07-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు స్వయాన్ని సంగమయుగీ బ్రాహ్మణులుగా భావించండి, అప్పుడు సత్యయుగీ వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి మరియు అపారమైన సంతోషములో ఉంటారు’’

ప్రశ్న:-
జ్ఞాన అభిరుచి కల పిల్లలు ఎవరైతే ఉంటారో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
వారు ఒకరితో ఒకరు జ్ఞాన విషయాలనే మాట్లాడుకుంటారు. ఎప్పుడూ పరచింతన చేయరు. ఏకాంతములోకి వెళ్ళి విచార సాగర మంథనము చేస్తారు.

ప్రశ్న:-
ఈ సృష్టి డ్రామా యొక్క ఏ రహస్యము గురించి పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు?

జవాబు:-
ఒక్క శివబాబా తప్ప ఈ సృష్టిలో ఇంకేదీ సదా నిలిచి ఉండదు. పాత ప్రపంచములోని ఆత్మలను కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు ఎవరో ఒకరు కావాలి, డ్రామాలోని ఈ రహస్యాన్ని కూడా పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు.

ఓంశాంతి
పురుషోత్తమ సంగమయుగములో వచ్చే తండ్రి ఆత్మిక పిల్లల కొరకు అర్థం చేయిస్తున్నారు. మేము బ్రాహ్మణులము అని అయితే పిల్లలు భావిస్తారు. స్వయాన్ని బ్రాహ్మణులుగా భావిస్తున్నారా లేక అది కూడా మర్చిపోతున్నారా? బ్రాహ్మణులు తమ కులాన్ని ఎప్పుడూ మర్చిపోరు. మీకు కూడా మేము బ్రాహ్మణులము అని తప్పకుండా గుర్తుండాలి. ఈ ఒక్క విషయము గుర్తున్నా సరే, నావ తీరం చేరుకుంటుంది. సంగమములో మీరు కొత్త-కొత్త విషయాలు వింటారు కావున వాటి చింతన నడవాలి, దానిని విచార సాగర మంథనము అని అంటారు. మీరు రూప్-బసంత్ (యోగీ, జ్ఞానీ). మీ ఆత్మలో మొత్తం జ్ఞానమంతా నింపడం జరుగుతుంది కావున రత్నాలు బయటకు రావాలి. స్వయాన్ని ‘నేను సంగమయుగీ బ్రాహ్మణ్’ అని భావించాలి. కొందరు ఇది కూడా అర్థం చేసుకోరు. ఒకవేళ స్వయాన్ని సంగమయుగవాసులుగా భావించినట్లయితే సత్యయుగ వృక్షాలు కనిపిస్తూ ఉంటాయి మరియు అపారమైన సంతోషము కూడా ఉంటుంది. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో, అది లోలోపల రిపీట్ అవుతూ ఉండాలి. మనము సంగమయుగములో ఉన్నాము, ఈ విషయము కూడా మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. సంగమయుగ చదువు కొంత సమయం కూడా తీసుకుంటుంది. నరుని నుండి నారాయణునిగా, నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారయ్యే చదువు ఇదొక్కటే. మేమే దేవతలుగా, స్వర్గవాసులుగా తయారవుతున్నాము అన్నది గుర్తున్నా ఎంతో సంతోషము ఉంటుంది. సంగమయుగవాసులుగా ఉన్నట్లయితేనే స్వర్గవాసులుగా అవుతారు. ఇంతకుముందు నరకవాసులుగా ఉండేవారు, అప్పుడు పూర్తిగా చెడు అవస్థ ఉండేది, చెడు పనులు చేస్తుండేవారు. ఇప్పుడు వాటిని సమాప్తము చేయాలి. మనుష్యుల నుండి దేవతలుగా, స్వర్గవాసులుగా తయారవ్వాలి. ఎవరి పత్ని అయినా చనిపోతే, మీ యుగళ్ ఎక్కడ ఉన్నారు అని మీరు అడగండి, అప్పుడు ఆమె స్వర్గవాసి అయ్యారు అని చెప్తారు. స్వర్గము అంటే ఏమిటి అనేది వారికి తెలియదు. ఒకవేళ స్వర్గవాసి అయితే మరి సంతోషించాలి కదా. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ విషయాల గురించి తెలుసు. లోలోపల ఆలోచన నడవాలి - మేమిప్పుడు సంగమములో ఉన్నాము, పావనముగా తయారవుతున్నాము, స్వర్గ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకుంటున్నాము. ఇది ఘడియ-ఘడియ స్మరిస్తూ ఉండాలి, మర్చిపోకూడదు. కానీ మాయ మరపింపజేసి పూర్తిగా కలియుగం వారిగా చేసేస్తుంది. నడవడిక పూర్తిగా కలియుగం వారిలా అయిపోతుంది. ఆ సంతోషము యొక్క పాదరసము ఉండదు. ముఖము శవములా ఉంటుంది. తండ్రి కూడా అంటారు - అందరూ కామ చితిపై కూర్చుని కాలిపోయి శవాలలా అయిపోయారు. మేము మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతాము అని మీకు తెలుసు కావున ఆ సంతోషము ఉండాలి కదా, అందుకే అతీంద్రియ సుఖము యొక్క అనుభూతి గురించి గోప-గోపికలను అడగండి అన్న గాయనము కూడా ఉంది. మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి - మేము ఆ అనుభూతిలో ఉంటున్నామా? మీది ఈశ్వరీయ మిషన్ కదా. ఈశ్వరీయ మిషన్ ఏం పని చేస్తుంది? మొదటైతే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా, బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారుచేస్తుంది. మనము బ్రాహ్మణులము - ఇది మర్చిపోకూడదు. ఆ బ్రాహ్మణులైతే - మేము బ్రాహ్మణులము అని వెంటనే అంటారు. వారు కుఖ వంశావళి. మీరు ముఖ వంశావళి. బ్రాహ్మణులైన మీకు చాలా నషా ఉండాలి. బ్రహ్మాభోజనానికి గాయనము కూడా ఉంది. మీరు ఎవరికైనా బ్రహ్మాభోజనాన్ని తినిపిస్తే, మేము పవిత్ర బ్రాహ్మణుల చేతి భోజనాన్ని తింటున్నాము అని వారు ఎంత సంతోషపడతారు. మనసా, వాచా, కర్మణా పవిత్రముగా ఉండాలి. ఎటువంటి అపవిత్రమైన కర్తవ్యాన్ని చేయకూడదు. కొంత సమయమైతే పడుతుంది. జన్మించగానే ఎవరూ తయారవ్వరు కదా. క్షణములో జీవన్ముక్తి అన్న గాయనము ఉంది, తండ్రికి పిల్లలుగా అవ్వగానే వారసత్వము లభిస్తుంది. ఒక్కసారి గుర్తించి - వీరు ప్రజాపిత బ్రహ్మా అని అంటే చాలు. బ్రహ్మా శివునికి పుత్రుడు. నిశ్చయము ఏర్పరచుకోవడముతోనే వారసులుగా అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఏవైనా చేయకూడని పనులు చేస్తే శిక్షలు చాలా అనుభవించవలసి ఉంటుంది. కాశీలోని కత్తుల బావి గురించి అర్థం చేయించినట్లుగా, శిక్ష అనుభవించడముతో లెక్కాచారము తీరిపోతుంది. ముక్తి కోసమే బావిలోకి దూకేవారు. ఇక్కడైతే ఆ విషయము లేదు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని శివబాబా పిల్లలతో అంటారు. ఇది ఎంత సహజము. అయినా, మాయ చక్రము వచ్చేస్తుంది. మీ ఈ యుద్ధము అన్నింటికన్నా ఎక్కువ సమయము నడుస్తుంది. బాహుబలము యొక్క యుద్ధాలు ఇంత సమయము నడవవు. మీరు ఎప్పటినుండైతే వచ్చారో, అప్పటినుండే యుద్ధము ప్రారంభమైంది. పాతవారితో ఎంత యుద్ధము జరుగుతుంది, కొత్తవారు ఎవరైతే వస్తారో వారితో కూడా జరుగుతుంది. ఆ యుద్ధములో కూడా మరణిస్తూ ఉంటారు, అప్పుడు వేరేవాళ్ళు వచ్చి చేరుతూ ఉంటారు. ఇక్కడ కూడా మరణిస్తూ ఉంటారు, వృద్ధి కూడా చెందుతూ ఉంటారు. ఈ వృక్షము పెద్దగా అయితే అయ్యేదే ఉంది. తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు - వారు తండ్రి కూడా, సుప్రీమ్ టీచర్ కూడా, సద్గురువు కూడా అన్నది గుర్తుండాలి. శ్రీకృష్ణుడినైతే సద్గురువు, తండ్రి, టీచర్ అని అనరు.

మీకు అందరి కళ్యాణము చేయాలనే అభిరుచి ఉండాలి. మహారథీ పిల్లలు సేవలో ఉంటారు. వారికైతే చాలా సంతోషము ఉంటుంది. ఎక్కడి నుండైతే ఆహ్వానము లభిస్తుందో, అక్కడికి పరుగెడతారు. ప్రదర్శనీ సేవా కమిటీలోకి కూడా మంచి-మంచి పిల్లలు ఎన్నుకోబడతారు. వారికి డైరెక్షన్లు లభిస్తూ ఉంటాయి. సేవ చేస్తూ ఉన్నట్లయితే, వీరు ఈశ్వరీయ మిషన్ లోని మంచి పిల్లలు అని అంటారు. వీరైతే చాలా మంచి సేవ చేస్తున్నారని తండ్రి కూడా సంతోషిస్తారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - మేము సేవ చేస్తున్నామా? ‘ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్’ (ఈశ్వరీయ సేవలో) అని అంటారు. గాడ్ ఫాదర్ సేవ ఏమిటి? అందరికీ మన్మనాభవ అనే ఈ సందేశాన్నే ఇవ్వండి, అంతే. ఆదిమధ్యాంతాల జ్ఞానమైతే బుద్ధిలో ఉంది. మీ పేరే స్వదర్శన చక్రధారి. కావున దాని చింతన నడుస్తూ ఉండాలి. స్వదర్శన చక్రము ఎప్పుడూ ఆగదు కదా. మీరు చైతన్యమైన లైట్ హౌస్ లు. మీ మహిమ ఎంతో గానం చేయబడుతుంది. అనంతమైన తండ్రి గురించిన గాయనమును కూడా మీరు అర్థం చేసుకుంటారు. వారు జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, గీతా భగవానుడు. వారే జ్ఞానము మరియు యోగబలము ద్వారా ఈ కార్యాన్ని చేయిస్తారు, ఇందులో యోగబలము యొక్క ప్రభావము ఎంతగానో ఉంది. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. అది మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు. సన్యాసులైతే హఠయోగులు, వారు పతితులను పావనముగా తయారుచేయలేరు. జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. జ్ఞానముతో మీరు జన్మ తీసుకుంటారు. గీతను తల్లి-తండ్రి అని అంటారు. మాత-పిత ఉన్నారు కదా. మీరు శివబాబా పిల్లలు, మరి తల్లి-తండ్రి కావాలి కదా. మనుష్యులు గానం చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. దీని అర్థము ఎంత గుహ్యమైనది అనేది తండ్రి అర్థం చేయిస్తారు. గాడ్ ఫాదర్ అని అంటారు, మరి మళ్ళీ మాత, పిత అని ఎందుకు అంటారు? బాబా అర్థం చేయించారు, సరస్వతి ఉన్నా కానీ, వాస్తవానికి సత్యాతి, సత్యమైన తల్లి బ్రహ్మపుత్ర. సాగరము మరియు బ్రహ్మపుత్ర ఉన్నారు, మొట్టమొదటి సంగమము వీరిరువురిది జరుగుతుంది. బాబా వీరిలోకి ప్రవేశిస్తారు. ఇవి ఎంత సూక్ష్మమైన విషయాలు. వీటి గురించి చింతన చేసేందుకు, చాలామంది బుద్ధిలో ఈ విషయాలే ఉండవు. అటువంటివారు చాలా తక్కువ బుద్ధి కలవారు, వారు తక్కువ పదవిని పొందుతారు. అయినా కూడా, వారి కొరకు తండ్రి, స్వయాన్ని ఆత్మగా భావించండి అని అంటారు. ఇదైతే సహజమే కదా. ఆత్మలమైన మన తండ్రి పరమాత్మ. వారు ఆత్మలైన మీతో అంటారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇది ముఖ్యమైన విషయము. మందబుద్ధి కలవారు పెద్ద విషయాలను అర్థం చేసుకోలేరు, అందుకే గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. బాబా, స్మృతియాత్ర చాలా కష్టము, ఘడియ-ఘడియ మర్చిపోతాము అని అందరూ వ్రాస్తారు. ఏదో ఒక విషయములో ఓడిపోతారు. ఇది మాయ మరియు ఈశ్వరీయ పిల్లల యొక్క బాక్సింగ్. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా అర్థం చేయించారు, మాయపై విజయాన్ని పొంది కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి. మొట్టమొదట మీరు కర్మ సంబంధములోకి వచ్చారు. అందులోకి వస్తూ, వస్తూ మళ్ళీ అర్ధకల్పము తర్వాత మీరు కర్మ బంధనములోకి వచ్చేశారు. మొట్టమొదట మీరు పవిత్రాత్మగా ఉండేవారు. సుఖము లేక దుఃఖము, ఏ కర్మబంధనము ఉండేది కాదు, ఆ తర్వాత సుఖము యొక్క సంబంధములోకి వచ్చారు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు - ఒకప్పుడు మనము సంబంధములో ఉండేవారము, ఇప్పుడు దుఃఖములో ఉన్నాము, మళ్ళీ తప్పకుండా సుఖములో ఉంటాము, కొత్త ప్రపంచము ఉన్నప్పుడు యజమానులుగా ఉండేవారము, పవిత్రముగా ఉండేవారము, ఇప్పుడు పాత ప్రపంచములో పతితులుగా అయిపోయాము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము, కావున ఇది స్మృతి చేయాలి కదా.

తండ్రి అంటారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు అంతమైపోతాయి, మీరు నా ఇంటికి వచ్చేస్తారు. వయా శాంతిధామము, సుఖధామములోకి వచ్చేస్తారు. మొట్టమొదట ఇంటికి వెళ్ళాలి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రముగా అవుతారు, నేను పతిత-పావనుడను, మీరు ఇంటికి వచ్చేందుకు నేను మిమ్మల్ని పవిత్రముగా తయారుచేస్తున్నాను. ఇలా, ఇలా మీతో మీరు మాట్లాడుకోవలసి ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది. మనము ఇన్ని జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు తండ్రి పతితుల నుండి పావనులుగా తయారుచేయడానికి వచ్చారు. యోగబలముతోనే పావనముగా తయారవుతారు. ఈ యోగబలము చాలా ప్రసిద్ధమైనది, దీనిని తండ్రే నేర్పించగలరు. ఇందులో శరీరముతో ఏమీ చేయవలసిన అవసరము లేదు. కావున రోజంతా ఈ విషయాల మంథనము నడుస్తూ ఉండాలి. ఏకాంతములో ఎక్కడైనా కూర్చోండి లేక ఎక్కడికైనా వెళ్ళండి, కానీ బుద్ధిలో ఇవే తిరుగుతూ ఉండాలి. ఏకాంతమైతే చాలా ఉంది, మేడ పైన అయితే భయపడే విషయమేమీ లేదు. ప్రారంభములో మీరు ఉదయం మురళి విన్న తర్వాత పర్వతాల పైకి వెళ్ళేవారు. ఏదైతే విన్నారో, దాని గురించి చింతన చేయడానికి పర్వతాలపైకి వెళ్ళి కూర్చునేవారు. జ్ఞాన అభిరుచి కలవారు ఎవరైతే ఉంటారో, వారు పరస్పరం జ్ఞాన విషయాలనే మాట్లాడుకుంటారు. జ్ఞానము లేకపోతే ఇక పరచింతన చేస్తూ ఉంటారు. ప్రదర్శనీలో మీరు ఎంతమందికి ఈ మార్గాన్ని తెలియజేస్తారు. మా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది అని భావిస్తారు. ఇతర ధర్మాలవారికి కేవలం - తండ్రిని స్మృతి చేయండి అని ఇంతమాత్రమే అర్థం చేయించాలి. ఇతను ముసల్మాను, నేను ఫలనా... అని భావించకూడదు, అలా చేయకూడదు. ఆత్మనే చూడాలి, ఆత్మకే అర్థం చేయించాలి. ప్రదర్శనీలో అర్థం చేయించేటప్పుడు - ఆత్మనైన నేను నా సోదరుడికి అర్థం చేయిస్తున్నాను అన్న అభ్యాసము ఉండాలి. ఇప్పుడు మనకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు తండ్రి వద్దకు పదండి, చాలాకాలం నుండి విడిపోయారు అని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ సోదరులకు జ్ఞానము ఇస్తారు. అది శాంతిధామము, ఇక్కడైతే ఎంత అశాంతి, దుఃఖము మొదలైనవి ఉన్నాయి. ఇప్పుడు తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించే అభ్యాసము చేసినట్లయితే ఇక నామము, రూపము, దేహము అన్నింటినీ మర్చిపోతారు. ఫలానావారు ముసల్మానులు అని ఇలా ఎందుకు అనుకుంటారు? ఆత్మగా భావిస్తూ అర్థం చేయించండి. ఈ ఆత్మ మంచిదా లేక చెడ్డదా అన్నది అర్థం చేసుకోగలరు. చెడ్డవారి నుండి దూరముగా వెళ్ళిపోవాలి అని ఆత్మ గురించే చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రికి పిల్లలు. ఇక్కడ పాత్రను అభినయించి ఇప్పుడిక తిరిగి వెళ్ళాలి, పావనముగా అవ్వాలి. తండ్రిని తప్పకుండా స్మృతి చేయవలసి ఉంటుంది. పావనముగా అయితే పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. నోటి ద్వారా ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. తండ్రి కూడా ప్రతిజ్ఞ చేయమని చెప్తారు. తండ్రి యుక్తిని కూడా తెలియజేస్తారు - ఆత్మలైన మీరు పరస్పరం సోదరులు, మళ్ళీ శరీరములోకి వచ్చినప్పుడు సోదరీ-సోదరులు. సోదరీ-సోదరులు ఎప్పుడూ వికారాలలోకి వెళ్ళలేరు. పవిత్రముగా అయి తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మాయతో ఓడిపోతే మళ్ళీ లేచి నిలబడండి అని అర్థం చేయించడం జరుగుతుంది. ఎంతగా నిలబడతారో, అంతగా ప్రాప్తి లభిస్తుంది. నష్టము మరియు జమ అనేవి ఉంటాయి కదా. అర్ధకల్పము జమ, మళ్ళీ రావణ రాజ్యములో నష్టమైపోతుంది. లెక్క ఉంది కదా. విజయము జమ, ఓటమి నష్టము. కావున స్వయాన్ని పూర్తిగా చెక్ చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పిల్లలైన మీకు సంతోషము కలుగుతుంది. వారు కేవలం మహిమ చేస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. వివేకహీనతతో అన్నీ చేస్తుంటారు. మీరైతే పూజ మొదలైనవి చేయరు కానీ గాయనమైతే చేస్తారు కదా. ఆ ఒక్క తండ్రి గాయనమే అవ్యభిచారి అయినది. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని తమంతట తామే చదివిస్తారు. మీరు ఏ ప్రశ్నలూ అడగవలసిన అవసరము లేదు. చక్రము స్మృతిలో ఉండాలి. మాయపై మేము ఎలా విజయము పొందుతాము, మళ్ళీ ఎలా ఓడిపోతాము అన్నది అర్థం చేసుకోవాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఓడిపోవడం వలన 100 రెట్లు శిక్ష పడుతుంది. తండ్రి అంటారు - సద్గురువును నిందింపజేయకండి లేదంటే ఉన్నత స్థానాన్ని పొందలేరు. ఇది సత్యనారాయణుని కథ, ఇది ఎవ్వరికీ తెలియదు. గీతను, సత్యనారాయణ కథను వేరు చేసేసారు. నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు ఈ గీత ఉంది.

తండ్రి అంటారు, నేను మీకు నరుని నుండి నారాయణునిగా తయారయ్యేందుకు కథను వినిపిస్తాను, దీనిని గీత అని కూడా అంటారు, అమరనాథుని కథ అని కూడా అంటారు. మూడవ నేత్రాన్ని తండ్రే ఇస్తారు. మనము దేవతలుగా అవుతాము కావున గుణాలు కూడా తప్పకుండా ఉండాలి అని కూడా మీకు తెలుసు. ఈ సృష్టిలో ఏ వస్తువూ సదాకాలము ఉండదు. సదాకాలము ఉండేది శివబాబా ఒక్కరే, మిగిలినవారందరూ కిందికి రావలసిందే. కానీ వారు కూడా సంగమములోనే వస్తారు, అందరినీ తిరిగి తీసుకువెళ్తారు. పాత ప్రపంచములోని ఆత్మలను కొత్త ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు ఎవరో అయితే కావాలి కదా. కావున డ్రామాలో ఈ రహస్యాలన్నీ ఉన్నాయి. తండ్రి వచ్చి పవిత్రముగా తయారుచేస్తారు. ఏ దేహధారినీ భగవంతుడు అని అనలేరు. ఈ సమయములో ఆత్మ రెక్కలు విరిగిపోయి ఉన్నాయి కావున ఎగరలేదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి వచ్చి జ్ఞానము మరియు యోగము అనే రెక్కలను ఇస్తారు. యోగబలముతో మీ పాపాలు భస్మమవుతాయి, పుణ్యాత్ములుగా అవుతారు. మొట్టమొదటైతే కృషి కూడా చేయవలసి ఉంటుంది, అందుకే తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, చార్ట్ పెట్టండి. ఎవరి చార్టు అయితే బాగుంటుందో వారు వ్రాస్తారు మరియు వారికి సంతోషము ఉంటుంది. ఇప్పుడు అందరూ కష్టపడతారు కానీ చార్ట్ వ్రాయకపోతే యోగములో పదును నిండదు. చార్ట్ వ్రాయడము వలన చాలా లాభముంది. చార్టుతో పాటు పాయింట్లు కూడా కావాలి. చార్టులోనైతే - సర్వీస్ ఎంత చేసారు మరియు స్మృతి ఎంత చేసారు, ఈ రెండూ వ్రాస్తారు. అంతిమములో ఇంకేమీ గుర్తురానంతగా పురుషార్థము చెయ్యాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పుణ్యాత్మగా అయిపోవాలి - ఈ కృషి చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏకాంతములో జ్ఞాన మనన చింతన చేయాలి. స్మృతియాత్రలో ఉంటూ మాయపై విజయము పొంది కర్మాతీత అవస్థను పొందాలి.

2. ఎవరికైనా జ్ఞానాన్ని వినిపించే సమయములో - నేను నా ఆత్మిక సోదరునికి జ్ఞానము వినిపిస్తున్నాను అని బుద్ధిలో ఉండాలి. నామము, రూపము, దేహము అన్నీ మర్చిపోవాలి. పావనముగా అవుతాము అనే ప్రతిజ్ఞ చేసి, పావనముగా అయి పావన ప్రపంచానికి అధిపతులుగా అవ్వాలి.

వరదానము:-
స్వయం పట్ల కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా అయి తండ్రి సమానముగా అఖండదాని, పరోపకారి భవ

ఏ విధముగా బ్రహ్మాబాబా స్వయము యొక్క సమయాన్ని కూడా సేవ కొరకు ఇచ్చారు, స్వయము నిర్మానులుగా అయి పిల్లలకు గౌరవాన్ని ఇచ్చారు, వారు చేసిన పనులకు వచ్చే పేరు అనే ప్రాప్తిని కూడా త్యాగము చేశారు, పేరు, ప్రతిష్ట, గౌరవము, అన్నింటిలోనూ పరోపకారిగా అయ్యారు, స్వయము యొక్క పేరును త్యాగము చేసి ఇతరుల పేరును ప్రఖ్యాతము చేశారు, స్వయాన్ని సదా సేవాధారిగానే ఉంచుకున్నారు, పిల్లలను యజమానులుగా చేసారు, స్వయము యొక్క సుఖము పిల్లల సుఖములో ఉంది అని భావించారు, ఈ విధముగా తండ్రి సమానముగా కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా అనగా నిశ్చింత ఫకీరుగా అయి అఖండదానిగా, పరోపకారిగా అవ్వండి, అప్పుడు విశ్వకళ్యాణ కార్యములో తీవ్ర గతి వచ్చేస్తుంది, కేసులు మరియు కథలు సమాప్తమైపోతాయి.

స్లోగన్:-
జ్ఞానము, గుణాలు మరియు ధారణలో సింధువుగా అవ్వండి, స్మృతిలో బిందువుగా అవ్వండి.

మీ శక్తిశాలీ మనసా ద్వారా సకాష్ ఇచ్చే సేవ చెయ్యండి

ఇప్పుడు పిల్లలైన మీరు మీ శ్రేష్ఠ శక్తిశాలీ సంకల్పాల ద్వారా సకాష్ ఇవ్వండి. బలహీనులకు బలాన్ని ఇవ్వండి. మీ పురుషార్థ సమయాన్ని ఇతరులకు సహయోగాన్ని ఇవ్వటములో పెట్టండి. ఇతరులకు సహయోగాన్ని ఇవ్వటము అనగా స్వయము జమ చేసుకోవటము. ఇప్పుడు ఎటువంటి అలను వ్యాపింపజేయండి అంటే - పరిష్కారము తీసుకోవటము కాదు, పరిష్కారము ఇవ్వాలి. ఇవ్వటములో తీసుకోవటము ఇమిడి ఉంది.