06-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఎక్కే కళ యొక్క సమయము,
భారత్ నిరుపేద నుండి షావుకారుగా అవుతుంది, మీరు తండ్రి నుండి సత్యయుగీ రాజ్యాధికారము
యొక్క వారసత్వాన్ని తీసుకోండి’’
ప్రశ్న:-
తండ్రి
యొక్క ఏ టైటిల్ ను శ్రీకృష్ణునికి ఇవ్వలేరు?
జవాబు:-
తండ్రి పేదల
పెన్నిధి. శ్రీకృష్ణుడిని అలా అనరు. వారు చాలా ధనవంతుడు, వారి రాజ్యములో అందరూ
షావుకారులుగా ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు అందరికన్నా నిరుపేదగా
ఉన్నది భారత్. భారత్ నే షావుకారుగా తయారుచేస్తారు. మన భారత్ స్వర్గముగా ఉండేది,
ఇప్పుడు అలా లేదు, మళ్ళీ ఆ విధముగా తయారవ్వనున్నది అని మీరంటారు. పేదల పెన్నిధి
అయిన బాబాయే భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు.
పాట:-
చివరికి నేడు
ఆ రోజు రానే వచ్చింది...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటను విన్నారు. ఆత్మ గుప్తమైనది మరియు శరీరము
ప్రత్యక్షముగా ఉంటుంది. ఆత్మను ఈ కనుల ద్వారా చూడలేము, అది గుప్తముగా ఉంది. ఆత్మ
తప్పకుండా ఉంది, కానీ ఈ శరీరముతో కప్పబడి ఉంది, అందుకే ఆత్మ గుప్తముగా ఉందని అంటారు.
ఆత్మ స్వయంగా అంటుంది - నేను నిరాకారిని, ఇక్కడ సాకారములోకి వచ్చి గుప్తము అయ్యాను.
ఆత్మలది నిరాకారీ ప్రపంచము, అక్కడైతే గుప్తముగా ఉండే విషయమేమీ లేదు. పరమపిత పరమాత్మ
కూడా అక్కడే ఉంటారు, వారిని సుప్రీమ్ అని అంటారు, వారు ఉన్నతోన్నతమైన ఆత్మ, అతీతముగా
ఉండే పరమ ఆత్మ. తండ్రి అంటారు - ఎలాగైతే మీరు గుప్తముగా ఉన్నారో, అలాగే నేను కూడా
గుప్తముగా రావలసి ఉంటుంది. నేను గర్భ జైలులోకి రాను. నాకు శివ అన్న ఒక్క పేరే
కొనసాగుతూ వస్తుంది. నేను ఈ తనువులోకి వచ్చినా కూడా నా పేరు మారదు. వీరి ఆత్మకు
ఏదైతే శరీరము ఉందో, ఆ శరీరము యొక్క పేరు మారుతుంది. నన్ను అయితే శివ అనే అంటారు -
నేను ఆత్మలందరికీ తండ్రిని. ఆత్మలైన మీరు ఈ శరీరములో గుప్తముగా ఉన్నారు, ఈ శరీరము
ద్వారా కర్మలు చేస్తారు. నేను కూడా గుప్తముగా ఉన్నాను. ఆత్మ ఈ శరీరముతో కప్పబడి ఉంది
అని పిల్లలకు ఈ జ్ఞానము ఇప్పుడు లభిస్తుంది. ఆత్మ గుప్తముగా ఉంది, శరీరము
ప్రత్యక్షముగా ఉంది. నేను కూడా అశరీరినే. గుప్తమైన తండ్రి ఈ శరీరము ద్వారా
వినిపిస్తారు. మీరు కూడా గుప్తమైనవారే, శరీరము ద్వారా వింటారు. భారత్ ను మళ్ళీ
నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. మీరు -
మా భారత్ అని అంటారు. ప్రతి ఒక్కరూ తమ-తమ రాష్ట్రాల విషయములో - మా గుజరాత్, మా
రాజస్థాన్ అని అంటారు. మాది-మాది అని అనడము వలన దాని పట్ల మోహము కలుగుతుంది. మన
భారత్ నిరుపేదగా ఉంది అని అందరూ అనుకుంటారు, కానీ మన భారత్ షావుకారుగా ఎప్పుడు
ఉండేది, ఎలా ఉండేది అనేది వారికి తెలియదు. పిల్లలైన మీకు చాలా నషా ఉంటుంది. మన భారత్
చాలా షావుకారుగా ఉండేది, దుఃఖమనే మాటే ఉండేది కాదు. సత్యయుగములో వేరే ఏ ధర్మమూ
ఉండేది కాదు, ఒక్క దేవీ-దేవతా ధర్మమే ఉండేది, ఇది ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచ
చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మంచి రీతిలో అర్థం
చేసుకుంటున్నారు. మన భారత్ చాలా షావుకారుగా ఉండేది. ఇప్పుడు చాలా నిరుపేదగా ఉంది.
ఇప్పుడు మళ్ళీ తండ్రి షావుకారుగా తయారుచేయడానికి వచ్చారు. భారత్ సత్యయుగములో చాలా
షావుకారుగా ఉండేది, అప్పుడు దేవీ-దేవతల రాజ్యముండేది, మరి ఆ రాజ్యము ఏమైపోయింది, ఇది
ఎవ్వరికీ తెలియదు. ఋషులు, మునులు మొదలైనవారు కూడా, మాకు రచయిత మరియు రచనల గురించి
తెలియదు అని అనేవారు. తండ్రి అంటారు, సత్యయుగములో కూడా దేవీ-దేవతలకు రచయిత మరియు
రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉండేది కాదు. మేము మెట్లు దిగుతూ కలియుగములోకి
వెళ్ళిపోతామని - ఒకవేళ దేవతలకు కూడా ఈ జ్ఞానమున్నట్లయితే ఇక వారికి రాజ్యాధికారము
యొక్క సుఖము ఉండదు, చింత కలుగుతుంది. మేము సతోప్రధానముగా ఉండేవారము, మళ్ళీ మేము
సతోప్రధానముగా ఎలా అవ్వాలి అనే చింత మీకు ఉంది. ఆత్మలమైన మనము నిరాకారీ ప్రపంచములో
ఉండేవారము, అక్కడ నుండి మళ్ళీ సుఖధామములోకి ఎలా వచ్చాము, ఈ జ్ఞానము కూడా మీకు ఉంది.
మనము ఇప్పుడు ఎక్కే కళలో ఉన్నాము. ఇది 84 జన్మల మెట్ల వరుస. డ్రామానుసారముగా ప్రతి
ఒక్క పాత్రధారి నంబరువారుగా తమ-తమ సమయమనుసారముగా వచ్చి పాత్రను అభినయిస్తారు. పేదల
పెన్నిధి అని ఎవరిని అంటారు అన్నది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, ఇది ప్రపంచానికి
తెలియదు. పాటలో కూడా విన్నారు - భక్తులందరూ ఏ రోజు కోసమైతే వేచి ఉన్నారో, చివరికి ఆ
రోజు నేడు వచ్చింది... భగవంతుడు ఎప్పుడు వచ్చి భక్తులైన మనల్ని ఈ భక్తి మార్గము
నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్తారు అన్నది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బాబా
ఈ శరీరములోకి మళ్ళీ వచ్చేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు అంటే వారు తప్పకుండా
వస్తారు. నేను శ్రీకృష్ణుడి తనువులోకి వస్తానని కూడా వారు అనరు. అలా కాదు. తండ్రి
అంటారు, శ్రీకృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుంది, వారి అనేక జన్మల అంతిమములో ఇది
అంతిమ జన్మ. ఎవరైతే మొదటి నంబరులో ఉండేవారో, వారిప్పుడు చివరిలో ఉన్నారు, తతత్వమ్ (ఇది
మీకు కూడా వర్తిస్తుంది). నేనైతే సాధారణ తనువులోకి వస్తాను, మీరు 84 జన్మలను ఎలా
అనుభవించారు అన్నది నేను వచ్చి మీకు తెలియజేస్తాను. సిక్కులు కూడా ఏక్ ఓంకార్,
పరమపిత పరమాత్మ అయిన తండ్రి అని భావిస్తారు, వారు తప్పకుండా మనుష్యుల నుండి దేవతలుగా
తయారుచేసేవారు. మరి మనము కూడా దేవతలుగా ఎందుకు అవ్వకూడదు. ఎవరైతే ఇంతకుముందు
దేవతలుగా అయ్యి ఉంటారో, వారు తండ్రికి పూర్తిగా అతుక్కుపోతారు. స్వయాన్ని దేవీ-దేవతా
ధర్మానికి చెందినవారమని ఒక్కరు కూడా భావించరు. ఇతర ధర్మాల చరిత్ర చాలా చిన్నది,
కొందరిది 500 సంవత్సరాల చరిత్ర, మరికొందరిది 1250 సంవత్సరాల చరిత్ర. మీ చరిత్ర 5000
సంవత్సరాలది. దేవతా ధర్మమువారే స్వర్గములోకి వస్తారు, ఇతర ధర్మాల వారు తర్వాతే
వస్తారు. దేవతా ధర్మమువారు కూడా డ్రామానుసారముగా ఇప్పుడు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్
అయిపోయారు. వారు మళ్ళీ కన్వర్ట్ అయ్యి తమ-తమ ధర్మాలలోకి తిరిగి వస్తారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు.
బాబా స్వర్గాన్ని స్థాపన చేసేవారు కావున మేము స్వర్గములో ఎందుకు ఉండము, మేము తండ్రి
నుండి తప్పకుండా వారసత్వాన్ని తీసుకుంటామని మీరు కూడా భావిస్తారు. ఇలా భావించేవారు
మన ధర్మానికి చెందినవారని ఋజువవుతుంది. అలా కానీ వారు ఇక్కడకు రానే రారు. వారు పరాయి
ధర్మములోకి మేము ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కొత్త ప్రపంచమైన సత్యయుగములో దేవతలకు
చాలా సుఖముండేదని, అక్కడ బంగారు మహళ్ళు ఉండేవని పిల్లలైన మీకు తెలుసు. సోమనాథ
మందిరములో ఎంత బంగారముండేది. ఇటువంటి ధర్మము ఇంకేదీ ఉండదు. సోమనాథ మందిరమంతటి భారీ
మందిరము ఇంకేదీ ఉండదు, అందులో చాలా వజ్ర-వైఢూర్యాలుండేవి. బుద్ధుడు మొదలైనవారికి
వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఏమీ ఉండవు. ఏ తండ్రి అయితే పిల్లలైన మిమ్మల్ని ఇంత ఉన్నతముగా
తయారుచేసారో, వారికి మీరు ఎంత గౌరవాన్ని ఇచ్చారు! గౌరవాన్ని ఇవ్వడము జరుగుతుంది కదా.
మంచి కర్మలు చేసి వెళ్ళారని భావిస్తారు. అన్నింటికన్నా మంచి కర్మ పతిత-పావనుడైన
తండ్రియే చేసి వెళ్తారని ఇప్పుడు మీకు తెలుసు. అన్నింటికన్నా ఉత్తమోత్తమ సేవను
అనంతమైన తండ్రే వచ్చి చేస్తారని మీ ఆత్మ అంటుంది. వారు మనల్ని నిరుపేదల నుండి
ధనవంతులుగా, బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఎవరైతే భారత్ ను స్వర్గముగా
తయారుచేస్తారో, వారినిప్పుడు ఎవరూ గౌరవించడము లేదు. ఉన్నతోన్నతమైన మందిరము అని
గాయనము చేయబడిన దానిని దోచుకుని వెళ్ళిపోయారు. లక్ష్మీ-నారాయణుల మందిరాన్ని ఎప్పుడూ
ఎవ్వరూ దోచుకోలేదు. సోమనాథ మందిరాన్ని దోచుకున్నారు. భక్తి మార్గములో కూడా చాలా
ధనవంతులుంటారు. రాజులలో కూడా నంబరువారుగా ఉంటారు కదా. ఎవరైతే ఉన్నత పదవి కలవారు
ఉంటారో, వారికి తక్కువ పదవి వారు గౌరవాన్ని ఇస్తారు. దర్బారులో కూడా నంబరువారుగా
కూర్చుంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఇక్కడ పతిత రాజుల దర్బారు ఉంటుంది. పావన
రాజుల దర్బారు ఎలా ఉంటుంది - వారి వద్ద ఇంత ధనముందంటే వారి ఇళ్ళు కూడా అంత బాగుంటాయి.
తండ్రి మనల్ని చదివిస్తున్నారని, స్వర్గ స్థాపనను చేయిస్తున్నారని ఇప్పుడు మీకు
తెలుసు. మనము స్వర్గము యొక్క మహారాజా-మహారాణులుగా అవుతాము, మళ్ళీ మనము పడిపోతూ,
పడిపోతూ భక్తులుగా అవుతాము, అప్పుడు మొట్టమొదట శివబాబాకు పూజారులుగా అవుతాము. ఎవరైతే
మనల్ని స్వర్గానికి యజమానులుగా చేసారో, వారినే పూజిస్తాము. వారు మనల్ని చాలా
షావుకార్లుగా చేస్తారు. ఇప్పుడు భారత్ ఎంత పేదగా ఉంది, ఏ భూమినైతే ఇంతకుముందు 500
రూపాయలకు తీసుకున్నామో, ఈ రోజు దాని విలువ 5000 రూపాయల కన్నా కూడా ఎక్కువైపోయింది.
ఇవన్నీ కృత్రిమమైన ధరలు. అక్కడైతే భూమికి ధర ఉండదు, ఎవరికి ఎంత కావాలనుకుంటే అంత
తీసుకోవచ్చు. ఎంతో భూమి ఉంటుంది, మధురమైన నదుల వద్ద మీ మహళ్ళు ఉంటాయి. మనుష్యులు
చాలా కొద్దిమందే ఉంటారు. ప్రకృతి దాసిగా ఉంటుంది. ఫలాలు, పుష్పాలు మంచి-మంచివి
లభిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది, అయినా కానీ భోజనము లభించదు.
మనుష్యులు చాలా ఆకలి, దప్పికలతో మరణిస్తుంటారు. పాట వినడముతో మీ రోమాలు
నిక్కబొడుచుకోవాలి. తండ్రిని పేదల పెన్నిధి అని అంటారు. పేదల పెన్నిధి యొక్క
అర్థాన్ని అర్థం చేసుకున్నారు కదా! ఎవరిని షావుకార్లుగా తయారుచేస్తారు? వారు
ఎక్కడికైతే వస్తారో, తప్పకుండా అక్కడున్నవారినే షావుకార్లుగా తయారుచేస్తారు కదా.
మనము పావనము నుండి పతితముగా అవ్వడానికి 5 వేల సంవత్సరాలు పడుతుందని పిల్లలైన మీకు
తెలుసు. ఇప్పుడు మళ్ళీ బాబా వెంటనే పతితము నుండి పావనముగా తయారుచేస్తారు,
ఉన్నతోన్నతముగా తయారుచేస్తారు, ఒక్క సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. బాబా, నేను
మీ వాడిని అని అంటారు. బాబా అంటారు - బిడ్డ, నీవు విశ్వానికి యజమానిగా ఉండేవాడివి.
కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు, ఎంత సంతోషము కలుగుతుంది. కూతురిని చూస్తే
ముఖము కిందకు దిగిపోతుంది. ఇక్కడైతే ఆత్మలందరూ కొడుకులు. 5 వేల సంవత్సరాల క్రితము
మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని ఇప్పుడు తెలిసింది. బాబా మనల్ని అలా
తయారుచేసారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అన్నది
తెలియదు. లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. శివజయంతిని
జరుపుకుంటారు, కేవలం లింగాన్ని పెట్టి పెద్ద-పెద్ద మందిరాలను నిర్మిస్తారు. కానీ
వారు ఎలా వచ్చారు, వచ్చి ఏం చేసారు అన్నది ఏమీ తెలియదు, దీనిని అంధ విశ్వాసము, అంధ
శ్రద్ధ అని అంటారు. మన ధర్మము ఏది, ఎప్పుడు స్థాపనయ్యింది అన్నది వారికి తెలియదు.
ఇతర ధర్మాల వారికి వారి ధర్మము గురించి తెలుసు, బుద్ధుడు ఎప్పుడు వచ్చారు,
తిథి-తారీఖులు ఏమిటి అన్నది కూడా వారికి తెలుసు. శివబాబాకు, లక్ష్మీ-నారాయణులకు
ఎటువంటి తిథి, తారీఖులు లేవు. 5 వేల సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలని
వ్రాసేసారు. లక్షల సంవత్సరాల విషయమనేట్పపటికి ఎవరికి గుర్తుకొస్తుంది? భారత్ లో
దేవీ-దేవతా ధర్మము ఎప్పుడు ఉండేది అనేది అర్థం చేసుకోరు. లక్షల సంవత్సరాల
లెక్కలోనైతే భారత్ జనాభా అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. భారత్ యొక్క భూమి కూడా
అన్నింటికన్నా ఎక్కువగా ఉండాలి. లక్షల సంవత్సరాలలో ఎంతమంది మనుష్యులు జన్మిస్తారు,
ఇప్పటికి లెక్కలేనంతమంది మనుష్యులు అయిపోయి ఉండాలి. కానీ అంతమందైతే లేరు, ఇంకా జనాభా
తగ్గిపోయింది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ విషయాలను
మనుష్యులు విన్నప్పుడు ఏమంటారంటే - ఈ విషయాలనైతే మేము ఎప్పుడూ వినలేదు, అలాగే ఏ
శాస్త్రాలలోనూ చదవలేదు. ఇవి అద్భుతమైన విషయాలు.
ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం చక్రము యొక్క జ్ఞానముంది. వీరు అనేక జన్మల
అంతిమములో కూడా అంతిమములో ఇప్పుడు పతితాత్మగా ఉన్నారు. ఎవరైతే సతోప్రధానముగా
ఉండేవారో వారు ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి.
ఆత్మలైన మీకిప్పుడు శిక్షణ లభిస్తోంది. ఆత్మ చెవుల ద్వారా వింటున్నప్పుడు శరీరము
ఊగుతుంది ఎందుకంటే ఆత్మ వింటుంది కదా. ఆత్మలమైన మనము తప్పకుండా 84 జన్మలు
తీసుకుంటాము, 84 జన్మలలో 84 తల్లిదండ్రులు తప్పకుండా లభించి ఉంటారు, ఇది కూడా లెక్క
కదా. మనము 84 జన్మలు తీసుకుంటామని బుద్ధిలోకి వస్తుంది, అలాగే తక్కువ జన్మలు
తీసుకునేవారు కూడా ఉంటారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. శాస్త్రాలలో ఏమేమి వ్రాసేసారు
అనేది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీ విషయములో కనీసం 84 జన్మలు అని అయినా
అంటారు కానీ నా కోసమైతే లెక్కలేనన్ని, అనేక జన్మలని అంటారు. కణకణములోకి,
రాయిరప్పలలోకి నన్ను తోసేసారు. ఎక్కడ చూసినా నీవే నీవు, కృష్ణుడే కృష్ణుడు అని
అంటారు. మథుర, బృందావనములో ఈ విధముగా అంటూ ఉంటారు. కృష్ణుడే సర్వవ్యాపి అని అంటారు.
రాధ వర్గానికి చెందినవారు ఎక్కడ చూసినా రాధయే రాధ, నీవు రాధయే, నేను రాధయే అని
అంటారు.
ఒక్క తండ్రి మాత్రమే పేదల పెన్నిధి. ఏ భారత్ అయితే అన్నింటికన్నా షావుకారుగా
ఉండేదో, ఇప్పుడది అన్నింటికన్నా పేదదిగా అయ్యింది, అందుకే నేను భారత్ లోకే రావలసి
ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, ఇందులో ఏ మాత్రము తేడా రాదు. డ్రామాలో ఏ
షూటింగ్ అయితే జరిగిపోయిందో, అది యథావిధిగా రిపీట్ అవుతుంది, ఇందులో పైసా అంత తేడా
కూడా రాదు. డ్రామా గురించి కూడా తెలిసి ఉండాలి. డ్రామా అంటే డ్రామా. అవి హద్దులోని
డ్రామాలు, ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామా యొక్క ఆదిమధ్యాంతాలు ఎవ్వరికీ
తెలియవు. పేదల పెన్నిధి అని నిరాకార భగవంతుడినే అనుకుంటారు, శ్రీకృష్ణుడిని అనుకోరు.
శ్రీకృష్ణుడైతే ధనవంతుడిగా, సత్యయుగ రాకుమారుడిగా అవుతారు. భగవంతునికైతే తనదంటూ
శరీరము లేదు. వారు వచ్చి పిల్లలైన మిమ్మల్ని ధనవంతులుగా తయారుచేస్తారు, మీకు
రాజయోగము యొక్క శిక్షణనిస్తారు. చదువుతో బ్యారిస్టరు మొదలైనవారిగా అయి, ఆ తర్వాత
సంపాదిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని ఇప్పుడు చదివిస్తున్నారు. మీరు భవిష్యత్తులో
నరుని నుండి నారాయణునిగా అవుతారు. మీ జన్మ అయితే జరుగుతుంది కదా. అంతేకానీ స్వర్గము
సముద్రము నుండి బయటకు వస్తుందని కాదు. శ్రీకృష్ణుడు కూడా జన్మ తీసుకున్నారు కదా. ఆ
సమయములో కంసపురి మొదలైనవేవీ లేవు. శ్రీకృష్ణుని పేరు ఎంతగా గాయనము చేయబడుతుంది, అతని
తండ్రికి అంతటి గాయనము లేదు. అతని తండ్రి ఎక్కడ ఉన్నారు? తప్పకుండా శ్రీకృష్ణుడు
ఎవరో ఒకరికి కుమారుడు కదా. శ్రీకృష్ణుడు జన్మ తీసుకున్నప్పుడు కొంతమంది పతితులు కూడా
ఉంటారు. ఆ పతితులు కూడా పూర్తిగా సమాప్తమైపోయినప్పుడు శ్రీకృష్ణుడు సింహాసనముపై
కూర్చుంటారు, తన రాజ్యాధికారాన్ని తీసుకుంటారు, అప్పటినుండే వారి కాలము
ప్రారంభమవుతుంది. లక్ష్మీ-నారాయణుల నుండే ఆ కాలము ప్రారంభమవుతుంది. వీరి రాజ్యము
ఇంత సమయము ఉంటుంది, ఆ తర్వాత వారిది ఇంత సమయము ఉంటుంది అని మీరు పూర్తి లెక్కను
వ్రాస్తారు. ఈ కల్పము ఆయువు పెద్దదిగా ఉండదని మనుష్యులు అర్థం చేసుకుంటారు. 5 వేల
సంవత్సరాల పూర్తి లెక్క ఉంది. ఇది పిల్లలైన మీ బుద్ధిలోకి వస్తుంది కదా. నిన్న మనము
స్వర్గానికి యజమానులుగా ఉండేవారము, తండ్రియే మనల్ని అలా తయారుచేసారు, అందుకే మనము
వారి శివజయంతిని జరుపుకుంటున్నాము. మీకు అందరి గురించి తెలుసు. క్రైస్టు, గురునానక్
మొదలైనవారు మళ్ళీ ఎప్పుడు వస్తారు అన్న జ్ఞానము మీకు ఉంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు
యథావిధిగా రిపీట్ అవుతాయి. ఈ చదువు ఎంత సహజమైనది. మీకు స్వర్గము గురించి తెలుసు.
తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది. భారత్ అవినాశీ ఖండము. భారత్ కు ఉన్నంత మహిమ
ఇంకెవ్వరికీ ఉండదు. అందరినీ పతితుల నుండి పావనముగా తయారుచేసేవారు ఒక్క తండ్రి
మాత్రమే. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ అన్ని చింతలను
వదిలేయాలి. సతోప్రధానముగా అవ్వాలన్న ఒక్క చింతనే పెట్టుకోవాలి.
2. పేదల పెన్నిధి అయిన బాబా భారత్ ను నిరుపేద నుండి షావుకారుగా తయారుచేయడానికి
వచ్చారు, వారికి పూర్తి-పూర్తి సహాయకులుగా అవ్వాలి. తమ కొత్త ప్రపంచాన్ని గుర్తు
చేసుకుంటూ సదా సంతోషముగా ఉండాలి.
వరదానము:-
హృదయములో సదా ఒక్క రాముడినే ఇముడ్చుకొని సత్యమైన సేవను చేసే
మాయాజీత్, విజయీ భవ
హనుమంతుడి విశేషతను ఏమని చూపిస్తారంటే - అతను సదా
సేవాధారిగా, మహావీరునిగా ఉండేవారు, అందుకే స్వయము కాలిపోకుండా తోక ద్వారా లంకను
కాల్చేసారు అని. అలాగే ఇక్కడ కూడా ఎవరైతే సదా సేవాధారిగా ఉంటారో, వారే మాయ యొక్క
అధికారాన్ని సమాప్తము చేయగలుగుతారు. ఎవరైతే సేవాధారి కారో, వారు మాయా రాజ్యాన్ని
కాల్చలేరు. హనుమంతుని హృదయములో సదా ఒక్క రాముడే నివసించేవారు, అదే విధముగా తండ్రి
తప్ప ఇంకెవ్వరూ హృదయములో ఉండకూడదు, మీ దేహపు స్మృతి కూడా ఉండకూడదు, అప్పుడే
మాయాజీతులుగా, విజయులుగా అవుతారు.
స్లోగన్:-
ఏ
విధముగా ఆత్మ మరియు శరీరము కంబైండ్ గా ఉన్నాయో, అదే విధముగా మీరు తండ్రితోపాటు
కంబైండ్ గా ఉండండి.
అవ్యక్త ప్రేరణలు -
ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి
సంగఠనలో ప్రతి ఒక్కరి
విశేషతలను చూడటము, విశేషతలనే గ్రహించటము మరియు బలహీనతలను తొలగించే ప్రయత్నము
చెయ్యటము - ఇదే ఏకతతో కూడిన సంగఠనను ధృఢము చేసేందుకు విధి. ఏ విధముగానైతే మీ అందరి
యొక్క లేవడము, మాట్లాడటము, నడవటము ఒకే విధముగా ఉన్నాయో, అందరివీ ఒకే విధమైన మాటలు,
ఒకే గతి, ఒకే రీతి, ఒకే నీతి ఉన్నాయో, అదే విధముగా సంస్కారాలు కూడా సమానముగా
కనిపించాలి. భిన్నత్వము ఉన్నప్పటికీ పరస్పరము ఒకరి పట్ల ఒకరు విశ్వాసము ఉంచి, అందరి
ఆలోచనలకు గౌరవాన్ని ఇవ్వండి, ఇదే ఏకతకు ఆధారము.
| | | |