09-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.02.20


‘‘మనసును స్వచ్ఛంగా, బుద్ధిని స్పష్టంగా ఉంచుకుని డబల్ లైట్ ఫరిశ్తా స్థితిని అనుభవము చెయ్యండి’’

ఈ రోజు బాప్ దాదా తమ స్వరాజ్య అధికారీ పిల్లలను చూస్తున్నారు. స్వరాజ్యము బ్రాహ్మణ జీవితము యొక్క జన్మసిద్ధ అధికారము. బాప్ దాదా బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరినీ స్వరాజ్యానికి సింహాసనాధికారులుగా తయారుచేసారు. స్వరాజ్య అధికారము జన్మించినప్పటి నుండే ప్రతి బ్రాహ్మణ ఆత్మకు ప్రాప్తించింది. ఎంతగా స్వరాజ్యములో స్థితి అయి ఉంటారో, అంతగానే స్వయములో లైట్ (ప్రకాశము) మరియు మైట్ (శక్తి) అనుభవం చేస్తారు.

బాప్ దాదా ఈ రోజు పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకముపై ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నారు. స్వయములో ఎంతగా శక్తిని ధారణ చేస్తారో, అంతగానే నంబరువారుగా ప్రకాశ కిరీటము మెరుస్తుంది. బాప్ దాదా పిల్లలందరికీ సర్వ శక్తులను అధికార రూపములో ఇచ్చారు. ప్రతి ఒక్కరూ మాస్టర్ సర్వశక్తివంతులే, కానీ ధారణ చెయ్యటంలో నంబరువారుగా అయిపోయారు. బాప్ దాదా చూసారు - సర్వ శక్తుల జ్ఞానము కూడా అందరిలోనూ ఉంది, ధారణ కూడా ఉంది, కానీ ఒక విషయములో తేడా వస్తుంది. బ్రాహ్మణ ఆత్మలెవరిని అడిగినా కానీ ప్రతి శక్తి గురించి వర్ణన కూడా చాలా బాగా చేస్తారు, ప్రాప్తుల గురించిన వర్ణనను కూడా చాలా బాగా చేస్తారు. కానీ అంతరము ఏమిటంటే ఏ సమయములో ఏ శక్తి యొక్క అవసరముంటుందో, ఆ సమయములో ఆ శక్తిని కార్యములో పెట్టలేకపోతారు. ఈ శక్తి యొక్క అవసరము కలిగింది కదా అని సమయము గడిచిపోయిన తరువాత రియలైజ్ అవుతారు. బాప్ దాదా పిల్లలతో అంటారు - సర్వ శక్తుల వారసత్వమనేది ఎంతటి శక్తిశాలి అయినదంటే ఏ సమస్య కూడా మీ ముందు నిలబడలేదు. సమస్యాముక్తులుగా అవ్వగలుగుతారు. దీని కొరకు కేవలం సర్వ శక్తులను ఇమర్జ్ రూపములో, స్మృతి రూపములో ఉంచుకోండి మరియు సమయానికి కార్యంలో ఉపయోగించండి. దీని కొరకు మీ బుద్ధి లైన్ ను క్లియర్ గా (స్పష్టంగా) ఉంచుకోండి. ఎంతగా బుద్ధి లైన్ క్లియర్ మరియు క్లీన్ గా (స్పష్టంగా మరియు స్వచ్ఛంగా) ఉంటుందో, అంతగా నిర్ణయ శక్తి తీవ్రతరం అయిన కారణంగా ఏ సమయంలో ఏ శక్తి యొక్క అవసరముంటుందో, ఆ శక్తిని కార్యములో ఉపయోగించగలుగుతారు ఎందుకంటే సమయ ప్రమాణంగా బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా, శ్రమతో కూడిన పురుషార్థము నుండి ముక్తులుగా చూడాలనుకుంటారు. అందరూ అయితే తప్పకుండా తయారవ్వవలసిందే కానీ బహుకాలపు ఈ అభ్యాసము అవసరము. బ్రహ్మాబాబా యొక్క విశేష సంస్కారాన్ని చూసారు ‘‘తక్షణ దానం మహా పుణ్యం’’. జీవిత ఆరంభము నుండీ ప్రతి కార్యములో దానము కూడా తక్షణమే చేసేవారు, పని కూడా తక్షణమే చేసేవారు. బ్రహ్మాబాబా విశేషత ఏమిటంటే వారి నిర్ణయ శక్తి సదా ఫాస్ట్ గా ఉండేది. మరి బాప్ దాదా రిజల్టును చూసారు. అందరినీ తనతోపాటు తోడుగా తీసుకునే వెళ్ళాలి. బాప్ దాదాతో పాటు వచ్చేవారే కదా! లేక వెనుక-వెనుక వచ్చేవారా? కలిసే వెళ్ళాలి అన్నప్పుడు బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యండి. కర్మలలో బ్రహ్మాబాబాను ఫాలో చెయ్యండి మరియు స్థితిలో నిరాకారీ శివబాబాను ఫాలో చెయ్యాలి. ఫాలో చెయ్యటం వస్తుంది కదా?

డబల్ విదేశీయులకు ఫాలో చెయ్యటం వస్తుందా? ఫాలో చెయ్యటమైతే సహజమే కదా! ఫాలో చెయ్యాల్సి వచ్చినప్పుడు ఇక ఎందుకు, ఏమిటి, ఎలా... ఇవన్నీ సమాప్తమైపోతాయి. మరియు అందరికీ అనుభవముంది, వ్యర్థ సంకల్పాలకు ఈ ఎందుకు, ఏమిటి, ఎలా... అనే పదాలే నిమిత్తమవుతాయి, ఇవే ఆధారమవుతాయి. ఫాలో ఫాదర్ అన్నప్పుడు ఈ పదాలు సమాప్తమైపోతాయి. ఎలా అని కాదు, ఇలా. ఇలా నడుచుకో, ఇలా చెయ్యి అని బుద్ధి వెంటనే నిర్ణయిస్తుంది. కావున బాప్ దాదా ఈ రోజు విశేషంగా పిల్లలందరికీ, వారు మొదటిసారి వచ్చినవారైనా, లేక పాతవారైనా కానీ, అందరికీ ఇదే సూచనను ఇస్తున్నారు - మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి. చాలామంది మనసులలో ఇప్పటికీ వ్యర్థము మరియు నెగెటివ్ అనే చిన్న, పెద్ద మచ్చలు ఉన్నాయి. ఈ కారణంగా పురుషార్థము యొక్క శ్రేష్ట స్పీడ్ లో, తీవ్రగతిలో ఆటంకము వస్తుంది. బాప్ దాదా సదా ఏ శ్రీమతాన్ని ఇస్తారంటే - మనసులో సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావనను మరియు శుభ కామనను ఉంచుకోండి - ఇదే స్వచ్ఛమైన మనసు. అపకారుల పట్ల కూడా ఉపకార వృత్తిని పెట్టుకోవటము - ఇదే స్వచ్ఛమైన మనసు. స్వయము గురించైనా లేక ఇతరుల గురించైనా వ్యర్థ సంకల్పాలు రావటము - ఇది స్వచ్ఛమైన మనసు కాదు. కనుక స్వచ్ఛమైన మనసు మరియు క్లీన్ అండ్ క్లియర్ (స్వచ్ఛమైన మరియు స్పష్టమైన) బుద్ధి. మీరే నిర్ణయించండి, మిమ్మల్ని మీరు అటెన్షన్ తో చూసుకోండి. బాగానే ఉన్నాను, బాగానే ఉన్నాను అని పైపైన చూసుకోవటము కాదు. ఆలోచించి చూసుకోండి - మనసు-బుద్ధి స్పష్టంగా ఉన్నాయా, శ్రేష్టంగా ఉన్నాయా? అప్పుడే డబల్ లైట్ స్థితి తయారవ్వగలదు. బాబా సమానమైన స్థితిని తయారుచేసుకునేందుకు ఇదే సహజమైన సాధనము. అంతేకాక ఈ అభ్యాసము అంతిమములో చెయ్యటము కాదు, బహుకాలపు అభ్యాసము అవసరము. మరి చెక్ చేసుకోవటము వస్తుందా? మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఇతరులను చెక్ చెయ్యకండి. బాప్ దాదా ఇంతకుముందు కూడా ఒక నవ్వొచ్చే విషయాన్ని చెప్పారు, అదేమిటంటే, చాలామంది పిల్లల యొక్క దూరపు చూపు చాలా బాగుంది, దగ్గరి చూపు బలహీనంగా ఉంది, అందుకే ఇతరులను జడ్జ్ చెయ్యటంలో చాలా తెలివైనవారిగా ఉంటారు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవటంలో బలహీనంగా అవ్వకండి.

బాప్ దాదా గతంలో కూడా చెప్పారు, నేను బ్రహ్మాకుమారిని లేక బ్రహ్మాకుమార్ ను అన్నది ఇప్పుడు పక్కా అయిపోయింది కదా. నడుస్తూ, తిరుగుతూ మేము బ్రహ్మాకుమారీలము, మేము బ్రహ్మాకుమార బ్రాహ్మణ ఆత్మలము అని అనుకుంటారు. అలాగే ఇప్పుడు ‘‘నేను ఫరిశ్తాను’’ అన్న న్యాచురల్ స్మృతిని మరియు నేచర్ ను తయారుచేసుకోండి. అమృతవేళ లేవటంతోనే దీనిని పక్కా చేసుకోండి - నేను ఫరిశ్తాను, పరమాత్ముని శ్రీమతమనుసారంగా అందరికీ సందేశాన్ని ఇవ్వడానికి మరియు శ్రేష్ట కర్మలను చేయడానికి కిందకు, ఈ సాకార తనువులోకి వచ్చాను. కార్యము పూర్తవ్వగానే మీ శాంతి స్థితిలో స్థితులైపోండి. ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోండి. ఒకరినొకరు కూడా ఫరిశ్తా స్వరూపములో చూడండి. మీ వృత్తి ఇతరులను కూడా నెమ్మది-నెమ్మదిగా ఫరిశ్తాగా చేస్తుంది. మీ దృష్టి ఇతరులపై కూడా ప్రభావము చూపిస్తుంది. మేము ఫరిశ్తాలము అన్నదైతే పక్కానే కదా? ఫరిశ్తా భవ యొక్క వరదానము అందరికీ లభించి ఉందా? ఒక్క క్షణములో ఫరిశ్తాగా అనగా డబల్ లైట్ గా అవ్వగలరా? ఒక్క క్షణములో అవ్వాలి, ఒక్క నిమిషములో కాదు, 10 క్షణాలలో కాదు, ఒక్క క్షణములో ఆలోచించారు మరియు అలా అయిపోయారు అన్నట్లు అటువంటి అభ్యాసము ఉందా? అచ్ఛా, ఎవరైతే ఒక్క క్షణములో అలా అవ్వగలరో, రెండు క్షణాలలో కాదు, ఒక్క క్షణములో అలా అవ్వగలరో, వారు ఒక చేతితో చప్పట్లు కొట్టండి. అవ్వగలరా? ఊరికే అలా చెయ్యి ఎత్తటం కాదు. డబల్ విదేశీయులు చెయ్యి ఎత్తడం లేదు! సమయం పడుతుందా? అచ్ఛా, ఎవరైతే - కొద్ది సమయము పడుతుంది, ఒక్క క్షణములో కాదు, కొద్ది సమయం పడుతుంది అని అనుకుంటున్నారో, వారు చేతులెత్తండి. (చాలామంది చేతులెత్తారు) మంచిది, కానీ చివరి ఘడియలోని పరీక్ష ఒక్క క్షణములో వస్తుంది, అప్పుడేం చేస్తారు? అకస్మాత్తుగా వస్తుంది మరియు క్షణములో వస్తుంది. చెయ్యి ఎత్తారు, ఏం పర్వాలేదు. అనుభూతి చెందారు, ఇది కూడా చాలా మంచిది. కానీ ఈ అభ్యాసము చెయ్యాల్సిందే. చెయ్యాల్సే ఉంటుంది అని కాదు, చెయ్యాల్సిందే. ఈ అభ్యాసము చాలా-చాలా-చాలా అవసరము. అయినప్పటికీ బాప్ దాదా కొంచెం సమయాన్ని ఇస్తున్నారు. ఎంత సమయం కావాలి? 2000 సంవత్సరం వరకు కావాలా. 21వ శతాబ్దానికి మీరందరూ ఛాలెంజ్ చేసారు, దండోరా వేసారు, గుర్తుందా? స్వర్ణిమయుగ ప్రపంచము వస్తుంది, లేక అటువంటి వాతావరణాన్ని తయారుచేస్తాము అని ఛాలెంజ్ చేసారు. ఛాలెంజ్ చేసారు కదా! మరి అప్పటివరకైతే చాలా సమయము ఉంది. ఎంతగా స్వయం పట్ల అటెన్షన్ పెట్టగలిగితే... అటెన్షన్ పెట్టగలిగితే అని కూడా కాదు, పెట్టాల్సిందే. దేహ భానములోకి రావటానికి ఎంత సమయము పడుతుంది? రెండు క్షణాలా? అనుకోకపోయినా కూడా దేహ భానములోకి వచ్చేస్తారు, దానికి ఎంత సమయము పడుతుంది? ఒక్క క్షణమా లేక అంతకంటే కూడా తక్కువ సమయమా? అక్కడ దేహ భానములోకి వచ్చేసాము అన్నది తెలియను కూడా తెలియదు. అలాగే ఈ అభ్యాసము చెయ్యండి - ఏమైనాగానీ, ఏం చేస్తున్నాగానీ నేను ఆత్మాభిమానీ స్థితిలో, శక్తిశాలీ స్థితిలో న్యాచురల్ గా స్థితైపోయాను అన్నది కూడా మీకు తెలియకూడదు. ఫరిశ్తా స్థితి కూడా న్యాచురల్ గా ఉండాలి. ఎంతగా మీ స్వభావాన్ని ఫరిశ్తాతనపు స్వభావముగా తయారుచేసుకుంటారో, అంతగా ఆ స్వభావము స్థితిని న్యాచురల్ గా చేస్తుంది. మరి బాప్ దాదా ఎంత సమయం తర్వాత అడగాలి? ఎంత సమయం కావాలి? జయంతి, చెప్పండి, ఎంత సమయం కావాలి? విదేశీయుల తరపు నుండి మీరు చెప్పండి, విదేశీయులకు ఎంత సమయం కావాలి? జనక్ చెప్పండి, (ఈ రోజుది ఈ రోజే అయిపోతుంది. రేపటివరకు కాదు అని దాదీజీ చెప్పారు). ఈ రోజుకు ఈ రోజే అంటే ఇప్పుడే అందరూ ఫరిశ్తాలుగా అయిపోయారా? అయిపోతాము అని అనకండి, ఒకవేళ అయిపోతాము అని అంటే, సరే, కానీ ఎప్పటికల్లా? బాప్ దాదా ఈ రోజు బ్రహ్మాబాబా యొక్క ఏ సంస్కారము గురించి చెప్పారు? తక్షణ దానము మహా పుణ్యము.

బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై ప్రేమ ఉంది. పిల్లల్లో ఒక్కరు కూడా తక్కువగా ఉండకూడదు అని అనుకుంటారు. నంబరువారుగా ఎందుకు ఉండాలి, అందరూ నంబరువన్ గా అయితే ఎంత బాగుంటుంది. అచ్ఛా!

ప్రశాసక వర్గము (అడ్మినిస్ట్రేషన్ వింగ్) కు చెందిన సోదర-సోదరీలతో:- అందరూ పరస్పరములో కలుసుకుని ఏ ప్రోగ్రామ్ తయారుచేసారు? శ్రేష్ట ఆత్మలైన మీ చేతిలోకి ఈ కార్యము త్వరత్వరగా వచ్చేయాలి అని ఇలా తీవ్ర పురుషార్థానికి చెందిన ప్లాన్ ను తయారుచేసారా? విశ్వ పరివర్తన చెయ్యాలంటే మొత్తము అడ్మినిస్ట్రేషన్ అంతా మారాల్సి ఉంటుంది కదా! ఈ కార్యము ఎలా సహజంగా పెరుగుతూ వెళ్ళాలి, ఎలా వ్యాపించాలి అన్నదాని గురించి ఆలోచించారా? తక్కువలో తక్కువ పెద్ద-పెద్ద పట్టణాలలో ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో, వారికి పర్సనల్ గా సందేశాన్ని ఇచ్చే ప్లాన్ ను తయారుచేసారా? ఇప్పుడు ఆధ్యాత్మికత ద్వారా పరివర్తన అవ్వగలదు మరియు అవ్వాలి అని తక్కువలో తక్కువ ఇదైతే అర్థం చేసుకోవాలి. కావున మీ వర్గాన్ని మేల్కొలపండి, అందుకే ఈ వర్గాలు తయారుచేయబడ్డాయి. బాప్ దాదా వర్గమువారి సేవను చూసి సంతోషిస్తున్నారు కానీ ఈ రిజల్టును చూడాలి - ప్రతి వర్గమువారూ తమ-తమ వర్గములోనివారికి ఎంతవరకు సందేశాన్ని ఇచ్చారు! కొద్దో-గొప్పో మేల్కొలిపారా లేక సహచరులుగా తయారుచేసారా? సహయోగులుగా, సహచరులుగా తయారుచేసారా? బ్రహ్మాకుమారులుగా తయారుచెయ్యలేదు కానీ సహయోగులుగా, సహచరులుగా తయారుచేసారా?

అన్ని వర్గాలవారికీ బాప్ దాదా చెప్తున్నారు - ఎలా అయితే ఇప్పుడు ధర్మనేతలు వచ్చారో, వారు నంబరువన్ వారు కాదు, అయినప్పటికీ ఒకే స్టేజ్ పై అందరూ కలిసారు మరియు వారందరి నోటి నుండి - మనమందరము కలిసి ఆధ్యాత్మిక శక్తిని వ్యాపింపజేయాలి అని వెలువడింది. అలాగే ప్రతి వర్గమువారు ఎవరైతే వచ్చారో, ఆ వచ్చిన ప్రతి వర్గమువారు ఏ రిజల్టును చూపించాలంటే - మా వర్గములోని వారికి సందేశం ఎంతవరకు చేరుకుంది? ఇంకొకటి - ఆధ్యాత్మికత యొక్క అవసరము ఉంది మరియు మేము కూడా సహయోగులుగా అవుతాము అన్న రిజల్టు రావాలి. రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వరు కానీ సహయోగులుగా అవ్వగలరు. మరి ఇప్పటివరకు ప్రతి వర్గము వారు ఏయే సేవలనైతే చేసారో, ఏ విధంగానైతే ఇప్పుడు ధర్మనేతలను పిలిచారో, అలా ప్రతి దేశము నుండి ప్రతి వర్గమువారి సేవను చెయ్యండి. ముందుగా ఇండియాలోనే చెయ్యండి, ఆ తరువాత అంతర్జాతీయ స్థాయిలో చెయ్యాలి. ప్రతి వర్గము నుండి ఇలా రకరకాల స్థాయిలలో ఉన్నవారిని ఒకచోట కలవాలి మరియు మేము అందరికీ సహయోగులుగా అవ్వాలి అని వారు అనుభవము చెయ్యాలి. ప్రతి వర్గములో ఇటువంటి రిజల్టు ఎంతవరకు వెలువడింది? మరియు ఇక ముందు కోసం ఏ ప్లాన్ ను తయారుచేసారు? ఎందుకంటే ఒక వర్గమువారు ఒకవేళ వర్గములోని ఒక్కొక్కరినీ లక్ష్యముగా పెట్టుకుని సమీపంగా తీసుకువచ్చినట్లయితే అప్పుడు అన్ని వర్గాలలోని సమీప సహయోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఒక చోట సమావేశం చేసి పెద్ద సంగఠనను తయారుచేయవచ్చు. అంతేకాక, ఒకరినొకరు చూసుకుని ఉల్లాస-ఉత్సాహాలు కూడా వస్తాయి. ఇప్పుడు వేరు-వేరుగా ఉన్నారు. ఒక పట్టణంలో కొంతమంది ఉన్నారు, మరో పట్టణంలో మరికొంతమంది ఉన్నారు. మంచి-మంచివారు ఉన్నారు కూడా, కానీ ముందుగా అందరి సంగఠనను ఏర్పాటు చెయ్యండి, ఆ తరువాత అందరినీ కలిపి ఒక పెద్ద సంగఠనను మధుబన్ లో చేస్తాము. మరి అటువంటి ప్లాన్ ఏదైనా తయారుచేసారా? తప్పకుండా తయారయ్యే ఉంటుంది. చెల్లాచెదురై ఉన్నవారు చాలామంది ఉన్నారు అని విదేశములోని వారికి కూడా సందేశాన్ని పంపారు. భారత్ లో చూసుకున్నా కూడా మంచి-మంచి సహయోగీ ఆత్మలు అన్ని చోట్లా ఉన్నారు, కానీ గుప్తంగా ఉండిపోతారు. వారందరినీ కలిపి ఏదైనా విశేష ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసి అనుభవాలను పంచుకున్నట్లయితే దాని ద్వారా మార్పు వస్తుంది, సమీపముగా వస్తారు. ఒక వర్గములో 5 మంది ఉంటే, ఇంకో వర్గములో 8 మంది ఉంటే, మరో వర్గములో 25-30 మంది కూడా ఉంటారు. సంగఠనలోకి రావటం ద్వారా ఉన్నతి చెందుతారు. ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతాయి. ఇప్పటివరకు అన్ని వర్గాల సేవ ఏదైతే జరిగిందో, దాని రిజల్టు తీయాలి. విన్నారా, అన్ని వర్గాలవారు వింటున్నారు కదా! అన్ని వర్గాలవారు, ఎవరైతే ఈ రోజు విశేషంగా వచ్చారో, వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు - ఎంతెంతమంది, ఎవరెవరు మరియు ఎంత శాతములో సమీప, సహయోగులుగా ఉన్నారు అన్న రిజల్టును ఇవ్వాలి. అప్పుడు వారి కొరకు ఒక రమణీకమైన ప్రోగ్రామ్ ను తయారుచేస్తాము. సరేనా!

మధుబన్ వారు ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉండాలనుకుంటున్నారా? బిజీగా ఉండాలనుకుంటున్నారు కదా! లేక అలసిపోతున్నారా? మధ్యమధ్యలో 15 రోజులు సెలవు కూడా ఉంటుంది మరియు ఉండాలి కూడా. కానీ లిస్ట్ లో ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ ఉండాలి, అప్పుడు ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి, లేదంటే సేవ లేని సమయంలో దాదీ ఒక కంప్లయింట్ చేస్తుంటారు. ఆ కంప్లయింట్ చెప్పాలా? అందరూ మా-మా ఊర్లకు వెళ్తాము అని అంటుంటారు అని దాదీ చెప్తూ ఉంటారు. ఊరికి వెళ్ళి వస్తాము, మామూలుగా అలా తిరిగి రావటానికి వెళ్తాము, అంతేకాక అక్కడ సేవ చేయటానికి కూడా వెళ్తాము అని అంటుంటారు. అందుకే బిజీగా ఉండటము మంచిది. బిజీగా ఉంటే గొడవలు కూడా ఉండవు. ఇంకా చూడండి, మధుబన్ వారిలోని ఒక విశేషతకు బాప్ దాదా పదమాల రెట్లు అభినందనలను ఇస్తారు. 100 రెట్లు కూడా కాదు, పదమాల రెట్లు, ఏ విషయములో? ఎప్పుడైనా ఎవరైనా వస్తే, మధుబన్ వారిలో ఎంతగా సేవ యొక్క లగనములో ఏర్పడుతుందంటే, ఇక లోపల ఏమున్నా గానీ, అది దాగిపోతుంది, అవ్యక్త స్థితి కనిపిస్తుంది, అలసిపోనివారిగా కనిపిస్తారు. ఇక్కడైతే ప్రతి ఒక్కరూ ఫరిశ్తాగానే అనిపిస్తున్నారు అని రిమార్క్ వ్రాసి వెళ్తారు. ఇది చాలా మంచి విశేషత, ఆ సమయములో విశేషంగా విల్ పవర్ వస్తుంది. సేవ యొక్క మెరుపు వస్తుంది. ఈ సర్టిఫికేట్ నైతే బాప్ దాదా ఇస్తారు. అభినందనలు తెలపాలి కదా? మరి మధుబన్ వారు చప్పట్లు కొట్టండి. చాలా మంచిది. బాప్ దాదా కూడా ఆ సమయములో అంతా తిరిగి వస్తారు. అది మీకు తెలియదు కానీ బాప్ దాదా అంతా తిరిగి చూడటానికి వస్తారు. మధుబన్ యొక్క ఈ విశేషత ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుంది. అచ్ఛా!

మీడియా వింగ్:- విదేశాలలో కూడా మీడియా వర్గము ప్రారంభమైంది కదా! మీడియాలో ఇప్పుడు చాలా మంచి శ్రమ చేసారు అన్నదానిని బాప్ దాదా చూసారు. ఇప్పుడు వార్తాపత్రికలలో రావటము ప్రారంభమైంది, అది కూడా ఎంతో ప్రేమతో ఇస్తున్నారు. కనుక శ్రమకు తగ్గ ఫలితము కూడా లభిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకా విశేషముగా వార్తాపత్రికలలో రావాలి. టి.వి.లలో, కొందరైతే పర్మనెంట్ గా కొంత సమయాన్ని కూడా కేటాయించారు కదా! ప్రతి రోజూ వస్తుంది కదా! ఈ ఉన్నతి బాగుంది. వినటం వలన అందరికీ మంచి అనుభవము కలుగుతుంది. అదే విధంగా వార్తాపత్రికలలో విశేషంగా వారానికి అయినా, లేక ప్రతిరోజు అయినా, లేక రోజు విడిచి రోజు అయినా, ఒక స్థానము మీ కోసం ఫిక్స్ అయిపోవాలి. ఇది ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునే అవకాశము అనే అంశము ఉండాలి. ఇటువంటి పురుషార్థము చెయ్యండి. మామూలుగా కూడా సఫలత ఉంది, కనెక్షన్లు కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వార్తాపత్రికలకు సంబంధించి ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించండి. చెయ్యగలరా? ఈ గ్రూప్ చెయ్యగలరా? చెయ్యి ఎత్తండి. సరే అంటారా! ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నట్లయితే సఫలత ఉండనే ఉంటుంది. ఎందుకు అవ్వదు! చివరికి ఎటువంటి సమయము వస్తుందంటే అన్ని సాధనాలు మీ తరపు నుండి ఉపయోగములోకి వస్తాయి. అందరూ మీకు ఆఫర్ చేస్తారు. ఏదైనా ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి అని ఆఫర్ చేస్తారు. మా సహాయాన్ని తీసుకోండి అని అంటారు. ప్రస్తుతమైతే - మీరు సహయోగులుగా అవ్వండి అని మీరు చెప్పాల్సి వస్తుంది, కానీ తరువాత, మమ్మల్ని సహయోగులుగా చేసుకోండి అని వారే అంటారు. కేవలం ఈ విషయాన్ని పక్కాగా చేసుకోండి - ఫరిశ్తా, ఫరిశ్తా, ఫరిశ్తా. అప్పుడిక చూడండి, మీ పని ఎంత త్వరగా అయిపోతుందో. వారి వెనుక పడాల్సిన అవసరము ఉండదు, నీడలా వారే మీ వెనుక వస్తారు. కేవలం మీ అవస్థలు ఆగి ఉన్నందువలన అంతా ఆగి ఉంది. ఎవర్రెడీగా అయినట్లయితే కేవలం స్విచ్ ను ఆన్ చేసే పనే మిగిలి ఉంటుంది, అంతే. మంచిగా చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు.

నలువైపులా ఉన్న దేశ-విదేశాలలో సాకార స్వరూపములో లేక సూక్ష్మ స్వరూపములో మిలనాన్ని చేసుకునే సర్వ స్వరాజ్య అధికారీ ఆత్మలకు, సదా ఈ శ్రేష్ట అధికారాన్ని తమ నడవడిక మరియు ముఖము ద్వారా ప్రత్యక్షము చేసే విశేష ఆత్మలకు, సదా బాప్ దాదాను ప్రతి అడుగులో ఫాలో చేసేవారికి, సదా మనసును స్వచ్ఛంగా మరియు బుద్ధిని స్పష్టంగా ఉంచుకునే అటువంటి స్వతహా తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా తోడుగా ఉండే మరియు తోడుగా వెళ్ళే డబల్ లైట్ పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-

సాధనాలను నిర్లిప్తంగా మరియు అతీతంగా అయ్యి కార్యములో వినియోగించే అనంతమైన వైరాగీ భవ

అనంతమైన వైరాగీ అనగా ఎవ్వరిపైనా మోహం ఉండకపోవడము, సదా తండ్రికి ప్రియంగా ఉండడము. ఈ ప్రియంగా ఉండే స్థితియే అతీతంగా చేస్తుంది. తండ్రికి ప్రియంగా అవ్వకపోతే అతీతంగా కూడా అవ్వలేరు, మోహంలోకి వచ్చేస్తారు. ఎవరైతే తండ్రికి ప్రియంగా ఉంటారో, వారు సర్వ అకర్షణల నుండి దూరంగా అనగా అతీతంగా ఉంటారు - దీనినే నిర్లిప్త స్థితి అని అంటారు. వారు ఎటువంటి హద్దు ఆకర్షణల ప్రభావములోకి వచ్చేవారు కారు. రచన మరియు సాధనాలను నిర్లిప్తంగా అయ్యి కార్యములోకి తీసుకొస్తారు - ఇటువంటి అనంతమైన వైరాగులే రాజఋషులు.

స్లోగన్:-

హృదయము యొక్క సత్యత-శుభ్రత ఉన్నట్లయితే తండ్రి సంతుష్టులవుతారు.