08-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


మధురమైన పిల్లలూ - తండ్రి సమానంగా అపకారులకు కూడా ఉపకారము చేయడం నేర్చుకోండి, నిందకులను కూడా తమ మిత్రులుగా చేసుకోండి

ప్రశ్న:-
తండ్రి యొక్క ఏ దృష్టి పక్కాగా ఉంటుంది? పిల్లలైన మీరు ఏ దృష్టిని పక్కా చేసుకోవాలి?

జవాబు:-
ఆత్మలు ఎవరెవరైతే ఉన్నారో వారంతా నా పిల్లలు అన్న దృష్టి తండ్రికి పక్కాగా ఉంది, అందుకే పిల్లలూ, పిల్లలూ అని అంటూ ఉంటారు. మీరు ఎప్పుడూ ఎవ్వరినీ పిల్లలూ, పిల్లలూ అని అనలేరు. మీరు ఈ ఆత్మ నా సోదరుడు అన్న ఈ దృష్టిని పక్కా చేసుకోవాలి. సోదరుడిని చూడండి, సోదరునితో మాట్లాడండి, దీని ద్వారా ఆత్మిక ప్రేమ ఉంటుంది. అశుద్ధమైన ఆలోచనలు సమాప్తమైపోతాయి. నిందించేవారు కూడా మిత్రులుగా అయిపోతారు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి యొక్క పేరు ఏమిటి? తప్పకుండా శివ అనే అంటారు. వారు అందరికీ ఆత్మిక తండ్రి, వారినే భగవంతుడు అని అంటారు. పిల్లలైన మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారంగా అర్థం చేసుకుంటారు. ఆకాశవాణి అని ఏదైతే అంటారో, ఆ ఆకాశవాణి ఎవరిది వెలువడుతుంది? శివబాబాది. ఈ నోటిని ఆకాశ తత్వము అని అంటారు. ఆకాశతత్వము నుండైతే మనుష్యులందరి వాణి వెలువడుతుంది. ఆత్మలందరూ ఎవరైతే ఉన్నారో, వారు తమ తండ్రిని మర్చిపోయారు. అనేక రకాలుగా మహిమ చేస్తూ ఉంటారు, కానీ ఏమీ తెలియదు. మహిమను కూడా ఇక్కడే చేస్తారు. సుఖములోనైతే ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయరు. అన్ని కోరికలు అక్కడ పూర్తయిపోతాయి. ఇక్కడైతే కోరికలు ఎన్నో ఉంటాయి. వర్షాలు కురవకపోతే యజ్ఞాలు రచిస్తారు, అలాగని సదా యజ్ఞాలు చేయడం ద్వారా వర్షాలు కురుస్తాయని కాదు. అలా కాదు. ఎక్కడైనా కరువు ఏర్పడితే యజ్ఞాలు రచిస్తారు, కానీ అలా యజ్ఞాలు చేయడం ద్వారా ఏమీ జరగదు. ఇది డ్రామా. ఆపదలేవైతే వచ్చేది ఉందో, అవి వస్తూనే ఉంటాయి. ఎంతమంది మనుష్యులు మరణిస్తారు, ఎన్ని జంతువులు మొదలైనవి మరణిస్తూ ఉంటాయి. మనుష్యులు ఎంత దుఃఖితులుగా అవుతారు. మరి వర్షాలను ఆపడానికి కూడా యజ్ఞాలు ఉన్నాయా ఏమిటి? బాగా కుండపోత వర్షాలు కురిస్తే అప్పుడు యజ్ఞాలు చేస్తారా? ఈ విషయాలన్నింటినీ గురించి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, వీటి గురించి ఇతరులకు ఏమి తెలుసు.

తండ్రి స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు, మనుష్యులు తండ్రికి మహిమను కూడా చేస్తారు మరియు నిందిస్తారు కూడా. ఇది విచిత్రము, బాబా యొక్క గ్లాని ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది? ఎప్పటి నుండైతే రావణ రాజ్యం ప్రారంభమయ్యిందో అప్పటి నుండి. ముఖ్యమైన గ్లాని ఏమిటంటే - ఈశ్వరుడిని సర్వవ్యాపి అని అన్నారు, దీని కారణంగానే పడిపోయారు. ఎవరైతే మమ్మల్ని నిందిస్తారో, వారు మా మిత్రులు అన్న గాయనము ఉంది. ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా ఎవరు గ్లాని చేసారు? పిల్లలైన మీరు. ఇప్పుడు మళ్ళీ మిత్రులుగా కూడా మీరే అవుతారు. ఆ మాటకొస్తే మొత్తం ప్రపంచమంతా గ్లాని చేస్తుంది. అందులో కూడా నంబరువన్ మీరే, మళ్ళీ మీరే మిత్రులుగా అవుతారు. అందరికంటే చేరువుగా ఉన్న మిత్రులు పిల్లలే. అనంతమైన తండ్రి అంటున్నారు, నన్ను పిల్లలైన మీరే నిందించారు. అపకారులుగా కూడా పిల్లలైన మీరే అవుతారు. డ్రామా ఎలా తయారయ్యింది! ఇవి విచార సాగర మంథనము చేయవలసిన విషయాలు. విచార సాగర మంథనానికి ఎంతటి అర్థం వెలువడుతుంది. దీనిని ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి అంటారు, పిల్లలైన మీరు చదువుకుని ఉపకారం చేస్తారు. యదా యదాహి... అన్న గాయనము కూడా ఉంది, ఇది భారత్ యొక్క విషయమే. ఈ ఆట ఎలా ఉందో చూడండి! శివజయంతిని లేక శివరాత్రిని కూడా జరుపుకుంటారు. వాస్తవానికి అవతరించేవారు ఒక్కరే. అవతరించినవారిని కూడా రాయి-రప్పలలో ఉన్నారు అని అనేసారు. తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు. గీత పాఠకులు శ్లోకాలను చదువుతారు కానీ మాకు తెలియదు అని అంటారు.

మీరే ప్రియాతి-ప్రియమైన పిల్లలు. బాబా ఎవరితో మాట్లాడినా పిల్లలూ, పిల్లలూ అనే అంటూ ఉంటారు. తండ్రికైతే - ఆత్మలందరూ నా పిల్లలు అన్న ఈ దృష్టి పక్కా అయిపోయింది. మీలో ఒక్కరి నోటి నుండి కూడా పిల్లలు అన్న మాట రాదు. ఎవరు ఏ పదవిని కలిగి ఉన్నారు, వారు ఏమిటి అన్నదైతే తెలుస్తుంది. అందరూ ఆత్మలే. ఇది కూడా డ్రామా తయారై ఉంది, అందుకే ఏ విధమైన దుఃఖము లేక సంతోషము కలగదు. అందరూ నా పిల్లలే. ఒకరు ఊడ్చేవారి శరీరాన్ని ధారణ చేస్తే మరొకరు ఫలానా శరీరాన్ని ధారణ చేసారు. పిల్లలూ, పిల్లలూ అనే అలవాటు అయిపోయింది. బాబా దృష్టిలో అందరూ ఆత్మలే. వారిలో కూడా పేదవారు చాలా మంచిగా అనిపిస్తారు ఎందుకంటే డ్రామా అనుసారంగా వారు ఎంతో గ్లాని చేసారు. ఇప్పుడు మళ్ళీ నా వద్దకు వచ్చేశారు. కేవలం ఈ లక్ష్మీ-నారాయణులకే ఎప్పుడూ గ్లాని జరగదు. శ్రీకృష్ణుడికి కూడా ఎంతో గ్లాని చేసారు. ఇది విచిత్రము కదా. అదే శ్రీకృష్ణుడు పెద్దవాడయ్యాక అతడిని గ్లాని చేయలేదు. ఈ జ్ఞానము చాలా చిత్రవిచిత్రమైనది, ఇటువంటి గుహ్యమైన విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోలేరు, ఇందులో బంగారు పాత్ర కావాలి. అది స్మృతియాత్ర ద్వారానే తయారవ్వగలదు. ఇక్కడ కూర్చొని కూడా యథార్థమైన స్మృతి చేయరు. నేను చిన్న ఆత్మ అని భావించరు. స్మృతిని కూడా బుద్ధి ద్వారా చేయాలి. ఇది బుద్ధిలోకి రాదు. అంత చిన్నగా ఉండే ఆత్మ మన తండ్రి కూడా, టీచరు కూడా, ఇది బుద్ధిలోకి రావడం కూడా అసంభవమైపోతుంది. బాబా, బాబా అనైతే అంటారు, దుఃఖములో అందరూ స్మరిస్తారు. భగవానువాచ ఉంది కదా - దుఃఖములో అందరూ తలచుకుంటారు, సుఖములో ఎవ్వరూ తలచుకోరు, అసలు అప్పుడు స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు. ఇక్కడైతే ఎన్ని దుఃఖాలు, ఆపదలు మొదలైనవి వస్తాయి. ఓ భగవంతుడా, దయ చూపించండి, కృప చూపించండి అని తలచుకుంటారు. ఇప్పుడు పిల్లలుగా అయ్యాక కూడా - కృప చూపించండి, శక్తిని ఇవ్వండి, దయ చూపించండి అని వ్రాస్తూ ఉంటారు. బాబా వ్రాస్తారు - శక్తిని మీకు మీరే యోగబలముతో తీసుకోండి. మీపై మీరే కృప చూపించుకోండి. మీకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకోండి. అది ఏ విధంగా దిద్దుకోగలరో నేను యుక్తిని తెలియజేస్తాను. టీచర్ చదువుకునేందుకు యుక్తిని తెలియజేస్తారు. ఇక చదవడం, టీచర్ డైరెక్షన్ పై నడవడం విద్యార్థుల పని. కృప చూపించేందుకు లేక ఆశీర్వదించేందుకు టీచర్ గురువేమీ కాదు. మంచి పిల్లలెవరైతే ఉంటారో వారు పరుగు తీస్తారు. ప్రతి ఒక్కరూ స్వతంత్రులు, ఎంతగా పరుగు తీయాలనుకుంటే అంతగా పరుగు తీయవచ్చు. స్మృతియాత్రయే పరుగు తీయడము.

ఒక్కొక్క ఆత్మ స్వతంత్రమైనది. సోదరీ, సోదరుల సంబంధం నుండి కూడా విడిపించేసారు. సోదరులుగా భావించినా కూడా అశుద్ధ దృష్టి వదలదు, అది తన పని చేస్తూ ఉంటుంది. ఈ సమయములో మనుష్యుల అంగాలన్నీ క్రిమినల్ గా ఉన్నాయి. ఎవరినైనా కాలితో తన్నితే లేక గట్చిగా దెబ్బ వేస్తే మరి ఆ అంగము క్రిమినల్ అంగము అయినట్లు కదా. అంగాంగము క్రిమినల్ గా ఉన్నాయి. అక్కడ ఏ అంగమూ క్రిమినల్ గా ఉండదు. ఇక్కడ అంగాంగముతోనూ క్రిమినల్ పనులు చేస్తూ ఉంటారు. అన్నింటికంటే ఎక్కువ క్రిమినల్ అంగము ఏది? కనులు. వికారాల ఆశ పూర్తవ్వకపోతే ఇక చేతులను ఉపయోగించడం మొదలుపెడతారు. మొట్టమొదట కళ్ళు. కావుననే సూరదాసుని కథ కూడా ఉంది. శివబాబా అయితే ఏ శాస్త్రాలనూ చదవలేదు. ఈ రథము కలవారు చదివారు. శివబాబానైతే జ్ఞానసాగరుడు అని అంటారు. శివబాబా ఏమీ పుస్తకాన్ని చేపట్టరని మీరు అర్థం చేసుకున్నారు. నేను నాలెడ్జ్ ఫుల్ ను, బీజరూపుడిని. ఇది సృష్టిరూపీ వృక్షము, దీని రచయిత తండ్రి, వారు బీజము. బాబా అర్థం చేయిస్తున్నారు - నా నివాస స్థానము మూలవతనములో ఉంది. ఇప్పుడు నేను ఈ శరీరములో విరాజమానమై ఉన్నాను. నేను ఈ మనుష్య సృష్టికి బీజరూపుడను అని ఇంకెవ్వరూ అనలేరు. నేను పరమపిత పరమాత్మను అని ఇంకెవ్వరూ ఈ విధంగా అనలేరు. మంచి వివేకవంతులైన పిల్లలెవరైనా ఉంటే, వారితో ఎవరైనా ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్తే, మరి నీవు కూడా ఈశ్వరుడివేనా, నీవు అల్లా-సాయివా, అది అవ్వదు అని అనేస్తారు. కానీ ఈ సమయములో ఎవరూ వివేకవంతులుగా లేరు. అల్లాను గురించి కూడా ఎవరికీ తెలియదు, నేను అల్లాను అని వారు స్వయమూ అంటారు. వారు కూడా ఇంగ్లీష్ లో ఓమ్నిప్రెజంట్ (సర్వవ్యాపి) అని అంటారు. దాని అర్థము తెలిసినట్లయితే ఎప్పుడూ అనరు. శివబాబా జయంతియే కొత్త విశ్వ జయంతి అని పిల్లలకు ఇప్పుడు తెలుసు. అందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ వచ్చేస్తాయి. శివజయంతియే కృష్ణజయంతి, అదే దసరా జయంతి. శివజయంతియే దీపావళి జయంతి, శివజయంతియే స్వర్గ జయంతి. ఇందులో అన్ని జయంతులూ వచ్చేస్తాయి. ఈ కొత్త విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. శివజయంతియే శివాలయ జయంతి, వేశ్యాలయ వర్ధంతి. అన్ని కొత్త విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. శివజయంతియే కొత్త విశ్వము యొక్క జయంతి. విశ్వములో శాంతి ఏర్పడాలి అని కోరుకుంటారు కదా. మీరు ఎంత బాగా అర్థం చేయించినా వారు మేల్కోనే మేల్కోరు. అజ్ఞానాంధకారంలో నిదురిస్తూ ఉన్నారు కదా. భక్తి చేస్తూ, మెట్లు దిగుతూ ఉంటారు. తండ్రి అంటారు, నేను వచ్చి అందరికీ సద్గతిని ఇస్తాను. స్వర్గము మరియు నరకము యొక్క రహస్యాన్ని పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు. వార్తా పత్రికలేవైతే మిమ్మల్ని గ్లాని చేస్తాయో వారికి ఇలా వ్రాసి పంపించాలి - మమ్మల్ని నిందించేవారు ఎవరైతే ఉన్నారో, వారు మా మిత్రులు, మేము మీ సద్గతిని కూడా తప్పకుండా చేస్తాము, మీకు ఎంత కావాలనుకుంటే అంత నిందించండి, స్వయంగా ఈశ్వరుడినే నిందిస్తారు, మమ్మల్ని నిందిస్తే ఏమైంది, మీ సద్గతిని మేము తప్పకుండా చేస్తాము, మీకు ఇష్టం లేకపోయినా సరే, ముక్కుపట్టుకొనైనా తీసుకువెళ్తాము. ఇందులో భయపడే విషయమేమీ లేదు. ఏదైతే చేస్తారో దానిని కల్పక్రితము కూడా చేసారు. బి.కె.లమైన మనమైతే అందరి సద్గతిని చేస్తాము. బాగా అర్థం చేయించాలి. అబలలపై అత్యాచారాలైతే కల్పక్రితము కూడా జరిగాయి, ఇది పిల్లలు మర్చిపోతారు. తండ్రి అంటారు, అనంతమైన పిల్లలందరూ నన్ను గ్లాని చేస్తారు. అందరికంటే ప్రియమైన మిత్రులుగా పిల్లలే అనిపిస్తారు. పిల్లలు పుష్పాలవంటివారు. పిల్లలను తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుంటారు, తలపైకి ఎక్కించుకుంటారు, వారికి సేవలు చేస్తారు. బాబా కూడా పిల్లలైన మీకు సేవ చేస్తారు.

ఇప్పుడు మీకు ఈ జ్ఞానము లభించింది, దీనిని మీరు మీతో పాటు తీసుకువెళ్తారు. ఎవరైతే తీసుకువెళ్ళరో వారికి కూడా డ్రామాలో పాత్ర ఉంది. వారు అదే పాత్రను అభినయిస్తారు. లెక్కాచారాలను తీర్చుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వారు స్వర్గాన్ని అయితే చూడలేరు. అందరూ స్వర్గాన్ని చూడరు కదా. ఇది డ్రామాగా తయారై ఉంది. పాపాలు చాలా చేస్తారు, రావడం కూడా ఆలస్యంగా వస్తారు. తమోప్రధానులు చాలా ఆలస్యంగా వస్తారు. ఈ రహస్యము కూడా బాగా అర్థం చేసుకోవలసినది. మంచి-మంచి మహారథులైన పిల్లలపై కూడా గ్రహచారం కూర్చుంటే వెంటనే కోపం వచ్చేస్తుంది, ఇక తర్వాత ఉత్తరం కూడా వ్రాయరు. బాబా కూడా అంటారు - వారికి మురళిని పంపించడం ఆపుచేయండి. అటువంటివారికి బాబా ఖజానాను అందించడం వలన లాభమేముంది. ఆ తర్వాత వారికి కళ్ళు తెరుచుకుంటే పొరపాటు అయిపోయింది అని అంటారు, కొందరైతే లెక్కే చేయరు. అంత నిర్లక్ష్యము చేయకూడదు. ఇటువంటివారు ఎంతోమంది ఉన్నారు, బాబాను స్మృతి కూడా చేయరు, ఎవ్వరినీ తమ సమానంగా కూడా తయారుచేయరు. లేదంటే బాబాకు వ్రాయాలి - బాబా, మేము మిమ్మల్ని ప్రతి క్షణము తలచుకుంటూ ఉంటాము. కొందరైతే - ఫలానావారికి ప్రియస్మృతులు చెప్పండి అని అంటూ అందరి పేర్లూ వ్రాసేస్తారు. ఈ స్మృతి సత్యమైనది కాదు. ఇక్కడ అసత్యము నడవదు. లోలోపల మనసు తింటూ ఉంటుంది. పిల్లలకు పాయింట్ల అయితే మంచి-మంచివి అర్థం చేయిస్తూ ఉంటారు. రోజురోజుకు బాబా గుహ్యాతి గుహ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. సత్యయుగములో దుఃఖము అన్న మాటే ఉండదు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. మైసూరు రాజు కూడా రావణుడు మొదలైనవారిని తయారుచేసి దసరాను బాగా జరుపుతారు. రాముడిని భగవంతుడు అని అంటారు. రాముని సీత అపహరించబడింది. ఇప్పుడు వారైతే సర్వశక్తివంతుడు, అతని సీత ఎలా అపహరించబడగలరు. ఇదంతా అంధవిశ్వాసము. ఈ సమయములో అందరిలోనూ 5 వికారాల అశుద్ధత ఉంది. మళ్ళీ భగవంతుడిని సర్వవ్యాపి అని అనడము, ఇది చాలా పెద్ద అసత్యము. అందుకే తండ్రి అంటారు, యదా యదాహి... నేను వచ్చి సత్యఖండాన్ని, సత్యధర్మాన్ని స్థాపన చేస్తాను. సత్యఖండము అని సత్యయుగమును, అసత్యఖండము అని కలియుగమును అంటారు. ఇప్పుడు తండ్రి అసత్యఖండమును సత్యఖండముగా తయారుచేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ గుహ్యమైన లేక చిత్రవిచిత్రమైన జ్ఞానాన్ని అర్థం చేసుకునేందుకు బుద్ధిని స్మృతియాత్ర ద్వారా బంగారు పాత్రగా తయారుచేసుకోవాలి. స్మృతి రేస్ ను చేయాలి.

2. తండ్రి డైరెక్షన్ పై నడుస్తూ చదువును శ్రద్ధగా చదువుకుని తమపై తామే కృపను లేక ఆశీర్వాదమును చూపించుకోవాలి, మీకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి. నిందించేవారిని మీ మిత్రులుగా భావిస్తూ వారికి కూడా సద్గతిని అందించాలి.

వరదానము:-

పై నుండి అవతరించిన అవతారమూర్తులుగా అయ్యి సేవ చేసే సాక్షాత్కారమూర్త భవ

ఏ విధంగా బాబా సేవ కొరకు వతనము నుండి కిందకు వస్తారో, అలా మనము కూడా సేవ కొరకు వతనము నుండి వచ్చాము, ఈ విధంగా అనుభవం చేస్తూ సేవ చేసినట్లయితే సదా అతీతులుగా మరియు బాబా సమానంగా విశ్వానికి ప్రియమైనవారిగా అవుతారు. పై నుండి కిందకు రావటము అనగా అవతారమూర్తులుగా అయ్యి అవతరించి సేవ చెయ్యటము. అవతారమూర్తులు వచ్చి మమ్మల్ని తమతో పాటు తీసుకువెళ్ళాలి అని అందరూ కోరుకుంటారు. కావున అందరినీ ముక్తిధామములోకి తమతో పాటు తీసుకువెళ్ళే సత్యమైన అవతారమూర్తులు మీరే. ఎప్పుడైతే అవతారమూర్తులుగా భావిస్తూ సేవ చేస్తారో, అప్పుడు సాక్షాత్కారమూర్తులుగా అవుతారు మరియు అనేకుల కోరికలు పూర్తి అవుతాయి.

స్లోగన్:-

మీకు ఎవరైనా మంచిని ఇచ్చినా లేక చెడును ఇచ్చినా, మీరైతే అందరికీ స్నేహాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి, దయ చూపించండి.