06-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బాబా దృష్టి హద్దు మరియు అనంతము నుండి కూడా అతీతంగా వెళ్తుంది, మీరు కూడా హద్దు (సత్యయుగం), అనంతము (కలియుగం) నుండి అతీతంగా వెళ్ళాలి’’

ప్రశ్న:-
ఉన్నతోన్నతమైన జ్ఞాన రత్నాల ధారణ ఏ పిల్లలకు బాగా జరుగుతుంది?

జవాబు:-
ఎవరి బుద్ధియోగమైతే ఒక్క తండ్రితోనే ఉంటుందో, ఎవరైతే పవిత్రంగా అయ్యారో, వారికి ఈ రత్నాల ధారణ బాగా జరుగుతుంది. ఈ జ్ఞానం కొరకు శుద్ధమైన పాత్ర కావాలి. తప్పుడు సంకల్పాలు కూడా సమాప్తమైపోవాలి. తండ్రితో యోగాన్ని జోడిస్తూ, జోడిస్తూ పాత్ర బంగారముగా అవ్వాలి, అప్పుడే రత్నాలు నిలవగలుగుతాయి.

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని ప్రతిరోజూ అర్థం చేయిస్తారు. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యముల ఈ సృష్టి చక్రము తయారై ఉందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. బుద్ధిలో ఈ జ్ఞానం ఉండాలి. పిల్లలైన మీరు హద్దు మరియు అనంతము నుండి అతీతంగా వెళ్ళాలి. తండ్రి అయితే హద్దు మరియు అనంతము నుండి అతీతంగా ఉన్నారు. దాని అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. జ్ఞానము, భక్తి, ఆ తర్వాత వైరాగ్యము అన్న ఈ టాపిక్ కూడా అర్థం చేయించాలి. జ్ఞానాన్ని పగలు అని అంటారు, అప్పుడు కొత్త ప్రపంచం ఉంటుంది. అందులో ఈ భక్తి అజ్ఞానము ఉండదు. అది హద్దు ప్రపంచము ఎందుకంటే అక్కడ చాలా కొద్దిమందే ఉంటారు, ఆ తర్వాత మెల్లమెల్లగా వృద్ధి జరుగుతుంది. సగం సమయం తర్వాత భక్తి ప్రారంభమవుతుంది. అక్కడ సన్యాస ధర్మము ఉండనే ఉండదు. సన్యాసము లేక త్యాగము అక్కడ ఉండదు. ఆ తర్వాత సృష్టి వృద్ధి జరుగుతుంది. పై నుండి ఆత్మలు కిందకు వస్తూ ఉంటారు. ఇక్కడ వృద్ధి జరుగుతూ ఉంటుంది. హద్దు నుండి ప్రారంభమవుతుంది, అనంతములోకి వెళ్తుంది. తండ్రి దృష్టి అయితే హద్దు మరియు అనంతమును కూడా దాటి అతీతంగా వెళ్తుంది. హద్దులో ఎంత తక్కువమంది పిల్లలు ఉంటారు, ఆ తర్వాత రావణ రాజ్యములో ఎంత వృద్ధి జరుగుతుంది అనేది తెలుసు. ఇప్పుడు మీరు హద్దు మరియు అనంతము నుండి కూడా అతీతంగా వెళ్ళాలి. సత్యయుగంలో ఎంత చిన్న ప్రపంచం ఉంది. అక్కడ సన్యాసము లేక వైరాగ్యము మొదలైనవేవీ ఉండవు. తర్వాత ద్వాపరము నుండి మొదలుకుని ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. సన్యాస ధర్మము కూడా ఉంటుంది, వారు ఇళ్ళూ, వాకిళ్ళను సన్యసిస్తారు. అందరినీ తెలుసుకోవాలి కదా. దానిని హఠయోగము మరియు హద్దు సన్యాసము అని అంటారు. అక్కడ కేవలం ఇళ్ళూ, వాకిళ్ళను వదిలి అడవులలోకి వెళ్తారు. ద్వాపరము నుండి భక్తి ప్రారంభమవుతుంది. అసలు అక్కడ జ్ఞానమే ఉండదు. జ్ఞానము అనగా సత్య, త్రేతా యుగాలు, సుఖము. భక్తి అనగా అజ్ఞానము మరియు దుఃఖము. ఇది బాగా అర్థం చేయించవలసి ఉంటుంది. మళ్ళీ దుఃఖము మరియు సుఖము నుండి అతీతముగా వెళ్ళాలి. హద్దు మరియు అనంతము నుండి అతీతంగా వెళ్ళాలి. సముద్రము ఎంతవరకూ ఉంది, ఆకాశము ఎంతవరకూ ఉంది అని మనుష్యులు పరిశీలిస్తూ ఉంటారు కదా. ఎంతగానో ప్రయత్నిస్తారు కానీ దాని అంతాన్ని పొందలేరు. విమానాలలో వెళ్తారు కానీ అందులో కూడా మళ్ళీ తిరిగి రాగలిగేందుకు సరిపడా పెట్రోల్ కావాలి కదా. చాలా దూరదూరాల వరకూ వెళ్తారు కానీ అనంతములోకి వెళ్ళలేరు, ఒక హద్దు వరకే వెళ్ళగలుగుతారు. మీరైతే హద్దు మరియు అనంతము నుండి అతీతముగా వెళ్తారు. మొదట కొత్త ప్రపంచములో హద్దు ఉంటుందని, చాలా కొద్దిమంది మనుష్యులే ఉంటారని, దానిని సత్యయుగము అని అంటారని ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. పిల్లలైన మీకు రచన ఆదిమధ్యాంతాల జ్ఞానం ఉండాలి కదా. ఈ జ్ఞానం ఇంకెవ్వరిలోనూ లేదు. మీకు అర్థం చేయించేవారు తండ్రి, ఈ తండ్రి హద్దు మరియు అనంతము నుండి అతీతంగా ఉన్నారు, ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. వారు రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు, మళ్ళీ దాని నుండి కూడా అతీతంగా వెళ్ళండి అని చెప్తారు. అక్కడైతే ఏమీ ఉండదు. ఎంత దూరం వెళ్ళినా అంతా ఆకాశమే ఆకాశము. దీనినే హద్దు మరియు అనంతము నుండి అతీతంగా వెళ్ళడం అని అంటారు. ఎవ్వరూ దాని అంతాన్ని పొందలేరు. అది అంతము లేనిది అని అంటారు. అంతము లేనిది అని అనడం సహజమే కానీ అంతము అన్నదాని అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు తండ్రి వివేకాన్ని ఇస్తున్నారు. తండ్రి అంటారు, నాకు హద్దు గురించి తెలుసు, అనంతము గురించి తెలుసు. ఫలానా-ఫలానా ధర్మాలు ఫలానా-ఫలానా సమయంలో స్థాపన అయ్యాయి! దృష్టి సత్యయుగ హద్దు వైపుకు వెళ్తుంది, ఆ తర్వాత కలియుగ విస్తారము వైపుకు వెళ్తుంది, ఆ తర్వాత మనం వాటిని దాటి వెళ్ళిపోతాము, అక్కడ ఇవేవీ ఉండవు. మనం సూర్యచంద్రాదులకన్నా పైకి వెళ్తాము, అక్కడ మన శాంతిధామము, మధురమైన ఇల్లు ఉంది. ఆ మాటకొస్తే సత్యయుగం కూడా మధురమైన ఇల్లే. అక్కడ శాంతి కూడా ఉంటుంది, అలాగే రాజ్యభాగ్యమైన సుఖం కూడా ఉంటుంది, రెండూ ఉంటాయి. ఇంటికి వెళ్ళినట్లయితే అక్కడ కేవలం శాంతియే ఉంటుంది, అక్కడ సుఖము యొక్క ప్రస్తావన ఉండదు. ఇప్పుడు మీరు శాంతిని కూడా స్థాపన చేస్తున్నారు మరియు సుఖ-శాంతులను కూడా స్థాపన చేస్తున్నారు. అక్కడైతే శాంతి కూడా ఉంది, సుఖము యొక్క రాజ్యము కూడా ఉంది. మూలవతనములోనైతే సుఖము యొక్క విషయం లేదు.

అర్ధకల్పము మీ రాజ్యము నడుస్తుంది, మళ్ళీ అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము వస్తుంది. పంచ వికారాల ద్వారానే అశాంతి ఏర్పడుతుంది. 2500 సంవత్సరాలు మీరు రాజ్యము చేస్తారు, మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత రావణ రాజ్యము వస్తుంది. వాళ్ళు అయితే లక్షల సంవత్సరాలు అని వ్రాసేసారు. పూర్తిగా వివేకహీనులుగా చేసేశారు. 5000 సంవత్సరాల కల్పమును లక్షల సంవత్సరాలు అని అనేస్తే అవివేకత అనే అంటారు కదా. కొద్దిగా కూడా సభ్యత లేదు. దేవతలలో ఎంతటి దైవీ సభ్యత ఉండేది. అది ఇప్పుడు అసభ్యతగా అయిపోయింది. వారికి ఏమీ తెలియదు. ఆసురీ గుణాలు వచ్చేశాయి. ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఆదిమధ్యాంతాలు దుఃఖితులుగా చేసేస్తారు, అందుకే దానిని రావణ సాంప్రదాయము అని అంటారు. రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారు అని చూపించారు. ఇప్పుడు రామచంద్రుడు త్రేతాయుగానికి చెందినవారు, అక్కడకు వానరులు ఎక్కడి నుండి వచ్చారు, అంతేకాక రాముడి యొక్క సీత అపహరించబడ్డారని అంటారు. అటువంటి విషయాలైతే అక్కడ ఉండనే ఉండవు. జీవ జంతువులు మొదలైన 84 లక్షల యోనులేవైతే ఇక్కడ ఉన్నాయో, ఇన్ని సత్య, త్రేతా యుగాలలో ఉండవు. ఈ అనంతమైన డ్రామానంతటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా దూరదృష్టి కలవారిగా అవ్వాలి. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. మనుష్యులై ఉండి కూడా నాటకము గురించి తెలియదు. అందరికన్నా పెద్ద ఎవరు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అది ఉన్నతోన్నతుడైన భగవంతుడు. మీ నామము ఉన్నతమైనది, ధామము ఉన్నతమైనది... అని శ్లోకాలు కూడా గానం చేస్తారు. ఇప్పుడు ఇవి మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. తండ్రి హద్దు మరియు అనంతము, రెండింటి రహస్యాలను అర్థం చేయిస్తారు. వాటిపైన ఇంకేమీ లేదు. అది మీరు ఉండే స్థానము, దానినే బ్రహ్మాండము అని కూడా అంటారు. ఇక్కడ మీరు ఆకాశతత్వములో కూర్చున్నారు, ఇందులో మీకు చూడటానికి ఏమైనా కనిపిస్తుందా? రేడియోలో ఆకాశవాణి అని అంటారు. ఇప్పుడు ఈ ఆకాశమైతే అనంతమైనది, దీని అంతాన్ని పొందలేరు. ఆకాశవాణి అని అంటే మనుష్యులు ఏమర్థం చేసుకుంటారు. ఈ నోరు ఏదైతే ఉందో, ఇందులో ఆకాశముంది. నోటి నుండి వాణి వెలువడుతుంది. ఇది సామాన్యమైన విషయమే. నోటి నుండి వాణి వెలువడడాన్నే ఆకాశవాణి అని అంటారు. తండ్రికి కూడా ఈ ఆకాశము ద్వారా వాణిని వినిపించవలసి ఉంటుంది. పిల్లలైన మీకు వారు తమ రహస్యాన్ని కూడా మొత్తం అర్థం చేయించారు. మీకు నిశ్చయం ఏర్పడుతుంది. వాస్తవానికి ఇది చాలా సహజము. ఏ విధంగా మనం ఆత్మలమో, అలా తండ్రి కూడా పరమ ఆత్మ. వారు ఉన్నతోన్నతమైన ఆత్మ కదా. అందరికీ తమ-తమ పాత్ర లభించి ఉంది. అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, ఆ తర్వాత ప్రవృత్తి మార్గము యొక్క యుగళ రూపమైన జంటపూసలు ఉన్నాయి, ఆ తర్వాత నంబరువారుగా మాల ఎంత కొద్దిగా ఉందో చూడండి, మళ్ళీ సృష్టి పెరుగుతూ, పెరుగుతూ ఎంత పెద్దగా అయిపోతుంది. ఇది ఎన్ని కోట్ల మణుల అనగా ఆత్మల మాల. ఇదంతా చదువు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మంచి రీతిలో బుద్ధిలో ధారణ చేయండి. వృక్షము యొక్క విస్తారమునైతే మీరు వింటూ ఉంటారు. బీజము పైన ఉంది. ఇది వెరైటీ వృక్షము. దీని ఆయువు ఎంతగా ఉంది. వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. కావున రోజంతా బుద్ధిలో ఇదే ఉండాలి. ఈ సృష్టి రూపీ కల్పవృక్షపు ఆయువు చాలా ఏక్యురేట్ గా ఉంటుంది. 5000 సంవత్సరాలకు ఒక్క క్షణం కూడా తేడా ఉండదు. పిల్లలైన మీ బుద్ధిలో ఇప్పుడు ఎంతటి జ్ఞానము ఉంది, దాని వలన బాగా దృఢముగా ఉన్నారు. ఎప్పుడైతే పవిత్రంగా ఉంటారో, అప్పుడు దృఢముగా ఉంటారు. ఈ జ్ఞానాన్ని ధారణ చేసేందుకు బంగారు పాత్ర కావాలి. ఆ తర్వాత బాబాకు ఇది ఎంత సహజమో అంత సహజమైపోతుంది. అప్పుడు మిమ్మల్ని కూడా మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఇక నంబరువారు పురుషార్థానుసారంగా మాలలోని మణులుగా అవుతారు. ఇటువంటి విషయాలను బాబా తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. ఈ ఆత్మ కూడా అర్థం చేయిస్తున్నారు. తండ్రి కూడా ఈ తనువు ద్వారా అర్థం చేయిస్తారు, అంతేకానీ దేవతల శరీరము ద్వారా కాదు. తండ్రి ఒకేసారి వచ్చి గురువుగా అవుతారు, అయినా కూడా తండ్రే పాత్రను అభినయించవలసి ఉంటుంది. 5000 సంవత్సరాల తర్వాత వచ్చి పాత్రను అభినయిస్తారు.

తండ్రి అర్థం చేయిస్తారు, ఉన్నతోన్నతమైనవాడిని నేనే, ఆ తర్వాత జంట పూసలు. ఎవరైతే ఆదిలో మహారాజు, మహారాణిగా ఉండేవారో, వారే మళ్ళీ అంతిమములో ఆదిదేవ్, ఆదిదేవిగా అవుతారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. మీరు ఎక్కడ అర్థం చేయించినా ఆశ్చర్యపోతారు. వీరు యథార్థమే చెప్తున్నారు అని భావిస్తారు. మనుష్య సృష్టికి బీజరూపుడు నాలెడ్జ్ ఫుల్. వారు తప్ప ఇంకెవ్వరూ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఈ విషయాలన్నింటినీ ధారణ చేయాలి కానీ పిల్లలకు ధారణ జరగడం లేదు. వాస్తవానికి ఇది చాలా సహజము. ఇందులో ఎటువంటి కష్టమూ లేదు. ఒకటేమో ఇందులో స్మృతియాత్ర కావాలి, తద్వారా పవిత్ర పాత్రలో రత్నాలు నిలవగలుగుతాయి. ఇవి ఉన్నతోన్నతమైన రత్నాలు. బాబా రత్నాల వ్యాపారిగా ఉండేవారు. వజ్రాలు, కెంపులు మొదలైన చాలా మంచి రత్నాలు వచ్చినప్పుడు వాటిని వెండి డిబ్బీలో దూది మొదలైనవి వేసి బాగా భద్రపరిచేవారు. వాటిని ఎవరైనా చూస్తే ఇవి చాలా ఫస్ట్ క్లాస్ అయిన వస్తువులు అని అనేవారు. ఇది కూడా అటువంటిదే. మంచి వస్తువు మంచి పాత్రలోనే శోభిస్తుంది. మీ చెవులు వింటాయి, అందులో ధారణ జరుగుతుంది. పవిత్రముగా ఉన్నట్లయితే, బుద్ధియోగము తండ్రితో ఉన్నట్లయితే ధారణ బాగా జరుగుతుంది, లేదంటే అంతా బయటకు పోతుంది. ఆత్మ కూడా ఎంత చిన్ననిది. అందులో ఎంతటి జ్ఞానము నిండి ఉంది. ఎంతటి మంచి శుద్ధమైన పాత్ర కావాలి. ఎటువంటి సంకల్పము కూడా ఉత్పన్నమవ్వకూడదు. తప్పుడు సంకల్పాలన్నీ సమాప్తమైపోవాలి. అన్నివైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. నాతో యోగాన్ని జోడిస్తూ, జోడిస్తూ పాత్రను బంగారముగా చేసుకున్నట్లయితే అందులో రత్నాలు నిలవగలుగుతాయి, అప్పుడు ఇతరులకు దానం చేస్తూ ఉంటారు. భారత్ ను మహాదానిగా భావించడం జరుగుతుంది. ఆ ధనాన్ని అయితే ఎంతో దానం చేస్తారు కానీ ఇది అవినాశీ జ్ఞాన రత్నాల దానము. దేహ సహితముగా ఏవైతే ఉన్నాయో వాటన్నింటి వదిలి ఒక్కరితోనే బుద్ధియోగము ఉండాలి. మనమైతే ఆ తండ్రికి చెందినవారము. ఇందులోనే శ్రమ ఉంది. లక్ష్యము-ఉద్దేశ్యమునైతే తండ్రి తెలియజేసేస్తారు. ఇక పురుషార్థము చేయడం పిల్లల పని. అప్పుడే అంతటి ఉన్నత పదవిని పొందగలుగుతారు. ఎటువంటి తప్పుడు సంకల్పాలు, వికల్పాలు రాకూడదు. తండ్రే జ్ఞానసాగరుడు, హద్దు మరియు అనంతము నుండి అతీతమైనవారు. వారు కూర్చుని అంతా అర్థం చేయిస్తారు. బాబా మమ్మల్ని చూస్తున్నారు అని మీరు భావిస్తారు కానీ నేను హద్దు, అనంతము నుండి అతీతంగా పైకి వెళ్ళిపోతాను. నేను ఉండేది కూడా అక్కడే. మీరు కూడా హద్దు మరియు అనంతము నుండి అతీతముగా వెళ్ళిపోండి. సంకల్ప, వికల్పాలు ఏవీ కూడా రాకూడదు. ఇందులో కష్టపడాలి. గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వాలి. చేతులు పని వైపూ, హృదయము ప్రియుని వైపూ ఉండాలి. గృహస్థులైతే ఎందరో ఉన్నారు. గృహస్థులు ఎంతైతే తీసుకుంటారో అంతగా ఇంటిలో ఉండే పిల్లలు తీసుకోరు. సెంటరు నడిపించేవారు, మురళి నడిపించేవారు కూడా ఫెయిల్ అయిపోతారు మరియు చదువుకునేవారు ఉన్నతిలోకి వెళ్ళిపోతారు. మున్ముందు మీకు అంతా తెలుస్తూ ఉంటుంది. బాబా పూర్తిగా ఖచ్చితంగా చెప్తున్నారు. మమ్మల్ని ఎవరైతే చదివించేవారో వారిని మాయ తినేసింది, మహారథులను మాయ పూర్తిగా మింగేసింది. వారు ఈ రోజు లేరు. మాయావీ ద్రోహులుగా అయిపోతారు. విదేశాలలో కూడా ద్రోహులుగా అయిపోతారు కదా. ఎక్కడెక్కడికో వెళ్ళి శరణు తీసుకుంటారు. ఎవరైతే శక్తివంతులుగా ఉంటారో, వారి వైపుకు వెళ్ళిపోతారు. ఈ సమయములోనైతే మృత్యువు ఎదురుగా ఉంది కదా కావున చాలా శక్తివంతుల వద్దకు వెళ్తారు. తండ్రే శక్తిమంతుడు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి సర్వశక్తివంతుడు. మనకు నేర్పిస్తూ, నేర్పిస్తూ మొత్తం విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. అక్కడ అంతా లభిస్తుంది. అప్రాప్తి అనే వస్తువే ఉండదు కావున దేనినీ పొందేందుకు పురుషార్థం చేయవలసిన అవసరం ఉండదు. అక్కడ మీ వద్ద లేని వస్తువంటూ ఉండదు. అది కూడా నంబరువారు పురుషార్థానుసారంగానే పదవిని పొందుతారు. తండ్రికి తప్ప ఇంకెవ్వరికీ ఈ విషయాల గురించి తెలియదు. అందరూ పూజారులే. శంకరాచార్యులు మొదలైన పెద్ద-పెద్ద వారు ఉన్నారు, బాబా వారి మహిమను కూడా వినిపిస్తారు. మొదట పవిత్రతా శక్తితో భారత్ ను చాలా బాగా నిలబెట్టేందుకు నిమిత్తులవుతారు. అది కూడా సతోప్రధానముగా ఉన్నప్పుడు నిమిత్తులవుతారు. ఇప్పుడైతే తమోప్రధానులుగా ఉన్నారు. వారిలో శక్తి ఏముంది? ఇప్పుడు పూజారులుగా ఉన్న మీరు మళ్ళీ పూజ్యులుగా అయ్యే పురుషార్థాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. బుద్ధిలో ధారణ అయి ఉండాలి మరియు మీరు అర్థం చేయిస్తూ ఉండండి. తండ్రిని కూడా స్మృతి చేయండి. తండ్రే మొత్తం వృక్షము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా అలా మధురంగా అవ్వాలి. ఇది యుద్ధము కదా. మాయ తుఫానులు కూడా ఎన్నో వస్తాయి. అన్నీ సహనం చేయవలసి ఉంటుంది. తండ్రి స్మృతిలో ఉండడం ద్వారా తుఫానులు అన్నీ తొలగిపోతాయి. హాతంతాయి నాటకాన్ని చూపిస్తారు కదా. నోటిలో నాణము వేసుకునేవారు, దానితో మాయ వెళ్ళిపోయేది. నాణాన్ని తీయడంతోనే మాయ వచ్చేసేది. ముట్టుకుంటే ముడుచుకుపోయే మొక్క ఉంటుంది కదా. చేయి పెట్టగానే ముడుచుకుపోతుంది. మాయ చాలా చురుకైనది. ఇంత ఉన్నతమైన చదువును చదువుతూ, చదువుతూ ఉండగా కూర్చుని, కూర్చుని ఉండగానే పడేస్తుంది, అందుకే తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు, పరస్పరం సోదరులుగా భావించినట్లయితే హద్దు మరియు అనంతము నుండి అతీతముగా వెళ్ళిపోతారు. శరీరమే లేకపోతే ఇక దృష్టి ఎటువైపుకు వెళ్తుంది. అంతగా కష్టపడాలి. విని నిరుత్సాహులైపోకూడదు. కల్పకల్పమూ మీ పురుషార్థము నడుస్తుంది మరియు మీరు మీ భాగ్యాన్ని పొందుతారు. తండ్రి అంటారు, మీరు చదివినదంతా మర్చిపోండి, ఏదైతే ఎప్పుడూ చదవలేదో అది వినండి మరియు స్మృతి చేయండి. దానిని భక్తి మార్గము అని అంటారు. మీరు రాజఋషులు కదా. మీ జుట్టు తెరవబడి ఉండాలి మరియు మురళి వినిపించండి. సాధు-సన్యాసులు మొదలైనవారు ఏదైతే వినిపిస్తారో అదంతా మనుష్యుల మురళి. ఇది అనంతమైన తండ్రి మురళి. సత్య, త్రేతాయుగాలలో జ్ఞానం మురళి యొక్క అవసరమే ఉండదు. అక్కడ జ్ఞానము యొక్క అవసరమూ ఉండదు, అలాగే భక్తి అవసరమూ ఉండదు. ఈ జ్ఞానము మీకు ఈ సంగమయుగములో లభిస్తుంది మరియు దీనిని ఇచ్చేవారు తండ్రే. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బుద్ధిలో జ్ఞాన రత్నాలను ధారణ చేసి దానం చేయాలి. హద్దు మరియు అనంతము నుండి అతీతముగా ఎటువంటి స్థితిలో ఉండాలంటే ఎప్పుడూ కూడా తప్పుడు సంకల్పాలు లేక వికల్పాలు రాకూడదు. ఆత్మలమైన మనము పరస్పరం సోదరులము అన్న ఈ స్మృతే ఉండాలి.

2. మాయ తుఫానుల నుండి సురక్షితముగా ఉండేందుకు నోటిలో తండ్రి స్మృతి అనే నాణము వేసుకోవాలి. అన్నింటినీ సహనం చేయాలి. ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిలా అవ్వకూడదు. మాయతో ఓడిపోకూడదు.

వరదానము:-
సదా ఒక్కరి స్నేహములో ఇమిడిపోయి ఉంటూ ఒక్క తండ్రినే ఆధారంగా చేసుకునే సర్వ ఆకర్షణాముక్త భవ

ఏ పిల్లలైతే ఒక్క తండ్రి స్నేహములో ఇమిడిపోయి ఉంటారో వారు సర్వ ప్రాప్తులలో సంపన్నంగా మరియు సంతుష్టంగా ఉంటారు. వారిని ఏ విధమైన ఆధారమూ ఆకర్షించలేదు. వారికి సహజముగానే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న అనుభూతి కలుగుతుంది. వారికి ఒక్క తండ్రే ప్రపంచము, ఒక్క తండ్రి ద్వారానే సర్వ సంబంధాల రసము అనుభవమవుతుంది. వారికి సర్వ ప్రాప్తులకు ఆధారము ఒక్క తండ్రే, అంతేకానీ వైభవాలు లేక సాధనాలు కావు. అందుకే వారు సహజంగానే ఆకర్షణాముక్తులుగా అయిపోతారు.

స్లోగన్:-
ప్రకృతిని పావనంగా చేయాలంటే సంపూర్ణ ఆకర్షణా ముక్తులుగా అవ్వండి.