‘‘ఏకవ్రతగా అయ్యి
పవిత్రతా ధారణ ద్వారా ఆత్మికతలో ఉంటూ మనసా సేవను చెయ్యండి’’
ఈ రోజు ఆత్మిక తండ్రి నలువైపులా ఉన్న ఆత్మిక పిల్లల యొక్క
ఆత్మికతను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలో ఆత్మికత యొక్క
మెరుపు ఎంత ఉంది? ఆత్మికత నయనాల ద్వారా ప్రత్యక్షమవుతుంది.
ఆత్మికతా శక్తి కల ఆత్మ సదా నయనాల ద్వారా ఇతరులకు కూడా ఆత్మిక
శక్తిని ఇస్తుంది. ఆత్మిక చిరునవ్వు ఇతరులకు కూడా సంతోషాన్ని
అనుభవం చేయిస్తుంది. వారి నడవడిక, ముఖము ఫరిశ్తాల సమానంగా డబల్
లైట్ గా కనిపిస్తుంది. ఇటువంటి ఆత్మికతకు ఆధారము పవిత్రత.
ఎంతెంతగా మనసు, వాణి, కర్మలలో పవిత్రత ఉంటుందో అంతగానే ఆత్మికత
కనిపిస్తుంది. పవిత్రత బ్రాహ్మణ జీవితము యొక్క అలంకరణ. పవిత్రత
బ్రాహ్మణ జీవితము యొక్క మర్యాద. కనుక బాప్ దాదా పిల్లలు ప్రతి
ఒక్కరిలోని పవిత్రత ఆధారంగా ఆత్మికతను చూస్తున్నారు. ఆత్మికత
కల ఆత్మ ఈ లోకములో ఉంటూ కూడా అలౌకిక ఫరిశ్తాలా కనిపిస్తుంది.
కనుక మిమ్మల్ని మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి - మా
సంకల్పాలు, మాటలలో ఆత్మికత ఉందా? ఆత్మిక సంకల్పాలు స్వయములో
కూడా శక్తిని నింపుతాయి మరియు ఇతరులకు కూడా శక్తిని ఇస్తాయి.
దీనినే మరో మాటలో - ఆత్మిక సంకల్పాలు మనసా సేవకు నిమిత్తమవుతాయి
అని అంటారు. ఆత్మికతతో కూడిన మాటలు స్వయానికి మరియు ఇతరులకు
సుఖాన్ని అనుభవం చేయిస్తాయి, శాంతిని అనుభవం చేయిస్తాయి.
ఆత్మికతతో కూడిన ఒక్క మాట ఇతర ఆత్మలు జీవితములో ముందుకు
వెళ్ళేందుకు ఆధారంగా అవుతుంది. ఆత్మిక మాటలు మాట్లాడేవారు
వరదానీ ఆత్మగా అవుతారు. ఆత్మిక కర్మలు సహజంగా స్వయానికి కూడా
కర్మయోగీ స్థితిని అనుభవం చేయిస్తాయి మరియు ఇతరులను కూడా
కర్మయోగులుగా తయారుచేయడానికి శ్యాంపుల్ గా అవుతాయి. వారి
సంపర్కములోకి ఎవరు వచ్చినా, వారు సహజయోగి, కర్మయోగి జీవితము
యొక్క అనుభవజ్ఞులుగా అవుతారు. కానీ ఆత్మికతకు బీజము పవిత్రత అని
వినిపించాము కదా. పవిత్రత స్వప్నములో కూడా భంగము కాకూడదు,
అప్పుడు ఆత్మికత కనిపిస్తుంది. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యమే
కాదు, కానీ ప్రతి మాటా బ్రహ్మాచారిగా ఉండాలి, ప్రతి సంకల్పము
బ్రహ్మాచారిగా ఉండాలి, ప్రతి కర్మ బ్రహ్మాచారిగా ఉండాలి. ఏ
విధంగా లౌకికములో కూడా కొంతమంది పిల్లల ముఖము వారి తండ్రి
ముఖములా, తండ్రి సమానంగా ఉంటే, ఇతనిలో వీరి తండ్రి
కనిపిస్తున్నారు అని అంటారో, అదే విధంగా బ్రహ్మాచారీ బ్రాహ్మణ
ఆత్మ యొక్క ముఖము ఆత్మికత ఆధారంగా బ్రహ్మా తండ్రి సమానంగా
అనుభవమవ్వాలి. వీరు బాబా సమానంగా ఉన్నారు అని సంపర్కములోని
ఆత్మలు అనుభవం చెయ్యాలి. సరే, 100 శాతం లేకపోయినా కానీ
సమయమనుసారంగా ఎంత శాతము కనిపించాలి? ఎంతవరకు చేరుకున్నారు? 75
శాతమా, 80 శాతమా, 90 శాతమా, ఎంతవరకు చేరుకున్నారు? ఇక్కడ
ముందువరుసలో కూర్చున్నవారు చెప్పండి, చూడండి, కూర్చోవటానికైతే
మీకు ముందు నంబరు లభించింది, మరి బ్రహ్మాచారిగా అవ్వటంలో కూడా
ముందు నంబరులో ఉంటారు కదా! ముందు ఉన్నారా లేదా?
బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరిలోని పవిత్రత ఆధారముగా
ఆత్మికతను చూడాలనుకుంటున్నారు. బాప్ దాదా వద్ద అందరి చార్టు
ఉంది. బాప్ దాదా చెప్పటం లేదు కానీ వారి వద్ద చార్టు ఉంది,
ఏమేమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, బాప్ దాదా వద్ద చార్టు
అంతా ఉంది. పవిత్రతలో కూడా ఇప్పుడు కొంతమంది పిల్లల శాతము చాలా
తక్కువగా ఉంది. సమయమనుసారంగా విశ్వములోని ఆత్మలు, ఆత్మలైన
మిమ్మల్ని ఆత్మికత యొక్క శ్యాంపుల్ గా చూడాలనుకుంటున్నారు.
ఇందుకు సహజ సాధనము - కేవలం ఒక్క మాటను అటెన్షన్ లో పెట్టుకోండి,
పదే-పదే ఆ ఒక్క మాటను మీకు మీరే అండర్ లైన్ చేసుకోండి, ఆ ఒక్క
మాట ఏమిటంటే - ఏకవ్రత భవ. ఎక్కడైతే ఒక్కరు ఉంటారో, అక్కడ
ఏకాగ్రత స్వతహాగానే వచ్చేస్తుంది. అచలంగా, స్థిరంగా స్వతహాగానే
అయిపోతారు. ఏకవ్రతగా అవ్వడంతో ఏకమతంపై నడుచుకోవడము చాలా
సహజమైపోతుంది. ఉండడమే ఏకవ్రతగా ఉంటే, ఇక ఆ ఒక్కరి మతముతో ఏకమతి,
సద్గతి సహజమైపోతుంది. ఏకరస స్థితి స్వతహాగా తయారైపోతుంది. కనుక
చెక్ చేసుకోండి - ఏకవ్రతగా ఉన్నారా? మొత్తము రోజంతటిలో
మనసు-బుద్ధి ఏకవ్రతగా ఉంటున్నాయా? లెక్కల్లో కూడా మొదట ఒకటితోనే
లెక్క మొదలవుతుంది. ఒక సున్నా, ఆ తర్వాత ఒకటి. ఒకటి పక్కన ఒక
బిందువు (సున్నా)ను పెడుతూ వెళ్తే దాని విలువ ఎంతగా పెరుగుతూ
ఉంటుంది! కనుక మరేమీ గుర్తుకు రాకపోయినా కానీ ‘ఒక్క’ (ఏకవ్రత)
అన్న మాట అయితే గుర్తుంటుంది కదా! సమయము మరియు ఆత్మలు ఏకవ్రత
ఆత్మలైన మిమ్మల్ని పిలుస్తున్నాయి. మరి ఓ దేవాత్మల్లారా, మీకు
సమయం యొక్క పిలుపు, ఆత్మల యొక్క పిలుపు వినపడటం లేదా? ప్రకృతి
కూడా ప్రకృతిపతి ఆత్మలైన మిమ్మల్ని చూస్తూ, చూస్తూ పిలుస్తుంది
- ఓ ప్రకృతిపతి ఆత్మల్లారా, ఇప్పుడు పరివర్తన చెయ్యండి అని.
మధ్యమధ్యలో అకస్మాత్తుగా చిన్న, చిన్న కుదుపులు వస్తున్నాయి.
పాపం ఆ దీనాత్మలకు పదే-పదే దుఃఖం లేక భయంతో కూడిన ఆకస్మిక
కుదుపులను రానివ్వకండి. ముక్తిని ఇచ్చే ఆత్మలైన మీరు, మాస్టర్
ముక్తిదాతలైన మీరు, ఈ ఆత్మలకు ఎప్పుడు ముక్తిని ఇస్తారు?
మనస్సులో దయ కలగటం లేదా? లేదా సమాచారం విన్న తర్వాత విన్నాము,
అయిపోయింది... అని నిశ్శబ్దమైపోతున్నారా. అందుకే బాప్ దాదా
పిల్లలు ప్రతి ఒక్కరిదీ ఇప్పుడు దయా స్వరూపాన్ని
చూడాలనుకుంటున్నారు. మీ హద్దు విషయాలను ఇప్పుడు వదిలేయండి, దయా
స్వరూపులుగా అవ్వండి. మనసా సేవలో నిమగ్నమవ్వండి. సకాష్ ను
ఇవ్వండి, శాంతిని ఇవ్వండి, ఆధారాన్ని ఇవ్వండి. ఒకవేళ దయా
స్వరూపులుగా అయి ఇతరులకు ఆధారాన్ని ఇవ్వటంలో బిజీగా ఉన్నట్లయితే
హద్దు ఆకర్షణల నుండి, హద్దు విషయాల నుండి స్వతహాగానే
దూరమైపోతారు, శ్రమ నుండి రక్షింపబడతారు. వాణి సేవలో చాలా
సమయాన్ని ఇచ్చారు, అందులో సమయాన్ని సఫలం చేసుకున్నారు,
సందేశాన్ని ఇచ్చారు, ఆత్మలను సంబంధ-సంపర్కములోకి తీసుకువచ్చారు,
డ్రామానుసారంగా ఇప్పటివరకు ఏదైతే చేసారో అది చాలా బాగా చేసారు.
కానీ ఇప్పుడు వాణితోపాటుగా మనసా సేవ యొక్క అవసరము ఎక్కువగా ఉంది.
మరియు ఈ మనసా సేవను ప్రతి ఒక్కరూ చెయ్యగలరు, కొత్తవారు, పాతవారు,
మహారథులు, గుర్రపు స్వారీ చేసేవారు, పాదచారులు అందరూ చెయ్యగలరు.
ఇందులో పెద్దవారు చేస్తారు, మేమైతే చిన్నవారము, మేమైతే
అనారోగ్యంతో ఉన్నాము, మాకైతే సాధనాలు లేవు... ఇలా ఏ ఆధారమూ
అవసరం లేదు. దీనిని చిన్న-చిన్న పిల్లలు కూడా చెయ్యగలరు.
పిల్లలూ, మనసా సేవను చెయ్యగలరు కదా? (హా జీ). అందుకే ఇప్పుడు
వాచ మరియు మనసా సేవ యొక్క బ్యాలెన్సును పెట్టండి. మనసా సేవ వలన,
చేస్తున్న మీకు కూడా చాలా లాభం ఉంది. ఎందుకు? ఏ ఆత్మకైతే మనసా
సేవ ద్వారా అనగా సంకల్పాల ద్వారా శక్తిని ఇస్తారో, సకాష్ ను
ఇస్తారో, ఆ ఆత్మ మీకు ఆశీర్వాదాలను ఇస్తుంది. మరియు మీ ఖాతాలో
స్వ యొక్క పురుషార్థమైతే ఉండనే ఉంది, దానితో పాటు ఆశీర్వాదాల
ఖాతా కూడా జమ అయిపోతుంది. కనుక మీ జమ ఖాతా డబుల్ రీతిలో
పెరుగుతూ ఉంటుంది, అందుకే కొత్తవారైనా లేక పాతవారైనా, ఎందుకంటే
ఈ సారి కొత్తవారు చాలామంది వచ్చారు కదా! కొత్తవారు ఎవరైతే
మొదటిసారిగా వచ్చారో వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చిన
పిల్లలను కూడా బాప్ దాదా అడుగుతున్నారు, ఆత్మలైన మీరు మనసా
సేవను చెయ్యగలరా? (బాప్ దాదా పాండవులను, మాతలను, అందరినీ
విడివిడిగా అడిగారు - మీరు మనసా సేవను చెయ్యగలరా?) చాలా బాగా
చేతులెత్తారు. టి.వి. ద్వారా చూస్తూ, వింటూ ఉన్నా లేక
సమ్ముఖముగా వింటున్నా, ఇప్పుడు బాప్ దాదా పిల్లలందరికీ బాధ్యతను
ఇస్తున్నారు - ప్రతి రోజూ మొత్తము రోజంతటిలో మనసా సేవను ఎన్ని
గంటలు యథార్థ రీతిలో చేసారు, దీని చార్టును ప్రతి ఒక్కరూ తమ
వద్ద పెట్టుకోండి. ఆ, చేసేసాము అని అనవద్దు. యథార్థ రూపములో
ఎన్ని గంటలు మనసా సేవ చేసారు, అది ప్రతి ఒక్కరూ చార్టు పెట్టండి.
తర్వాత బాప్ దాదా అకస్మాత్తుగా చార్టును అడుగుతారు, డేట్
చెప్పరు. అకస్మాత్తుగా అడుగుతారు, బాధ్యతా కిరీటాన్ని
పెట్టుకుని ఉన్నారా లేక అది కదులుతూ ఉందా అన్నదానిని చూస్తారు.
బాధ్యతా కిరీటాన్ని పెట్టుకోవాలి కదా! టీచర్లు అయితే బాధ్యతా
కిరీటాన్ని పెట్టుకునే ఉన్నారు కదా! ఇప్పుడు అందులో ఈ మనసా సేవ
బాధ్యతను కలపండి. సరేనా! డబుల్ విదేశీయులు చేతులెత్తండి. ఈ
బాధ్యతా కిరీటము మంచిగా అనిపిస్తుందా? అనిపిస్తుంది అని అనేవారు
చేతులెత్తండి. టీచర్లు కూడా చేతులెత్తండి, మిమ్మల్ని చూస్తే
అందరికీ ప్రేరణ కలుగుతుంది. మరి చార్టును పెట్టుకుంటారా? అచ్ఛా,
బాప్ దాదా అకస్మాత్తుగా ఏదో ఒక రోజు అడుగుతారు, మీ-మీ చార్టును
వ్రాసి పంపండి అని, అప్పుడు చూస్తాము, ఎందుకంటే వర్తమాన సమయములో
ఇది చాలా అవసరము. మీ పరివారములోనివారి దుఃఖాన్ని, ఆందోళనను మీరు
చూడగలరా! చూడగలరా? దుఃఖిత ఆత్మలకు అంచలినైతే ఇవ్వండి. మేము
ఒక్క బిందువు కొరకు దాహార్తులుగా ఉన్నాము... అని మీ పాట ఒకటి
ఉంది కదా. ఈ సమయములో ఆత్మలు సుఖ-శాంతుల యొక్క ఒక్క బిందువు
కొరకు దాహార్తులుగా ఉన్నారు. సుఖ-శాంతుల యొక్క ఒక్క అమృత
బిందువు లభించినా కూడా సంతోషపడిపోతారు. బాప్ దాదా పదే-పదే
వినిపిస్తూ ఉంటారు - సమయము మీ కొరకు ఎదురుచూస్తూ ఉంది.
బ్రహ్మాబాబా తమ ఇంటి గేట్ ను తెరవడానికి ఎదురుచూస్తున్నారు.
ప్రకృతి తీవ్రగతితో శుభ్రం చేయడానికి ఎదురుచూస్తూ ఉంది. కనుక ఓ
ఫరిశ్తాల్లారా, ఇప్పుడు మీ డబల్ లైట్ ద్వారా ఆ ఎదురుచూపులను
సమాప్తము చెయ్యండి. ఎవర్రెడీ అన్న మాటనైతే అందరూ అంటూ ఉంటారు
కానీ సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వటంలో ఎవర్రెడీగా అయ్యారా?
కేవలం శరీరాన్ని వదిలే విషయంలో ఎవర్రెడీగా అవ్వడం కాదు, కానీ
తండ్రి సమానంగా అయ్యి వెళ్ళటంలో ఎవర్రెడీగా అవ్వాలి.
మధుబన్ వారందరూ ముందు కూర్చుంటారు, మంచిది. సేవ కూడా
చేస్తారు. మధుబన్ వారు ఎవర్రెడీయేనా? నవ్వుతున్నారు, అచ్ఛా,
ముందు వరుసలో ఉన్న మహారథులు ఎవర్రెడీయేనా? బాబా సమానంగా
అవ్వటంలో ఎవర్రెడీయేనా? అలా అయ్యి వెళ్తే అడ్వాన్స్ పార్టీలోకి
వెళ్తారు. అడ్వాన్స్ పార్టీ అనుకోకపోయినా కూడా పెరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు వాణి మరియు మనసా సేవల బ్యాలెన్స్ లో బిజీ అయినట్లయితే
చాలా బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాలు) లభిస్తాయి. డబుల్ ఖాతా జమ
అయిపోతుంది - పురుషార్థముది మరియు ఆశీర్వాదాలది. కనుక సంకల్పాల
ద్వారా, మాటల ద్వారా, వాణి ద్వారా, కర్మల ద్వారా,
సంబంధ-సంపర్కముల ద్వారా ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు
ఆశీర్వాదాలను తీసుకోండి. ఒకటే పని చెయ్యండి, ఆశీర్వాదాలను
ఇవ్వాలి, అంతే. ఎవరైనా శాపనార్థాలు ఇచ్చినా సరే మీరు మాత్రం
ఆశీర్వాదాలు ఇవ్వండి ఎందుకంటే మీరు ఆశీర్వాదాల సాగరుని పిల్లలు.
ఎవరైనా అసంతుష్టులైనా మీరు అసంతుష్టులవ్వకండి. మీరు సంతుష్టంగా
ఉండండి. అలా వీలవుతుందా? 100 మంది మిమ్మల్ని అసంతుష్టం చేసినా
సరే మీరు సంతుష్టంగా ఉండండి, అది వీలవుతుందా? ఇలా వీలవుతుందా?
రెండవ వరుసలో ఉన్నవారు చెప్పండి, వీలవుతుందా? ఇప్పుడు ఇంకా
అసంతుష్టం చేస్తారు, చూడండి! పరీక్ష అయితే వస్తుంది కదా. మాయ
కూడా వింటుంది కదా! కేవలం ఈ వ్రతాన్ని చేపట్టండి, దృఢ సంకల్పం
తీసుకోండి - ‘‘నేను ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు తీసుకోవాలి,
అంతే.’’ వీలవుతుందా? మాయ అసంతుష్టం చేసినా కానీ, మీరైతే
సంతుష్టం చేసేవారే కదా? కనుక ఒకే పని చెయ్యండి, అంతే. అసంతుష్టం
అవ్వకూడదు, అసంతుష్టం చెయ్యకూడదు. వారు అసంతుష్టం చేసినా కానీ,
మనము అసంతుష్టం అవ్వకూడదు. మనము అసంతుష్టం అవ్వకూడదు, అసంతుష్టం
చెయ్యకూడదు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను తీసుకోవాలి. ఇతను
చేస్తున్నారా, ఈమె చేస్తున్నారా అని ఇతరులను చూడకూడదు, మనము
సాక్షీగా అయ్యి ఆటను చూసేవారము, కేవలం సంతుష్టంగా ఉండే ఆటనే
చూస్తారా ఏమిటి, అసంతుష్టంగా ఉండేది కూడా మధ్యమధ్యలో చూడాలి కదా.
కానీ ప్రతి ఒక్కరూ తమను తాము సంతుష్టంగా ఉంచుకోవాలి.
మాతలూ, పాండవులూ, ఇది వీలవుతుందా? బాప్ దాదా చిత్రాన్ని
చూస్తారు. బాప్ దాదా వద్ద చాలా పెద్ద టి.వి. ఉంది, చాలా పెద్దది.
ఏ సమయంలో ఎవరు ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరినీ చూడగలరు,
బాప్ దాదా చూస్తారు కానీ చెప్పరు, మీకు వినిపించరు. అయితే
తప్పులు ఎన్నో చూస్తారు. రహస్యంగా ఏం చేస్తున్నారు అన్నది కూడా
చూస్తారు. పిల్లల్లో చతురత కూడా ఎంతో ఉంది కదా! ఎంతో
తెలివైనవారు. ఒకవేళ బాప్ దాదా పిల్లలు చేసే ఆ చతురతతో కూడిన
పనులు గురించి వినిపిస్తే, అది వినగానే మీరు కొద్దిగా ఆలోచనలో
పడతారు, అందుకే బాప్ దాదా వినిపించరు. మిమ్మల్ని ఆలోచనలో
పెట్టడం ఎందుకు. కానీ చాలా తెలివిగా చేస్తున్నారు. ఒకవేళ
అందరికంటే తెలివైనవారిని చూడాలన్నా కూడా బ్రాహ్మణులలో చూడండి.
కానీ ఇప్పుడు దేనిలో తెలివైనవారిగా అవుతారు? మనసా సేవలో. ఇందులో
ముందు నంబర్ తీసుకోండి, వెనుక ఉండకండి. దీనిలో ఏ కారణాలూ ఉండవు.
సమయం లభించటం లేదు, అవకాశం లభించటం లేదు, ఆరోగ్యం మంచిగా లేదు,
నన్ను అడగలేదు, ఇవేవీ ఇందులో ఉండవు. అందరూ చెయ్యగలరు. పిల్లలు
పరుగుపందెం ఆటను ఆడారు కదా, ఇప్పుడు ఇందులో పరుగు పెట్టండి.
మనసా సేవలో పరుగు పెట్టండి. అచ్ఛా!
కర్నాటక వారి టర్న్:- కర్నాటక వారు ఎవరైతే సేవకు వచ్చారో,
వారు లేచి నిలబడండి. ఇంతమంది సేవకు వచ్చారు. మంచిది. ఇది కూడా
సహజంగా శ్రేష్ఠ పుణ్యాన్ని జమ చేసుకునేందుకు గోల్డెన్ ఛాన్స్
లభిస్తుంది. భక్తిలో ఏం చెప్తూ ఉంటారంటే - ఒక్క బ్రాహ్మణుడి
సేవ చేసినా కానీ చాలా పుణ్యము లభిస్తుంది అని. మరి ఇక్కడ
ఎంతమంది సత్యమైన బ్రాహ్మణుల యొక్క సేవ చేస్తారు. కనుక ఇక్కడ
మంచి అవకాశము లభిస్తుంది కదా! మంచిగా అనిపించిందా లేక అలసట
అనిపించిందా? అలసిపోలేదు కదా! ఆనందం అనిపించింది కదా! ఒకవేళ
సత్యమైన హృదయముతో పుణ్యముగా భావించి సేవ చేసినట్లయితే దానికి
ప్రత్యక్ష ఫలము ఉంటుంది, వారికి అలసట కలగదు, సంతోషము కలుగుతుంది.
ఈ ప్రత్యక్షఫలము పుణ్యము యొక్క జమగా అనుభవమవుతుంది. ఒకవేళ
కొద్దిగానైనా ఏ కారణంగానైనా అలసట కలిగినట్లయితే లేక కాస్త
అలసటను అనుభూతి చేసినా, సత్యమైన హృదయముతో సేవ చెయ్యలేదు అని
భావించండి. సేవ అనగా ప్రత్యక్షఫలము, మేవ (ఫలము). మీరు సేవ
చెయ్యటం లేదు, ఫలాన్ని తింటున్నారు. కర్నాటక సేవాధారులందరూ చాలా
మంచిగా తమ సేవా పాత్రను పోషించారు మరియు సేవా ఫలాన్ని తిన్నారు.
అచ్ఛా, టీచర్లందరూ బాగున్నారా. టీచర్లకైతే ఎన్ని సార్లు
సీజన్ లో టర్న్ లభిస్తుంది. ఇలా టర్న్ లభించటము కూడా భాగ్యానికి
గుర్తు. ఇప్పుడు టీచర్లు మనసా సేవలో రేస్ చెయ్యాలి. కానీ అలాగని
మొత్తం రోజంతా అలా కూర్చుండిపోయి, నేను మనసా సేవ చేస్తున్నాను
అన్నట్లు చెయ్యకండి. ఎవరైనా కోర్స్ కోసం వస్తే, లేదు, నేను మనసా
సేవ చేస్తున్నాను అని చెప్పకండి. కర్మయోగము చేయవలసిన సమయము
వస్తే నేను మనసా సేవ చేస్తున్నాను అని చెప్పటం కాదు, అలా కాదు.
బ్యాలెన్స్ ఉండాలి. కొంతమందికి ఎక్కువ నషా ఎక్కుతుంది కదా!
అటువంటి నషాను ఎక్కనివ్వకండి. బ్యాలెన్స్ ద్వారా బ్లెస్సింగ్స్
(ఆశీర్వాదాలు) ఉంటాయి. బ్యాలెన్స్ లేకపోతే బ్లెస్సింగ్స్ (ఆశీర్వాదాలు)
కూడా ఉండవు. అచ్ఛా.
ఇప్పుడు అందరూ ఒక్క క్షణములో మనసా సేవను అనుభవము చెయ్యండి.
ఆత్మలకు శాంతి మరియు శక్తుల అంచలిని ఇవ్వండి. అచ్ఛా.
నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ ఆత్మికతను అనుభవము చేయించే
ఆత్మిక ఆత్మలకు, అన్ని సంకల్పాలు మరియు స్వప్నాలలో కూడా
పవిత్రత యొక్క పాఠాన్ని చదువుకునే బ్రహ్మాచారీ పిల్లలకు, సర్వ
దృఢ సంకల్పధారి, మనసా సేవాధారి తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా
ఆశీర్వాదాలను ఇచ్చే మరియు తీసుకునే పుణ్యాత్ములకు బాప్ దాదా
యొక్క, మనోభిరాముడి యొక్క మనస్ఫూర్వకమైన, ప్రాణప్రదమైన, ప్రేమతో
కూడిన ప్రియస్మృతులు మరియు నమస్తే.