09-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ప్రతి ఒక్కరి నాడిని చూసి మొదట వారికి
అల్ఫ్ (భగవంతుడి) పై నిశ్చయమును కలిగించండి, ఆ తర్వాత ముందుకు వెళ్ళండి, అల్ఫ్ (భగవంతుడి)
పై నిశ్చయము లేకుండా జ్ఞానము ఇవ్వడమంటే సమయాన్ని వ్యర్థము చేయడమే’’
ప్రశ్న:-
ఏ ఒక్క
ముఖ్యమైన పురుషార్థము స్కాలర్షిప్ తీసుకునేందుకు అధికారులుగా తయారుచేస్తుంది?
జవాబు:-
అంతర్ముఖత.
మీరు చాలా అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రి అయితే కళ్యాణకారి. కళ్యాణము కొరకే సలహా
ఇస్తారు. అంతర్ముఖీ యోగీ పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడూ దేహాభిమానములోకి వచ్చి
అలగడము లేదా గొడవ పడడము చేయరు. వారి నడవడిక చాలా రాయల్ గా, హుందాగా ఉంటుంది. వారు
చాలా తక్కువగా మాట్లాడుతారు, యజ్ఞ సేవలో అభిరుచి కలిగి ఉంటారు. వారు జ్ఞానము
ఎక్కువగా మాట్లాడుతూ, మాట్లాడుతూ ఉండరు, స్మృతిలో ఉంటూ సేవ చేస్తారు.
ఓంశాంతి
చాలా వరకు గమనించడం జరిగింది, అలాగే ప్రదర్శనీ సేవ యొక్క సమాచారము కూడా వస్తుంటుంది,
అదేమిటంటే, ముఖ్యమైన విషయమైన తండ్రి పరిచయముపై పూర్తి నిశ్చయము కూర్చోబెట్టకపోతే ఇక
మిగిలినది ఏదైతే అర్థం చేయిస్తూ ఉంటారో, అది ఎవరి బుద్ధిలోనైనా కూర్చోవడము కష్టము.
బాగుంది, బాగుంది అని అంటారు కానీ తండ్రి పరిచయము లేదు. మొదటైతే తండ్రి పరిచయము
ఉండాలి. తండ్రి మహావాక్యాలు ఏమిటంటే - నన్ను స్మృతి చేయండి, నేనే పతిత-పావనుడను.
నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. ఇది ముఖ్యమైన
విషయము. భగవంతుడు ఒక్కరే, వారే పతిత-పావనుడు. వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. వారే
ఉన్నతోన్నతమైనవారు. ఈ నిశ్చయము ఏర్పడినట్లయితే ఇక భక్తి మార్గము యొక్క శాస్త్రాలు,
వేదాలు మరియు గీతా, భాగవతము మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖండితమైపోతాయి. భగవంతుడే
స్వయంగా చెప్తున్నారు - వీటిని నేను వినిపించలేదు, నేను ఇచ్చిన జ్ఞానము శాస్త్రాలలో
లేదు. అది భక్తి మార్గపు జ్ఞానము. నేనైతే జ్ఞానాన్ని ఇచ్చి సద్గతిని కలిగించి
వెళ్ళిపోతాను. ఇక తర్వాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. జ్ఞానము యొక్క ప్రారబ్ధము
పూర్తి అయిన తర్వాత మళ్ళీ భక్తి మార్గము ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే తండ్రిపై
నిశ్చయము కూర్చుంటుందో అప్పుడు, భగవానువాచ - ఇవి భక్తి మార్గపు శాస్త్రాలు అని అర్థం
చేసుకుంటారు. జ్ఞానము మరియు భక్తి సగం-సగం సమయము నడుస్తాయి. భగవంతుడు ఎప్పుడైతే
వస్తారో అప్పుడు వారి పరిచయాన్ని ఇస్తారు - ఇది ఐదు వేల సంవత్సరాల కల్పము అని నేను
చెప్తున్నాను, నేను బ్రహ్మా ముఖము ద్వారా అర్థం చేయిస్తున్నాను. కనుక భగవంతుడు ఎవరు
అన్న మొదటి ముఖ్యమైన విషయాన్ని బుద్ధిలో కూర్చోబెట్టాలి. ఈ విషయము ఎప్పటివరకైతే
బుద్ధిలో కూర్చోదో అప్పటివరకు ఇంకే విషయము అర్థం చేయించినా కానీ ప్రభావము పడదు.
మొత్తము శ్రమంతా ఈ విషయములోనే ఉంది. తండ్రి సమాధి నుండి మేలుకొలిపేందుకే వస్తారు.
శాస్త్రాలు మొదలైనవి చదవడముతో మేలుకోరు. పరమ ఆత్మ జ్యోతి స్వరూపుడు కావున వారి
పిల్లలు కూడా జ్యోతి స్వరూపులే. కానీ పిల్లలైన మీ ఆత్మ పతితముగా అయిపోయింది, దాని
కారణముగానే జ్యోతి ఆరిపోయింది. తమోప్రధానముగా అయిపోయారు. మొట్టమొదట తండ్రి పరిచయము
ఇవ్వకపోతే ఇక మిగతా ఏదైతే శ్రమ చేస్తారో, వారి చేత ఒపీనియన్ (అభిప్రాయాలు) మొదలైనవి
ఏవైతే వ్రాయిస్తారో, అవి దేనికి ఉపయోగపడవు. అందుకే సేవ జరగదు. నిశ్చయము ఉన్నట్లయితే
తప్పకుండా బ్రహ్మా ద్వారా జ్ఞానమును ఇస్తున్నారు అని అర్థం చేసుకుంటారు. మనుష్యులు
బ్రహ్మాను చూసి ఎంతగా తికమకపడతారు ఎందుకంటే వారికి తండ్రి పరిచయము లేదు. భక్తి
మార్గము ఇప్పుడు గతించిపోయింది అని మీ అందరికీ తెలుసు. కలియుగములో ఉన్నది భక్తి
మార్గము మరియు ఇప్పుడు సంగమములో ఉన్నది జ్ఞాన మార్గము. మనము సంగమయుగ వాసులము.
రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము, కొత్త ప్రపంచము కొరకు దైవీ గుణాలను ధారణ
చేస్తున్నాము. ఎవరైతే సంగమయుగములో లేరో వారు రోజురోజుకు తమోప్రధానముగా అవుతూనే
ఉంటారు. అటువైపు తమోప్రధానత పెరిగిపోతూ ఉంటుంది, ఇటువైపు మీ సంగమయుగము పూర్తవుతూ
ఉంది. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు కదా. అర్థం చేయించేవారు కూడా నంబరువారుగా
ఉన్నారు. బాబా ప్రతిరోజూ పురుషార్థము చేయిస్తూ ఉంటారు. నిశ్చయబుద్ధి విజయంతి.
పిల్లల్లో ఎక్కువగా మాట్లాడే అలవాటు చాలా ఉంది. తండ్రిని స్మృతే చేయరు. స్మృతి చేయడం
చాలా కష్టము. తండ్రిని స్మృతి చేయడం వదిలేసి తమ విషయాలనే అలా వినిపిస్తూ ఉంటారు.
తండ్రిపై నిశ్చయము ఏర్పడకుండా అసలు ఇతర చిత్రాల వైపుకు వెళ్ళనే వెళ్ళకూడదు. నిశ్చయము
లేకపోతే అసలు ఏమీ అర్థం చేసుకోరు. ఆ మొదటి వారిపై నిశ్చయము లేకపోతే ఇక రెండవ, మూడవ
విషయాల వరకు వెళ్ళడమంటే అది సమయాన్ని వృధా చేయడమే. వారికి ఎవరి నాడి గురించి తెలియదు.
ప్రారంభోత్సవము చేసేవారికి కూడా మొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వీరు
ఉన్నతోన్నతుడైన తండ్రి, జ్ఞానసాగరుడు. తండ్రి ఈ జ్ఞానాన్ని ఇప్పుడే ఇస్తారు.
సత్యయుగములో ఈ జ్ఞానము యొక్క అవసరము ఉండదు. ఆ తర్వాత భక్తి ప్రారంభమవుతుంది. తండ్రి
అంటారు, ఎప్పుడైతే నన్ను నిందించడం పూర్తి అయ్యే సమయము వస్తుందో అప్పుడు నేను
వస్తాను. అర్ధకల్పము వారు నిందించవలసిందే. ఎవరినైతే పూజిస్తారో వారి కర్తవ్యము
గురించి తెలియదు. పిల్లలైన మీరు కూర్చుని అర్థం చేయిస్తారు కానీ స్వయానికే బాబాతో
యోగము లేకపోతే ఇక ఇతరులకు ఏమి అర్థం చేయించగలరు. శివబాబా అని అంటారు కానీ యోగములో
అసలు ఉండనే ఉండకపోతే ఇక వికర్మలు కూడా వినాశనమవ్వవు, ధారణ జరగదు. ముఖ్యమైన విషయము,
ఒక్క తండ్రిని స్మృతి చేయడము.
ఏ పిల్లలైతే జ్ఞానీ ఆత్మగా అవ్వడముతో పాటు యోగీ ఆత్మగా అవ్వరో, వారిలో
దేహాభిమానపు అంశము తప్పకుండా ఉంటుంది. యోగము లేకుండా అర్థం చేయించడం వలన ఏ ఉపయోగము
లేదు. ఇక దేహాభిమానములోకి వచ్చి ఎవరినో ఒకరిని విసిగిస్తూ ఉంటారు. పిల్లలు భాషణ బాగా
చేసినట్లయితే - మేము జ్ఞానీ ఆత్మలము అని భావిస్తారు. తండ్రి అంటారు, మీరు జ్ఞానీ
ఆత్మలుగానైతే ఉన్నారు కానీ యోగము తక్కువగా ఉంది, యోగము చేసే విషయములో పురుషార్థము
చాలా తక్కువగా ఉంది. చార్టు పెట్టండి అని తండ్రి ఎంతగా అర్థం చేయిస్తారు. ముఖ్యమైన
విషయము యోగానికి సంబంధించినది. పిల్లల్లో జ్ఞానాన్ని అర్థం చేయించాలి అనే అభిరుచి
అయితే ఉంది కానీ యోగము లేదు. కావున యోగము లేకుండా వికర్మలు వినాశనమవ్వవు, మరి ఇక ఏ
పదవిని పొందుతారు! యోగములోనైతే చాలా మంది పిల్లలు ఫెయిల్ అవుతారు. మేము వంద శాతము
ఉన్నామని వారు భావిస్తారు కానీ బాబా అంటారు, మీరు రెండు శాతమే ఉన్నారు. బాబా స్వయంగా
చెప్తూ ఉంటారు - నేను భోజనము చేసే సమయములో స్మృతిలో ఉంటాను, మళ్ళీ మర్చిపోతాను.
స్నానము చేసేటప్పుడు కూడా బాబాను స్మృతి చేస్తాను. నేను వారి సంతానమునే అయినా కానీ
స్మృతిని మర్చిపోతాను. బాబా నంబరు వన్ లోకి వెళ్ళేవారు కావున తప్పకుండా వారి జ్ఞానము
మరియు యోగము సరిగ్గా ఉంటాయి అని భావిస్తారు, అయినా కూడా బాబా అంటారు - యోగములో చాలా
శ్రమ ఉంది. కావాలంటే ప్రయత్నించి చూడండి, ఆ తర్వాత అనుభవము వినిపించండి. టైలర్
బట్టలు కుడుతున్నప్పుడు చూసుకోవాలి - నేను బాబా స్మృతిలో ఉంటున్నానా. వీరు చాలా
మధురమైన ప్రియుడు. వారిని ఎంతగా స్మృతి చేస్తామో అంతగా మన వికర్మలు వినాశనమవుతాయి,
మనము సతోప్రధానముగా అవుతాము. మనము ఎంత సమయము స్మృతిలో ఉంటున్నాము అని స్వయాన్ని
చూసుకోవాలి. బాబాకు రిజల్టు చెప్పాలి. స్మృతిలో ఉండడము ద్వారానే కళ్యాణము జరుగుతుంది.
ఇకపోతే ఎక్కువగా అర్థం చేయించడం వలన కళ్యాణము జరగదు. ఏమీ అర్థం చేసుకోరు. అల్ఫ్ ను
(భగవంతుడిని) అర్థం చేసుకోకపోతే పని ఎలా అవుతుంది? ఒక్క భగవంతుడి గురించే తెలియకపోతే
అనగా ఆ ఒక్కరి గురించే తెలియకపోతే ఇక ఒకటి పక్కన పెట్టే సున్నా, సున్నాలానే
ఉండిపోతుంది. అల్ఫ్ తో (ఒకటితో) పాటు సున్నా పెట్టడము వలన లాభము ఉంటుంది. యోగము
లేకపోతే రోజంతా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. ఇక వీరు ఏ పదవిని పొందుతారు అని
తండ్రికైతే దయ కలుగుతుంది. అదృష్టములో లేకపోతే ఇక తండ్రి కూడా ఏం చేయగలరు. తండ్రి
అయితే ఘడియ-ఘడియ అర్థం చేయిస్తూ ఉంటారు - దైవీ గుణాలను బాగా ఉంచుకోండి, తండ్రి
స్మృతిలో ఉండండి. స్మృతి చాలా అవసరము. స్మృతి ద్వారా ప్రేమ ఏర్పడుతుంది, అప్పుడే
శ్రీమతముపై నడవగలుగుతారు. ప్రజలైతే ఎంతోమంది తయారవ్వనున్నారు. మీరు ఇక్కడికి
వచ్చిందే - ఈ లక్ష్మీ-నారాయణులుగా అయ్యేందుకు, ఇందులోనే శ్రమ ఉంది. స్వర్గములోకైతే
వెళ్తారు కానీ శిక్షలను అనుభవించి తర్వాత చివరిలో వచ్చి ఒక చిన్న పదవిని పొందుతారు.
బాబాకైతే పిల్లలందరి గురించి తెలుసు కదా. ఏ పిల్లలైతే యోగములో కచ్చాగా (అపరిపక్వముగా)
ఉంటారో, వారు దేహాభిమానములోకి వచ్చి అలుగుతారు మరియు కొట్లాడుతూ-గొడవపడుతూ ఉంటారు.
పక్కా యోగీలు ఎవరైతే ఉంటారో వారి నడవడిక చాలా రాయల్ గా, హుందాగా ఉంటుంది, వారు చాలా
తక్కువ మాట్లాడుతారు. యజ్ఞ సేవ పట్ల కూడా వారికి అభిరుచి ఉంటుంది. యజ్ఞ సేవలో
ఎముకలను సైతం సమర్పించేటువంటి వారు కూడా కొందరు ఉన్నారు. కానీ బాబా అంటారు, స్మృతిలో
ఎక్కువగా ఉన్నట్లయితే తండ్రి పట్ల ప్రేమ కలుగుతుంది మరియు సంతోషముగా ఉంటారు.
తండ్రి అంటారు, నేను భారత ఖండములోనే వస్తాను. నేను వచ్చి భారత్ నే ఉన్నతముగా
తయారుచేస్తాను. సత్యయుగములో మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు, అప్పుడు సద్గతిలో
ఉండేవారు, మరి దుర్గతిని ఎవరు కలిగించారు? (రావణుడు) ఎప్పుడు ప్రారంభమయ్యింది? (ద్వాపరము
నుండి) అర్ధకల్పము కొరకు ఈ సద్గతిని ఒక్క క్షణములో పొందుతారు, 21 జన్మల వారసత్వాన్ని
పొందుతారు. ఎప్పుడైనా ఎవరైనా మంచి వ్యక్తి వస్తే మొట్టమొదట వారికి తండ్రి పరిచయాన్ని
ఇవ్వండి. తండ్రి అంటారు - పిల్లలూ, ఈ జ్ఞానము ద్వారానే మీ సద్గతి జరుగుతుంది. ఈ
డ్రామా క్షణములు గడిచే కొద్ది నడుస్తూ ఉంది అని పిల్లలైన మీకు తెలుసు. ఈ విషయము
బుద్ధిలో గుర్తున్నా సరే మీరు మంచి రీతిలో స్థిరముగా ఉండగలుగుతారు. మీరు ఇక్కడ
కూర్చుని ఉన్నా కూడా ఈ సృష్టి చక్రము పేను వలె ఎలా తిరుగుతూ ఉంటుందో మీ బుద్ధిలో
ఉండాలి. క్షణము-క్షణము టిక్-టిక్ అంటూ ఉంటుంది. డ్రామానుసారముగానే పాత్ర అంతా
గడుస్తూ ఉంది. ఒక్క క్షణము గడిచింది అంటే ఇక అది సమాప్తము. చక్రము తిరుగుతూ ఉంటుంది.
చాలా మెల్లమెల్లగా తిరుగుతూ ఉంటుంది. ఇది అనంతమైన డ్రామా. వృద్ధులు మొదలైనవారు
ఎవరైతే ఉంటారో వారి బుద్ధిలో ఈ విషయాలు కూర్చోలేవు. జ్ఞానము కూడా కూర్చోదు. యోగము
కూడా ఉండదు. అయినా కానీ వారు నా పిల్లలే కదా. అయితే, సేవ చేసేవారి పదవి ఉన్నతముగా
ఉంటుంది. మిగిలినవారి పదవి తక్కువగా ఉంటుంది. ఇది పక్కాగా ఆలోచనలో పెట్టుకోండి. ఇది
అనంతమైన డ్రామా, ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఏ విధంగా రికార్డ్ తిరుగుతూ ఉంటుంది
కదా, అలా మన ఆత్మలో కూడా ఇటువంటి రికార్డు నిండి ఉంది. చిన్నని ఆత్మలో ఎంతో పాత్ర
నిండి ఉంది, దీనినే సృష్టి అద్భుతము అని అంటారు. చూడడానికి ఏమీ కనిపించదు. ఇవి అర్థం
చేసుకోవలసిన విషయాలు. మందబుద్ధి కలవారు వీటిని అర్థం చేసుకోలేరు. ఇందులో మనము ఏదైతే
మాట్లాడుతూ ఉంటామో, సమయము గతించిపోతూ ఉంటుందో, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత రిపీట్
అవుతుంది. ఇటువంటి వివేకము ఎవరి వద్ద లేదు. మహారథులు ఎవరైతే ఉంటారో వారు ఘడియ-ఘడియ
ఈ విషయాలపై ధ్యాస పెట్టి అర్థం చేయిస్తూ ఉంటారు, అందుకే బాబా అంటారు, మొట్టమొదటైతే
తండ్రి స్మృతి యొక్క కొంగు ముడి వేసుకోండి. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి.
ఆత్మ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. దేహపు సర్వ సంబంధాలను విడిచిపెట్టాలి. ఎంత వీలైతే
అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఈ పురుషార్థము గుప్తమైనది. బాబా పరిచయమునే
అందరికీ ఇవ్వండి అని బాబా సలహా ఇస్తున్నారు. బాబాను తక్కువగా స్మృతి చేస్తే బాబా
పరిచయము కూడా తక్కువగానే ఇస్తారు. మొదటైతే బాబా పరిచయము బుద్ధిలో కూర్చోవాలి. వారు
మన తండ్రి అని ఇప్పుడు వ్రాయండి అని వారికి చెప్పండి. దేహ సహితముగా అన్నింటినీ వదిలి
ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే మీరు తమోప్రధానుల నుండి
సతోప్రధానులుగా అవుతారు. ముక్తిధామము మరియు జీవన్ముక్తిధామములో దుఃఖము, బాధ ఉండనే
ఉండవు. రోజురోజుకు మంచి విషయాలను అర్థం చేయించడం జరుగుతుంది. మీరు పరస్పరము కూడా ఇవే
విషయాలను మాట్లాడుకోండి. యోగ్యులుగా కూడా తయారవ్వాలి కదా. బ్రాహ్మణులుగా అయి ఉండి ఆ
తండ్రి యొక్క ఆత్మిక సేవను చేయకపోతే ఇక ఎందుకు పనికి వస్తారు. చదువును బాగా ధారణ
చేయాలి కదా. ఒక్క అక్షరము కూడా ధారణ జరగని వారు ఎంతోమంది ఉన్నారని బాబాకు తెలుసు.
వారు యథార్థ రీతిగా తండ్రిని స్మృతి చేయరు. రాజా-రాణుల పదవిని పొందడములో శ్రమ
ఉంటుంది. ఎవరైతే కష్టపడతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. కష్టపడితేనే రాజ్యములోకి
వెళ్ళగలుగుతారు. నంబరు వన్ గా ఉన్నవారికే స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ
లక్ష్మీ-నారాయణులు స్కాలర్షిప్ ను తీసుకున్నారు, ఆ తర్వాత ఉన్నవారు నంబరువారుగా
ఉన్నారు. ఇది చాలా పెద్ద పరీక్ష కదా. స్కాలర్షిప్ పొందేవారి మాలయే తయారై ఉంది. 8
రత్నాలు ఉన్నారు కదా. మొదట 8 మంది, ఆ తర్వాత 100 మంది, ఆ తర్వాత 16,000 మంది. మరి
మాలలో కూర్చబడేందుకు ఎంత పురుషార్థము చేయాలి. అంతర్ముఖులుగా ఉండే పురుషార్థము
చేసినట్లయితే స్కాలర్షిప్ ను పొందేందుకు అధికారులుగా అవుతారు. మీరు చాలా
అంతర్ముఖులుగా ఉండాలి. తండ్రి కళ్యాణకారి కావున కళ్యాణము కొరకే సలహా ఇస్తారు.
మొత్తము ప్రపంచము యొక్క కళ్యాణము జరగనున్నది. కానీ నంబరువారుగా ఉంటారు. మీరు ఇక్కడ
తండ్రి వద్దకు చదువుకునేందుకు వచ్చారు. మీలో కూడా ఏ విద్యార్థులైతే చదువుపై ధ్యాస
ఉంచుతారో వారు మంచి విద్యార్థులు. కొందరు ఏ మాత్రమూ ధ్యాస పెట్టరు. భాగ్యములో ఏది
ఉంటే అదే లభిస్తుంది అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. చదువు విషయములో వారికి
లక్ష్యమే లేదు. కావున పిల్లలు స్మృతి చార్టు పెట్టుకోవాలి. మనము ఇప్పుడు తిరిగి
ఇంటికి వెళ్ళాలి. జ్ఞానాన్ని అయితే ఇక్కడే వదిలి వెళ్తాము. జ్ఞానము యొక్క పాత్ర
పూర్తి అవుతుంది. ఆత్మ ఎంత చిన్ననిది, అందులో ఎంత పాత్ర ఉంది, ఇది అద్భుతము కదా.
ఇదంతా ఒక అవినాశీ డ్రామా. ఈ విధంగా మీరు అంతర్ముఖులై స్వయముతో మాట్లాడుకుంటూ
ఉన్నట్లయితే - ఆత్మ ఎప్పుడూ వినాశనమవ్వదు అనేటువంటి విషయాలను తండ్రి వచ్చి
వినిపిస్తారు అని మీకు ఎంతో సంతోషము కలుగుతుంది. డ్రామాలో ప్రతి వ్యక్తి మరియు ప్రతి
వస్తువు యొక్క పాత్ర నిశ్చితమై ఉంది. దీనిని అంతము లేనిది అని అనడానికి వీల్లేదు.
దీనికి అంతము ఉంది కానీ ఇది అనాది అయినది. ఇందులో ఎన్ని ఉన్నాయో చూడండి. దీనిని
సృష్టి అద్భుతము అని అంటారు! ఈశ్వరుని అద్భుతము అని కూడా అనలేము. ఈశ్వరుడు అంటారు,
నాకు కూడా ఇందులో పాత్ర ఉంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. యోగములో చాలా శ్రమ ఉంది, అందుకే కర్మలలో ఎంత సమయము తండ్రి స్మృతి ఉంటుంది అని
ప్రయత్నించి చూడాలి! స్మృతిలో ఉండడములోనే కళ్యాణము ఉంది, మధురమైన ప్రియుడిని చాలా
ప్రేమతో స్మృతి చేయాలి, స్మృతి చార్టు పెట్టుకోవాలి.
2. సూక్ష్మమైన బుద్ధితో ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా-చాలా
కళ్యాణకారి డ్రామా, మనము ఏదైతే మాట్లాడుతామో లేదా చేస్తామో అది మళ్ళీ 5 వేల
సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. దీనిని యథార్థముగా అర్థం చేసుకుని సంతోషముగా
ఉండాలి.
వరదానము:-
తమ శ్రేష్ఠ జీవితము ద్వారా పరమాత్మ జ్ఞానము యొక్క ప్రత్యక్ష
ప్రూఫ్ ను చూపించే మాయాప్రూఫ్ భవ
స్వయాన్ని పరమాత్మ జ్ఞానము యొక్క ప్రత్యక్ష ప్రమాణముగా
లేక ప్రూఫ్ గా భావించడము ద్వారా మాయాప్రూఫ్ గా అయిపోతారు. మీ శ్రేష్ఠ పవిత్ర జీవితమే
ప్రత్యక్ష ప్రూఫ్. అసంభవము నుండి సంభవమైన అన్నింటికంటే పెద్ద విషయమేమిటంటే -
ప్రవృత్తిలో ఉంటూ పర వృత్తిలో ఉండడము, దేహము మరియు దైహిక ప్రపంచపు సంబంధాల నుండి
అతీతముగా ఉండడము. పాత శరీరము యొక్క నేత్రాలతో పాత ప్రపంచము యొక్క వస్తువులను చూస్తూ
కూడా చూడకుండా ఉండడము అనగా సంపూర్ణ పవిత్ర జీవితములో నడుచుకోవడము - ఇదే పరమాత్మను
ప్రత్యక్షము చేసేందుకు లేక మాయా ప్రూఫ్ గా అయ్యేందుకు సహజ సాధనము.
స్లోగన్:-
అటెన్షన్ రూపీ కాపలాదారుడు సరిగ్గా ఉన్నట్లయితే అతీంద్రియ సుఖము యొక్క ఖజానాను
పోగొట్టుకోలేరు.
అవ్యక్త సూచనలు -
‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’
బాబాను సహచరునిగా అయితే చేసుకున్నారు, ఇప్పుడు వారిని కంబైండ్ రూపములో అనుభవము
చెయ్యండి మరియు ఈ అనుభవాన్ని పదే-పదే స్మృతిలోకి తీసుకువస్తూ, తీసుకువస్తూ స్మృతి
స్వరూపులుగా అవ్వండి. పదే-పదే చెక్ చేసుకోండి - కంబైండుగా ఉన్నానా, వారి నుండి
పక్కకు అయితే రాలేదు కదా? ఎంతగా కంబైండ్ రూపము యొక్క అనుభవము పెరుగుతూ ఉంటుందో అంతగా
బ్రాహ్మణ జీవితము చాలా ప్రియమైనదిగా, మనోరంజకమైనదిగా అనుభవమవుతుంది.
| | |