‘‘వర్తమాన సమయములో మీ దయాహృదయాన్ని మరియు దాతా
స్వరూపాన్ని ప్రత్యక్షము చెయ్యండి’’
ఈ రోజు వరదాత తండ్రి తమ జ్ఞాన దాతలు, శక్తి దాతలు, గుణ దాతలు,
పరమాత్మ సందేశవాహకులు అయిన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు
ప్రతి ఒక్కరూ మాస్టరు దాతగా అయ్యి ఆత్మలను బాబాకు సమీపముగా
తీసుకువచ్చేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నారు. విశ్వములో
అనేక రకాల ఆత్మలు ఉన్నారు, కొన్ని ఆత్మలకు జ్ఞానామృతము కావాలి,
ఇతర ఆత్మలకు శక్తి కావాలి, గుణాలు కావాలి, పిల్లలైన మీ వద్ద
అన్ని ఖజానాలు అఖండముగా ఉన్నాయి. ప్రతి ఒక్క ఆత్మ యొక్క కోరికను
పూర్తి చేసేవారు మీరు. రోజురోజుకూ సమయము సమాప్తికి సమీపముగా
వస్తున్న కారణముగా ఇప్పుడు ఆత్మలు ఏదైనా కొత్త ఆధారాన్ని
వెతుకుతున్నారు. ఆత్మలైన మీరు ఆ కొత్త ఆధారాన్ని ఇవ్వడానికి
నిమిత్తులుగా అయ్యారు. బాప్ దాదా పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి
సంతోషిస్తున్నారు. ఒకవైపు అవసరము ఉంది మరియు ఇంకొకవైపు
ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. అవసరమైన సమయములో ఒక్క బిందువుకు కూడా
మహత్వము ఉంటుంది. కనుక ఈ సమయములో మీరు ఇచ్చే అంచలికి,
సందేశానికి కూడా మహత్వము ఉంటుంది.
వర్తమాన సమయము పిల్లలైన మీ అందరి దయాహృదయము మరియు దాతా
స్వరూపము ప్రత్యక్షమయ్యే సమయము. బ్రాహ్మణ ఆత్మలైన మీ అనాది
స్వరూపములో కూడా దాతాతనపు సంస్కారాలు నిండి ఉన్నాయి, అందుకే
కల్పవృక్షము చిత్రములో మీరు వృక్షము యొక్క వేర్లలో
చూపించబడ్డారు ఎందుకంటే వేర్ల ద్వారానే మొత్తము వృక్షానికి
అన్నీ చేరుకుంటాయి. మీ ఆది స్వరూపము దేవతా రూపము, దేవత అన్నదాని
అర్థమే దేవ త అనగా ఇచ్చేవారు. మీ మధ్యకాల స్వరూపము పూజ్యనీయ
చిత్రము కనుక మధ్యకాలములో కూడా పూజ్య రూపములో మీరు వరదానాలను
ఇచ్చే, దీవెనలను ఇచ్చే, ఆశీర్వాదాలను ఇచ్చే దాతా రూపులు. కనుక
ఆత్మలైన మీ విశేష స్వరూపమే దాతాతనపు స్వరూపము. అలాగే ఇప్పుడు
కూడా పరమాత్ముని సందేశ వాహకులుగా అయ్యి విశ్వములో బాబా
ప్రత్యక్షత యొక్క సందేశాన్ని వ్యాపింపజేస్తున్నారు. బ్రాహ్మణ
పిల్లలు ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి - అనాది, ఆది దాతాతనపు
సంస్కారాలు ప్రతి ఒక్కరి జీవితములో సదా ఇమర్జ్ రూపములో
ఉంటున్నాయా? దాతాతనపు సంస్కారాలు కల ఆత్మలకు గుర్తు ఏమిటంటే -
ఎవరైనా ఇస్తే మేము ఇస్తాము, ఎవరైనా చేస్తే మేము చేస్తాము అని
వారు ఎప్పుడూ సంకల్పమాత్రముగా కూడా ఇలా అనుకోరు. వారు నిరంతరము
తెరిచియున్న భాండాగారములా ఉంటారు. బాప్ దాదా నలువైపులా ఉన్న
పిల్లల యొక్క దాతాతనపు సంస్కారాలను చూస్తూ ఉన్నారు. ఏం చూసి
ఉంటారు? నంబరువారుగా అయితే ఉండనే ఉన్నారు కదా! ఎప్పుడూ కూడా ఈ
సంకల్పాన్ని చెయ్యకండి - ఇది ఇలా ఉంటే నేను కూడా చేస్తాను అని.
దాతాతనపు సంస్కారాలు కలవారికి అన్ని వైపుల నుండి సహయోగము
స్వతహాగానే ప్రాప్తిస్తుంది. కేవలము ఆత్మల ద్వారానే కాకుండా
ప్రకృతి కూడా సమయమనుసారముగా సహయోగిగా అయిపోతుంది. ఒక
సూక్ష్మమైన లెక్క ఏమిటంటే - ఎవరైతే సదా దాతగా అవుతారో, ఆ ఆత్మకు
ఆ పుణ్యానికి ఫలముగా అవసరమైన సమయానికి సహయోగము, అవసరమైన
సమయానికి సఫలత సహజముగా ప్రాప్తిస్తుంది. అందుకే సదా దాతాతనపు
సంస్కారాలను ఇమర్జ్ రూపములో ఉంచుకోండి. పుణ్య ఖాతా ఒకటికి పది
రెట్లు ఫలాన్ని ఇస్తుంది. కనుక మొత్తం రోజంతటిలో నోట్ చేసుకోండి
- సంకల్పాల ద్వారా, వాణి ద్వారా, సంబంధ-సంపర్కాల ద్వారా పుణ్య
ఆత్మగా అయ్యి పుణ్య ఖాతాను ఎంత జమ చేసుకున్నాను? మనసా సేవ కూడా
పుణ్య ఖాతాను జమ చేస్తుంది. వాణి ద్వారా ఎవరైనా బలహీన ఆత్మను
సంతోషములోకి తీసుకురావటము, ఆందోళనలో ఉన్నవారిని తమ గౌరవము
యొక్క స్మృతిలోకి తీసుకురావటము, నిరాశలో ఉన్న ఆత్మను తమ వాణి
ద్వారా ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురావటము, సంబంధ-సంపర్కము
ద్వారా ఆత్మకు తమ శ్రేష్ఠ సాంగత్యపు రంగును అనుభవము చేయించటము,
ఈ విధి ద్వారా పుణ్య ఖాతాను జమ చేసుకోగలరు. ఈ జన్మలో ఎంత
పుణ్యము జమ చేసుకుంటారంటే ఇక అర్ధకల్పము ఆ పుణ్య ఫలాన్ని
తింటారు మరియు అర్ధకల్పము మీ జడ చిత్రాలు పాప ఆత్మలను
వాయుమండలము ద్వారా పాపాల నుండి ముక్తులుగా చేస్తాయి.
పతిత-పావనిగా అయిపోతారు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి జమ
అయిన పుణ్య ఖాతాను చూస్తూ ఉంటారు.
బాప్ దాదా వర్తమాన సమయములో పిల్లల్లో ఉన్న సేవ యొక్క
ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు. మెజారిటీ పిల్లలలో
సేవకు సంబంధించిన ఉల్లాసము బాగుంది. అందరూ తమ-తమ వైపు నుండి
సేవా ప్లాన్లను ప్రాక్టికల్లోకి తీసుకువస్తున్నారు. ఇందుకు బాప్
దాదా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. బాగా చేస్తున్నారు మరియు
బాగా చేస్తూ ఉంటారు. అన్నిటికంటే మంచి విషయము ఏమిటంటే - అందరి
సంకల్పాలు మరియు సమయము బిజీగా అయిపోయాయి. ప్రతి ఒక్కరికీ ఈ
లక్ష్యము ఉంది - నలువైపులా చేసే సేవ ద్వారా ఇప్పుడు ఫిర్యాదులను
తప్పకుండా పూర్తి చెయ్యాలి అని.
బ్రాహ్మణుల దృఢ సంకల్పములో చాలా శక్తి ఉంది. ఒకవేళ
బ్రాహ్మణులు దృఢ సంకల్పము చేసినట్లయితే ఏదైనా ఎందుకని అవ్వదు!
అన్నీ అవుతాయి. కేవలము యోగాన్ని జ్వాలా రూపముగా చెయ్యండి. యోగము
జ్వలారూపముగా అయినట్లయితే ఆ జ్వాల వెనుక ఆత్మలు స్వతహాగానే
వచ్చేస్తాయి ఎందుకంటే జ్వాల (వెలుగు) లభించటముతో వారికి దారి
కనిపిస్తుంది. ఇప్పుడు యోగమైతే జోడిస్తున్నారు కానీ యోగము
జ్వాలారూపముగా ఉండాలి. సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు మంచిగా
పెరుగుతున్నాయి కానీ యోగములో జ్వాలారూపాన్ని ఇప్పుడు అండర్ లైన్
చెయ్యాలి. మీ దృష్టిలో ఎటువంటి మెరుపు రావాలంటే ఆ దృష్టి ద్వారా
ఏదో ఒక అనుభూతిని అనుభవం చెయ్యాలి.
బాప్ దాదాకు విదేశాలవారు చేసిన ‘కాల్ ఆఫ్ టైమ్ (సమయము యొక్క
పిలుపు)’ అన్న సేవ ఏదైతే ఉందో, దాని విధి బాగా అనిపించింది,
ఇందులో చిన్న సంగఠనను సమీపముగా తీసుకువచ్చారు. ఈ విధంగా ప్రతి
జోన్ వారు, ప్రతి సెంటరు వారు వేర్వేరు సేవలనైతే చేస్తున్నారు
కానీ అన్ని వర్గాల సంగఠనను ఏదైనా తయారుచెయ్యండి. బాప్ దాదా
అన్నారు - చెల్లాచెదురై ఉన్న సేవ చాలా ఉంది, కానీ
చెల్లాచెదురుగా వ్యాపించి ఉన్న సేవ ద్వారా సమీపముగా వచ్చే
కొందరు యోగ్య ఆత్మల సంగఠనను ఎంచుకోండి మరియు ఎప్పటికప్పుడు ఆ
సంగఠనను సమీపముగా తీసుకువస్తూ ఉండండి మరియు వారిలో సేవా
ఉల్లాసాన్ని పెంచండి. బాప్ దాదా చూస్తున్నారు - అటువంటి ఆత్మలు
ఉన్నారు కానీ ఇప్పుడు ఇంకా ఆ శక్తిశాలీ పాలన సంగఠిత రూపములో
లభించటం లేదు. వేర్వేరుగా యథా శక్తి పాలన లభిస్తూ ఉంది కానీ
సంగఠనలో ఒకరిని చూసి ఒకరికి ఉల్లాసము కూడా వస్తుంది. వారు
దీనిని చెయ్యగలిగినప్పుడు నేను కూడా చెయ్యగలను, నేను కూడా
చేస్తాను అన్న ఉల్లాసము వస్తుంది. బాప్ దాదా ఇప్పుడు సేవ యొక్క
ప్రత్యక్ష సంగఠిత రూపాన్ని చూడాలనుకుంటున్నారు. బాగా
కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరూ తమ వర్గము యొక్క, ఏరియా యొక్క,
జోన్ యొక్క, సేవాకేంద్రము యొక్క సేవను చేస్తున్నారు, ఇందుకు
బాప్ దాదా సంతోషిస్తారు. ఇప్పుడు కొందరిని బాబా ఎదురుగా
తీసుకురండి. ప్రవృత్తిలో ఉన్నవారి ఉల్లాసము కూడా బాప్ దాదా
వద్దకు చేరుకుంటుంది. డబుల్ విదేశీయులు కూడా డబుల్ కార్యములో
ఉంటూ సేవలో మరియు స్వ పురుషార్థములో మంచి ఉల్లాసములో ఉంటున్నారు,
ఇది చూసి కూడా బాప్ దాదా సంతోషిస్తున్నారు.
బ్రాహ్మణ ఆత్మలు వర్తమాన వాయుమండలాన్ని చూసి విదేశాలలో
భయపడటం లేదు కదా? రేపు ఏమవుతుంది, రేపు ఏమవుతుంది... అనైతే
ఆలోచించరు కదా? రేపు మంచిగా అవుతుంది. మంచిగా ఉంది మరియు మంచే
జరగనున్నది. ప్రపంచములో ఎంతగా అలజడి ఉంటుందో, అంతగానే
బ్రాహ్మణులైన మీ స్థితి అచలముగా ఉంటుంది. అలా ఉన్నారా? డబుల్
విదేశీయులు అలజడిలో ఉన్నారా లేక అచలముగా ఉన్నారా? అచలముగా
ఉన్నారా? అలజడిలో అయితే లేరు కదా! ఎవరైతే అచలముగా ఉన్నారో వారు
చేతులెత్తండి. అచలముగా ఉన్నారా? రేపు ఏదైనా అయితే? ఏదైనా అయినా
కూడా అచలముగా ఉంటారు కదా! ఏమవుతుంది, ఏమీ కాదు. బ్రాహ్మణులైన
మీపై పరమాత్ముని ఛత్రఛాయ ఉంది. ఏదైనా వాటర్ ప్రూఫ్ గా ఉంటే,
ఎంత వాటర్ ఉన్నా కానీ వాటర్ ప్రూఫ్ ద్వారా వాటర్ ప్రూఫ్ గా (తడవకుండా)
అయిపోతారో, అలాగే ఎంత అలజడి ఉన్నా సరే బ్రాహ్మణాత్మలు
పరమాత్ముని ఛత్రఛాయ క్రింద సదా సురక్షితముగా ఉంటారు. నిశ్చింత
చక్రవర్తులు కదా! లేదా ఏమవుతుందో అని కొంచెం-కొంచెం చింత ఉందా?
లేదు. నిశ్చింతులు. స్వరాజ్య అధికారులుగా అయ్యి, నిశ్చింత
చక్రవర్తులుగా అయ్యి, అచల్-అడోల్ (చలించని-స్థిరమైన) సీట్ పై
సెట్ అయ్యి ఉండండి. సీట్ నుండి కిందకు దిగకండి. అప్సెట్ (మానసిక
అలజడి) అనగా సీట్ పై సెట్ అవ్వకపోతే అప్సెట్ అవుతారు. సీట్ పై
ఎవరైతే సెట్ అయి ఉంటారో, వారు స్వప్నములో కూడా అప్సెట్ అవ్వలేరు.
మాతలు ఏమనుకుంటున్నారు? సీట్ పై సెట్ అవ్వటము, కూర్చోవటము
వస్తుందా? అలజడి అయితే కలగడం లేదు కదా? బాప్ దాదా కంబైండుగా
ఉన్నారు, సర్వశక్తివంతుడు మీతో కంబైండుగా ఉన్నప్పుడు ఇక మీకు
ఏం భయము! ఒంటరివారిగా భావిస్తే అలజడిలోకి వస్తారు. కంబైండుగా
ఉంటే ఎంత అలజడి ఉన్నా సరే మీరు అచలముగా ఉంటారు. సరేనా మాతలూ?
సరే కదా, కంబైండుగా ఉన్నారు కదా! ఒంటరిగా అయితే లేరు కదా?
బాధ్యత బాబాది, ఒకవేళ మీరు సీట్ పై సెట్ అయ్యి ఉంటే బాబాది
బాధ్యత, అప్సెట్ అయితే మీదే బాధ్యత.
ఆత్మలకు సందేశము ద్వారా అంచలిని ఇస్తూ ఉన్నట్లయితే దాత
స్వరూపములో స్థితులై ఉంటారు, అప్పుడు దాతాతనపు పుణ్య ఫలముగా
శక్తి లభిస్తూ ఉంటుంది. నడుస్తూ-తిరుగుతూ స్వయాన్ని కరావన్ హార్
ఆత్మగా (చేయించే ఆత్మగా) భావించాలి మరియు ఈ కర్మేంద్రియాలను
కరన్ హార్ (చేసేవి) కర్మచారులుగా భావించాలి. ఈ ఆత్మ స్మృతి
యొక్క అనుభవము సదా ఇమర్జ్ రూపములో ఉండాలి, నేను ఉన్నదే ఆత్మ కదా
అని ఇలా అనుకోవటము కాదు. ఇలా కాదు. స్మృతిలో ఇమర్జ్ అయ్యి
ఉండాలి. మర్జ్ రూపములో ఉంటుంది కానీ ఇమర్జ్ రూపములో ఉన్నట్లయితే
ఆ నషా, సంతోషము మరియు కంట్రోలింగ్ పవర్ ఉంటాయి. మజా కూడా
వస్తుంది, ఎందుకని! సాక్షీగా అయ్యి కర్మలు చేయిస్తారు. కనుక
పదే-పదే చెక్ చేసుకోండి - కరావన్ హార్ (చేయించేవాని) గా అయ్యి
కర్మలు చేయిస్తున్నానా? ఏ విధంగా రాజు తన కర్మచారులను తన ఆజ్ఞలో
ఉంచుకుంటాడో, ఆజ్ఞాపించి చేయిస్తాడో, అలాగే ఆత్మ కరావన్ హార్ (చేయించేవాడు)
అన్న స్వరూపము యొక్క స్మృతి ఉన్నట్లయితే సర్వ కర్మేంద్రియాలు
ఆర్డర్ అనుసారముగా ఉంటాయి. మాయ ఆర్డర్ (ఆజ్ఞ) లో ఉండవు, మీ
ఆర్డర్ లో ఉంటాయి. లేదంటే మాయ గమనిస్తూ ఉంటుంది, కరావన్ హార్ (చేయించే)
ఆత్మ నిర్లక్ష్యముగా అయిపోయినట్లయితే ఇక మాయ ఆర్డర్ చేయటం
మొదలుపెడుతుంది. ఒక్కోసారి సంకల్ప శక్తి, ఒక్కోసారి వాచా శక్తి
మాయ ఆర్డర్ అనుసారముగా నడవడం మొదలుపెడతాయి, అందుకే సదా అన్ని
కర్మేంద్రియాలను మీ ఆర్డర్ అనుసారముగా నడిపించండి. అలా
అవ్వాలనుకోలేదు, కానీ అలా అయిపోయింది అని అనకండి. ఏది
కోరుకుంటారో అదే జరుగుతుంది. ఇప్పటినుండే రాజ్యాధికారిగా అయ్యే
సంస్కారాన్ని నింపుకుంటేనే, అక్కడ కూడా రాజ్యాన్ని నడిపిస్తారు.
స్వరాజ్య అధికారి అన్న సీట్ నుండి ఎప్పుడూ కిందకు రాకండి.
ఒకవేళ కర్మేంద్రియాలు ఆర్డర్ లో ఉన్నట్లయితే ప్రతి శక్తి కూడా
మీ ఆర్డర్ లో ఉంటుంది. ఏ సమయములో ఏ శక్తి యొక్క అవసరముంటుందో,
అది ఆ సమయములో చిత్తం ప్రభూ అంటూ హాజరైపోతుంది. అలా కాకుండా పని
అయిపోయిన తర్వాత సహనశక్తి రా అని మీరు ఆర్డర్ చేయడము మరియు అది
పని అయిపోయిన తర్వాత రావడము కాదు. ప్రతి శక్తి మీ ఆర్డర్
అనుసారముగా చిత్తం ప్రభూ అని అంటూ హాజరవుతుంది ఎందుకంటే ఈ ప్రతి
శక్తి పరమాత్మ ఇచ్చిన కానుక. కనుక పరమాత్మ ఇచ్చిన కానుక మీ
వస్తువైపోయింది. మీ వస్తువు అన్నప్పుడు మీరు ఎలా అయినా
ఉపయోగించుకోవచ్చు, ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు, అలాగే ఈ సర్వ
శక్తులు మీ ఆర్డర్ లో ఉంటాయి, సర్వ కర్మేంద్రియాలు మీ ఆర్డర్
లో ఉంటాయి, వీరినే స్వరాజ్య అధికారులు, మాస్టర్ సర్వశక్తివంతులు
అని అంటారు. పాండవులు అటువంటివారేనా? మాస్టర్ సర్వశక్తివంతులు
కూడా మరియు స్వరాజ్య అధికారులు కూడా. నోటి నుండి అలా మాటలు
వచ్చేసాయి అని అనకండి. అలా రావటానికి ఆర్డర్ ఇచ్చింది ఎవరు!
చూడాలనుకోలేదు, కానీ చూసేసాను. చెయ్యాలనుకోలేదు కానీ చేసేసాను.
ఇలా ఎవరి ఆర్డర్ పై జరుగుతుంది? వీరిని అధికారులు అని అంటారా
లేక ఆధీనులు అని అంటారా? అధికారులుగా అవ్వండి, ఆధీనులుగా కాదు.
అచ్ఛా!
బాప్ దాదా అంటారు - ఎలా అయితే ఇప్పుడు మధుబన్ లో అందరూ
చాలా-చాలా సంతోషముగా ఉన్నారో, అలాగే సదా సంతోషముగా, సంపన్నముగా
ఉండండి. మీరు ఆత్మిక గులాబీలు. చూడండి, నలువైపులా చూడండి, అందరూ
ఆత్మిక గులాబీలు, వికసించిన గులాబీలు. వాడిపోయినవారు కాదు,
వికసించిన గులాబీలు. కనుక సదా ఇలాగే భాగ్యశాలిగా, సంతోషకరమైన
ముఖముతో ఉండండి. ఎవరైనా మీ ముఖాన్ని చూస్తే మీకు ఏం లభించింది,
చాలా సంతోషములో ఉన్నారే అని మిమ్మల్ని అడగాలి. ప్రతి ఒక్కరి
ముఖము బాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఏ విధంగా చిత్రము పరిచయము
ఇస్తుందో, అలా మీ ముఖము - బాబా లభించారు అని బాబా పరిచయము
ఇవ్వాలి. అచ్ఛా.
అందరూ బాగున్నారా? విదేశాలవారు కూడా చేరుకున్నారు. ఇక్కడ
బాగా అనిపిస్తుంది కదా? (న్యూయార్కు మోహినీ దీదీ)
అల్లకల్లోలాన్ని వినటం నుండైతే రక్షింపబడ్డారు కదా. మంచిగా
చేసారు, అందరూ కలిసి చేరుకున్నారు, చాలా బాగా చేసారు. అచ్ఛా -
డబుల్ విదేశీయులు, డబుల్ నషా ఉంది కదా! ఉన్నామంటే డబుల్
విదేశీయులైన మేమే ఉన్నాము అని మా మనసు చెప్తుంది అని అంతటి నషా
ఉందా, చెప్పండి. డబుల్ నషా ఉంది, స్వరాజ్య అధికారులే విశ్వ
అధికారులు. డబుల్ నషా ఉంది కదా! బాప్ దాదాకు కూడా మంచిగా
అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా గ్రూపులో డబుల్ విదేశీయులు లేకపోతే
మంచిగా అనిపించదు. విశ్వ పిత కదా, కనుక విశ్వములోని వారు కావాలి
కదా! అందరూ కావాలి. మాతలు లేకపోయినా కూడా ఆ శోభ ఉండదు. పాండవులు
లేకపోయినా కూడా ఆ శోభ తక్కువైపోతుంది. చూడండి, ఏ సెంటరులోనైనా
కేవలము మాతలే ఉండి పాండవులు లేకపోతే మంచిగా అనిపిస్తుందా!
కేవలము పాండవులే ఉండి, శక్తులు లేకపోయినా కూడా సేవాకేంద్రము
అలంకరించబడినట్లుగా అనిపించదు. ఇరువురూ కావాలి. పిల్లలు కూడా
కావాలి. మా పేరు ఎందుకు తీసుకోలేదు అని పిల్లలు అడుగుతారు.
పిల్లలు యొక్క శోభ కూడా ఉంటుంది.
అచ్ఛా - ఇప్పుడు ఒక్క సెకండులో నిరాకారీ ఆత్మగా అయ్యి
నిరాకార బాబా యొక్క స్మృతిలో లవలీనులైపోండి (డ్రిల్)
నలువైపులా ఉన్న సర్వ స్వరాజ్య అధికారులకు, సదా సాక్షీతనమనే
సీట్ పై సెట్ అయ్యి ఉండే చలించని-స్థిరమైన ఆత్మలకు, సదా
దాతాతనపు స్మృతితో సర్వులకు జ్ఞానము, శక్తులు, గుణాలను ఇచ్చే
దయాహృదయ ఆత్మలకు, సదా తమ ముఖము ద్వారా బాబా చిత్రాన్ని చూపించే
శ్రేష్ఠ ఆత్మలకు, సదా భాగ్యశాలిగా, సంతోషముగా ఉండే ఆత్మిక
గులాబీలకు, ఆత్మిక గులాబీ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు
మరియు నమస్తే.