ఓంశాంతి
ఉన్నతోన్నతుడైన భగవంతుడిని మహిమ కూడా చేసారు, అలాగే గ్లాని కూడా చేసారు. ఇప్పుడు
ఉన్నతోన్నతుడైన తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయాన్ని ఇస్తారు, తర్వాత రావణ రాజ్యము
ప్రారంభమైనప్పుడు రావణుడు తన గొప్పతనాన్ని చూపిస్తాడు. భక్తి మార్గములో భక్తి
రాజ్యమే ఉంటుంది, అందుకే రావణ రాజ్యము అని అంటారు. అది రామ రాజ్యము, ఇది రావణ
రాజ్యము. రాముడిని మరియు రావణుడినే పోల్చడం జరుగుతుంది. ఆ రాముడు త్రేతాయుగ రాజు,
ఇది అతని గురించి చెప్పడం లేదు. రావణుడు అర్ధకల్పము యొక్క రాజు. అంతేకానీ రాముడు
అర్ధకల్పము యొక్క రాజు కాదు, అలా కాదు. ఇవి విస్తారముగా అర్థం చేసుకోవలసిన విషయాలు.
ఇకపోతే, చాలా సహజముగా అర్థం చేసుకునే విషయము ఏమిటంటే - మనమందరమూ సోదరులము, మన అందరి
తండ్రి ఒక్క నిరాకారుడు. ఈ సమయములో తన పిల్లలందరూ రావణుడి జైలులో ఉన్నారని తండ్రికి
తెలుసు. కామ చితిపై కూర్చుని అందరూ నల్లగా అయిపోయారు. ఇది తండ్రికి తెలుసు. ఆత్మలోనే
జ్ఞానమంతా ఉంది కదా. అందులోనూ ఆత్మ మరియు పరమాత్మను తెలుసుకోవడానికి చాలా మహత్వము
ఇవ్వవలసి ఉంటుంది. చిన్న ఆత్మలో ఎంతటి పాత్ర నిశ్చితమై ఉంది, దానిని అభినయిస్తూ
ఉంటుంది. దేహాభిమానములోకి వచ్చి పాత్రను అభినయించినప్పుడు స్వధర్మాన్ని మర్చిపోతారు.
ఇప్పుడు తండ్రి వచ్చి ఆత్మాభిమానులుగా తయారుచేస్తారు ఎందుకంటే, నేను పావనముగా
తయారవ్వాలని ఆత్మయే అంటుంది. కావున తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. ఓ
పరమపిత, ఓ పతిత-పావనా, ఆత్మలమైన మేము పతితముగా అయిపోయాము కావున మీరు వచ్చి మమ్మల్ని
పావనముగా తయారుచేయండి అని ఆత్మ పిలుస్తుంది. సంస్కారమంతా ఆత్మలోనే ఉంటుంది కదా. నేను
పతితముగా అయ్యాను అని ఆత్మ స్పష్టముగా చెప్తుంది. ఎవరైతే వికారాలలోకి వెళ్తారో,
వారిని పతితులు అని అంటారు. పతిత మనుష్యులు పావన నిర్వికారీ దేవతల వద్దకు వెళ్ళి
మందిరములో వారి మహిమ గానం చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరే
పూజ్య దేవతలుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ కిందికి తప్పకుండా దిగవలసి
ఉంటుంది. ఈ నాటకమే పతితుల నుండి పావనులుగా, పావనుల నుండి పతితులుగా తయారయ్యే నాటకము.
మొత్తం జ్ఞానమంతటినీ తండ్రి వచ్చి సూచన ద్వారా అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఇది అందరి
అంతిమ జన్మ. అందరూ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని వెళ్ళాలి. బాబా సాక్షాత్కారము
చేయిస్తారు. పతితులు తమ వికర్మలకు శిక్షలు తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది.
అంతిమములో ఏదో ఒక జన్మనిచ్చి వారికి శిక్ష వేస్తారు. మనుష్య తనువులోనే శిక్షలు
అనుభవిస్తారు, అందుకే శరీరాన్ని తప్పకుండా ధారణ చేయవలసి ఉంటుంది. నేను శిక్షలను
అనుభవిస్తున్నాను అని ఆత్మకు అనుభవమవుతుంది. కాశీలోని కత్తుల బావిలోకి దూకినప్పుడు
శిక్షలు అనుభవిస్తారు, వారు గతంలో చేసిన పాపాల సాక్షాత్కారము జరుగుతుంది, అందుకే,
భగవంతుడా క్షమించండి, మేము ఇంకెప్పుడూ ఇలా చేయము అని అంటారు. సాక్షాత్కారములోనే ఈ
విధముగా క్షమాపణలు అడుగుతారు. ఇది అనుభవమవుతుంది, దుఃఖాన్ని అనుభవిస్తారు.
అన్నింటికంటే ఎక్కువ మహత్వముంది ఆత్మ మరియు పరమాత్మకు. ఆత్మయే 84 జన్మల పాత్రను
అభినయిస్తుంది. కావున ఆత్మ అన్నింటికన్నా శక్తివంతమైనది అయినట్లు కదా. మొత్తం
డ్రామాలో మహత్వమున్నది ఆత్మ మరియు పరమాత్మకు. వీరి గురించి ఇంకెవ్వరికీ తెలియదు.
మనుష్యమాత్రులు ఒక్కరికి కూడా ఆత్మ ఏమిటి మరియు పరమాత్మ ఏమిటి అనేది తెలియదు. డ్రామా
అనుసారముగా ఇది కూడా జరిగేది ఉంది. ఇది కొత్త విషయమేమీ కాదు అని పిల్లలైన మీకు కూడా
జ్ఞానముంది, కల్పపూర్వము కూడా ఇలాగే జరిగింది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని అంటారు
కూడా. కానీ అర్థాన్ని అర్థం చేసుకోరు. బాబా ఈ సాధువులు మొదలైనవారి సాంగత్యము ఎంతో
చేసారు, వారు కేవలం ఆ పేర్లు ఉపయోగిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు బాగా అర్థం
చేసుకున్నారు - మేము పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి వెళ్తాము కావున పాత
ప్రపంచము నుండి తప్పకుండా వైరాగ్యము కలగాలి. దీని పట్ల మనసు ఏమి పెట్టుకోవాలి. ఏ
దేహధారి పట్ల మనసు పెట్టుకోము అని మీరు ప్రతిజ్ఞ చేసారు. ఆత్మ అంటుంది, నేను ఒక్క
తండ్రినే స్మృతి చేస్తాను, నా దేహాన్ని కూడా స్మృతి చేయను. తండ్రి దేహ సహితముగా
సర్వస్వాన్ని సన్యసింపజేస్తారు. మరి ఇతరుల దేహము పట్ల మనము మోహము ఎందుకు
పెట్టుకోవాలి. ఎవరి పట్లనైనా మోహము ఉంటే వారు గుర్తుకొస్తూ ఉంటారు. అప్పుడు ఈశ్వరుడు
గుర్తుకు రారు. ప్రతిజ్ఞను తెంచితే శిక్ష కూడా ఎంతో అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా
భ్రష్టమైపోతుంది, అందుకే ఎంత వీలైతే అంత, తండ్రినే స్మృతి చేయాలి. మాయ అయితే చాలా
మోసం చేస్తుంది. ఎటువంటి పరిస్థితిలోనూ మాయ నుండి స్వయాన్ని రక్షించుకోవాలి.
దేహాభిమానము చాలా కఠినమైన రోగము. తండ్రి అంటారు, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి.
తండ్రిని స్మృతి చేసినట్లయితే దేహాభిమానపు రోగము దూరమైపోతుంది. రోజంతా దేహాభిమానములో
ఉంటారు, తండ్రిని చాలా కష్టం మీద స్మృతి చేస్తారు. తండ్రి అర్థం చేయించారు, చేతులు
పని వైపు ఉంచండి, హృదయము ప్రియుని వైపు ఉంచండి. ఏ విధముగా ప్రేయసీ, ప్రియులు తమ
వ్యాపార, వ్యవహారాలను చేసుకుంటూ కూడా తాము ప్రేమించినవారినే తలచుకుంటూ ఉంటారో, అలా
ఇప్పుడు ఆత్మలైన మీరు పరమాత్మునితో ప్రీతిని పెట్టుకోవాలి కావున వారినే స్మృతి
చేయాలి కదా. మేము దేవి-దేవతలుగా తయారవ్వాలి, ఇదే మీ లక్ష్యము-ఉద్దేశ్యము, దాని కోసం
పురుషార్థము చేయాలి. మాయ అయితే తప్పకుండా మోసగిస్తుంది, స్వయాన్ని దాని నుండి
విడిపించుకోవాలి, లేదంటే చిక్కుకుపోతారు, అప్పుడు గ్లాని కూడా జరుగుతుంది, దాని
వల్ల నష్టము కూడా ఎంతగానో జరుగుతుంది.
పిల్లలైన మీకు తెలుసు - ఆత్మలైన మనము బిందువులము, మన తండ్రి కూడా బీజరూపుడు,
నాలెడ్జ్ ఫుల్. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఆత్మ అంటే ఏమిటో, అందులో అవినాశీ పాత్ర
ఎలా నిండి ఉందో - ఈ గుహ్యమైన విషయాలను మంచి-మంచి పిల్లలు కూడా పూర్తిగా అర్థం
చేసుకోరు. స్వయాన్ని యథార్థ రీతిలో ఆత్మగా భావించాలి మరియు తండ్రిని కూడా బిందు
రూపముగా భావిస్తూ స్మృతి చేయాలి, వారు జ్ఞాన సాగరుడు, బీజరూపుడు... ఇలా భావిస్తూ
స్మృతి చేయడం చాలా కష్టం మీద చేస్తారు. స్థూల రూపములో కాకుండా ఇందులో
సూక్ష్మబుద్ధిని ఉపయోగించవలసి ఉంటుంది - నేను ఆత్మ, నా తండ్రి వచ్చి ఉన్నారు, వారు
బీజరూపుడు, నాలెడ్జ్ ఫుల్, నాకు జ్ఞానము వినిపిస్తున్నారు, ధారణ కూడా ఇంత చిన్న
ఆత్మనైన నాలోనే జరుగుతుంది. ఆత్మ, పరమాత్మ అని పైపైన అనేవారు చాలామంది ఉన్నారు....
కానీ వారికి ఇది యథార్థ రీతిలో బుద్ధిలోకి రాదు. అసలు స్మృతి చేయకపోవడం కన్నా ఇలా
స్మృతి చేయడం కొంత మంచిదే. కానీ ఆ యథార్థ స్మృతి ఎక్కువ ఫలదాయకమైనది. వారు అంత
ఉన్నత పదవిని పొందలేరు. ఇందులో చాలా శ్రమ ఉంది. ఆత్మనైన నేను ఒక చిన్న బిందువును,
బాబా కూడా ఎంతో చిన్న బిందువే, వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది, ఇది కూడా మీరు ఇక్కడ
కూర్చున్నారు కాబట్టి కాస్త బుద్ధిలోకి వస్తుంది కానీ నడుస్తూ, తిరుగుతూ ఆ చింతనలో
ఉండాలి, అది ఉండటం లేదు, మర్చిపోతారు. రోజంతా అదే చింతన ఉండాలి - ఇది
సత్యాతి-సత్యమైన స్మృతి. కొందరు తాము ఎలా స్మృతి చేస్తున్నారు అనేది సత్యముగా
చెప్పరు. చార్టునైతే పంపిస్తారు కానీ స్వయాన్ని బిందువుగా భావిస్తూ తండ్రిని కూడా
బిందువుగా భావిస్తూ స్మృతి చేస్తున్నాము అని వ్రాయరు. సత్యతతో పూర్తిగా వ్రాయరు.
మురళిని చాలా బాగా వినిపిస్తారు కానీ యోగము చాలా తక్కువగా ఉంది, దేహాభిమానము చాలా
ఉంది, ఈ గుప్తమైన విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోరు, స్మృతి చేయరు. స్మృతి ద్వారానే
పావనముగా తయారవ్వాలి. మొట్టమొదట అయితే కర్మాతీత అవస్థ కావాలి కదా. వారే ఉన్నత పదవిని
పొందగలరు. ఇకపోతే మురళిని వినిపించేవారు అయితే ఎంతోమంది ఉన్నారు. కానీ వీరు యోగములో
ఉండలేకపోతారు అని బాబాకు తెలుసు. విశ్వానికి యజమానులుగా తయారవ్వడమనేది పిన్నమ్మ
ఇంటికి వెళ్ళడమంత సులువేమీ కాదు. ఆ అల్పకాలికమైన పదవులను పొందడానికి కూడా ఎంతగా
చదువుతారు. చదువు సంపాదనకు ఆధారముగా ఇప్పుడే అయ్యింది. ఇంతకుముందు బ్యారిస్టర్లు
మొదలైనవారు ఇంతగా సంపాదించేవారు కాదు. ఇప్పుడు ఎంతగా సంపాదిస్తున్నారు.
పిల్లలు తమ కళ్యాణము కొరకు, ఒకటి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ యథార్థ రీతిగా
తండ్రిని స్మృతి చేయాలి మరియు త్రిమూర్తి శివుని పరిచయాన్ని ఇతరులకు కూడా ఇవ్వాలి.
కేవలం శివ అని అనడం ద్వారా అర్థం చేసుకోరు. త్రిమూర్తి అనేది తప్పకుండా కావాలి.
ముఖ్యమైనవి రెండు చిత్రాలు - త్రిమూర్తి మరియు కల్పవృక్షము. మెట్ల వరుస కన్నా
వృక్షములో ఎక్కువ జ్ఞానము ఉంది. ఈ చిత్రాలైతే అందరి వద్దా ఉండాలి. ఒకవైపు త్రిమూర్తి
సృష్టిచక్రము, ఇంకొకవైపు కల్పవృక్షము - పాండవ సేన జెండా ఇలా ఉండాలి. డ్రామా మరియు
కల్పవృక్ష జ్ఞానాన్ని కూడా తండ్రి ఇస్తారు. లక్ష్మీ-నారాయణులు, విష్ణువు
మొదలైనవారంతా ఎవరు? ఇది ఎవరూ అర్థం చేసుకోరు. మహాలక్ష్మికి పూజ చేస్తారు, లక్ష్మి
వస్తారని భావిస్తారు. ఇప్పుడు లక్ష్మికి ధనము ఎక్కడి నుండి వస్తుంది? నాలుగు
భుజాలవారిని, 8 భుజాలవారిని, ఇలా ఎన్ని చిత్రాలు తయారుచేసారు. కానీ ఏమీ అర్థం
చేసుకోరు. 8-10 భుజాల మనుష్యులైతే ఎవ్వరూ ఉండరు. ఎవరికి ఏది తోస్తే అలా తయారుచేసారు,
ఇక అదే నడుస్తూ వచ్చింది. ఎవరో హనుమంతుడిని పూజించమని సలహా ఇస్తే, ఇక అదే చేయడం
మొదలుపెట్టారు. సంజీవని మూలికను తీసుకువచ్చినట్లుగా చూపిస్తారు... దీని అర్థాన్ని
కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. మన్మనాభవయే సంజీవని మూలిక. ఎప్పటివరకైతే
బ్రాహ్మణులుగా అవ్వరో, తండ్రి పరిచయము లభించదో, అప్పటివరకూ వారు పైసకు కూడా
కొరగానివారు అని ఆలోచనలో అనిపిస్తుంది. మనుష్యులకు తమ పదవుల గురించి ఎంత అహంకారము
ఉంటుంది. వారికి అర్థం చేయించడం చాలా కష్టము. రాజ్యాన్ని స్థాపన చేయడానికి ఎంత
కష్టపడవలసి వస్తుంది. అది బాహుబలము, ఇది యోగబలము. ఈ విషయాలు శాస్త్రాలలోనైతే లేవు.
వాస్తవానికి మీరేమీ శాస్త్రాల విషయాలను ప్రస్తావించకూడదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని,
మీరు శాస్త్రాలను నమ్ముతారా అని అడిగితే మీరు ఇలా చెప్పండి - అవును, ఇవన్నీ భక్తి
మార్గపు సామగ్రి, ఇప్పుడు మేము జ్ఞానమార్గములో నడుస్తున్నాము, జ్ఞానాన్ని ఇచ్చేది
జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కరే, దీనిని ఆత్మిక జ్ఞానము అని అంటారు. ఆత్మ కూర్చుని
ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఆ మనుష్యులు, మనుష్యులకు ఇస్తారు. వాస్తవానికి
మనుష్యులు ఎప్పుడూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వలేరు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు,
ముక్తిప్రదాత, సద్గతిదాత తండ్రి ఒక్కరే.
ఇలా, ఇలా చేయండి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. ఇప్పుడు శివజయంతికి ఎంత
ఆర్భాటముగా సేవ చేస్తారో చూద్దాము. అందరికీ లభించేలా చిన్న ట్రాన్స్ లైట్ చిత్రాలు
కూడా ఉండాలి. మీదైతే పూర్తిగా కొత్త విషయము. ఎవరూ అర్థం చేసుకోలేరు. వార్తాపత్రికలలో
బాగా వేయాలి. శబ్దాన్ని వ్యాపింపజేయాలి. సెంటర్లు తెరిచేందుకు కూడా అటువంటివారు
కావాలి. ఇప్పుడు పిల్లలైన మీకే అంత నషా ఎక్కలేదు. నంబరువారు పురుషార్థానుసారముగా
అర్థం చేయిస్తారు. ఎంతోమంది బ్రహ్మాకుమార, బ్రహ్మాకుమారీలు ఉన్నారు. అచ్ఛా, బ్రహ్మా
పేరు తీసేసి ఇంకెవరి పేరైనా పెట్టండి, రాధ-కృష్ణుల పేరు పెట్టండి, అచ్ఛా, మరి
అప్పుడు బ్రహ్మాకుమార, కుమారీలు ఎక్కడి నుండి వస్తారు? ముఖవంశావళి బి.కే.లు
ఉండేందుకు ఎవరో ఒక బ్రహ్మా అయితే కావాలి కదా. పిల్లలు మున్ముందు చాలా అర్థం
చేసుకుంటారు. ఖర్చు అయితే చేయవలసే వస్తుంది. చిత్రాలైతే చాలా స్పష్టముగా ఉన్నాయి.
లక్ష్మీ-నారాయణుల చిత్రము చాలా బాగుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే, సర్వీసబుల్, ఆజ్ఞాకారీ, విధేయులైన పిల్లలకు నంబరువారు
పురుషార్థానుసారముగా మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.