ అసంతుష్టపరచకూడదు, స్వయము అసంతుష్టమవ్వకూడదు. అహంకారం కూడా రాకూడదు. నేను ఇది చేస్తాను, నేను ఇంత తెలివైనవాడిని - ఈ ఆలోచన రావడం కూడా దేహాభిమానమే. వారి నడవడిక ఎలా అయిపోతుందంటే, ఇక సిగ్గుపడాల్సి వస్తుంది. లేకపోతే మీకు ఉన్నంత సుఖము ఇంకెవ్వరికీ ఉండదు. ఇది బుద్ధిలో గుర్తు ఉన్నట్లయితే మీరు మెరుస్తూ ఉంటారు. సెంటర్లలో కొందరు మంచి మహారథులు ఉంటారు, కొందరు గుర్రపు స్వారీ వారు ఉంటారు, పాదచారులు కూడా ఉంటారు. ఇందులో చాలా విశాలమైన బుద్ధి ఉండాలి. ఎలాంటి-ఎలాంటి బ్రాహ్మణీలు ఉన్నారంటే, కొందరు చాలా సహాయకులుగా ఉన్నారు, సేవలో ఎంత సంతోషము ఉంటుంది. మీకు నషా ఎక్కాలి. సేవ చేయకపోతే ఏం పదవిని పొందుతారు. తల్లి-తండ్రికైతే పిల్లల పట్ల గౌరవము ఉంటుంది, కానీ వారు స్వయాన్నే గౌరవించుకోకపోతే ఇక బాబా ఏమంటారు.

పిల్లలైన మీరు కొద్ది సమయంలోనే అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి. తండ్రి మన్మనాభవ అని చెప్తున్నారని చెప్పండి. పిండిలోని ఉప్పు వలె గీతలో కొన్ని పదాలు సరైనవి ఉన్నాయి. ఈ విశాలమైన ప్రపంచము ఎంత పెద్దది, ఇది బుద్ధిలోకి రావాలి. ఇది ఎంత పెద్ద ప్రపంచము, ఎంతమంది మనుష్యులు ఉన్నారు, ఇవేవీ ఇక ఉండవు. ఏ ఖండము యొక్క నామ-రూపాలూ ఉండవు. మేము స్వర్గానికి యజమానులుగా అవుతాము అని రాత్రింబవళ్ళూ ఈ సంతోషము ఉండాలి. జ్ఞానమైతే చాలా సహజము, అర్థం చేయించేవారు చాలా చాతుర్యం కలిగి ఉండాలి. అనేక రకాల యుక్తులు ఉన్నాయి. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని డిప్లమాట్ (రాయబారిగా) తయారుచేస్తాను. వారు డిప్లమాట్ అని అంబాసిడర్ ని అంటారు. కావున పిల్లల బుద్ధిలో - ఓహో! అనంతమైన తండ్రి మాకు డైరెక్షన్లు ఇస్తున్నారు అని గుర్తుండాలి. మీరు ధారణ చేసి ఇతరులకు కూడా తండ్రి పరిచయాన్ని ఇస్తారు. మీరు తప్ప మిగిలిన ప్రపంచమంతా నాస్తికులుగానే ఉన్నారు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరైతే నాస్తికులుగా కూడా ఉన్నారు కదా. తండ్రిని స్మృతే చేయరు. బాబా - మేము స్మృతిని మర్చిపోతున్నామని స్వయమే అంటారు, మరి వారు నాస్తికులైనట్లే కదా. ఈ తండ్రి ఈశ్వరీయ సంతానముగా తయారుచేస్తారు, వీరు గుర్తుకు రావడం లేదా! ఇది అర్థం చేసుకోవడానికి కూడా చాలా విశాల బుద్ధి కావాలి. తండ్రి అంటారు - నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను. మీ ద్వారానే కార్యము చేయిస్తాను. యోధులైన మీరు ఎంత బాగున్నారు. ‘వందేమాతరం’ అని మీరు మహిమ చేయబడతారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, మళ్ళీ పూజారులుగా అయ్యారు. ఇప్పుడు శ్రీమతముపై మళ్ళీ పూజ్యులుగా అవుతున్నారు. పిల్లలైన మీరు ఎంతో శాంతిగా సేవ చేయాలి. మీరు అశాంతి చెందకూడదు. ఎవరి నరనరాలలోనైతే భూతాలు నిండి ఉన్నాయో, వారు ఏం పదవిని పొందుతారు. లోభము కూడా పెద్ద భూతమే. ప్రతి ఒక్కరి నడవడిక ఎలా ఉంది అని బాబా అంతా చూస్తూ ఉంటారు. బాబా ఎంత నషాను ఎక్కిస్తారు. కొందరు సేవ చేయకపోతే, కేవలం తింటూ, త్రాగుతూ ఉంటారు, ఇక 21 జన్మలు సేవ చేయవలసి ఉంటుంది. దాస-దాసీలు కూడా తయారవుతారు కదా. చివరిలో అందరికీ సాక్షాత్కారాలు జరగనున్నాయి. హృదయం పైకైతే సేవాధారులే ఎక్కుతారు. ఎవరినైనా అమరలోక వాసులుగా తయారుచేయడమే మీ సేవ. బాబా ధైర్యాన్ని అయితే ఎంతగానో అందిస్తారు. ధారణ చేయండి, దేహాభిమానులకు ధారణ జరగదు. మనం తండ్రిని స్మృతి చేసి వేశ్యాలయము నుండి శివాలయములోకి వెళ్తామని మీకు తెలుసు, కావున ఆ విధంగా తయారై కూడా చూపించాలి.

బాబా అయితే ఉత్తరాల్లో వ్రాస్తారు - ప్రియమైన ఆత్మిక ఈశ్వరీయ పిల్లలూ, ఇప్పుడు శ్రీమతముపై నడిచినట్లయితే, మహారథులుగా అయినట్లయితే రాజకుమారులుగా తప్పకుండా అవుతారు. మీ లక్ష్యము-ఉద్దేశ్యమే ఇది. ఒక్క సత్యమైన బాబాయే మీకు అన్ని విషయాలనూ మంచి రీతిలో అర్థం చేయిస్తున్నారు. సేవ చేసి, ఇతరుల కళ్యాణాన్ని కూడా చేస్తూ ఉండండి. యోగబలం లేకపోతే ఇక - ఇది కావాలి, అది కావాలి అని కోరికలు కలుగుతాయి. అంతటి సంతోషము ఉండదు. సంతోషము వంటి ఔషధం ఇంకేదీ లేదు అని అనడం జరుగుతుంది. సాహెబు పిల్లలకైతే ఎంతో సంతోషము ఉండాలి. అది లేకపోతే ఇక అనేక రకాల విషయాలు వస్తాయి. అరే, తండ్రి విశ్వం యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తున్నారు, ఇంకేమి కావాలి! ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - మేము ఇంతటి మధురమైన బాబాకు ఏం సేవ చేస్తున్నాము? తండ్రి అంటారు - సాహెబు వచ్చి ఉన్నారని అందరికీ సందేశాన్ని ఇస్తూ వెళ్ళండి. వాస్తవానికి మీరందరూ సోదరులు. మనమందరమూ పరస్పరం సోదరులకు సహాయం చేయాలని అంటూ ఉంటారు. ఈ ఆలోచనతో సోదరులు అని అంటారు. ఇక్కడైతే తండ్రి అంటారు - మీరంతా ఒకే తండ్రి పిల్లలు కావున పరస్పరం సోదరులు. తండ్రి స్వర్గ స్థాపనను చేసేవారు. పిల్లల ద్వారా స్వర్గాన్ని తయారుచేస్తారు. సేవ కోసం యుక్తులనైతే ఎన్నో అర్థం చేయిస్తారు. మిత్ర- సంబంధీకులకు కూడా అర్థం చేయించాలి. చూడండి, పిల్లలు విదేశాల్లో ఉన్నారు, వారు కూడా సేవ చేస్తున్నారు. రోజురోజుకు మనుష్యులు ఆపదలను చూసి - మరణించే కన్నా ముందే వారసత్వాన్ని తీసుకోవాలి అని భావిస్తారు. పిల్లలు తమ మిత్ర-సంబంధీకులను కూడా ఉన్నతంగా తయారుచేస్తున్నారు. పవిత్రంగా కూడా ఉంటారు. ఇకపోతే నిరంతరము భాయి-భాయి యొక్క అవస్థ ఉండడమనేది కష్టము. తండ్రి అయితే పిల్లలకు సాహెబ్ జాదే (సాహెబు పిల్లలు) అన్న ఎంత మంచి టైటిల్ ను ఇచ్చారు. స్వయాన్ని చూసుకోవాలి. సేవ చేయకపోతే మేము ఏమవుతాము? ఒకవేళ ఎవరైనా జమ చేసుకున్నా, అది తింటూ, తింటూ సమాప్తమైపోతే, అప్పుడు వారి ఖాతాలో నష్టం జమా అవుతుంది. సేవ చేసేవారికి ఎప్పుడూ - మేము ఇంత ఇచ్చాము అన్న ఆలోచన కూడా రాకూడదు. వారు ఇచ్చినదానితో అందరి పాలనా జరుగుతుంది. అందుకే సహాయం చేసేవారికి మర్యాద, మంచి పాలన కూడా చేయడం జరుగుతుంది. వారు తినిపించేవారు అని అర్థం చేయించాలి. ఆ ఆత్మిక పిల్లలు మీకు తినిపిస్తారు. మీరు వారి సేవను చేస్తారు, ఇది చాలా పెద్ద లెక్క. మనసా, వాచా, కర్మణా వారి సేవనే చేయకపోతే మరి ఆ సంతోషము ఎలా ఉంటుంది. శివబాబాను స్మృతి చేస్తూ భోజనాన్ని తయారుచేసినట్లయితే వారి శక్తి లభిస్తుంది. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - మేము అందరినీ సంతుష్టపరుస్తున్నామా? మహారథి పిల్లలు ఎంత సేవ చేస్తున్నారు. బాబా రెక్సిన్ పై చిత్రాలను తయారుచేయిస్తారు, ఈ చిత్రాలు ఎప్పుడూ చిరిగిపోవు. బాబా పిల్లలు కూర్చున్నారు, వారు తమంతట తామే పంపిస్తారు. లెదంటే తండ్రి డబ్బును ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఈ సెంటర్లన్నీ ఎలా నడుస్తున్నాయి? పిల్లలే నడిపిస్తారు కదా. శివబాబా అంటారు - నా వద్దనైతే ఒక్క చిల్లిగవ్వ కూడా లేదు. మున్ముందు మీ వద్దకు అందరూ వారంతట వారే వచ్చి, మా ఇంటిని మీరు ఉపయోగించండి అని అంటారు. మీరు అంటారు - ఇప్పుడు టూ లేట్ అయిపోయింది. తండ్రి పేదలపాలిటి పెన్నిధి. పేదవారి వద్ద డబ్బు ఎక్కడి నుండి వస్తుంది. కొందరు కోటీశ్వరులు, పదమపతులు కూడా ఉన్నారు. వారికైతే ఇక్కడే స్వర్గము. ఇది మాయ యొక్క ఆర్భాటము. వారి పతనము జరుగుతూ ఉంది. తండ్రి అంటారు - మీరు మొదట సాహెబు పిల్లలుగా అయ్యారు, ఆ తర్వాత వెళ్ళి అక్కడ రాజకుమారులుగా అవుతారు. కానీ అంతటి సేవను కూడా చేసి చూపించండి కదా. చాలా సంతోషములో ఉండాలి. మనం సాహెబు పిల్లలము, మళ్ళీ రాజకుమారులుగా అవ్వనున్నాము. ఎప్పుడైతే అనేకుల సేవను చేస్తారో, అప్పుడే రాజకుమారులుగా అవుతారు. సంతోషపు పాదరసము ఎంతగా పైకి ఎక్కాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవ్వరినీ అసంతుష్టపరచకూడదు, స్వయం అసంతుష్టమవ్వకూడదు. తమ తెలివి లేక సేవ యొక్క అహంకారాన్ని చూపించకూడదు. ఏ విధంగా తండ్రి పిల్లల పట్ల గౌరవాన్ని ఉంచుతారో, అలా స్వయం పట్ల స్వయమే గౌరవాన్ని ఉంచాలి.

2. యోగబలం ద్వారా మీ కోరికలన్నింటినీ సమాప్తం చేసుకోవాలి. మేము సాహెబు పిల్లల నుండి రాజకుమారులుగా అవ్వనున్నాము అని సదా ఇదే సంతోషము మరియు నషాలో ఉండాలి. సదా శాంతిగా ఉంటూ సేవ చేయాలి. రోమ-రోమాలలో ఏ భూతాలైతే నిండి ఉన్నాయో, వాటన్నింటినీ తొలగించివేయాలి.

వరదానము:-

బ్రాహ్మణ జీవితములో తండ్రి ద్వారా ప్రకాశ కిరీటాన్ని ప్రాప్తి చేసుకునే మహాన్ భాగ్యవాన్ ఆత్మా భవ

సంగమయుగీ బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత ‘‘పవిత్రత’’. పవిత్రతకు గుర్తు - ప్రకాశ కిరీటము, ఇది ప్రతి బ్రాహ్మణ ఆత్మకూ తండ్రి ద్వారా ప్రాప్తిస్తుంది. పవిత్రత యొక్క ఈ ప్రకాశ కిరీటము ఆ రత్నజడిత కిరీటము కంటే అతి శ్రేష్ఠమైనది. మహాన్ ఆత్మలు, పరమాత్మ భాగ్యవాన్ ఆత్మలు మరియు ఉన్నతోన్నతమైన ఆత్మలు యొక్క గుర్తు ఈ ప్రకాశ కిరీటము. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ జన్మించడంతోనే ‘‘పవిత్ర భవ’’ అన్న వరదానాన్ని ఇస్తారు, దీని గుర్తు ప్రకాశ కిరీటము.

స్లోగన్:-

అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా కోరికలకు వశమై వ్యాకులత చెందుతున్న ఆత్మల యొక్క వ్యాకులతను దూరం చెయ్యండి.