07-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు చాలా రాయల్ విద్యార్థులు, మీరు తండ్రి, టీచర్ మరియు సద్గురువు స్మృతిలో ఉండాలి, అలౌకిక సేవ చేయాలి’’

ప్రశ్న:-
ఎవరైతే తమను తాము అనంతమైన పాత్రధారులుగా భావిస్తూ నడుచుకుంటారో, వారి గుర్తులను వినిపించండి?

జవాబు:-
వారి బుద్ధిలో ఎటువంటి స్థూల లేక సూక్ష్మ దేహధారుల స్మృతి ఉండదు. వారు ఒక్క తండ్రిని మరియు శాంతిధామమైన ఇంటిని స్మృతి చేస్తూ ఉంటారు, ఎందుకంటే గొప్పదనమంతా ఒక్క తండ్రిదే. ఏ విధంగా తండ్రి మొత్తం ప్రపంచమంతటికీ సేవ చేస్తారో, పతితులను పావనముగా తయారుచేస్తారో, అలా పిల్లలు కూడా తండ్రి సమానముగా సేవాధారులుగా అవుతారు.

ఓంశాంతి
మొట్టమొదటగా తండ్రి పిల్లలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి ఎదురుగా కూర్చొన్నారా? మేము తండ్రి ఎదురుగా కూడా కూర్చొన్నాము మరియు టీచర్ ఎదురుగా కూడా కూర్చున్నాము అన్న స్మృతిని కూడా బుద్ధిలోకి తీసుకురండి. నంబర్ వన్ విషయమేమిటంటే - నేను ఆత్మను, తండ్రి కూడా ఒక ఆత్మయే, అలాగే టీచర్ కూడా ఆత్మయే, గురువు కూడా ఆత్మయే. వీరంతా ఒక్కరే కదా. ఈ కొత్త విషయాన్ని మీరు వింటారు. మీరు అంటారు, బాబా, కల్ప-కల్పము మేము ఈ విషయాలను వింటాము. కావున తండ్రి చదివిస్తున్నారు మరియు ఆత్మనైన నేను ఈ ఇంద్రియాల ద్వారా వింటున్నాను అని బుద్ధిలో ఇది గుర్తుండాలి. ఈ జ్ఞానము ఈ సమయములోనే పిల్లలైన మీకు లభిస్తుంది, ఉన్నతోన్నతుడైన భగవంతుని ద్వారా లభిస్తుంది. వారు సర్వాత్మలకు తండ్రి, వారు వారసత్వాన్ని ఇస్తారు. వారు ఏ జ్ఞానాన్ని ఇస్తారు? అందరి సద్గతిని చేస్తారు అనగా ఇంటికి తీసుకుని వెళ్తారు. ఎంతమందిని తీసుకుని వెళ్తారు? ఈ విషయాలన్నీ మీకు తెలుసు. దోమల గుంపులా ఆత్మలన్నీ వెళ్ళవలసి ఉంటాయి. సత్యయుగములో ఒకే ఒక్క ధర్మము, పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. పిల్లలైన మీకు చిత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సహజము. చిన్నపిల్లలు కూడా ఇది ఇంగ్లాండ్ అని, ఇది ఈ దేశము అని మ్యాప్ ల ద్వారా అర్థం చేసుకుంటారు కదా, ఆ తర్వాత ఇక అది గుర్తుండిపోతుంది, ఇది కూడా అలాంటిదే. ఒక్కొక్క విద్యార్థికి అర్థం చేయించవలసి ఉంటుంది. శివాయ నమః ఉన్నతోన్నతుడైన భగవంతుడు అన్న మహిమ కూడా ఒక్కరికే ఉంది. రచయిత అయిన తండ్రి ఇంటికి పెద్దవారై ఉంటారు కదా. వారు హద్దులోని తండ్రి, వీరు ఈ మొత్తం అనంతమైన ఇంటికి తండ్రి. అలాగే వీరు టీచర్ కూడా. వీరు మిమ్మల్ని చదివిస్తారు. కావున పిల్లలైన మీకు ఎంతో సంతోషము ఉండాలి. మీరు కూడా రాయల్ విద్యార్థులు. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోకి వస్తాను. ప్రజాపిత బ్రహ్మా కూడా తప్పకుండా ఇక్కడే ఉండాలి. వారు లేకుండా పని ఎలా జరుగుతుంది. అంతేకాక తప్పకుండా వృద్ధుడైనవారే కావాలి ఎందుకంటే దత్తత తీసుకోబడ్డ పిల్లలు కదా కావున వృద్ధుడైనవారే కావాలి. శ్రీకృష్ణుడైతే పిల్లలూ, పిల్లలూ అని సంబోధించలేరు. పిల్లలూ అని సంబోధించడానికి వృద్ధులు శోభిస్తారు. చిన్న బాలుడినైతే ఎవరూ బాబా అని సంబోధించరు. కావున - నేను ఎవరి ఎదురుగా కూర్చున్నాను అని పిల్లలకు కూడా బుద్ధిలోకి రావాలి. లోలోపల సంతోషము కూడా ఉండాలి. విద్యార్థులు ఎక్కడ కూర్చుని ఉన్నా వారికి బుద్ధిలో తమ తండ్రి కూడా గుర్తుకువస్తారు, అలాగే టీచరు కూడా గుర్తుకువస్తారు. లౌకికములో అయితే వారికి తండ్రి వేరుగా, టీచరు వేరుగా ఉంటారు. కానీ మీకు అయితే ఒక్కరే తండ్రి, టీచరు మరియు గురువుగా ఉన్నారు. ఈ బాబా కూడా ఒక విద్యార్థే కదా. వీరు చదువుకుంటున్నారు. కేవలం అప్పుగా వీరి శరీరాన్ని ఇచ్చారు, ఇంకే తేడా లేదు. వీరు కూడా మీలాంటివారే. మీరు ఏదైతే అర్థం చేసుకుంటున్నారో, వీరి ఆత్మ కూడా అదే అర్థం చేసుకుంటున్నారు. గొప్పదనమంతా ఒక్కరిదే. వారినే ప్రభువు, ఈశ్వరుడు అని అంటారు. తండ్రి ఇది కూడా చెప్తుంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క పరమాత్మను స్మృతి చేయండి, మిగిలిన సూక్ష్మ మరియు స్థూల దేహధారులందరినీ మర్చిపోండి. మీరు శాంతిధామ నివాసులు. మీరు అనంతమైన పాత్రధారులు. ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. మొత్తం ప్రపంచములో ఇంకెవ్వరికీ ఈ విషయాలు తెలియవు. ఇక్కడికి ఎవరైతే వస్తుంటారో, వారు అర్థం చేసుకుంటూ ఉంటారు మరియు తండ్రి సేవలోకి వస్తూ ఉంటారు. ఈశ్వరీయ సేవాధారులు కదా. తండ్రి కూడా సేవ చేసేందుకే వచ్చారు. వారు పతితులను పావనముగా తయారుచేసే సేవను చేస్తారు. రాజ్యాన్ని పోగొట్టుకొని ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో, అప్పుడు తండ్రిని పిలుస్తారు. ఎవరైతే రాజ్యాన్ని ఇచ్చారో వారినే పిలుస్తారు.

తండ్రి సుఖధామానికి యజమానులుగా చేసేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయము ప్రపంచములో ఇంకెవ్వరికీ తెలియదు. వాస్తవానికి భారతవాసులందరూ ఒకే ధర్మానికి చెందినవారు. ఇదే ముఖ్యమైన ధర్మము. కావున ఎప్పుడైతే ఈ ధర్మము ఉండదో, అప్పుడే తండ్రి వచ్చి దీనిని స్థాపన చేస్తారు. ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా అల్లా, గాడ్ అని పిలుస్తుందో, వారు ఇక్కడకు డ్రామానుసారముగా కల్పపూర్వము వలె వచ్చారని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇది గీతా అధ్యాయము, దీనిని తండ్రి వచ్చి స్థాపన చేస్తారు. బ్రాహ్మణులు మరియు దేవీ-దేవతలు అన్న గాయనము కూడా ఉంది, క్షత్రియులు అని అనరు. బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అని అంటారు ఎందుకంటే క్షత్రియులంటే ఎంతైనా రెండు కళలు తగ్గిపోయాయి కదా. స్వర్గము అని కొత్త ప్రపంచాన్ని అంటారు. త్రేతాను కొత్త ప్రపంచము అని అనరు. మొట్టమొదట సత్యయుగములో ఉన్నది పూర్తి కొత్త ప్రపంచము. ఇది అత్యంత పాత ప్రపంచము, మళ్ళీ అత్యంత కొత్త ప్రపంచములోకి వెళ్తారు. మనం ఇప్పుడు ఆ ప్రపంచములోకి వెళ్తున్నాము కావుననే పిల్లలు అంటారు - మేము నరుడి నుండి నారాయణుడిగా అవుతున్నాము అని. కథ కూడా మనము సత్యనారాయణుడిగా తయారయ్యే కథనే వింటాము. యువరాజుగా అయ్యే కథ అని అనరు. అది సత్యనారాయణుడి కథ. వారు నారాయణుడిని వేరుగా భావిస్తారు. కానీ నారాయణుని జీవిత గాథ ఏదీ లేదు. జ్ఞాన విషయాలైతే ఎన్నో ఉన్నాయి కదా, అందుకే ఏడు రోజులు ఇవ్వడం జరుగుతుంది. ఏడు రోజులు భట్టీలో ఉండవలసి ఉంటుంది. అలాగని భట్టీలో ఇక్కడే ఉండమని కూడా కాదు. అలాగైతే ఇక భట్టీని ఆసరాగా చేసుకుని చాలామంది వచ్చేస్తారు. చదువు అనేది ఉదయము మరియు సాయంత్రం వేళల్లో జరుగుతుంది. మధ్యాహ్నము సమయములో వాయుమండలము అంత బాగుండదు. రాత్రివేళలో కూడా 10 నుండి 12 గంటల వరకు అది చాలా అశుద్ధమైన సమయము. ఇక్కడ పిల్లలైన మీరు కూడా స్మృతిలో ఉంటూ సతోప్రధానముగా అయ్యేందుకు పురుషార్థము చేయవలసి ఉంటుంది. అక్కడైతే రోజంతా వ్యాపార, వ్యవహారాల్లో ఉంటారు. ఉద్యోగ వ్యవహారాలు చేసుకుంటూ కూడా ఇంకా మంచి ఉద్యోగాన్ని పొందేందుకు చదువుకునేవారు కూడా చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా మీరు చదువుకుంటున్నారు కావున మిమ్మల్ని చదివించే టీచరును కూడా గుర్తు చేసుకోవాలి. అచ్ఛా, తండ్రిని టీచరుగా భావించి స్మృతి చేసినా కూడా - తండ్రి, టీచరు మరియు గురువు, ముగ్గురూ కలిపి గుర్తుకువస్తారు. మీకు ఇది చాలా సహజము కావున వారు వెంటనే గుర్తుకురావాలి. వీరు మనకు తండ్రి కూడా, టీచరు మరియు గురువు కూడా. తండ్రి ఉన్నతోన్నతమైనవారు, వారి నుండి మనము స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. మనము స్వర్గములోకి తప్పకుండా వెళ్తాము. స్వర్గ స్థాపన తప్పకుండా జరగనున్నది. మీరు కేవలం ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేస్తారు. ఇది కూడా మీకు తెలుసు. ఈ విషయము మున్ముందు మనుష్యులందరికీ కూడా తెలుస్తుంది. మీ శబ్దము వ్యాపిస్తూ ఉంటుంది. బ్రాహ్మణులైన మీ అలౌకిక ధర్మము ఏమిటంటే - శ్రీమతము ఆధారముగా అలౌకిక సేవలో తత్పరులై ఉండడము. మీరు శ్రీమతము ఆధారముగా ఎంత ఉన్నతమైన కార్యాన్ని చేస్తున్నారు అనేది కూడా మనుష్యులందరికీ తెలుస్తుంది. మీ వంటి ఈ అలౌకిక సేవను ఇంకెవ్వరూ చేయలేరు. కేవలం బ్రాహ్మణ ధర్మానికి చెందిన మీరు మాత్రమే ఇటువంటి కార్యము చేస్తారు. కావున ఈ కార్యములో నిమగ్నమైపోవాలి, ఇందులోనే బిజీగా ఉండాలి. తండ్రి కూడా బిజీగా ఉంటారు కదా. మీరు రాజధానిని స్థాపన చేస్తున్నారు. అక్కడైతే పంచాయతీ వారందరూ కలిసి కేవలం పాలన చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గుప్త వేషములో ఏమి చేస్తున్నారో చూడండి. మీరు గుప్త యోధులు, అజ్ఞాత యోధులు, అహింసాయుతమైన యోధులు, దీని అర్థము కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. మీరు డబుల్ అహింసకులైన సైన్యము. ఈ వికారాల హింసయే అన్నింటికన్నా పెద్ద హింస, అదే పతితముగా చేస్తుంది, దానిపైనే విజయము పొందాలి. భగవానువాచ - కామము మహాశత్రువు, దీనిపై విజయము పొందడము ద్వారానే మీరు జగజ్జీతులుగా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు జగజ్జీతులు కదా. భారత్ ఒకప్పుడు జగజ్జీతునిగా ఉండేది. వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు! ఇది కూడా బయటి వారెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధి చాలా విశాలముగా ఉండాలి. పెద్ద-పెద్ద పరీక్షల కొరకు చదివేవారికి విశాలబుద్ధి ఉంటుంది కదా. మీరు శ్రీమతము ఆధారముగా మీ రాజ్య స్థాపనను చేసుకుంటున్నారు. విశ్వములో ఒకప్పుడు శాంతి ఉండేదని, అప్పుడు ఇతర రాజ్యాలేవీ లేవని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. స్వర్గములో అశాంతి ఉండజాలదు. ఆ స్వర్గాన్ని భగవంతుని పూదోట అని అంటారు. అక్కడ కేవలం పూలతోట మాత్రమే ఉండదు కదా. మనుష్యులు కూడా కావాలి కదా. మనము స్వర్గానికి యజమానులుగా అవుతున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. పిల్లలైన మీకు ఎంత నషా ఉండాలి, అంతేకాక ఉన్నతమైన భావాలు ఉండాలి. మీరు బాహ్య సుఖాలేవీ కోరుకోరు. ఈ సమయములో మీరు పూర్తిగా సింపుల్ గా ఉండాలి. ఇప్పుడు మీరు అత్తవారింటికి వెళ్తారు. ఇది పుట్టినిల్లు. ఇక్కడ మీకు ఇద్దరు తండ్రులు లభించారు. ఒకరు నిరాకారుడు, ఉన్నతోన్నతమైనవారు, రెండవ వారు సాకార తండ్రి, వారు కూడా ఉన్నతోన్నతమైనవారే. ఇప్పుడు మీరు అత్తవారిల్లు అయిన విష్ణుపురిలోకి వెళ్తారు. దానిని కృష్ణపురి అని అనరు. పిల్లల విషయములో పురి ఉండదు. విష్ణుపురి అనగా లక్ష్మీ-నారాయణుల పురి. మీది రాజయోగము. కావున తప్పకుండా నరుడి నుండి నారాయణుడిగా అవుతారు.

పిల్లలైన మీరు సత్యాతి సత్యమైన ఈశ్వరీయ సేవాధారులు. ఏ పిల్లలైతే తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థము చేస్తారో, బాబా వారినే సత్యమైన ఈశ్వరీయ సేవాధారులు అని అంటారు. ఏ కర్మబంధనాలు లేనట్లయితే ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వగలుగుతారు మరియు కర్మాతీత అవస్థ ఏర్పడగలదు. నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలంటే కర్మాతీత అవస్థ తప్పకుండా కావాలి. కర్మబంధనాలు ఉన్నట్లయితే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. స్మృతి చేసే విషయములో చాలా కఠినమైన శ్రమ ఉంటుందని పిల్లలు స్వయం అర్థం చేసుకుంటారు. యుక్తి చాలా సహజమైనది, కేవలం తండ్రిని స్మృతి చేయాలి. భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది. యోగము కొరకే జ్ఞానము ఉంది, దానిని తండ్రి వచ్చి నేర్పిస్తారు. శ్రీకృష్ణుడేమీ యోగాన్ని నేర్పించరు. శ్రీకృష్ణునికి స్వదర్శన చక్రాన్ని చూపించారు. ఆ చిత్రము కూడా ఎంత తప్పు. ఇప్పుడు మీరు చిత్రాలు మొదలైనవాటినేమీ స్మృతి చేయకూడదు. అంతా మర్చిపోండి. ఎవరివైపుకు బుద్ధి వెళ్ళకూడదు, లైన్ క్లియర్ గా ఉండాలి. ఇది చదువుకునే సమయము. ప్రపంచాన్ని మరచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడే పాపాలు నాశనమవుతాయి. తండ్రి అంటారు, మొట్టమొదట మీరు అశరీరిగా వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళాలి. మీరు అల్రౌండర్లు. వారు హద్దులోని పాత్రధారులు, మీరు అనంతమైన పాత్రధారులు. మేము అనేక సార్లు పాత్రను అభినయించాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అనేక సార్లు మీరు అనంతమైన యజమానులుగా అవుతారు. ఈ అనంతమైన నాటకములో మళ్ళీ చిన్న-చిన్న నాటకాలు కూడా అనేక సార్లు జరుగుతూ ఉంటాయి. సత్యయుగము నుండి కలియుగము వరకు ఏదైతే జరిగిందో, అది రిపీట్ అవుతూ ఉంటుంది. పై నుండి మొదలుకుని క్రింది వరకు అంతా మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము మరియు సృష్టి చక్రము, అంతే, ఇతర ఏ ధామముతోనూ మీకు పని లేదు. మీ ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చే ధర్మము. వారి సమయము ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు వారు వస్తారు. నంబరువారుగా ఏ విధముగా అయితే వచ్చారో, అలాగే మళ్ళీ వెళ్తారు. మనము ఇతర ధర్మాలను గురించి ఏమని వర్ణిస్తాము. మీకు కేవలం ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. చిత్రాలు మొదలైనవాటినన్నింటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. బ్రహ్మా, విష్ణు, శంకరులను కూడా కాదు, కేవలం ఒక్కరినే స్మృతి చేయాలి. వారు పరమాత్మ లింగరూపుడు అని భావిస్తారు. వాస్తవానికి లింగ సమానముగా ఏ వస్తువైనా ఎలా ఉండగలదు. వారు జ్ఞానాన్ని ఎలా వినిపిస్తారు. ప్రేరణ ద్వారా లౌడ్ స్పీకర్ ను పెట్టి అందులో నుండి మీకు వినిపిస్తారా. ప్రేరణ ద్వారా ఏమీ జరుగదు. శంకరుడిని ప్రేరేపిస్తారని కూడా కాదు. ఇవన్నీ డ్రామాలో ముందు నుండే నిశ్చితమై ఉన్నాయి. వినాశనమైతే జరగవలసిందే. ఏ విధముగా ఆత్మలైన మీరు శరీరము ద్వారా మాట్లాడుతారో, అలాగే పరమాత్మ కూడా పిల్లలైన మీతో మాట్లాడుతారు. వారి పాత్రయే దివ్యమైనది, అలౌకికమైనది. పతితులను పావనముగా తయారుచేసేది ఒక్క తండ్రియే. వారు అంటారు, నా పాత్ర అందరికంటే అతీతమైనది. కల్పపూర్వము ఎవరైతే వచ్చారో వారే వస్తూ ఉంటారు. ఏదైతే గతించిపోయిందో అదంతా డ్రామా, ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. ఆపై పురుషార్థము గురించి ఆలోచన పెట్టుకోవాలి. డ్రామానుసారముగా నా పురుషార్థము తక్కువగా ఉంటుంది అని భావించకండి, అలాగైతే పదవి కూడా చాలా తక్కువైపోతుంది. పురుషార్థాన్ని తీవ్రము చేయాలి. డ్రామాపై వదిలివేయకూడదు. మీ చార్టును చూసుకుంటూ ఉండండి, పెంచుకుంటూ ఉండండి. మా చార్టు పెరుగుతూ ఉంది కదా, తగ్గిపోవడం లేదు కదా అని నోట్ చేసుకుంటూ ఉండండి. చాలా అప్రమత్తముగా ఉండాలి. ఇక్కడ మీది బ్రాహ్మణుల సాంగత్యము, బయట అంతా చెడు సాంగత్యము ఉంది. వారంతా తప్పుడు మాటలనే వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని చెడు సాంగత్యము నుండి బయటకు తీస్తారు.

మనుష్యులు చెడు సాంగత్యములోకి వచ్చి తమ జీవన పద్ధతిని, నడవడికను, తమ వేషధారణ మొదలైనవాటినన్నింటినీ మార్చేసుకున్నారు. దేశాన్ని, వేషాన్ని మార్చేసుకున్నారు. ఇది కూడా తమ ధర్మాన్ని అవమానపరచినట్లే. తమ జుట్టును ఎలా ఎలా తయారుచేసుకుంటారో చూడండి. దేహాభిమానము ఉంటుంది. కేవలం తమ జుట్టును రకరకాలుగా తయారుచేసుకునేందుకు 100-150 రూపాయలు ఇస్తారు. దీనినే అతి దేహాభిమానము అని అంటారు. అటువంటివారు ఎప్పుడూ జ్ఞానాన్ని తీసుకోలేరు. బాబా అంటారు, పూర్తిగా సింపుల్ గా ఉండండి. ఖరీదైన చీరను కట్టుకున్నా దేహాభిమానము వస్తుంది. దేహాభిమానాన్ని సమాప్తము చేసుకునేందుకు అన్నింటినీ సాధారణముగా చేసుకోవాలి. మంచి ఖరీదైన వస్తువు దేహాభిమానములోకి తీసుకువస్తుంది. మీరు ఈ సమయములో వనవాసములో ఉన్నారు కదా. ప్రతి వస్తువు నుండి మోహాన్ని తొలగించాలి. చాలా సాధారణముగా ఉండాలి. వివాహాలు మొదలైన కార్యాలకు రంగు బట్టలను ధరించి వెళ్ళండి, అక్కడ సంబంధాన్ని నిలబెట్టుకునేందుకు, బాధ్యతను నెరవేర్చేందుకు అలా ధరించండి, మళ్ళీ ఇంటికి వచ్చి వాటిని మార్చుకోండి. మీరు అయితే వాణికి అతీతముగా వెళ్ళాలి. వానప్రస్థులు శ్వేత వస్త్రాలను ధరించి ఉంటారు. మీలోని చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరూ వానప్రస్థులే. చిన్న పిల్లలకు కూడా శివబాబా స్మృతినే కలిగించాలి, ఇందులోనే కళ్యాణము ఉంది. ఇప్పుడు ఇక మనము శివబాబా వద్దకు వెళ్ళిపోవాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నా ఏ నడవడికా దేహాభిమానముతో కూడినదిగా ఉండకూడదు అని సదా ధ్యానము ఉండాలి. చాలా సాధారణముగా ఉండాలి. ఏ వస్తువు పట్ల మమకారము పెట్టుకోకూడదు. చెడు సాంగత్యము నుండి స్వయాన్ని సంభాళించుకోవాలి.

2. స్మృతి చేసే విషయములో శ్రమించడం ద్వారా సర్వ కర్మ బంధనాలను సమాప్తము చేసుకుని కర్మాతీతముగా అవ్వాలి. తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు ఆత్మాభిమానిగా ఉంటూ సత్యాతి, సత్యమైన ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి.

వరదానము:-
విశాల బుద్ధి, విశాల హృదయము ద్వారా నా వారు అన్న అనుభూతిని కలిగించే మాస్టర్ రచయిత భవ

మాస్టర్ రచయిత యొక్క మొదటి రచన - ఈ దేహము. ఎవరైతే ఈ దేహము యొక్క యజమాని స్థితిలో సంపూర్ణ సఫలతను ప్రాప్తి చేసుకుంటారో, వారు తమ స్నేహము మరియు సంపర్కము ద్వారా సర్వులకు - వీరు నా వారు అన్న అనుభవాన్ని కలిగిస్తారు. అటువంటి ఆత్మ యొక్క సంపర్కము ద్వారా సుఖము, దాతాతనము, శాంతి, ప్రేమ, ఆనందము, సహయోగము, ధైర్యము, ఉత్సాహము, ఉల్లాసము, ఇలా ఏదో ఒక విశేషత అనుభూతి అవుతుంది. అటువంటివారినే విశాల బుద్ధి, విశాల హృదయము కలవారు అని అంటారు.

స్లోగన్:-
ఉల్లాస-ఉత్సాహాలు అనే రెక్కల ద్వారా సదా ఎగిరే కళ యొక్క అనుభూతి చేస్తూ వెళ్ళండి.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి

స్వయాన్ని శ్రేష్ఠ సంకల్పాలతో సంపన్నముగా చేసుకునేందుకు ట్రస్టీగా అయ్యి ఉండండి, ట్రస్టీగా అవ్వటము అనగా డబల్ లైట్ ఫరిస్తాగా అవ్వటము. ఇటువంటి పిల్లల ప్రతి శ్రేష్ఠ సంకల్పము సఫలమవుతుంది. ఒక్క శ్రేష్ఠ సంకల్పము పిల్లలది మరియు వేలాది శ్రేష్ఠ సంకల్పాల ఫలము బాబా ద్వారా ప్రాప్తిస్తుంది. ఒకటికి వెయ్యి రెట్లు లభిస్తుంది.