09-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 18.01.2004


‘‘వరల్డ్అథారిటీ యొక్క డైరెక్ట్పిల్లలము - ఈ స్మృతిని ఇమర్జ్చేసుకుని సర్వ శక్తులను ఆర్డర్ అనుసారముగా నడిపించండి’’

ఈ రోజు నలువైపులా స్నేహ అలలలో పిల్లలందరూ లీనమై ఉన్నారు. అందరి హృదయాలలో విశేషముగా బ్రహ్మాబాబా యొక్క స్మృతి ఇమర్జ్అయి ఉంది. అమృతవేళ నుండి మొదలుకుని సాకార పాలన పొందిన రత్నాలు మరియు వారితో పాటు అలౌకిక పాలన పొందిన రత్నాలు, ఇరువురి హృదయాలలోని స్మృతుల మాలలు బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. అందరి హృదయములో బాప్ దాదా స్మృతి యొక్క చిత్రము కనిపిస్తూ ఉంది మరియు బాబా హృదయములో పిల్లలందరి స్నేహభరితమైన స్మృతి ఇమిడి ఉంది. అందరి హృదయాలలో ఒకటే స్నేహభరితమైన పాట మ్రోగుతూ ఉంది - ‘‘నా బాబా’’ మరియు బాబా హృదయము నుండి ఇదే పాట మ్రోగుతూ ఉంది - ‘‘నా మధురాతి మధురమైన పిల్లలూ’’. ఈ ఆటోమేటిక్ పాట, అనంతమైన ఈ పాట ఎంత ప్రియమైనది. బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలకు వారి స్నేహభరితమైన స్మృతికి రిటర్నులో హృదయము నుండి స్నేహభరితమైన ఆశీర్వాదాలను పదమాలు రెట్లుగా ఇస్తున్నారు.

బాప్ దాదా చూస్తున్నారు, ఇప్పుడు కూడా దేశము మరియు విదేశములో పిల్లలు స్నేహ సాగరునిలో లవలీనమై ఉన్నారు. ఈ స్మృతి దివసము విశేషముగా పిల్లలందరి కొరకు సమర్థముగా తయారుచేసే రోజు. ఈ రోజు బ్రహ్మాబాబా ద్వారా పిల్లలకు పట్టాభిషేకము జరిగిన రోజు. బ్రహ్మాబాబా నిమిత్త పిల్లలకు విశ్వ సేవా బాధ్యత యొక్క కిరీటాన్ని పెట్టారు. స్వయం గుప్తమై పిల్లలను సాకార స్వరూపములో నిమిత్తముగా చేసే స్మృతి తిలకము దిద్దారు. తమ సమానముగా అవ్యక్త ఫరిశ్తా స్వరూపము యొక్క ప్రకాశ కిరీటాన్ని పెట్టారు. స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లలను చేసేవారిగా తయారుచేసారు, అందుకే ఈ రోజుని స్మృతి దివసము మరియు సమర్థ దివసము అంటారు. కేవలం స్మృతియే కాదు, స్మృతితో పాటు సర్వ సమర్థతలు పిల్లలకు వరదానము రూపములో ప్రాప్తించాయి. బాప్ దాదా పిల్లలందరినీ సర్వ స్మృతుల స్వరూపులుగా చూస్తున్నారు. మాస్టర్సర్వశక్తివాన్స్వరూపములో చూస్తున్నారు. శక్తివంతులుగా కాదు, సర్వశక్తివంతులు. ఈ సర్వ శక్తులు బాబా ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికీ వరదానము రూపములో లభించాయి. దివ్య జన్మ తీసుకోగానే బాప్ దాదా వరదానము ఇచ్చారు - సర్వశక్తివాన్ భవ! ఇది ప్రతి జన్మ దినము యొక్క వరదానము. ఈ శక్తులను ప్రాప్తించిన వరదానాల రూపముతో కార్యములో ఉపయోగించండి. శక్తులైతే పిల్లలు ప్రతి ఒక్కరికీ లభించాయి కానీ కార్యములో ఉపయోగించడములో నంబరువారు అవుతున్నారు. ప్రతి శక్తి యొక్క వరదానాన్ని సమయమనుసారముగా ఆర్డర్ చేయవచ్చు. ఒకవేళ వరదాత ఇచ్చిన వరదానాల యొక్క స్మృతి స్వరూపులుగా అయ్యి సమయమనుసారముగా ఏ శక్తిని ఆర్డర్చేసినా, ప్రతి శక్తి హాజరవ్వాల్సిందే. వరదానాల ప్రాప్తి యొక్క స్మృతితో, యజమానిని అన్న స్మృతి స్వరూపములో ఉంటూ మీరు ఆర్డర్చేస్తే, శక్తి సమయానికి కార్యములోకి రాకపోవటమనేది జరగదు. కానీ యజమాని మాస్టర్సర్వశక్తివాన్అనే స్మృతి యొక్క సీట్పై సెట్అవ్వాలి, సీట్ పై సెట్అవ్వకుండా ఏ ఆర్డర్ పాటించడం జరగదు. బాబా, మేము మిమ్మల్ని స్మృతి చేయగానే మీరు హాజరైపోతారు, ప్రభువు హాజరైపోతారు అని పిల్లలు అంటుంటారు కదా, మరి ప్రభువు హాజరవ్వగలిగినప్పుడు శక్తులు ఎందుకు హాజరవ్వవు? కేవలం విధిపూర్వకముగా, యజమానిని అనే అథారటీతో ఆర్డర్చేయండి. ఈ సర్వ శక్తులు సంగమయుగములో విశేషముగా పరమాత్ముని ప్రాపర్టీ. ప్రాపర్టీ ఎవరి కోసము ఉంటుంది? పిల్లల కోసమే ప్రాపర్టీ ఉంటుంది. కనుక అధికారముతో స్మృతి స్వరూపము అనే సీట్ పై సెట్అయ్యి ఆర్డర్చేయండి, శ్రమ ఎందుకు చేయాలి, ఆర్డర్చేయండి. వరల్డ్ అథారిటీకి డైరెక్ట్పిల్లలము - ఈ స్మృతి యొక్క నషా సదా ఇమర్జ్అయి ఉండాలి.

స్వయాన్ని చెక్ చేసుకోండి - వరల్డ్ఆల్మైటీ అథారిటీ యొక్క అధికారి ఆత్మను, అన్న ఈ స్మృతి స్వతహాగానే ఉంటుందా? ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? ఈ రోజుల్లోని సమయములోనైతే అధికారము తీసుకునే విషయములోనే గొడవలు జరుగుతున్నాయి మరియు మీ అందరికీ పరమాత్మ అధికారము, పరమాత్మ అథారిటీ జన్మతోనే ప్రాప్తించాయి. కనుక మీ అధికారము యొక్క సమర్థతలో ఉండండి. స్వయం కూడా సమర్థముగా ఉండండి మరియు సర్వాత్మలకు కూడా సమర్థతను ఇప్పించండి. సర్వాత్మలు ఈ సమయములో సమర్థత కొరకు అనగా శక్తుల కొరకు బికారులుగా ఉన్నారు, మీ జడచిత్రాల ఎదురుగా యాచిస్తూ ఉంటారు. కనుక బాబా అంటారు, ‘‘ఓ సమర్థ ఆత్మల్లారా, సర్వాత్మలకు శక్తిని ఇవ్వండి, సమర్థతను ఇవ్వండి’’. దీని కోసం కేవలం ఒక విషయముపై అటెన్షన్ పిల్లలు ప్రతి ఒక్కరూ పెట్టడం అవసరము - దాని కొరకు బాప్ దాదా సూచన కూడా ఇచ్చి ఉన్నారు, బాప్ దాదా రిజల్టులో చూస్తే మెజారిటీ పిల్లల సంకల్పాలు మరియు సమయము వ్యర్థంగా పోతున్నాయి. ఏ విధంగా కరెంట్యొక్క కనెక్షన్ఒకవేళ కొద్దిగా లూజ్అయినా లేక లీక్అయినా, కాంతి సరిగ్గా రాదో, అదే విధంగా ఈ వ్యర్థము యొక్క లీకేజ్అనేది సమర్థ స్థితిని సదాకాలిక స్మృతిగా అవ్వనివ్వదు, అందుకే వేస్ట్ను బెస్ట్లోకి మార్చండి. పొదుపు పథకాన్ని తయారుచేయండి. మొత్తం రోజంతటిలో వేస్ట్ఎంత అయ్యింది, బెస్ట్ఎంత అయ్యింది అన్న శాతము పరిశీలించండి. ఒకవేళ 40% వేస్ట్ ఉంటే, 20% వేస్ట్ ఉంటే, దానిని పొదుపు చెయ్యండి. కొద్దిగానే కదా వేస్ట్అవుతుంది, మిగిలిన రోజంతా అయితే మంచిగానే ఉంటుంది కదా అని అనుకోకండి. ఈ వ్యర్థము యొక్క అలవాటు, చాలా సమయము నుండి ఉన్న అలవాటు కారణముగా చివరి సమయములో మోసం చేయగలదు. ఈ వ్యర్థము నంబరువారుగా చేసేస్తుంది, నంబర్వన్గా అవ్వనివ్వదు. ఏ విధంగా బ్రహ్మాబాబా ఆదిలో తమ చెకింగ్చేసుకోవడం కోసం రోజూ రాత్రి తమ దర్బారును పెట్టుకునేవారు. ఎవరి దర్బారు? పిల్లల దర్బారు కాదు, తమ కర్మేంద్రియాల యొక్క దర్బారును పెట్టుకునేవారు. ఆర్డరు వేసేవారు - ఓ మనసు అనే ముఖ్యమంత్రి, నీ ఈ నడవడిక బాగోలేదు, ఆర్డరులో నడుచుకో. ఓ సంస్కారమా, ఆర్డర్ లో నడుచుకో. ఎందుకు అలజడిలోకి వచ్చావు, కారణము చెప్పు, నివారణ చేయి. ఇలా ప్రతిరోజూ అఫిషియల్దర్బారు పెట్టుకునేవారు. ఇలా రోజు మీ స్వరాజ్య దర్బారును పెట్టుకోండి. కొంతమంది పిల్లలు బాప్ దాదాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తుంటారు. పర్సనల్ సంభాషణ చేస్తుంటారు, చెప్పమంటారా. ఏమంటారంటే - మా భవిష్య చిత్రము ఏమిటో చెప్పండి, మేము భవిష్యత్తులో ఏమవుతాము? ఆది రత్నాలకు గుర్తు ఉండి ఉంటుంది - జగదంబ తల్లిని పిల్లలందరూ తమ చిత్రము గురించి అడుగుతూ ఉండేవారు, మమ్మా, మేము ఎలా ఉన్నామో మీరు మా చిత్రాన్ని ఇవ్వండి. అలా బాప్ దాదాతో కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ తమ చిత్రాన్ని అడుగుతారు. మీ అందరికీ కూడా మాకు కూడా మా చిత్రము లభిస్తే బాగుంటుంది అని అనిపిస్తూ ఉండవచ్చు కదా. కానీ బాప్ దాదా చెప్తున్నారు - బాప్ దాదా ప్రతి ఒక్క బిడ్డకు ఒక విచిత్ర దర్పణము ఇచ్చారు, ఆ దర్పణము ఏమిటి? వర్తమాన సమయములో మీరు స్వరాజ్య అధికారులు కదా! అవునా? స్వరాజ్య అధికారులేనా? అయితే చేతులు ఎత్తండి. స్వరాజ్యానికి అధికారులా? అచ్ఛా. కొద్దిమంది ఎత్తడం లేదు. అంటే కొంచెం-కొంచెమే అలా ఉన్నారా? అచ్ఛా. అందరూ స్వరాజ్యాధికారులే, అభినందనలు. ఈ స్వరాజ్య అధికారము యొక్క చార్టు మీ కొరకు భవిష్య పదవి యొక్క ముఖాన్ని చూపించే దర్పణము. ఈ దర్పణము అందరికీ లభించింది కదా? స్పష్టముగా ఉందా? ఏ విధమైన నల్ల మచ్చలైతే లేవు కదా! అచ్ఛా, నల్ల మచ్చలు అయితే ఉండవు కానీ అప్పుడప్పుడు ఎలాగైతే వేడి నీరు ఉన్నప్పుడు, అది ఆవిరిలా అద్దానికి పట్టేస్తుంది. పొగమంచు ఉంటుంది కదా, అద్దంపై అలా వచ్చేస్తుంది, దాని వల్ల అద్దం స్పష్టముగా చూపించదు. స్నానము చేసే సమయంలోనైతే అందరికీ అనుభవం ఉంటుంది. అదే విధంగా ఒకవేళ ఏదైనా ఒక్క కర్మేంద్రియమైనా ఇప్పటివరకు కూడా మీ పూర్తి కంట్రోల్ లో లేకపోతే, కంట్రోల్ లోనే ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఉండటం లేదు కూడా. ఒకవేళ ఏ కర్మేంద్రియమైనా, కళ్ళు అయినా, నోరు అయినా, చెవులు అయినా, కాళ్ళు అయినా, కాళ్ళు కూడా అప్పుడప్పుడు చెడు సాంగత్యము వైపుకు వెళ్ళిపోతాయి, మరి అప్పుడు కాళ్ళు కూడా కంట్రోల్ లో లేనట్లు కదా. అందరూ కలిసి కూర్చున్నప్పుడు రామాయణము, భాగవతము యొక్క తప్పుడు కథలు వింటారు, మంచివి వినరు. ఇలా ఏ కర్మేంద్రియమైనా సంకల్పము మరియు సమయము సహితముగా ఒకవేళ కంట్రోల్ లో లేకపోతే దాని ద్వారానే చెక్ చేసుకోండి - స్వరాజ్యములోనే కంట్రోలింగ్ పవర్ లేకపోతే విశ్వ రాజ్యము ఏం కంట్రోల్చేస్తారు! మరి రాజుగా ఎలా అవుతారు? అక్కడైతే అన్నీ ఏక్యురేట్ గా ఉంటాయి. కంట్రోలింగ్పవర్, రూలింగ్పవర్అన్నీ స్వతహాగానే సంగమయుగము యొక్క పురుషార్థానికి ప్రారబ్ధ రూపములో లభిస్తాయి. అందుకే సంగమయుగములో అనగా వర్తమాన సమయములో ఒకవేళ కంట్రోలింగ్పవర్, రూలింగ్పవర్తక్కువగా ఉంటే పురుషార్థము తక్కువగా ఉన్నట్లు, మరి ప్రారబ్ధము ఏమి లభిస్తుంది? లెక్క చూడటములోనైతే తెలివైనవారు కదా! కనుక ఈ దర్పణములో మీ ముఖాన్ని చూసుకోండి, మీ ముఖకవళికలను చూసుకోండి. రాజు ముఖము కనిపిస్తుందా, రాయల్ఫ్యామిలీ వారి ముఖము కనిపిస్తుందా, రాయల్ ప్రజల ముఖము కనిపిస్తుందా, సాధారణ ప్రజల ముఖము కనిపిస్తుందా, ఏ ముఖము కనిపిస్తుంది? మరి లభించిందా చిత్రము? ఈ చిత్రముతో చెక్ చేసుకోండి. ప్రతి రోజు చెక్ చేసుకోండి ఎందుకంటే బహుకాలపు పురుషార్థముతో బహుకాలపు రాజ్యభాగ్యము ప్రాప్తిస్తుంది. అంతిమ సమయములో అనంతమైన వైరాగ్యము వచ్చేస్తుంది అని ఒకవేళ మీరు అనుకుంటే, మరి అంతిమ సమయము వచ్చినప్పుడు అది బహుకాలము అయినట్లా లేక కొద్ది సమయము అయినట్లా? బహుకాలము అని అనరు కదా! మరి 21 జన్మలు పూర్తి రాజ్యాధికారులుగా అవ్వాలి, సింహాసనముపై కూర్చోకపోయినా కానీ రాజ్యాధికారులుగా అవ్వాలి. ఈ బహుకాలపు పురుషార్థానికి, బహుకాలపు ప్రారబ్ధానికి సంబంధం ఉంది, అందుకే నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఇప్పుడైతే ఇంకా వినాశనము యొక్క తారీఖే ఫిక్స్ అవ్వలేదు, ఎప్పుడవుతుందో తెలియదు, 8 సంవత్సరాలలో అవుతుందా, 10 సంవత్సరాలలో అవుతుందా తెలియదు కదా, కావున రాబోయే సమయములో తయారైపోతాము అని ఇలా అనుకోకండి. విశ్వము యొక్క అంతిమ కాలము గురించి ఆలోచించే ముందు మీ జన్మ యొక్క అంతిమ కాలము గురించి ఆలోచించండి, మీ వద్ద తారిఖు ఫిక్స్ అయి ఉందా? ఈ తారీఖున నా మృత్యువు జరుగుతుంది అని ఎవరి దగ్గరైనా తారీఖు ఉందా! ఎవరి దగ్గరైనా ఉందా? లేదు కదా! విశ్వము యొక్క అంతము అయితే అయ్యేది ఉంది, అది సమయానికి తప్పకుండా అవుతుంది కూడా, కానీ మొదట మీ అంతిమ కాలము గురించి ఆలోచించుకోండి మరియు జగదంబ యొక్క స్లోగన్ ను గుర్తు తెచ్చుకోండి - ఏ స్లోగన్? ప్రతి ఘడియను మీ అంతిమ ఘడియగా భావించండి. అకస్మాత్తుగా జరగనున్నది. తారీఖు చెప్పడం జరగదు. విశ్వ వినాశనము యొక్క తారీఖైనా లేక మీ అంతిమ ఘడియ యొక్క తారీఖైనా చెప్పడం జరగదు. అంతా అకస్మాత్తుగా జరిగే ఆట, అందుకే దర్బారు పెట్టుకోండి - ఓ రాజుల్లారా, స్వరాజ్యాధికారి రాజుల్లారా, మీ దర్బారు పెట్టుకోండి. ఆర్డరులో నడిపించుకోండి ఎందుకంటే భవిష్యత్తులో లా అండ్ఆర్డర్ఉంటుంది అని గాయనము ఉంది. అక్కడ స్వతహాగానే ఉంటుంది. లవ్మరియు లా, రెండింటిలో బ్యాలెన్స్ఉంటుంది. స్వతహాగా ఉంటుంది. రాజు ఏమీ ఇది లా అని చెప్పి లా పాస్చేయరు. ఈ రోజుల్లో అందరూ లా తయారుచేస్తూ ఉంటారు. ఈ రోజుల్లోనైతే పోలీస్వారు కూడా లా తీసుకుంటున్నారు. కానీ అక్కడ లవ్మరియు లా యొక్క న్యాచురల్ బ్యాలెన్స్ఉంటుంది.

మరి ఇప్పుడు ఆల్మైటీ అథారిటీ (సర్వశక్తివాన్) అనే సీట్పై సెట్అయ్యి ఉండండి. అప్పుడు ఈ కర్మేంద్రియాలు, శక్తులు, గుణాలు అన్నీ మీ ఎదురుగా చిత్తం ప్రభూ! చిత్తం ప్రభూ! అంటూ హాజరవుతాయి. మోసం చేయవు. జీ హాజరు అంటాయి. మరి ఇప్పుడేమి చేస్తారు? మరుసటి స్మృతి దివసము నాడు ఏ సమారోహము జరుపుకుంటారు? ప్రతి జోన్వారూ సమారోహము జరుపుకుంటారు కదా. సన్మాన సమారోహాలు కూడా చాలా జరుపుకున్నారు. ఇప్పుడు సదా ప్రతి సంకల్పము మరియు సమయము యొక్క సఫలతా సమారోహాన్ని జరుపుకోండి. ఈ సమారోహాన్ని జరుపుకోండి. వ్యర్థము సమాప్తమవ్వాలి ఎందుకంటే మీరు సఫలతామూర్తిగా అయితే ఆత్మలకు తృప్తి యొక్క సఫలత లభిస్తుంది. నిరాశకు బదులుగా నలువైపులా శుభ ఆశల దీపాలు వెలుగుతాయి. దేనిలోనైనా సఫలత లభిస్తే దీపాలు వెలిగిస్తారు కదా! ఇప్పుడు విశ్వములో ఆశా దీపాలను వెలిగించండి. ప్రతి ఆత్మలో ఏదోక నిరాశ ఉండనే ఉంది, నిరాశల కారణముగా చింతలో ఉన్నారు, టెన్షన్ లో ఉన్నారు. కనుక ఓ అవినాశీ దీపాలూ, ఇప్పుడు ఆశల దీపాల యొక్క దీపావళి జరుపుకోండి. మొదట స్వయం, తర్వాత సర్వులు. విన్నారా!

ఇకపోతే బాప్ దాదా పిల్లల స్నేహాన్ని చూసి సంతోషిస్తున్నారు. స్నేహమనే సబ్జెక్టులో పర్సెంటేజ్ బాగుంది. మీరు ఇంత శ్రమ చేసి ఇక్కడికి ఎందుకు చేరుకున్నారు, మిమ్మల్ని తీసుకువచ్చింది ఎవరు? ట్రైన్ తీసుకువచ్చిందా లేక విమానము తీసుకువచ్చిందా లేక స్నేహము తీసుకువచ్చిందా? స్నేహమనే విమానము ద్వారా చేరుకున్నారు. కనుక స్నేహములోనైతే పాస్అయిపోయారు. ఇప్పుడు ఆల్మైటీ అథారిటీ స్థితిలో మాస్టర్ గా ఉండాలి, దానిలో పాస్అవ్వాలి, అప్పుడు ఈ ప్రకృతి, ఈ మాయ, ఈ సంస్కారాలు అన్నీ మీకు దాసీగా అయిపోతాయి. యజమాని ఏం ఆర్డర్ ఇస్తారు అని ప్రతి ఘడియ ఎదురు చూస్తుంటాయి! బ్రహ్మాబాబా కూడా యజమాని అయ్యి లోలోపలే ఎటువంటి సూక్ష్మ పురుషార్థము చేసారు, వారు సంపన్నముగా ఎలా అయ్యారో మీకు తెలిసిందా? పక్షి ఎగిరిపోయింది. పంజరము తెరుచుకుంది. సాకార ప్రపంచము యొక్క లెక్కాచారాలు, సాకార తనువు యొక్క పంజరము తెరుచుకుంది, పక్షి ఎగిరిపోయింది. ఇప్పుడు బ్రహ్మాబాబా కూడా ఎంతో ప్రేమతో పిల్లలను - త్వరగా రండి, త్వరగా రండి, ఇప్పుడే రండి, ఇప్పుడే రండి అని ఆహ్వానిస్తున్నారు. కనుక రెక్కలైతే లభించాయి కదా! ఇప్పుడు అందరూ ఒక సెకండులో మీ హృదయములో ఈ డ్రిల్చేయండి, ఇప్పుడిప్పుడే చేయండి, అన్ని సంకల్పాలను సమాప్తము చేయండి, ఇదే డ్రిల్చేయండి - ‘‘ఓ బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, మేము మీ సమానముగా అవ్యక్త రూపధారిగా ఇక అవ్వబోతున్నాము’’ (బాప్ దాదా డ్రిల్చేయించారు).

అచ్ఛా - నలువైపులా ఉన్న స్నేహీ సో సమర్థులైన పిల్లలకు, నలువైపులా ఉన్న స్వరాజ్యాధికారి సో విశ్వరాజ్యాధికారి పిల్లలకు, నలువైపులా ఉన్న మాస్టర్ఆల్మైటీ అథారటీ యొక్క సీట్పై సెట్అయ్యి ఉండే తీవ్ర పురుషార్థీ పిల్లలకు, సదా యజమానిగా అయ్యి ప్రకృతిని, సంస్కారాలను, శక్తులను, గుణాలను ఆర్డర్చేసే విశ్వ రాజ్యాధికారి పిల్లలకు, బాబా సమానముగా సంపూర్ణతను మరియు సంపన్నతను సమీపముగా తీసుకువచ్చే దేశ, విదేశాలలోని ప్రతి స్థానములో మూలమూలల్లో ఉండే పిల్లలకు సమర్థ దివసానికి బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఇప్పుడిప్పుడే బాప్ దాదాకు విశేషముగా ఎవరు గుర్తుకువస్తున్నారు? జనక్బచ్చీ. వారు ప్రత్యేకముగా సందేశము పంపారు - నేను సభలో తప్పకుండా హాజరవుతాను అని. కావున లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా మరియు భారత్ లోని వారందరికీ, ప్రతి దేశములోని పిల్లలందరికీ, ఒక్కొక్కరికీ పేరు మరియు విశేషత సహితముగా ప్రియస్మృతులు. మీకైతే సమ్ముఖముగానే ప్రియస్మృతులు లభిస్తున్నాయి కదా. అచ్ఛా.

ఈ రోజు మధుబన్వారిని కూడా గుర్తు చేసుకున్నాము. వీరు ముందు-ముందు కూర్చుంటారు కదా. మధుబన్వారు చేతులెత్తండి. మధుబన్భుజాలందరూ చేతులెత్తండి. మధుబన్ వారికి విశేషముగా త్యాగము యొక్క భాగ్యము సూక్ష్మముగా ప్రాప్తిస్తుంది ఎందుకంటే ఉండేది పాండవ్ భవన్ లో, మధుబన్ లో, శాంతివన్ లో, కానీ మిలనము వారికి అవకాశము లభిస్తుంది, మధుబన్ వారు సాక్షీగా అయి చూస్తుంటారు. కానీ మనసులో సదా మధుబన్ వారు గుర్తు ఉన్నారు. ఇప్పుడు మధుబన్నుండి వేస్ట్యొక్క నామ-రూపాలు సమాప్తమవ్వాలి. సేవలో, స్థితిలో అన్నింటిలోనూ మహాన్ గా ఉండాలి. సరేనా! మధుబన్ వారిని మర్చిపోము కానీ మధుబన్ వారికి త్యాగము చేసేందుకు ఛాన్స్ ఇస్తాము. అచ్ఛా.

వరదానము:-
మస్తకము ద్వారా సంతుష్టతా ప్రకాశము యొక్క మెరుపును చూపించే సాక్షాత్కారమూర్త భవ

ఎవరైతే సదా సంతుష్టముగా ఉంటారో, వారి మస్తకము నుండి సంతుష్టతా యొక్క మెరుపు సదా ప్రకాశిస్తూ ఉంటుంది, వారిని ఒకవేళ ఎవరైనా ఉదాసీన ఆత్మలు చూస్తే, వారు కూడా సంతోషపడతారు, వారి ఉదాసీనత దూరమైపోతుంది. ఎవరి వద్దనైతే సంతుష్టత యొక్క సంతోషపు ఖజానా ఉంటుందో, వారి వెనుక స్వతహాగానే అందరూ ఆకర్షితులవుతారు. వారి సంతోషమయమైన ముఖము చైతన్యమైన బోర్డులా అవుతుంది, అది అనేక ఆత్మలను తయారుచేసేవారి యొక్క పరిచయాన్ని ఇస్తుంది. కావున ఈ విధంగా సంతుష్టముగా ఉండే మరియు సర్వులను సంతుష్టపరిచే సంతుష్టమణులుగా అవ్వండి, తద్వారా అనేకులకు సాక్షాత్కారము జరుగుతుంది.

స్లోగన్:-
దెబ్బ వేసేవారి పని దెబ్బ వేయడము మరియు మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవడము.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ఏ విధంగా కొబ్బరికాయ కొట్టి ఉద్ఘాటన చేస్తారో, రిబ్బన్ కట్ చేసి ఉద్ఘాటన చేస్తారో, అలాగే ఒకే మతము, ఒకే బలము, ఒకే నమ్మకము మరియు ఏకత యొక్క రిబ్బన్ ను కట్ చేయండి మరియు సర్వుల సంతుష్టత మరియు ప్రసన్నత అనే కొబ్బరికాయను కొట్టండి. ఆ నీటిని ధరణిలో వేయండి, అప్పుడు సఫలత ఎంత లభిస్తుందో చూడండి.