07-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు పరస్పరం ఆత్మిక సోదరులు, మీకు పరస్పరం ఒకరి పట్ల ఒకరికి అపారమైన ప్రేమ ఉండాలి, మీరు ప్రేమతో నిండిన గంగలుగా అవ్వండి, ఎప్పుడూ కొట్లాడుకోకండి, గొడవపడకండి’’

ప్రశ్న:-
ఆత్మిక తండ్రికి ఏ పిల్లలు చాలా-చాలా ప్రియమనిపిస్తారు?

జవాబు:-
1) ఎవరైతే శ్రీమతముపై మొత్తం విశ్వం యొక్క కళ్యాణాన్ని చేస్తున్నారో, 2) ఎవరైతే పుష్పాలుగా అయ్యారో, ఎప్పుడూ ఎవ్వరికీ ముల్లు గుచ్చరో, పరస్పరం చాలా-చాలా ప్రేమగా ఉంటారో, ఎప్పుడూ అలగరో - అటువంటి పిల్లలు తండ్రికి చాలా-చాలా ప్రియమనిపిస్తారు. ఎవరైతే దేహాభిమానంలోకి వచ్చి పరస్పరం కొట్లాడుకుంటారో, ఉప్పునీరులా అవుతారో, వారు తండ్రి పరువును పోగొడతారు. వారు తండ్రిని నిందింపజేసే నిందకులు.

ఓంశాంతి
ఏ విధంగానైతే ఆత్మిక పిల్లలకు ఇప్పుడు ఆత్మిక తండ్రి ప్రియమనిపిస్తారో, అలాగే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు కూడా ప్రియమనిపిస్తారు ఎందుకంటే పిల్లలు శ్రీమతంపై మొత్తం విశ్వం యొక్క కళ్యాణాన్ని చేస్తున్నారు, కళ్యాణకారులు అందరూ ప్రియమనిపిస్తారు. మీరు కూడా పరస్పరం సోదరులు, కావున మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు ప్రియమనిపిస్తారు. తండ్రి యొక్క పిల్లలకు పరస్పరం ఎంతగానైతే ప్రేమ ఉంటుందో, అంతగా బయటివారి పట్ల ఉండదు. మీకు కూడా పరస్పరం చాలా-చాలా ప్రేమ ఉండాలి. ఒకవేళ సోదరులు ఇక్కడే కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటే లేక ప్రేమించుకోకపోతే, ఇక వారు సోదరులు కానట్లే. మీకు పరస్పరం ప్రేమ ఉండాలి. తండ్రికి కూడా ఆత్మల పట్ల ప్రేమ ఉంది కదా. కావున ఆత్మలకు కూడా పరస్పరం ఎంతో ప్రేమ ఉండాలి. సత్యయుగములో ఆత్మలందరూ ఒకరికొకరు ప్రియమనిపిస్తారు ఎందుకంటే శరీరం యొక్క అభిమానము తొలగిపోతుంది. సోదరులైన మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా మొత్తం విశ్వమంతటి కళ్యాణాన్ని చేస్తారు. మీరు స్వయం యొక్క కళ్యాణాన్ని కూడా చేసుకుంటారు, అలాగే సోదరుల కళ్యాణాన్ని కూడా చేయాలి, అందుకే తండ్రి దేహాభిమానుల నుండి దేహీ-అభిమానులుగా తయారుచేస్తున్నారు. ఆ లౌకిక సోదరులైతే పరస్పరం ధనం కోసం, వాటాల కోసం కొట్లాడుకుంటారు. ఇక్కడ కొట్లాడుకునే-గొడవపడే విషయమేమీ లేదు, ప్రతి ఒక్కరూ డైరెక్ట్ గా కనెక్షన్ ను పెట్టుకోవలసి ఉంటుంది. ఇది అనంతమైన విషయము. యోగబలంతో తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. లౌకిక తండ్రి నుండి స్థూలమైన వారసత్వాన్ని తీసుకుంటారు, ఇదేమో ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలు పొందే ఆత్మిక వారసత్వము. ప్రతి ఒక్కరూ డైరెక్ట్ తండ్రి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. ఎంతెంతగా వ్యక్తిగతంగా తండ్రిని స్మృతి చేస్తారో, అంతగా వారసత్వం లభిస్తుంది. పరస్పరం కొట్లాడుకోవడాన్ని తండ్రి చూసినప్పుడు మీరేమైనా అనాథలా? అని తండ్రి అడుగుతారు. ఆత్మిక సోదరులు పరస్పరం ఎప్పుడూ కొట్లాడుకోకూడదు. ఒకవేళ సోదరులయ్యుండి పరస్పరం కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటే, ప్రేమ లేకపోతే, ఇక రావణుడికి చెందినవారిగా అయినట్లే. వారంతా అసురీ సంతానము. అప్పుడిక దైవీ సంతానానికి మరియు అసురీ సంతానానికి తేడా లేనట్లుగా అయిపోతుంది, ఎందుకంటే దేహాభిమానులుగా అయ్యే కొట్లాడుకుంటారు. ఆత్మ, ఆత్మతో కొట్లాడదు. అందుకే తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, పరస్పరం ఉప్పునీరులా అవ్వకూడదు. అలా అవుతున్నారు కాబట్టే అర్థం చేయించడం జరుగుతుంది. అప్పుడు తండ్రి అంటారు - వీరు దేహాభిమానీ పిల్లలు, రావణుడి పిల్లలు, నా పిల్లలైతే కాదు, ఎందుకంటే పరస్పరం ఉప్పునీరులా ఉంటుంటారు. మీరు 21 జన్మలు క్షీరఖండములా ఉంటారు. ఈ సమయంలో దేహీ-అభిమానులుగా అయ్యి ఉండాలి. ఒకవేళ పరస్పరం ఒకరితో ఒకరికి పడకపోతే, ఇక ఆ సమయానికి వారిని రావణ సాంప్రదాయం వారిగా భావించాలి. పరస్పరం ఉప్పునీరులా అవ్వడం వలన తండ్రి పరువును పోగొడతారు. ఈశ్వరీయ సంతానము అని అంటారు కానీ ఒకవేళ అసురీ గుణాలు ఉన్నట్లయితే ఇక దేహాభిమానులుగా ఉన్నట్లే. దేహీ-అభిమానులలో ఈశ్వరీయ గుణాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఈశ్వరీయ గుణాలను ధారణ చేస్తారు, అప్పుడే తండ్రి తమతోపాటు తీసుకువెళ్తారు, మళ్ళీ అవే సంస్కారాలు మీతోపాటు వస్తాయి. పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి పరస్పరం ఉప్పునీరు వలె ఉంటున్నారని తండ్రికి తెలుస్తుంది. వారు ఈశ్వరీయ పిల్లలుగా పిలవబడలేరు. వారు ఎంతగా తమను తాము నష్టపరచుకుంటారు. మాయకు వశమైపోతారు. పరస్పరం ఉప్పునీరులా (అభిప్రాయ-భేదాలు కలవారిగా) అయిపోతారు. వాస్తవానికైతే మొత్తం ప్రపంచమంతా ఉప్పునీరులా ఉంది, కానీ ఒకవేళ ఈశ్వరీయ సంతానము కూడా ఉప్పునీరులా ఉంటే, ఇక తేడా ఏమున్నట్లు? అటువంటివారైతే తండ్రిని నిందింపజేస్తారు. తండ్రిని నిందింపజేసేవారు, ఉప్పునీరులా అయ్యేవారు ఉన్నత పదవిని పొందలేరు. అటువంటివారిని నాస్తికులు అని కూడా అనవచ్చు. ఆస్తికులుగా అయ్యే పిల్లలు ఎప్పుడూ కొట్లాడుకోరు. మీరు పరస్పరం కొట్లాడుకోకూడదు. ప్రేమగా ఉండడం ఇక్కడే నేర్చుకోవాలి, అప్పుడిక 21 జన్మలు పరస్పరం ప్రేమ ఉంటుంది. తండ్రి పిల్లలుగా పిలువబడిన తర్వాత మళ్ళీ సోదరులుగా అవ్వకపోతే వారు అసురీ సంతానమైనట్లు. తండ్రి పిల్లలకు అర్థం చేయించడానికే మురళిని వినిపిస్తారు, కానీ దేహాభిమానం కారణంగా వారికి - బాబా ఇది మా కోసమే చెప్తున్నారు అని కూడా తెలియదు. మాయ చాలా తెలివైనది. ఎలాగైతే ఎలుక తెలియనే తెలియకుండా కొరుకుతుందో, అలా మాయ కూడా చాలా తియ్య-తియ్యగా ఊదుతుంది మరియు కొరికేస్తుంది. తెలియను కూడా తెలియదు. పరస్పరం అలగడం మొదలైనవి అసురీ సాంప్రదాయుల పని. చాలా సెంటర్లలో ఉప్పునీరు వలె ఉంటారు. ఇప్పుడు ఇంకా ఎవ్వరూ పర్ఫెక్ట్ గా అవ్వలేదు, మాయ దాడి చేస్తూ ఉంటుంది. మాయ తలను ఎలా తిప్పేస్తుందంటే, అసలు అది తెలియనే తెలియదు. మాకు పరస్పరం ప్రేమ ఉందా, లేదా? అని తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ప్రేమసాగరుని పిల్లలు కావున ప్రేమతో నిండిన గంగగా తయారవ్వాలి. కొట్లాడుకోవడం-గొడవపడడం, తప్పుగా మాట్లాడడం - దీని కన్నా మాట్లాడకుండా ఉండడం మంచిది. చెడు వినకండి... ఒకవేళ ఎవరిలోనైనా క్రోధము యొక్క అంశము ఉంటే, ఇక ఆ ప్రేమ ఉండదు, అందుకే బాబా అంటారు - ప్రతిరోజూ మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి, అసురీ నడవడిక బాగవ్వకపోతే ఇక ఎటువంటి ఫలితము వస్తుంది? ఏ పదవిని పొందుతారు? తండ్రి అర్థం చేయిస్తారు - ఏ సేవా చేయకపోతే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది? పదవి తగ్గిపోతుంది. సాక్షాత్కారమైతే అందరికీ జరిగేదే ఉంది, మీకు కూడా మీ చదువు యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. సాక్షాత్కారం జరిగిన తర్వాతనే మీరు ట్రాన్స్ఫర్ అవుతారు, ట్రాన్స్ఫర్ అయి మీరు కొత్త ప్రపంచములోకి వచ్చేస్తారు. ఎవరెవరు ఏ మార్కులతో పాస్ అయ్యారు అనేది చివరిలో అంతా సాక్షాత్కారమవుతుంది. ఇక అప్పుడు ఏడుస్తారు, రోదిస్తారు, శిక్షలు కూడా అనుభవిస్తారు, బాబా చెప్పిన మాట వినలేదే అని పశ్చాత్తాపపడతారు. ఎటువంటి అసురీ గుణాలు ఉండకూడదు అని బాబా అయితే పదే-పదే అర్థం చేయించారు. ఎవరిలోనైతే దైవీ గుణాలు ఉన్నాయో, వారిని ఈ విధంగా తమ సమానంగా తయారుచేయాలి. తండ్రిని స్మృతి చేయడమైతే చాలా సహజము - అల్ఫ్ మరియు బే, అల్ఫ్ అనగా తండ్రి, బే అనగా రాజ్యాధికారము. కావున పిల్లలకు నషా ఉండాలి. ఒకవేళ పరస్పరం ఉప్పునీరు వలె ఉంటే, మరి ఈశ్వరీయ సంతానముగా ఎలా భావిస్తారు. బాబా అనుకుంటారు - వీరు అసురీ సంతానము, మాయ వీరి ముక్కును పట్టుకుంది, అది వారికి తెలియను కూడా తెలియదు, మొత్తం అవస్థ అంతా చంచలమైపోతుంది, పదవి తగ్గిపోతుంది. పిల్లలైన మీరు వారికి ప్రేమగా నేర్పించే ప్రయత్నం చేయాలి, ప్రేమతో కూడిన దృష్టి ఉండాలి. బాబా ప్రేమసాగరుడు కావున పిల్లలను కూడా ఆకర్షిస్తారు కదా. కావున మీరు కూడా ప్రేమసాగరులుగా అవ్వాలి.

తండ్రి పిల్లలకు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు, మంచి మతాన్ని ఇస్తారు. ఈశ్వరీయ మతం లభించడం ద్వారా మీరు పుష్పాలుగా అవుతారు. అన్ని గుణాలనూ మీకు ఇస్తారు. దేవతలలో ప్రేమ ఉంటుంది కదా. కావున ఆ అవస్థను మీరు ఇక్కడే తయారుచేసుకోవాలి. ఈ సమయంలో మీకు జ్ఞానం ఉంది, మళ్ళీ దేవతలుగా అయిన తర్వాత ఇక జ్ఞానం ఉండదు. అక్కడ దైవీ ప్రేమ మాత్రమే ఉంటుంది. కావున పిల్లలు ఇప్పుడు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఇప్పుడు మీరు పూజ్యాలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇప్పుడు సంగమములో ఉన్నారు. తండ్రి కూడా భారత్ లోకే వస్తారు. శివజయంతిని జరుపుతారు. కానీ వారు ఎవరు, ఎలా వస్తారు, ఎప్పుడు వస్తారు, ఏం చేస్తారు? అనేది తెలియదు. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు నంబరువారు పురుషార్థానుసారంగా తెలుసు, ఎవరికైతే తెలియదో వారు ఎవ్వరికీ అర్థం చేయించలేరు కూడా, అప్పుడు పదవి తగ్గిపోతుంది. స్కూల్లో చదివేవారిలో, కొందరి నడవడిక బాగోదు, కొందరిది సదా మంచి నడవడిక ఉంటుంది. కొందరు ప్రెజెంట్ అవుతారు, కొందరు ఆబ్సెంట్ అవుతారు. ఇక్కడ ఎవరైతే సదా తండ్రిని స్మృతి చేస్తారో, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటారో, వారు ప్రెజెంట్ అయినట్లు. తండ్రి అంటారు - లేస్తూ-కూర్చుంటూ మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావించండి. మర్చిపోతారు కాబట్టే ఆబ్సెంట్ అయిపోతారు, ఎప్పుడైతే సదా ప్రెజెంట్ అయ్యి ఉంటారో అప్పుడే ఉన్నత పదవిని పొందుతారు, మర్చిపోయినట్లయితే తక్కువ పదవిని పొందుతారు. ఇప్పుడు ఇంకా సమయం ఉంది అని తండ్రికి తెలుసు. ఉన్నత పదవిని పొందేవారి బుద్ధిలో ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఏమంటూ ఉంటారంటే - శివబాబా స్మృతి ఉండాలి, నోటిలో జ్ఞానామృతం ఉండాలి, అప్పుడు ప్రాణం తనువు నుండి వెళ్ళిపోవాలి అని. ఒకవేళ ఏ వస్తువు పట్లనైనా ప్రీతి ఉన్నట్లయితే అంత్యకాలములో అదే గుర్తుకువస్తూ ఉంటుంది. భోజనంపై లోభం ఉన్నట్లయితే మరణించే సమయంలో - ఇది తినాలి, అని ఆ వస్తువే గుర్తుకువస్తూ ఉంటుంది, అప్పుడిక పదవి భ్రష్టమైపోతుంది. తండ్రి ఏమంటారంటే - స్వదర్శన చక్రధారులుగా అయి మరణించండి, ఇంకేదీ గుర్తుకురాకూడదు. ఆత్మ ఏ విధంగానైతే ఏ సంబంధమూ లేకుండా వచ్చిందో, అదే విధంగా తిరిగి వెళ్ళాలి. లోభము కూడా తక్కువేమీ కాదు. లోభము ఉన్నట్లయితే చివరి సమయంలో అదే గుర్తుకువస్తూ ఉంటుంది, అది లభించకపోతే ఇక అదే ఆశతో మరణిస్తారు, అందుకే పిల్లలైన మీలో లోభము మొదలైనవి కూడా ఉండకూడదు. తండ్రి అయితే ఎంతగానో అర్థం చేయిస్తారు కానీ అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు. బాబా, ఓహో బాబా అంటూ తండ్రి స్మృతిని హృదయానికి గట్టిగా హత్తుకోండి. బాబా-బాబా అని నోటితో అనకూడదు కూడా. మనస్సులో నిరంతర జపము నడుస్తూ ఉండాలి. తండ్రి స్మృతిలో, కర్మాతీత అవస్థలో ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు ఉన్నత పదవిని పొందగలుగుతారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రేమతో నిండిన గంగలుగా అవ్వాలి, అందరి పైనా ప్రేమపూరితమైన దృష్టిని ఉంచాలి. ఎప్పుడూ కూడా నోటితో తప్పుడు మాటలను మాట్లాడకూడదు.

2. ఏ వస్తువు పట్ల లోభమును ఉంచుకోకూడదు. స్వదర్శన చక్రధారులుగా అయి ఉండాలి. అంతిమ సమయంలో ఏ వస్తువూ గుర్తుకురాకూడదు అని అభ్యాసం చేయాలి.

వరదానము:-

పాత దేహము మరియు పాత ప్రపంచము యొక్క సర్వ ఆకర్షణల నుండి సహజంగా మరియు సదా దూరంగా ఉండే రాజఋషి భవ

రాజఋషి అనగా అర్థము ఒకవైపు సర్వ ప్రాప్తుల అధికారము యొక్క నషా మరియు ఇంకొకవైపు అనంతమైన వైరాగ్యము యొక్క అలౌకిక నషా. వర్తమాన సమయములో ఈ రెండు అభ్యాసాలను పెంచుతూ వెళ్ళండి. వైరాగ్యము అంటే పక్కకు తప్పుకోవడమని కాదు, కానీ సర్వ ప్రాప్తులు ఉంటూ కూడా హద్దు ఆకర్షణ మనసు-బుద్ధిని ఆకర్షణలోకి తీసుకురాకుండా ఉండటము. సంకల్పమాత్రముగా కూడా ఆధీనత ఉండకూడదు, అటువంటివారినే రాజఋషి అని అంటారు అనగా అనంతమైన వైరాగి. వారు ఈ పాత దేహము మరియు దేహపు పాత ప్రపంచము, వ్యక్త భావము, వైభవాల భావము, ఈ అన్ని ఆకర్షణల నుండి సదా మరియు సహజంగానే దూరంగా ఉంటారు.

స్లోగన్:-

సైన్స్ సాధనాలను ఉపయోగించండి కానీ వాటిని మీ జీవితము యొక్క ఆధారంగా చేసుకోకండి.

మాతేశ్వరిగారి మధుర మహావాక్యాలు

చూడండి, కౌరవులకు మరియు పాండవులకు పరస్పరం కురుక్షేత్రములో యుద్ధము జరిగిందని, మరియు పాండవులకు తోడుగా డైరెక్షన్లను ఇచ్చేందుకు శ్రీకృష్ణుడు ఉన్నారని మనుష్యులు అంటారు, మరి ఎవరి వైపునైతే స్వయంగా ప్రకృతిపతియే ఉన్నారో, వారికైతే తప్పకుండా విజయము కలుగుతుంది. చూడండి, అన్ని విషయాలనూ కలిపేసారు. ఇప్పుడు మొదటైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోండి - ప్రకృతిపతి అయితే పరమాత్మ, శ్రీకృష్ణుడైతే సత్యయుగము యొక్క మొదటి దేవత. పాండవుల సారథి అయితే పరమాత్మయే. ఇప్పుడు పరమాత్మ పిల్లలైన మనకు ఎప్పుడూ హింసను నేర్పించలేరు, అలాగే పాండవులు హింసాత్మకమైన యుద్ధము చేసి స్వరాజ్యాన్ని సంపాదించుకోలేదు. ఈ ప్రపంచము కర్మక్షేత్రము, దీనిపై మనుష్యులు ఎటువంటి కర్మలు చేసి బీజాన్ని నాటుతారో, అటువంటి మంచి లేక చెడు ఫలాన్ని అనుభవిస్తారు. ఈ కర్మక్షేత్రములో పాండవులు అనగా భారతమాత శక్తి అవతారాలు కూడా హాజరై ఉన్నారు. పరమాత్మ భారతఖండములోనే వస్తారు, అందుకే భారతఖండాన్ని అవినాశీ ఖండము అని అంటారు. పరమాత్ముని అవతరణ ప్రత్యేకంగా భారతఖండములో జరిగింది, ఎందుకంటే అధర్మము యొక్క వృద్ధి కూడా భారతఖండము నుండి మొదలైంది. ఇక్కడే పరమాత్మ యోగబలము ద్వారా కౌరవ రాజ్యాన్ని అంతము చేసి పాండవుల రాజ్యాన్ని స్థాపన చేసారు. కావున పరమాత్మ ఒక్క ఆది సనాతన ధర్మాన్ని స్థాపన చేసారు, కానీ భారతవాసులు తమ మహా పవిత్రమైన ధర్మాన్ని మరియు శ్రేష్ఠ కర్మలను మరచి స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటున్నారు. పాపం, తమ ధర్మము గురించి తెలియని కారణంగా ఇతరుల ధర్మాలలో కలిసిపోయారు. ఈ అనంతమైన జ్ఞానాన్ని, అనంతమైన యజమాని స్వయమే తెలియజేస్తారు. వీరు తమ స్వధర్మాన్ని మరచి హద్దులో చిక్కుకుపోయారు, దీనినే అతి ధర్మగ్లాని అని అంటారు, ఎందుకంటే ఇవన్నీ ప్రకృతి యొక్క ధర్మాలు. కానీ మొదట కావాల్సింది స్వధర్మము. ప్రతి ఒక్కరి స్వధర్మము ఏమిటంటే - నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని, నా ప్రకృతి యొక్క ధర్మము దేవతా ధర్మము. ఈ 33 కోట్ల భారతవాసులు దేవతలు. అందుకే పరమాత్మ అంటారు - అనేక దేహపు ధర్మాలను త్యజించండి, సర్వ ధర్మాని పరిత్యజ... ఈ హద్దు ధర్మాలలో ఎంతగా విప్లవం సృష్టించబడింది. కావున ఇప్పుడు ఈ హద్దు ధర్మాల నుండి బయటపడి అనంతములోకి వెళ్ళాలి. ఆ అనంతమైన తండ్రి అయిన సర్వశక్తివంతుడైన పరమాత్మతో యోగాన్ని జోడించాలి, ఆ సర్వశక్తివంతుడు, ప్రకృతిపతి పరమాత్మ, అంతేకానీ శ్రీకృష్ణుడు కాదు. కల్పపూర్వము కూడా ఎవరి వైపు అయితే సాక్షాత్తు ప్రకృతిపతి అయిన పరమాత్మ ఉన్నారో, వారి విజయము మహిమ చేయబడింది. అచ్ఛా. ఓం శాంతి.