07-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - శివబాబా మీ భాండాగారాలన్నింటినీ
నిండుగా చేయడానికి వచ్చారు, భాండాగారాలన్నీ నిండుగా ఉంటే కష్టాలు, దుఃఖాలు
దూరమవుతాయి అని అంటారు కూడా’’
ప్రశ్న:-
జ్ఞానవంతులైన పిల్లల బుద్ధిలో ఏ ఒక్క విషయము యొక్క నిశ్చయము పక్కాగా ఉంటుంది?
జవాబు:-
వారికి దృఢ
నిశ్చయం ఉంటుంది - మా పాత్ర ఏదైతే ఉందో, అది ఎప్పుడూ అరగదు-అంతమవ్వదు, ఆత్మనైన నాలో
84 జన్మల అవినాశీ పాత్ర రచించబడి ఉంది, ఈ జ్ఞానము బుద్ధిలో ఉంటే వారు జ్ఞానవంతులు.
లేదంటే మొత్తం జ్ఞానమంతా బుద్ధి నుండి దూరమైపోతుంది.
ఓంశాంతి
తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు ఏమి చెప్తారు? ఏ సేవను చేస్తారు? ఈ సమయములో తండ్రి ఈ
ఆత్మిక చదువును చదివించే సేవను చేస్తారు, ఇది కూడా మీకు తెలుసు. తండ్రి పాత్ర కూడా
ఉంది, టీచర్ పాత్ర కూడా ఉంది మరియు గురువు పాత్ర కూడా ఉంది. మూడు పాత్రలను బాగా
అభినయిస్తున్నారు. వారు అందరికీ తండ్రి కూడా మరియు సద్గతిని ఇచ్చే గురువు కూడా అని
మీకు తెలుసు. చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు, యుక్తవయస్కులు అందరికీ వారొక్కరే
ఉన్నారు. వారు సుప్రీమ్ తండ్రి, సుప్రీమ్ టీచర్. వారు అనంతమైన శిక్షణను ఇస్తారు.
మాకు అందరి జీవితచరిత్ర గురించి తెలుసు, పరమపిత పరమాత్మ శివబాబా జీవితగాథ గురించి
కూడా తెలుసు అని మీరు కాన్ఫరెన్స్ లో కూడా అర్థం చేయించవచ్చు. నంబరువారుగా అన్నీ
బుద్ధిలో గుర్తుండాలి. మొత్తం విరాట రూపమంతా తప్పకుండా బుద్ధిలో ఉండే ఉంటుంది. మనం
ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ మనం దేవతలుగా అవుతాము, ఆ తర్వాత క్షత్రియులుగా,
వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇదైతే పిల్లలకు గుర్తుంది కదా. పిల్లలైన మీకు తప్ప
ఇంకెవ్వరికీ ఈ విషయాలు గుర్తుండవు. ఉన్నతి మరియు పతనము యొక్క రహస్యమంతా బుద్ధిలో
ఉండాలి. మనం ఉన్నతిలో ఉండేవారము, మళ్ళీ పతనములోకి వచ్చాము, ఇప్పుడు మధ్యలో ఉన్నాము.
శూద్రులుగానూ లేరు, పూర్తిగా బ్రాహ్మణులుగానూ అవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు పక్కా
బ్రాహ్మణులుగా ఉన్నట్లయితే ఇక శూద్రత్వపు కర్మలు జరగకూడదు. బ్రాహ్మణులలో కూడా మళ్ళీ
శూద్రత్వం వచ్చేస్తుంది. పాపాలు ఎప్పటినుండి ప్రారంభించారు అన్నది కూడా మీకు తెలుసు.
ఎప్పటినుండైతే కామచితిపైకి ఎక్కారో అప్పటినుండి. మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది.
పైన పరమపిత పరమాత్మ అయిన తండ్రి ఉన్నారు, ఆ తర్వాత ఆత్మలైన మీరు ఉన్నారు. ఈ విషయాలు
పిల్లలైన మీ బుద్ధిలో తప్పకుండా గుర్తుండాలి. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాము,
దేవతలుగా అవుతున్నాము, ఆ తర్వాత వైశ్య, శూద్ర వంశాలలోకి వస్తాము. తండ్రి వచ్చి
మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు, మళ్ళీ మనం బ్రాహ్మణుల నుండి
దేవతలుగా అవుతాము. బ్రాహ్మణులుగా అయి కర్మాతీత అవస్థను పొంది మళ్ళీ తిరిగి వెళ్తాము.
మీకు తండ్రి గురించి కూడా తెలుసు. పిల్లిమొగ్గలాట లేక 84 జన్మల చక్రము గురించి కూడా
మీకు తెలుసు. పిల్లిమొగ్గల ఉదాహరణ ద్వారా మీకు చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు.
మిమ్మల్ని చాలా తేలికగా చేస్తారు, తద్వారా స్వయాన్ని బిందువుగా భావిస్తూ వెంటనే
వెళ్ళిపోగలుగుతారు. విద్యార్థులు క్లాసులో కూర్చున్నప్పుడు బుద్ధిలో చదువే
గుర్తుంటుంది. మీకు కూడా ఈ చదువే గుర్తుండాలి. ఇప్పుడు మనం సంగమయుగములో ఉన్నాము,
మళ్ళీ ఈ విధంగా చక్రములో తిరుగుతాము. ఈ చక్రము సదా బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఈ
చక్రము మొదలైనవాటి జ్ఞానము బ్రాహ్మణులైన మీ వద్ద మాత్రమే ఉంది, అంతేకానీ శూద్రుల
వద్ద లేదు. దేవతల వద్ద కూడా ఈ జ్ఞానము లేదు. భక్తి మార్గములో ఏ చిత్రాలైతే
తయారయ్యాయో అవన్నీ యథార్థ రీతిగా తయారుచేయబడలేదని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు.
మీ వద్ద ఏక్యురేట్ వి ఉన్నాయి ఎందుకంటే మీరు ఏక్యురేట్ గా తయారవుతున్నారు. ఇప్పుడు
మీకు జ్ఞానము లభించింది కావున భక్తి అని దేనిని అంటారో, జ్ఞానము అని దేనిని అంటారో
మీకు అర్థమవుతుంది. జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞానసాగరుడైన తండ్రి ఇప్పుడు లభించారు.
స్కూల్లో చదువుకుంటారు, లక్ష్యము, ఉద్దేశ్యము గురించి తెలిసి ఉంటుంది కదా. భక్తి
మార్గములో అయితే లక్ష్యము, ఉద్దేశ్యము అంటూ ఏదీ ఉండదు. మేమే ఉన్నతమైన దేవీ, దేవతలుగా
ఉండేవారము, మళ్ళీ మేమే కిందకు దిగజారిపోయాము అని మీకు ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు
బ్రాహ్మణులుగా అయ్యారు కావున మీకు తెలిసింది. బ్రహ్మాకుమార, కుమారీలుగా తప్పకుండా
ఇంతకుముందు కూడా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మా పేరు అయితే ప్రసిద్ధమైనది. ప్రజాపిత
అయితే మానవుడే కదా. వారికి ఇంతమంది పిల్లలు ఉన్నారంటే తప్పకుండా వారంతా దత్తత
తీసుకోబడ్డవారే అయి ఉండాలి. దత్తత తీసుకోబడ్డవారు ఎంతమంది ఉన్నారు. ఆత్మ రూపములో
అయితే అందరూ పరస్పరం సోదరులే. ఇప్పుడు మీ బుద్ధి ఎంత దూరం వెళ్తుంది. మీకు తెలుసు,
పైన నక్షత్రాలు ఉన్నాయి, దూరం నుండి అవి ఎంత చిన్నగా కనిపిస్తాయి, అలాగే మీరు కూడా
చాలా చిన్న ఆత్మ. ఆత్మ ఎప్పుడూ చిన్నగా, పెద్దగా అవ్వదు. అయితే, మీ పదవి చాలా
ఉన్నతమైనది. వాటిని కూడా సూర్యదేవత, చంద్రదేవత అని అంటారు. సూర్యుడు తండ్రి,
చంద్రుడు తల్లి అని అంటారు. ఇకపోతే ఆత్మలన్నీ నక్షత్రాలు, సితారలు. కావున ఆత్మలన్నీ
ఒకే విధంగా చిన్నగా ఉంటాయి. ఇక్కడకు వచ్చి పాత్రధారులుగా అవుతాయి. దేవతలుగా అయితే
మీరే అవుతారు.
మనం చాలా శక్తివంతంగా అవుతున్నాము. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మనం సతోప్రధాన
దేవతలుగా అవుతాము. నంబరువారుగా కొద్దికొద్దిగా తేడా అయితే ఉంటుంది. ఒక్కో ఆత్మ
పవిత్రముగా అయి సతోప్రధాన దేవతగా అయిపోతుంది, ఒక్కో ఆత్మ పూర్తిగా పవిత్రముగా అవ్వదు.
జ్ఞానము గురించి కొద్దిగా కూడా తెలియదు. తండ్రి పరిచయమైతే తప్పకుండా అందరికీ
లభించాలి అని తండ్రి అర్థం చేయించారు. చివరిలో తండ్రి గురించి అయితే తెలుసుకుంటారు
కదా. తండ్రి వచ్చి ఉన్నారు అని వినాశన సమయములో అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు కూడా
కొందరు భగవంతుడు తప్పకుండా ఎక్కడో వచ్చి ఉన్నారు కానీ తెలియడం లేదు అని అంటారు. వారు
ఏదో ఒక రూపములో వచ్చేస్తారు అని భావిస్తారు. మనుష్య మతాలైతే ఎన్నో ఉన్నాయి కదా,
మీదైతే ఒక్క ఈశ్వరీయ మతమే. మీరు ఈశ్వరీయ మతము ద్వారా ఎలా తయారవుతారు? ఒకటేమో మనుష్య
మతము, ఇంకొకటి ఈశ్వరీయ మతము మరియు మూడవది దేవతా మతము. దేవతలకు కూడా మతము ఎవరు
ఇచ్చారు? తండ్రి. తండ్రి శ్రీమతము శ్రేష్ఠముగా తయారుచేసేటువంటిది. శ్రీశ్రీ అని
తండ్రినే అంటారు, అంతేకానీ మనుష్యులను కాదు. శ్రీశ్రీయే వచ్చి శ్రీగా (శ్రేష్ఠముగా)
తయారుచేస్తారు. దేవతలను శ్రేష్ఠముగా తయారుచేసేవారు తండ్రే, వారిని శ్రీశ్రీ అని
అంటారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఈ విధంగా యోగ్యులుగా చేస్తాను. వారేమో తమపై
తాము శ్రీశ్రీ అన్న టైటిల్ ను పెట్టుకున్నారు. కాన్ఫరెన్స్ లో కూడా మీరు అర్థం
చేయించవచ్చు. మీరే అర్థం చేయించేందుకు నిమిత్తముగా అయ్యారు. శ్రీశ్రీ అయితే ఒక్క
శివబాబాయే, వారు ఈ విధంగా శ్రేష్ఠముగా దేవతలుగా తయారుచేస్తారు. వాళ్ళు శాస్త్రాలు
మొదలైనవాటి చదువును చదువుకుని టైటిల్స్ తీసుకుంటారు. మిమ్మల్ని అయితే శ్రీశ్రీ అయిన
తండ్రే శ్రీగా అనగా శ్రేష్ఠముగా తయారుచేస్తున్నారు. ఇది ఉన్నదే తమోప్రధానమైన
భ్రష్టాచారీ ప్రపంచము. ఇక్కడ భ్రష్టాచారము ద్వారా జన్మ తీసుకుంటారు. తండ్రి టైటిల్
ఎక్కడ, ఇక్కడ ఈ పతిత మనుష్యులు తమకు తాము ఈ టైటిల్ పెట్టుకోవడం ఎక్కడ. సత్యాతి
సత్యమైన, శ్రేష్ఠమైన మహాన్ ఆత్మలైతే దేవీ-దేవతలే కదా. సతోప్రధాన ప్రపంచములో
తమోప్రధాన మనుష్యులు ఎవరూ ఉండలేరు. రజోలో రజోగుణీ మనుష్యులే ఉంటారు, అంతేకానీ
తమోగుణీవారు కాదు. వర్ణాల గురించి కూడా చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు అర్థం
చేసుకున్నారు, ఇంతకుముందైతే మనమేమీ అర్థం చేసుకునేవారము కాము. ఇప్పుడు తండ్రి ఎంత
వివేకవంతులుగా తయారుచేస్తారు. మీరు ఎంత ధనవంతులుగా అవుతారు. శివబాబా భాండాగారము
నిండుగా ఉంది. శివబాబా భాండాగారము దేనిది? (అవినాశీ జ్ఞాన రత్నాలది) శివబాబా
భాండాగారము నిండుగా ఉంటుంది కావున కష్టాలు, దుఃఖాలు దూరమైపోతాయి. తండ్రి పిల్లలైన
మీకు జ్ఞాన రత్నాలను ఇస్తారు. వారు స్వయం సాగరుడు. వారు జ్ఞాన రత్నాల సాగరుడు.
పిల్లల బుద్ధి అనంతములోకి వెళ్ళాలి. ఇన్ని కోట్లాదిమంది ఆత్మలందరూ తమ-తమ శరీరాల రూపీ
ఆసనాలపై విరాజమానమై ఉన్నారు. ఇది అనంతమైన నాటకము. ఆత్మ ఈ ఆసనముపై విరాజమానమవుతుంది.
ఒక ఆసనము (శరీరము) మరొకదానితో కలవదు. అందరి ముఖకవళికలు వేర్వేరుగా ఉంటాయి, దీనిని
సృష్టి అద్భుతము అని అనడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి పాత్రా అవినాశీగా ఎలా ఉందో
చూడండి. ఇంత చిన్నని ఆత్మలో 84 జన్మల రికార్డు నిండి ఉంటుంది, అది అతి సూక్ష్మమైనది.
ఇంతకన్నా సూక్ష్మమైన అద్భుతమంటూ ఇంకేదీ ఉండదు. ఇంత చిన్నని ఆత్మలో మొత్తం పాత్ర అంతా
నిండి ఉంది, ఆ పాత్రను ఇక్కడే అభినయిస్తుంది. సూక్ష్మవతనములోనైతే ఎటువంటి పాత్రనూ
అభినయించదు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. తండ్రి ద్వారా మీరు అంతా
తెలుసుకుంటారు. ఇదే జ్ఞానము. అలాగని వారు అందరిలో ఏముందో తెలిసినవారు అని కాదు.
వారికి ఈ జ్ఞానము తెలుసు, ఈ జ్ఞానమే మీలో కూడా ఇమర్జ్ అవుతోంది. ఈ జ్ఞానము ద్వారానే
మీరు ఇంతటి ఉన్నత పదవిని పొందుతారు. ఈ వివేకము కూడా ఉంటుంది కదా. తండ్రి బీజరూపుడు.
వారిలో వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. మనుష్యులైతే లక్షల సంవత్సరాల
ఆయువును చూపించారు కావున అందులో జ్ఞానము రాదు. ఇప్పుడు మీకు ఈ సంగమయుగములో ఈ
జ్ఞానమంతా లభిస్తోంది. తండ్రి ద్వారా మీరు మొత్తం చక్రమంతటినీ తెలుసుకుంటారు.
ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. ఇది మీ అంతిమ
జన్మ. పురుషార్థము చేస్తూ-చేస్తూ మళ్ళీ మీరు పూర్తి బ్రాహ్మణులుగా అయిపోతారు.
ఇప్పుడు అలా లేరు. ఇప్పుడైతే మంచి-మంచి పిల్లలు కూడా బ్రాహ్మణుల నుండి మళ్ళీ
శూద్రులుగా అయిపోతారు. దీనిని మాయతో ఓడిపోవడము అని అంటారు. ఓడిపోయి బాబా ఒడి నుండి
రావణుని ఒడిలోకి వెళ్ళిపోతారు. శ్రేష్ఠముగా తయారుచేసే తండ్రి ఒడి ఎక్కడ, భ్రష్టముగా
తయారుచేసే ఆ ఒడి ఎక్కడ. క్షణములో జీవన్ముక్తి లభిస్తుంది, అలాగే క్షణములో పూర్తి
దుర్దశ ఏర్పడుతుంది. ఏ విధంగా దుర్దశ ఏర్పడుతుంది అన్నది బ్రాహ్మణ పిల్లలకు బాగా
తెలుసు. ఈ రోజు తండ్రికి చెందినవారిగా అవుతారు, రేపు మళ్ళీ మాయ గుప్పిట్లోకి వచ్చి
రావణునికి చెందినవారిగా అయిపోతారు, మళ్ళీ మీరు వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తే
వారిలో కొందరు రక్షింపబడతారు కూడా. మునిగిపోతున్నారు అని మీరు గమనించినప్పుడు వారిని
రక్షించేందుకు ప్రయత్నిస్తూ ఉండండి. ఎంత ఘర్షణ జరుగుతుంది.
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడ స్కూల్లో మీరు చదువుకుంటారు
కదా. మనం ఏ విధంగా ఈ చక్రములో తిరుగుతాము అనేది మీకు తెలుసు. ఇలా, ఇలా చేయండి అని
పిల్లలైన మీకు శ్రీమతము లభిస్తుంది. భగవానువాచ అయితే తప్పకుండా ఉంది. వారు ఇచ్చేది
శ్రీమతము కదా. నేను పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు శూద్రుల నుండి దేవతలుగా
తయారుచేయడానికి వచ్చాను. ఇప్పుడు కలియుగములో శూద్ర సాంప్రదాయము ఉంది. కలియుగము
పూర్తి అవుతోందని మీకు తెలుసు. మీరు సంగమములో కూర్చున్నారు. ఈ తండ్రి ద్వారా మీకు
జ్ఞానము లభించింది. శాస్త్రాలనేవైతే తయారుచేశారో వాటన్నింటిలోనూ మనుష్య మతమే ఉంది.
ఈశ్వరుడైతే శాస్త్రాలను తయారుచేయరు. ఒక్క గీతకే ఎన్ని పేర్లు పెట్టేసారు. గాంధీ గీత,
ఠాగూర్ గీత మొదలైన పేర్లు పెట్టారు. అలా ఎన్నో పేర్లు ఉన్నాయి. గీతను మనుష్యులు
అంతగా ఎందుకు చదువుతారు? అర్థమైతే ఏమీ చేసుకోరు. అదే అధ్యాయాన్ని తీసుకుని తమ-తమ
అర్థాలను చెప్తూ ఉంటారు. అవన్నీ మనుష్యుల ద్వారా తయారుచేయబడినవి కదా. మనుష్య మతము
ద్వారా తయారుచేయబడిన గీతను చదవడం ద్వారా ఈ నాడు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని
మీరు చెప్పవచ్చు. గీతయే మొదటి నంబరు శాస్త్రము కదా. అది దేవీ-దేవతా ధర్మము యొక్క
శాస్త్రము. ఇది మీ బ్రాహ్మణ కులము. ఇది కూడా బ్రాహ్మణ ధర్మమే కదా. ఎన్ని ధర్మాలు
ఉన్నాయి, ఎవరెవరు ఏయే ధర్మాన్ని రచించారో వారి ఆ పేరు నడుస్తూ ఉంటుంది. జైనులు
మహావీర్ అని అంటారు. పిల్లలైన మీరందరూ మహావీరులు, మహావీరనీలు. మీ స్మృతిచిహ్నాలు
మందిరములో ఉన్నాయి. ఇది రాజయోగము కదా. కింద యోగ-తపస్యలో కూర్చున్నారు, పైన రాజ్యము
యొక్క చిత్రము ఉంది. ఇది రాజయోగానికి సంబంధించిన ఏక్యురేట్ మందిరము. తర్వాత
ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టారు. స్మృతిచిహ్నమైతే పూర్తిగా ఏక్యురేట్ గా ఉంది,
బుద్ధిని ఉపయోగించి దీనిని సరిగ్గా తయారుచేశారు, ఆ తర్వాత ఎవరికి ఏ పేరు వస్తే అది
పెట్టేసారు. దీనిని మోడల్ రూపములో తయారుచేశారు. స్వర్గము మరియు సంగమయుగము యొక్క
రాజయోగానికి సంబంధించినది తయారుచేయబడి ఉంది. మీకు ఆదిమధ్యాంతాల గురించి తెలుసు.
ఆదిని కూడా మీరు చూసారు. ఆది అని సంగమయుగాన్ని అనండి లేక సత్యయుగాన్ని అనండి.
సంగమయుగపు దృశ్యాన్ని కింద చూపిస్తారు, ఆ తర్వాత రాజ్యాన్ని పైన చూపించారు. కావున
సత్యయుగము ఆది, మళ్ళీ మధ్యలో ద్వాపరము ఉంది. అంతిమమునైతే మీరు చూస్తూనే ఉన్నారు.
ఇదంతా అంతమైపోనున్నది. పూర్తి స్మృతిచిహ్నము తయారుచేయబడి ఉంది. దేవీ-దేవతలే మళ్ళీ
వామమార్గములోకి వెళ్తారు. ద్వాపరము నుండి వామమార్గము ప్రారంభమవుతుంది. స్మృతిచిహ్నము
పూర్తిగా ఏక్యురేట్ గా ఉంది. స్మృతిచిహ్నాలుగా ఎన్నో మందిరాలను తయారుచేశారు. ఇక్కడే
అన్ని గుర్తులూ ఉన్నాయి. మందిరాలు కూడా ఇక్కడే తయారవుతాయి. దేవీ-దేవతలైన భారతవాసులే
రాజ్యము చేసి వెళ్ళారు కదా. మళ్ళీ తర్వాత ఎన్ని మందిరాలను తయారుచేస్తారు. సిక్కు
ధర్మమువారు ఎక్కువగా ఉంటే వారు తమ మందిరాన్ని తయారుచేసుకుంటారు. మిలట్రీవారు కూడా
తమ మందిరాన్ని తయారుచేసుకుంటారు. భారతవాసులు తమ కృష్ణుడు లేక లక్ష్మీ-నారాయణుల
మందిరాన్ని తయారుచేసుకుంటారు, హనుమాన్, గణేష్ మందిరాలను తయారుచేస్తారు. మొత్తం ఈ
సృష్టి చక్రమంతా ఎలా తిరుగుతుందో, ఏ విధంగా స్థాపన, వినాశనం, పాలన జరుగుతుందో, అది
మీకే తెలుసు. దీనిని అంధకారమయమైన రాత్రి అని అంటారు. బ్రహ్మా యొక్క పగలు మరియు
రాత్రియే గానం చేయబడుతుంది ఎందుకంటే బ్రహ్మాయే చక్రములోకి వస్తారు. ఇప్పుడు మీరు
బ్రాహ్మణులుగా ఉన్నారు, తర్వాత దేవతలుగా అవుతారు. ముఖ్యమైనవారైతే బ్రహ్మాయే కదా.
బ్రహ్మాను ఉంచాలా లేక విష్ణువును ఉంచాలా! బ్రహ్మా రాత్రికి సంబంధించిన వారు మరియు
విష్ణువు పగలుకు సంబంధించినవారు. వారే మళ్ళీ రాత్రి నుండి పగలులోకి వస్తారు, పగలు
నుండి మళ్ళీ 84 జన్మల తర్వాత రాత్రిలోకి వస్తారు. ఇది ఎంత సహజమైన వివరణ. ఇది కూడా
పూర్తిగా గుర్తుంచుకోలేరు. పూర్తిగా చదవకపోతే నంబరువారు పురుషార్థానుసారముగా పదవిని
పొందుతారు. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సతోప్రధానముగా అవుతారు. సతోప్రధానముగా ఉన్న
భారత్ తమోప్రధానముగా అయ్యింది. పిల్లలలో ఎంతటి జ్ఞానము ఉంది. ఈ జ్ఞానాన్ని స్మరిస్తూ
ఉండాలి. ఈ జ్ఞానము ఉన్నదే కొత్త ప్రపంచము కోసము, దీనిని అనంతమైన తండ్రి వచ్చి
ఇస్తారు. మనుష్యులందరూ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఆంగ్లేయులు కూడా ఓ గాడ్
ఫాదర్, లిబరేటర్, గైడ్ అని అంటారు, దీని అర్థమైతే పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి
వచ్చి దుఃఖమయమైన ప్రపంచమైన ఇనుపయుగము నుండి బయటకు తీసి బంగారుయుగములోకి
తీసుకువెళ్తారు. బంగారుయుగము తప్పకుండా గతించింది కావుననే దానిని తలచుకుంటారు కదా.
పిల్లలైన మీకు లోలోపల ఎంతో సంతోషము ఉండాలి మరియు దైవీ కర్మలను కూడా చేయాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి నుండి అవినాశీ జ్ఞాన రత్నాల తరగని ఖజానా ఏదైతే లభిస్తుందో, దానిని
స్మృతిలో ఉంచుకుని బుద్ధిని అనంతములోకి తీసుకువెళ్ళాలి. ఈ అనంతమైన నాటకములో ఆత్మలు
ఏ విధంగా తమ-తమ ఆసనాలపై విరాజమానమై ఉన్నారు - ఈ సృష్టి అద్భుతాన్ని సాక్షీగా అయి
చూడాలి.
2. సదా బుద్ధిలో గుర్తుండాలి - మేము సంగమయుగీ బ్రాహ్మణులము, మాకు తండ్రి యొక్క
శ్రేష్ఠమైన ఒడి లభించింది, మేము రావణుడి ఒడిలోకి వెళ్ళలేము, మా కర్తవ్యము
మునిగిపోయేవారిని కూడా రక్షించడము.
వరదానము:-
వ్యర్థ సంకల్పాల రూపీ స్తంభాలను ఆధారముగా చేసుకునేందుకు
బదులుగా సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచుకునే సత్యమైన స్నేహీ భవ
మాయ బలహీన సంకల్పాలను దృఢంగా చేయడానికి ఎన్నో రాయల్
స్తంభాలను నిలబెడుతూ ఉంటుంది. పదే-పదే ఇదే సంకల్పాన్ని ఇస్తుంది - ఇలా అయితే
జరుగుతుంది కదా, పెద్ద-పెద్దవారు కూడా ఇలా చేస్తారు, ఇప్పుడింకా సంపూర్ణముగా అయితే
అవ్వలేదు, తప్పకుండా ఏదో ఒక బలహీనత అయితే ఉండనే ఉంటుంది... ఈ వ్యర్థ సంకల్పాల రూపీ
స్తంభాలు బలహీనతలను ఇంకా దృఢంగా చేస్తాయి. ఇప్పుడు ఇటువంటి స్తంభాలను ఆధారముగా
తీసుకునేందుకు బదులుగా సర్వ సంబంధాల అనుభవాన్ని పెంచండి. సాకార రూపములో తోడును
అనుభవం చేస్తూ సత్యమైన స్నేహీలుగా అవ్వండి.
స్లోగన్:-
సంతుష్టత అన్నింటికన్నా పెద్ద
గుణము, ఎవరైతే సదా సంతుష్టముగా ఉంటారో, వారే ప్రభు ప్రియులుగా, లోక ప్రియులుగా మరియు
స్వయం ప్రియులుగా అవుతారు.
| | |