08-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సర్వోత్తమ యుగము ఈ సంగమము, ఈ సమయములోనే ఆత్మలైన మీరు పరమాత్మ తండ్రిని కలుసుకుంటారు, ఇదే సత్యాతి-సత్యమైన కుంభ మేళ’’

ప్రశ్న:-
ఏ పాఠాన్ని తండ్రి మాత్రమే చదివిస్తారు, మనుష్యులెవ్వరూ చదివించలేరు?

జవాబు:-
దేహీ-అభిమానులుగా అయ్యే పాఠాన్ని ఒక్క తండ్రియే చదివిస్తారు, ఈ పాఠాన్ని దేహధారులెవ్వరూ చదివించలేరు. మొట్టమొదట మీకు ఆత్మ జ్ఞానము లభిస్తుంది. మీకు తెలుసు - ఆత్మలమైన మనము పరంధామము నుండి పాత్రధారులుగా అయి పాత్రను అభినయించడానికి వచ్చాము, ఇప్పుడు నాటకము పూర్తవుతుంది, ఈ డ్రామా తయారై, తయారుచేయబడినది, దీనిని ఎవ్వరూ తయారుచేయలేదు, అందుకే దీనికి ఆది మరియు అంతిమము లేవు.

పాట:-
మేల్కోండి ప్రేయసులారా మేల్కోండి...

ఓంశాంతి
పిల్లలు ఈ పాటను అనేక సార్లు విని ఉంటారు. ప్రియుడు ప్రేయసులకు చెప్తున్నారు. వారు శరీరములోకి వచ్చినప్పుడు వారిని ప్రియుడు అని అంటారు. లేదంటే వారు తండ్రి, మీరు పిల్లలు. మీరందరూ భక్తురాళ్ళు. భగవంతుడిని తలచుకుంటారు. వధువులు, వరుడిని తలచుకుంటారు. ఈ వరుడు అందరికీ ప్రియుడు. వారు కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు మేల్కోండి, కొత్త యుగము వస్తుంది. కొత్త యుగము అనగా కొత్త ప్రపంచమైన సత్యయుగము. పాత ప్రపంచము కలియుగము. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారుచేస్తారు. నేను మిమ్మల్ని స్వర్గవాసులుగా తయారుచేస్తాను అని మనుష్యులెవ్వరూ అనలేరు. సన్యాసులకైతే స్వర్గము మరియు నరకము గురించి ఏ మాత్రమూ తెలియదు. ఏ విధంగా ఇతర ధర్మాలు ఉన్నాయో అలాగే సన్యాసులది కూడా ఒక ధర్మము. అదేమీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము కాదు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని భగవంతుడే వచ్చి స్థాపన చేస్తారు, నరకవాసులు ఎవరైతే ఉన్నారో వారే మళ్ళీ సత్యయుగ స్వర్గవాసులుగా అవుతారు. ఇప్పుడు మీరు నరకవాసులు కారు. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. సంగమము మధ్యలో ఉంటుంది. సంగమములో స్వర్గవాసులుగా అయ్యేందుకు మీరు పురుషార్థము చేస్తున్నారు, అందుకే సంగమయుగానికి మహిమ ఉంది. వాస్తవానికి సర్వోత్తమమైన కుంభమేళా కూడా ఇదే. దీనినే పురుషోత్తమమైనది అని అంటారు. మీకు తెలుసు, మనమందరమూ ఒక్క తండ్రి సంతానము, బ్రదర్ హుడ్ (అందరూ సోదరులే) అని అంటారు కదా. ఆత్మలందరూ పరస్పరములో భాయి-భాయి (సోదరులు). హిందువులు, చైనీయులు భాయి-భాయి (సోదరులు) అని అంటారు, అన్ని ధర్మాలవారి లెక్క అనుసారంగానైతే భాయి-భాయి. ఈ జ్ఞానము మీకు ఇప్పుడు లభించింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు తండ్రినైన నా సంతానము. ఇప్పుడు మీరు సమ్ముఖముగా వింటున్నారు. వారు కేవలము నామమాత్రముగా ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే, ఆ ఒక్కరినే తలచుకుంటారు అని అంటారు. స్త్రీ-పురుషులు ఇరువురిలోనూ ఆత్మ ఉంది. ఈ లెక్కలో భాయి-భాయి అవుతారు, ఆ తర్వాత సోదర-సోదరీలు అవుతారు, ఆ తర్వాత స్త్రీ-పురుషులు అవుతారు. కావున తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మలు-పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు... అని అంటూ ఉంటారు, అంతేకానీ నదులు మరియు సాగరము చాలా కాలము వేరుగా ఉన్నాయి... అని అనరు. పెద్ద-పెద్ద నదులైతే సాగరముతో కలిసి ఉంటాయి. ఇది కూడా పిల్లలకు తెలుసు, నది సాగరానికి సంతానము, సాగరము నుండి నీరు పైకి వెళ్తుంది, ఆ తర్వాత మేఘాల ద్వారా వర్షము పర్వతాలపై కురుస్తుంది, అప్పుడవి నదులుగా తయారవుతాయి. కావున అన్నీ ఆ సాగరానికి కుమారులు మరియు కుమార్తెలు అవుతాయి. అసలు నీరు ఎక్కడి నుండి వస్తుంది అనేది కూడా ఎంతోమందికి తెలియదు. ఇది కూడా నేర్పించడం జరుగుతుంది. కావున ఇప్పుడు పిల్లలకు తెలుసు - జ్ఞానసాగరుడు ఒక్క తండ్రియే. మీరందరూ ఆత్మలు, తండ్రి ఒక్కరే అని ఈ విషయము కూడా అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మ కూడా నిరాకారియే, మళ్ళీ ఎప్పుడైతే సాకారములోకి వస్తారో అప్పుడు పునర్జన్మలను తీసుకుంటారు. తండ్రి కూడా ఎప్పుడైతే సాకారములోకి వస్తారో, అప్పుడే వచ్చి కలుసుకుంటారు. తండ్రి కలుసుకోవడమనేది ఒకసారి మాత్రమే జరుగుతుంది. ఈ సమయములో వచ్చి అందరినీ కలుసుకున్నారు. వారు భగవంతుడు అని కూడా అందరూ తెలుసుకుంటూ ఉంటారు. గీతలో శ్రీకృష్ణుడి పేరు వేసారు కానీ శ్రీకృష్ణుడైతే ఇక్కడకు రాలేరు. వారు ఎలా నిందింపబడగలరు? శ్రీకృష్ణుడి ఆత్మ ఈ సమయములో ఉందని మీకు తెలుసు. మొట్టమొదట మీకు ఆత్మ జ్ఞానము లభిస్తుంది. మీరు ఆత్మ, స్వయాన్ని శరీరముగా భావిస్తూ ఇంతకాలము నడుస్తూ వచ్చారు, ఇప్పుడు తండ్రి వచ్చి దేహీ-అభిమానులుగా తయారుచేస్తారు. సాధు-సన్యాసులు మొదలైనవారు ఎప్పుడూ మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేయరు. మీరు పిల్లలు, మీకు అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. మీ బుద్ధిలో ఉంది - మేము పరంధామములో ఉండేవారము, తర్వాత ఇక్కడికి పాత్రను అభినయించడానికి వచ్చాము, ఇప్పుడు ఈ నాటకము పూర్తవుతుంది. ఈ డ్రామాను ఎవరూ తయారుచేయలేదు. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. ఈ డ్రామా ఎప్పటినుండి ప్రారంభమయ్యింది అని మిమ్మల్ని అడుగుతారు. ఇది అనాది డ్రామా, దీనికి ఆది-అంత్యాలు ఉండవు అని మీరు చెప్పండి. పాతది కొత్తగా మరియు కొత్తది పాతగా అవుతుంది. ఈ పాఠము పిల్లలైన మీలో పక్కాగా ఉంది. కొత్త ప్రపంచము ఎప్పుడు తయారవుతుంది మరియు అది పాతదిగా ఎప్పుడు అవుతుంది అనేది మీకు తెలుసు. ఇది కూడా కొందరి బుద్ధిలో పూర్తిగా ఉంది. ఇప్పుడు నాటకము పూర్తవుతుందని మీకు తెలుసు, ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. తప్పకుండా మన 84 జన్మల పాత్ర పూర్తయ్యింది. ఇప్పుడు తండ్రి మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చారు. తండ్రి మార్గదర్శకుడు కూడా కదా. మీరందరూ పండాలు. పండాలు యాత్రికులను తీసుకుని వెళ్తారు. వారు దైహికమైన పండాలు, మీరు ఆత్మిక పండాలు, అందుకే మీకు పాండవ గవర్నమెంట్ అన్న పేరు కూడా ఉంది, కానీ ఇది చాలా గుప్తముగా ఉంది. పాండవులు, కౌరవులు, యాదవులు ఏమి చేసారు. అది ఈ సమయానికి చెందిన విషయము, ఇదే మహాభారత యుద్ధము యొక్క సమయము కూడా. అనేక ధర్మాలు ఉన్నాయి, ప్రపంచము కూడా తమోప్రధానముగా ఉంది, వెరైటీ ధర్మాల ఈ వృక్షమంతా పాతగా అయిపోయింది. ఈ వృక్షము యొక్క మొట్టమొదటి పునాది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అని మీకు తెలుసు. సత్యయుగములో కొద్దిమందే ఉంటారు, ఆ తర్వాత వృద్ధి జరుగుతుంది. ఈ విషయము ఎవరికీ తెలియదు, మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. విద్యార్థులలో కొందరు మంచి తెలివైనవారు ఉంటారు, వారు బాగా ధారణ చేస్తారు మరియు వారికి ఇతరుల చేత కూడా ధారణ చేయించే అభిరుచి కలిగి ఉంటుంది. కొందరు బాగా ధారణ చేస్తారు, కొందరు మధ్యమముగా, కొందరు మూడవ, నాల్గవ శ్రేణులలో ధారణ చేస్తూ ఉంటారు. ప్రదర్శనీలోనైతే రిఫైన్ గా అర్థం చేయించేవారు కావాలి. మొదట ఈ విషయము చెప్పండి - ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఒకరు అనంతమైన పారలౌకిక తండ్రి, ఇంకొకరు హద్దులోని లౌకిక తండ్రి. భారత్ కు అనంతమైన వారసత్వము లభించింది. భారత్ స్వర్గముగా ఉండేది, అది మళ్ళీ నరకముగా అయ్యింది, దీనిని ఆసురీ రాజ్యము అని అంటారు. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది. ఒక్క శివబాబానే స్మృతి చేస్తారు.

తండ్రి అంటారు - పిల్లలూ, పురుషోత్తములుగా అవ్వాలంటే మిమ్మల్ని కనిష్టులుగా చేసే విషయాలను వినకండి, ఒక్క తండ్రి నుండే వినండి. అవ్యభిచారీ జ్ఞానాన్ని వినండి. ఇతరుల నుండి ఏదైతే వింటారో, అదంతా అసత్యమే. తండ్రి ఇప్పుడు మీకు సత్యము వినిపించి పురుషోత్తములుగా తయారుచేస్తారు. ఆసురీ విషయాలను మీరు వింటూ-వింటూ కనిష్టులుగా అయిపోయారు. వెలుగు బ్రహ్మా యొక్క పగలు మరియు అంధకారము బ్రహ్మా యొక్క రాత్రి. ఈ పాయింట్లన్నింటినీ ధారణ చేయాలి. ప్రతి విషయములోనూ నంబరువారుగా ఎలాగూ ఉంటారు. కొందరు డాక్టర్లు ఒక ఆపరేషన్ కు 10-20 వేలు తీసుకుంటారు, కొందరికి తినడానికి కూడా ఏమీ ఉండదు. బ్యారిస్టర్లు కూడా ఈ విధంగా ఉంటారు. మీరు కూడా ఎంతగా చదువుకుంటారో మరియు చదివిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. తేడా అయితే ఉంటుంది కదా. దాస-దాసీలలో కూడా నంబరువారుగా ఉంటారు. మొత్తము ఆధారమంతా చదువుపైనే ఉంది. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను ఎంత చదువుతున్నాను, భవిష్య జన్మ-జన్మాంతరాలు నేను ఎలా తయారవుతాను? జన్మ-జన్మాంతరాలు ఎలా తయారవుతారో, కల్ప-కల్పాంతరాలు అలాగే తయారవుతారు, అందుకే చదువుపై పూర్తి అటెన్షన్ ఉంచాలి. విషాన్ని తాగడము పూర్తిగా వదిలేయాలి. మురికిపట్టిన వస్త్రాలను భగవంతుడు వచ్చి శుభ్రము చేస్తారు అని సత్యయుగములో అనరు. ఈ సమయములో అందరి వస్త్రాలు కుళ్ళిపోయాయి. తమోప్రధానముగా ఉన్నాయి కదా. ఇది కూడా అర్థం చేయించవలసిన విషయము కదా. అందరికన్నా పాత వస్త్రము ఎవరిది? మనదే. మనము ఈ శరీరాన్ని మారుస్తూ ఉంటాము. ఆత్మ పతితముగా అవుతూ ఉంటుంది. శరీరము కూడా పతితముగా, పాతగా అవుతూ ఉంటుంది. శరీరాన్ని మార్చవలసి ఉంటుంది. ఆత్మ అయితే మారదు. శరీరము వృద్ధాప్యములోకి చేరుకుంటుంది, మృత్యువు జరుగుతుంది - ఇది కూడా డ్రామాగా తయారుచేయబడి ఉంది. అందరికీ పాత్ర ఉంది. ఆత్మ అవినాశీ. నేను శరీరాన్ని వదులుతాను అని ఆత్మయే స్వయం అంటుంది. దేహీ-అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. అర్ధకల్పము దేహాభిమానులుగా ఉంటారు, ఆ తర్వాత అర్ధకల్పము దేహీ-అభిమానులుగా ఉంటారు.

దేహీ-అభిమానులుగా అయిన కారణముగా సత్యయుగ దేవతలకు మోహజీతులు అనే టైటిల్ లభించింది ఎందుకంటే అక్కడ ఎలా భావిస్తారంటే - నేను ఆత్మను, ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలి. మోహజీతుడైన రాజు కథ కూడా ఉంది కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, దేవీ-దేవతలు మొహజీతులుగా ఉంటారు. ఎంతో సంతోషముగా ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకోవాలి. పిల్లలకు జ్ఞానమంతా తండ్రి ద్వారా లభిస్తూ ఉంది. మీరే చక్రములో తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఇతర ధర్మాలలోకి ఎవరైతే కన్వర్ట్ అయిపోయారో, వారు కూడా వచ్చి కలుసుకుంటారు. ఎంతోకొంత తమ వారసత్వాన్ని తీసుకుంటారు. వారి ధర్మమే మారిపోయింది కదా. ఎంతకాలము ఆ ధర్మములో ఉన్నారో తెలియదు. 2-3 జన్మలు తీసుకుని ఉండవచ్చు. ఎవరినైనా హిందువు నుండి ముసల్మానుగా చేసినట్లయితే వారు ఆ ధర్మములోకే వస్తూ ఉంటారు, మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇవి కూడా విస్తారమైన విషయాలు. తండ్రి అంటారు, ఇన్ని విషయాలను గుర్తుంచుకోలేకపోతే, అచ్ఛా, కనీసము స్వయాన్ని బాబాకు బిడ్డగా అయినా భావించండి. మంచి-మంచి పిల్లలు కూడా మర్చిపోతారు. తండ్రిని స్మృతియే చేయరు. ఇందులోనే మాయ మరపింపజేస్తుంది. మీరు కూడా ఇంతకుముందు మాయకు దాసులుగా ఉండేవారు కదా. ఇప్పుడు ఈశ్వరునికి చెందినవారిగా అవుతారు. డ్రామాలో ఆ పాత్ర ఉంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ అయిన మీరు మొట్టమొదట శరీరములోకి వచ్చినప్పుడు పవిత్రముగా ఉండేవారు, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ పతితముగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి అంటున్నారు, నష్టోమోహులుగా అవ్వండి. ఈ శరీరముపై కూడా మోహము ఉంచుకోకండి.

ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యము కలుగుతుంది ఎందుకంటే ఈ ప్రపంచములో అందరూ ఒకరికొకరు దుఃఖాన్ని ఇచ్చుకునేవారే, అందుకే ఈ పాత ప్రపంచాన్నే మర్చిపోండి. మనము అశరీరిగా వచ్చాము, మళ్ళీ ఇప్పుడు అశరీరిగా అయి తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రపంచమే అంతమవ్వనున్నది. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని శ్రీకృష్ణుడు అయితే అనలేరు. శ్రీకృష్ణుడు సత్యయుగములో ఉంటారు. తండ్రే అంటారు, నన్ను మీరు పతిత-పావనా అని కూడా అంటారు కావున ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, పావనముగా అయ్యేందుకు నేను ఈ యుక్తిని తెలియజేస్తాను. కల్ప-కల్పము కొరకు యుక్తిని తెలియజేస్తాను. ప్రపంచము పాతగా అయినప్పుడు భగవంతుడు రావలసి ఉంటుంది. మనుష్యులు డ్రామా ఆయువును బాగా పెద్దగా చూపించారు. కావుననే మనుష్యులు దీనిని పూర్తిగా మర్చిపోయారు. ఇది సంగమయుగమని, ఇది పురుషోత్తములుగా తయారయ్యే యుగమని మీకు ఇప్పుడు తెలుసు. మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారములో పడి ఉన్నారు. ఈ సమయములో అంతా తమోప్రధానముగా ఉన్నారు. ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. మీరే అందరికన్నా ఎక్కువ భక్తి చేసారు. ఇప్పుడు భక్తి మార్గము సమాప్తమవుతుంది. భక్తి మృత్యులోకములో ఉంది. ఆ తర్వాత అమరలోకము వస్తుంది. ఈ సమయములో జ్ఞానాన్ని తీసుకుంటారు, ఆ తర్వాత భక్తి యొక్క నామ-రూపాలు ఉండవు. ఓ భగవంతుడా, ఓ రామా - ఇవన్నీ భక్తి మార్గపు పదాలు. ఇక్కడ ఏ శబ్దమూ చేయకూడదు. తండ్రి జ్ఞానసాగరుడు, వారు శబ్దమేమీ చేయరు. వారిని సుఖ-శాంతుల సాగరుడు అనే అంటారు. మరి వినిపించేందుకు కూడా వారికి శరీరము కావాలి కదా. భగవంతుడి భాష ఏమిటి అనేది ఎవరికీ తెలియదు. బాబా అన్ని భాషల్లోనూ మాట్లాడుతారని కాదు. అలా కాదు. వారి భాష హిందీ. బాబా ఒకే భాషలో అర్థం చేయిస్తారు, దానిని మీరు ఇతర భాషలలోకి అనువాదము చేసి చెప్తారు. విదేశీయులు మొదలైనవారు ఎవరు కలిసినా, వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. త్రిమూర్తి చిత్రముపై అర్థం చేయించాలి. ప్రజాపిత బ్రహ్మాకు ఎంతమంది బ్రహ్మాకుమార, కుమారీలు ఉన్నారు. ఎవరైనా వస్తే ముందుగా వారిని అడగండి - మీరు ఎవరి వద్దకు వచ్చారు? బోర్డుపైనైతే ప్రజాపిత... అని వ్రాసి ఉంది. ప్రజాపిత అనగా రచించేవారు. కానీ వారిని భగవంతుడు అని అనలేరు. భగవంతుడు అని నిరాకారుడినే అంటారు. ఈ బ్రహ్మాకుమార, కుమారీలు బ్రహ్మా యొక్క సంతానము. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా తండ్రితో మీకేమి పని! తండ్రితో పిల్లలకే పని ఉంటుంది కదా. మనకు తండ్రి గురించి బాగా తెలుసు. సన్ షోస్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు) అని అంటూ ఉంటారు. మనము వారి పిల్లలము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పురుషోత్తములుగా అయ్యేందుకు కనిష్టులుగా తయారుచేసే ఆసురీ విషయాలు ఏవైతే ఉంటాయో, వాటిని వినకూడదు. ఒక్క తండ్రి నుండే అవ్యభిచారీ జ్ఞానాన్ని వినాలి.

2. నష్టోమోహులుగా అయ్యేందుకు దేహీ-అభిమానులుగా అయ్యే పూర్తి-పూర్తి పురుషార్థము చేయాలి. ఇది పాత, దుఃఖము ఇచ్చే ప్రపంచము అని బుద్ధిలో ఉండాలి, దీనిని మర్చిపోవాలి. దీనిపై అనంతమైన వైరాగ్యము ఉండాలి.

వరదానము:-
సంగమయుగము యొక్క సర్వ ప్రాప్తులను స్మృతిలో ఉంచుకుని ఎక్కే కళను అనుభవం చేసే శ్రేష్ఠ ప్రారబ్ధీ భవ

పరమాత్మ మిలనము మరియు పరమాత్మ జ్ఞానము యొక్క విశేషత ఏమిటంటే - అవినాశీ ప్రాప్తులు లభించడము. సంగమయుగము పురుషార్థీ జీవితము మరియు సత్యయుగము ప్రారబ్ధీ జీవితము అని కాదు. సంగమయుగము యొక్క విశేషత ఏమిటంటే - ఒక్క అడుగు వేయండి మరియు వేలాది అడుగులను ప్రారబ్ధముగా పొందండి. కావున మీరు కేవలం పురుషార్థులు కారు, మీరు శ్రేష్ఠ ప్రారబ్ధులు - ఈ స్వరూపాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి. ప్రారబ్ధాన్ని చూస్తూ సహజముగానే ఎక్కే కళను అనుభవము చేస్తారు. ‘‘పొందవలసిందేదో పొందేసాము’’ - ఈ పాటను పాడుతూ ఉన్నట్లయితే గుటకలు మింగడము మరియు కునుకుపాట్లు పడడము నుండి రక్షింపబడతారు.

స్లోగన్:-
బ్రాహ్మణుల శ్వాస ధైర్యము, దీని ద్వారా కఠినాతి కఠినమైన కార్యాలు కూడా సహజమవుతాయి.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

బ్రహ్మాబాబాను చూసారు కదా, వారు తండ్రితోపాటు స్వయాన్ని సదా కంబైండ్ రూపములో అనుభవము చేసారు మరియు చేయించారు. ఈ కంబైండ్ స్వరూపాన్ని ఎవ్వరూ వేరు చెయ్యలేరు. ఇటువంటి సుపుత్రులైన పిల్లలు సదా స్వయాన్ని తండ్రితో పాటు కంబైండుగా అనుభవము చేస్తారు. వారిని వేరు చేసే శక్తి ఏదీ లేదు.