05-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 03.03.2006


‘‘పరమాత్మ సాంగత్యములో జ్ఞానమనే రంగులపొడిని, గుణాలు మరియు శక్తులనే రంగులను వేసుకోవటమే సత్యమైన హోలీని జరుపుకోవటము’’

ఈ రోజు బాప్ దాదా అత్యంత అదృష్టవంతులైన మరియు అత్యంత పవిత్రులైన తమ పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు. ప్రపంచములోనివారైతే ఏ ఉత్సవమునైనా కేవలము జరుపుకుంటారు కానీ పిల్లలైన మీరు కేవలము జరుపుకోరు, జరుపుకోవటము అనగా తయారవ్వటము. మీరు హోలీగా అనగా పవిత్ర ఆత్మలుగా తయారయ్యారు. మీరందరూ ఎటువంటి ఆత్మలు? హోలీ ఆత్మలు అనగా అత్యంత పవిత్ర ఆత్మలు. ప్రపంచములోనివారైతే శరీరముపై స్థూలమైన రంగులు వేసుకుంటారు కానీ ఆత్మలైన మీరు ఆత్మపై ఎటువంటి రంగును వేసుకున్నారు? అన్నిటికంటే అత్యంత మంచి రంగు ఏది? అవినాశీ రంగు ఏది? మీరందరూ పరమాత్మ సాంగత్యమనే రంగును ఆత్మపై వేసుకున్నారు, దీని ద్వారా ఆత్మపై పవిత్రత అనే రంగు వేయబడింది అని మీకు తెలుసు. పరమాత్మ సాంగత్యము అనే ఈ రంగు ఎంత గొప్పది మరియు ఎంత సహజమైనది, అందుకే పరమాత్మ సాంగత్యము యొక్క మహత్వము కారణముగా ఇప్పుడు అంతిమములో కూడా సత్సంగానికి మహత్వము ఉంది. సత్సంగము అన్నదాని అర్థమే పరమాత్మ సాంగత్యములో ఉండటము, ఇది అన్నిటికంటే సహజమైనది మరియు ఉన్నతోన్నతమైనది. ఇటువంటి సాంగత్యములో ఉండటము కష్టమా? ఈ సాంగత్యమనే రంగులో ఉండటము వలన ఏ విధముగా పరమాత్మ ఉన్నతోన్నతమైనవారో అలా పిల్లలైన మీరు కూడా ఉన్నతోన్నతమైన, పవిత్రమైన మహానాత్మలుగా, పూజ్యాత్మలుగా అయ్యారు. ఈ అవినాశీ సాంగత్యపు రంగు ప్రియముగా అనిపిస్తుంది కదా! ప్రపంచములోనివారు ఎంతగా ప్రయత్నము చేస్తారు. పరమాత్ముని సాంగత్యము విషయము పక్కన పెట్టండి, కేవలము పరమాత్మను గుర్తు చేసుకోవటానికి కూడా ఎంత కష్టపడతారు. కానీ ఆత్మలైన మీరు బాబాను తెలుసుకున్నారు. మనస్ఫూర్తిగా ‘‘మేరా బాబా (నా బాబా)’’ అని అన్నారు. బాబా ‘‘మేరే బచ్చే (నా పిల్లలు)’’ అని అన్నారు, అంతే రంగు అంటుకుంది. బాబా ఏ రంగును వేసారు? జ్ఞానమనే రంగుల పొడిని వేసారు, గుణాల రంగులను వేసారు, శక్తుల రంగులను వేసారు, ఈ రంగుల ద్వారా మీరు ఎలాగూ దేవతలుగా అయిపోయారు, అంతేకాక ఇప్పుడు కలియుగాంతము వరకు కూడా మీ పవిత్రమైన చిత్రాలు దేవాత్మల రూపములో పూజింపబడుతున్నాయి. పవిత్ర ఆత్మలుగా చాలామంది అవుతారు, మహానాత్మలుగా చాలామంది అవుతారు, ధర్మాత్మలుగా చాలామంది అవుతారు కానీ మీ పవిత్రత, దేవాత్మల రూపములో ఆత్మ కూడా పవిత్రముగా అవుతుంది మరియు ఆత్మతోపాటుగా శరీరము కూడా పవిత్రముగా అవుతుంది. ఇంతటి శ్రేష్ఠమైన పవిత్రత ఎలా తయారయ్యింది? కేవలము సాంగత్యమనే రంగు ద్వారా. పరమాత్మ ఎక్కడ ఉంటారు అని ఒకవేళ పిల్లలైన మిమ్మల్ని ఎవరైనా అడిగితే, మీరు దానికి నషాతో సమాధానము చెప్తారు. పరంధామములోనైతే ఎలాగూ ఉన్నారు కానీ ఇప్పుడు సంగమయుగములో పరమాత్మ మీతోపాటు ఎక్కడ ఉంటారు? దీనికి మీరు ఏమని జవాబిస్తారు? పరమాత్మకు ఇప్పుడు పవిత్ర ఆత్మలమైన మా హృదయ సింహాసనమే మంచిగా అనిపిస్తుంది అని అంటారు. అలానే కదా? మీ హృదయములో బాబా ఉంటారు, మీరు బాబా హృదయములో ఉంటారు. ఎవరైతే అలా ఉంటారో వారు చేతులెత్తండి. ఉంటారా? (అందరూ చేతులెత్తారు). మంచిది, చాలా మంచిది. పరమాత్మకు నా హృదయము తప్ప మరెక్కడా మంచిగా అనిపించదు అని నషాతో అంటారు ఎందుకంటే మీరు కంబైండుగా ఉంటారు కదా! కంబైండుగా ఉంటారా? చాలామంది పిల్లలు కంబైండుగా ఉంటాము అని చెప్తూ కూడా సదా బాబా సాంగత్యము యొక్క లాభాన్ని తీసుకోరు. వారిని కంపానియన్ గా (సహచరుడిగా) అయితే చేసుకున్నారు, ఇది పక్కానే. మేరా బాబా అని అన్నారంటే వారిని సహచరునిగానైతే చేసుకున్నట్లే, కానీ ప్రతి సమయము వారి సాంగత్యాన్ని అనుభవము చెయ్యటము, ఇందులో తేడా వచ్చేస్తుంది. ఈ విషయములో నంబరువారుగా లాభాన్ని తీసుకుంటున్నారు అన్నదానిని బాప్ దాదా చూస్తారు. దీనికి కారణమేమిటి? మీ అందరికీ బాగా తెలుసు.

బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - ఒకవేళ హృదయములో రావణుడికి చెందిన ఏ పాత ఆస్తి అయినా పాత సంస్కారాల రూపములో ఉండిపోయినట్లయితే మరి రావణుడి వస్తువు అనేది పరాయి వస్తువు అయినట్లు కదా! పరాయివారి వస్తువును ఎప్పుడూ తమ వద్ద ఉంచుకోరు, తీసేస్తారు. కానీ బాప్ దాదా చూసారు, ఆత్మిక సంభాషణలో వింటుంటారు కూడా, పిల్లలు ఏమంటారంటే - బాబా, నేనేమి చేయను, నా సంస్కారాలే ఇలా ఉన్నాయి. నా సంస్కారాలు అని అనటానికి అవి మీ సంస్కారాలా ఏమిటి? నా పాత సంస్కారాలు, నా నేచర్ అని అనటము రైటేనా? రైటా? రైటా? రైట్ అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఎవ్వరూ ఎత్తటము లేదు. మరైతే అలా ఎందుకు అంటారు? పొరపాటున అనేస్తారా? మరజీవులుగా అయిపోయినప్పుడు, ఇప్పుడు మీ అందరి ఇంటి పేరు ఏమిటి? పాత జన్మకు చెందిన ఇంటి పేరా లేక బి.కె. అన్నది మీ ఇంటి పేరా? మీ ఇంటి పేరు ఏమని వ్రాస్తారు? బి.కె. అనా లేక ఫలానా, ఫలానా... అనా? మరజీవులుగా అయిపోయినప్పుడు మరి పాత సంస్కారాలు నా సంస్కారాలుగా ఎలా అయ్యాయి? పాత సంస్కారాలనేవి పరాయి సంస్కారాలు, అవి నావైతే కావు కదా! మరి ఈ హోలీలో ఏదో ఒకటి కాలుస్తారు కదా! హోలీలో కాలుస్తారు కూడా మరియు రంగులు కూడా వేస్తారు, మరి మీరందరూ ఈ హోలీలో ఏమి కాలుస్తారు? నా సంస్కారాలు అన్న ఈ మాటను మీ బ్రాహ్మణ జీవితపు డిక్షనరీ నుండి సమాప్తము చేయండి. జీవితము కూడా ఒక డిక్షనరీ కదా! కావున ఇకపై ఎప్పుడూ స్వప్నములో కూడా ఇలా ఆలోచించకండి. సంకల్పములో రావటము కాదు కదా, పాత సంస్కారాలను నా సంస్కారాలు అని అనుకోవటమనేది కనీసము స్వప్నములో కూడా ఆలోచించకండి. ఇప్పుడైతే బాబా సంస్కారాలు ఏవో అవే మీ సంస్కారాలు. మా లక్ష్యము బాబా సమానముగా అవ్వటము అని అందరూ అంటారు కదా. మరి అందరూ మీ హృదయములో దృఢ సంకల్పముతో కూడిన ఈ ప్రతిజ్ఞను మీకు మీరు చేసుకున్నారా? పొరపాటున కూడా నావి అని అనకండి. నావి, నావి అని అంటుంటారు కదా, కావున పాత సంస్కారాలేవైతే ఉన్నాయో అవి లాభము తీసుకుంటాయి. వాటిని నావి అని అనేటప్పటికి ఇక అవి కూర్చుండిపోతాయి, ఇక పోవు.

బాప్ దాదా పిల్లలందరినీ ఏ రూపములో చూడాలనుకుంటున్నారు? మీకు తెలుసు కూడా, మీరు అంగీకరిస్తారు కూడా. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ భృకుటి సింహాసనాధికారులుగా, స్వరాజ్య అధికారులైన రాజా పిల్లలుగా, ఆధీనులైన పిల్లలుగా కాదు, రాజా పిల్లలుగా, కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ కలవారిగా, మాస్టర్ సర్వశక్తివంతుల స్వరూపములో చూస్తున్నారు. మీరు మీ ఏ రూపాన్ని చూస్తున్నారు? ఈ రూపాన్నే కదా, మీరు రాజ్యాధికారులు కదా! మీరు ఆధీనులైతే కారు కదా? ఆధీనులుగా ఉన్న ఆత్మలను మీరందరూ అధికారులుగా తయారుచేసేవారు. ఆత్మల పట్ల దయార్ద్ర హృదయులుగా అయ్యి వారిని కూడా ఆధీనులు నుండి అధికారులుగా తయారుచేసేవారు మీరు. మీరందరూ హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా?

అందరూ స్నేహమనే విమానము ద్వారా చేరుకున్నారు అని బాప్ దాదాకు కూడా సంతోషముగా ఉంది. అందరి వద్ద విమానము ఉంది కదా! బాప్ దాదా ప్రతి బ్రాహ్మణాత్మకు వారు జన్మించగానే మనసు అనే విమానాన్ని కానుకగా ఇచ్చారు. మరి అందరి వద్ద మనసనే విమానము ఉందా? విమానములో పెట్రోల్ సరిగ్గా ఉందా? రెక్కలు సరిగ్గా ఉన్నాయా? దానిని స్టార్ట్ చేయడానికి ఆధారము సరిగ్గా ఉందా? చెక్ చేస్తుంటారా? ఇది ఎటువంటి విమానమంటే ఇది మూడు లోకాలకూ క్షణములో వెళ్ళగలదు. ఒకవేళ ధైర్యము మరియు ఉల్లాస-ఉత్సాహాలు అనే రెండు రెక్కలు యథార్థముగా ఉన్నట్లయితే అది ఒక్క క్షణములో స్టార్ట్ అయిపోగలదు. స్టార్ట్ చేయడానికి తాళముచెవి ఏమిటి? మేరా బాబా (నా బాబా). మేరా బాబా అని అన్నట్లయితే మనసు ఎక్కడకు చేరుకోవాలనుకుంటే అక్కడకు చేరుకోగలదు. రెండు రెక్కలూ సరిగ్గా ఉండాలి. ధైర్యాన్ని ఎప్పుడూ వదలకండి. ఎందుకని? బాప్ దాదా యొక్క ప్రతిజ్ఞ ఉంది, వరదానము ఉంది, మీరు ధైర్యముతో ఒక్క అడుగు వేస్తే, బాబా నుండి వెయ్యి అడుగుల సహాయము లభిస్తుంది. ఎటువంటి కఠినమైన సంస్కారమైనా కానీ, ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ఎందుకని? సర్వశక్తివంతుడైన బాబా సహాయకునిగా ఉన్నారు మరియు కంబైండుగా ఉన్నారు, సదా హాజరై ఉన్నారు. మీరు ధైర్యముతో సర్వశక్తివంతుడైన, కంబైండుగా ఉన్న బాబాపైన అధికారాన్ని ఉంచండి మరియు జరగాల్సిందే, బాబా నావారు, నేను బాబా వాడిని అని దృఢముగా ఉండండి. ఈ ధైర్యాన్ని మర్చిపోకండి, అప్పుడు ఏమవుతుంది? ఎలా చేయను అన్న ఆలోచన వస్తుంది కదా, ఆ ‘ఎలా’ అన్న మాట మారిపోయి అది ‘ఇలా’ అని అయిపోతుంది. ఎలా చేయను, ఏం చేయను అని అనుకోవద్దు. ఈ విధముగా జరిగే ఉంది అని అనుకోండి. చేయడమైతే చేస్తున్నాము, అవుతుంది, అవ్వడమైతే అవ్వాలి, బాబా సహాయమైతే ఇస్తారు... అని అనుకుంటారు. కానీ అది ‘జరిగే ఉంది’, దృఢ నిశ్చయబుద్ధి కలవారికి సహాయము చేయడానికి బాబా బంధింపబడి ఉన్నారు. కానీ మీరు కేవలము కాస్త రూపాన్ని మార్చుతారు. బాబాపై హక్కు పెట్టుకుంటారు కానీ రూపాన్ని మార్చేస్తారు. బాబా, మీరైతే సహాయము చేస్తారు కదా! మీరైతే బంధింపబడి ఉన్నారు కదా! ఇలా కదా, కదా... అని అంటారు. నిశ్చయబుద్ధి కలవారికి విజయము నిశ్చితమయ్యే ఉంటుంది ఎందుకంటే బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ వారు జన్మించగానే వారి మస్తకముపై విజయ తిలకాన్ని దిద్దారు. దృఢతను మీ తీవ్ర పురుషార్థానికి తాళముచెవిగా చేసుకోండి. ప్లాన్లు చాలా బాగా తయారుచేస్తారు. బాప్ దాదా ఆత్మిక సంభాషణను విన్నప్పుడు, ఆత్మిక సంభాషణనైతే చాలా ధైర్యముతో కూడినదే చేస్తారు, ప్లాన్లు కూడా చాలా శక్తిశాలి అయినవి తయారుచేస్తారు, కానీ ప్లాన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చినప్పుడు వాటిని ప్లెయిన్ బుద్ధి కలవారిగా అయ్యి చెయ్యరు. దానిలో కొద్దిగా ‘చేయడమైతే చేస్తున్నాము, మరి అవ్వడమైతే అవ్వాలి’... ఇలా స్వయములో నిశ్చయముతో కూడిన సంకల్పాలు కాకుండా వ్యర్థ సంకల్పాలను కలిపేస్తారు.

ఇప్పుడు సమయమనుసారముగా ప్లెయిన్ బుద్ధి కలవారిగా అయ్యి సంకల్పాలను సాకార రూపములోకి తీసుకురండి. కొద్దిగా కూడా బలహీన సంకల్పాలను ఇమర్జ్ చేయకండి. ఇప్పుడు ఈ ఒక్కసారే చెయ్యటము లేదు, అనేక సార్లు చేసినదానిని కేవలం రిపీట్ చేస్తున్నాము అన్నదానిని గుర్తు ఉంచుకోండి. ఎన్ని సార్లు కల్ప-కల్పము విజయులుగా అయ్యారు అన్నదానిని గుర్తు తెచ్చుకోండి! అనేక సార్లు విజయులుగా అయ్యారు. విజయము అనేది అనేక కల్పాల జన్మసిద్ధ అధికారము. ఈ అధికారముతో నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి దృఢత అనే తాళముచెవిని ఉపయోగించండి. విజయము బ్రాహ్మణ ఆత్మలైన మీ వద్దకు కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది! విజయము బ్రాహ్మణ ఆత్మలైన మీ జన్మసిద్ధ అధికారము, మీ మెడలోని హారము. నషా ఉంది కదా? అవుతుందా, అవ్వదా అని అనుకోవద్దు. జరిగే ఉంది. ఇంతటి నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి ప్రతి కార్యాన్ని చెయ్యండి, విజయము నిశ్చితమయ్యే ఉంది. ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు మీరు. విజయము లభించే ఉంది. లభిస్తుందా, లభించదా అని కాదు. అది లభించే ఉంది. ఈ నషాయే పెట్టుకోండి. ఇంతకుముందు కూడా అలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలా ఉన్నారు మరియు తర్వాత కూడా అలా ఉంటారు. మరి ఇటువంటి పవిత్రులు కదా! అత్యంత పవిత్రులుగానైతే ఉండనే ఉన్నారు. బాప్ దాదాతో జ్ఞానమనే రంగులపొడితో హోలిని ఆడుకున్నారు, ఇప్పుడు ఇంకేమి ఆడుతారు?

బాప్ దాదా చూసారు, మెజారిటీ అందరికీ - ఇది చేస్తాము, అది చేస్తాము, ఇదైపోతుంది అని ఉల్లాస-ఉత్సాహాలు చాలా బాగా కలుగుతాయి. బాప్ దాదా కూడా చాలా సంతోషిస్తారు కానీ ఈ ఉల్లాస-ఉత్సాహాలు సదా ఇమర్జ్ అయ్యి ఉండాలి, ఇవి అప్పుడప్పుడు మర్జ్ అయిపోతాయి, అప్పుడప్పుడు ఇమర్జ్ అవుతాయి. అవి మర్జ్ అయిపోకూడదు, ఇమర్జ్ అయ్యి ఉండాలి ఎందుకంటే మొత్తము సంగమయుగమంతా మీ ఉత్సవమే. వాళ్ళు ఉత్సవాన్ని అప్పుడప్పుడు ఎందుకు జరుపుకుంటారంటే, చాలా సమయము టెన్షన్ లో ఉంటారు కదా, కావున ఉత్సాహములో డ్యాన్స్ చేస్తూ, పాడుకుంటా, తింటూ ఉంటే కాస్త మార్పు ఉంటుంది అని అనుకుంటారు. కానీ మీ వద్దనైతే ప్రతి క్షణము నాట్యము చేయడము మరియు పాడుకోవడము ఉండనే ఉంటుంది. మీరు సదా మనసులో సంతోషములో నాట్యము చేస్తుంటారు కదా! లేక చెయ్యరా! నాట్యము చేస్తారు. సంతోషములో నాట్యము చెయ్యటము వస్తుందా? నాట్యము చెయ్యటము వస్తుందా? ఎవరికైతే వస్తుందో వారు చేతులెత్తండి. నాట్యము చెయ్యటము వస్తుందా, మంచిది. నాట్యం చెయ్యటం వస్తుంది అంటే అభినందనలు. మరి సదా నాట్యము చేస్తుంటారా లేక అప్పుడప్పుడు చేస్తుంటారా?

బాప్ దాదా ఈ సంవత్సరానికి హోమ్ వర్క్ ఇచ్చి ఉన్నారు, అదేమిటంటే - రెండు పదాల గురించి ఎప్పుడూ ఆలోచించకండి - సమ్ టైమ్ (అప్పుడప్పుడు), సమ్ థింగ్ (ఏదో ఒకటి). ఆ హోమ్ వర్క్ చేసారా? లేక ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అని అంటుంటారా? సమ్ టైమ, సమ్ థింగ్ అనేవి సమాప్తమవ్వాలి. ఈ నాట్యములో అలసిపోయే విషయమైతే లేదు. చారబడి ఉన్నా, పని చేసుకుంటున్నా, నడుస్తున్నా, కూర్చుని ఉన్నా, సంతోషపు డ్యాన్స్ నైతే తప్పకుండా చెయ్యగలరు మరియు బాబా ఇచ్చిన ప్రాప్తుల పాట కూడా పాడగలరు. పాట కూడా వస్తుంది కదా, ఈ పాటైతే అందరికీ వస్తుంది. నోటి ద్వారా పాడే పాట అయితే కొందరికి వస్తుంది, కొందరికి రాదు కానీ బాబా ఇచ్చిన ప్రాప్తులు, బాబా యొక్క గుణాల పాట అయితే అందరికీ వస్తుంది కదా. కనుక ప్రతి రోజూ ఉత్సవమే, ప్రతి ఘడియ ఉత్సవమే, అంతే, మరియు సదా నాట్యము చేస్తూ ఉండండి, పాడుతూ ఉండండి, వేరే పనైతే ఇవ్వనే లేదు. ఈ రెండు పనులే కదా - నాట్యము చేయండి మరియు పాడండి. కావున ఎంజాయ్ చేయండి. భారము ఎందుకు తీసుకుంటారు? ఎంజాయ్ చేయండి, నాట్యము చేయండి, పాడండి, అంతే. అచ్ఛా. హోలీనైతే జరుపుకున్నారు కదా! ఇప్పుడు రంగులతో చేసుకునే హోలీని కూడా జరుపుకుంటారా? అచ్ఛా, భక్తులు మిమ్మల్నే కాపీ చేస్తారు కదా! మీరు భగవంతునితోపాటు హోలీ ఆడుకుంటే భక్తులు కూడా దేవతలైన మీలో ఎవరో ఒకరితో ఆడుకుంటుంటారు. అచ్ఛా.

ఈ రోజు చాలామంది పిల్లల నుండి ఈ-మెయిల్స్ కూడా వచ్చాయి, ఉత్తరాలు కూడా వచ్చాయి, ఫోన్లు కూడా వచ్చాయి. సాధనాలు ఏవేవైతే ఉన్నాయో వాటి ద్వారా హోలీ అభినందనలను పంపారు. మీరు సంకల్పము చేసిన వెంటనే బాప్ దాదా వద్దకు అవి చేరుకుంటాయి. కానీ నలువైపులా ఉన్న పిల్లలు విశేషముగా స్మృతి చేస్తారు మరియు స్మృతి చేసారు కూడా, బాప్ దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరికీ పదమాల, పదమాల ఆశీర్వాదాలను మరియు పదమాల, పదమాల హృదయపూర్వకమైన ప్రియస్మృతులను రిటర్నులో ప్రతి ఒక్కరికీ పేరు సహితముగా, విశేషతా సహితముగా ఇస్తున్నారు. సందేశీ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ తమవైపు నుండి ప్రియస్మృతులను ఇస్తారు. ఎవరైతే ఇవ్వలేదో వారివి కూడా బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. ఇదే కదా పరమాత్మ ప్రేమ యొక్క విశేషత. ఈ ఒక్కొక్క రోజు ఎంతటి ప్రియమైనది! గ్రామాలలో ఉన్నా, పెద్ద-పెద్ద పట్టణాలలో ఉన్నా కానీ, గ్రామాలలో ఉన్నవారి వద్ద స్మృతి సాధనాలు లేకపోయినా కూడా బాప్ దాదా వద్దకు చేరుకుంటాయి ఎందుకంటే బాబా వద్ద స్పిరిచ్యువల్ (ఆధ్యాత్మిక) సాధనాలైతే చాలానే ఉన్నాయి కదా! అచ్ఛా.

నేటి సమయములో డాక్టర్లు - మందులను విడిచిపెట్టండి, ఎక్సర్సైజ్ చేయండి అని అంటూ ఉంటారు. మరి బాప్ దాదా కూడా చెప్తున్నారు - యుద్ధము చెయ్యటాన్ని విడిచిపెట్టండి, కష్టపడటాన్ని విడిచిపెట్టండి, మొత్తము రోజంతటిలో 5-5 నిమిషాలు మనసు యొక్క ఎక్సర్సైజ్ ను చేయండి. ఒక్క నిమిషములో నిరాకారి, ఒక్క నిమిషములో ఆకారీ, ఒక్క నిమిషములో అన్నిరకాల సేవాధారిని, ఈ 5 నిమిషాల మనసు ఎక్సర్సైజ్ ను మొత్తము రోజంతటిలో వేర్వేరు సమయాలలో చేయండి, అప్పుడు సదా ఆరోగ్యముగా ఉంటారు, శ్రమ నుండి ముక్తులవుతారు. వీలవుతుంది కదా! మధుబన్ వారు, వీలవుతుందా? మధుబన్ పునాది వంటిది, మధుబన్ లోని వైబ్రేషన్లు నలువైపులకు వద్దనుకున్నా కానీ చేరుకుంటాయి. మధుబన్ లో ఏదైనా విషయము జరిగితే అది మొత్తము భారత్ లో, ప్రతిచోటుకూ మరుసటి రోజు చేరిపోతుంది. మధుబన్ లో ఎటువంటి సాధనాలు ఉన్నాయంటే, ఏ విషయమూ దాగదు, అది మంచి విషయమైనా, పురుషార్థానికి చెందిన విషయమైనా సరే. కనుక మధుబన్ ఏది చేస్తే ఆ వైబ్రేషన్లు స్వతహాగా మరియు సహజముగా వ్యాపిస్తాయి. మొదట మధుబన్ నివాసులు వ్యర్థ సంకల్పాలను ఆపుచేయాలి, వీలవుతుందా? వీలవుతుందా? ముందు కూర్చున్నారు కదా! మధుబన్ నివాసులు చేతులెత్తండి. కనుక వ్యర్థము సమాప్తమయ్యే విధముగా మధుబన్ నివాసులు పరస్పరములో ఏదైనా అటువంటి ప్లాన్ ను తయారుచేయండి. సంకల్పాలనే ఆపు చేయండి అని బాప్ దాదా అనటము లేదు. వ్యర్థ సంకల్పాలు సమాప్తమైపోవాలి. వాటి వల్ల లాభమైతే లేదు. టెన్షనే ఉంటుంది. వీలవుతుందా? పరస్పరము మీటింగ్ చేసుకుని దీనిని చేస్తాము అని మధుబన్ నివాసులెవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. చేస్తాము, చేయాలి అని అనుకునేవారు బాగా పైకి చేతులెత్తండి. రెండు-రెండు చేతులు ఎత్తండి. అభినందనలు. బాప్ దాదా హృదయపూర్వకముగా ఆశీర్వాదాలను ఇస్తున్నారు. అభినందనలను తెలుపుతున్నారు. మధుబన్ వారిలో ధైర్యము ఉంది, ఏది కావాలనుకుంటే అది చెయ్యగలరు, చేయించగలరు కూడా. మధుబన్ లోని అక్కయ్యలు కూడా ఉన్నారు, అక్కయ్యలు చేతులెత్తండి. బాగా పైకి చేతులెత్తండి. మీటింగ్ చేయండి. దాదీలు, మీరు మీటింగ్ చేయించండి. చూడండి, అందరూ చేతులెత్తుతున్నారు. ఇప్పుడు ఎత్తిన ఈ చేతి యొక్క గౌరవాన్ని నిలపండి. అచ్ఛా!

బ్రహ్మాబాబా చివరిలో - నిరాకారీ, నిర్వికారీ, నిరహంకారీ అన్న వరదానమునేదైతే ఇచ్చారో, అది బ్రహ్మాబాబా ఇచ్చిన చివరి వరదానము. ఇది పిల్లల కొరకు చాలా పెద్ద కానుక వంటిది. మరి ఇప్పుడిప్పుడే క్షణములో బ్రహ్మాబాబా యొక్క కానుకను మనసు ద్వారా స్వీకరించగలరా? బాబా ఇచ్చిన ఈ కానుకను సదా ప్రాక్టికల్ జీవితములో తీసుకురావాలి అని దృఢ సంకల్పము చేయగలరా? ఎందుకంటే ఆదిదేవుని కానుక తక్కువైనదేమీ కాదు. బ్రహ్మా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, వారు ఇచ్చిన కానుక తక్కువైనదేమీ కాదు. కనుక మీ, మీ పురుషార్థమనుసారముగా సంకల్పము చేయండి - నేటి ఈ రోజున హోలీ అనగా ఏదైతే గతించిపోయిందో, అది గతించిపోయింది, అది అయిపోయింది. కానీ ఇప్పటినుండి ఈ కానుకను పదే-పదే ఇమర్జ్ చేసుకుని బ్రహ్మాబాబాకు సేవకు రిటర్న్ ఇస్తారు. చూడండి, బ్రహ్మాబాబా అంతిమ రోజు వరకు, అంతిమ సమయము వరకు సేవ చేసారు. ఇది బ్రహ్మాబాబాకు పిల్లలు పట్ల ఉన్న ప్రేమకు, సేవ పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనము. కావున బ్రహ్మాబాబాకు రిటర్న్ ఇవ్వడము అనగా పదే-పదే వారు ఇచ్చిన ఈ కానుకను జీవితములో రివైజ్ చేసుకుని ప్రాక్టికల్ లోకి తీసుకురావడము. కావున అందరూ మీ హృదయములో బ్రహ్మాబాబా స్నేహానికి రిటర్నులో ఈ సంకల్పాన్ని దృఢముగా చేయండి. ఇదే బ్రహ్మాబాబా యొక్క స్నేహపు కానుకకు రిటర్న్ ఇవ్వటము. అచ్ఛా!

నలువైపులా ఉన్న అత్యంత అదృష్టవంతులు, అత్యంత పవిత్రులైన పిల్లలకు, దృఢ సంకల్పమనే తాళముచెవిని సదా ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చే ధైర్యవంతులైన పిల్లలకు, సదా తమ మనసును రకరకాల సేవలలో బిజీగా ఉంచుకునేవారికి, ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే పిల్లలకు, సదా ప్రతి రోజు ఉత్సాహములో ఉండేవారికి, ప్రతి రోజును ఉత్సవముగా భావించి ఉత్సవాన్ని జరుపుకునే పిల్లలకు, సదా అదృష్టవంతులైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
లవ్ మరియు లవలీన స్థితి యొక్క అనుభవము ద్వారా అన్నింటినీ మర్చిపోయే సదా దేహీ-అభిమానీ భవ

కర్మలలో, వాణిలో, సంపర్కములో, సంబంధములో లవ్ (ప్రేమ) ఉండాలి, మరియు స్మృతిలో, స్థితిలో లవలీనులుగా ఉండాలి, అప్పుడు అన్నింటినీ మర్చిపోయి దేహీ-అభిమానులుగా అవుతారు. ప్రేమయే బాబాకు సమీప సంబంధములోకి తీసుకువస్తుంది, సర్వస్వ త్యాగులుగా చేస్తుంది. ఈ ప్రేమ యొక్క విశేషత ద్వారా మరియు లవలీన స్థితిలో ఉండటము ద్వారానే సర్వాత్మల భాగ్యాన్ని మరియు అదృష్టాన్ని మేల్కొలపగలరు. ఈ ప్రేమయే భాగ్యము రూపీ తాళానికి తాళముచెవి. ఇదే మాస్టర్ కీ. దీని ద్వారా ఎటువంటి దుర్భాగ్యశాలీ ఆత్మనైనా భాగ్యశాలీగా చేయగలరు.

స్లోగన్:-
స్వయం యొక్క పరివర్తనా ఘడియను నిశ్చితము చేసుకున్నట్లయితే విశ్వ పరివర్తన స్వతహాగా జరిగిపోతుంది.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి

మనసా శక్తికి దర్పణము - మాటలు మరియు కర్మలు. అజ్ఞానీ ఆత్మలైనా, జ్ఞానీ ఆత్మలైనా కానీ, ఇరువురి సంబంధ-సంపర్కములోనూ మాటలు మరియు కర్మలు, శుభ భావన మరియు శుభ కామన కలవిగా ఉండాలి. ఎవరి మనసు అయితే శక్తిశాలిగా మరియు శుభమైనదిగా ఉంటుందో, వారి వాచా మరియు కర్మణా స్వతహాగానే శక్తిశాలిగా, శుద్ధముగా ఉంటాయి, శుభ భావన కలవిగా ఉంటాయి. మనసు శక్తిశాలిగా ఉండటము అనగా స్మృతి యొక్క శక్తి శ్రేష్ఠముగా ఉంటుంది, శక్తిశాలిగా ఉంటుంది, వారు సహజయోగిగా ఉంటారు.