09-09-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - యోగబలముతో చెడు సంస్కారాలను పరివర్తన చేసుకొని మంచి సంస్కారాలను అలవర్చుకోండి. జ్ఞానము మరియు పవిత్రతా సంస్కారాలు మంచి సంస్కారాలు’’

ప్రశ్న:-
పిల్లలైన మీ జన్మసిద్ధ అధికారము ఏమిటి? మీకు ఇప్పుడు ఏ ఫీలింగ్ కలుగుతుంది?

జవాబు:-
మీ జన్మసిద్ధ అధికారము - ముక్తి మరియు జీవన్ముక్తి. మీకు ఇప్పుడు - మేమిక తండ్రితోపాటు తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఫీలింగ్ కలుగుతుంది. మీకు తెలుసు, భక్తి ఫలమైన ముక్తి మరియు జీవన్ముక్తిని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు అందరూ శాంతిధామానికి వెళ్ళాలి. అందరూ తమ ఇంటిని సాక్షాత్కారం చేసుకోవాలి.

ఓంశాంతి
మనుష్యులు తండ్రిని సచ్ఛా పాత్ షాహ్ (సత్యమైన చక్రవర్తి) అని కూడా అంటారు. ఇంగ్లీషులో చక్రవర్తి అని అనరు, అందులో కేవలం సత్యమైన ఫాదర్ (తండ్రి) అనే అంటారు. గాడ్ ఫాదర్ ఈజ్ ట్రూత్ అని అంటారు. భారత్ లోనే సత్యమైన చక్రవర్తి అని అంటారు. ఇప్పుడు తేడా అయితే ఎంతో ఉంది. వారు కేవలం సత్యాన్నే వినిపిస్తారు, సత్యాన్నే నేర్పిస్తారు, సత్యంగా తయారుచేస్తారు. ఇక్కడ సత్యమైన చక్రవర్తి అని అంటారు. వారు సత్యముగా కూడా తయారుచేస్తారు మరియు సత్యఖండానికి చక్రవర్తిగా కూడా తయారుచేస్తారు. తప్పకుండా వారు ముక్తిని కూడా ఇస్తారు, జీవన్ముక్తిని కూడా ఇస్తారు, దీనిని భక్తి ఫలము అని అంటారు. లిబరేషన్ మరియు ఫ్రూషన్ (ముక్తి మరియు ఫలము). భక్తి ఫలాన్ని కూడా ఇస్తారు మరియు విముక్తులుగా కూడా చేస్తారు. మనకు రెండింటినీ ఇస్తారు అని పిల్లలకు తెలుసు. విముక్తులుగా అయితే అందరినీ చేస్తారు, ఫలాన్ని మీకు ఇస్తారు. లిబరేషన్ మరియు ఫ్రూషన్ - ఈ భాష కూడా తయారై ఉంది కదా. భాషలైతే ఎన్నో ఉన్నాయి. శివబాబాకు కూడా ఎన్నో పేర్లు పెట్టేస్తారు. కొంతమందికి, వారి పేరు శివబాబా అని చెప్తే, వాళ్ళు మేము వారిని మాలిక్ (యజమాని) అనే అంటాము అని అంటారు. వారు మాలిక్ అన్నది సరే, కానీ వారికి కూడా పేరు ఉండాలి కదా. నామ-రూపాలకు అతీతమైన వస్తువేదీ ఉండదు. వారు మాలిక్ అయినా, ఏదో ఒకదానికి మాలిక్ అవుతారు కదా. వారికి నామ-రూపాలైతే తప్పకుండా ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - తండ్రి తప్పకుండా విముక్తులుగా కూడా చేస్తారు, ఆ తర్వాత శాంతిధామములోకి తప్పకుండా అందరూ వెళ్ళాలి. తమ ఇంటి సాక్షాత్కారాన్ని అందరూ పొందేది ఉంది. ఇంటి నుండి వచ్చారు కావున మొదట ఇంటి సాక్షాత్కారాన్ని పొందుతారు. దీనిని గతి, సద్గతి అని అంటారు. ఈ పదాలను వాడుతారు కానీ అర్థం చేసుకోకుండా వాడుతారు. పిల్లలైన మీకైతే ఫీలింగ్ కలుగుతుంది - మేము మా ఇంటికి కూడా వెళ్తాము మరియు మాకు ఫలము కూడా లభిస్తుంది. మీకు నంబరువారుగా లభిస్తుంది, అలాగే ఇతర ధర్మాలవారికి కూడా సమయమనుసారంగా లభిస్తుంది. తండ్రి అర్థం చేయించారు - మీరు స్వర్గవాసులా లేక నరకవాసులా? అన్న ఈ కరపత్రం చాలా బాగుంది. ఈ ముక్తి, జీవన్ముక్తులు రెండూ భగవంతుడైన తండ్రి ఇచ్చే జన్మసిద్ధ అధికారమని పిల్లలైన మీకే తెలుసు. మీరు అలా వ్రాయవచ్చు కూడా. తండ్రి ద్వారా పిల్లలైన మీకు ఈ జన్మసిద్ధ అధికారము లభిస్తుంది. తండ్రికి చెందినవారిగా అవ్వడముతో ఈ రెండూ ప్రాప్తిస్తాయి. అది రావణుడు ఇచ్చే జన్మసిద్ధ అధికారమైతే, ఇది పరమపిత పరమాత్మ ఇచ్చే జన్మసిద్ధ అధికారము. ఇది భగవంతుడు ఇచ్చే జన్మసిద్ధ అధికారము, అది సైతాన్ ఇచ్చే జన్మసిద్ధ అధికారము. కావున ఈ విధంగా వ్రాయాలి, తద్వారా ఎంతో కొంత అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గాన్ని స్థాపన చేయాలి. ఎంత పని చేయాలి! ఇప్పుడైతే బేబీస్ (పసి పిల్లల్లా) ఉన్నారు. మనుష్యులు కలియుగాన్ని, అది ఇప్పుడింకా బేబీలా (బాల్యములో) ఉంది అని అంటారు కదా. తండ్రి అంటారు, సత్యయుగ స్థాపన బేబీలా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు వారసత్వం లభిస్తోంది. రావణుడు ఇచ్చేదానిని వారసత్వము అని ఏమీ అనరు. గాడ్ ఫాదర్ నుండైతే వారసత్వం లభిస్తుంది. రావణుడు ఏమీ తండ్రి కాదు, అతడిని (5 వికారాలైన రావణుడిని) అయితే సైతాన్ అని అంటారు. సైతాన్ నుండి వారసత్వం ఏం లభిస్తుంది? పంచ వికారాలు లభిస్తాయి, వాటినే ప్రదర్శిస్తారు, తమోప్రధానులుగా అయిపోతారు. ఇప్పుడు దసరాను ఎంతగా జరుపుకుంటారు, ఉత్సవములా జరుపుకుంటారు. ఎంతో ఖర్చు చేస్తారు. విదేశాల నుండి కూడా ఆహ్వానం ఇచ్చి పిలుస్తారు. దసరాను అన్ని చోట్ల కన్నా ఎక్కువ ప్రసిద్ధంగా మైసూరులో జరుపుకుంటారు. అక్కడ ధనవంతులు కూడా ఎంతోమంది ఉన్నారు. రావణ రాజ్యములో ధనం లభిస్తే దానితో బుద్ధి పాడైపోతుంది. తండ్రి వివరంగా అర్థం చేయిస్తారు. దీని పేరు రావణ రాజ్యము. దానినేమో ఈశ్వరీయ రాజ్యము అని అంటారు. రామ రాజ్యము అని అనడం కూడా తప్పే అవుతుంది. గాంధీజీ రామ రాజ్యాన్ని కోరుకునేవారు. మనుష్యులు గాంధీజీ కూడా ఒక అవతారమేనని భావిస్తారు. వారికి ఎంత ధనాన్ని ఇచ్చేవారు. వారిని భారత్ యొక్క బాపూజీ అని అనేవారు. ఇప్పుడు వీరైతే మొత్తం విశ్వానికి బాపూజీ. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఎంతమంది జీవాత్మలు ఉంటారు అనేది మీకు తెలుసు. జీవ్ (శరీరము) అయితే నశ్వరమైనది, ఇకపోతే ఆత్మ అవినాశీ. ఆత్మలైతే ఎన్నో ఉన్నాయి. ఏ విధంగా ఆకాశములో సితారలు ఉంటాయి కదా, సితారలు ఎక్కువ ఉన్నాయా లేక ఆత్మలు ఎక్కువ ఉన్నాయా? ఎందుకంటే మీరు ధరిత్రి సితారలు మరియు అవి ఆకాశములోని సితారలు. మిమ్మల్ని దేవతలు అని అంటారు. వారైతే ఆ సితారలను కూడా దేవతలు అని అనేస్తారు. మిమ్మల్ని లక్కీ సితారలు అని అంటారు కదా.

అచ్ఛా, ఈ విషయముపై పరస్పరం చర్చించుకోండి. బాబా ఇప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించరు. ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే అన్నదైతే అర్థం చేయించారు, వీరి బుద్ధిలోనైతే అన్నీ ఉన్నాయి, మనుష్యమాత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ వీరు తండ్రి. మొత్తం సృష్టి అంతా సముద్రంపై నిలబడి ఉందని అందరికీ తెలుసు. అది కూడా అందరికీ ఏమీ తెలియదు. తండ్రి అర్థం చేయించారు, ఈ రావణ రాజ్యము మొత్తం సృష్టి అంతటి పైనా ఉంది. రావణ రాజ్యము సాగరానికి అవతల ఉంది అనేమీ కాదు. సాగరమైతే అన్ని వైపులా ఉంది. కింద ఎద్దు ఉందని, దాని కొమ్ముపై సృష్టి నిలిచి ఉందని, అది ఎప్పుడైతే అలసిపోతుందో అప్పుడు సృష్టిని ఇంకొక కొమ్ముపైకి మార్చుకుంటుందని అంటారు కదా. ఇప్పుడు పాత ప్రపంచము అంతమై కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. శాస్త్రాలలోనైతే అనేక రకాల విషయాలను కట్టుకథల వలె వ్రాసేసారు. ఇక్కడ ఆత్మలందరూ శరీరాలతోపాటు ఉన్నారని, వీరిని జీవాత్మలు అని అంటారని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఆత్మల ఇల్లు ఏదైతే ఉందో, అక్కడ శరీరాలు ఉండవు. వారిని నిరాకారీ అని అంటారు. శరీరానికి ఆకారము ఉంటుంది, అందుకే సాకారీ అని అంటారు. నిరాకారీగా ఉన్నప్పుడు శరీరము ఉండదు. ఇది సాకార సృష్టి. అది నిరాకారీ ఆత్మల ప్రపంచము. దీనిని సృష్టి అంటారు, దానిని నిరాకారీ లోకము అని అంటారు. ఆత్మ ఎప్పుడైతే శరీరములోకి వస్తుందో, అప్పుడు ఈ కదలికలు మొదలవుతాయి, లేకపోతే శరీరాలు ఎందుకూ పనికిరావు. దానిని నిరాకారీ లోకము అని అంటారు. ఎన్ని ఆత్మలైతే ఉన్నాయో అవన్నీ చివరి సమయం కల్లా వచ్చేయాలి. అందుకే దీనిని పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. అన్ని ఆత్మలూ ఎప్పుడైతే ఇక్కడకు వచ్చేస్తాయో అప్పుడిక పైన ఒక్క ఆత్మ కూడా ఉండదు. అక్కడ ఎప్పుడైతే పూర్తిగా ఖాళీ అయిపోతుందో, అప్పుడిక అందరూ తిరిగి వెళ్తారు. మీరు నంబరువారు పురుషార్థానుసారంగా ఈ సంస్కారాలను తీసుకువెళ్తారు. కొందరు జ్ఞాన సంస్కారాలను తీసుకువెళ్తారు, కొందరు పవిత్రతా సంస్కారాలను తీసుకువెళ్తారు. రావడమైతే అందరూ మళ్ళీ ఇక్కడకు రావలసిందే. కానీ మొదట ఇంటికి వెళ్ళాలి. అక్కడ మంచి సంస్కారాలు ఉంటాయి. ఇక్కడ చెడు సంస్కారాలు ఉంటాయి. మంచి సంస్కారాలు మారిపోయి చెడు సంస్కారాలుగా అవుతాయి. మళ్ళీ చెడు సంస్కారాలు యోగబలముతో మంచిగా అవుతాయి. మంచి సంస్కారాలను అక్కడకు తీసుకువెళ్తారు. తండ్రిలో కూడా చదివించే సంస్కారాలు ఉన్నాయి కదా. అందుకే వారు వచ్చి అర్థం చేయిస్తారు. రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. బీజము గురించి కూడా అర్థం చేయిస్తారు, అలాగే మొత్తం వృక్షమంతటి గురించి కూడా అర్థం చేయిస్తారు. బీజము గురించి అర్థం చేయించడం జ్ఞానము మరియు వృక్షము గురించి అర్థం చేయించడం భక్తి. భక్తిలో ఎంతో విస్తారము ఉంటుంది కదా. బీజాన్ని స్మృతి చేయడమైతే సహజము. అక్కడికే వెళ్ళిపోవాలి. తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవ్వడానికి కొద్ది సమయమే పడుతుంది. మళ్ళీ సతోప్రధానుల నుండి తమోప్రధానులుగా అవ్వడానికి ఏక్యురేట్ గా 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ చక్రము చాలా ఏక్యురేట్ గా తయారుచేయబడి ఉంది, ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇంకెవ్వరూ ఈ విషయాలను తెలియజేయలేరు. మీరు తెలియజేయగలరు. దీనిని సగం, సగం చేయడం జరుగుతుంది. సగం స్వర్గము, సగం నరకము, ఆ తర్వాత దాని విస్తారాన్ని కూడా తెలియజేస్తారు. స్వర్గములో జన్మలు తక్కువగా, ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. నరకములో జన్మలు ఎక్కువగా, ఆయుష్షు తక్కువగా ఉంటుంది. అక్కడ యోగులు ఉంటారు, ఇక్కడ భోగులు ఉంటారు, అందుకే ఇక్కడ ఎన్నో జన్మలు ఉంటాయి. ఈ విషయాల గురించి ఇంకెవ్వరికీ తెలియదు. మనుష్యులకైతే అసలు ఏమీ తెలియదు. దేవతలు ఎప్పుడు ఉండేవారు, వారు అలా ఎలా తయారయ్యారు, ఎంత వివేకవంతులుగా అయ్యారు - ఇది కూడా మీకు తెలుసు. తండ్రి ఈ సమయములో పిల్లలను చదివించి వారికి 21 జన్మల కొరకు వారసత్వాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఇక మీ ఈ సంస్కారాలు ఉండవు. రాజ్య సంస్కారాలు ఉన్నప్పుడు జ్ఞానానికి సంబంధించిన చదువుకునే సంస్కారాలు పూర్తయిపోతాయి. ఈ సంస్కారాలు పూర్తయ్యాక నంబరువారు పురుషార్థానుసారంగా రుద్రమాలలో కూర్చబడతారు, మళ్ళీ పాత్రను అభినయించడానికి నంబరువారుగా వస్తారు. ఎవరైతే పూర్తి 84 జన్మలను తీసుకున్నారో వారు మొదట వస్తారు. వారి పేరును కూడా చెప్తారు. శ్రీకృష్ణుడు స్వర్గము యొక్క మొదటి యువరాజు. కేవలం ఒక్కరే ఉండరు, మొత్తం రాజధాని అంతా ఉంటుంది అని మీకు తెలుసు. రాజుతోపాటు ప్రజలు కూడా కావాలి. ఒకరి నుండి ఇంకొకరు జన్మ తీసుకుంటూ ఉండవచ్చు. ఒకవేళ 8 మంది కలిసే వస్తారు అని అన్నా శ్రీకృష్ణుడైతే మొదటి నంబరులో వస్తారు కదా. 8 మంది కలిసే వస్తే మరి శ్రీకృష్ణుడికి ఇంత మహిమ ఎందుకు ఉంది? ఈ విషయాలన్నింటినీ మున్ముందు అర్థం చేయిస్తారు. ఈ రోజు మీకు చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని అంటారు కదా. అంటే ఇంకా కొంత మిగిలి ఉందని కదా. ఎవరైనా ఏ విషయాన్ని అయినా అర్థం చేసుకోవడం లేదు అని గమనించినప్పుడు - మా పెద్ద అక్కయ్య దీనికి జవాబు ఇవ్వగలరు అని చెప్పండి లేకపోతే తండ్రి దీని గురించి ఇంకా అర్థం చేయించలేదు, వారు రోజురోజుకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తారు అని చెప్పండి, ఈ యుక్తి బాగుంటుంది. ఇలా చెప్పడంలో సిగ్గుపడే విషయమేదీ లేదు. గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపించినప్పుడు, అవి విని మీకు చాలా సంతోషమనిపిస్తుంది. చివరిలో ఇక మన్మనాభవ, మధ్యాజీభవ అని చెప్తారు. ఈ పదాలను కూడా శాస్త్రాలను తయారుచేసేవారే వ్రాసారు. ఇందులో తికమకపడవలసిన అవసరమేదీ లేదు. కొడుకు తండ్రికి చెందినవాడిగా అవ్వడంతోనే అనంతమైన సుఖము లభిస్తుంది. ఇందులో మనసా, వాచా, కర్మణా పవిత్రత అవసరముంది. లక్ష్మీ-నారాయణులకు తండ్రి వారసత్వం లభించింది కదా. వీరు మొదటి నంబరులో ఉన్నారు, వీరికే పూజ జరుగుతుంది. స్వయాన్ని కూడా చూసుకోండి - నాలో ఇటువంటి గుణాలు ఉన్నాయా. ఇప్పుడైతే ఏ గుణాలు లేకుండా ఉన్నారు కదా. తమ అవగుణాల గురించి కూడా ఎవ్వరికీ తెలియదు.

ఇప్పుడు మీరు తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున తప్పకుండా పరివర్తన అవ్వాలి. తండ్రి బుద్ధి తాళాన్ని తెరిచారు. బ్రహ్మా మరియు విష్ణువు యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. వీరు పతితులు, వారు పావనులు. దత్తత తీసుకోవడమనేది ఈ పురుషోత్తమ సంగమయుగములోనే జరుగుతుంది. ప్రజాపిత బ్రహ్మా ఎప్పుడైతే ఉంటారో, అప్పుడే దత్తత తీసుకోవడం జరుగుతుంది. సత్యయుగములో అది జరుగదు. ఇక్కడ కూడా ఎవరికైనా పిల్లలు లేకపోతే దత్తత తీసుకుంటారు. ప్రజాపితకు కూడా తప్పకుండా బ్రాహ్మణ పిల్లలు కావాలి. వీరు ముఖ వంశావళి, వారు కుఖ వంశావళి. బ్రహ్మా అయితే ఎంతో ప్రసిద్ధమైనవారు. వీరి ఇంటి పేరే ఎంతో అనంతమైనది. ప్రజాపిత బ్రహ్మా ఆదిదేవ్ అని అందరూ భావిస్తారు, వారిని ఇంగ్లీషులో గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఇది అనంతమైన ఇంటి పేరు. మిగిలినవన్నీ హద్దులోని ఇంటి పేర్లు. అందుకే తండ్రి అర్థం చేయిస్తారు - భారత్ అన్నింటికన్నా అతి పెద్ద తీర్థ స్థానమని, అందులోకి అనంతమైన తండ్రి వస్తారని ఈ విషయము తప్పకుండా అందరికీ తెలియాలి. అలాగని వారు మొత్తం భారతదేశమంతా విరాజమానమై ఉన్నారని కాదు. శాస్త్రాలలో మగధ దేశము అని వ్రాసారు, కానీ జ్ఞానాన్ని ఎక్కడ నేర్పించారు? ఆబూలోకి ఎలా వచ్చారు? దిల్వాడా మందిరం కూడా ఇక్కడ పూర్తి స్మృతిచిహ్నముగా ఉంది. దీనిని ఎవరైతే తయారుచేసారో, వారి బుద్ధిలోకి ఇది వచ్చింది, దానితో వారు కూర్చొని తయారుచేసారు. ఏక్యురేట్ మోడల్ నైతే తయారుచేయలేరు. తండ్రి ఇక్కడికే వచ్చి సర్వుల సద్గతిని చేస్తారు, అంతేకానీ మగధ దేశములో కాదు. అది పాకిస్థాన్ అవుతుంది, ఇది పాక్ స్థాన్ (పవిత్రమైన స్థానము). వాస్తవానికి పాక్ స్థాన్ (పవిత్రమైన స్థానము) అని స్వర్గాన్ని అంటారు. పవిత్రత మరియు అపవిత్రతకు సంబంధించి ఈ డ్రామా తయారై ఉంది.

కావున మధురాతి మధురమైన, చాలాకాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలూ - ఆత్మలైన మీరు మరియు పరమాత్మ ఎంతో కాలంగా దూరంగా ఉన్నారు... అని అర్థం చేసుకున్నారు. ఎంతకాలం తర్వాత కలుసుకున్నారు? మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటారు? ఎప్పుడైతే సద్గురువు మధ్యవర్తి రూపములో లభించారో అప్పుడు సుందర మిలనాన్ని జరిపారు. గురువులైతే ఎందరో ఉన్నారు కదా, అందుకే సద్గురువు అని అంటారు. స్త్రీకి ఎప్పుడైతే ముడి వేస్తారో, అప్పుడు కూడా ఈ పతి నీకు గురువు, ఈశ్వరుడు అని అంటారు. కానీ ఆ పతియే మొట్టమొదట అపవిత్రంగా చేస్తాడు. ఈ రోజుల్లోనైతే ప్రపంచములో ఎంతో అశుద్ధత ఉంది. ఇప్పుడు పిల్లలైన మీరైతే పుష్పాలుగా అవ్వాలి. పిల్లలైన మీకు పక్కా-పక్కా ముడిని తండ్రి వేస్తారు.

వాస్తవానికి శివ జయంతితోపాటే రక్షాబంధనము కూడా జరుగుతుంది. అలాగే గీతా జయంతి కూడా జరగాలి. శ్రీకృష్ణుడి జయంతి కాస్త తర్వాత కొత్త ప్రపంచములో జరిగింది. వాస్తవానికి పండగలన్నీ ఈ సమయానికి చెందినవే. రామనవమి ఎప్పుడు జరిగింది - ఇది కూడా ఎవరికైనా తెలుసా? కొత్త ప్రపంచములో 1250 సంవత్సరాల తర్వాత రామనవమి జరుగుతుంది అని మీరంటారు. శివ జయంతి, కృష్ణ జయంతి, రామ జయంతి ఎప్పుడు జరిగాయి...? ఇది ఎవ్వరూ తెలియజేయలేరు. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు తండ్రి ద్వారానే తెలుసుకున్నారు. మీరు ఏక్యురేట్ గా చెప్పగలుగుతారు. అనగా మొత్తం ప్రపంచమంతటి జీవిత గాథ గురించి మీరు చెప్పగలుగుతారు. లక్షల సంవత్సరాల విషయాన్ని అయితే చెప్పలేరు. తండ్రి ఎంత మంచి అనంతమైన చదువును చదివిస్తారు. ఒకేసారి మీరు 21 జన్మల కొరకు వివస్త్రగా అవ్వడం నుండి రక్షింపబడతారు. ఇప్పుడు మీరు పంచ వికారాల రూపీ రావణుడి యొక్క పరాయి రాజ్యములో ఉన్నారు. ఇప్పుడు మొత్తం 84 జన్మల చక్రం మీ స్మృతిలోకి వచ్చింది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అనంతమైన సుఖ వారసత్వాన్ని ప్రాప్తి చేసుకునేందుకు మనసా, వాచా, కర్మణా పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. మంచి సంస్కారాలను యోగబలం ద్వారా ధారణ చేయాలి. స్వయాన్ని గుణవంతులుగా చేసుకోవాలి.

2. సదా సంతోషములో ఉండేందుకు తండ్రి రోజూ ఏవైతే గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తారో, వాటిని వినాలి మరియు ఇతరులకు వినిపించాలి. ఏ విషయములోనూ తికమకపడకూడదు. యుక్తిగా జవాబు ఇవ్వాలి. సిగ్గుపడకూడదు.

వరదానము:-

సుఖ స్వరూపులై ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇచ్చే మాస్టర్ సుఖదాత భవ

ఏ పిల్లలైతే సదా యథార్థ కర్మలను చేస్తారో వారికి ఆ కర్మలకు ప్రత్యక్ష ఫలముగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి. వారి హృదయము సదా సంతోషముగా ఉంటుంది, వారికి సంకల్పమాత్రము కూడా దుఃఖపు అల రాలేదు. సంగమయుగీ బ్రాహ్మణులు అనగా దుఃఖము యొక్క నామ-రూపాలు కూడా ఉండవు ఎందుకంటే మీరు సుఖదాత పిల్లలు. అటువంటి సుఖదాత పిల్లలు స్వయం కూడా మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు. వారు ప్రతి ఆత్మకు సదా సుఖాన్ని ఇస్తారు. వారు ఎప్పుడూ దుఃఖాన్ని ఇవ్వరు, దుఃఖాన్ని తీసుకోరు.

స్లోగన్:-

మాస్టర్ దాతలుగా అయ్యి సహయోగాన్ని, స్నేహాన్ని మరియు సహానుభూతిని ఇవ్వటము - ఇదే దయాహృదయము కల ఆత్మకు గుర్తు.