06-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు పూర్తిగా ఒడ్డున నిలబడి
ఉన్నారు, మీరు ఇప్పుడు ఈ తీరము నుండి ఆ తీరానికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళేందుకు
ఏర్పాట్లు చేసుకోవాలి’’
ప్రశ్న:-
ఏ ఒక్క
విషయాన్ని గుర్తుంచుకున్నట్లయితే అవస్థ అచలముగా, స్థిరముగా తయారవుతుంది?
జవాబు:-
గతించినదేదో
గతించిపోయింది. గతించినదాని గురించి ఆలోచించకూడదు, ముందుకు వెళ్తూ ఉండాలి. సదా ఒక
వైపే చూస్తూ ఉన్నట్లయితే అవస్థ అచలముగా, స్థిరముగా అవుతుంది. మీరు ఇప్పుడు కలియుగ
ఒడ్డును వదిలేశారు, మళ్ళీ వెనుకకు ఎందుకు చూస్తారు? అటువైపుకు బుద్ధి కొద్దిగా కూడా
వెళ్ళకూడదు - ఇదే సూక్ష్మమైన చదువు.
ఓంశాంతి
రోజులు మారుతూ ఉంటాయి, సమయము గడిచిపోతూ ఉంటుంది. ఆలోచించండి, సత్యయుగము నుండి
మొదలుకొని సమయము గడిచిపోతూ-గడిచిపోతూ ఇప్పుడు వచ్చి కలియుగములో, అది కూడా ఒడ్డున
నిలబడి ఉన్నారు. ఈ సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాల చక్రము కూడా ఒక మోడల్ వంటిది.
సృష్టి అయితే చాలా పొడవు-వెడల్పులు కలది. దాని మోడల్ రూపాన్ని పిల్లలు
తెలుసుకున్నారు. ఇప్పుడు కలియుగము పూర్తవుతుందన్న విషయము ఇంతకుముందు తెలియదు.
ఇప్పుడు తెలిసింది - కావున పిల్లలు కూడా బుద్ధి ద్వారా సత్యయుగము నుండి మొదలుపెట్టి
చక్రములో తిరిగి కలియుగాంతములో ఒడ్డుకు వచ్చి నిలబడాలి. సమయము టిక్ టిక్ అని గడుస్తూ
ఉంటుంది, డ్రామా తిరుగుతూ ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఇంకా ఎంత లెక్క మిగిలి
ఉంటుంది? కొద్దిగా మిగిలి ఉంటుంది. ఇది ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం
చేయించారు, చిన్న భాగమే మిగిలి ఉంది. ఈ ప్రపంచము నుండి ఆ ప్రపంచములోకి వెళ్ళేందుకు
ఇప్పుడింకా కొద్ది సమయమే మిగిలి ఉంది. ఈ జ్ఞానము కూడా ఇప్పుడే లభించింది. మనము
సత్యయుగము నుండి మొదలుకుని చక్రములో తిరుగుతూ-తిరుగుతూ ఇప్పుడు కలియుగాంతములోకి
వచ్చి చేరుకున్నాము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. రావడానికి మరియు తిరిగి
వెళ్ళడానికి గేట్ ఉంటుంది కదా. ఇది కూడా అటువంటిదే. ఇంకా ఒడ్డులో కొద్దిగానే మిగిలి
ఉందని పిల్లలు అర్థం చేయించాలి. ఇది పురుషోత్తమ సంగమయుగము కదా. ఇప్పుడు మనము ఒడ్డున
ఉన్నాము. చాలా కొద్ది సమయము ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచము నుండి మమకారాన్ని
తొలగించాలి. ఇప్పుడిక కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. వివరణ అయితే చాలా సహజమైనది
లభిస్తుంది. దీనిని బుద్ధిలో ఉంచుకోవాలి. చక్రము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఇప్పుడు
మీరు కలియుగములో లేరు. మీరు ఈ హద్దును వదిలేశారు, పాత ప్రపంచాన్ని వదిలేసినప్పుడు
మరి ఇటువైపు ఉన్నవారిని ఎందుకు గుర్తు చేయాలి? మనము పురుషోత్తమ సంగమయుగములో ఉన్నాము,
మళ్ళీ వెనుకకు ఎందుకు చూడాలి? బుద్ధియోగాన్ని వికారీ ప్రపంచముతో ఎందుకు జోడించాలి?
ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. కొంతమందైతే రూపాయిలో ఒక్క అణా అంత కూడా అర్థం
చేసుకోరని బాబాకు తెలుసు. వింటారు మరియు మర్చిపోతారు. మీరు వెనుకకు చూడకూడదు.
బుద్ధిని ఉపయోగించాలి కదా. మనము దూరముగా వచ్చేసాము - మళ్ళీ వెనుకకు అసలు ఎందుకు
చూడాలి? గతించినదేదో గతించిపోయింది. తండ్రి అంటున్నారు, నేను ఎంత సూక్ష్మమైన
విషయాలను అర్థం చేయిస్తున్నాను. అయినా పిల్లల తలలు వెనుక వైపుకు ఎందుకు తిరిగి
ఉంటున్నాయి. కలియుగము వైపు తిరిగి ఉన్నాయి. తండ్రి అంటారు, తలలు ఇటువైపు తిప్పండి.
ఆ పాత ప్రపంచము మీకు ఉపయోగపడుదు. బాబా పాత ప్రపంచము పట్ల వైరాగ్యాన్ని ఇప్పిస్తారు,
కొత్త ప్రపంచము ఎదురుగా నిలబడి ఉంది, ఇక పాత ప్రపంచము పట్ల వైరాగ్యము కలగాలి. మా
అవస్థ ఆ విధముగా ఉందా అని ఆలోచించండి. తండ్రి అంటారు, గతించినదేదో గతించిపోయింది.
గతించిన దాని గురించి ఆలోచించకండి. పాత ప్రపంచము పట్ల ఎటువంటి ఆశను పెట్టుకోకండి.
ఇప్పుడిక ఒకటే ఉన్నతమైన ఆశను పెట్టుకోవాలి - మనము సుఖధామానికి వెళ్ళాలి. బుద్ధిలో
సుఖధామమే గుర్తుండాలి. వెనుకకు ఎందుకు తిరగాలి. కానీ చాలామంది వెనుకకు తిరిగిపోతారు.
మీరు ఇప్పుడు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. పాత ప్రపంచము నుండి పక్కకు వచ్చేశారు.
ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. ఎక్కడా ఆగకూడదు. ఏటూ చూడకూడదు. గతాన్ని గుర్తు
చేసుకోకూడదు. తండ్రి అంటారు, ముందుకు వెళ్తూ ఉండండి, వెనుకకు చూడకండి. ఒకవైపే చూస్తూ
ఉండండి, అప్పుడే అచలమైన, స్థిరమైన, చలించని అవస్థ ఉండగలదు. అటువైపే చూస్తూ ఉంటే పాత
ప్రపంచము యొక్క మిత్ర-సంబంధీకులు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు. నంబరువారుగా
ఉన్నారు కదా. ఈ రోజు చూస్తే చాలా బాగా నడుస్తూ ఉంటారు, రేపు పడిపోతే మనసు ఒక్కసారిగా
తొలగిపోతుంది. ఎటువంటి గ్రహచారము కూర్చుంటుందంటే, ఇక మురళి వినేందుకు కూడా మనసు
కలగదు. ఆలోచించండి - అలానే జరుగుతుంది కదా?
తండ్రి అంటారు, మీరు ఇప్పుడు సంగమములో నిలబడి ఉన్నారు కావున ముఖము ముందువైపే
ఉండాలి. కొత్త ప్రపంచము ముందు ఉంది అని అనుకుంటేనే సంతోషము కలుగుతుంది. ఇకపోతే
ఇప్పుడు మీరు చాలా సమీపముగా, ఒడ్డున ఉన్నారు. ఇప్పుడు మన దేశము యొక్క వృక్షాలు
కనిపిస్తున్నాయి అని అంటారు కదా. మీరు పిలుస్తే వారికి వెంటనే వినబడుతుంది అని
అంటారు కదా. సమీపముగా అనగా పూర్తిగా ఎదురుగా ఉన్నారు. మీరు తలచుకోగానే దేవతలు
వచ్చేస్తారు. ఇంతకుముందు అలా వచ్చేవారు కాదు. సూక్ష్మవతనములో అత్తవారింటి వారు
వచ్చేవారా ఏమిటి? ఇప్పుడు పుట్టింటివారు మరియు అత్తవారింటివారు వెళ్ళి కలుసుకుంటారు,
అయినా పిల్లలు నడుస్తూ-నడుస్తూ మర్చిపోతారు. బుద్ధియోగము వెనుకవైపుకు తిరిగిపోతుంది.
తండ్రి అంటారు, మీ అందరిదీ ఇది అంతిమ జన్మ. మీరు వెనుకకు తిరగకూడదు. ఇప్పుడు ఆ
తీరానికి వెళ్ళాలి. ఇటువైపు నుండి అటువైపుకు వెళ్ళాలి. మృత్యువు కూడా సమీపముగా వస్తూ
ఉంటుంది. ఇక కేవలం ఒక అడుగు వేయాలి, నావ తీరానికి చేరుకున్నప్పుడు అవతలివైపుకు అడుగు
వేయవలసి ఉంటుంది కదా. పిల్లలైన మీరు ఒడ్డున నిలబడాలి. ఆత్మలు తమ స్వీట్ హోమ్ కు
వెళ్తారని మీ బుద్ధిలో ఉంది. ఇది గుర్తున్నా కూడా ఆ సంతోషము మిమ్మల్ని
అచలముగా-స్థిరముగా చేస్తుంది. ఇదే విచార సాగర మంథనము చేస్తూ ఉండాలి. ఇది బుద్ధికి
సంబంధించిన విషయము. ఆత్మనైన నేను వెళ్తున్నాను. ఇప్పుడు ఒడ్డున చాలా సమీపముగా
చేరుకున్నాను. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. దీనినే స్మృతియాత్ర అని అంటారు. ఇది
కూడా మర్చిపోతారు. చార్ట్ వ్రాయడము కూడా మర్చిపోతారు. మీ హృదయముపై చేయి వేసుకుని
చూసుకోండి - నేను ఒడ్డున చాలా సమీపముగా నిలబడి ఉన్నాను అని మీరు భావించండి అని బాబా
ఏదైతే చెప్తున్నారో, నాకు అటువంటి అవస్థ ఉందా? బుద్ధిలో ఒక్క తండ్రి మాత్రమే
గుర్తుండాలి. బాబా స్మృతియాత్రను రకరకాలుగా చేయడం నేర్పిస్తూ ఉంటారు. ఈ
స్మృతియాత్రలోనే ఆనందముగా ఉండాలి. ఇప్పుడు ఇక నేను వెళ్ళాలి. ఇక్కడ అన్నీ అసత్యపు
సంబంధాలు. సత్యమైనవి సత్యయుగములోని సంబంధాలు. నేను ఎక్కడ నిలబడి ఉన్నాను అని
స్వయాన్ని చూసుకోండి. సత్యయుగము నుండి మొదలుకొని బుద్ధిలో ఈ చక్రాన్ని గుర్తు
చేసుకోండి. మీరు స్వదర్శన చక్రధారులు కదా. సత్యయుగము నుండి మొదలుకొని చక్రములో
తిరిగి వచ్చి ఒడ్డున నిలబడ్డారు. చాలా సమీపముగా వచ్చేశారు కదా. కొందరు తమ సమయాన్ని
చాలా వ్యర్థముగా పోగొట్టుకుంటూ ఉంటారు. 5-10 నిముషాలు కూడా కష్టము మీద స్మృతిలో ఉంటూ
ఉండవచ్చు. స్వదర్శన చక్రధారులుగానైతే రోజంతా అవ్వాలి. కానీ అలా లేరు. బాబా రకరకాల
పద్ధతులలో అర్థం చేయిస్తారు. ఇది ఆత్మకు సంబంధించిన విషయమే. మీ బుద్ధిలో చక్రము
తిరుగుతూ ఉంటుంది. బుద్ధిలో ఇది ఎందుకు గుర్తు ఉండకూడదు. ఇప్పుడు మనము ఒడ్డున నిలబడి
ఉన్నాము. ఈ ఒడ్డు బుద్ధిలో ఎందుకు గుర్తుండదు. మనము పురుషోత్తములుగా అవుతున్నామని
తెలిసినప్పుడు మరి వెళ్ళి ఒడ్డులో నిలబడి ఉండండి. పేను వలె నడుస్తూనే ఉండండి. ఈ
అభ్యాసాన్ని ఎందుకు చేయరు? చక్రము బుద్ధిలోకి ఎందుకు రాదు? ఇది స్వదర్శన చక్రము కదా.
బాబా ప్రారంభము నుండి మొదలుకొని మొత్తము చక్రమంతా అర్థం చేయిస్తూ ఉంటారు. మీ బుద్ధి
చక్రమంతా తిరిగి, వచ్చి ఒడ్డున నిలబడిపోవాలి, అంతేకానీ బయట వాతావరణ ప్రభావము గాని
లేక జంజాటాలు గాని ఏవీ ఉండకూడదు. రోజురోజుకు పిల్లలైన మీరు సైలెన్స్ లోకే వెళ్ళాలి.
సమయాన్ని వ్యర్థముగా పోగొట్టుకోకూడదు. పాత ప్రపంచాన్ని వదిలి కొత్త సంబంధాలతో మీ
బుద్ధియోగాన్ని జోడించండి. యోగము జోడించకపోతే పాపాలు ఎలా తొలగుతాయి? ఈ ప్రపంచమే
సమాప్తము కానున్నదని మీకు తెలుసు, దీని మోడల్ ఎంత చిన్నది. ఇది 5 వేల సంవత్సరాల
ప్రపంచము. అజ్మేర్ లో స్వర్గము యొక్క మోడల్ ఉంది కానీ ఎవరికైనా స్వర్గము
గుర్తుకొస్తుందా? స్వర్గమంటే ఏమిటో వారికేమి తెలుసు. స్వర్గమైతే 40 వేల సంవత్సరాల
తర్వాత వస్తుందని వారు భావిస్తారు. తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం
చేయిస్తున్నారు, ఈ ప్రపంచములో కార్యవ్యవహారాలు చేస్తూ, ఈ ప్రపంచము సమాప్తము
అవ్వనున్నదని బుద్ధిలో గుర్తుంచుకోండి. ఇప్పుడిక వెళ్ళాలి, మనము చివరిలో నిలబడి
ఉన్నాము. అడుగడుగు పేను వలె నడుస్తుంది. గమ్యము ఎంత గొప్పది. తండ్రికైతే గమ్యము
గురించి తెలుసు కదా. తండ్రితో పాటు దాదా కూడా కలిసి ఉన్నారు. వారు అర్థం
చేయిస్తున్నప్పుడు మరి వీరు అర్థం చేయించలేరా. వీరు కూడా వింటారు కదా. వీరు ఈ
విధముగా విచార సాగర మంథనము చేస్తూ ఉండరా? తండ్రి మీకు విచార సాగర మంథనము చేయడము కోసం
పాయింట్లు వినిపిస్తూ ఉంటారు. బ్రహ్మాబాబా చాలా వెనుక ఉన్నారని కాదు. అరే, వీరు నాకు
తోక వలె వేలాడుతూ ఉన్నారు, అటువంటప్పుడు వెనుక ఎలా ఉంటారు. ఈ గుహ్యాతి గుహ్యమైన
విషయాలన్నింటినీ ధారణ చేయాలి. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. బాబా వద్దకు రెండేసి
సంవత్సరాల తర్వాత వస్తారు. మేము చాలా సమీపముగా ఒడ్డునే నిలబడి ఉన్నామని స్మృతి ఉండి
ఉంటుందా? ఇప్పుడిక వెళ్ళాలి. ఇటువంటి అవస్థ ఏర్పడితే ఇంకేమి కావాలి? బాబా
ద్వికిరీటధారులు... అని ఇది కూడా అర్థం చేయించారు. ఇది కేవలం పేరు, అంతేకానీ అక్కడ
ప్రకాశము యొక్క కిరీటమేమీ ఉండదు. ఇది పవిత్రతకు గుర్తు. ధర్మ స్థాపకులు ఎవరైతే
ఉన్నారో, వారి చిత్రాలలో ప్రకాశాన్ని తప్పకుండా చూపిస్తారు ఎందుకంటే వారు
నిర్వికారులు, సతోప్రధానమైనవారు, ఆ తర్వాత రజో, తమోలలోకి వస్తారు. పిల్లలైన మీకు
జ్ఞానము లభిస్తుంది, అందులో ఆనందముగా ఉండాలి. మీరు ఈ ప్రపంచములో ఉన్నా కానీ
బుద్ధియోగము అక్కడ జోడించబడి ఉండాలి. ఇక్కడ ఉన్నవారితో కూడా సంబంధాన్ని
నిర్వర్తించాలి. ఈ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారు వస్తారు. అంటు
కట్టబడుతుంది. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారు
తప్పకుండా ముందో-వెనుకో వస్తారు. వెనుక వచ్చేవారు కూడా ముందు ఉన్నవారి కన్నా వేగముగా
వెళ్ళిపోతారు. ఇది చివరివరకు జరుగుతూనే ఉంటుంది. వారు పాతవారికన్నా వేగముగా అడుగులు
ముందుకు వేస్తారు. మొత్తము పరీక్షంతా స్మృతియాత్రకు సంబంధించినది. ఆలస్యముగా వచ్చినా
కూడా, స్మృతియాత్రలో నిమగ్నమవ్వాలి. మిగిలిన వ్యాపార వ్యవహారాలన్నీ వదిలి ఈ
యాత్రలోనే కూర్చుండిపోవాలి, భోజనమైతే తినవలసిందే. మంచి రీతిలో స్మృతిలో ఉన్నట్లయితే
ఆ సంతోషము వంటి ఔషధము ఉండదు. ఇప్పుడు ఇక నేను వెళ్ళాలి అని ఇదే చింత ఉండాలి. 21
జన్మల రాజ్య భాగ్యము లభిస్తుంది. లాటరీ లభించినవారికి సంతోషము యొక్క పాదరసము
ఎక్కుతుంది కదా. మీరు చాలా కృషి చేయాలి. దీనినే అంతిమ, అమూల్యమైన జీవితమని అంటారు.
స్మృతియాత్రలో చాలా ఆనందము ఉంటుంది. హనుమంతుడు కూడా పురుషార్థము చేస్తూ-చేస్తూ
స్థిరముగా అయిపోయారు కదా. అడవికి నిప్పు అంటుకుంది, రావణ రాజ్యము కాలిపోయింది. ఇదొక
కథగా తయారుచేశారు. తండ్రి కూర్చుని యథార్థమైన విషయాన్ని అర్థం చేయిస్తారు. రావణ
రాజ్యము సమాప్తమైపోతుంది. దీనినే స్థిరమైన బుద్ధి అని అంటారు. ఇప్పుడిక ఒడ్డులో
ఉన్నాము, మనము వెళ్ళిపోతున్నాము. ఈ స్మృతిలో ఉండే పురుషార్థము చేయండి, అప్పుడు
సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది, ఆయుష్షు కూడా యోగబలముతో పెరుగుతుంది. మీరు
ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తారు, అవి అర్ధకల్పము నడుస్తాయి. ఈ ఒక్క జన్మలో మీరు
ఎంత పురుషార్థము చేస్తారంటే, ఇక మీరు వెళ్ళి ఈ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. మరి
ఎంత పురుషార్థము చేయాలి. ఇందులో నిర్లక్ష్యము చేయకూడదు మరియు సమయాన్ని వ్యర్థము
చేయకూడదు. ఎవరు చేస్తే వారు పొందుతారు. తండ్రి శిక్షణనిస్తూ ఉంటారు. కల్ప-కల్పము
మనము విశ్వానికి యజమానులుగా అవుతామని మీరు అర్థం చేసుకుంటారు. ఇంత తక్కువ సమయములోనే
అద్భుతము చేసేస్తారు. మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేసేస్తారు. ఇది తండ్రికి పెద్ద
విషయమేమీ కాదు. కల్ప-కల్పము చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు -
నడుస్తూ-తిరుగుతూ, తింటూ-తాగుతూ మీ బుద్ధియోగాన్ని తండ్రితో జోడించండి. ఈ గుప్తమైన
విషయాన్ని తండ్రియే కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. మీ అవస్థను మంచి రీతిగా
తయారుచేసుకుంటూ ఉండండి. లేకపోతే ఉన్నతమైన పదవిని పొందరు. పిల్లలైన మీరు నంబరువారు
పురుషార్థానుసారముగా కృషి చేస్తారు. ఇప్పుడు మనము ఒడ్డున నిలబడి ఉన్నామని అర్థం
చేసుకుంటారు. మరి మనం వెనుకకు ఎందుకు చూడాలి? అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. ఇందులో
అంతర్ముఖత చాలా కావాలి, అందుకే తాబేలు ఉదాహరణ కూడా ఉంది. ఈ ఉదాహరణలు మొదలైనవన్నీ మీ
కొరకే ఉన్నాయి. సన్యాసులైతే హఠయోగులు, వారు రాజయోగాన్ని నేర్పించలేరు. వారు వింటే,
వీళ్ళు మమ్మల్ని అవమానపరుస్తున్నారని భావిస్తారు, అందుకే ఇది కూడా యుక్తిగా వ్రాయాలి.
తండ్రి తప్ప రాజయోగాన్ని ఎవ్వరూ నేర్పించలేరు. వారికి ఆలోచన నడవకుండా - ఇండైరెక్ట్
గా చెప్పడం జరుగుతుంది. యుక్తిగా నడుచుకోవలసి ఉంటుంది కదా, పాము కూడా చావాలి, కర్ర
కూడా విరగకూడదు. కుటుంబ పరివారము మొదలైనవారందరి పట్ల ప్రీతిని ఉంచండి కానీ
బుద్ధియోగము తండ్రితో జోడించాలి. ఇప్పుడు మనము ఒక్కరి మతముపైనే ఉన్నామని మీకు తెలుసు.
ఇది దేవతలుగా తయారయ్యే మతము, దీనినే అద్వైత మతమని అంటారు. పిల్లలు దేవతలుగా అవ్వాలి.
ఎన్ని సార్లు మీరు అలా అయ్యారు? అనేక సార్లు. ఇప్పుడు మీరు సంగమయుగములో నిలబడి
ఉన్నారు. ఇది అంతిమ జన్మ. ఇప్పుడిక వెళ్ళాలి. వెనుకకు ఎందుకు చూడాలి. చూస్తున్నా
కూడా మీరు మీ స్థిరత్వములో నిలబడి ఉండండి. గమ్యాన్ని మర్చిపోకూడదు. మీరే మాయపై
విజయాన్ని పొందే మహావీరులు. ఈ గెలుపు-ఓటముల చక్రము తిరుగుతూనే ఉంటుందని ఇప్పుడు మీరు
అర్థం చేసుకున్నారు. బాబాది ఎంత అద్భుతమైన జ్ఞానము. స్వయాన్ని బిందువుగా భావించాలి
అని ఇంతకుముందు తెలుసా, ఇంత చిన్న బిందువులో మొత్తం పాత్ర నిశ్చితమై ఉంది, ఈ చక్రము
తిరుగుతూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనది. దీనిని అద్భుతము అని అనవలసే ఉంటుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. వెనుకకు తిరిగి చూడకూడదు. ఏ విషయములోనూ ఆగకూడదు. ఒక్క తండ్రి వైపే చూస్తూ తమ
అవస్థను ఏకరసముగా ఉంచుకోవాలి.
2. ఇప్పుడు మేము ఒడ్డున నిలబడి ఉన్నాము, ఇంటికి వెళ్ళాలి అని బుద్ధిలో
గుర్తుంచుకోవాలి. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. తమ అవస్థను తయారుచేసుకునేందుకు
గుప్తమైన కృషి చేయాలి.
వరదానము:-
సర్వుల నుండి హృదయపూర్వకమైన ప్రేమను ప్రాప్తి చేసుకునే
అతీతమైన, ప్రియమైన, నిస్సంకల్ప భవ
ఏ పిల్లల్లోనైతే అతీతముగా మరియు ప్రియముగా ఉండే గుణము
మరియు నిస్సంకల్పముగా ఉండే విశేషత ఉంటుందో, అనగా ఎవరికైతే ఈ వరదానము ప్రాప్తిస్తుందో,
వారు సర్వులకు ప్రియముగా అవుతారు ఎందుకంటే అతీతమైన స్థితి ద్వారా సర్వుల నుండి
హృదయపూర్వకమైన ప్రేమ స్వతహాగా ప్రాప్తిస్తుంది. వారు తమ శక్తిశాలి నిస్సంకల్ప స్థితి
మరియు శ్రేష్ఠ కర్మల ద్వారా అనేకుల సేవకు నిమిత్తమవుతారు, అందుకే స్వయము కూడా
సంతుష్టముగా ఉంటారు మరియు ఇతరులది కూడా కళ్యాణము చేస్తారు. వారికి ప్రతి కార్యములోనూ
సఫలత స్వతహాగా ప్రాప్తిస్తుంది.
స్లోగన్:-
ఒక్క
‘‘బాబా’’ అనే పదమే సర్వ ఖజానాలకు తాళంచెవి - ఈ తాళంచెవిని సదా సంభాళించుకుని
పెట్టుకోండి.
అవ్యక్త సూచనలు -
అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి
ఎప్పుడైతే ఏ
సంస్కారాల యొక్క టైట్ నెస్ ఉండదో, అప్పుడే ఒక్క క్షణములో శరీరము నుండి వేరు కాగలరు.
మామూలుగా కూడా ఏదైనా వస్తువు అతుక్కుని ఉంటే దానిని వేరు చేయటము కష్టమవుతుంది. అదే
లూజ్ గా ఉంటే సహజముగానే వేరైపోతుంది. అదే విధముగా ఒకవేళ మీ సంస్కారాలలో ఏ
కొద్దిగానైనా ఈజీ తనము లేకపోతే, అప్పుడిక అశరీరీతనాన్ని అనుభవము చెయ్యలేకపోతారు,
అందుకే ఈజీగా మరియు అలర్ట్ గా ఉండండి.
| | | |