08-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈ రాజయోగము యొక్క చదువును
రాజ్యము కొరకు చదువుకుంటారు, ఇది మీ కొత్త చదువు’’
ప్రశ్న:-
ఈ
చదువులో కొంతమంది పిల్లలు నడుస్తూ-నడుస్తూ ఉండగా ఫెయిల్ ఎందుకు అవుతారు?
జవాబు:-
ఎందుకంటే ఈ
చదువులో మాయతో బాక్సింగ్ ఉంది. మాయాతో జరిగే బాక్సింగ్ లో బుద్ధికి చాలా గట్టి
దెబ్బ తగులుతుంది. దెబ్బ తగలడానికి కారణము తండ్రితో సత్యముగా లేకపోవడము. సత్యమైన
పిల్లలు సదా సురక్షితముగా ఉంటారు.
ఓంశాంతి
ఆత్మలైన మనకు పరమాత్మ అయిన తండ్రి చదివిస్తారు అన్న నిశ్చయమైతే పిల్లలందరికీ ఉంటుంది.
5000 సంవత్సరాల తర్వాత ఒకేసారి అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన పిల్లలను చదివిస్తారు.
ఎవరైనా కొత్త వ్యక్తి ఈ విషయాలను వింటే అర్థం చేసుకోలేరు. ఆత్మిక తండ్రి మరియు
ఆత్మిక పిల్లలు అంటే ఏమిటి అన్నది కూడా అర్థం చేసుకోలేరు. మనమందరమూ సోదరులమని
పిల్లలైన మీకు తెలుసు. వారు మన తండ్రి కూడా, టీచర్ కూడా మరియు సుప్రీమ్ గురువు కూడా.
పిల్లలైన మీకు ఇది తప్పకుండా ఆటోమేటిక్ గా గుర్తుంటుంది, ఇక్కడ కూర్చుని -
ఆత్మలందరికీ ఆత్మిక తండ్రి ఒక్కరే అని మీరు భావిస్తూ ఉండవచ్చు. ఏ ధర్మానికి
చెందినవారైనా ఆత్మలందరూ వారినే తలచుకుంటారు. మనుష్యమాత్రులందరూ తప్పకుండా వారిని
తలచుకుంటారు. తండ్రి అర్థం చేయించారు, ఆత్మ అయితే అందరిలోనూ ఉంది కదా. ఇప్పుడు
తండ్రి అంటారు, దేహపు సర్వ ధర్మాలనూ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు
ఆత్మ అయిన మీరు ఇక్కడ పాత్రను అభినయిస్తున్నారు. ఏ విధంగా పాత్రను అభినయిస్తారు
అన్నది కూడా అర్థం చేయించబడింది. పిల్లలు కూడా నంబరువారు పురుషార్థానుసారముగానే
అర్థం చేసుకుంటారు. మీరు రాజయోగులు కదా. చదువుకునేవారందరూ యోగీగానే ఉంటారు. చదివించే
టీచరుతో యోగాన్ని తప్పకుండా ఉంచవలసి ఉంటుంది. ఈ చదువుతో మేము ఫలానాగా అవుతాము అని
లక్ష్యము-ఉద్దేశ్యము గురించి కూడా తెలిసి ఉంటుంది. ఈ చదువు అయితే ఒక్కటే, దీనిని
రాజులకే రాజులుగా తయారుచేసే చదువు అని అంటారు. ఇది రాజయోగము కదా. ఇది రాజ్యాన్ని
ప్రాప్తి చేసుకునేందుకు తండ్రితో జోడించే యోగము. ఇంకే మానవులూ ఈ రాజయోగాన్ని ఎప్పుడూ
నేర్పించలేరు. మీకు మానవమాత్రులు ఎవ్వరూ నేర్పించరు. పరమాత్మయే ఆత్మలైన మీకు
నేర్పిస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు నేర్పిస్తారు. మీరు కూడా స్వయాన్ని ఆత్మగా
భావించండి. ఆత్మలైన మనకు తండ్రి నేర్పిస్తున్నారు. ఇది గుర్తుండకపోతే అందులో పదును
నిండదు, అందుకే అనేకుల బుద్ధిలో ఇది కూర్చోదు. కావున తండ్రి ఎప్పుడూ అర్థం
చేయిస్తారు, యోగయుక్తులుగా అయి స్మృతియాత్రలో ఉంటూ అర్థం చేయించండి. మనం సోదరులకు
నేర్పిస్తాము. మీరు కూడా ఒక ఆత్మయే. వారు అందరికీ తండ్రి, టీచర్, గురువు. ఆత్మనే
చూడాలి. క్షణములో జీవన్ముక్తి అన్న గాయనము ఉంది కానీ ఇందులో శ్రమ ఎంతో ఉంది.
ఆత్మాభిమానిగా అవ్వకపోతే మీ మాటలలో అంత శక్తి ఉండదు ఎందుకంటే తండ్రి ఏ విధంగా అర్థం
చేయిస్తారో, ఆ విధంగా ఎవరూ అర్థం చేయించరు. కొందరైతే చాలా బాగా అర్థం చేయిస్తారు.
ముల్లు ఎవరు మరియు పుష్పము ఎవరు అనేది అంతా తెలుస్తుంది. స్కూల్లో పిల్లలు 5-6
తరగతులు చదువుకుని ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు. మంచి, మంచి పిల్లలు ఎప్పుడైతే
ట్రాన్స్ఫర్ అవుతారో అప్పుడు వేరే క్లాస్ లోని టీచరుకు కూడా వెంటనే అది తెలుస్తుంది
- ఈ విద్యార్థి తీవ్ర పురుషార్థి, ఇతను బాగా చదివాడు, అందుకే ఉన్నత శ్రేణిలోకి
వచ్చాడు అని. టీచరుకైతే తప్పకుండా అర్థమవుతుంది కదా. అది లౌకిక చదువు, ఇక్కడ ఆ
విషయమేదీ లేదు, ఇది పారలౌకిక చదువు, ఇక్కడ అలా అనరు. వీరు మొదట చాలా బాగా చదువుకుని
వచ్చారు కావుననే బాగా చదువుతున్నారు అని కాదు. ఆ చదువులో అయితే ట్రాన్స్ఫర్
అయినప్పుడు, ఇతను చదువులో బాగా కష్టపడ్డాడు కావుననే ముందు నంబరు తీసుకున్నాడు అని
టీచర్ భావిస్తారు. కానీ ఇక్కడైతే ఇది కొత్త చదువు, కావున దీనిని ఇంతకుముందు ఎవరూ
చదువుకోలేదు. ఇది కొత్త చదువు, చదివించేవారూ కొత్తవారే. అంతా కొత్తే. కొత్తవారిని
చదివిస్తారు. అందులో ఎవరైతే బాగా చదువుతారో వారిని మంచి పురుషార్థీ అని అనడం
జరుగుతుంది. ఇది కొత్త ప్రపంచము కొరకు కొత్త జ్ఞానము, దీనిని చదివించేవారు ఇంకెవ్వరూ
లేరు. ఎవరెవరు ఎంతెంత అటెన్షన్ పెడతారో, అంతగా ఉన్నతమైన నంబరులోకి వెళ్తారు.
కొందరైతే చాలా మధురముగా, ఆజ్ఞాకారులుగా ఉంటారు. వారిని చూడడంతోనే - చదివించే వీరు
చాలా బాగున్నారు, వీరిలో ఏ అవగుణమూ లేదు అన్నది తెలిసిపోతుంది. వారి నడవడిక ద్వారా,
మాటల ద్వారా అది తెలిసిపోతుంది. తండ్రి అందరినీ అడుగుతారు - వీరు ఎలా చదివిస్తారు,
వీరిలో ఎటువంటి లోపమూ లేదు కదా. మమ్మల్ని అడగకుండా సమాచారాన్ని ఎప్పుడూ ఇవ్వకండి అని
అనేవారు కూడా ఎందరో ఉంటారు. కొందరు బాగా చదివిస్తారు, కొందరి చురుకైన బుద్ధి
కలవారిగా ఉండరు. మాయ దాడి ఎంతగానో జరుగుతుంది. మాయ వీరిని ఎంతో మోసగిస్తోంది అని
తండ్రికి తెలుసు. 10 సంవత్సరాలు చదివించినా కానీ మాయ ఎంత శక్తివంతమైనదంటే దేహ
అహంకారం రావడంతోనే అందులో చిక్కుకుపోతారు. తండ్రి అర్థం చేయిస్తారు -
శక్తివంతమైనవారు ఎవరైతే ఉంటారో వారిపై మాయ దెబ్బ తగులుతుంది, మాయ కూడా శక్తివంతులతో
శక్తివంతంగా అయి పోరాడుతుంది.
బాబా ఎవరిలోకి అయితే ప్రవేశించారో వారు నంబరు వన్ అని మీరు అర్థం చేసుకుంటూ ఉండవచ్చు,
ఆ తర్వాత నంబరువారుగా అయితే ఎందరో ఉన్నారు కదా. బాబా ఉదాహరణగా ఒకరిద్దరి గురించి
చెప్తారు. కానీ నంబరువారుగా అయితే ఎందరో ఉంటారు. ఉదాహరణకు ఢిల్లీలో గీతా బచ్చీ చాలా
చురుకైనవారు, ఈ బచ్చీ చాలా మధురమైనవారు. బాబా ఎప్పుడూ ఆమెను - గీత అయితే సత్యమైన
గీత అని అంటూ ఉంటారు. మనుష్యులు ఆ గీతను చదువుతారు కానీ భగవంతుడు ఏ విధంగా
రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజులుగా తయారుచేశారు అన్నది అర్థం చేసుకోరు.
తప్పకుండా సత్యయుగము ఉన్నప్పుడు ఒకే ధర్మము ఉండేది, ఇది నిన్నటి విషయమే. తండ్రి
అంటారు, నిన్న మిమ్మల్ని నేను ఇంత షావుకార్లుగా తయారుచేసి వెళ్ళాను. మీరు పదమాపదమ
భాగ్యశాలులుగా ఉండేవారు, ఇప్పుడు మీరు ఎలా తయారైపోయారు. మీకు అది ఫీల్ అవుతుంది కదా.
ఆ గీతను వినిపించేవారి ద్వారా ఎవరికైనా అనుభూతి కలుగుతుందా? కొద్దిగా కూడా అర్థం
చేసుకోరు. ఉన్నతోన్నతమైనదిగా శ్రీమద్భగవద్గీతయే గాయనము చేయబడుతుంది. వారైతే గీతా
పుస్తకాన్ని కూర్చుని చదువుతారు లేక వినిపిస్తారు. తండ్రి అయితే పుస్తకాన్ని చదవరు,
తేడా అయితే ఉంది కదా. అసలు వారిది స్మృతియాత్ర కానే కాదు. వారైతే కిందకు పడుతూనే
ఉంటారు. సర్వవ్యాపి జ్ఞానముతో అందరూ ఎలా తయారైపోయారో చూడండి. కల్పకల్పమూ ఇదే విధంగా
జరుగుతుందని మీకు తెలుసు. తండ్రి అంటారు, మీకు నేర్పించి, మిమ్మల్ని విషయ సాగరము
నుండి ఆవలి తీరానికి చేరుస్తారు, ఎంత తేడా ఉంది. శాస్త్రాలను చదవడమైతే భక్తి
మార్గమైనట్లు కదా. తండ్రి అంటారు, వాటిని చదవడం ద్వారా నన్ను ఎవ్వరూ కలుసుకోలేరు.
వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎటువైపు నుండి వెళ్ళినా చేరుకోవడమైతే అందరూ ఒకే చోటుకు
చేరుకునేది ఉంది. ఒక్కోసారి ఏమంటారంటే, భగవంతుడు ఏదో ఒక రూపములో వచ్చి చదివిస్తారు
అని. మరి తండ్రే వచ్చి చదివించవలసి ఉన్నప్పుడు మీరు ఏమి చదివిస్తున్నారు. తండ్రి
అర్థం చేయిస్తున్నారు, గీతలో పిండిలో ఉప్పు ఉన్నంతగా ఏవో కొన్ని యథార్థమైన విషయాలు
ఉన్నాయి, వాటిని మీరు పట్టుకోవచ్చు. సత్యయుగములోనైతే ఎటువంటి శాస్త్రాలు మొదలైనవి
ఉండనే ఉండవు. ఇవి భక్తి మార్గపు శాస్త్రాలు. వీటిని ఇవి అనాది అయినవి, మొదటి నుండి
నడుస్తూ వస్తున్నాయి అని అనరు. అలా అనరు. అనాది అన్న పదము యొక్క అర్థాన్ని అర్థం
చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తారు, ఈ డ్రామా అయితే తప్పకుండా అనాది అయినదే. మీకు
తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మీకు నేర్పిస్తాను,
తర్వాత మాయమైపోతాను. మా రాజ్యము అనాది అయినది అని మీరు అంటారు. రాజ్యమైతే అదే, కేవలం
పావనుల నుండి మారి పతితులుగా అయిన కారణముగా పేరు మారిపోతుంది. దేవతలకు బదులుగా
హిందువులు అని పిలవబడతారు. వాస్తవానికి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారే
కదా. ఏ విధంగా ఇతరులు సతోప్రధానము నుండి సతో, రజో, తమోలలోకి వస్తారో, మీరు కూడా
అలాగే కిందకు దిగుతారు. రజోలోకి రావడంతో అపవిత్రత కారణముగా దేవతలకు బదులుగా
హిందువులుగా పిలువబడతారు. వాస్తవానికి హిందు అన్న పేరు హిందుస్థాన్ కు సంబంధించినది.
వాస్తవానికి మీరు దేవీ-దేవతలు కదా. దేవతలు సదా పావనముగా ఉంటారు. ఇప్పుడైతే మనుష్యులు
పతితులుగా అయిపోయారు. కావున పేరు కూడా హిందువులు అని పెట్టేసారు. హిందూ ధర్మమును
ఎప్పుడు మరియు ఎవరు రచించారు అని మీరు అడిగితే చెప్పలేకపోతారు. ఆది సనాతన దేవీ-దేవతా
ధర్మముండేది, దానికి ప్యారడైజ్ మొదలైన చాలా మంచి-మంచి పేర్లు పెడతారు. ఏదైతే
గతించిందో అది మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. ఈ సమయములో మీకు ప్రారంభము నుండి మొదలుకుని
చివరి వరకూ అంతా తెలుసు. తెలుసుకుంటూ ఉంటే జీవిస్తూ ఉంటారు. కొందరైతే మరణిస్తారు
కూడా. తండ్రికి చెందినవారిగా అయితే మాయ యుద్ధము జరుగుతుంది. యుద్ధము జరగడముతో
ద్రోహులుగా అవుతారు. రావణునికి చెందినవారిగా ఉండేవారు, రామునికి చెందినవారిగా
అయ్యారు. మళ్ళీ రావణుడు రాముని పిల్లలపై విజయాన్ని పొంది తనవైపుకు తీసుకువెళ్తాడు.
కొందరు రోగగ్రస్థులుగా అవుతారు, ఆ తర్వాత అక్కడకు చెందినవారిగానూ ఉండరు, ఇక్కడికి
చెందినవారిగానూ ఉండరు. సంతోషమూ ఉండదు, దుఃఖమూ ఉండదు, మధ్యలో పడి ఉంటారు. ఇలా మధ్యలో
ఉన్నవారు మీ వద్ద కూడా ఎందరో ఉన్నారు. వారు పూర్తిగా తండ్రికి చెందినవారిగానూ అవ్వరు,
అలాగే పూర్తిగా రావణునికి చెందినవారిగానూ అవ్వరు.
ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు
పురుషార్థము చేస్తున్నారు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి అడిగినప్పుడు
చేతులనైతే ఎంతోమంది పిల్లలు ఎత్తుతారు, కానీ బుద్ధి అంతగా లేదు అని భావించడం
జరుగుతుంది. బాబా అయితే శుభమే పలకండి అని అంటారు. మేము నరుని నుండి నారాయణునిగా
అవుతాము అని అయితే అందరూ అంటారు. ఈ కథయే నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ. అజ్ఞాన
కాలములో కూడా సత్యనారాయణుని కథను వింటారు కదా, అక్కడైతే ఎవ్వరూ అడగలేరు. ఈ
విషయాలనైతే తండ్రే అడుగుతారు. మీరేమి అనుకుంటున్నారు - అంతటి ధైర్యముందా? మీరు
పావనులుగా కూడా తప్పకుండా అవ్వాలి. ఎవరైనా వస్తే వారిని - ఈ జన్మలో మీరు ఎటువంటి
పాప కర్మలూ చేయలేదు కదా అని అడగడం జరుగుతుంది. జన్మ-జన్మాంతరాల పాపులుగా అయితే ఉండనే
ఉన్నారు. ఈ జన్మలోని పాపాలను వినిపించినట్లయితే తేలికైపోతారు లేదంటే మనస్సు లోలోపల
తింటూ ఉంటుంది. నిజం చెప్పినట్లయితే తేలికగా అవుతారు. కొందరు పిల్లలు నిజం
చెప్పకపోతే మాయ ఒక్కసారిగా గట్టిగా దెబ్బ వేసేస్తుంది. మీది చాలా కఠినమైన బాక్సింగ్.
ఆ బాక్సింగ్ లోనైతే శరీరానికి దెబ్బ తగులుతుంది, ఇందులో అయితే బుద్ధికి దెబ్బ
తగులుతుంది. ఈ విషయము బాబాకు కూడా తెలుసు. ఈ బ్రహ్మా అంటారు, నేను అనేక జన్మల
అంతిమములో ఉన్నాను. నేను అందరికన్నా పావనముగా ఉండేవాడిని, ఇప్పుడు అందరికన్నా
పతితముగా ఉన్నాను, మళ్ళీ పావనముగా అవుతాను. నేను మహాత్మను అని అయితే నేను అనను.
తండ్రి కూడా పాలన ఇస్తారు. ఇతను అందరికన్నా ఎక్కువ పతితుడు. తండ్రి అంటారు, నేను
పరాయి దేశములోకి, పరాయి శరీరములోకి వస్తాను. ఇతని అనేక జన్మల అంతిమములో నేను
ఇతనిలోకి ప్రవేశిస్తాను, ఇతనే పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు ఇతను కూడా
పావనముగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు, చాలా జాగ్రత్తగా కూడా ఉండవలసి ఉంటుంది.
తండ్రికైతే తెలుసు కదా. బాబా యొక్క ఈ పుత్రుడు చాలా సమీపముగా ఉన్నారు. ఇతను ఎప్పుడూ
తండ్రి నుండి వేరు కాలేరు. వదిలి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా రాదు. నాకు బాగా పక్కనే
కూర్చున్నారు. బాబా అయితే నా వారు కదా. నా ఇంట్లో కూర్చున్నారు. బాబాకు తెలుసు,
సరదాగా కూడా అంటూ ఉంటారు. బాబా, ఈ రోజు నాకు స్నానం చేయించండి, భోజనం తినిపించండి,
నేను చిన్న పిల్లవాడిని. ఇలా అనేక రకాలుగా బాబాను తలచుకుంటాను. ఇలా, ఇలా స్మృతి
చేయండి అని పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. బాబా, మీరైతే చాలా మధురమైనవారు, మీరు
మమ్మల్ని పూర్తిగా విశ్వానికే యజమానులుగా చేసేస్తారు. ఈ విషయము ఇంకెవ్వరి బుద్ధిలోనూ
ఉండదు. తండ్రి అందరినీ రిఫ్రెష్ చేస్తూ ఉంటారు. అందరూ పురుషార్థమైతే చేస్తారు, కానీ
నడవడిక కూడా అలా ఉండాలి కదా. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే వ్రాయాలి - బాబా, మా
ద్వారా ఈ పొరపాటు జరుగుతోంది అని. కొందరైతే ఇలా వ్రాస్తారు కూడా - బాబా, మా ద్వారా
ఈ పొరపాటు జరిగింది, క్షమించండి అని. నా బిడ్డగా అయి మళ్ళీ పొరపాటు చేసినట్లయితే అది
100 రెట్లు పెరిగిపోతుంది. మాయతో ఓడిపోతే ఇక ఇంతకుముందులాగే అయిపోతారు. ఎంతోమంది
ఓడిపోతారు. ఇది చాలా పెద్ద బాక్సింగ్. ఇది రామ, రావణుల యుద్ధము. వానర సైన్యాన్ని
తీసుకున్నారు అని కూడా చూపిస్తారు. ఇదంతా పిల్లలాటలా తయారుచేయబడి ఉంది. చిన్నపిల్లలు
అంత తెలివి కలవారిగా ఉండరు కదా. అలాగే, వీరి బుద్ధి చాలా తక్కువ బుద్ధి అని తండ్రి
కూడా అంటారు. ప్రతి ఒక్కరూ ఈశ్వరుని రూపమే అని అనేస్తారు. అలాగైతే ప్రతి ఒక్కరూ
ఈశ్వరునిగా అయి సృష్టిస్తారు, పాలన చేస్తారు, మళ్ళీ వినాశనం కూడా చేసేస్తారు.
వాస్తవానికి ఈశ్వరుడు అయితే ఎవరినీ వినాశనం చేయరు. ఇది ఎంతటి అజ్ఞానము. అందుకే
బొమ్మల పూజలు చేస్తూ ఉంటారు అని అనడం జరుగుతుంది. ఇది ఆశ్చర్యము. మనుష్యుల బుద్ధి
ఎలా అయిపోతుంది. ఎంత ఖర్చు చేస్తారు. తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు - నేను మిమ్మల్ని
ఇంత పెద్దగా తయారుచేసి వెళ్ళాను, మీరేమి చేశారు! మీకు కూడా తెలుసు - మేము దేవతలుగా
ఉండేవారము, మళ్ళీ చక్రములో చుట్టి వస్తాము, ఇప్పుడు మేము బ్రాహ్మణులుగా అయ్యాము,
మళ్ళీ మేమే దేవతలుగా అవుతాము... ఇది బుద్ధిలో కూర్చుని ఉంది కదా. ఇక్కడ
కూర్చున్నప్పుడు మీ బుద్ధిలో ఈ జ్ఞానము ఉండాలి. తండ్రి కూడా నాలెడ్జ్ ఫుల్ కదా. వారు
ఉండడం శాంతిధామములో ఉంటారు, అయినా కానీ వారిని నాలెడ్జ్ ఫుల్ అనే అంటారు. మీ ఆత్మలో
కూడా మొత్తం జ్ఞానమంతా ఉంటుంది కదా. ఈ జ్ఞానముతోనైతే మా కళ్ళు తెరుచుకున్నాయి అని
అంటారు. తండ్రి మీకు జ్ఞాన చక్షువును ఇస్తారు. ఆత్మకు సృష్టి ఆదిమధ్యాంతాల గురించి
తెలిసిపోయింది. చక్రము తిరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణులకే స్వదర్శన చక్రము లభిస్తుంది.
దేవతలను చదివించేవారు ఎవరూ ఉండరు. వారికి శిక్షణ యొక్క అవసరం లేదు. చదవాల్సింది మీరే,
తద్వారా మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు తండ్రి కూర్చుని ఈ కొత్త-కొత్త
విషయాలను అర్థం చేయిస్తారు. ఈ కొత్త చదువును చదువుకుని మీరు ఉన్నతమైనవారిగా అవుతారు.
ఫస్ట్ సో లాస్ట్, లాస్ట్ సో ఫస్ట్. ఇది చదువు కదా. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు,
తండ్రి ప్రతి కల్పమూ వచ్చి పతితుల నుండి పావనులుగా తయారుచేస్తారు, ఆ తర్వాత ఇక ఈ
జ్ఞానము సమాప్తమైపోతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. చాలా-చాలా ఆజ్ఞాకారులుగా, మధురముగా ఉంటూ నడుచుకోవాలి. దేహ అహంకారములోకి
రాకూడదు. తండ్రికి బిడ్డగా అయి ఇక ఎటువంటి పొరపాట్లు చేయకూడదు. మాయతో జరిగే
బాక్సింగ్ లో చాలా-చాలా జాగ్రత్తగా ఉండాలి.
2. మీ మాటలలో (వాక్యాలలో) శక్తిని నింపుకునేందుకు ఆత్మాభిమానులుగా ఉండే అభ్యాసము
చేయాలి. తండ్రి నేర్పించినదానిని మేము వినిపిస్తున్నాము అన్న స్మృతి ఉన్నట్లయితే
అప్పుడు అందులో పదును నిండుతుంది.
వరదానము:-
అవినాశీ నషాలో ఉంటూ ఆత్మిక ఆనందాన్ని మరియు ఉల్లాసాన్ని
అనుభవం చేసే బ్రాహ్మణ సో ఫరిశ్తా భవ
బ్రాహ్మణ సో ఫరిశ్తా అయిన మీరు దేవతల కంటే కూడా
ఉన్నతమైనవారు. దేవతా జీవితములో తండ్రి జ్ఞానము ఇమర్జ్ అవ్వదు, పరమాత్మ మిలనము యొక్క
అనుభవం కూడా ఉండదు, అందుకే ఇప్పుడు సదా ఈ నషా ఉండాలి - మేము దేవతల కంటే కూడా
ఉన్నతమైన బ్రాహ్మణ సో ఫరిశ్తాలము. ఈ అవినాశీ నషాయే ఆత్మిక ఆనందాన్ని మరియు
ఉల్లాసాన్ని అనుభవం చేయిస్తుంది. ఒకవేళ నషా సదా ఉండకపోతే ఒక్కోసారి ఆనందములో ఉంటారు,
ఒక్కోసారి తికమకలో ఉంటారు.
స్లోగన్:-
మీ సేవను కూడా తండ్రి ముందు
అర్పించి వేయండి, అప్పుడు సమర్పిత ఆత్మ అని అంటారు.
| | |