08-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు స్వర్గానికి పాస్ పోర్ట్
తీసుకునేందుకు ఈ పాఠశాలకు వచ్చారు, ఆత్మాభిమానులుగా అవ్వండి మరియు మీ పేరును
రిజిస్టరులో నోట్ చేయించండి, అప్పుడు స్వర్గములోకి వచ్చేస్తారు’’
ప్రశ్న:-
ఏ
స్మృతి లేని కారణముగా పిల్లలు తండ్రి పట్ల గౌరవాన్ని ఉంచరు?
జవాబు:-
ఎవరినైతే
మొత్తం ప్రపంచమంతా పిలుస్తూ ఉందో, స్మృతి చేస్తూ ఉందో, ఆ ఉన్నతోన్నతమైన తండ్రి
పిల్లలైన మన సేవలో ఉపస్థితులై ఉన్నారని కొంతమంది పిల్లలకు గుర్తుండదు. ఈ నిశ్చయము
నంబరువారుగా ఉంది, ఎవరికి ఎంత నిశ్చయము ఉంటుందో, వారు అంతటి గౌరవాన్ని ఉంచుతారు.
పాట:-
ఎవరైతే
ప్రియమైనవారితో ఉన్నారో...
ఓంశాంతి
పిల్లలందరూ జ్ఞానసాగరునితో పాటు అయితే ఉన్నారు. ఇంతమంది పిల్లలు ఒకేచోట అయితే
ఉండలేరు. ఎవరైతే కలిసే ఉన్నారో, వారు సమీపముగా డైరెక్టుగా జ్ఞానాన్ని వింటారు మరియు
ఎవరైతే దూరముగా ఉన్నారో, వారికి ఆలస్యముగా లభిస్తుంది. అలాగని కలిసి ఉన్నవారు
ఎక్కువ ఉన్నతిని పొందుతారని మరియు దూరముగా ఉన్నవారు తక్కువ ఉన్నతిని పొందుతారని కాదు.
అలా కాదు. ప్రాక్టికల్ గా ఏం గమనించడం జరిగిందంటే - ఎవరైతే దూరముగా ఉన్నారో వారు
ఎక్కువగా చదువుకుంటారు మరియు ఉన్నతిని పొందుతారు. అనంతమైన తండ్రి ఇక్కడ ఉన్నారు
అన్నదైతే తప్పకుండా వాస్తవము. బ్రాహ్మణ పిల్లలలో కూడా నంబరువారుగా ఉన్నారు. పిల్లలు
దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. కొంతమంది పిల్లల ద్వారా పెద్ద-పెద్ద పొరపాట్లు
జరుగుతాయి. అనంతమైన తండ్రి ఎవరినైతే మొత్తం సృష్టి అంతా స్మృతి చేస్తుందో, వారు మన
సేవలో ఉపస్థితులై ఉన్నారని మరియు మనకు ఉన్నతోన్నతముగా తయారయ్యే మార్గాన్ని
తెలియజేస్తున్నారని కూడా తెలుసు. వారు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు, అయినా అంతటి
గౌరవాన్ని ఇవ్వరు. బంధనములో ఉన్నవారు ఎన్ని దెబ్బలు తింటారు, ఎంత తపిస్తారు, అయినా
స్మృతిలో ఉంటూ జ్ఞానాన్ని బాగా తీసుకుంటారు. వారికి పదవి కూడా ఉన్నతముగా అవుతుంది.
ఈ మాట బాబా అందరి గురించి చెప్పడం లేదు, నంబరువారు పురుషార్థము అనుసారముగానే ఉన్నారు.
తండ్రి పిల్లలను సావధానపరుస్తారు, అందరూ అయితే ఒకే విధముగా ఉండరు. బంధనాలలో ఉండేవారు
బయట ఉంటూ కూడా చాలా సంపాదన చేసుకుంటారు. ఈ పాట భక్తి మార్గములోని వారి ద్వారా
తయారుచేయబడింది. కానీ ఇది మీకు సరిపడే విధముగా ఉంది, ప్రియుడు ఎవరు, వారు ఎవరికి
ప్రియుడు అనేది వారికేమి తెలుసు. ఆత్మకు స్వయం గురించే తెలియకపోతే ఇక తండ్రిని ఎలా
తెలుసుకోగలదు. వాస్తవానికి అందరూ ఆత్మనే కదా. తాము ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అనేది
కూడా తెలియదు. అందరూ దేహాభిమానులుగా ఉన్నారు. ఆత్మాభిమానులుగా ఎవ్వరూ లేరు. ఒకవేళ
ఆత్మాభిమానులుగా అయినట్లయితే ఆత్మకు తన తండ్రి గురించి కూడా తెలిసి ఉండాలి.
దేహాభిమానులుగా ఉన్న కారణముగా ఆత్మ గురించి గాని, పరమపిత పరమాత్మ గురించి గాని
తెలియదు. ఇక్కడైతే పిల్లలైన మీకు తండ్రి కూర్చుని సమ్ముఖముగా అర్థం చేయిస్తారు. ఇది
అనంతమైన స్కూల్. ఇక్కడ ఒకటే లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది - స్వర్గ రాజ్యాధికారాన్ని
ప్రాప్తి చేసుకోవడము. స్వర్గములో కూడా చాలా పదవులు ఉన్నాయి. కొంతమంది రాజా-రాణులు,
కొంతమంది ప్రజలు ఉంటారు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని మళ్ళీ ద్వికిరీటధారులుగా
చేసేందుకు వచ్చాను. అందరూ అయితే ద్వికిరీటధారులుగా అవ్వలేరు. ఎవరైతే బాగా
చదువుకుంటారో, వారు - మేము ఈ విధముగా అవ్వగలము అని లోలోపల భావిస్తారు. వారు సరెండర్
కూడా అవుతారు, నిశ్చయము కూడా ఉంటుంది. వీరి ద్వారా ఎటువంటి ఛీ-ఛీ పనులు జరగవని అందరూ
అర్థం చేసుకుంటారు. కొందరిలో చాలా అవగుణాలు ఉంటాయి. మేము ఎంతో ఉన్నతమైన పదవిని
పొందుతామని వారు అనుకోరు, అందుకే ఇక పురుషార్థమే చేయరు. నేను ఈ విధముగా అవ్వగలనా అని
బాబాను అడిగితే, బాబా వెంటనే చెప్తారు. స్వయాన్ని చూసుకున్నట్లయితే, నేను తప్పకుండా
ఉన్నత పదవిని పొందలేనని వెంటనే అర్థం చేసుకుంటారు. లక్షణాలు కూడా కావాలి కదా. సత్య,
త్రేతాయుగాలలోనైతే ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడ ప్రారబ్ధము ఉంటుంది. ఆ తర్వాత వచ్చే
రాజులు ఎవరైతే ఉంటారో, వారు కూడా ప్రజలను చాలా ప్రేమిస్తారు. వీరు మీ తల్లి-తండ్రి.
ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వీరు అనంతమైన తండ్రి, వీరు మొత్తం
ప్రపంచాన్ని రిజిస్టరు చేసేవారు. మీరు కూడా రిజిస్టరు చేస్తారు కదా. పాస్ పోర్ట్
ఇస్తున్నారు. స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు ఇక్కడి నుండి మీకు పాస్ పోర్ట్
లభిస్తుంది. బాబా చెప్పారు - వైకుంఠానికి యోగ్యులుగా ఉన్నవారందరి ఫోటోలు ఉండాలి
ఎందుకంటే మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. పక్కన కిరీటధారిగా,
సింహాసనాధికారిగా ఉన్న మీ ఫోటో ఉండాలి. మనము ఈ విధంగా తయారవుతున్నాము. ప్రదర్శినీలు
మొదలైనవాటిలో కూడా ఈ శ్యాంపుల్ పెట్టాలి - ఇదే రాజయోగము. ఎవరైనా బ్యారిస్టర్ గా
అయినట్లయితే, వారు ఒకవైపు సాధారణ డ్రస్ లో ఉండాలి, ఒకవైపు బ్యారిస్టర్ డ్రస్ లో
ఉండాలి. అలా మీరు ఒకవైపు సాధారణముగా, ఒకవైపు ద్వికిరీటధారులుగా ఉండాలి. మీ చిత్రము
ఒకటి ఉంది కదా - అందులో, మీరు ఎలా అవ్వాలని అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తారు. ఈ
బ్యారిస్టర్ మొదలైనవారిగా అవ్వాలా లేక రాజులకే రాజులుగా అవ్వాలా. ఇటువంటి చిత్రాలు
ఉండాలి. బ్యారిస్టర్, జడ్జ్ మొదలైనవారైతే ఇక్కడివారు. మీరు రాజులకే రాజులుగా కొత్త
ప్రపంచములో అవ్వనున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. మనమిలా తయారవుతున్నాము.
ఎంత బాగా అర్థం చేయించడం జరుగుతుంది. చిత్రాలు కూడా చాలా బాగా ఉండాలి, ఫుల్ సైజులో
ఉండాలి. వారు బ్యారిస్టరీ చదువుతారు కావున యోగము బ్యారిస్టర్ తో ఉంటుంది,
బ్యారిస్టర్లుగానే అవుతారు. వీరి యోగము పరమపిత పరమాత్మునితో ఉంది కావున
ద్వికిరీటధారులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలు ఆచరణలోకి
తీసుకురావాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రముపై అర్థం చేయించడం చాలా సహజముగా ఉంటుంది.
మనము ఈ విధముగా తయారవుతున్నాము కావున మన కొరకు తప్పకుండా కొత్త ప్రపంచము కావాలి.
నరకము తర్వాత స్వర్గము ఉంటుంది.
ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగము. ఈ చదువు ఎంత ఉన్నతముగా తయారుచేసేటటువంటిది,
ఇందులో ధనము మొదలైనవాటి అవసరము లేదు. చదువు పట్ల అభిరుచి ఉండాలి. ఒక వ్యక్తి చాలా
పేదవానిగా ఉండేవారు, అతని వద్ద చదువుకునేందుకు ధనము ఉండేది కాదు, వారు తర్వాత
చదువుకుంటూ-చదువుకుంటూ కష్టపడి ఎంత షావుకారుగా అయ్యారంటే, క్వీన్ విక్టోరియాకు
మినిస్టర్ గా అయ్యారు. మీరు కూడా ఇప్పుడు ఎంత పేదవారు. తండ్రి ఎంత ఉన్నతముగా
చదివిస్తున్నారు. ఇక్కడ కేవలం బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. దీపాలు
మొదలైనవి వెలిగించే అవసరము కూడా లేదు. ఎక్కడ కూర్చుని ఉన్నా స్మృతి చేయండి. కానీ
మాయ ఎటువంటిదంటే అది తండ్రి స్మృతిని మరిపింపజేస్తుంది. స్మృతిలోనే విఘ్నాలు
కలుగుతాయి. ఇదే యుద్ధము కదా. ఆత్మ తండ్రిని స్మృతి చేయడం ద్వారానే పవిత్రముగా
అవుతుంది. చదువులో మాయ ఏమీ చేయదు. చదువు కన్నా స్మృతి యొక్క నషా ఉన్నతమైనది, అందుకే
ప్రాచీన యోగము అని అంటూ ఉంటారు. యోగము మరియు జ్ఞానము అని అంటారు. యోగము కొరకు
ఇలా-ఇలా స్మృతి చేయండి అని జ్ఞానము లభిస్తుంది. ఇంకా సృష్టిచక్ర జ్ఞానము కూడా ఉంది.
రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి ఇంకెవ్వరికీ తెలియదు. భారత్ యొక్క ప్రాచీన
యోగాన్ని నేర్పిస్తారు. ప్రాచీనము అని కొత్త ప్రపంచాన్ని అంటారు. దానికి వారు లక్షల
సంవత్సరాలు చూపించారు. కల్పము ఆయుష్షు గురించి కూడా అనేక రకాలుగా చెప్తుంటారు.
కొందరు ఒకలా చెప్తారు, మరికొందరు మరోలా చెప్తారు. ఇక్కడ మిమ్మల్ని ఒక్క తండ్రియే
చదివిస్తున్నారు. మీరు విదేశాలకు వెళ్ళినా, మీకు చిత్రాలు లభిస్తాయి. వీరు వ్యాపారి
కదా. బాబా అంటారు, బట్టపై కూడా ముద్రించవచ్చు. ఒకవేళ ఎవరి వద్దనైనా పెద్ద స్క్రీన్
ప్రెస్ లేకపోతే వారు సగం-సగం చేస్తారు, ఆ తర్వాత ఏ విధముగా కలుపుతారంటే అది
జోడించినట్లుగా తెలియను కూడా తెలియదు. అనంతమైన తండ్రి అనే పెద్ద గవర్నమెంట్
చెప్తున్నారు, ఎవరైనా ముద్రించి చూపిస్తే నేను వారి పేరును ప్రసిద్ధము చేస్తాను.
ఎవరైనా ఈ చిత్రాలను బట్టపై ముద్రించి విదేశాలకు తీసుకువెళ్తే మీకు ఒక్కొక్క
చిత్రానికి 5-10 వేలు కూడా ఇస్తారు. ధనమైతే అక్కడ చాలా ఉంది. అటువంటి చిత్రాలను
తయారుచేయవచ్చు, అంత పెద్ద-పెద్ద ప్రెస్ లు ఉన్నాయి. పట్టణాల యొక్క సీన్ సీనరీలను ఎలా
ముద్రిస్తారంటే, ఇక అడగకండి. అలాగే వీటిని కూడా ముద్రించవచ్చు. ఇవి చాలా ఫస్టు
క్లాస్ వస్తువులు - సత్యమైన జ్ఞానము అయితే వీటిలోనే ఉంది, ఇంకెవ్వరి వద్ద లేదు, ఈ
విషయాలు ఎవ్వరికీ తెలియవు అని అంటారు. ఇంగ్లీషులో అర్థం చేయించగలిగే తెలివైనవారు
కూడా ఉండాలి. ఇంగ్లీషు అయితే అందరికీ వస్తుంది. వారికి కూడా సందేశమైతే ఇవ్వాలి కదా.
వారే డ్రామానుసారముగా వినాశనము కొరకు నిమిత్తముగా అయ్యారు. బాబా చెప్పారు, వారి
వద్ద బాంబులు మొదలైనవి ఎటువంటివి ఉన్నాయంటే, ఒకవేళ వారిద్దరూ పరస్పరములో కలిసిపోతే
మొత్తం విశ్వానికి యజమానులుగా అవ్వగలరు. కానీ ఈ డ్రామా ఏ విధముగా రచింపబడి ఉందంటే
మీరు యోగబలము ద్వారానే విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటారు. ఆయుధాలు మొదలైనవాటితో
విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. అది సైన్సు, మీది సైలెన్స్. కేవలం తండ్రిని మరియు
చక్రాన్ని స్మృతి చేయండి, మీ సమానముగా తయారుచేయండి.
పిల్లలైన మీరు యోగబలముతో విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటున్నారు. వారు తప్పకుండా
పరస్పరములో కొట్లాడుకుంటారు కూడా, వెన్న మధ్యలో మీకు లభించనున్నది. శ్రీకృష్ణుని
నోటిలో వెన్న ముద్దను చూపిస్తారు. ఇద్దరు పరస్పరము కొట్లాడుకుంటారు, మధ్యలో మూడవవారు
వెన్న తినేసారు అన్నట్లుగా చెప్పకుంటూ ఉంటారు కూడా. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది.
మొత్తం విశ్వము యొక్క రాజ్యమనే వెన్న మీకు లభిస్తుంది కావున మీకు ఎంత సంతోషముండాలి.
వాహ్ బాబా, మీది అద్భుతము. జ్ఞానమైతే మీదే. చాలా బాగా అర్థం చేయించారు. ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మమువారు విశ్వ రాజ్యాన్ని ఎలా ప్రాప్తి చేసుకున్నారు అనేది ఎవ్వరికీ
కూడా ఆలోచనలో రాదు. ఆ సమయములో వేరే ఏ ఖండము ఉండదు. తండ్రి అంటారు, నేను విశ్వానికి
యజమానిగా అవ్వను, మిమ్మల్ని తయారుచేస్తాను. మీరు చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా
అవుతారు. పరమాత్మనైన నేను అశరీరిని. మీ అందరికీ శరీరాలు ఉన్నాయి. మీరు దేహధారులు.
బ్రహ్మా-విష్ణు-శంకరులకు కూడా సూక్ష్మ శరీరాలు ఉన్నాయి. ఏ విధముగా మీరు ఆత్మలో, అదే
విధముగా నేను కూడా పరమ ఆత్మను. నా జన్మ దివ్యమైనది మరియు అలౌకికమైనది, ఇంకెవ్వరూ
ఇటువంటి జన్మ తీసుకోరు. ఇది నిశ్చితము. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎవరైనా
ఇప్పుడు చనిపోతే, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. డ్రామా గురించి ఎంత వివరణ
లభిస్తుంది. నంబరువారుగా అర్థం చేసుకుంటారు. కొందరు మందబుద్ధి కలవారిగా ఉంటారు. మూడు
శ్రేణులు ఉంటాయి. చివరి శ్రేణి వారిని మందబుద్ధి కలవారు అని అంటారు. ఫలానావారు మొదటి
శ్రేణిలో ఉన్నారు, ఫలానావారు రెండవ శ్రేణిలో ఉన్నారని స్వయం కూడా అర్థం చేసుకుంటారు.
ప్రజలలో కూడా ఇలాగే ఉంటారు. చదువైతే ఒక్కటే. ఇది చదువుకుని మేమే డబల్ కిరీటధారులుగా
అవుతామని పిల్లలకు తెలుసు. మనము ద్వికిరీటధారులుగా ఉండేవారము, ఆ తర్వాత ఏక
కిరీటధారులుగా, ఆ తర్వాత ఏ కిరీటము లేనివారిగా అయ్యాము. ఎటువంటి కర్మనో, అటువంటి
ఫలము అని అంటారు. సత్యయుగములో ఇలా అనరు. ఇక్కడ మంచి కర్మలు చేసినట్లయితే, ఒక్క జన్మ
కోసం మంచి ఫలము లభిస్తుంది. కొందరు ఎలాంటి కర్మలు చేస్తారంటే, వారు పుట్టుకతోనే
రోగగ్రస్థులుగా ఉంటారు. ఇది కూడా కర్మభోగమే కదా. పిల్లలకు కర్మ, అకర్మ, వికర్మల
గురించి కూడా అర్థం చేయించారు. ఇక్కడ ఎటువంటి కర్మలు చేస్తారో, దాని బట్టి మంచి లేక
చెడు ఫలాన్ని పొందుతారు. ఎవరైనా షావుకార్లుగా అయ్యారంటే, వారు తప్పకుండా మంచి కర్మలు
చేసి ఉంటారు. ఇప్పుడు మీరు జన్మ-జన్మాంతరాల ప్రారబ్ధాన్ని తయారుచేసుకుంటారు. ఇప్పటి
పురుషార్థానుసారముగా అక్కడ పేదవారు, షావుకార్ల మధ్యన వ్యత్యాసముంటుంది కదా. అది 21
జన్మల కొరకు అవినాశీ ప్రారబ్ధము. ఇక్కడ అల్పకాలికమైన ప్రారబ్ధము లభిస్తుంది.
కర్మలైతే జరుగుతాయి కదా. ఇది కర్మక్షేత్రము. సత్యయుగము స్వర్గపు కర్మక్షేత్రము.
అక్కడ వికర్మలే జరగవు. ఈ విషయాలన్నింటినీ బుద్ధిలో ధారణ చేయాలి. సదా పాయింట్లు
వ్రాస్తూ ఉండేవారు ఎవరో అరుదుగా ఉంటారు. చార్టు కూడా వ్రాస్తూ-వ్రాస్తూ ఇక
అలసిపోతారు. పిల్లలైన మీరు పాయింట్లు వ్రాయాలి. చాలా సూక్ష్మాతి-సూక్ష్మమైన
పాయింట్లు ఉన్నాయి. వాటినన్నింటినీ మీరు ఎప్పటికీ జ్ఞాపకముంచుకోలేరు, అవి
జారిపోతుంటాయి. ఈ పాయింటును నేను మర్చిపోయానే అని తర్వాత పశ్చాత్తాపపడతారు. అందరి
పరిస్థితి ఇలాగే ఉంటుంది. చాలామంది మర్చిపోతారు, మళ్ళీ మరుసటి రోజు గుర్తుకొస్తాయి.
పిల్లలు తమ ఉన్నతి కొరకు ఆలోచించాలి. ఎవరో అరుదుగా యథార్థ రీతిగా వ్రాస్తూ ఉంటారని
బాబాకు తెలుసు. బాబా వ్యాపారి కూడా కదా. వారు వినాశీ రత్నాల వ్యాపారి, వీరు జ్ఞాన
రత్నాల వ్యాపారి. యోగములోనే చాలా మంది పిల్లలు ఫెయిల్ అవుతారు. ఏక్యురేట్ స్మృతిలో
ఎంతో కష్టముగా గంట గంటన్నర ఉండగలుగుతారు. 8 గంటలైతే పురుషార్థము చేయాలి. పిల్లలైన
మీరు శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి. బాబా ప్రేయసీ-ప్రియుని ఉదాహరణను కూడా ఇచ్చారు.
కూర్చుని-కూర్చునే గుర్తు చేసుకుంటారు మరియు వెంటనే ఎదురుగా వచ్చేస్తారు. ఇది కూడా
ఒక రకమైన సాక్షాత్కారమే. వారు వీరిని గుర్తు చేసుకుంటారు, వీరు వారిని గుర్తు
చేసుకుంటారు. ఇక్కడైతే ప్రియుడు ఒక్కరే, మీరంతా ప్రేయసులు. ఆ సుందరమైన ప్రియుడు
అయితే సదా తెల్లగా ఉంటారు, సదా పవిత్రముగా ఉంటారు. తండ్రి అంటారు, యాత్రికుడినైన
నేను సదా సుందరముగా ఉంటాను, మిమ్మల్ని కూడా సుందరముగా చేస్తాను. ఈ దేవతలది సహజ
సౌందర్యము. ఇక్కడ ఎలాంటి ఫ్యాషన్లు చేస్తుంటారు. రకరకాల డ్రస్ లు ధరిస్తూ ఉంటారు.
అక్కడైతే ఏకరసమైన సహజ సౌందర్యముంటుంది. అటువంటి ప్రపంచములోకి ఇప్పుడు మీరు
వెళ్ళబోతున్నారు. తండ్రి అంటారు, నేను పాత పతిత దేశము, పతిత శరీరములోకి వస్తాను.
ఇక్కడ పావన శరీరము లేదు. తండ్రి అంటారు, నేను వీరి అనేక జన్మల అంతిమములో ప్రవేశించి
ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తాను. మున్ముందు మీరు సర్వీసబుల్ గా అవుతూ ఉంటారు.
పురుషార్థము చేస్తారు, ఆ తర్వాత అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు కూడా ఇటువంటి
పురుషార్థాన్ని చేసారు, ఇప్పుడూ చేస్తున్నారు. పురుషార్థము చేయకుండానైతే ఏమీ లభించదు.
మనము నరుని నుండి నారాయణునిగా అయ్యే పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. కొత్త
ప్రపంచపు రాజధాని ఉండేది, ఇప్పుడు అది లేదు, మళ్ళీ ఉంటుంది. ఇనుప యుగము తర్వాత మళ్ళీ
బంగారు యుగము తప్పకుండా ఉంటుంది. కల్పక్రితము వలె రాజధాని స్థాపన జరగవలసిందే. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సరెండర్ అవ్వడముతో పాటు నిశ్చయబుద్ధి కలవారిగా అవ్వాలి. ఎటువంటి ఛీ-ఛీ పనులు
జరగకూడదు. లోపల ఎటువంటి అవగుణాలు ఉండకూడదు, అప్పుడు మంచి పదవి లభించగలదు.
2. జ్ఞాన రత్నాల వ్యాపారము చేసేందుకు బాబా ఏవైతే మంచి-మంచి పాయింట్లు
వినిపిస్తారో, వాటిని నోట్ చేసుకోవాలి. తర్వాత వాటిని గుర్తు చేసుకుని ఇతరులకు
వినిపించాలి. సదా తమ ఉన్నతి కొరకు ఆలోచించాలి.
వరదానము:-
బాలక స్థితి మరియు యజమాని స్థితి యొక్క సమానత ద్వారా సర్వ
ఖజానాలలో సంపన్న భవ
ఏ విధముగా బాలక స్థితి యొక్క నషా అందరిలోనూ ఉందో, అదే
విధముగా బాలక్ సో మాలిక్ అనగా బాబా సమానమైన సంపన్న స్థితిని అనుభవము చేయండి. యజమాని
స్థితి యొక్క విశేషత ఏమిటంటే - ఎంతగా యజమానులుగా ఉంటారో, అంతగానే విశ్వ సేవాధారి
యొక్క సంస్కారాలు సదా ఇమర్జ్ రూపములో ఉండాలి. యజమాని స్థితి యొక్క నషా మరియు విశ్వ
సేవాధారి యొక్క నషా సమాన రూపములో ఉండాలి, అప్పుడు బాబా సమానమైనవారు అని అంటారు.
బాలకులు మరియు యజమానులు, రెండు స్వరూపాలు సదా ప్రత్యక్ష కర్మలలోకి రావాలి, అప్పుడు
బాబా సమానముగా సర్వ ఖజానాలతో సంపన్న స్థితిని అనుభవము చేయగలరు.
స్లోగన్:-
జ్ఞానము
యొక్క తరగని ఖజానాలకు అధికారులుగా అవ్వండి, అప్పుడు ఆధీనత సమాప్తమైపోతుంది.
అవ్యక్త సూచనలు -
స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి
వాచా సేవ ఎలాగైతే
నేచురల్అయిపోయిందో, అలా మనసా సేవ కూడా తోడుతోడుగా మరియు నేచురల్అయిపోవాలి. వాణి
సేవతోపాటు మనసా సేవ కూడా చేస్తూ ఉన్నట్లయితే మీకు ఎక్కువ మట్లాడవలసిన అవసరముండదు.
మాట్లాడటములో ఏ శక్తినైతే పెడతారో, అది మనసా సేవ యొక్క సహయోగము కారణముగా వాణి యొక్క
శక్తి జమ అవుతుంది మరియు మనసు ద్వారా చేసే శక్తిశాలి సేవ సఫలతను ఎక్కువగా అనుభవము
చేయిస్తుంది.
| | |