ఓంశాంతి 
అభ్యాసము కోసము కుమార్తెలు ఇక్కడ (గద్దెపై) కూర్చుంటారు. వాస్తవానికి ఎవరైతే 
దేహీ-అభిమానులుగా అయి తండ్రి స్మృతిలో కూర్చుంటారో వారే ఇక్కడ గద్దెపై కూర్చోవాలి. 
ఒకవేళ స్మృతిలో కూర్చోకపోతే వారిని టీచర్ అని పిలవడానికి వీల్లేదు. స్మృతిలో శక్తి 
ఉంటుంది, జ్ఞానములో శక్తి ఉండదు. దీనిని స్మృతి బలము అనే అనడం జరుగుతుంది. యోగబలము 
అనే పదము సన్యాసులది. తండ్రి కఠినమైన పదాలను ఉపయోగించరు. తండ్రి అంటారు - పిల్లలూ, 
ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రులను స్మృతి చేసుకుంటూ 
ఉంటారు కదా. వారు దేహధారులు. పిల్లలైన మీరు విచిత్రులు. ఈ చిత్రము (దేహము) మీకు 
ఇక్కడ లభిస్తుంది. మీరు విచిత్ర దేశములో నివసించేవారు. అక్కడ చిత్రము ఉండదు. నేను 
ఒక ఆత్మను అన్నది మొట్టమొదట పక్కా చేసుకోవాలి. అందుకే తండ్రి అంటారు - పిల్లలూ, 
దేహీ-అభిమానులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. మీరు నిర్వాణ దేశము 
నుండి వచ్చారు. అది ఆత్మలైన మీ అందరి ఇల్లు. ఇక్కడికి పాత్రను అభినయించేందుకు 
వస్తారు. మొట్టమొదట ఎవరు వస్తారు? ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. ఈ జ్ఞానము ఉన్నవారు 
ప్రపంచములో ఎవరూ లేరు. ఇప్పుడు తండ్రి అంటారు - శాస్త్రాలు మొదలైనవేవైతే చదువుతారో, 
వాటినన్నిటినీ మర్చిపోండి. శ్రీకృష్ణుడు మొదలైనవారి మహిమను ఎంతగా చేస్తారు. గాంధీకి 
కూడా ఎంతగా మహిమ చేస్తారు. అతనే రామ రాజ్యాన్ని స్థాపన చేసి వెళ్ళినంతగా మహిమ చేస్తూ 
ఉంటారు. కానీ, శివ భగవానువాచ - ఆది సనాతన రాజా-రాణుల రాజ్యము యొక్క నియమము ఏదైతే 
ఉందో, తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఆ అనుసారముగా రాజు, రాణులుగా తయారుచేసారు, 
కానీ ఆ ఈశ్వరీయ ఆచార-వ్యవహారాలను కూడా తెంచేసారు. మాకు రాజ్యాలు వద్దు, మాకు ప్రజలపై 
ప్రజల రాజ్యము కావాలి అని అన్నారు. ఇప్పుడు దాని పరిస్థితి ఏమైంది! అంతా దుఃఖమే 
దుఃఖము, పరస్పరము గొడవపడుతూ-కొట్లాడుకుంటూ ఉంటారు. అనేక అభిప్రాయాలు ఏర్పడ్డాయి. 
ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతము ఆధారముగా రాజ్యాన్ని తీసుకుంటారు. మీలో ఎంతటి శక్తి 
ఉంటుందంటే, ఇక అక్కడ సైన్యాలు మొదలైనవి ఉండవు. అక్కడ భయం యొక్క విషయమేమీ లేదు. ఈ 
లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, అద్వైత రాజ్యముగా ఉండేది. అసలు అక్కడ గొడవలు 
జరగడానికి రెండో రాజ్యమనేదే లేదు. దానిని అద్వైత రాజ్యము అని అంటారు. పిల్లలైన 
మిమ్మల్ని తండ్రి దేవతలుగా తయారుచేస్తారు. ఆ తర్వాత రావణుడి ద్వారా ద్వైతము వల్ల 
అసురులుగా అయిపోయారు. భారతవాసులైన మనము మొత్తము విశ్వానికి యజమానులుగా ఉండేవారమని 
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీకు విశ్వ రాజ్యము కేవలం స్మృతి బలము ద్వారానే 
లభించింది. ఇప్పుడు మళ్ళీ అది లభిస్తూ ఉంది. అది కల్ప-కల్పమూ లభిస్తుంది, కేవలం 
స్మృతి బలము ద్వారానే లభిస్తుంది. చదువులో కూడా బలము ఉంది. బ్యారిస్టరుగా 
తయారవుతున్నారంటే బలము ఉంటుంది కదా. అది పైసకు కొరగాని బలము. మీరు యోగబలము ద్వారా 
విశ్వముపై రాజ్యము చేస్తారు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి బలము లభిస్తుంది. మీరు 
అంటారు - బాబా, మేము కల్ప-కల్పము మీ నుండి సత్యయుగ స్వరాజ్యాన్ని తీసుకుంటాము, మళ్ళీ 
పోగొట్టుకుంటాము, మళ్ళీ తిరిగి తీసుకంటాము. మీకు పూర్తి జ్ఞానము లభించింది. ఇప్పుడు 
మనము శ్రీమతముపై శ్రేష్ఠమైన విశ్వము యొక్క రాజ్యాన్ని తీసుకుంటాము. విశ్వము కూడా 
శ్రేష్ఠముగా అవుతుంది. ఈ రచయిత మరియు రచన యొక్క జ్ఞానము మీకు ఇప్పుడు ఉంది. మేము 
రాజ్యాన్ని ఎలా తీసుకున్నాము అనే జ్ఞానము ఈ లక్ష్మీ-నారాయణులకు కూడా ఉండదు! ఇక్కడ 
మీరు చదువుకుంటారు, ఆ తర్వాత వెళ్ళి రాజ్యము చేస్తారు. ఎవరైనా మంచి ధనవంతుల ఇంటిలో 
జన్మ తీసుకుంటే - ఇతను గత జన్మలో మంచి కర్మలు చేసారు, దాన-పుణ్యాలు చేసారు అని 
అంటారు. ఎటువంటి కర్మలో, అటువంటి జన్మ లభిస్తుంది. ఇప్పుడు ఇది ఉన్నదే రావణ రాజ్యము. 
ఇక్కడ ఏ కర్మలు చేసినా అవి వికర్మలుగానే అవుతాయి. మెట్లు దిగవలసిందే. అందరికంటే 
ఉన్నతులైన దేవీ-దేవతా ధర్మము వారు కూడా మెట్లు దిగవలసిందే. సతో, రజో, తమోలలోకి 
రావలసిందే. ప్రతి వస్తువు కొత్తది నుండి మళ్ళీ పాతగా అవుతుంది. ఇప్పుడు పిల్లలైన 
మీకు అపారమైన సంతోషము ఉండాలి. మేము విశ్వానికి యజమానులుగా అవుతాము అని మీ 
సంకల్పము-స్వప్నములో కూడా లేదు.
మొత్తము విశ్వముపై ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది అని భారతవాసులకు తెలుసు. వారు 
పూజ్యులుగా ఉండేవారు, ఆ తర్వాత పూజారులుగా అయ్యారు. మీరే పూజ్యులు, మీరే పూజారులు 
అని గాయనము కూడా చేస్తుంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఇది ఉండాలి. ఈ నాటకము చాలా 
అద్భుతమైనది. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనేదాని గురించి ఎవ్వరికీ తెలియదు. 
శాస్త్రాలలో 84 లక్షల జన్మలు అని వ్రాస్తారు. తండ్రి అంటారు, ఇవన్నీ భక్తి మార్గపు 
ప్రగల్భాలు. ఇది రావణ రాజ్యము కదా. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము ఎలా ఉంటాయి అనేది 
పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. రావణుడిని ప్రతి సంవత్సరము 
కాలుస్తూ ఉంటారు, కావున అతను శత్రువు కదా. పంచ వికారాలు మనుష్యులకు శత్రువులు. 
రావణుడు ఎవరు, అతడిని ఎందుకు కాలుస్తారు - ఇది ఎవ్వరికీ తెలియదు. ఎవరైతే తమను తాము 
సంగమయుగవాసులుగా భావిస్తారో, వారి స్మృతిలో ఉంటుంది - ఇప్పుడు మేము పురుషోత్తములుగా 
అవుతున్నాము, భగవంతుడు మాకు రాజయోగాన్ని నేర్పించి నరుడి నుండి నారాయణుడిగా, 
భ్రష్టాచారుల నుండి శ్రేష్ఠాచారులుగా తయారుచేస్తున్నారు. మనల్ని ఉన్నతోన్నతుడైన 
నిరాకారుడైన భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎంతటి అపారమైన సంతోషము 
ఉండాలి. మేము విద్యార్థులము - అని స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో ఉంటుంది కదా. 
అక్కడ చదివించేవారు సామాన్యమైన టీచరు. ఇక్కడైతే మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. 
చదువుతో ఇంత ఉన్నత పదవి లభిస్తుంది అన్నప్పుడు మరి ఎంత బాగా చదువుకోవాలి. 
వాస్తవానికి ఇది చాలా సహజము, కేవలం ఉదయం అరగంట, ముప్పావుగంట చదువుకోవాలి. మొత్తము 
రోజంతటిలో వ్యాపార వ్యవహారాలలో స్మృతిని మర్చిపోతారు, అందుకే ఇక్కడకు ఉదయమే వచ్చి 
స్మృతిలో కూర్చుంటారు. బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది - 
బాబా, మీరు మమ్మల్ని చదివించడానికి వచ్చారు, మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి 
చదివిస్తారని ఇప్పుడు మాకు తెలిసింది. బాబా వద్దకు పిల్లలెవరైనా వస్తే బాబా 
అడుగుతారు - ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా? ఇటువంటి ప్రశ్నను సాధు-సన్యాసులు 
మొదలైనవారు ఎప్పుడూ అడగలేరు. ఆ సత్సంగాలకు ఎవరు కావాలనుకుంటే వారు వెళ్ళి 
కూర్చొంటారు. ఎంతోమంది వెళ్ళడం చూసి అందరూ లపలికి దూరిపోతారు. మేము కూడా గీత, 
రామాయణము మొదలైనవాటిని ఎంత సంతోషముగా వెళ్ళి వినేవాళ్ళము కానీ ఏమీ అర్థం 
చేసుకునేవారము కాదు అని మీరు కూడా ఇప్పుడు భావిస్తారు. అదంతా భక్తికి సంబంధించిన 
సంతోషము మాత్రమే. చాలా సంతోషములో నాట్యము చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ కిందకు దిగుతూ 
వస్తారు. రకరకాల హఠయోగాలు మొదలైనవి చేస్తారు. ఆరోగ్యము కోసమే అన్నీ చేస్తూ ఉంటారు. 
తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇవన్నీ భక్తి మార్గపు ఆచార-వ్యవహారాలు. రచయిత మరియు 
రచన గురించి ఎవ్వరికీ తెలియదు. ఇక మిగిలినది ఏముందని. రచయిత మరియు రచనను తెలుసుకోవడం 
వలన మీరు ఎలా తయారవుతారు, మరియు తెలుసుకోకపోవడం వలన మీరు ఎలా తయారవుతారు? 
తెలుసుకోవడం వలన మీరు సుసంపన్నులుగా అవుతారు మరియు తెలుసుకోకపోవడం వలన అదే 
భారతవాసులు నిరుపేదలుగా అయిపోయారు. ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ప్రపంచములో ఏమేమి 
జరుగుతూ ఉంటాయి. ఎంత ధనము, బంగారము మొదలైనవాటిని దోచుకుంటూ ఉంటారు! ఇప్పుడు 
పిల్లలైన మీకు తెలుసు - అక్కడైతే మనము బంగారు మహళ్ళను తయారుచేస్తాము. బ్యారిస్టరీ 
మొదలైనవి చదివేటప్పుడు లోలోపల ఉంటుంది కదా - మేము ఈ పరీక్షను పాస్ అయి ఇలా చేస్తాము, 
ఇల్లు కట్టుకుంటాము అని. మరి మేము స్వర్గపు రాకుమారులు, రాకుమార్తెలుగా 
తయారయ్యేందుకు చదువుకుంటున్నాము అని మీకెందుకు బుద్ధిలోకి రాదు. ఎంత సంతోషము ఉండాలి. 
కానీ బయటికి వెళ్ళడముతోనే సంతోషము మాయమైపోతుంది. చిన్న-చిన్న కుమార్తెలు ఈ జ్ఞానములో 
నిమగ్నమైపోతారు. వారి సంబంధీకులు ఏమీ అర్థం చేసుకోరు, ఏదో ఇంద్రజాలము ఉంది అని 
అంటారు. మేము వీరిని చదవనివ్వము అని అంటారు. ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మైనర్ గా 
ఉన్నంత వరకు తల్లిదండ్రుల మాటను వినవలసి ఉంటుంది. మనము తీసుకోవడానికి వీలుండదు. చాలా 
గొడవలు జరుగుతాయి. ప్రారంభములో ఎన్ని గొడవలు జరిగాయి. నాకు 18 సంవత్సరాలు అని కుమారి 
అంటుంది, కానీ ఆమె తండ్రి ఏమో, లేదు 16 సంవత్సరాలే, ఇంకా మైనరే అని అంటారు, గొడవ 
చేసి ఆమెను పట్టుకుని వెళ్ళిపోయేవారు. మైనర్ అంటేనే తండ్రి ఆజ్ఞానుసారముగా 
నడుచుకోవలసి ఉంటుంది. మేజర్ అయితే ఏది కావాలనుకుంటే అది చేయవచ్చు. నిబంధనలు కూడా 
ఉన్నాయి కదా. బాబా అంటారు, మీరు తండ్రి వద్దకు వచ్చినప్పుడు నియమమేమిటంటే - మీ 
లౌకిక తండ్రి నుండి సర్టిఫికెట్ ను తీసుకుని రండి. ఆ తర్వాత మ్యానర్స్ కూడా చూడవలసి 
ఉంటుంది. మ్యానర్స్ సరిగ్గా లేకపోతే తిరిగి వెళ్ళిపోవలసి ఉంటుంది. ఆటలో కూడా ఇలానే 
జరుగుతుంది. సరిగ్గా ఆడకపోతే - నీవు బయటికి వెళ్ళిపో, పరువు తీస్తున్నావు అని అంటారు. 
మనము యుద్ధ మైదానములో ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. కల్ప-కల్పము తండ్రి 
వచ్చి మనల్ని మాయపై విజయులుగా చేస్తారు. ముఖ్యమైన విషయము పావనముగా అవ్వడమే. వికారాల 
ద్వారా పతితముగా అయ్యారు. తండ్రి అంటారు, కామము మహాశత్రువు, ఇది ఆదిమధ్యాంతాలు 
దుఃఖము ఇస్తుంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో, వారే మళ్ళీ దేవీ-దేవతా ధర్మములోకి 
వస్తారు. బ్రాహ్మణులలో కూడా నంబరువారుగా ఉంటారు. దీపము పైకి దీపపు పురుగులు వస్తాయి. 
కొన్ని కాలిపోయి చనిపోతాయి, కొన్ని చుట్టూ తిరిగి వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడికి 
వచ్చినవారిలో కూడా కొందరు పూర్తిగా బలిహారమైపోతారు, కొందరు విని మళ్ళీ వెళ్ళిపోతారు. 
పూర్వము అయితే రక్తముతో కూడా వ్రాసి ఇచ్చేవారు - బాబా, మేము మీ వారము అని. అయినా 
మాయ ఓడించేసింది. మాయ యుద్ధము అంతగా నడుస్తూ ఉంటుంది, దీనినే యుద్ధ స్థలము అని 
అంటారు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా సర్వ 
వేద-శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. చిత్రాలైతే ఎన్నో తయారుచేసారు కదా. 
నారదుని ఉదాహరణ కూడా ఈ సమయానిదే. మేము లక్ష్మి లేక నారాయణుడిగా అవుతాము అని అందరూ 
అంటారు. తండ్రి అంటారు - మీ లోపల చూసుకోండి, నేను అర్హునిగా ఉన్నానా, నాలో ఏ వికారమూ 
లేదు కదా? అందరూ నారదుని వలె భక్తులే కదా. నారదునిది కేవలం ఒక ఉదాహరణగా వ్రాసారు.
మేము శ్రీలక్ష్మిని వరించవచ్చా అని భక్తి మార్గము వారు అంటారు. తండ్రి అంటారు - 
లేదు, ఎప్పుడైతే జ్ఞానము వింటారో అప్పుడే సద్గతిని పొందగలుగుతారు. పతిత-పావనుడినైన 
నేనే అందరికీ సద్గతిని ఇచ్చేవాడిని. తండ్రి మనల్ని రావణ రాజ్యము నుండి విముక్తులుగా 
చేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అవి దైహిక యాత్రలు. భగవానువాచ - 
మన్మనాభవ. అంతే. ఇందులో ఎదురుదెబ్బలు తినే విషయము లేదు. అవన్నీ భక్తి మార్గపు 
ఎదురుదెబ్బలు. అర్ధకల్పము బ్రహ్మా యొక్క పగలు, అర్ధకల్పము బ్రహ్మా యొక్క రాత్రి. 
బి.కె.లైన మనందరికీ ఇప్పుడు అర్ధకల్పము పగలు ఉంటుందని మీరు అర్థం చేసుకుంటారు. మనము 
సుఖధామములో ఉంటాము. అక్కడ భక్తి ఉండదు. మనము అందరికన్నా షావుకారులుగా అవుతాము అని 
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు కావున ఎంత సంతోషము ఉండాలి. మీరందరూ ఇదివరకు కఠినమైన 
రాళ్ళలా ఉండేవారు, ఇప్పుడు తండ్రి సానబెడుతున్నారు. బాబా రత్నాకరుడు కూడా కదా. 
డ్రామానుసారముగా బాబా రథము కూడా అనుభవీ రథాన్ని తీసుకున్నారు. పల్లెటూరి బాలుడు 
అన్న గాయనము కూడా ఉంది. శ్రీకృష్ణుడు పల్లెటూరి బాలుడు ఎలా అవుతారు. అతను 
సత్యయుగములో ఉండేవారు. అతడిని ఊయలల్లో ఊపుతారు, అతనికి కిరీటము పెడతారు, మరి 
పల్లెటూరి బాలుడు అని ఎందుకు అంటారు? నల్లగా అయిన తర్వాత పల్లెటూరి బాలుడు అని 
అంటారు. ఇప్పుడు సుందరముగా అయ్యేందుకు వచ్చారు. తండ్రి జ్ఞానముతో సానబెడుతున్నారు. 
ఈ సత్యమైనవారి సాంగత్యము కల్ప-కల్పము, కల్పములో ఒకేసారి లభిస్తుంది. మిగిలినవన్నీ 
అసత్య సాంగత్యాలు. అందుకే తండ్రి అంటారు, చెడు వినవద్దు... ఎక్కడైనా నన్ను మరియు 
మిమ్మల్ని గ్లాని చేస్తూ ఉంటే, అటువంటి మాటలను వినకండి.
ఏ కుమారీలైతే జ్ఞానములోకి వస్తారో వారు - మాకు తండ్రి ఆస్తిలో భాగము ఉంది అని 
అనవచ్చు. మేము దానితో భారత్ యొక్క సేవార్థము సెంటర్ ఎందుకు తెరవకూడదు. కన్యాదానము 
అయితే ఇవ్వవలసిందే కదా. ఆ భాగము మాకు ఇచ్చినట్లయితే మేము సెంటర్ తెరుస్తాము, అనేకుల 
కళ్యాణము జరుగుతుంది. ఈ విధమైన యుక్తిని రచించాలి. ఇది మీ ఈశ్వరీయ మిషన్. మీరు 
రాతిబుద్ధి కలవారిని పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తారు. మన ధర్మానికి చెందినవారు 
ఎవరైతే ఉంటారో వారు వస్తారు. ఒకే ఇంట్లో ఉన్నా, దేవీ-దేవతా ధర్మానికి చెందిన పుష్పము 
వస్తుంది, మిగిలినవారు రారు. శ్రమించవలసి ఉంటుంది కదా. తండ్రి ఆత్మలందరినీ పావనముగా 
తయారుచేసి అందరినీ తీసుకువెళ్తారు, అందుకే బాబా అర్థం చేయించారు - సంగమయుగ చిత్రము 
వద్దకు తీసుకువెళ్ళండి, ఇటువైపు కలియుగము ఉంది, అటువైపు సత్యయుగము ఉంది, సత్యయుగములో 
దేవతలు ఉన్నారు, కలియుగములో అసురులు ఉన్నారు, దీనిని పురుషోత్తమ సంగమయుగము అని 
అంటారు. తండ్రియే పురుషోత్తములుగా తయారుచేస్తారు. ఎవరైతే చదువుతారో వారు 
సత్యయుగములోకి వస్తారు, మిగిలినవారందరూ ముక్తిధామములోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత 
మళ్ళీ తమ-తమ సమయాలలో వస్తారు. ఈ సృష్టిచక్ర చిత్రము చాలా బాగుంది. పిల్లలకు సేవ 
పట్ల అభిరుచి ఉండాలి. మనము ఈ-ఈ విధంగా సేవ చేసి, పేదవారిని ఉద్ధరించి వారిని 
స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తాము. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ 
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.