ఓంశాంతి
తండ్రి పిల్లలకు జ్ఞానము మరియు భక్తి గురించి అర్థం చేయిస్తారు. సత్యయుగములో భక్తి
ఉండదు అని అయితే పిల్లలు అర్థం చేసుకుంటారు. జ్ఞానము కూడా సత్యయుగములో లభించదు.
శ్రీకృష్ణుడు భక్తీ చేయరు, అలాగే జ్ఞాన మురళీని వినిపించరు. మురళి అనగా జ్ఞానాన్ని
ఇవ్వడము. మురళిలో ఇంద్రజాలముంది అన్న గాయనము ఉంది కదా. మరి తప్పకుండా ఏదో ఒక
ఇంద్రజాలము ఉంటుంది కదా. కేవలం మురళిని వాయించడమనేది సామాన్యమైన విషయమే, ఫకీరులు
కూడా మురళిని వాయిస్తారు. కానీ ఇందులో జ్ఞానము యొక్క ఇంద్రజాలము ఉంది. అజ్ఞానాన్ని
ఇంద్రజాలము అని అనరు. శ్రీకృష్ణుడు మురళిని వాయించేవారని మనుష్యులు భావిస్తారు,
అతనికి ఎంతో మహిమ చేస్తారు. తండ్రి అంటారు, శ్రీకృష్ణుడు అయితే ఒక దేవత. మనుష్యుల
నుండి దేవతలుగా, దేవతల నుండి మనుష్యులుగా... ఇలా అవుతూనే ఉంటారు. దైవీ సృష్టి కూడా
ఉంటుంది, అలాగే మనుష్య సృష్టి కూడా ఉంటుంది. ఈ జ్ఞానముతో మనుష్యుల నుండి దేవతలుగా
అవుతారు. సత్యయుగము ఉన్నప్పుడు ఈ జ్ఞాన వారసత్వము ఉంటుంది. సత్యయుగములో భక్తి ఉండదు.
దేవతలు ఎప్పుడైతే మనుష్యులుగా అవుతారో అప్పుడు భక్తి ప్రారంభమవుతుంది. మనుష్యులను
వికారులు అని, దేవతలను నిర్వికారులు అని అంటారు. దేవతల సృష్టిని పవిత్ర ప్రపంచము అని
అంటారు. ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. దేవతల్లో ఈ జ్ఞానము
ఉండదు. దేవతలు సద్గతిలో ఉంటారు, జ్ఞానము అనేది దుర్గతిలో ఉండేవారికి అవసరము. ఈ
జ్ఞానముతోనే దైవీ గుణాలు వస్తాయి. జ్ఞాన ధారణ కలిగినవారి నడవడిక దివ్యముగా ఉంటుంది.
తక్కువగా ధారణ చేసేవారి నడవడిక మిక్స్ గా ఉంటుంది. ఆసురీ నడవడిక అని అయితే అనలేము.
ధారణ లేకపోతే, నా పిల్లలుగా ఎలా పిలవబడతారు. పిల్లలు తండ్రిని తెలుసుకోకపోతే మరి
తండ్రి కూడా పిల్లలను ఎలా తెలుసుకుంటారు. తండ్రిని ఎంత తప్పుడు మాటలతో నిందిస్తూ
ఉంటారు. భగవంతుడిని నిందించడము ఎంత చెడ్డ పని. మళ్ళీ ఎప్పుడైతే వారు బ్రాహ్మణులుగా
అవుతారో అప్పుడు ఇక అలా నిందించడము ఆగిపోతుంది. ఈ జ్ఞానాన్ని విచార సాగర మంథనము
చేయాలి. విద్యార్థులు విచార సాగర మంథనము చేసి జ్ఞానాన్ని ఉన్నతిలోకి తీసుకువస్తారు.
మీకు ఈ జ్ఞానము లభిస్తోంది, దీనిపై మీ విచార సాగర మంథనము చేసినట్లయితే అమృతము
వెలువడుతుంది. విచార సాగర మంథనము జరగకపోతే ఇంకే మంథనము జరుగుతుంది? ఆసురీ ఆలోచనల
మంథనము జరుగుతుంది, దానిలో నుండి చెత్తయే వెలువడుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వరీయ
విద్యార్థులు. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువును తండ్రి చదివిస్తున్నారు అని
మీకు తెలుసు. దేవతలైతే చదివించరు. దేవతలను ఎప్పుడూ జ్ఞాన సాగరులని అనరు. తండ్రే
జ్ఞాన సాగరుడు. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నాలో అన్ని దైవీ గుణాలు ఉన్నాయా.
ఒకవేళ ఆసురీ గుణాలు ఉన్నట్లయితే వాటిని తొలగించివేయాలి, అప్పుడే దేవతలుగా అవుతారు.
ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. పురుషోత్తములుగా అవుతున్నారంటే
వాతావరణము కూడా చాలా బాగుండాలి. ఛీ-ఛీ విషయాలు నోటి నుండి రాకూడదు, లేకపోతే తక్కువ
స్థాయి వారు అని పిలవబడతారు. వాతావరణము ద్వారా వెంటనే తెలిసిపోతుంది. వారి నోటి
నుండి దుఃఖాన్ని ఇచ్చే మాటలే వెలువడుతాయి. పిల్లలైన మీరు తండ్రి పేరును ప్రఖ్యాతము
చేయాలి. ముఖము సదా హర్షితముగా ఉండాలి. నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. ఈ
లక్ష్మీ-నారాయణులు ఎంత హర్షితముఖులు, వీరి ఆత్మలు జ్ఞాన రత్నాలను ధారణ చేసారు కదా,
వీరి నోటి నుండి ఈ రత్నాలను వెలువడింపజేసారు. జ్ఞాన రత్నాలనే వినేవారు,
వినిపించేవారు. ఎంతటి సంతోషము ఉండాలి. ఇప్పుడు మీరు ఏ జ్ఞాన రత్నాలనైతే
తీసుకుంటున్నారో, అవి తర్వాత సత్యమైన వజ్ర-వైఢూర్యాలుగా అయిపోతాయి. నవరత్నాల మాల
అంటే వజ్ర-వైఢూర్యాలతో తయారైనదేమీ కాదు, అది ఈ చైతన్య రత్నాల మాల. మనుష్యులు వాటిని
ఆ రత్నాలుగా భావించి ఉంగరాలను మొదలైనవాటిని ధరిస్తారు. జ్ఞాన రత్నాల మాల ఈ
పురుషోత్తమ సంగమయుగములోనే తయారవుతుంది. ఈ రత్నాలే 21 జన్మల కొరకు సుసంపన్నులుగా
చేస్తాయి, వీటిని ఎవరూ దోచుకోలేరు. ఈ ప్రపంచములో ఏవైనా రత్నాలు ధరిస్తే వెంటనే
దోచుకుంటారు. కావున స్వయాన్ని చాలా-చాలా వివేకవంతులుగా తయారుచేసుకోవాలి. ఆసురీ
గుణాలను తొలగించివేయాలి. ఆసురీ గుణాలు కలవారి ముఖము కూడా అలా అయిపోతుంది. క్రోధముతో
ముఖము ఎర్రగా రాగిలా అయిపోతుంది. కామ వికారము కలవారైతే పూర్తిగా నల్ల ముఖము వారిగా
అయిపోతారు. శ్రీకృష్ణుడిని కూడా నల్లగా చూపిస్తారు కదా. వికారాల కారణముగానే తెల్లగా
ఉన్నవారి నుండి నల్లగా అయిపోయారు. పిల్లలైన మీరు ప్రతి ఒక్క విషయముపై విచార సాగర
మంథనము చేయాలి. ఇది చాలా ధనాన్ని ప్రాప్తింపజేసే చదువు. క్వీన్ విక్టోరియా యొక్క
మంత్రి మొదట చాలా పేదవానిగా ఉండేవారని, దీపం వెలిగించుకుని చదువుకునేవారని పిల్లలైన
మీరు విన్నారు కానీ ఆ చదువు రత్నాలేమీ కాదు. జ్ఞానాన్ని చదువుకుని పూర్తి పొజిషన్
ను పొందుతారు. కావున చదువు ఉపయోగపడిందే కానీ ధనము కాదు. చదువే ధనము. అది హద్దులోని
ధనము, ఇది అనంతమైన ధనము. తండ్రి మనల్ని చదివించి విశ్వాధిపతులుగా తయారుచేస్తారని
ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అక్కడ ధనాన్ని సంపాదించేందుకు చదువు చదవరు. అక్కడ
ఇప్పటి పురుషార్థముతో అపారమైన ధనము లభిస్తుంది. ఆ ధనము అవినాశీగా అయిపోతుంది. దేవతల
వద్ద ఎంతో ధనము ఉండేది, మళ్ళీ ఎప్పుడైతే వామ మార్గములోకి, రావణ రాజ్యములోకి వస్తారో,
అప్పుడు కూడా ఎంత ధనము ఉండేది. ఎన్ని మందిరాలు నిర్మించారు. మళ్ళీ తర్వాత
ముసల్మానులు దోచుకున్నారు. ఎంత ధనవంతులుగా ఉండేవారు. ఈ రోజుల్లోని చదువుతో ఇంతటి
ధనవంతులుగా అవ్వలేరు. ఈ చదువుతో మనుష్యులు ఎలా అయిపోతారో చూడండి! పేదవారి నుండి
షావుకార్లుగా. ఇప్పుడు భారత్ ఎంత పేదదిగా ఉందో చూడండి! పేరుకు షావుకారులైనవారు
ఎవరైతే ఉంటారో, వారికైతే తీరికే లేదు. తమ ధనము, పొజిషన్ యొక్క అహంకారము ఎంతగా
ఉంటుంది. ఇందులో అహంకారము మొదలైనవన్నీ అంతమైపోవాలి. మనము ఒక ఆత్మ, ఆత్మ వద్ద
ధన-సంపదలు, వజ్ర-వైఢూర్యాలు మొదలైనవేవీ లేవు.
తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలనూ వదలండి.
ఆత్మ శరీరాన్ని వదిలితే ఇక ఆ తర్వాత సంపన్నత మొదలైనవన్నీ అంతమైపోతాయి. మళ్ళీ
ఎప్పుడైతే కొత్తగా చదువుకుంటారో, ధనాన్ని సంపాదిస్తారో, అప్పుడు ధనవంతులుగా అవుతారు,
లేదా దాన-పుణ్యాలను బాగా చేసి ఉంటే షావుకార్ల ఇళ్ళలో జన్మ తీసుకుంటారు. ఇది గత
కర్మల ఫలము అని అంటారు. జ్ఞానాన్ని దానం చేసి ఉంటారు లేక కాలేజీలు, ధర్మశాలలు
మొదలైనవి నిర్మించి ఉంటారు, దాని వలన ఫలము లభిస్తుంది, కానీ అది అల్పకాలికమైనది. ఈ
దానపుణ్యాదులు మొదలైనవి కూడా ఇక్కడే చేయబడతాయి. అవి సత్యయుగములో చేయబడవు.
సత్యయుగములో మంచి కర్మలే ఉంటాయి, ఎందుకంటే ఇప్పటి వారసత్వమే అక్కడ లభిస్తుంది.
అక్కడ ఏ కర్మలూ వికర్మలుగా అవ్వవు ఎందుకంటే అక్కడ రావణుడే లేడు. వికారాలలోకి
వెళ్ళడము వలన వికారీ కర్మలుగా అవుతాయి. వికారాల ద్వారా వికర్మలు తయారవుతాయి.
స్వర్గములో వికర్మలు అంటూ ఏవీ ఉండవు. మొత్తం ఆధారమంతా కర్మలపైనే ఉంది. ఈ మాయా
రావణుడు అవగుణాలు కలవారిగా చేస్తాడు. తండ్రి వచ్చి సర్వ గుణ సంపన్నులుగా చేస్తారు.
రామ వంశీయులు మరియు రావణ వంశీయుల యుద్ధము జరుగుతుంది. మీరు రాముని పిల్లలు, ఎంతో
మంచి-మంచి పిల్లలు మాయతో ఓడిపోతారు. బాబా పేర్లు చెప్పరు. అయినా కానీ నమ్మకము
పెట్టుకుంటారు. అతి అధములుగా అయినవారి ఉద్దరణను చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే
మొత్తం విశ్వమంతటి ఉద్దరణను చేయాలి. రావణుని రాజ్యములో అందరూ అధమ గతిని పొందారు.
తండ్రి అయితే స్వయాన్ని రక్షించుకునే మరియు ఇతరులను రక్షించే యుక్తులను ప్రతి రోజూ
అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా కానీ పడిపోతే ఇక అతి అధములుగా అయిపోతారు. అటువంటివారు
ఇక అంతగా పైకి ఎక్కలేరు. ఆ అధమ స్థితి లోలోపల తింటూ ఉంటుంది. అంత్యకాలములో ఎవరైతే
స్త్రీని స్మరిస్తారో... అని అంటారు కదా. వారి బుద్ధిలో ఆ అధమ స్థితియే గుర్తొస్తూ
ఉంటుంది.
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు - సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది
అనేది కల్ప-కల్పమూ మీరే వింటారు, జంతువులైతే తెలుసుకోవు కదా. మీరే వింటారు మరియు
అర్థం చేసుకుంటారు. మనుష్యులైతే మనుష్యులే, ఈ లక్ష్మీ-నారాయణులకు కూడా చెవులు,
ముక్కు మొదలైనవన్నీ ఉన్నాయి, ఎంతైనా వారూ మనుష్యులే కదా. కానీ దైవీ గుణాలు ఉన్న
కారణముగా వారిని దేవతలు అని అంటారు. వీరు ఈ విధంగా దేవతల్లా ఎలా అవుతారు, మళ్ళీ ఎలా
పడిపోతారు అన్న ఈ చక్రము గురించి మీకే తెలుసు. ఎవరైతే విచార సాగర మంథనము చేస్తూ
ఉంటారో, వారికే ధారణ జరుగుతుంది. ఎవరైతే విచార సాగర మంథనము చేయరో వారిని
తెలివితక్కువవారు అని అంటారు. మురళిని వినిపించేవారికి ఈ టాపిక్ పై ఇలా-ఇలా అర్థం
చేయించాలి అని విచార సాగర మంథనము నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థం చేసుకోకపోయినా సరే,
మున్ముందు తప్పకుండా అర్థం చేసుకుంటారు అన్న ఆశ పెట్టుకోవడం జరుగుతుంది. అలా ఆశ
పెట్టుకోవడం అనగా సేవా అభిరుచి ఉన్నట్లు, అలసిపోకూడదు. ఎవరైనా పైకి ఎక్కి మళ్ళీ
అధములుగా అయిపోతే, ఒకవేళ వారు మళ్ళీ వస్తే స్నేహముతో కూర్చోబెడతారు కదా లేదా
వెళ్ళిపో అని అంటారా! ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారు, ఏమి చేసారు అని వారి స్థితిగతుల
గురించి అడగాలి. మాయతో ఓడిపోయాను అని అంటారు కదా. జ్ఞానము చాలా బాగుంది అని
భావిస్తారు కూడా. స్మృతి అయితే ఉంటుంది కదా. భక్తిలోనైతే గెలుపు-ఓటములను పొందే
విషయమే లేదు. ఇది జ్ఞానము, దీనిని ధారణ చేయాలి. మీరు ఎప్పటివరకైతే బ్రాహ్మణులుగా
అవ్వరో, అప్పటివరకూ దేవతలుగా అవ్వలేరు. క్రిస్టియన్లు, బౌద్ధులు, పారసీ మొదలైనవారిలో
బ్రాహ్మణులు ఉండరు. బ్రాహ్మణుల పిల్లలు బ్రాహ్మణులు అవుతారు. ఈ విషయాలను ఇప్పుడు
మీరు అర్థం చేసుకుంటారు. అల్ఫ్ ను (భగవంతుడిని) స్మృతి చేయాలి అని మీకు తెలుసు.
అల్ఫ్ ను స్మృతి చేయడము ద్వారా రాజ్యాధికారము లభిస్తుంది. ఎవరైనా కలిసినప్పుడు అల్ఫ్
అల్లాను స్మృతి చేయండి అని చెప్పండి. అల్ఫ్ నే ఉన్నతమైనవారు అని అంటారు. అల్ఫ్
వైపుకు వేలితో సైగ చేస్తారు. అల్ఫ్ (సింధీలో) నిటారుగా ఉంటుంది. అల్ఫ్ ను ఒకటి అని
కూడా అంటారు. భగవంతుడు ఒక్కరే, మిగిలినవారంతా వారి పిల్లలు. తండ్రిని అల్ఫ్ అని
అంటారు. తండ్రి జ్ఞానాన్ని కూడా ఇస్తారు, అలాగే తమ పిల్లలుగా కూడా చేసుకుంటారు.
కావున పిల్లలైన మీరు ఎంతటి సంతోషములో ఉండాలి. బాబా మన సేవను ఎంతగా చేస్తారు,
విశ్వాధిపతులుగా తయారుచేస్తారు. వారు స్వయం పవిత్ర ప్రపంచములోకి రాను కూడా రారు.
పావన ప్రపంచములోకి వారిని ఎవరూ పిలవనే పిలవరు. పతిత ప్రపంచములోనే పిలుస్తారు. పావన
ప్రపంచములోకి వచ్చి వారేమి చేస్తారు. వారి పేరే పతిత-పావనుడు. కావున పాత ప్రపంచాన్ని
పావనముగా తయారుచేయడం వారి కర్తవ్యము. తండ్రి పేరే శివ. పిల్లలను సాలిగ్రామాలు అని
అంటారు. ఇరువురి పూజ జరుగుతుంది. కానీ పూజ చేసేవారికి ఏమీ తెలియదు, కేవలం పూజ చేసే
ఒక ఆచారాన్ని తయారుచేసారు. దేవీలకు కూడా ఫస్ట్ క్లాస్ అయిన వజ్రాలు, ముత్యాల మహళ్ళు
మొదలైనవాటిని నిర్మిస్తారు, పూజిస్తారు, కానీ అక్కడైతే మట్టితో లింగాన్ని
తయారుచేస్తారు, కూల్చేస్తారు. తయారుచేయడానికి పెద్ద శ్రమ పట్టదు. దేవీలను
తయారుచేయడములో శ్రమించవలసి ఉంటుంది. శివుని పూజలో శ్రమ ఏమీ ఉండదు. అన్నీ ఉచితముగా
లభిస్తాయి. రాయి నీటిలో అరుగుతూ, అరుగుతూ గుండ్రంగా అయిపోతుంది. పూర్తిగా
అండాకారముగా చేసేస్తారు. ఆత్మ అండాకారములో ఉంటుందని, అది బ్రహ్మతత్వములో ఉంటుందని,
అందుకే దానిని బ్రహ్మాండము అని అంటారని కూడా చెప్తారు. మీరు బ్రహ్మాండానికి మరియు
విశ్వానికి కూడా యజమానులుగా అవుతారు.
మొట్టమొదట ఒక్క తండ్రి గురించి వివరణ ఇవ్వాలి. శివుడిని తండ్రి అని అంటూ అందరూ
తలచుకుంటారు. అలాగే బ్రహ్మాను కూడా తండ్రి అని అంటారు. వారు ప్రజాపిత అనగా మొత్తం
ప్రజలందరికీ పిత అవుతారు కదా. వారు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ జ్ఞానమంతా
ఇప్పుడు పిల్లలైన మీలో ఉంది. ప్రజాపిత బ్రహ్మా అని చాలామంది అంటారు కానీ యథార్థ
రీతిగా ఎవరికీ తెలియదు. బ్రహ్మా ఎవరి సంతానము? పరమపిత పరమాత్ముని సంతానము అని మీరు
అంటారు. శివబాబా వీరిని దత్తత తీసుకున్నారు అనగా వీరు శరీరధారి అయినట్లే కదా. అందరూ
ఈశ్వరుని సంతానమే, మళ్ళీ ఎప్పుడైతే శరీరము లభిస్తుందో అప్పుడు ప్రజాపిత బ్రహ్మా
ద్వారా దత్తత తీసుకోబడినవారు అని అంటారు. ఇది ఆ దత్తత తీసుకోవడము కాదు. ఆత్మలను
పరమపిత పరమాత్మ దత్తత తీసుకున్నారా? కాదు. వారు మిమ్మల్ని దత్తత తీసుకున్నారు.
ఇప్పుడు మీరు బ్రహ్మాకుమార, కుమారీలు. శివబాబా దత్తత తీసుకోరు. ఆత్మలన్నీ అనాది,
అవినాశీ అయినవి. ఆత్మలందరికీ తమ-తమ శరీరాలు, తమ-తమ పాత్రలు లభించి ఉన్నాయి, వాటిని
అభినయించవలసిందే. ఈ పాత్రలన్నీ అనాదిగా, అవినాశీగా పరంపరగా నడుస్తూ వస్తాయి. వాటికి
ఆది అంత్యాలు ఉండవు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.