ఓంశాంతి
మధురాతి మధురమైన, చాలాకాలం తర్వాత కలిసిన పిల్లలు - ఈ పాత ప్రపంచములో మేము ఇప్పుడు
ఇంకా కొద్ది రోజుల యాత్రికులమే అని భావిస్తారు. ప్రపంచములోని మనుష్యులు ఇంకా 40,000
సంవత్సరాలు ఇక్కడ ఉండేది ఉందని భావిస్తారు. పిల్లలైన మీకైతే నిశ్చయము ఉంది కదా. ఈ
విషయాలను మర్చిపోకండి. ఇక్కడ కూర్చున్నా కూడా పిల్లలైన మీకు లోలోపల పులకరింపు కలగాలి.
ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో అదంతా వినాశనమవ్వనున్నది. ఆత్మ అయితే అవినాశీ.
ఆత్మ అయిన మనము 84 జన్మలు తీసుకున్నాము. ఇప్పుడు బాబా ఇంటికి తీసుకువెళ్ళేందుకు
వచ్చారు. పాత ప్రపంచము ఎప్పుడైతే పూర్తి అవుతుందో అప్పుడు తండ్రి కొత్త ప్రపంచాన్ని
తయారుచేయడానికి వస్తారు. కొత్తది పాతగా, పాతది కొత్త ప్రపంచముగా ఎలా అవుతుంది, ఇది
మీ బుద్ధిలో ఉంది. మనము అనేక సార్లు చక్రమును చుట్టి వచ్చాము. ఇప్పుడు చక్రము పూర్తి
అవుతుంది. కొత్త ప్రపంచములో కొద్దిమంది దేవతలమైన మనమే ఉంటాము. మనుష్యులు ఉండరు.
ఇకపోతే కర్మల పైనే మొత్తమంతా ఆధారపడి ఉంది. మనుష్యులు తప్పుడు కర్మలు చేస్తే అది
తప్పకుండా తింటుంది, అందుకే తండ్రి అడుగుతారు - ఈ జన్మలో అటువంటి పాపాలేవీ చేయలేదు
కదా? ఇది పతిత ఛీ-ఛీ రావణ రాజ్యము. ఇది అంధకారమయమైన ప్రపంచము. ఇప్పుడు తండ్రి
పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీరు భక్తి చేయరు. భక్తి యొక్క
అంధకారములో ఎదురుదెబ్బలు తిని వచ్చారు. ఇప్పుడు తండ్రి చేయి లభించింది. తండ్రి
యొక్క ఆధారము లేకపోతే మీరు విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉండేవారు. అర్ధకల్పము
భక్తియే ఉంటుంది, జ్ఞానము లభించడముతో మీరు సత్యయుగీ కొత్త ప్రపంచములోకి వెళ్ళిపోతారు.
ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇందులో మీరు ఛీ-ఛీ పతితుల నుండి పుష్పాలుగా,
ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. అలా ఎవరు తయారుచేస్తారు? అనంతమైన తండ్రి.
లౌకిక తండ్రిని అనంతమైన తండ్రి అని అనరు. మీరు బ్రహ్మా మరియు విష్ణువు యొక్క
కర్తవ్యము గురించి కూడా తెలుసుకున్నారు. కావున మీకు ఎంతటి శుద్ధమైన నషా ఉండాలి.
మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము... ఇవన్నీ సంగమయుగములోనే ఉంటాయి. తండ్రి
కూర్చొని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇది పాత మరియు కొత్త ప్రపంచము
యొక్క సంగమయుగము. పతితులను పావనముగా తయారుచేసేందుకు రండి అని పిలుస్తారు కూడా.
తండ్రిది కూడా ఈ సంగమయుగములో పాత్ర ఉంటుంది. వారు క్రియేటర్ మరియు డైరెక్టర్ కదా!
కావున తప్పకుండా వారి పాత్ర ఏదో ఉంటుంది కదా. వారిని మనిషి అని అనరని, వారికి తమ
శరీరమే లేదని అందరికీ తెలుసు. మిగిలినవారందరినీ మనుష్యులు లేక దేవతలు అని అంటారు.
శివబాబాను దేవత అని అనరు, అలాగే మానవుడు అని అనరు. వీరు శరీరాన్ని తాత్కాలికముగా
అప్పుగా తీసుకున్నారు. వీరు గర్భము నుంచి జన్మించలేదు కదా. తండ్రి స్వయం అంటారు -
పిల్లలూ, శరీరము లేకుండా నేను రాజయోగాన్ని ఎలా నేర్పించగలను! మనుష్యులు నన్ను
పరమాత్మ రాయి, రప్పల్లో ఉన్నారు అని అనేస్తారు, కానీ నేను ఎలా వస్తాను అనేది ఇప్పుడు
పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు.
దీనిని మనుష్యులు ఎవరూ నేర్పించలేరు. దేవతలైతే రాజయోగాన్ని నేర్చుకోలేరు. ఇక్కడ ఈ
పురుషోత్తమ సంగమయుగములో రాజయోగాన్ని నేర్చుకుని దేవతలుగా అవుతారు.
మేము ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము అని ఇప్పుడు పిల్లలైన మీకు
అపారమైన సంతోషము ఉండాలి. తండ్రి కల్ప-కల్పమూ వస్తారు, ఇది అనేక జన్మల అంతిమ జన్మ అని
తండ్రి స్వయంగా అంటారు. శ్రీకృష్ణుడైతే సత్యయుగ రాకుమారుడు, వారే మళ్ళీ 84 జన్మల
చక్రాన్ని చుట్టి వస్తారు. శివబాబా అయితే 84 జన్మల చక్రములోకి రారు. శ్రీకృష్ణుని
ఆత్మయే సుందరము నుండి నల్లగా అవుతుంది, ఈ విషయాలు ఎవరికీ తెలియవు. మీలో కూడా
నంబరువారుగానే తెలుసు. మాయ చాలా కఠినమైనది. అది ఎవరినీ వదలదు. తండ్రికి అన్నీ
తెలుస్తాయి. మాయా రూపీ మొసలి పూర్తిగా మింగేస్తుంది. ఇది తండ్రికి బాగా తెలుసు.
తండ్రిని అంతర్యామి అనేమీ భావించకండి. అలా కాదు. తండ్రికి అందరి నడవడికను గురించి
తెలుసు. సమాచారాలైతే వస్తూ ఉంటాయి కదా. మాయ పూర్తిగా పచ్చిగానే కడుపులో
వేసేసుకుంటుంది. ఇలాంటి ఎన్నో విషయాలు పిల్లలైన మీకు తెలియవు. తండ్రికైతే అన్నీ
తెలుస్తాయి. మనుష్యులేమో పరమాత్మ అంతర్యామి అని భావిస్తారు. తండ్రి అంటారు, నేను
అంతర్యామిని కాను. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తెలియడమైతే తెలుస్తుంది కదా. చాలా
ఛీ-ఛీ నడవడిక కూడా నడుస్తారు. అందుకే తండ్రి ఘడియ, ఘడియ పిల్లలను అప్రమత్తం చేస్తారు.
మాయ నుండి సంభాళించుకోవాలి. తండ్రి అర్థం చేయించినా కానీ బుద్ధిలో కూర్చోదు. కామము
మహాశత్రువు, తాము వికారాలలోకి వెళ్ళాము అన్నది తెలియను కూడా తెలియదు. ఇలా కూడా
జరుగుతుంది. అందుకే తండ్రి అంటారు, ఏవైనా పొరపాట్లు మొదలైనవి జరిగితే స్పష్టముగా
చెప్పేయండి. దాచిపెట్టకండి. లేకపోతే పాపం 100 రెట్లుగా అయిపోతుంది. అది లోలోపల తింటూ
ఉంటుంది. వృద్ధి చెందుతూ ఉంటుంది. పూర్తిగా పడిపోతారు. పిల్లలు తండ్రితో పూర్తిగా
సత్యముగా ఉండాలి. లేకపోతే చాలా-చాలా నష్టపోతారు. ఇది రావణుని ప్రపంచము. రావణ
ప్రపంచాన్ని మనం ఎందుకు స్మృతి చేయాలి. మనమైతే కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. తండ్రి
కొత్త ఇల్లు మొదలైనవి నిర్మిస్తే - మా కోసం కొత్త ఇల్లు తయారవుతోంది అని పిల్లలు
భావిస్తారు, సంతోషము ఉంటుంది. ఇది అనంతమైన విషయము. మన కోసం కొత్త ప్రపంచమైన స్వర్గము
తయారవుతోంది. ఇప్పుడు మనము కొత్త ప్రపంచములోకి వెళ్ళనున్నాము, ఇక ఎంతగా తండ్రిని
స్మృతి చేస్తారో అంతగా పుష్పాలుగా అవుతారు. మనం వికారాలకు వశమై ముళ్ళలా అయిపోయాము.
ఎవరైతే రారో వారు మాయకు వశమైపోయారని పిల్లలైన మీకు తెలుసు. వారు తండ్రి వద్ద లేనే
లేరు. ద్రోహులుగా అయిపోయారు. పాత శత్రువు వద్దకు వెళ్ళిపోయారు. ఇలా, ఇలా అనేకులను
మాయ మింగేస్తుంది. ఎంతమంది అంతమైపోతారు. మేము ఇలా చేస్తాము, ఇది చేస్తాము, అది
చేస్తాము అని చెప్పి వెళ్ళే ఎంతో మంచి మంచివారు ఉంటారు. మేమైతే యజ్ఞము కోసం ప్రాణాలు
కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటారు, ఈ రోజు వారు లేరు. మీ యుద్ధము
జరుగుతుంది మాయతోనే. మాయతో యుద్ధము ఎలా జరుగుతుంది అన్నది ప్రపంచములో ఎవరికీ తెలియదు.
శాస్త్రాలలో దేవతలు మరియు అసురులకు మధ్యన యుద్ధము జరిగింది అన్నట్లు చూపించారు. ఆ
తర్వాత కౌరవులు మరియు పాండవుల యుద్ధము జరిగింది. మీరు ఎవరినైనా అడగండి - ఈ రెండు
విషయాలు శాస్త్రాలలో ఎలా ఉన్నాయి? దేవతలు అయితే అహింసకులు కదా. వారు సత్యయుగములోనే
ఉంటారు. మరి వారు కలియుగములో యుద్ధము చేసేందుకు వస్తారా? కౌరవులు మరియు పాండవుల
యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. శాస్త్రాలలో ఏదైతే వ్రాసి ఉందో, అదే చదివి
వినిపిస్తూ ఉంటారు. తండ్రి అయితే మొత్తం గీతనంతటినీ చదివారు. ఈ జ్ఞానము
లభించినప్పుడు ఆలోచన కలిగింది - గీతలో ఈ యుద్ధము మొదలైన విషయాల గురించి ఏం వ్రాశారు
అని. శ్రీకృష్ణుడు అయితే గీతా భగవానుడు కాదు. ఇతనిలో తండ్రి కూర్చున్నారు కావున ఇతని
ద్వారా ఆ గీతను కూడా వదిలింపజేసారు. ఇప్పుడు తండ్రి ద్వారా ఎంత ప్రకాశము లభించింది.
ఆత్మకే ప్రకాశము లభిస్తుంది. అందుకే తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావించండి,
అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. భక్తిలో మీరు స్మృతి చేసేవారు. మీరు వచ్చినట్లయితే
మేము మీపై బలిహారమవుతాము అని అనేవారు. కానీ వారు ఎలా వస్తారు, ఏ విధముగా
బలిహారమవుతాము అన్నది అర్థం చేసుకునేవారు కాదు.
ఇప్పుడు పిల్లలైన మీరు అర్ధం చేసుకుంటారు - ఏ విధంగా తండ్రి ఉన్నారో అలాగే ఆత్మ
అయిన మనము కూడా ఉన్నాము. తండ్రిది అలౌకిక జన్మ, వారు పిల్లలైన మిమ్మల్ని ఎంత బాగా
చదివిస్తారు. వీరు మా ఆ తండ్రియే, వీరు కల్ప-కల్పము మాకు తండ్రిగా అవుతారు అని మీరు
స్వయమే అంటారు. మనమందరమూ బాబా, బాబా అని అంటాము. అలాగే బాబా కూడా పిల్లలూ, పిల్లలూ
అని అంటారు, వారే టీచరు రూపములో రాజయోగాన్ని నేర్పిస్తారు. విశ్వానికి మిమ్మల్ని
అధిపతులుగా తయారుచేస్తారు. కావున ఇటువంటి తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ అదే టీచరు
నుండి శిక్షణను కూడా తీసుకోవాలి. ఇవన్నీ వింటూ, వింటూ పులకరించిపోవాలి. ఒకవేళ ఛీ-ఛీగా
అయినట్లయితే, ఇక ఆ సంతోషము కలగనే కలగదు. ఎవరెంత కష్టపడినా సరే, వారు మన జాతికి
చెందివారు కారు. ఇక్కడ మనుష్యులకు ఎన్ని ఇంటి పేర్లు ఉంటాయి. అవన్నీ హద్దులోని
విషయాలు. మీ ఇంటి పేరు ఎంత పెద్దదో చూడండి. అందరి కన్నా పెద్దవారు గ్రేట్, గ్రేట్
గ్రాండ్ ఫాదర్ బ్రహ్మాయే. వారి గురించి ఎవరికీ తెలియనే తెలియదు. శివబాబానైతే
సర్వవ్యాపి అని అనేశారు. బ్రహ్మా గురించి కూడా ఎవరికీ తెలియదు. బ్రహ్మా, విష్ణు,
శంకరుల చిత్రము కూడా ఉంది. మళ్ళీ బ్రహ్మాను సూక్ష్మవతనములోకి తీసుకువెళ్ళారు. వారి
చరిత్ర గురించి ఏమీ తెలియదు. సూక్ష్మవతనములోకి బ్రహ్మా ఎక్కడి నుండి వచ్చారు? అక్కడ
ఎలా దత్తత తీసుకుంటారు? ఇతను నా రథము అని తండ్రి అర్థం చేయించారు. అనేక జన్మల
అంతిమములో నేను ఇతనిలోకి ప్రవేశించాను. ఈ పురుషోత్తమ సంగమయుగము గీతా అధ్యాయము,
ఇందులో పవిత్రత ముఖ్యమైనది. పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి, ఇది ఎవరికీ తెలియదు.
దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలనూ మరచి తండ్రినైన నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే
మాయ యొక్క పాప కర్మలన్నీ భస్మమైపోతాయి అని సాధు-సన్యాసులు మొదలైనవారు ఎప్పుడూ ఇలా
అనరు. వారికి అసలు తండ్రి గురించే తెలియదు. గీతలో తండ్రి అన్నారు, ఈ సాధువులు
మొదలైనవారిని కూడా నేనే వచ్చి ఉద్ధరిస్తాను అని.
తండ్రి అర్థం చేయిస్తారు - ప్రారంభము నుండి మొదలుకుని ఇప్పటివరకు ఏయే ఆత్మలైతే
పాత్రను అభినయిస్తున్నారో, వారందరిదీ ఇది అంతిమ జన్మ. ఇతనిది కూడా ఇది అంతిమ జన్మ.
ఇతనే మళ్ళీ బ్రహ్మాగా అయ్యారు. బాల్యములో ఓ పల్లెటూరి బాలుడిలా ఉండేవారు. ఇతను 84
జన్మలను, మొదటి నుండి చివరి వరకు పూర్తి చేసారు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి రూపీ
తాళము తెరిచి ఉంది. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అవుతారు. ఇంతకుముందు వివేకహీనులుగా
ఉండేవారు. ఈ లక్ష్మీ-నారాయణులు వివేకవంతులు. వివేకహీనులు అని పతితులను అనడం
జరుగుతుంది. ముఖ్యమైనది పవిత్రత. మాయ మమ్మల్ని పడేసింది, కళ్ళు అశుద్ధముగా అయిపోయాయి
అని వ్రాస్తారు కూడా. తండ్రి అయితే ఘడియ-ఘడియ అప్రమత్తం చేస్తూ ఉంటారు - పిల్లలూ,
ఎప్పుడూ మాయతో ఓడిపోవద్దు. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత ప్రపంచము ఇక అంతమైపోనున్నది. మనము పావనముగా అవుతాము
కావున మనకు పావన ప్రపంచము కూడా కావాలి కదా! పిల్లలైన మీరే పతితుల నుండి పావనులుగా
అవ్వాలి. తండ్రి అయితే యోగాన్ని జోడించరు. యోగము జోడించేందుకు బాబా ఏమైనా పతితముగా
అవుతారా. బాబా అయితే అంటారు, నేను మీ సేవలో ఉపస్థితమవుతాను. మీరు వచ్చి పతితులైన
మమ్మల్ని పావనముగా చేయండి అని మీరే నన్ను కోరారు. మీ పిలుపుకే నేను వచ్చాను. మీకు
చాలా సహజమైన మార్గాన్ని తెలియజేస్తాను - కేవలం మన్మనాభవ. భగవానువాచ ఉంది కదా. కేవలం
శ్రీకృష్ణుని పేరు వ్రాయడంతో తండ్రిని అందరూ మర్చిపోయారు. తండ్రి ఫస్ట్,
శ్రీకృష్ణుడు సెకండ్. వారు పరంధామానికి అధిపతి, వీరు వైకుంఠానికి అధిపతి.
సూక్ష్మవతనములోనైతే అసలు ఏమీ జరగదు. అందరిలో కల్లా నంబరు వన్ శ్రీకృష్ణుడు, అతడిని
అందరూ ప్రేమిస్తారు. మిగిలినవారంతా వెనక-వెనక వస్తారు. స్వర్గములోకి అయితే అందరూ
వెళ్ళలేరు కూడా.
కావున మధురాతి మధురమైన పిల్లలైన మీకు చాలా సంతోషము ఉండాలి. ఎప్పుడూ పవిత్రముగా
ఉండని పిల్లలు కూడా కొందరు బాబా వద్దకు వస్తారు. వికారాలలోకి వెళ్తున్నావు, మరి బాబా
వద్దకు ఎందుకు వస్తున్నావు అని బాబా అర్థం చేయిస్తారు. అప్పుడు - ఏం చేయను, నేను
ఉండలేకపోతున్నాను, అయినా ఎప్పుడైనా బాణం తగులుతుందేమోనని ఇక్కడికి వస్తాను, మీరు
తప్ప మా సద్గతిని ఇంకెవరు చేస్తారు, అందుకే వచ్చి కూర్చుంటాను అని అంటారు. మాయ ఎంత
ప్రబలమైనది. బాబా మమ్మల్ని పతితుల నుండి పావనులుగా, పుష్పాల్లా తయారుచేస్తారు అన్న
నిశ్చయము కూడా ఉంటుంది. కానీ ఏం చేయను, నిజం చెప్పేస్తే ఎప్పుడైనా బాగుపడతాను కదా,
మీ ద్వారానే మేము బాగుపడాలి అన్న నిశ్చయము మాకు ఉంది అని కూడా అంటారు. బాబాకు
ఇటువంటి పిల్లలపై దయ కలుగుతుంది. మళ్ళీ అలా జరుగుతుంది. నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు).
బాబా అయితే ప్రతి రోజూ శ్రీమతాన్ని ఇస్తారు. కొందరు అమలులోకి తీసుకువస్తారు కూడా,
ఇందులో బాబా ఏం చేయగలరు. ఇతని పాత్రయే ఇలా ఉందేమో అని బాబా అంటారు. అందరూ
రాజు-రాణులుగా అయితే అవ్వరు. రాజధాని స్థాపన అవుతోంది. రాజధానిలో అందరూ కావాలి.
అయినా బాబా అంటారు - పిల్లలూ, ధైర్యాన్ని వదలకండి, మీరు ముందుకు వెళ్ళగలరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.