‘‘ఈ సంవత్సరాన్ని విశేషముగా జీవన్ముక్త సంవత్సరము
రూపములో జరుపుకోండి, ఏకత మరియు ఏకాగ్రతతో బాబా యొక్క
ప్రత్యక్షత చెయ్యండి’’
ఈ రోజు స్నేహ సాగరుడు నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలను
చూస్తున్నారు. బాబాకు కూడా పిల్లల పట్ల హృదయపూర్వకమైన అవినాశీ
స్నేహము ఉంది మరియు పిల్లలకు కూడా హృదయాభిరాముడైన బాబా పట్ల
హృదయపూర్వకమైన స్నేహము ఉంది. ఈ పరమాత్మ స్నేహము, హృదయపూర్వకమైన
స్నేహము కేవలము బాబాకు మరియు బ్రాహ్మణ పిల్లలకే తెలుసు.
పరమాత్మ స్నేహానికి పాత్రులు కేవలము బ్రాహ్మణ ఆత్మలైన మీరే.
భక్త ఆత్మలు పరమాత్మ ప్రేమ కొరకు దాహార్తులై ఉన్నారు, పిలుస్తూ
ఉన్నారు. భాగ్యవాన్ బ్రాహ్మణ ఆత్మలైన మీరు ఆ ప్రేమను ప్రాప్తి
చేసుకోవడానికి పాత్రులు. పిల్లలకు బాబా పట్ల విశేషమైన ప్రేమ
ఎందుకు ఉంది అనేది బాప్ దాదాకు తెలుసు, ఎందుకంటే ఈ సమయములోనే
సర్వ ఖజానాల యజమాని ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయి. ఈ
ఖజానాలు కేవలము ఇప్పటి ఈ ఒక్క జన్మకు మాత్రమే ఉండవు కానీ అనేక
జన్మల వరకు ఈ అవినాశీ ఖజానాలు మీతో పాటు ఉంటాయి. బ్రాహ్మణ
ఆత్మలైన మీరు ప్రపంచములోని వారిలా ఖాళీ చేతులతో వెళ్ళరు, సర్వ
ఖజానాలు మీతో పాటు ఉంటాయి. మరి ఇటువంటి అవినాశీ ఖజానాల ప్రాప్తి
యొక్క నషా ఉంటుంది కదా! మరియు పిల్లలందరూ అవినాశీ ఖజానాలను జమ
చేసుకున్నారు కదా! జమ యొక్క నషా, జమ యొక్క సంతోషము కూడా సదా
ఉంటాయి. ప్రతి ఒక్కరి ముఖముపై ఖజానాల జమ యొక్క మెరుపు
కనిపిస్తుంది. ఏ ఖజానాలు బాబా ద్వారా ప్రాప్తించాయి అనేది
తెలుసు కదా? ఎప్పుడైనా మీ జమ ఖాతాను చెక్ చేసుకుంటున్నారా? బాబా
అయితే పిల్లలందరికీ ప్రతి ఒక్క ఖజానాను తరగనంతగా ఇస్తారు.
కొందరికి కొంచెము, కొందరికి ఎక్కువ ఇవ్వరు. పిల్లలు ప్రతి
ఒక్కరూ తరగని, అఖండమైన, అవినాశీ ఖజానాలకు యజమానులు. బాలకులుగా
అవ్వటము అనగా ఖజానాలకు యజమానులుగా అవ్వటము. కనుక ఇమర్జ్
చేసుకోండి, ఎన్ని ఖజానాలను బాప్ దాదా ఇచ్చారు.
అన్నింటికన్నా మొదటి ఖజానా - జ్ఞాన ధనము, మరి అందరికీ జ్ఞాన
ధనము లభించిందా? లభించిందా లేక లభించాలా? అచ్ఛా - జమ కూడా అయి
ఉందా? లేక కొంచెం జమ అయ్యింది, కొంచెం పోయిందా? జ్ఞాన ధనము అనగా
వివేకవంతులుగా అయ్యి, త్రికాలదర్శులుగా అయ్యి కర్మలు చెయ్యటము.
జ్ఞాన సంపన్నులుగా అవ్వటము. పూర్తి జ్ఞానాన్ని మరియు మూడు
కాలాల జ్ఞానాన్ని అర్థం చేసుకుని జ్ఞాన ధనాన్ని కార్యములో
వినియోగించడము. ఈ జ్ఞాన ఖజానాను ప్రత్యక్ష జీవితములో, ప్రతి
కార్యములో ఉపయోగించటము ద్వారా విధి ద్వారా సిద్ధి లభిస్తుంది -
దీని ద్వారా అనేక బంధనాల నుండి ముక్తి మరియు జీవన్ముక్తి
లభిస్తుంది. అనుభవము చేస్తున్నారా? సత్యయుగములోనే జీవన్ముక్తి
లభిస్తుందని కాదు, ఇప్పుడు కూడా ఈ సంగమయుగ జీవితములో కూడా అనేక
హద్దు బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. జీవితము బంధనముక్తిగా
అవుతుంది. ఎన్ని బంధనాల నుండి ఫ్రీ అయిపోయారో తెలుసు కదా! ఎన్ని
రకాల అయ్యో అయ్యో అనేవాటి నుండి విముక్తులైపోయారు! మరియు సదా
కొరకు అయ్యో అయ్యో అనేవాటిని సమాప్తము చేసి, వాహ్-వాహ్ అనే
పాటలను పాడుతూ ఉంటారు. ఒకవేళ ఏ విషయములోనైనా, ఏ కొంచెమైనా, నోటి
నుండే కాదు, కనీసము సంకల్పమాత్రముగానైనా, స్వప్నమాత్రముగానైనా...
అయ్యో అనేది మనసులో వచ్చిందంటే జీవన్ముక్తులుగా లేనట్లు. వాహ్!
వాహ్! వాహ్! ఇలా ఉన్నారా? మాతలూ, అయ్యో, అయ్యో అనైతే అనటము లేదు
కదా? అనటము లేదా? అప్పుడప్పుడు అంటున్నారా? పాండవులు అంటున్నారా?
నోటి నుండి అనకపోయినా కానీ మనసులో సంకల్పమాత్రముగానైనా ఒకవేళ ఏ
విషయములోనైనా అయ్యో అనేది ఉన్నట్లయితే ఎగరలేరు. అయ్యో అనగా
బంధనము మరియు ఎగరటము, ఎగిరే కళ అనగా జీవన్ముక్త్, బంధనముక్త్.
కనుక చెక్ చేసుకోండి ఎందుకంటే బ్రాహ్మణ ఆత్మలు ఎప్పటివరకైతే
స్వయం బంధనముక్తులుగా అవ్వరో, ఏ రకమైన బంగారము లేక వజ్రాలకు
సంబంధించిన రాయల్ బంధనము అనే తాడుతో బంధింపబడి ఉన్నట్లయితే,
సర్వ ఆత్మల కొరకు ముక్తి ద్వారము తెరుచుకోలేదు. మీరు
బంధనముక్తులుగా అవ్వటముతో సర్వాత్మల కొరకు ముక్తి గేట్
తెరుచుకుంటుంది. కనుక గేట్ ను తెరిచే మరియు సర్వాత్మలను దుఃఖము,
అశాంతి నుండి ముక్తులుగా చేసే బాధ్యత మీపై ఉంది.
కనుక చెక్ చేసుకోండి - మీ బాధ్యతను ఎంతవరకు నిర్వర్తించారు?
మీరందరూ బాప్ దాదాతో పాటు విశ్వ పరివర్తనా కార్యాన్ని చేసే
కాంట్రాక్ట్ చేపట్టారు. మీరు కాంట్రాక్టరులు, బాధ్యత కలవారు.
ఒకవేళ బాబా కావాలనుకుంటే అన్నీ చెయ్యగలరు కానీ బాబాకు పిల్లలపై
ప్రేమ ఉంది, వారు ఒంటరిగా చెయ్యాలనుకోరు, బాబా అవతరించగానే
పిల్లలైన మిమ్మల్నందరినీ వారితో పాటే అవతరింపజేసారు.
శివరాత్రిని జరుపుకున్నారు కదా! ఎవరిది జరుపుకున్నారు? కేవలము
బాప్ దాదాది మాత్రమే జరుపుకున్నారా? మీ అందరిదీ కూడా
జరుపుకున్నారు కదా! మీరు బాబాకు ఆది నుండి అంతిమము వరకు సహచరులు.
ఆది నుండి అంతిమము వరకు మేము సహచరులము అన్న నషా ఉందా? మీరు
భగవంతునికి సహచరులు.
మరి బాప్ దాదా ఇప్పుడు ఈ సంవత్సరము యొక్క సీజన్ అంతిమ
పాత్రను పోషించటములో పిల్లలందరి నుండి దీనిని కోరుకుంటారు, ఏం
కోరుకుంటున్నారో చెప్పమంటారా? చెయ్యాల్సి ఉంటుంది. కేవలము
వినటము కాదు, చెయ్యాల్సి ఉంటుంది. టీచర్లూ, సరేనా? టీచర్లు
చేతులెత్తండి. టీచర్లు విసనకర్రలు కూడా ఊపుతున్నారు, వేడిగా
అనిపిస్తుంది. అచ్ఛా, టీచర్లందరూ చేస్తారా, చేయిస్తారా?
చేయిస్తారా, చేస్తారా? అచ్ఛా. గాలి కూడా తగులుతుంది, చేతులు
కూడా ఊపుతున్నారు. దృశ్యము బాగా అనిపిస్తుంది. చాలా మంచిది.
బాప్ దాదా ఈ సీజన్ యొక్క సమాప్తి సమారోహములో ఒక్క కొత్త రకమైన
దీపావళిని జరపాలనుకుంటున్నారు. అర్థమైందా! ఒక కొత్త రకమైన
దీపావళిని జరపాలనుకుంటున్నారు. మరి మీరందరూ అటువంటి దీపావళిని
జరుపుకోవటానికి సిద్ధముగా ఉన్నారా? ఎవరైతే సిద్ధముగా ఉన్నారో
వారు చేతులెత్తండి. ఊరికే అలా సరే అని అనవద్దు. బాప్ దాదాను
సంతోషపరిచేందుకు చేతులెత్తవద్దు, మనస్ఫూర్తిగా ఎత్తండి. అచ్ఛా.
బాప్ దాదా తమ హృదయములోని ఆశలను సంపన్నము చేసే దీపాలను వెలిగి
ఉన్నట్లుగా చూడాలని కోరుకుంటున్నారు. కనుక బాప్ దాదా ఆశల దీపాల
దీపావళిని జరపాలని కోరుకుంటున్నారు. ఎటువంటి దీపావళిని
జరపాలనుకుంటున్నారో అర్థమైందా? స్పష్టమైందా?
బాప్ దాదా ఆశల దీపాలు అంటే ఏమిటి? ముందు సంవత్సరము నుండి ఈ
సంవత్సరము వరకు ఈ సీజన్ పూర్తయిపోయింది. బాప్ దాదా చెప్పారు
మరియు మీరందరూ సంకల్పము కూడా చేసారు, గుర్తుందా? కొందరు ఆ
సంకల్పాన్ని కేవలము సంకల్పము వరకే పూర్తి చేసారు, కొందరు
సంకల్పాన్ని సగం పూర్తి చేసారు మరియు కొందరు ఆలోచిస్తారు కానీ
ఆలోచన, ఆలోచన వరకే ఉంది. ఆ సంకల్పము ఏమిటి? అది కొత్త విషయమేమీ
కాదు, పాత విషయమే - స్వ పరివర్తన ద్వారా సర్వుల పరివర్తన.
విశ్వము యొక్క విషయాన్ని వదిలేయండి, కానీ బాప్ దాదా - స్వ
పరివర్తన ద్వారా బ్రాహ్మణ పరివారము యొక్క పరివర్తన అన్నదానిని
చూడాలనుకుంటున్నారు. ఇలా ఉంటే ఇది అవుతుంది, వీరు మారితే నేను
మారుతాను, వీరు చేస్తే నేను చేస్తాను... ఇప్పుడు ఇటువంటివి
వినాలనుకోవటము లేదు. ఇందులో విశేషముగా ప్రతి బిడ్డకు
బ్రహ్మాబాబా విశేషముగా చెప్తున్నారు - నా సమానముగా హే అర్జున్
గా అవ్వండి. ఇందులో ‘ముందు నేను’. ముందు వారు అని కాదు, ముందు
నేను. ఇటువంటి ‘‘నేను’’ అనేది కళ్యాణకారీ అయినది. మిగిలిన
హద్దులోని నేను, నేను అనేవన్నీ కింద పడేస్తాయి. ఇందులో - ఎవరైతే
తమకు తాముగా ముందుకు వచ్చి బాధ్యతను స్వీకరిస్తారో వారే
అర్జునులు అనే సామెత ఉంది కదా, అక్కడ అర్జున్ అనగా నంబర్ వన్.
నంబరువారు కాదు, నంబర్ వన్. మరి మీరు రెండవ నంబరువారుగా
అవ్వాలనుకుంటున్నారా లేక నంబర్ వన్ గా అవ్వాలనుకుంటున్నారా?
చాలా కార్యాలలో బాప్ దాదా చూసారు - నవ్వు వచ్చే విషయమే,
పరివారము యొక్క విషయము వినిపిస్తాము. పరివారము కూర్చుని ఉంది
కదా! ఏవైనా అటువంటి పనులు ఉన్నప్పుడు బాప్ దాదా వద్దకు
సమాచారాలు వస్తాయి. కొన్ని కార్యాలు, కొన్ని ప్రోగ్రాములు ఎలా
ఉంటాయంటే అవి కేవలము విశేష ఆత్మల నిమిత్తమే ఉంటాయి. బాప్ దాదా
వద్దకు, దాదీల వద్దకు సమాచారాలు వస్తుంటాయి ఎందుకంటే సాకారములో
అయితే దాదీలు ఉన్నారు. బాప్ దాదా వద్దకైతే సంకల్పాలు
చేరుకుంటాయి. ఎటువంటి సంకల్పాలు చేరుకుంటాయి? నా పేరు కూడా
ఇందులో ఉండాలి, నేనేమన్నా తక్కువా! నా పేరు ఎందుకు లేదు!
అప్పుడు బాబా ఏమంటారంటే - హే అర్జున్ (బాధ్యత తీసుకునే)
విషయములో మీ పేరు ఎందుకు లేదు! ఉండాలి కదా! లేక ఉండాల్సిన
అవసరము లేదా? ఉండాలా? ఎదురుగా మహారథులు కూర్చుని ఉన్నారు,
ఉండాలి కదా! ఉండాలా? మరి బ్రహ్మాబాబా ఏదైతే చేసి చూపించారో,
అందులో ఎవ్వరినీ చూడలేదు, వీరు చెయ్యరు, వారు చెయ్యరు అని
అనుకోలేదు. ముందు నేను. ఈ ‘నేను’ అనేదానిలో అనేక రకాల రాయల్
రూపాల నేను అనేవి ఏవైతే ఉంటాయో, వాటిని ఇంతకుముందు వినిపించాము
కదా, ఈ ‘నేను’ అనేదానిలో అవన్నీ సమాప్తమైపోతాయి. ఈ సీజన్ యొక్క
సమాప్తిలో బాప్ దాదా యొక్క ఆశలు ఏమిటంటే - పిల్లలు ప్రతి ఒక్కరూ
ఎవరైతే బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలుగా చెప్పుకుంటున్నారో,
అంగీకరిస్తున్నారో, తెలుసుకున్నారో, ఆ ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ
సంకల్పములో కూడా ఏవైతే హద్దు యొక్క బంధనాలు ఉన్నాయో, ఆ బంధనాల
నుండి కూడా విముక్తులవ్వాలి. బ్రహ్మాబాబా సమానముగా
బంధనముక్తులుగా, జీవన్ముక్తులుగా అవ్వాలి. బ్రాహ్మణ
జీవిన్ముక్తులుగా అవ్వాలి, సాధారణ జీవన్ముక్తులుగా కాదు,
బ్రాహ్మణ శ్రేష్ఠ జీవన్ముక్తులుగా ఈ విశేష సంవత్సరాన్ని
జరుపుకోవాలి. ప్రతి ఒక్క ఆత్మకు తన సూక్ష్మ బంధనాల గురించి తనకు
ఎంతగా తెలుసో, అంతగా ఇతరులు తెలుసుకోలేరు. బాప్ దాదాకైతే తెలుసు
ఎందుకంటే బాప్ దాదా వద్దనైతే టి.వి. ఉంది, మనసుకు చెందిన టి.వి.,
శరీరానికి చెందిన టి.వి. కాదు, మనసుకు చెందిన టి. వి. మరి
ఇప్పుడు మళ్ళీ సీజన్ ఉంటుంది కదా, సీజన్ ఉంటుందా లేక సెలవు
ఇమ్మంటారా? ఒక సంవత్సరము సెలవు ఇమ్మంటారా? వద్దా? ఒక
సంవత్సరమైతే సెలవు ఉండాలా? ఉండకూడదా? పాండవులూ, ఒక సంవత్సరము
సెలవు ఇమ్మంటారా? (దాదీజీ అంటున్నారు, నెలలో 15 రోజులు సెలవు)
అచ్ఛా. చాలా మంచిది, అందరూ చెప్తున్నారు. ఎవరైతే సెలవు వద్దు
అని అంటున్నారో వారు చేతులెత్తండి. సెలవు వద్దా? మంచిది. పైన
గ్యాలరీలో ఉన్నవారు చేతులు ఊపటం లేదు. (మొత్తం సభ అంతా చేతులు
ఊపింది). చాలా మంచిది. బాబా అయితే సదా పిల్లలకు హాజీ, హాజీ అని
అంటారు, అంతేనా. మరి ఇప్పుడు బాబాకు పిల్లలు ఎప్పుడు హాజీ అని
అంటారు! బాబా చేత హాజీ అనిపించారు. మరి బాబా అంటున్నారు, బాబా
కూడా ఇప్పుడు ఒక షరతు పెడుతున్నారు, ఆ షరతుకు అంగీకారమేనా?
అందరూ హాజీ అనైతే అనండి. పక్కా? కొంచెము కూడా పెడచెవిన పెట్టరు
కదా? ఇప్పుడు అందరి ముఖాలను టి.వి.లో చూపించండి. మంచిది.
పిల్లలందరూ హాజీ, హాజీ అని అనేవారని బాబాకు కూడా సంతోషము
కలుగుతుంది.
బాప్ దాదా ఏం కోరుకుంటున్నారంటే - ఈ కారణము ఉంది, ఈ కారణము
ఉంది, అందుకే ఈ బంధనముంది... అని కారణాలేవీ చెప్పకూడదు. సమస్యగా
కాదు, సమాధాన స్వరూపులుగా అవ్వాలి మరియు సహచరులను కూడా
తయారుచెయ్యాలి ఎందుకంటే సమయము యొక్క పరిస్థితి చూస్తున్నారు.
భ్రష్టాచారపు మాటలు ఎంతగా పెరుగుతూ ఉన్నాయి. భ్రష్టాచారము,
అత్యాచారము అతిలోకి వెళ్తున్నాయి. కనుక శ్రేష్ఠాచారము యొక్క
జెండా ముందుగా ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క మనసులో ఎగరాలి,
అప్పుడు విశ్వములో ఎగురుతుంది. ఎన్ని శివరాత్రులను
జరుపుకున్నారు! ప్రతి శివరాత్రికి - విశ్వములో బాబా జెండాను
ఎగురవేయాలి అని ఇదే సంకల్పము చేస్తారు. విశ్వములో ఈ ప్రత్యక్షతా
జెండాను ఎగరవేసే కన్నా ముందు బ్రాహ్మణులు ప్రతి ఒక్కరూ తమ
మనసులో సదా తమ హృదయ సింహాసనముపై బాబా జెండాను ఎగరవేయాల్సి
ఉంటుంది. ఈ జెండాను ఎగురవేసేందుకు కేవలము రెండు పదాలను ప్రతి
కర్మలోకి తీసుకురావలసి ఉంటుంది. కర్మలోకి తీసుకురావాలి,
సంకల్పములోకో, బుద్ధిలోకో కాదు. మనసులోకి, కర్మలోకి,
సంబంధములోకి, సంపర్కములోకి తీసుకురావలసి ఉంటుంది. అవి కష్టమైన
పదాలేమీ కాదు, మామూలు పదాలే. అవేమిటంటే - ఒకటి - సర్వ
సంబంధ-సంపర్కాలలో పరస్పరము ఏకత. అనేక సంస్కారాలు ఉన్నప్పటికీ
అనేకతలో ఏకత ఉండాలి. మరియు రెండవది - ఏవైతే శ్రేష్ఠ సంకల్పాలు
చేస్తారో, అవి బాప్ దాదాకు చాలా మంచిగా అనిపిస్తాయి. మీరు
సంకల్పాలు చేస్తారు కదా, అప్పుడు బాప్ దాదా ఆ సంకల్పాలు చూసి,
విని, చాలా సంతోషిస్తారు. వాహ్! వాహ్! పిల్లలూ వాహ్! వాహ్!
శ్రేష్ఠ సంకల్పము వాహ్! అని అంటారు. కానీ, కానీ... అనేది
వచ్చేస్తుంది. రాకూడదు కానీ వచ్చేస్తుంది. సంకల్పాల అనేవి
మెజారిటీ, మెజారిటీ అనగా 90 శాతము సంకల్పాలు అనేవి చాలామంది
పిల్లలవి చాలా మంచిగా ఉంటాయి. ఈ రోజు ఈ బిడ్డ సంకల్పము చాలా
బాగుంది, ఉన్నతిలోకి వెళ్తారు అని బాప్ దాదా భావిస్తారు కానీ
మాటలలోకి వచ్చేసరికి సగం తగ్గిపోతుంది, కర్మలలోకి వచ్చేసరికి
మూడు వంతులు తగ్గిపోతుంది, మిక్స్ అయిపోతుంది. దీనికి
కారణమేమిటి? సంకల్పములో ఏకాగ్రత, దృఢత లేదు. ఒకవేళ సంకల్పములో
ఏకాగ్రత ఉన్నట్లయితే ఏకాగ్రత సఫలతకు సాధనము. దృఢత సఫలతకు సాధనము.
అందులో తేడా వచ్చేస్తుంది. దానికి కారణమేమిటి? ఒకటే విషయాన్ని
బాప్ దాదా రిజల్టులో చూసారు, అదేమిటంటే, ఇతరుల వైపు ఎక్కువగా
చూస్తారు. మీరు చెప్తూ ఉంటారు కదా, (బాప్ దాదా ఒక వేలును
ముందుకు పెట్టి చూపించారు) వేలు ఇలా పెట్టినప్పుడు ఒక వేలు
ఇతరుల వైపుకు ఉంటే, నాలుగు వేళ్ళు మీ వైపుకు ఉంటాయి. నాలుగు
వేళ్ళను చూడరు, ఒక వేలునే చాలా ఎక్కువ చూస్తారు, అందుకే దృఢత
మరియు ఏకాగ్రత, ఏకత చలించిపోతాయి. వీరు చేస్తే నేను చేస్తాను,
ఇందులో అర్జునుడిగా అవుతారు, అందులోనేమో రెండవ నంబరువారిగా
అవుతారు. లేదంటే మీ స్లోగన్ ను మార్చేయండి. స్వ పరివర్తనతో
విశ్వ పరివర్తన అన్నదానికి బదులుగా విశ్వ పరివర్తనతో స్వ
పరివర్తన, ఇతరుల పరివర్తనతో స్వ పరివర్తన అని మార్చేయండి.
మార్చమంటారా? మార్చమంటారా? మార్చ వద్దా? మరి అటువంటప్పుడు బాప్
దాదా కూడా ఒక షరతును పెడతారు, అంగీకారమేనా, చెప్పమంటారా? బాప్
దాదా 6 నెలల్లో రిజల్టును చూస్తారు, అప్పుడు వస్తారు, లేదంటే
రారు. బాబా హాజీ అని అన్నప్పుడు, మరి పిల్లలు కూడా హాజీ అనాలి
కదా! ఏమి జరిగినా సరే, బాప్ దాదా అయితే అంటారు, స్వ పరివర్తన
కొరకు ఈ హద్దు యొక్క మైపన్ (నేను అన్న భావన) నుండి మరణించాల్సి
ఉంటుంది, మైపన్ నుండి మరణించాలి, శరీరముతో మరణించడము కాదు.
శరీరముతో మరణించడము కాదు, మైపన్ (నేను అన్న భావన) నుండి
మరణించాలి. నేను రైట్, నేను ఇది, నేనేమైనా తక్కువా, నేను కూడా
సర్వస్వము, ఈ నేను అన్నదాని నుండి మరణించాలి. కావున మరణించవలసి
వచ్చినా కానీ ఈ మృత్యువు చాలా మధురమైన మృత్యువు. ఇది మరణించడము
కాదు, 21 జన్మలు రాజ్య భాగ్యములో జీవించడము. మరి అంగీకారమేనా?
టీచర్లూ అంగీకారమేనా? డబుల్ విదేశీయులు? డబుల్ విదేశీయులు ఏ
సంకల్పమునైతే చేస్తారో, అది చేయడములో ధైర్యము పెట్టుకుంటారు,
ఇది వారి విశేషత. భారతవాసులు ట్రిపుల్ (మూడు రెట్లు) ధైర్యము
కలవారు. వారు డబుల్ అయితే వీరు ట్రిపుల్. కావున బాప్ దాదా ఇదే
చూడాలనుకుంటున్నారు. అర్థమైందా! బాప్ దాదా ఈ శ్రేష్ఠ ఆశల
దీపాన్ని, ప్రతి బిడ్డలో వెలుగుతూ ఉండటాన్ని చూడాలని
కోరుకుంటారు. ఇప్పుడు ఈ సారి ఈ దీపావళిని జరుపుకోండి. 6 నెలల
తర్వాతైనా జరుపుకోండి. బాప్ దాదా ఈ దీపావళి సమారోహాన్ని చూసిన
తర్వాత తమ ప్రోగ్రామ్ ను ఇస్తారు. చెయ్యటమైతే చెయ్యాల్సిందే.
మీరు చెయ్యకపోతే వెనక వచ్చేవారు చేస్తారా ఏమిటి! మాల అయితే మీదే
కదా! 16108 మాలలోకైతే పాతవారైన మీరే వచ్చేది ఉంది కదా.
కొత్తవారైతే వెనుక-వెనుక వస్తారు. అయితే, కొంతమంది లాస్ట్ సో
ఫాస్ట్ వస్తారు. కొందరు లాస్ట్ లో వచ్చినా ఫాస్ట్ గా వెళ్తారు,
ఫస్ట్ వస్తారు. కానీ కొద్దిమందే అలా ఉంటారు. ఇక మిగిలింది మీరే.
మీరే ప్రతి కల్పము తయారయ్యారు, మీరే తయారయ్యేది ఉంది. ఎక్కడ
కూర్చుని ఉన్నా కానీ, విదేశాలలో కూర్చుని ఉన్నా, దేశములో
కూర్చుని ఉన్నా కానీ, మీలో ఎవరైతే బహుకాలము బట్టి పక్కా
నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో వారు తప్పకుండా అధికారులే. బాప్
దాదా కు ప్రేమ ఉంది కదా, కావున ఎవరైతే బహుకాలము బట్టి మంచి
పురుషార్థులో, సంపూర్ణ పురుషార్థులు కాకపోయినా ఎవరైత మంచి
పురుషార్థులుగా ఉన్నారో, వారిని బాప్ దాదా వదిలి వెళ్ళరు,
తమతోపాటు తీసుకువెళ్తారు. అందుకే పక్కా నిశ్చయము పెట్టుకోండి -
మేమే అలా ఉండేవారము, మేమే అలా ఉన్నాము, మేమే వారితో పాటు ఉంటాము.
సరేనా? పక్కాయేనా? కేవలము శుభ చింతకులుగా ఉండండి, శుభ చింతన,
శుభ భావన, పరివర్తన భావన, సహయోగము ఇచ్చే భావన, దయాహృదయ భావన,
వీటిని ఇమర్జ్ చెయ్యండి. ఇప్పుడు మర్జ్ చేసి పెట్టుకున్నారు,
వాటిని ఇమర్జ్ చెయ్యండి. శిక్షణ ఎక్కువ ఇవ్వకండి, క్షమించండి.
ఇతరులకు శిక్షణ ఇవ్వటములో అందరూ తెలివైనవారే, కానీ క్షమతోపాటు
శిక్షణను ఇవ్వండి. మురళిని వినిపించే విషయములో, కోర్సు చెప్పే
విషయములో లేక మీరు ఏవైతే ప్రోగ్రాములు చేస్తారో, వాటికి
సంబంధించి శిక్షణను ఇవ్వండి కానీ పరస్పరము కార్య-వ్యవహారాలలోకి
వచ్చినప్పుడు క్షమతోపాటుగా శిక్షణను ఇవ్వండి. కేవలము శిక్షణను
ఇవ్వకండి, దయాహృదయులుగా అయ్యి శిక్షణను ఇచ్చినట్లయితే మీరు
చూపించే దయ ఎలా పని చేస్తుందంటే దాని వలన ఇతరులలోని బలహీనత
క్షమించబడుతుంది. అర్థమైందా. అచ్ఛా!
ఇప్పుడు ఒక్క క్షణములో మనసుకు యజమానిగా అయ్యి మనసును ఎంత
సమయము కావాలంటే అంత సమయము ఏకాగ్రము చెయ్యగలరా? చెయ్యగలరా? అయితే
ఇప్పుడు ఈ ఆత్మిక ఎక్సర్ సైజ్ ను చెయ్యండి. పూర్తిగా మనసులో
ఏకాగ్రత ఉండాలి. సంకల్పములో కూడా అలజడి ఉండకూడదు. అచలముగా
ఉండాలి. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ అవినాశీ అఖండ ఖజానాల యజమానులకు, సదా
సంగమయుగీ శ్రేష్ఠ బంధనముక్త, జీవన్ముక్త స్థితిలో స్థితులై
ఉండేవారికి, సదా బాప్ దాదా యొక్క ఆశలను సంపన్నము చేసేవారికి,
సదా ఏకత మరియు ఏకాగ్రతా శక్తి సంపన్నులైన మాస్టర్ సర్వ
శక్తివాన్ ఆత్మలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.
నలువైపులా దూరములో కూర్చుని ఉన్న పిల్లలకు, ఎవరైతే
ప్రియస్మృతులను పంపించారో, ఉత్తరాలు పంపించారో, వారికి కూడా
బాప్ దాదా చాలా చాలా హృదయపూర్వకమైన ప్రేమతోపాటు ప్రియస్మృతులను
ఇస్తున్నారు. అలాగే చాలామంది పిల్లలు మధుబన్ యొక్క
రిఫ్రెష్మెంట్ కు చెందిన చాలా మంచి-మంచి ఉత్తరాలను పంపారు, ఆ
పిల్లలకు కూడా విశేష ప్రియస్మృతులు మరియు నమస్తే.