06-03-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఏ విధంగా ఆత్మలైన మీకు ఈ శరీరము రూపీ సింహాసనము లభించిందో, అలాగే తండ్రి కూడా ఈ దాదా సింహాసనముపై విరాజమానమై ఉన్నారు, తండ్రికి తనదంటూ సింహాసనము లేదు’’

ప్రశ్న:-
ఏ పిల్లలకైతే ఈశ్వరీయ సంతానము అనే స్మృతి ఉంటుందో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
వారి సత్యమైన ప్రేమ ఒక్క తండ్రిపై ఉంటుంది. ఈశ్వరీయ సంతానము ఎప్పుడూ కొట్లాడరు, గొడవపడరు. వారికి ఎప్పుడూ చెడు దృష్టి ఉండదు. బ్రహ్మాకుమార, కుమారీలుగా అనగా సోదర, సోదరీలుగా అయినప్పుడు ఇక చెడు దృష్టి కలగడానికి వీలు లేదు.

పాట:-
ఆకాశ సింహాసనాన్ని వదిలి రా...

ఓంశాంతి
బాబా తన ఆకాశ సింహాసనాన్ని వదిలి ఇప్పుడు దాదా తనువును తన సింహాసనముగా చేసుకున్నారని, ఆ సింహాసనాన్ని వదిలి ఇక్కడికి వచ్చి కూర్చున్నారని ఇప్పుడు పిల్లలకు తెలుసు. ఈ ఆకాశ తత్వము జీవాత్మల సింహాసనము. ఆత్మల సింహాసనము ఆ మహాతత్వము, అక్కడ ఆత్మలైన మీరు శరీరము లేకుండా ఉండేవారు. ఏ విధంగా ఆకాశములో నక్షత్రాలు ఉన్నాయి కదా, అలాగే ఆత్మలైన మీరు కూడా చాలా చిన్న-చిన్నగా అక్కడ ఉంటారు. ఆత్మను దివ్వ దృష్టి లేకుండా చూడలేరు. పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానము ఉంది, ఏ విధంగా నక్షత్రము ఎంతో చిన్నగా ఉంటుందో, అలా ఆత్మలు కూడా బిందువులా ఉంటాయి. ఇప్పుడు తండ్రి తన సింహాసనాన్ని అయితే వదిలేశారు. తండ్రి అంటారు, ఆత్మలైన మీరు కూడా ఆ సింహాసనాన్ని వదిలి ఇక్కడ ఈ శరీరాన్ని మీ సింహాసనముగా చేసుకున్నారు. నాకు కూడా తప్పకుండా శరీరము కావాలి. నన్ను పిలవడమే పాత ప్రపంచములోకి పిలుస్తారు. దూరదేశ నివాసి... అన్న పాట ఉంది కదా. ఆత్మలైన మీరు ఎక్కడైతే ఉంటారో అదే బాబా మరియు ఆత్మలైన మీ యొక్క దేశము. ఆ తర్వాత మీరు స్వర్గములోకి వెళ్తారు, దానిని బాబా స్థాపన చేస్తారు. బాబా స్వయం ఆ స్వర్గములోకి రారు. వారు వాణి నుండి అతీతముగా, వానప్రస్థములోకి వెళ్ళి ఉంటారు. స్వర్గములో వారి అవసరము లేదు. వారు సుఖ-దుఃఖాలకు అతీతుడు కదా. మీరైతే సుఖములోకి వస్తారు, అలాగే దుఃఖములోకి కూడా వస్తారు.

బ్రహ్మాకుమార, కుమారీలైన మనము సోదర, సోదరీలమని ఇప్పుడు మీకు తెలుసు. ఒకరి పట్ల ఒకరికి చెడు దృష్టితో కూడిన ఆలోచన కూడా రాకూడదు. ఇక్కడైతే మీరు తండ్రి సమ్ముఖములో కూర్చున్నారు, మీరు పరస్పరము సోదరీ, సోదరులు. పవిత్రముగా ఉండేందుకు ఈ యుక్తి ఎలా ఉందో చూడండి. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. అందరికీ తండ్రి ఒక్కరే కావున అందరూ పిల్లలైనట్లే కదా. పిల్లలు పరస్పరము ఒకరితో ఒకరు గొడవపడకూడదు, కొట్లాడుకోకూడదు. ఈ సమయములో మనము ఈశ్వరీయ సంతానము అని మీకు తెలుసు, దీనికి ముందు ఆసురీ సంతానముగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ సంగమములో ఈశ్వరీయ సంతానముగా అయ్యాము, మళ్ళీ సత్యయుగములో దైవీ సంతానముగా అవుతాము. ఈ చక్రము గురించి పిల్లలకు తెలిసింది. మీరు బ్రహ్మాకుమార, కుమారీలు కావున ఎప్పుడూ చెడు దృష్టి కలగదు. సత్యయుగములో చెడు దృష్టి అనేది ఉండదు. చెడు దృష్టి రావణ రాజ్యములో ఉంటుంది. పిల్లలైన మీకు ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకెవరి స్మృతి ఉండకూడదు. అందరికన్నా ఎక్కువగా ఒక్క తండ్రి పట్ల ప్రేమ ఏర్పడాలి. నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు మీరు శివాలయములోకి వెళ్ళాలి. శివబాబా స్వర్గ స్థాపనను చేస్తున్నారు. అర్ధకల్పము రావణ రాజ్యము నడిచింది, దానితో దుర్గతిని పొందారు. అసలు రావణుడు ఎవరు, అతడిని ఎందుకు కాలుస్తారు, ఇది కూడా ఎవరికీ తెలియదు. శివబాబా గురించి కూడా తెలియదు. ఏ విధంగా దేవీలను అలంకరించి, పూజించి మళ్ళీ నీటిలో ముంచేస్తారో, అలా శివబాబాది కూడా మట్టి లింగము తయారుచేసి, పూజ మొదలైనవి చేసి, ఆ తర్వాత మట్టిని మట్టిలో కలిపేస్తారు. అలాగే రావణుడిని కూడా తయారుచేసి తర్వాత కాల్చేస్తారు. ఏమీ అర్థం చేసుకోరు. ఇప్పుడున్నది రావణ రాజ్యమని, రామ రాజ్యము స్థాపన అవ్వనున్నదని అంటారు కూడా. గాంధీ కూడా రామ రాజ్యాన్ని కోరుకునేవారు అంటే దాని అర్థం ఇప్పుడు రావణ రాజ్యము ఉన్నట్లు కదా. ఏ పిల్లలైతే ఈ రావణ రాజ్యములో కామచితిపై కూర్చుని కాలిపోయారో, తండ్రి వచ్చి వారిపై మళ్ళీ జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు, అందరి కళ్యాణము చేస్తారు. ఏ విధంగా బీడు భూమిపై వర్షము పడడముతో గడ్డి మొలుస్తుంది కదా, అలా మీపై కూడా జ్ఞాన వర్షము పడని కారణముగా ఎంత నిరుపేదలుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ జ్ఞాన వర్షము కురుస్తుంది, దానితో మీరు విశ్వానికి యజమానులుగా అయిపోతారు. పిల్లలైన మీరు గృహస్థ వ్యవహారములో ఉంటున్నా కానీ లోలోపల ఎంతో సంతోషము ఉండాలి. ఏ విధంగా కొందరు నిరుపేద పిల్లలు చదువుకున్నప్పుడు, వారు ఆ చదువు ద్వారా బ్యారిస్టర్లు మొదలైనవారిగా అవుతారు. అప్పుడు వారు కూడా పెద్ద-పెద్దవారితో కూర్చుంటారు, తింటారు, తాగుతారు. ఆదివాసి స్త్రీ యొక్క విషయము కూడా శాస్త్రాలలో ఉంది కదా.

ఎవరైతే అందరికంటే ఎక్కువ భక్తి చేస్తారో, వారే వచ్చి అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని తీసుకుంటారు అని పిల్లలైన మీకు తెలుసు. ప్రారంభము నుండి మొదలుకుని అందరికంటే ఎక్కువ భక్తిని మనమే చేసాము. కావున మనల్నే బాబా అందరికంటే ముందు స్వర్గములోకి పంపిస్తారు. ఇది జ్ఞానయుక్తమైన, యథార్థమైన విషయము. తప్పకుండా మనమే పూజ్యులుగా ఉండేవారము, మళ్ళీ మనమే పూజారులుగా అవుతాము. కిందకు దిగుతూ వస్తాము. పిల్లలకు జ్ఞానమంతా అర్థం చేయించడము జరుగుతుంది. ఈ సమయములో ఈ మొత్తము ప్రపంచమంతా నాస్తికులుగా ఉన్నారు, తండ్రి గురించి తెలియదు. మాకు తెలియదు, తెలియదు అని అనేస్తారు. మున్ముందు ఈ సన్యాసులు మొదలైనవారంతా తప్పకుండా వచ్చి ఆస్తికులుగా అవుతారు. ఏదో ఒక సన్యాసి వచ్చినంతమాత్రాన అందరూ అతనిపై విశ్వాసముంచరు కదా. ఇతనిపై బి.కె.లు ఏదో మాయ చేసారు అని అంటారు. అతని శిష్యుడిని వారి ఆసనముపై కూర్చోబెట్టి, అతడిని పంపించేస్తారు. అలా ఎంతోమంది సన్యాసులు మీ వద్దకు వచ్చారు, తర్వాత మాయమైపోతారు. ఇది చాలా అద్భుతమైన డ్రామా. ఇప్పుడు పిల్లలైన మీకు ఆది నుండి మొదలుకుని అంతిమము వరకూ మొత్తమంతా తెలుసు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా ధారణ చేయగలుగుతారు. తండ్రి వద్ద మొత్తము జ్ఞానమంతా ఉంది, అలాగే మీ వద్ద కూడా ఉండాలి. రోజురోజుకు ఎన్ని సెంటర్లు తెరవబడుతూ ఉంటాయి. పిల్లలు చాలా దయార్ద్ర హృదయులుగా అవ్వాలి. తండ్రి అంటారు, మీపై మీరు కూడా దయార్ద్ర హృదయులుగా అవ్వండి. నిర్దయులుగా అవ్వకండి. మీపై మీరు దయ చూపించుకోవాలి. అది ఎలా? అది కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తూ పతితుల నుండి పావనులుగా అవ్వాలి. ఇక మళ్ళీ ఎప్పుడూ పతితులుగా అయ్యే పురుషార్థము చేయకూడదు. దృష్టి చాలా మంచిగా ఉండాలి. బ్రాహ్మణులైన మనము ఈశ్వరీయ సంతానము. ఈశ్వరుడు మనల్ని దత్తత తీసుకున్నారు కదా. ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. మొదట సూక్ష్మవతనవాసి ఫరిశ్తాగా అవుతారు. ఇప్పుడు మీరు ఫరిశ్తాలుగా అవుతున్నారు. సూక్ష్మవతనము యొక్క రహస్యాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు. ఇక్కడ ఉన్నది టాకీ (శబ్దము), సూక్ష్మవతనములో ఉన్నది మూవీ (సైగలు), మూలవతనములో ఉన్నది సైలెన్స్. సూక్ష్మవతనము ఫరిశ్తాలకు చెందినది. దెయ్యానికి నీడ వంటి శరీరము ఉంటుంది కదా. ఆత్మకు శరీరము లభించకపోతే అది భ్రమిస్తూ ఉంటుంది, దానిని దెయ్యము అని అంటారు. దానిని ఈ కళ్ళ ద్వారా కూడా చూడవచ్చు. కానీ వీరు సూక్ష్మవతనవాసీ ఫరిశ్తాలు. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవలసినవి. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము - వీటి గురించి మీకు జ్ఞానము ఉంది. నడుస్తూ-తిరుగుతూ మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉండాలి. వాస్తవానికి మనము మూలవతనవాసులము. ఇప్పుడు మనము వయా సూక్ష్మవతనము అక్కడికి వెళ్తాము. బాబా సూక్ష్మవతనాన్ని ఈ సమయములోనే రచిస్తారు. మొదట సూక్ష్మము, ఆ తర్వాత స్థూలము కావాలి. ఇప్పుడు ఇది సంగమయుగము. దీనిని ఈశ్వరీయ యుగము అని అంటారు, దానిని దైవీ యుగము అని అంటారు. పిల్లలైన మీకు ఎంత సంతోషము ఉండాలి. చెడు దృష్టి కలిగితే ఇక ఉన్నత పదవిని పొందలేరు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు కదా. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది మర్చిపోకూడదు. మీరు సాంగత్య దోషములోకి వచ్చి మర్చిపోతారు. హంసలైన మీరు ఈశ్వరీయ సంతానము. మీకు ఎవరి పట్ల ఆంతరికముగా మోహము కలగకూడదు. ఒకవేళ మోహము కలిగితే మోహము కలిగిన కోతి అని అంటారు. మీ వృత్తియే అందరినీ పావనముగా తయారుచేయటము. మీరు విశ్వాన్ని స్వర్గముగా తయారుచేసేవారు. ఆ రావణుడి ఆసురీ సంతానమెక్కడ, ఈశ్వరీయ సంతానమైన మీరెక్కడ. పిల్లలైన మీరు మీ అవస్థను ఏకరసముగా తయారుచేసుకునేందుకు అన్నీ చూస్తూ కూడా చూడనట్లుగా ఉండాలి, ఈ అభ్యాసము చేయాలి. ఇందులో బుద్ధిని ఏకరసముగా ఉంచుకోవడమనేది ధైర్యముతో కూడిన విషయము. పర్ఫెక్ట్ గా అవ్వడానికి కష్టపడవలసి ఉంటుంది. సంపూర్ణముగా అవ్వడానికి సమయము కావాలి. ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో, అప్పుడు ఆ దృష్టి స్థిరమవుతుంది, అప్పటివరకూ ఏదో ఒక ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. ఇందులో పూర్తిగా అతీతముగా ఉండవలసి ఉంటుంది. లైన్ క్లియర్ గా ఉండాలి. మీరు చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటారు, ఇటువంటి అభ్యాసము ఎవరికైతే ఉంటుందో, వారే ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు అటువంటి అవస్థ ఇంకా లేదు. సన్యాసులైతే ఈ విషయాలను అర్థం కూడా చేసుకోరు. ఇక్కడైతే చాలా శ్రమించవలసి ఉంటుంది. మనము కూడా ఈ పాత ప్రపంచాన్ని సన్యసించి కూర్చున్నాము అని మీకు తెలుసు. మనమైతే ఇప్పుడు ఇక స్వీట్ సైలెన్స్ హోమ్ (మధురమైన నిశ్శబ్దమైన ఇంటికి) వెళ్ళాలి. మీ బుద్ధిలో ఎంతైతే ఉందో, అంతగా ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలని మీకు మాత్రమే తెలుసు. శివ భగవానువాచ అని కూడా ఉంది - వారు పతిత-పావనుడు, ముక్తిప్రదాత, మార్గదర్శకుడు. కృష్ణుడేమీ మార్గదర్శకుడు కాదు. ఈ సమయములో మీరు కూడా అందరికీ మార్గాన్ని తెలియజేయడము నేర్చుకుంటున్నారు, అందుకే మీకు పాండవులు అన్న పేరు పెట్టడము జరిగింది. మీరు పాండవుల సేన. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అయ్యారు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలని, ఈ పాత శరీరాన్ని వదలాలని ఇప్పుడు మీకు తెలుసు. సర్పము ఉదాహరణ, భ్రమరము ఉదాహరణ, ఇవన్నీ ఈ సమయములో మీకు చెందినవే. మీరు ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు. వారైతే ఈ వ్యాపారము చేయలేరు. ఇది స్మశానవాటికని, ఇప్పుడు మళ్ళీ ఇది పరిస్తాన్ గా అవ్వనున్నదని మీకు తెలుసు.

మీ కొరకు అన్ని రోజులు లక్కీయే. పిల్లలైన మీరు సదా లక్కీయే (అదృష్టవంతులు). గురువారము రోజున పిల్లలను స్కూల్లో కూర్చోబెడతారు. ఈ సాంప్రదాయము నడుస్తూ వస్తోంది. మిమ్మల్ని ఇప్పుడు వృక్షపతి చదివిస్తున్నారు. మీ ఈ బృహస్పతి దశ జన్మజన్మాంతరాలు నడుస్తుంది. ఇది అనంతమైన దశ. భక్తి మార్గములో హద్దులలోని దశలు నడుస్తూ ఉంటాయి, ఇప్పుడు ఉన్నది అనంతమైన దశ. కావున పూర్తిగా కృషి చేయాలి. కేవలం ఒక్క లక్ష్మీ-నారాయణులు మాత్రమే ఉండరు కదా, వారి రాజ్య వంశము ఉంటుంది కదా. తప్పకుండా ఎంతోమంది రాజ్యము చేస్తూ ఉండవచ్చు. లక్ష్మీ-నారాయణులది సూర్యవంశీ రాజ్యము నడిచింది, ఈ విషయాలు కూడా మీ బుద్ధిలో ఉన్నాయి. అక్కడ రాజ్య తిలకము ఏ విధంగా ఇస్తారో కూడా పిల్లలైన మీకు సాక్షాత్కారము కలిగింది. సూర్యవంశీయులు తర్వాత చంద్రవంశీయులకు ఏ విధంగా రాజ్యాన్ని ఇస్తారు. తల్లిదండ్రులు పిల్లల కాళ్లను కడిగి రాజ్యతిలకాన్ని ఇస్తారు, రాజ్యభాగ్యాన్ని ఇస్తారు. ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి, ఇందులో పిల్లలైన మీరు తికమకపడవలసిన అవసరము లేదు. మీరు తండ్రిని స్మృతి చేయండి, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి మరియు ఇతరులను కూడా తయారుచెయ్యండి. మీరు బ్రహ్మా ముఖవంశావళి, స్వదర్శన చక్రధారీ, సత్యమైన బ్రాహ్మణులు. శాస్త్రాలలో స్వదర్శన చక్రముతో ఎన్ని హింసలను చూపించారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు సత్యమైన గీతను వినిపిస్తున్నారు. దీనిని పూర్తిగా కంఠస్థము చేసేయ్యాలి. ఇది ఎంత సహజమైనది. మీ సంబంధమంతా గీతతోనే ఉంది. గీతలో జ్ఞానము కూడా ఉంది, అలాగే యోగము కూడా ఉంది. మీరు కూడా ఒకే పుస్తకము తయారుచేయాలి. యోగము పుస్తకాన్ని వేరుగా ఎందుకు తయారుచేయాలి. కానీ ఈ రోజుల్లో యోగానికి ఎంతో పేరు ఉంది, అందుకే యోగము అన్న పేరు పెడతారు, తద్వారా మనుష్యులు వచ్చి అర్థం చేసుకుంటారు. యోగము ఒక్క తండ్రితోనే జోడించాలి అన్న విషయాన్ని చివరికి అర్థం చేసుకుంటారు. ఎవరైతే వింటారో వారు తిరిగి తమ ధర్మములోకి వచ్చి ఉన్నత పదవిని పొందుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మీపై మీరే దయ చూపించుకోవాలి, మీ దృష్టిని చాలా మంచిగా, పవిత్రముగా ఉంచుకోవాలి. ఈశ్వరుడు మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేందుకు దత్తత తీసుకున్నారు, అందుకే పతితముగా అయ్యే ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు.

2. సంపూర్ణ కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు సదా ఉపరామముగా ఉండే అభ్యాసము చేయాలి. ఈ ప్రపంచములో అన్నీ చూస్తూ కూడా చూడకూడదు. ఈ అభ్యాసముతోనే అవస్థను ఏకరసముగా తయారుచేసుకోవాలి.

వరదానము:-
ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేసుకునే సర్వ ఖజానాలతో సంపన్న మరియు తృప్త ఆత్మా భవ

ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో ఉంటూ ప్రతి అడుగు వేస్తారో వారు అడుగడుగులోనూ పదమాల సంపాదనను జమ చేసుకుంటారు. ఈ సంగమములోనే పదమాల సంపాదన యొక్క గని లభిస్తుంది. సంగమయుగము జమ చేసుకునే యుగము. ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఒక్క అడుగు కూడా అనగా ఒక్క క్షణము కూడా జమ అవ్వకుండా పోకూడదు అనగా వ్యర్థమవ్వకూడదు. సదా ఖజానా నిండుగా ఉండాలి. అప్రాప్తి అనే వస్తువేదీ లేదు... అనే ఇటువంటి సంస్కారము ఉండాలి. ఎప్పుడైతే ఈ సమయములో ఈ విధంగా తృప్తిగా మరియు సంపన్న ఆత్మగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో తరగని ఖజానాలకు యజమానులుగా అవుతారు.

స్లోగన్:-
ఏ విషయములోనైనా అప్సెట్ అయ్యేందుకు (అలజడి చెందేందుకు) బదులుగా నాలెడ్జ్ ఫుల్ అనే సీట్ పై సెట్ అయి ఉండండి.

మాతేశ్వరిగారి అమూల్య మహావాక్యాలు

‘‘అర్ధ కల్పము జ్ఞానము బ్రహ్మా యొక్క పగలు మరియు అర్ధ కల్పము భక్తి మార్గము బ్రహ్మా యొక్క రాత్రి’’

అర్ధకల్పము బ్రహ్మా యొక్క పగలు, అర్ధకల్పము బ్రహ్మా యొక్క రాత్రి, ఇప్పుడు రాత్రి పూర్తయ్యి పగలు రానున్నది. ఇప్పుడు పరమాత్మ వచ్చి అంధకారము యొక్క అంతము చేసి ప్రకాశము యొక్క ఆది చేస్తారు, జ్ఞానము ద్వారా ప్రకాశము, భక్తి ద్వారా అంధకారము కలుగుతుంది. పాటలో కూడా అంటారు - ఈ పాపపు ప్రపంచము నుండి దూరముగా ఎక్కడికైనా తీసుకువెళ్ళండి, మనసు ప్రశాంతతను పొందే చోటుకు తీసుకువెళ్ళండి... ఇది ప్రశాంతత లేని ప్రపంచము, ఇక్కడ ప్రశాంతత లేదు. ముక్తిలో ప్రశాంతత లేదు, అశాంతి లేదు. సత్య, త్రేతాయుగాలు ప్రశాంతమయ ప్రపంచము, ఆ సుఖధామాన్ని అందరూ తలచుకుంటారు. మరి ఇప్పుడు మీరు ప్రశాంతమయమైన ప్రపంచములోకి వెళ్తున్నారు, అక్కడకు ఎటువంటి అపవిత్ర ఆత్మ వెళ్ళలేరు, వారు చివరిలో ధర్మరాజు నుండి శిక్షలు అనుభవించి కర్మబంధనాల నుండి ముక్తులై శుద్ధ సంస్కారాలను తీసుకువెళ్తారు ఎందుకంటే అక్కడ అశుద్ధ సంస్కారాలూ ఉండవు, పాపాలూ ఉండవు. ఆత్మ ఎప్పుడైతే తన అసలైన తండ్రిని మర్చిపోతుందో, అప్పుడు గెలుపు-ఓటములతో కూడిన ఈ తికమక దారుల అనాది ఆట తయారైంది, అందుకే మనము ఈ సర్వశక్తివంతుడైన పరమాత్మ ద్వారా శక్తిని తీసుకుని వికారాలపై విజయాన్ని పొంది 21 జన్మల కొరకు రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము. అచ్ఛా! ఓం శాంతి!

అవ్యక్త ప్రేరణలు - సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ ను (సంస్కృతిని) అలవరచుకోండి

మీ మాటలలో స్నేహము కూడా ఉండాలి, మధురత మరియు మహానత కూడా ఉండాలి, సత్యత కూడా ఉండాలి కానీ స్వరూపములో నమ్రత కూడా ఉండాలి. నిర్భయులుగా అయ్యి అథారిటీతో మాట్లాడండి కానీ మాటలు మర్యాదపూర్వకముగా ఉండాలి - ఈ రెండు విషయాల బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కడైతే బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతము కనిపిస్తుంది మరియు ఆ మాటలు కటువుగా ఉండవు, మధురముగా అనిపిస్తాయి, కనుక అథారిటీ మరియు నమ్రత, ఈ రెండింటి బ్యాలెన్స్ యొక్క అద్భుతాన్ని చూపించండి. ఇదే తండ్రి ప్రత్యక్షతకు సాధనము.