08-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి శ్రీమతము మీకు 21 జన్మల సుఖాన్ని ఇస్తుంది, ఇంతటి అతీతమైన మతాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు, మీరు శ్రీమతముపై నడుస్తూ ఉండండి’’

ప్రశ్న:-
తమకు తాము రాజ్య తిలకమును ఇచ్చుకునేందుకు సహజ పురుషార్థము ఏమిటి?

జవాబు:-
1. తమకు తాము రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు తండ్రి శిక్షణలేవైతే లభిస్తాయో వాటిపై బాగా నడవండి. ఇందులో ఆశీర్వాదము లేక కృప యొక్క మాటేమీ లేదు. 2. ఫాలో ఫాదర్ చేయండి, ఇతరులను చూడకండి, మన్మనాభవ, దీనితో స్వయానికి స్వయమే తిలకము లభిస్తుంది. చదువు మరియు స్మృతియాత్రతోనే మీరు బికారి నుండి రాకుమారునిగా తయారవుతారు.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
తండ్రి మరియు దాదా ఓంశాంతి అని అన్నప్పుడు వారు రెండు సార్లు కూడా అనవచ్చు ఎందుకంటే ఇద్దరూ ఒకరిలోనే ఉన్నారు. ఒకరు అవ్యక్తము, మరొకరు వ్యక్తము, ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇద్దరి ఓంశాంతి అనే శబ్దము కలిసి కూడా ఉండవచ్చు, వేరువేరుగా కూడా ఉండవచ్చు. ఇది ఒక అద్భుతము. ప్రపంచములోని వారికెవ్వరికీ పరమపిత పరమాత్మ ఇతని శరీరములో కూర్చుని జ్ఞానాన్ని వినిపిస్తారని తెలియదు. ఇది ఎక్కడా వ్రాయబడి లేదు. తండ్రి కల్పపూర్వము కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు, నేను ఈ సాధారణ తనువులో ఎన్నో జన్మల అంతిమములో వీరిలో ప్రవేశిస్తాను, ఇతని ఆధారాన్ని తీసుకుంటాను. గీతలో ఇలాంటివి కొన్ని-కొన్ని వాక్యాలు ఉన్నాయి, వాటిలో కొన్ని సత్యమైనవి కూడా ఉన్నాయి. నేను అనేక జన్మల అంతిమములో ప్రవేశిస్తాను, వీరు వానప్రస్థావస్థలో ఉన్నప్పుడు ప్రవేశిస్తాను అన్న ఈ అక్షరాలు సత్యమైనవి. ఇతని విషయములో ఇలా అనటము సరిగ్గా వర్తిస్తుంది. మొట్టమొదట సత్యయుగములో జన్మ కూడా ఇతనిదే జరుగుతుంది, మళ్ళీ చివరిలో వానప్రస్థావస్థలో ఉన్నారు, ఇతనిలోనే తండ్రి ప్రవేశిస్తారు. తాను ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారు అన్నది అతనికి తెలియదు అని వీరి విషయములోనే తండ్రి అంటారు. శాస్త్రాలలో 84 లక్షల పునర్జన్మలు అని వ్రాసేశారు. అదంతా భక్తి మార్గము. దీనిని భక్తి సాంప్రదాయము అని అంటారు. జ్ఞాన కాండము వేరు, భక్తి కాండము వేరు. భక్తి చేస్తూ-చేస్తూ కిందికి దిగుతూనే వస్తారు. ఈ జ్ఞానమైతే ఒకేసారి లభిస్తుంది. తండ్రి సర్వులకు సద్గతిని ఇచ్చేందుకు ఒకేసారి వస్తారు. బాబా వచ్చి భవిష్యత్తు కొరకు అందరి ప్రారబ్ధాన్ని ఒకేసారి తయారుచేస్తారు. మీరు చదివేదే భవిష్య కొత్త ప్రపంచము కొరకు. తండ్రి వచ్చేదే కొత్త రాజధానిని స్థాపించేందుకు, అందుకే దీనిని రాజయోగము అని అంటారు. దీనికి చాలా మహత్వము ఉంది. భారత్ యొక్క ప్రాచీన రాజయోగాన్ని ఎవరైనా నేర్పిస్తే బావుండును అని కోరుకుంటారు, కానీ ఈ రోజుల్లో ఈ సన్యాసులు విదేశాలకు వెళ్ళి, మేము ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాము అని అంటారు. అప్పుడు వారు కూడా మేము నేర్చుకోవాలి అని అనుకుంటారు ఎందుకంటే యోగముతోనే ప్యారడైజ్ స్థాపన అయ్యింది అని అనుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, యోగబలముతో మీరు ప్యారడైజ్ కు అధిపతులుగా అవుతారు. ప్యారడైజ్ ను స్థాపన చేసింది తండ్రి. ఎలా స్థాపన చేస్తారు అన్నది తెలియదు. ఈ రాజయోగాన్ని ఆత్మిక తండ్రే నేర్పిస్తారు. దేహధారులైన మానవులెవ్వరూ నేర్పించలేరు. ఈ రోజుల్లో కల్తీ, అవినీతి అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకే తండ్రి అన్నారు - నేను పతితులను పావనముగా చేసేవాడిని. తప్పకుండా మళ్ళీ పతితులుగా చేసేవారు కూడా ఎవరో ఉంటారు. ఇప్పుడు మీరే జడ్జి చేయండి, తప్పకుండా ఇలాగే ఉంటుంది కదా. నేనే వచ్చి సర్వ వేద-శాస్త్రాలు మొదలైనవాటి సారాన్ని వినిపిస్తాను. జ్ఞానము ద్వారా మీకు 21 జన్మల సుఖము లభిస్తుంది. భక్తి మార్గములో అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖము ఉంటుంది, ఇది 21 తరాల సుఖము, దీనిని తండ్రియే ఇస్తారు. తండ్రి మీకు సద్గతినిచ్చేందుకు ఏ శ్రీమతమునైతే ఇస్తారో, అది అన్నింటికన్నా అతీతమైనది. ఈ తండ్రి అందరి హృదయాలను తీసుకునేవారు. అక్కడ జడమైన దిల్వాడా మందిరము ఉన్నట్లుగా ఇక్కడ ఇది చైతన్య దిల్వాలా మందిరము. మీ కర్తవ్యము యొక్క చిత్రాలు ఏక్యురేట్ గా తయారయ్యాయి. ఈ సమయములో మీ కర్తవ్యము నడుస్తోంది. సర్వుల సద్గతిని చేసేవారు, సర్వుల దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చేవారైన దిల్వాలా తండ్రి దొరికారు. ఎంత ఉన్నతోన్నతమైనవారిగా మహిమ చేయబడ్డారు. ఉన్నతోన్నతమైనది భగవంతుడైన శివుని యొక్క మహిమ. చిత్రాలలో శంకరుడు మొదలైనవారి ఎదురుగా కూడా శివుని చిత్రాన్ని చూపించారు. వాస్తవానికి దేవతల ముందు శివుని చిత్రాన్ని ఉంచడం నిషేధము. ఎందుకంటే దేవతలు భక్తి చేయరు. భక్తిని దేవతలు చేయరు, అలాగే సన్యాసులు చేయలేరు. వారు బ్రహ్మ జ్ఞానులు, తత్వ జ్ఞానులు. ఈ ఆకాశ తత్వము ఎటువంటిదో, ఆ బ్రహ్మ తత్వము కూడా అటువంటిదే. వారు తండ్రినైతే స్మృతి చేయరు, అలాగే వారికి ఈ మహామంత్రము కూడా లభించదు. ఈ మహామంత్రాన్ని తండ్రియే వచ్చి సంగమయుగములో ఇస్తారు. సర్వుల సద్గతిదాత అయిన తండ్రి ఒకేసారి వచ్చి మన్మనాభవ అనే మంత్రాన్ని ఇస్తారు. తండ్రి అంటారు - పిల్లలూ, దేహ సహితముగా దేహపు సర్వ ధర్మాలను త్యజించి, స్వయాన్ని అశరీరి ఆత్మగా భావిస్తూ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఎంత సహజముగా అర్థం చేయిస్తారు. రావణ రాజ్యము కారణముగా మీరందరూ దేహాభిమానులుగా అయ్యారు. ఇపుడు తండ్రి మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారుచేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఆత్మలో మలినాలు ఏవైతే చేరాయో అవి తొలగిపోతాయి. సతోప్రధానము నుండి సతోలోకి రావడముతో కళలు తగ్గిపోతాయి కదా. బంగారానికి కూడా నాణ్యత ఉంటుంది కదా. ఇప్పుడైతే కలియుగ అంతిమములో బంగారము చూసేందుకు కూడా కనిపించదు. సత్యయుగములోనైతే బంగారు మహళ్ళు ఉంటాయి. ఎంతగా రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది! దాని పేరే స్వర్ణయుగ ప్రపంచము. అక్కడ ఇటుకలు, రాళ్ళతో పని ఉండదు. అక్కడ భవనాలు తయారైతే అందులో కూడా బంగారము, వెండి తప్ప ఇంకే చెత్తాచెదారము ఉండదు. అక్కడ సైన్సుతో చాలా సుఖము ఉంటుంది. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. ఈ సమయములో సైన్స్ గర్వితులు ఉన్నారు, సత్యయుగములో వారిని గర్వితులు అని అనరు. అక్కడైతే సైన్సుతో మీకు సుఖము లభిస్తుంది. ఇక్కడ ఉన్నది అల్పకాలిక సుఖము, మళ్ళీ సైన్సుతోనే చాలా భారీ దుఃఖము లభిస్తుంది. బాంబులు మొదలైనవన్నీ వినాశనము కొరకు తయారుచేస్తూనే ఉంటారు. బాంబులు తయారుచేయవద్దని ఇతరులకు చెప్తారు కానీ స్వయం తయారుచేస్తూనే ఉంటారు. ఈ బాంబుల ద్వారా తమ మృత్యువే జరుగుతుందని తెలుసు కూడా, అయినా తయారుచేస్తూనే ఉంటారు అంటే వారి బుద్ధి హతమార్చబడిందనే కదా. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. వారు అవి తయారుచేయకుండా ఉండలేరు. ఈ బాంబుల ద్వారా తమ మృత్యువే జరుగుతుందని మనుష్యులు భావిస్తారు కూడా కానీ ఎవరు ప్రేరేపిస్తున్నారు అన్నది తెలియదు, మేము తయారుచేయకుండా ఉండలేము అని అంటారు. తప్పకుండా తయారుచేయవలసే ఉంటుంది. వినాశనము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరు ఎన్ని శాంతి పురస్కారాలను ఇచ్చినా కానీ శాంతిని స్థాపన చేసేది అయితే ఒక్క తండ్రే. శాంతిసాగరుడైన తండ్రే శాంతి, సుఖము, పవిత్రతల వారసత్వాన్ని ఇస్తారు. సత్యయుగములో ఉన్నది అనంతమైన సంపద. అక్కడైతే పాల నదులు ప్రవహిస్తాయి. విష్ణువును క్షీరసాగరములో చూపిస్తారు. ఈ విధంగా పోల్చడం జరుగుతుంది. క్షీరసాగరము ఎక్కడ, ఈ విషయసాగరము ఎక్కడ. భక్తి మార్గములో ఒక కొలను వంటిది తయారుచేసి అందులో రాయి పైన విష్ణువుని పడుకోబెడతారు. భక్తిలో ఎంత ఖర్చు చేస్తారు. సమయాన్ని, ధనాన్ని ఎంతగా వృధా చేస్తారు. దేవీల మూర్తులను ఎంత ఖర్చు పెట్టి తయారుచేస్తారు, మళ్ళీ సముద్రములో ముంచేస్తారు, అంటే ధనము వృధా అయినట్లే కదా. ఇది బొమ్మల పూజ. ఎవరి కర్తవ్యము గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు ఎవరి మందిరములోకి వెళ్ళినా, మీకు ప్రతి ఒక్కరి కర్తవ్యము గురించి తెలుసు. పిల్లలు ఎక్కడికీ వెళ్ళకూడదని అవరోధమేమీ లేదు. ఇంతకుముందైతే ఏమీ తెలియకుండా వెళ్ళేవారు, ఇపుడు వివేకవంతులుగా అయి వెళ్తారు. మాకు వీరి 84 జన్మల గురించి తెలుసు అని మీరు అంటారు. భారతవాసులకైతే శ్రీకృష్ణుడి జన్మల గురించి కూడా తెలియదు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమంతా ఉంది. జ్ఞానము సంపాదనకు ఆధారము. వేద-శాస్త్రాలు మొదలైనవాటిలో ఎటువంటి లక్ష్యము-ఉద్దేశ్యము లేదు. స్కూల్లో ఎల్లప్పుడూ లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటుంది. ఈ చదువుతో మీరు ఎంత షావుకారుగా అవుతారు.

జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. ఈ జ్ఞానము ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు. మీరు ఏ మందిరములోకి వెళ్ళినా, అది ఎవరి స్మృతిచిహ్నము అనేది వెంటనే అర్థం చేసుకుంటారు. ఉదాహరణకు దిల్వాడా మందిరము ఉంది - అది జడమైనది, ఇది చైతన్యమైనది. ఇక్కడ వృక్షములో ఎలా చూపించారో, సరిగ్గా అదే విధముగా మందిరము తయారుచేయబడింది. కింద తపస్యలో కూర్చున్నారు, పైన కప్పు పైన స్వర్గమంతా ఉంది. చాలా ఖర్చుతో తయారుచేసారు. ఇక్కడైతే ఏమీ లేదు. భారత్ 100 శాతము సంపన్నముగా, పావనముగా ఉండేది, ఇప్పుడు 100 శాతం దివాలా తీసి, పతితముగా ఉంది ఎందుకంటే ఇక్కడ అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు. అక్కడ అశుద్ధి అనే మాటే లేదు. గరుడ పురాణములో భయంకరమైన విషయాలను మనుష్యులు కాస్త బాగుపడాలనే ఉద్దేశ్యముతో వ్రాశారు. కానీ డ్రామాలో మనుష్యులు బాగుపడేది లేదు. ఇపుడు ఈశ్వరీయ స్థాపన జరుగుతుంది. ఈశ్వరుడే స్వర్గ స్థాపన చేస్తారు కదా. వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. తండ్రి అర్థం చేయించారు - అక్కడ సైన్యమెవరైతే యుద్ధము చేస్తారో, వారంతా రాజు, రాణుల కొరకే చేస్తారు. ఇక్కడ మీరు స్వయం కొరకే మాయపై విజయము పొందుతారు. ఎంత చేస్తే అంత పొందుతారు. మీరు ప్రతి ఒక్కరూ మీ తనువు, మనసు, ధనములను భారత్ ను స్వర్గముగా తయారుచేయడానికి ఉపయోగించవలసి ఉంటుంది. ఎంత చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇక్కడ ఉండేదైతే ఏమీ లేదు. కొందరి ధనము ధూళిలో కలిసిపోతుంది... అని ఈ సమయము గురించే గాయనము చేస్తారు. ఇప్పుడు తండ్రి మీకు రాజ్యభాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నారు. ఇప్పుడు తనువు, మనస్సు, ధనము, అన్నింటినీ ఇందులో పెట్టండి అని చెప్తారు. ఇతను (బ్రహ్మా) తన సర్వస్వాన్ని అర్పణ చేసేసారు కదా. ఇతడిని మహాదాని అని అంటారు. వినాశీ ధనాన్ని దానం చేస్తారు కదా, అలాగే అవినాశీ ధనాన్ని కూడా దానం చేయవలసి ఉంటుంది. ఎవరు ఎంత దానం చేస్తే అంత. ప్రసిద్ధమైన దాతలు ఎవరైనా ఉంటే వారిని ఫలానా అతను చాలా గొప్ప మహాదాని అని అంటారు. వారి పేరైతే ప్రసిద్ధి అవుతుంది కదా. వారు ఇన్ డైరెక్టుగా ఈశ్వరార్థము చేస్తారు. రాజ్యమేమీ స్థాపన అవ్వదు. ఇప్పుడైతే రాజ్య స్థాపన జరుగుతుంది, అందుకే పూర్తిగా మహాదానులుగా అవ్వాలి. భక్తి మార్గములో, మేము బలిహారమైపోతాము అని పాడుతారు కూడా. ఇందులో ఖర్చు ఏమీ లేదు. ప్రభుత్వానికి ఎంత ఖర్చు అవుతుంది. ఇక్కడ మీరు ఏదైతే చేస్తారో, అదంతా మీ కోసమే. ఇక ఆపై అష్టరత్నాల మాలలోకైనా రండి, లేక 108 మాలలోకైనా రండి, లేక 16108 మాలలోకైనా రండి. పాస్ విత్ ఆనర్ గా అవ్వాలి. కర్మాతీత అవస్థను పొంది, ఇక ఏ శిక్ష అనుభవించవలసిన అవసరము లేనంతటి యోగాన్ని సంపాదించుకోండి.

మీరందరూ యోధులు. మీ యుద్ధము రావణుడితో ఉంది, మనుష్యులెవరితోనూ కాదు. పాస్ అవ్వని కారణముగా రెండు కళలు తగ్గిపోయాయి. త్రేతాను రెండు కళలు తగ్గిన స్వర్గము అని అంటారు. తండ్రిని పూర్తిగా ఫాలో చేసేందుకు పురుషార్థమైతే చేయాలి కదా. ఇందులో మనస్సు-బుద్ధితో సమర్పణ అవ్వవలసి ఉంటుంది. బాబా, ఈ సర్వస్వము మీదే అని అంటారు. తండ్రి అంటారు, దీనిని సేవలో పెట్టండి. నేను మీకు ఏ డైరెక్షన్లు అయితే ఇస్తానో, ఆ కార్యము చేయండి, యూనివర్సిటీని తెరవండి, సెంటరు తెరవండి, అనేకుల కళ్యాణము జరుగుతుంది. కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని తీసుకోండి అనే ఈ సందేశాన్ని ఇవ్వండి. మెసెంజర్, పైగంబర్ (సందేశకులు) అని పిల్లలైన మిమ్మల్ని అంటారు. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి, మీకు జీవన్ముక్తి లభిస్తుంది అని తండ్రి ఈ బ్రహ్మా ద్వారా చెప్తున్నారని అందరికీ సందేశాన్ని ఇవ్వండి. ఇప్పుడు ఉన్నది జీవన బంధనము, తర్వాత జీవన్ముక్తి ఉంటుంది. తండ్రి అంటారు, నేను భారత్ లోనే వస్తాను. ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది. ఎప్పుడు తయారయ్యింది, ఎప్పుడు పూర్తి అవుతుంది, ఈ ప్రశ్న తలెత్తలేదు. ఈ డ్రామా అయితే అనాదిగా నడుస్తూనే ఉంటుంది. ఆత్మ ఎంత చిన్న బిందువు. అందులో ఈ అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది. ఇవి ఎంతటి గుహ్యమైన విషయాలు. ఆత్మ నక్షత్రము వలె చిన్న బిందువు. మాతలు కూడా మస్తకములో బిందువు పెట్టుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థముతో మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటున్నారు. మీరు తండ్రి శిక్షణలపై బాగా నడిచినట్లయితే మీకు మీరే రాజ్య తిలకాన్ని ఇచ్చుకున్నట్లు అవుతుంది. ఇందులో ఆశీర్వాదము, కృప ఏమీ ఉండదు. మీకు మీరే రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. వాస్తవానికి ఇది రాజ్య తిలకము. తండ్రిని ఫాలో చేసే పురుషార్థము చేయాలి, ఇతరులను చూడకూడదు. ఇది మన్మనాభవ, దీనితో మీ అంతట మీకే తిలకము లభిస్తుంది, తండ్రి ఇవ్వరు. ఇది ఉన్నదే రాజయోగము. మీరు బికారి నుండి రాకుమారునిగా అవుతారు. మరి ఎంత మంచి పురుషార్థము చేయాలి. అంతేకాక వీరిని కూడా ఫాలో చేయాలి. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. చదువు ద్వారా సంపాదన జరుగుతుంది. ఎంతెంత యోగము ఉంటుందో అంతగా ధారణ ఉంటుంది. యోగములోనే శ్రమ ఉంది, అందుకే భారత్ యొక్క రాజయోగము గాయనం చేయబడింది. ఇకపోతే గంగా స్నానాలు చేస్తూ-చేస్తూ మొత్తం ఆయుష్షు అంతా గడిచిపోయినా పావనముగా అవ్వలేరు. భక్తి మార్గములో ఈశ్వరార్థము పేదలకు ఇస్తారు. కానీ ఇక్కడ స్వయంగా ఈశ్వరుడే వచ్చి పేదవారికే విశ్వ రాజ్యాన్ని ఇస్తారు. పేదల పాలిటి పెన్నిధి కదా. 100 శాతము సంపన్నముగా ఉన్న భారత్ ఇప్పుడు 100 శాతము దివాలా తీసింది. దానము ఎల్లప్పుడూ పేదవారికే ఇవ్వడం జరుగుతుంది. తండ్రి ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. ఇటువంటి తండ్రిని నిందిస్తారు. తండ్రి అంటారు, ఇలా ఎప్పుడైతే గ్లాని చేస్తారో అప్పుడు నేను రావలసి వస్తుంది. ఇది కూడా డ్రామాగా తయారై ఉంది. వీరు తండ్రి కూడా, టీచరు కూడా. సిక్కు ధర్మము వారు సద్గురువు అకాల్ అని అంటారు. మిగిలిన భక్తి మార్గపు గురువులైతే ఎంతోమంది ఉన్నారు. అకాలుడికి కేవలం ఈ ఆసనమే లభిస్తుంది. పిల్లలైన మీ ఆసనాన్ని కూడా ఉపయోగిస్తారు. నేను ఇతనిలో ప్రవేశించి అందరి కళ్యాణము చేస్తాను అని అంటారు. ఈ సమయములో ఇతని పాత్ర ఇది. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. కొత్త వారెవ్వరూ అర్థం చేసుకోలేరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అవినాశీ జ్ఞాన ధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ఏ విధంగా బ్రహ్మాబాబా తన సర్వస్వాన్ని ఇందులో సమర్పించారో, అలాగే తండ్రిని ఫాలో చేసి రాజ్యములో ఉన్నత పదవిని పొందాలి.

2. శిక్షల నుండి రక్షించుకునేందుకు ఎటువంటి యోగాన్ని సంపాదించుకోవాలంటే, ఇక కర్మాతీత అవస్థను పొందాలి. పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు పూర్తి-పూర్తి పురుషార్థము చేయాలి. ఇతరులను చూడకూడదు.

వరదానము:-
కఠినమైన నియమాలు మరియు దృఢ సంకల్పము ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తము చేసే బ్రహ్మాబాబా సమానముగా అలసట లేనివారిగా కండి

బ్రహ్మాబాబా సమానముగా అలసట లేనివారిగా అయ్యేందుకు నిర్లక్ష్యాన్ని సమాప్తము చేయండి, దీని కొరకు ఏదైనా కఠినమైన నియమాన్ని తయారుచేసుకోండి. దృఢ సంకల్పము చేయండి. అటెన్షన్ రూపీ కాపలాదారుడు సదా అలర్టుగా ఉన్నట్లయితే నిర్లక్ష్యము సమాప్తమైపోతుంది. మొదట స్వయముపై కృషి చేయండి, ఆ తర్వాత సేవలో కృషి చేయండి, అప్పుడు ధరణి పరివర్తన అవుతుంది. ఇప్పుడు కేవలం ‘‘చేసేద్దాము, అయిపోతుంది’’ అన్న ఈ విశ్రాంతితో కూడిన సంకల్పాల డన్లప్ ను వదలండి. ‘‘చెయ్యాల్సిందే’’ అన్న ఈ స్లోగన్ మస్తకములో గుర్తున్నట్లయితే పరివర్తన అయిపోతుంది.

స్లోగన్:-
సమర్థ మాటలకు గుర్తు ఏమిటంటే - ఆ మాటలలో ఆత్మిక భావము మరియు శుభ భావన ఉండాలి.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ఇచ్చే సేవ చెయ్యండి

ఎంతెంతగా సమయము సమీపముగా వస్తూ ఉందో, అంతగానే వ్యర్థ సంకల్పాలు కూడా పెరుగుతున్నాయి, కానీ ఇవి సమాప్తమయ్యేందుకే బయటకు వస్తున్నాయి. వాటి పని రావటము మరియు మీ పని ఎగిరే కళ ద్వారా, సకాష్ ద్వారా పరివర్తన చెయ్యటము. గాభరా పడకండి. వాటి సెగలోకి రాకండి.