05-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ ప్రపంచమంతా రోగుల యొక్క పెద్ద
హాస్పిటల్, ప్రపంచమంతటినీ నిరోగిగా చేసేందుకు బాబా వచ్చారు’’
ప్రశ్న:-
ఏ
స్మృతి ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా వాడిపోవడం లేదా దుఃఖపు అల రావడమనేది జరగదు?
జవాబు:-
ఇప్పుడు మనం ఈ
పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్తాము, మళ్ళీ కొత్త ప్రపంచములో
పునర్జన్మలు తీసుకుంటాము. రాజ్యములోకి వెళ్ళేందుకు మనము ఇప్పుడు రాజయోగము
నేర్చుకుంటున్నాము. పిల్లలైన మన కోసం తండ్రి ఆత్మిక రాజస్థాన్ ను స్థాపన
చేస్తున్నారు, ఈ స్మృతి ఉన్నట్లయితే దుఃఖపు అల రాలేదు.
పాట:-
నీవే తల్లివి...
ఓంశాంతి
ఈ పాట పిల్లలైన మీ కోసమేమీ కాదు, ఇది కొత్తవారికి అర్థం చేయించడం కోసముంది. అలాగని
ఇక్కడ అందరూ తెలివైనవారని కూడా కాదు. అలా కాదు. తెలివిహీనులను తెలివైనవారిగా
తయారుచేయడం జరుగుతుంది. మనమెంత తెలివిహీనులుగా అయిపోయాము, ఇప్పుడు తండ్రి మనల్ని
తెలివైనవారిగా తయారుచేస్తున్నారు అన్నది పిల్లలు అర్థం చేసుకుంటారు. స్కూల్లో
చదువుకుని పిల్లలు ఎంత తెలివైనవారిగా అవుతారు. ప్రతి ఒక్కరూ తమ-తమ తెలివి ద్వారా
బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైనవారిగా అవుతారు. ఇక్కడైతే ఆత్మను తెలివైనదిగా
తయారుచేయాలి. చదువుకునేది కూడా ఆత్మయే, శరీరము ద్వారా. కానీ బయట ఏదైతే శిక్షణ
లభిస్తుందో, అది అల్పకాలికమైన శరీర నిర్వహణ కోసం లభిస్తుంది. కొంతమంది కన్వర్ట్ కూడా
చేస్తారు, హిందువులను క్రిస్టియన్లుగా చేస్తారు - దేని కోసము? కొంత సుఖము
పొందేందుకని. ధనము, ఉద్యోగము మొదలైనవి సహజముగా లభించడము కోసము, జీవనోపాధి కోసము
చేస్తారు. మనము మొట్టమొదట ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు
తెలుసు. ఇదే ముఖ్యమైన విషయము ఎందుకంటే ఇది ఉన్నదే రోగుల ప్రపంచము. రోగులుగా
అవ్వనటువంటి మనుష్యులంటూ ఎవ్వరూ లేరు. ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. ఈ ప్రపంచమంతా అతి
పెద్ద హాస్పిటల్, ఇందులోని మనుష్యులందరూ పతితులుగా, రోగులుగా ఉన్నారు. ఆయుష్షు కూడా
చాలా తక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా మృత్యువు అవుతుంది. కాలుడి పంజాలోకి
వచ్చేస్తారు. ఇది కూడా పిల్లలైన మీకే తెలుసు. పిల్లలైన మీరు కేవలం భారత్ కే కాక,
మొత్తం విశ్వానికి గుప్త రీతిలో సేవ చేస్తారు. ముఖ్యమైన విషయమేమిటంటే, తండ్రి
గురించి ఎవ్వరికీ తెలియదు. మనుష్యులై ఉండి పారలౌకిక తండ్రి గురించి తెలియదు, వారి
పట్ల ప్రేమనుంచరు. ఇప్పుడు తండ్రి అంటారు, నా పట్ల ప్రేమను ఉంచండి. నా పై ప్రేమను
ఉంచుతూ-ఉంచుతూ మీరు నాతో పాటుగానే తిరిగి వెళ్ళాలి. తిరిగి వెళ్ళేంతవరకు ఈ ఛీ-ఛీ
ప్రపంచములో ఉండవలసి ఉంటుంది. మొట్టమొదట దేహాభిమానుల నుండి దేహీ-అభిమానులుగా అవ్వండి,
అప్పుడు మీరు ధారణ చేయగలరు మరియు తండ్రిని స్మృతి చేయగలరు. ఒకవేళ దేహీ-అభిమానులుగా
అవ్వకపోతే, ఇక దేనికీ పనికి రారు. అందరూ దేహాభిమానులుగానే ఉన్నారు. మేము
ఆత్మాభిమానులుగా అవ్వకపోతే, తండ్రిని స్మృతి చేయకపోతే, మేము మునుపటిలాగానే
ఉండిపోతామని మీరు అర్థం చేసుకుంటారు కూడా. దేహీ-అభిమానులుగా అవ్వడమే ముఖ్యమైన విషయము,
అంతేకానీ రచన గురించి తెలుసుకోవడం కాదు. రచయిత మరియు రచనల జ్ఞానమని అంటూ ఉంటారు కూడా.
మొదట రచన, ఆ తర్వాత రచయిత యొక్క జ్ఞానమని అనరు. అలా కాదు, మొదట రచయిత, వారే తండ్రి.
ఓ గాడ్ ఫాదర్ అని అంటారు కూడా. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని తమ సమానముగా
తయారుచేస్తారు. తండ్రి అయితే సదా ఆత్మాభిమానిగానే ఉంటారు, అందుకే వారు సుప్రీమ్.
తండ్రి అంటారు, నేను అయితే ఆత్మాభిమానిని. ఎవరిలోనైతే ప్రవేశించానో, వారిని కూడా
ఆత్మాభిమానిగా చేస్తాను. వీరిని కన్వర్ట్ చేసేందుకు వీరిలోకి ప్రవేశిస్తాను ఎందుకంటే
వీరు కూడా దేహాభిమానిగా ఉండేవారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను యథార్థ రీతిలో
స్మృతి చేయండి అని వీరికి కూడా చెప్తాను. ఆత్మ వేరు, జీవము వేరు అని భావించే
మనుష్యులు చాలామంది ఉన్నారు. ఆత్మ దేహము నుండి బయటకు వచ్చేస్తుందంటే, అవి రెండు
వేర్వేరు అన్నట్లే కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నీవు ఒక ఆత్మవు. ఆత్మయే
పునర్జన్మలు తీసుకుంటుంది. ఆత్మయే శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తుంది. బాబా
పదే-పదే అర్థం చేయిస్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి, ఇందులోనే చాలా శ్రమ కావాలి.
విద్యార్థులు చదువుకునేందుకు ఏకాంతములోకి, పుష్పాలతోటలు మొదలైనవాటిలోకి వెళ్ళి
చదువుకుంటారు. ఫాదర్లు కూడా వాకింగ్ కు వెళ్ళినప్పుడు పూర్తిగా శాంతిగా ఉంటారు.
వారేమీ ఆత్మాభిమానులుగా ఉండరు. వారు క్రైస్ట్ స్మృతిలో ఉంటారు. ఇంట్లో ఉంటూ కూడా
స్మృతి అయితే చేయవచ్చు కానీ క్రైస్ట్ ను స్మృతి చేసేందుకు విశేషముగా ఏకాంతములోకి
వెళ్తారు, ఇంకెటువైపు చూడరు కూడా. ఎవరైతే చాలా మంచివారు ఉంటారో, వారు మేము క్రైస్ట్
ను స్మృతి చేస్తూ-చేస్తూ వారి వద్దకు వెళ్ళిపోతామని భావిస్తారు. క్రైస్ట్ స్వర్గములో
కూర్చున్నారని, మేము కూడా స్వర్గములోకి వెళ్ళిపోతామని భావిస్తారు. క్రైస్ట్ హెవెన్లీ
గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళారని, మేము కూడా స్మృతి చేస్తూ-చేస్తూ వారి వద్దకు
వెళ్ళిపోతామని కూడా భావిస్తారు. క్రిస్టియన్లంతా వారొక్కరి సంతానమే. వాళ్ళలో కొంత
జ్ఞానము సరిగ్గా ఉంది. కానీ క్రైస్ట్ ఆత్మ అయితే పైకి వెళ్ళనే లేదు. క్రైస్ట్ అనే
పేరు శిలువ పైకి ఎక్కించిన శరీరానిది. ఆత్మ అయితే శిలువ పైకి ఎక్కదు. ఇప్పుడు
క్రైస్ట్ ఆత్మ గాడ్ ఫాదర్ వద్దకు వెళ్ళిందని అనడం కూడా తప్పే అవుతుంది. ఎవరైనా
తిరిగి ఎలా వెళ్తారు? ప్రతి ఒక్కరూ స్థాపనను, ఆ తర్వాత పాలనను తప్పకుండా చేయవలసి
ఉంటుంది. ఇంటికి సున్నము మొదలైనవి వేయించడం జరుగుతుంది, ఇది కూడా పాలనే కదా.
ఇప్పుడు అనంతమైన తండ్రిని మీరు స్మృతి చేయండి. ఈ జ్ఞానాన్ని అనంతమైన తండ్రి తప్ప
ఇంకెవ్వరూ ఇవ్వలేరు. స్వయం యొక్క కళ్యాణము చేసుకోవాలి. రోగుల నుండి నిరోగులుగా
అవ్వాలి. ఇది రోగుల యొక్క పెద్ద హాస్పిటల్. మొత్తం విశ్వము రోగుల హాస్పిటల్ వంటిది.
రోగులు తప్పకుండా త్వరగా మరణిస్తారు, తండ్రి వచ్చి ఈ విశ్వమంతటినీ నిరోగిగా చేస్తారు.
ఇక్కడే నిరోగులుగా అవుతారని కాదు. తండ్రి అంటారు - నిరోగులు కొత్త ప్రపంచములోనే
ఉంటారు, పాత ప్రపంచములో నిరోగులు ఉండరు. ఈ లక్ష్మీ-నారాయణులు నిరోగులు, సదా
ఆరోగ్యవంతులు. అక్కడ ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. వికారులే రోగులుగా ఉంటారు.
నిర్వికారులు రోగులుగా ఉండరు. వారు సంపూర్ణ నిర్వికారులు. తండ్రి స్వయంగా
చెప్తున్నారు, ఈ సమయములో మొత్తం విశ్వమంతా, విశేషముగా భారత్ రోగగ్రస్థముగా ఉంది.
పిల్లలైన మీరు మొట్టమొదట నిరోగి ప్రపంచములోకి వస్తారు, స్మృతియాత్ర ద్వారా
నిరోగులుగా అవుతారు. స్మృతి ద్వారా మీరు మీ మధురమైన ఇంటికి వెళ్ళిపోతారు. ఇది కూడా
ఒక యాత్ర. ఇది తండ్రి అయిన పరమాత్మ వద్దకు వెళ్ళేందుకు ఆత్మ యొక్క యాత్ర. ఇది
ఆధ్యాత్మిక యాత్ర. ఈ పదాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. మీకు కూడా నంబరువారుగా తెలుసు,
కానీ మర్చిపోతారు. ముఖ్యమైన విషయము ఇదే, దీనిని అర్థం చేయించడం కూడా చాలా సహజము.
కానీ ఎవరైతే స్వయం కూడా ఆత్మిక యాత్రలో ఉంటారో, వారే అర్థం చేయించగలరు. స్వయం
యాత్రలో లేకుండా ఇతరులకు చెప్తే బాణము తగలదు. సత్యత యొక్క పదును కావాలి. మనము బాబాను
ఎంతో స్మృతి చేస్తాము. స్త్రీ పతిని ఎంతగా స్మృతి చేస్తుంది. వీరు పతులకే పతి,
తండ్రులకే తండ్రి, గురువులకే గురువు. గురువులు కూడా ఆ తండ్రినే స్మృతి చేస్తారు.
క్రైస్ట్ కూడా తండ్రినే స్మృతి చేసేవారు. కానీ ఆ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు.
తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడే తమ పరిచయాన్ని ఇస్తారు. భారతవాసులకే తండ్రి
గురించి తెలియకపోతే ఇక ఇతరులకు ఎక్కడ నుండి లభిస్తారు. యోగము నేర్చుకునేందుకు
విదేశాల నుండి కూడా ఇక్కడకు వస్తారు. ప్రాచీన యోగాన్ని భగవంతుడే నేర్పించారని వారు
భావిస్తారు. ఇది భావన. తండ్రి అర్థం చేయిస్తున్నారు, సత్యాతి-సత్యమైన యోగాన్ని అయితే
నేనే కల్ప-కల్పము, ఒక్కసారి మాత్రమే వచ్చి నేర్పిస్తాను. ముఖ్యమైన విషయము, స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, దీనినే ఆత్మిక యోగమని అంటారు.
మిగిలినవారందరివీ దైహిక యోగాలు. బ్రహ్మ తత్వముతో యోగము జోడిస్తారు. అది కూడా తండ్రి
కాదు. అది మహాతత్వము, నివసించే స్థానము. కనుక తండ్రి ఒక్కరే రైట్. ఒక్క తండ్రినే
సత్యమని అంటారు. ఒక్క తండ్రియే ఎలా సత్యమైనవారు అనేది కూడా భారతవాసులకు తెలియదు.
వారే సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు. సత్య ఖండము మరియు అసత్య ఖండము. మీరు సత్య
ఖండములో ఉన్నప్పుడు అక్కడ రావణ రాజ్యమే ఉండదు. అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము,
అసత్య ఖండము ప్రారంభమవుతుంది. సత్య ఖండమని పూర్తి సత్యయుగాన్ని అంటారు. ఆ తర్వాత
కలియుగాంతము పూర్తి అసత్య ఖండము. ఇప్పుడు మీరు సంగమములో కూర్చున్నారు. ఇక్కడా లేరు,
అక్కడా లేరు. మీరు ప్రయాణము (యాత్ర) చేస్తున్నారు. ఆత్మ ప్రయాణము చేస్తుంది, శరీరము
కాదు. తండ్రి వచ్చి యాత్ర చేయడం నేర్పిస్తారు. ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి. మీకు
ఇది నేర్పిస్తున్నారు. వారు నక్షత్రాలు, చంద్రుడు మొదలైనవాటి వైపుకు వెళ్ళేందుకు
ప్రయాణము చేస్తారు. దాని వల్ల లాభమేమీ లేదని ఇప్పుడు మీకు తెలుసు. వీటి ద్వారానే
పూర్తి వినాశనము జరగవలసి ఉంది. ఇకపోతే చేస్తున్న ఈ శ్రమ అంతా వ్యర్థమే. సైన్స్
ద్వారా తయారవుతున్న ఈ వస్తువులన్నీ భవిష్యత్తులో మీకే ఉపయోగపడతాయని మీకు తెలుసు. ఈ
డ్రామా తయారై ఉంది. అనంతమైన తండ్రి వచ్చి చదివిస్తున్నారంటే ఎంత గౌరవము ఉంచాలి.
టీచర్ కు మామూలుగా కూడా చాలా గౌరవము ఇస్తారు. మంచి రీతిలో చదువుకుని పాస్ అవ్వండి
అని టీచర్ ఆజ్ఞాపిస్తారు. ఒకవేళ ఆజ్ఞను పాటించకపోతే ఫెయిల్ అయిపోతారు. తండ్రి కూడా
అంటారు, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసేందుకు చదివిస్తున్నాను. ఈ
లక్ష్మీ-నారాయణలు యజమానులు. ప్రజలు కూడా యజమానులే కానీ హోదాలు అయితే చాలా ఉన్నాయి
కదా. మేము యజమానులమని భారతవాసులందరూ కూడా అంటుంటారు కదా. పేదవారు కూడా స్వయాన్ని
భారత్ యొక్క యజమానులుగానే భావిస్తారు. కానీ రాజులకు మరియు వారికి ఎంత తేడా ఉంటుంది.
జ్ఞానము కారణముగా పదవులలో తేడా వచ్చేస్తుంది. జ్ఞానములో కూడా తెలివితేటలు ఉండాలి.
పవిత్రత కూడా అవసరము మరియు ఆరోగ్యము-సంపద కూడా ఉండాలి. స్వర్గములో అన్నీ ఉన్నాయి కదా.
తండ్రి లక్ష్యము-ఉద్దేశ్యమును అర్థం చేయిస్తారు. ప్రపంచములో ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఈ
లక్ష్యము-ఉద్దేశ్యము ఉండవు. మేము ఈ విధముగా తయారవుతామని మీరు వెంటనే అంటారు. పూర్తి
విశ్వములో మన రాజధాని ఉంటుంది. ఇదైతే ఇప్పుడు పంచాయితీ రాజ్యము. మొదట
ద్వికిరీటధారులుగా ఉండేవారు, ఆ తర్వాత ఒకే కిరీటము ఉండేది, ఇప్పుడు ఏ కిరీటమూ లేదు.
బాబా మురళిలో చెప్పారు, ద్వికిరీటధారి రాజుల ఎదురుగా ఏక కిరీటధారులు తల
వంచుతున్నట్లుగా కూడా చిత్రముండాలి. నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా,
ద్వికిరీటధారులుగా చేస్తానని ఇప్పుడు తండ్రి అంటారు. అది అల్పకాలము కొరకు, ఇది 21
జన్మల విషయము. మొట్టమొదటి ముఖ్యమైన విషయము, పావనముగా అవ్వడము. మీరు వచ్చి పతితుల
నుండి పావనముగా చేయండి అని పిలుస్తారు కూడా, కానీ రాజుగా తయారుచేయండి అని అనరు.
ఇప్పుడు పిల్లలైన మీది అనంతమైన సన్యాసము. ఈ ప్రపంచము నుండి మన ఇంటికి వెళ్ళిపోతాము.
ఆ తర్వాత స్వర్గములోకి వస్తాము. మేము ఇంటికి వెళ్తాము, ఆ తర్వాత రాజ్యములోకి వస్తాము
అని అర్థం చేసుకున్నప్పుడు లోలోపల సంతోషము ఉండాలి, మరి వాడిపోవడం, దుఃఖము కలగడం
మొదలైనవన్నీ ఎందుకు ఉండాలి. ఆత్మలమైన మనము ఇంటికి వెళ్ళిపోతాము, ఆ తర్వాత కొత్త
ప్రపంచములో పునర్జన్మలు తీసుకుంటాము. పిల్లలకు స్థిరమైన సంతోషము ఎందుకు ఉండదు? మాయ
యొక్క అపోజిషన్ చాలా ఉంది, అందుకే సంతోషము తగ్గిపోతుంది. నన్ను స్మృతి చేసినట్లయితే
మీ జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి అని పతిత-పావనుడు స్వయంగా అంటారు. మీరు
స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మళ్ళీ మనము మన రాజస్థాన్ లోకి వెళ్ళిపోతామని మీకు
తెలుసు. ఇక్కడ రకరకాల రాజులుండేవారు, ఇప్పుడు మళ్ళీ ఆత్మిక రాజస్థాన్ తయారవ్వాలి.
స్వర్గానికి యజమానులుగా అవుతాము. క్రిస్టియన్లు హెవెన్ యొక్క అర్థాన్ని అర్థం
చేసుకోరు. వారు ముక్తిధామాన్నే స్వర్గమని అనేస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ లో
ఉంటారనేమీ కాదు. వారు శాంతిధామములోనే ఉంటారు. ఇప్పుడు మీరు ప్యారడైజ్ లోకి
వెళ్ళేందుకు పురుషార్థము చేస్తారు. ఈ వ్యత్యాసాన్ని తెలియజేయాలి. గాడ్ ఫాదర్
ముక్తిధామములో నివసిస్తారు. స్వర్గమని కొత్త ప్రపంచాన్ని అంటారు. ఫాదర్ యే వచ్చి
ప్యారడైజ్ ను స్థాపన చేస్తారు. మీరు దేనినైతే శాంతిధామము అని అంటారో, దానిని వారు
హెవెన్ గా భావిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు.
తండ్రి అంటారు, జ్ఞానము అయితే చాలా సహజమైనది. ఇది పవిత్రముగా తయారయ్యేందకు
జ్ఞానము, ముక్తి-జీవన్ముక్తులలోకి వెళ్ళేందుకు జ్ఞానము, దీనిని తండ్రి మాత్రమే
ఇవ్వగలరు. ఎవరికైనా ఉరిశిక్ష వేసేటప్పుడు, మేము భగవంతుని వద్దకు వెళ్తామని వారికి
లోపల ఉంటుంది, అలానే ఉరి తీసేవారు కూడా భగవంతుడిని తలచుకోమని చెప్తారు. కానీ
ఇరువురికీ భగవంతుని గురించి తెలియదు. వారికైతే ఆ సమయములో మిత్ర-సంబంధీకులు
మొదలైనవారు గుర్తుకొస్తారు. అంతిమ కాలములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో... అని
గాయనము కూడా ఉంది. ఎవరో ఒకరు తప్పకుండా గుర్తుకొస్తారు. సత్యయుగములో మాత్రమే
మోహజీతులు ఉంటారు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటామని అక్కడ వారికి తెలుసు.
అక్కడ స్మృతి చేయవలసిన అవసరముండదు, అందుకే దుఃఖములో అందరూ స్మరిస్తారు అని అంటారు.
ఇక్కడ దుఃఖముంది, అందుకే భగవంతుడి నుండి ఏదైనా లభించాలి అని తలచుకుంటారు. అక్కడైతే
అన్నీ లభించే ఉంటాయి. మా ఉద్దేశ్యము మనుష్యులను ఆస్తికులుగా చేయడము, ఆ నాథుడికి
చెందినవారిగా చేయడమని మీరు చెప్పవచ్చు. ఇప్పుడు అందరూ అనాథలుగా ఉన్నారు. మనము ఆ
నాథుడికి చెందినవారిగా అవుతాము. సుఖ-శాంతులు, సంపదల వారసత్వాన్ని ఇచ్చేవారు తండ్రి
మాత్రమే. ఈ లక్ష్మీ-నారాయణులకు ఎంత ఎక్కువ ఆయుష్షు ఉండేది. భారతవాసులకు మొట్టమొదట
చాలా ఎక్కువ ఆయుష్షు ఉండేదని కూడా మీకు తెలుసు. ఇప్పుడు తక్కువగా ఉంది. ఎందుకు
తగ్గిపోయింది అనేది ఎవ్వరికీ తెలియదు. అర్థం చేసుకోవడం మరియు అర్థం చేయించడం అనేది
మీకు చాలా సహజమైపోయింది. అది కూడా నంబరువారుగా ఉన్నారు. ప్రతి ఒక్కరి అర్థం చేయించడం
ఎవరిది వారిదే ఉంటుంది, ఎవరు ఎలా ధారణ చేస్తారో, అలా అర్థం చేయిస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ విధముగా తండ్రి సదా ఆత్మాభిమానిగా ఉంటారో, అదే విధముగా ఆత్మాభిమానిగా
ఉండేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. ఒక్క తండ్రినే హృదయపూర్వకముగా
ప్రేమిస్తూ-ప్రేమిస్తూ తండ్రితో పాటు ఇంటికి వెళ్ళాలి.
2. అనంతమైన తండ్రి పట్ల పూర్తిగా గౌరవాన్ని ఉంచాలి అనగా తండ్రి ఆజ్ఞపై
నడుచుకోవాలి. తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ - పిల్లలూ, బాగా చదువుకుని పాస్ అవ్వండి. ఈ
ఆజ్ఞను పాటించాలి.
వరదానము:-
శక్తిశాలి సేవ ద్వారా బలహీనముగా ఉన్నవారిలో బలాన్ని నింపే
సత్యమైన సేవాధారీ భవ
సత్యమైన సేవాధారుల వాస్తవిక విశేషత ఏమిటంటే - బలహీనముగా
ఉన్నవారిలో బలాన్ని నింపేందుకు నిమిత్తమవ్వడము. సేవ అయితే అందరూ చేస్తారు కానీ
సఫలతలో ఏదైతే తేడా కనిపిస్తుందో, దానికి కారణమేమిటంటే, సేవా సాధనాలలో శక్తి
లోపించడము. ఏ విధముగా ఖడ్గములో పదును లేకపోతే, అది ఖడ్గములా పని చేయదో, అదే విధముగా
సేవా సాధనాలలో స్మృతి శక్తి అనే పదును లేకపోతే సఫలత ఉండదు, అందుకే శక్తిశాలి
సేవాధారులుగా అవ్వండి, బలహీనముగా ఉన్నవారిలో బలము నింపి క్వాలిటీ ఆత్మలను
తయారుచేయండి, అప్పుడు సత్యమైన సేవాధారీ అని అంటారు.
స్లోగన్:-
ప్రతి
పరిస్థితిని ఎగిరే కళకు సాధనముగా భావిస్తూ సదా ఎగురుతూ ఉండండి.
అవ్యక్త సూచనలు -
అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి
మామూలుగా అయితే
అశరీరిగా అవ్వటము సహజమే కానీ ఏ సమయములోనైనా ఏదైనా విషయము ఎదురుగా వచ్చినా, సర్వీస్
లో ఏదైనా ఇబ్బంది ఎదురుగా వచ్చినా, అలజడిలోకి తీసుకువచ్చే పరిస్థితి ఏదైనా వచ్చినా,
అటువంటి సమయములో అనుకున్న వెంటనే అశరీరిగా అయిపోవాలి, ఇటువంటి స్థితి కొరకు బహుకాలపు
అభ్యాసము అవసరము. ఆలోచించటము మరియు చెయ్యటము ఒకేసారి జరగాలి, అప్పుడు అంతిమ పరీక్షలో
పాస్ అవ్వగలుగుతారు.
| | | |