07-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అన్నింటికన్నా మంచి దైవీ గుణము శాంతిగా ఉండడము, ఎక్కువగా శబ్దములోకి రాకుండా ఉండడము, మధురముగా మాట్లాడడము, పిల్లలైన మీరు ఇప్పుడు టాకీ నుండి మూవీలోకి, మూవీ నుండి సైలెన్స్ లోకి వెళ్తారు, అందుకే ఎక్కువగా శబ్దములోకి రాకండి’’

ప్రశ్న:-
ఏ ముఖ్యమైన ధారణ ఆధారముతో సర్వ దైవీ గుణాలు స్వతహాగానే వస్తూ ఉంటాయి?

జవాబు:-
ముఖ్యమైనది పవిత్రత యొక్క ధారణ. దేవతలు పవిత్రముగా ఉంటారు, అందుకే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. ఈ ప్రపంచములో ఎవరిలోనూ కూడా దైవీ గుణాలు ఉండవు. రావణ రాజ్యములో దైవీ గుణాలు ఎక్కడి నుండి వస్తాయి? రాయల్ పిల్లలైన మీరు ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు.

పాట:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు...

ఓంశాంతి
పాడైనదానిని బాగు చేసేవారు ఒక్కరేనని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గములో అనేకుల వద్దకు వెళ్తారు. ఎన్ని తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. పాడైనదానిని బాగు చేసేవారు, పతితులను పావనముగా చేసేవారు ఒక్కరే, సద్గతిదాత, మార్గదర్శకుడు మరియు ముక్తిప్రదాత కూడా వారు ఒక్కరే. ఇప్పుడు గాయనము ఈ విధంగా ఉంది కానీ అనేకమంది మనుష్యులు, అనేక ధర్మాలు, మఠాలు, మార్గాలు, శాస్త్రాలు ఉన్న కారణముగా అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు. సుఖము మరియు శాంతి కొరకు సత్సంగాలకు వెళ్తారు కదా. ఎవరైతే వెళ్ళరో వారు మాయావీ నషాలోనే నిమగ్నమై ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమము అని కూడా పిల్లలైన మీకు తెలుసు. సత్యయుగము ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉన్నది ఏమిటి అనేది మనుష్యులకు తెలియదు. కొత్త ప్రపంచములో సుఖము ఉంటుంది, పాత ప్రపంచములో తప్పకుండా దుఃఖము ఉంటుంది అని చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. ఈ పాత ప్రపంచములో అనేకమంది మనుష్యులు ఉన్నారు, అనేక ధర్మాలు ఉన్నాయి. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇది కలియుగము, సత్యయుగము గతించిపోయింది. అక్కడ ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము మాత్రమే ఉండేది, ఇంకే ఇతర ధర్మాలు లేవు. బాబా చాలా సార్లు అర్థం చేయించారు, మళ్ళీ అర్థం చేయిస్తున్నారు, మీ వద్దకు ఎవరైతే వస్తారో వారికి కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము యొక్క వ్యత్యాసాన్ని చూపించాలి. వారు ఏమన్నా చెప్పనివ్వండి, కొందరు పది వేల సంవత్సరాల ఆయువు అని అంటారు, కొందరు ముప్పై వేల సంవత్సరాలు ఆయువు అని అంటారు. అనేక మతాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వారి వద్ద ఉన్నదే శాస్త్రాల మతము. అనేక శాస్త్రాలు, అనేక మతాలు. అవి మనుష్యుల మతాలు కదా. శాస్త్రాలను కూడా వ్రాసేది మనుష్యులే కదా! దేవతలేమీ శాస్త్రాలను వ్రాయరు. సత్యయుగములో దేవీ-దేవతా ధర్మము ఉంటుంది. వారిని మనుష్యులు అని కూడా అనలేము. మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరైనా కలిసినప్పుడు వారికి ఈ విషయాలను కూర్చుని వినిపించాలి. ఇది ఆలోచించవలసిన విషయము. కొత్త ప్రపంచములో ఎంత కొద్ది మంది మనుష్యులు ఉంటారు. పాత ప్రపంచములో ఎంతగా వృద్ధి జరుగుతుంది. సత్యయుగములో కేవలం ఒక్క దేవతా ధర్మము ఉండేది. మనుష్యులు కూడా తక్కువమందే ఉండేవారు. దైవీ గుణాలు దేవతలలోనే ఉంటాయి, మనుష్యులలో ఉండవు. అందుకే మనుష్యులు వెళ్ళి దేవతల ఎదురుగా నమస్కరిస్తారు కదా. దేవతల మహిమను గానం చేస్తారు. వారు స్వర్గవాసులు, మనము నరకవాసులము, కలియుగవాసులము అని వారికి తెలుసు. మనుష్యులలో దైవీ గుణాలు ఉండవు. ఎవరైనా ఫలానా వారిలో చాలా మంచి దైవీ గుణాలు ఉన్నాయి అని అంటే వారికి చెప్పండి - లేదు, దైవీ గుణాలు దేవతలలోనే ఉంటాయి ఎందుకంటే వారు పవిత్రులు. ఇక్కడ పవిత్రముగా లేని కారణముగా ఎవరిలోనూ దైవీ గుణాలు ఉండవు ఎందుకంటే ఇది ఆసురీ రావణ రాజ్యము కదా. కొత్త వృక్షములో దైవీ గుణాలు కలిగిన దేవతలు ఉంటారు, ఆ తర్వాత వృక్షము పాతదిగా అవుతుంది. రావణ రాజ్యములో దైవీ గుణాలు కలిగినవారు ఉండరు. సత్యయుగములో ఆది సనాతన దేవీ-దేవతల ప్రవృత్తి మార్గము ఉండేది. ప్రవృత్తి మార్గము వారి మహిమయే గానము చేయబడింది. సత్యయుగములో మనము పవిత్ర దేవీ-దేవతలుగా ఉండేవారము, అక్కడ సన్యాస మార్గము ఉండేది కాదు. ఎన్నో పాయింట్లు లభిస్తాయి. కానీ అన్ని పాయింట్లు ఎవరి బుద్ధిలోనూ ఉండవు, పాయింట్లు మర్చిపోతారు, అందుకే ఫెయిల్ అవుతారు, దైవీ గుణాలను ధారణ చేయరు. ఒక్క దైవీ గుణము మంచిది, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఉండడము, మధురముగా మాట్లాడడము, చాలా తక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే పిల్లలైన మీరు టాకీ నుండి మూవీలోకి, మూవీ నుండి సైలెన్స్ లోకి వెళ్ళాలి. కావున టాకీని చాలా తగ్గించాలి. ఎవరైతే చాలా తక్కువగా, మెల్లగా మాట్లాడతారో వారు రాయల్ కుటుంబానికి చెందినవారు అని భావిస్తారు. నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి.

సన్యాసులైనా లేక ఇంకెవరైనా సరే వారికి కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము యొక్క వ్యత్యాసాన్ని తెలియజేయాలి. సత్యయుగములో దైవీ గుణాలు కల దేవతలు ఉండేవారు, అది ప్రవృత్తి మార్గము. సన్యాసులైన మీ ధర్మమే వేరు. కొత్త సృష్టి సతోప్రధానముగా ఉంటుంది, ఇప్పుడు తమోప్రధానముగా ఉంది అన్నదైతే అర్థం చేసుకున్నారు కదా. ఆత్మ తమోప్రధానముగా అయినట్లయితే శరీరము కూడా తమోప్రధానమైనదే లభిస్తుంది. ఇప్పుడు ఉన్నదే పతిత ప్రపంచము. అందరినీ పతితులు అని అంటారు. అది పావన సతోప్రధాన ప్రపంచము. ఆ కొత్త ప్రపంచమే ఇప్పుడు పాతదిగా అవుతుంది. ఈ సమయములో మనుష్యాత్మలు అందరూ నాస్తికులు, అందుకే గొడవలు జరుగుతున్నాయి. నాథుడి గురించి తెలియని కారణముగా పరస్పరములో కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. రచయిత మరియు రచన గురించి తెలిసినవారిని ఆస్తికులు అని అంటారు. సన్యాస ధర్మము వారికి కొత్త ప్రపంచము గురించి తెలియనే తెలియదు. కావున వారు అక్కడికి రారు. తండ్రి అర్థం చేయించారు, ఇప్పుడు ఆత్మలన్నీ తమోప్రధానముగా అయిపోయాయి, మళ్ళీ ఆత్మలన్నింటినీ సతోప్రధానముగా ఎవరు తయారుచేస్తారు? ఆ విధంగా తండ్రియే తయారుచేయగలరు. సతోప్రధాన ప్రపంచములో కొద్దిమంది మనుష్యులు మాత్రమే ఉంటారు. మిగిలినవారందరూ ముక్తిధామములో ఉంటారు. బ్రహ్మతత్వములో ఆత్మలైన మనము నివాసము ఉంటాము. దానిని బ్రహ్మాండము అని అంటారు. ఆత్మ అయితే అవినాశీ. ఇది అవినాశీ నాటకము, ఇందులో ఆత్మలందరికీ పాత్ర ఉంది. ఈ నాటకము ఎప్పుడు ప్రారంభమయ్యింది? ఇది ఎప్పుడూ ఎవరూ చెప్పలేరు. ఇది అనాది డ్రామా కదా. తండ్రికి కేవలం పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేసేందుకు రావలసి ఉంటుంది. అలాగని తండ్రి కొత్త సృష్టిని రచిస్తారని కాదు. ఎప్పుడైతే పతితముగా అవుతారో అప్పుడే పిలుస్తారు, సత్యయుగములో ఎవరూ పిలవరు. అది ఉన్నదే పావన ప్రపంచము. రావణుడు పతితులుగా తయారుచేస్తాడు, పరమపిత పరమాత్మ వచ్చి పావనులుగా తయారుచేస్తారు. ఇరువురి రాజ్యము సగం-సగం ఉంటుంది అని తప్పకుండా అంటారు. బ్రహ్మా యొక్క పగలు మరియు బ్రహ్మా యొక్క రాత్రి సగం-సగం ఉంటాయి. జ్ఞానముతో పగలు వస్తుంది, అక్కడ అజ్ఞానమే ఉండదు. భక్తి మార్గాన్ని అంధకార మార్గమని అంటారు. దేవతలు పునర్జన్మలను తీసుకుంటూ-తీసుకుంటూ మళ్ళీ అంధకారములోకి వస్తారు, అందుకే మనుష్యులు ఏ విధంగా సతో, రజో, తమోలలోకి వస్తారు అనేది ఈ మెట్ల వరుస చిత్రములో చూపించారు. ఇప్పుడు అందరిదీ శిథిలావస్థ. తండ్రి ట్రాన్స్ఫర్ చేయడానికి అనగా మనుష్యులను దేవతలుగా తయారుచేయడానికి వస్తారు. దేవతలు ఉన్నప్పుడు ఆసురీ గుణాలు కలిగిన మనుష్యులు ఉండేవారు కాదు. మరి ఇప్పుడు ఈ ఆసురీ గుణాలు కలవారిని మళ్ళీ దైవీ గుణాలు కలవారిగా ఎవరు తయారుచేస్తారు? ఇప్పుడైతే అనేక ధర్మాలు ఉన్నాయి, అనేకమంది మనుష్యులు ఉన్నారు. కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. సత్యయుగములో ఒకే ధర్మము ఉంటుంది కావున దుఃఖము యొక్క విషయమేమీ ఉండదు. శాస్త్రాలలోనైతే ఎన్నో కట్టు కథలు ఉన్నాయి, వాటిని జన్మ-జన్మాంతరాలుగా చదువుతూ వచ్చారు. తండ్రి అంటారు, ఇవన్నీ భక్తి మార్గపు శాస్త్రాలు, వీటి ద్వారా మీరు నన్ను పొందలేరు. నేను స్వయం ఒక్కసారి మాత్రమే వచ్చి అందరి సద్గతిని చేయవలసి ఉంటుంది. ఊరికే అలా ఎవరూ తిరిగి వెళ్ళలేరు. చాలా ఓపికగా కూర్చుని అర్థం చేయించాలి, హంగామా కూడా ఉండకూడదు. వాళ్ళకు వాళ్ళ అహంకారము ఉంటుంది కదా. సాధు-సన్యాసులతోపాటు అనుచరులు కూడా ఉంటారు. వీరికి కూడా బ్రహ్మాకుమారీల గారడి అంటుకుంది అని వాళ్ళు వెంటనే అనేస్తారు. తెలివైన మనుష్యులు ఎవరైతే ఉంటారో వారు - ఇవి ఆలోచించదగిన విషయాలు అని అంటారు. మేళాలు మరియు ప్రదర్శనీలలో అనేక రకాలవారు వస్తారు కదా. ప్రదర్శనీలు మొదలైనవాటికి ఎవరైనా వచ్చినప్పుడు - ఏ విధంగా బాబా ఓపికగా అర్థం చేయిస్తున్నారో అలా వారికి కూడా చాలా ఓపికగా అర్థం చేయించవలసి ఉంటుంది. చాలా గట్టిగా మాట్లాడకూడదు. ప్రదర్శనీలో చాలామంది గుంపుగా చేరుతారు కదా. అప్పుడు వారికి ఇలా చెప్పాలి - మీరు కొద్దిగా సమయాన్ని కేటాయించి ఏకాంతములో వచ్చి అర్థం చేసుకున్నట్లయితే మీకు రచయిత మరియు రచన యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తాము. రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని రచయిత అయిన తండ్రియే అర్థం చేయిస్తారు. ఇక మిగిలినవారంతా నేతి-నేతి (తెలియదు-తెలియదు) అనే అంటూ ఉంటారు. మనుష్యులెవ్వరూ కూడా అక్కడికి వెళ్ళలేరు. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది, ఇక ఆ తర్వాత జ్ఞానము యొక్క అవసరము ఉండదు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవరూ అర్థం చేయించలేరు. అర్థం చేయించేవారు ఎవరైనా వృద్ధులు అయినట్లయితే మనుష్యులు భావిస్తారు - వీరు కూడా అనుభవజ్ఞులే, తప్పకుండా సత్సంగాలు మొదలైనవి చేసి ఉంటారు అని. చిన్న పిల్లలెవరైనా అర్థం చేయించినట్లయితే - వీరికి ఏం తెలుసు అని అనుకుంటారు. కావున అటువంటివారిపై వృద్ధుల యొక్క ప్రభావము పడవచ్చు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు, తమోప్రధానము నుండి సతోప్రధానముగా తయారుచేస్తారు. వారికి మాతలు కూర్చుని అర్థం చేయించినట్లయితే సంతోషిస్తారు. వారికి ఇలా చెప్పండి - జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞాన కలశాన్ని మాతలైన మాకు ఇచ్చారు, దానిని మేము మళ్ళీ ఇతరులకు ఇస్తాము. చాలా నమ్రతతో చెప్తూ ఉండాలి. శివుడే జ్ఞానసాగరుడు, వారే మనకు జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి అంటారు - నేను మాతలైన మీ ద్వారా ముక్తి-జీవన్ముక్తుల గేట్లను తెరుస్తాను, ఇంకెవ్వరూ తెరవలేరు. మనము ఇప్పుడు పరమాత్మ ద్వారా చదువుకుంటున్నాము, మనల్ని మనుష్యులెవ్వరూ చదివించరు. జ్ఞానసాగరుడు ఒక్క పరమపిత పరమాత్మయే. మీరందరూ భక్తి సాగరులు, మీరు భక్తి యొక్క అథారిటీ కలవారు, అంతేకానీ జ్ఞానము యొక్క అథారటీ కలవారు కాదు. జ్ఞానము యొక్క అథారిటీ కలవాడిని కేవలం నేను ఒక్కడిని మాత్రమే. మహిమ కూడా ఒక్కరికే చేస్తారు. వారే ఉన్నతోన్నతమైనవారు. మనము వారినే నమ్ముతాము. వారు మనకు బ్రహ్మా తనువు ద్వారా చదివిస్తారు, అందుకే బ్రహ్మాకుమార-కుమారీలు అని అంటూ ఉంటారు. ఈ విధంగా చాలా మధురమైన రూపములో కూర్చుని అర్థం చేయించండి. ఎంత చదువుకున్నవారైనా సరే, ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. మొట్టమొదటైతే తండ్రిపైనే నిశ్చయము ఏర్పరచాలి. మొట్టమొదట మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి - రచయిత తండ్రియా, కాదా. అందరి రచయిత ఒక్క శివబాబాయే, వారే జ్ఞానసాగరుడు, వారే తండ్రి, టీచర్, సద్గురువు. మొట్టమొదటైతే ఈ నిశ్చయబుద్ధి కలిగి ఉండాలి - రచయిత అయిన తండ్రియే రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు అని. వారే మనకు అర్థం చేయిస్తున్నారు, వారు తప్పకుండా రైట్ విషయాలనే అర్థం చేయిస్తారు. ఇకప్పుడు ఏ ప్రశ్నలు తలెత్తవు. తండ్రి వచ్చేదే సంగమములో. వారు కేవలం - నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమైపోతాయి అని చెప్తున్నారు. నా పనే పతితులను పావనముగా చేయడము. ఇప్పుడు ఇది తమోప్రధాన ప్రపంచము. పతిత-పావనుడైన తండ్రి లేకుండా ఎవరికీ జీవన్ముక్తి లభించదు. అందరూ గంగా స్నానాలు చేయడానికి వెళ్తున్నారంటే వారు పతితులనే కదా. గంగా స్నానాలు చేయండి అని నేను చెప్పను. నేను, నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్తాను. నేను ప్రేయసులైన మీ అందరికీ ప్రియుడిని. అందరూ ఒక్క ప్రియుడినే స్మృతి చేస్తారు. ఈ రచన యొక్క సృష్టికర్త ఒక్క తండ్రియే. వారంటారు, దేహీ-అభిమానులుగా అయి నన్ను స్మృతి చేసినట్లయితే ఈ యోగాగ్నితో వికర్మలు వినాశనమవుతాయి. పాత ప్రపంచము మారుతూ ఉన్న ఈ సమయములోనే తండ్రి యోగాన్ని నేర్పిస్తారు. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు మనము దేవతలుగా తయారవుతున్నాము. తండ్రి ఎంత సహజముగా తెలియజేస్తున్నారు. తండ్రి ఎదురుగా వింటారు కానీ ఏకరసముగా అయి వినరు. బుద్ధి అటూ-ఇటూ పరిగెడుతూ ఉంటుంది. భక్తిలో కూడా ఈ విధంగా జరుగుతుంది. మొత్తం రోజంతా వ్యర్థముగా పోతుంది, ఇక ఏదైతే సమయాన్ని భక్తి చేయడానికి నియమించుకుంటారో అందులో కూడా బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటుంది. అందరికీ ఇటువంటి పరిస్థితియే ఉండి ఉంటుంది. మాయ ఉంది కదా!

కొందరు పిల్లలు తండ్రి ఎదురుగా కూర్చుని ధ్యానములోకి వెళ్ళిపోతారు, ఇది కూడా సమయాన్ని వ్యర్థము చేసుకోవడమే కదా. సంపాదనైతే జరగలేదు. తండ్రి అయితే అంటారు - స్మృతిలో ఉండండి, దాని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ధ్యానములోకి వెళ్ళినట్లయితే బుద్ధిలో తండ్రి స్మృతి ఉండదు. ఈ విషయాలన్నింటిలో ఎంతో గోలుమాలు ఉంది. మీరైతే కళ్ళు కూడా మూసుకోకూడదు. మీరు స్మృతిలో కూర్చోవాలి కదా. యోగములో కళ్ళు తెరుచుకునేందుకు భయపడకూడదు. కళ్ళు తెరుచుకుని ఉండాలి. బుద్ధిలో ప్రియుడే గుర్తుండాలి. కళ్ళు మూసుకుని కూర్చోవడమనేది నియమము కాదు. తండ్రి అంటారు, స్మృతిలో కూర్చోండి. వారు కళ్ళు మూసుకోండి అని చెప్పరు. కళ్ళు మూసుకుని, తల కిందకు దించుకుని కూర్చున్నట్లయితే బాబా ఎలా చూస్తారు? కళ్ళు ఎప్పుడూ మూసుకోకూడదు. కళ్ళు మూసుకుంటున్నారంటే ఏదో తేడా ఉన్నట్లు, ఇంకెవరినో స్మృతి చేస్తూ ఉండవచ్చు. తండ్రి అంటారు, ఇంకే ఇతర మిత్ర-సంబంధీకులు మొదలైనవారిని స్మృతి చేసినట్లయితే మీరు సత్యమైన ప్రేయసులు కాదు. సత్యమైన ప్రేయసులుగా అయినప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. శ్రమ అంతా స్మృతిలోనే ఉంది. దేహాభిమానములో తండ్రిని మర్చిపోతారు, ఇక ఆ తర్వాత ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. చాలా మధురముగా కూడా తయారవ్వాలి. వాతావరణము కూడా మధురముగా ఉండాలి, ఏ శబ్దమూ ఉండకూడదు. ఎవరైనా వస్తే వీరు ఎంత మధురముగా మాట్లాడుతున్నారు అని భావించాలి. చాలా సైలెన్స్ (నిశ్శబ్దత) ఉండాలి. కొట్లాడుకోవటం-గొడవపడటం చేయకూడదు. లేకపోతే తండ్రి, టీచర్ మరియు గురువును, ముగ్గురుని నిందింపజేస్తారు. అటువంటివారు ఇక పదవి కూడా చాలా తక్కువది పొందుతారు. పిల్లలకు ఇప్పుడు వివేకమైతే లభించింది. తండ్రి అంటారు - ఉన్నత పదవిని పొందడానికే నేను మిమ్మల్ని చదివిస్తున్నాను. మీరు చదువుకుని ఇతరులను చదివించాలి. మేమైతే ఎవరికీ వినిపించడం లేదు కావున ఇక ఏ పదవిని పొందుతాము అని స్వయం కూడా అర్థం చేసుకోగలరు. ప్రజలను తయారుచేసుకోకపోతే మరి ఎలా తయారవుతారు! యోగము లేదు, జ్ఞానము లేదు అంటే ఇక తప్పకుండా చదువుకున్నవారి ముందు సేవ చేయవలసి వస్తుంది. మిమ్మల్ని మీరు చూసుకోవాలి - ఈ సమయములో ఫెయిల్ అయితే, తక్కువ పదవిని పొందితే ఇక కల్ప-కల్పాంతరాలు తక్కువ పదవే లభిస్తుంది. తండ్రి పనే అర్థం చేయించడము, అర్థం చేసుకోకపోతే తమ పదవిని తామే నష్టపరుచుకుంటారు. ఎవరికి ఎలా అర్థం చేయించాలి అనేది కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత తక్కువగా మరియు మెల్లగా మాట్లాడుతారో అంత మంచిది. బాబా సేవ చేసేవారి మహిమను కూడా చేస్తారు కదా. చాలా మంచి సేవ చేసినట్లయితే బాబా హృదయాన్ని అధిరోహిస్తారు. సేవ ఆధారముగానే హృదయాన్ని అధిరోహిస్తారు కదా. స్మృతియాత్ర కూడా తప్పకుండా ఉండాలి, అప్పుడే సతోప్రధానముగా అవుతారు. శిక్షలు ఎక్కువ పొందినట్లయితే పదవి తగ్గిపోతుంది. పాపాలు భస్మమవ్వకపోతే చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా తగ్గిపోతుంది. దానినే నష్టము అని అంటారు. ఇది కూడా వ్యాపారమే కదా. కావున నష్టములోకి వెళ్ళకూడదు. దైవీ గుణాలను ధారణ చేయండి. ఉన్నతముగా తయారవ్వాలి. బాబా ఉన్నతి కొరకు అనేక రకాల విషయాలను వినిపిస్తారు, ఇప్పుడు ఎవరైతే చేస్తారో వారు పొందుతారు. మీరు స్వర్గవాసులుగా అవ్వాలి, గుణాలు కూడా అటువంటివే ధారణ చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరితోనైనా సరే చాలా నమ్రతతో మరియు మెల్లగా మాట్లాడాలి. మాట-వ్యవహారము చాలా మధురముగా ఉండాలి. నిశ్శబ్దమైన వాతావరణము ఉండాలి. ఏ శబ్దము లేకపోతే సేవలో సఫలత లభిస్తుంది.

2. సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అయి ఒక్క ప్రియుడినే స్మృతి చేయాలి. స్మృతి చేసే సమయములో ఎప్పుడూ కళ్ళు మూసుకుని, తల దించుకుని కూర్చోకూడదు. దేహీ-అభిమానులుగా అయి ఉండాలి.

వరదానము:-
సర్వ ఖజానాలను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించే అఖండ మహాదానీ భవ

ఏ విధంగా తండ్రి భాండాగారము సదా నడుస్తూనే ఉంటుందో, రోజూ ఇస్తూనే ఉంటారో, అలా మీది కూడా అఖండ భాండాగారము నడుస్తూ ఉండాలి ఎందుకంటే మీ వద్ద జ్ఞానము యొక్క, శక్తుల యొక్క, సంతోషాల యొక్క సంపన్నమైన భాండాగారాలు ఉన్నాయి. వీటిని మీతోపాటు ఉంచుకోవటములో లేక ఉపయోగించటములో ఎటువంటి ప్రమాదమూ లేదు. ఈ భాండాగారము తెరిచి ఉంచినట్లయితే దొంగలు రారు. మూసి ఉంచితే దొంగలు వస్తారు. అందుకే రోజూ మీకు లభించిన ఖజానాలను చూసుకోండి మరియు వాటిని స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించండి, అప్పుడు అఖండ మహాదానులుగా అవుతారు.

స్లోగన్:-
విన్నదానిని మననము చేయండి, మననము చేయడము ద్వారానే శక్తిశాలిగా అవుతారు.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

సేవ మరియు స్థితి, తండ్రి మరియు మీరు, ఇది కంబైండ్ స్థితి. కంబైండ్ సేవ చేసినట్లయితే సదా ఫరిశ్తా స్వరూపాన్ని అనుభవము చేస్తారు. సదా తండ్రితో పాటు ఉన్నాము మరియు వారి సహచరులుగా కూడా ఉన్నాము - ఈ డబల్ అనుభవము ఉండాలి. స్వయము యొక్క లగనములో సదా తోడును అనుభవము చేయండి మరియు సేవలో సదా సహచరుడిని అనుభవము చేయండి.