09-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి పిల్లలైన మిమ్మల్ని భక్తాత్మల నుండి జ్ఞానీ ఆత్మలుగా చేయడానికి, పతితుల నుండి పావనులుగా చేయడానికి వచ్చారు’’

ప్రశ్న:-
జ్ఞానవంతులైన పిల్లలు ఏ చింతనలో సదా ఉంటారు?

జవాబు:-
నేను అవినాశీ ఆత్మను, ఈ శరీరము వినాశీ. నేను 84 శరీరాలను ధారణ చేసాను. ఇప్పుడిది అంతిమ జన్మ. ఆత్మ ఎప్పుడూ చిన్నగా, పెద్దగా అవ్వదు. శరీరమే చిన్నగా, పెద్దగా అవుతుంది. ఈ కనులు శరీరములో ఉన్నాయి కానీ వీటి ద్వారా చూసేది ఆత్మనైన నేను. బాబా ఆత్మలకే జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని ఇస్తారు. వారు కూడా ఎప్పటివరకైతే శరీరాన్ని ఆధారముగా తీసుకోరో, అప్పటివరకూ చదివించలేరు. ఇటువంటి చింతనను జ్ఞానవంతులైన పిల్లలు సదా చేస్తారు.

ఓంశాంతి
ఇది ఎవరు అన్నారు? ఆత్మ. అవినాశీ ఆత్మ శరీరము ద్వారా అన్నది. శరీరము మరియు ఆత్మలో ఎంత తేడా ఉంది. శరీరము పంచ తత్వాలతో ఇంత పెద్ద బొమ్మగా తయారవుతుంది. శరీరము చిన్నగా ఉన్నా కానీ అది ఆత్మ కంటే తప్పకుండా పెద్దదిగానే ఉంటుంది. మొదటైతే చాలా చిన్నని పిండముగా ఉంటుంది, ఎప్పుడైతే అది కొద్దిగా పెరుగుతుందో అప్పుడు ఆత్మ ప్రవేశిస్తుంది. అది పెద్దగా అవుతూ, అవుతూ ఇంత పెద్దగా అయిపోతుంది. ఆత్మ అయితే చైతన్యమైనది కదా. ఎప్పటివరకైతే ఆత్మ ప్రవేశించదో అప్పటివరకూ ఈ బొమ్మ ఎందుకూ పనికిరాదు. ఎంత తేడా ఉంది. మాట్లాడేది, నడిచేది కూడా ఆత్మయే. అది ఇంత చిన్న బిందువు. అది ఎప్పుడూ చిన్నగా, పెద్దగా అవ్వదు, వినాశనమవ్వదు. ఇప్పుడు పరమాత్మ అయిన తండ్రి అర్థం చేయించారు - నేను అవినాశీని మరియు ఈ శరీరము వినాశీ, నేను ఈ శరీరములోకి ప్రవేశించి పాత్రను అభినయిస్తాను. ఈ విషయాలను మీరు ఇప్పుడు చింతనలోకి తీసుకువస్తారు. ఇంతకుముందైతే ఆత్మను గురించి తెలియదు, అలాగే పరమాత్మను గురించి తెలియదు. కేవలం ఏదో నామమాత్రంగా - ఓ పరమపిత పరమాత్మ అని అనేవారు. ఆత్మగా కూడా భావించేవారు కానీ మళ్ళీ ఎవరో నీవు పరమాత్మవు అని అనేసారు. ఇలా ఎవరు అన్నారు? ఈ భక్తి మార్గపు గురువులు మరియు శాస్త్రాలు. సత్యయుగములో ఎవరూ ఇలా అనరు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, మీరు నా పిల్లలు. ఆత్మ న్యాచురల్ (సహజసిద్ధమైనది), శరీరము అన్ న్యాచురల్ (కృత్రిమమైనది), మట్టితో తయారుచేయబడ్డది. ఆత్మ ఉన్నప్పుడు మాట్లాడుతుంది, నడుస్తుంది. ఆత్మలైన మనకు తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. నిరాకారుడైన శివబాబా ఈ సంగమములోనే ఈ శరీరము ద్వారా వచ్చి వినిపిస్తారు. ఈ కనులైతే శరీరములోనే ఉంటాయి. ఇప్పుడు తండ్రి జ్ఞాన చక్షువులు ఇస్తారు. ఆత్మలో జ్ఞానము లేకపోతే అజ్ఞాన చక్షువులు ఉన్నట్లు. తండ్రి వచ్చినప్పుడు ఆత్మకు జ్ఞాన చక్షువులు లభిస్తాయి. ఆత్మయే అన్నీ చేస్తుంది. ఆత్మ శరీరము ద్వారా కర్మలు చేస్తుంది. తండ్రి ఈ శరీరాన్ని ధారణ చేశారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు తమ రహస్యాన్ని కూడా తెలియజేస్తారు, అలాగే సృష్టి ఆదిమధ్యాంత రహస్యాన్ని కూడా తెలియజేస్తారు. మొత్తం నాటకము గురించిన జ్ఞానాన్ని కూడా ఇస్తారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు. ఇది తప్పకుండా నాటకమే. సృష్టి చక్రము తిరుగుతుంది కానీ ఎలా తిరుగుతుంది, ఇది ఎవ్వరికీ తెలియదు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంత జ్ఞానము ఇప్పుడు మీకు లభిస్తుంది. మిగిలినదంతా భక్తియే. తండ్రే వచ్చి మిమ్మల్ని జ్ఞానీ ఆత్మలుగా తయారుచేస్తారు. ఇంతకుముందు మీరు భక్త ఆత్మలుగా ఉండేవారు. ఆత్మ అయిన నీవు భక్తి చేసేవాడవు, ఇప్పుడు ఆత్మ అయిన నీవు జ్ఞానాన్ని వింటున్నావు. భక్తిని అంధకారము అని అంటారు. భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారు అని అనరు. తండ్రి అర్థం చేయించారు, భక్తి యొక్క పాత్ర కూడా ఉంది, జ్ఞానము యొక్క పాత్ర కూడా ఉంది. మనం భక్తి చేసేటప్పుడు ఎటువంటి సుఖము ఉండేది కాదని అని మీకు తెలుసు. భక్తి చేస్తూ ఎదురుదెబ్బలు తింటూ ఉండేవారము, తండ్రిని వెదుకుతూ ఉండేవారము. ఇప్పుడు అర్థం చేసుకున్నారు - యజ్ఞ, తప, దాన పుణ్యాదులు మొదలైనవి ఏవైతే చేస్తారో, అక్కడ వెదుకుతూ, వెదుకుతూ, ఎదురుదెబ్బలు తింటూ, తింటూ విసిగిపోతారు. తమోప్రధానముగా అయిపోతారు, ఎందుకంటే కిందకు పడడమే అవుతుంది కదా. అసత్యమైన పనులు చేస్తూ, ఛీ-ఛీగా అవుతూ ఉంటారు, పతితులుగా కూడా అయిపోయారు. పావనులుగా అయ్యేందుకు భక్తి చేసేవారని కాదు. భగవంతుని ద్వారా పావనముగా అవ్వకుండా మనం పావన ప్రపంచములోకి వెళ్ళలేము. పావనముగా అవ్వకుండా భగవంతుడిని కలుసుకోలేమని కాదు. భగవంతుడినైతే, మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని కోరుకుంటారు. పతితులే పావనులుగా అయ్యేందుకు భగవంతుడిని కలుసుకుంటారు. పావనులనైతే భగవంతుడు కలుసుకోరు. సత్యయుగములో ఈ లక్ష్మీ-నారాయణులను భగవంతుడు కలుసుకోరు. భగవంతుడు వచ్చి పతితులైన మిమ్మల్ని పావనముగా తయారుచేస్తారు మరియు మీరు ఈ శరీరాన్ని వదిలేస్తారు. పావనులైతే ఈ తమోప్రధానమైన పతిత సృష్టిలో ఉండలేరు. తండ్రి మిమ్మల్ని పావనముగా తయారుచేసి మాయమైపోతారు, డ్రామాలోని వారి పాత్రయే అద్భుతమైనది. ఏ విధంగా ఆత్మ చూడటానికి కనిపించదు. సాక్షాత్కారము జరిగినా కానీ అర్థం చేసుకోలేరు. వీరు ఫలానా, వీరు ఫలానా అని ఇతరులందరినీ అర్థం చేసుకోగలరు, వారిని తలచుకుంటారు. ఫలానావారి చైతన్య సాక్షాత్కారము జరగాలి అని కోరుకుంటారు. అందులో వేరే ఉపయోగమేమీ లేదు. అచ్ఛా, చైతన్యముగా చూస్తారు, ఆ తర్వాత ఏమిటి? సాక్షాత్కారం జరుగుతుంది, ఆ తర్వాత మాయమైపోతారు. అల్పకాలికమైన, క్షణభంగురమైన సుఖపు ఆశ పూర్తవుతుంది. దానిని అల్పకాలికమైన, క్షణభంగురమైన సుఖము అని అంటారు. సాక్షాత్కారపు కోరిక ఉంటుంది, అది లభిస్తుంది. ఇక్కడైతే ముఖ్యమైన విషయము పతితుల నుండి పావనులుగా అవ్వడము, అంతే. పావనులుగా అయినట్లయితే దేవతలుగా అయిపోతారు అనగా స్వర్గములోకి వెళ్ళిపోతారు.

శాస్త్రాలలో అయితే కల్పం ఆయువును లక్షల సంవత్సరాలుగా వ్రాసేసారు. కలియుగానికి ఇంకా 40 వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయి అని భావిస్తారు. బాబా అయితే అర్థం చేయిస్తారు, మొత్తం కల్పమే 5000 సంవత్సరాలది. కావున మరి మనుష్యులు అంధకారములో ఉన్నట్లే కదా. దానిని ఘోర అంధకారము అని అంటారు. జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. అదంతా భక్తియే. రావణుడు ఎప్పటినుండైతే వస్తాడో, అప్పటినుండీ భక్తి కూడా అతడితోపాటు ఉంటుంది మరియు ఎప్పుడైతే తండ్రి వస్తారో అప్పుడు వారితోపాటు జ్ఞానము ఉంటుంది. తండ్రి ద్వారా ఒకేసారి జ్ఞాన వారసత్వము లభిస్తుంది. అది ఘడియ, ఘడియా లభించదు. అక్కడైతే మీరు ఎవ్వరికీ జ్ఞానాన్ని ఇవ్వరు. అవసరమే ఉండదు. ఎవరైతే అజ్ఞానములో ఉన్నారో, వారికి జ్ఞానము లభిస్తుంది. తండ్రి గురించి అయితే ఎవ్వరికీ తెలియనే తెలియదు. తండ్రిని నిందించకుండా అసలు ఎవ్వరూ మాట్లాడనే మాట్లాడరు. ఇది కూడా పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఈశ్వరుడు సర్వవ్యాపి కారు, వారు ఆత్మలైన మన తండ్రి అని మీరు అంటారు, మరియు వారు, అలా కాదు, పరమాత్మ రాయిరప్పలలో ఉన్నారు అని అంటారు. పిల్లలైన మీరు బాగా అర్థం చేసుకున్నారు - భక్తి పూర్తిగా వేరు, అందులో కొద్దిగా కూడా జ్ఞానము ఉండదు. అసలు సమయమే పూర్తిగా మారిపోతుంది. భగవంతుని పేరు కూడా మారిపోతుంది, ఆ తర్వాత మనుష్యుల పేరు కూడా మారిపోతుంది. మొదట దేవతలు అని అంటారు, ఆ తర్వాత క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. దేవతలు దైవీ గుణాలు కల మనుష్యులు మరియు వీరు ఆసురీ గుణాలు కల మనుష్యులు. వీరు పూర్తిగా అశుద్ధముగా ఉన్నారు. గురునానక్ కూడా అన్నారు - ఇతరుల సంపాదనను భక్షించే దొంగలు మరియు దోపిడీదారులు లెక్కలేనంత మంది ఉన్నారు... అని. మనుష్యులెవరైనా ఇలా అంటే, నీవు ఇలా నిందిస్తున్నావు ఏమిటి అని వెంటనే అనేస్తారు. కానీ తండ్రి అంటారు, వీరందరూ ఆసురీ సాంప్రదాయమువారు. మీకు స్పష్టంగా అర్థం చేయిస్తారు. వారు రావణ సాంప్రదాయమువారు, వీరు రామ సాంప్రదాయమువారు. మాకు రామరాజ్యము కావాలి అని గాంధీజీ కూడా అనేవారు. రామ రాజ్యములో అందరూ నిర్వికారులు ఉన్నారు, రావణ రాజ్యములో అందరూ వికారులు ఉన్నారు. దీని పేరే వేశ్యాలయము. ఇది రౌరవ నరకము కదా. ఈ సమయములోని మనుష్యులు విషయ వైతరిణీ నదిలో పడి ఉన్నారు. మనుష్యులు, జంతువులు అంతా ఒకేలా ఉన్నారు. మనుష్యులకు ఎటువంటి మహిమా లేదు. పంచ వికారాలపై పిల్లలైన మీరు విజయాన్ని పొంది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే పదవిని పొందుతారు, మిగిలినవారంతా అంతమైపోతారు. దేవతలు సత్యయుగములో ఉండేవారు. ఇప్పుడు ఈ కలియుగములో అసురులు ఉంటారు. అసురులకు గుర్తు ఏమిటి? 5 వికారాలు. దేవతలను సంపూర్ణ నిర్వికారులు అని అంటారు మరియు అసురులను సంపూర్ణ వికారులు అని అంటారు. వారు 16 కళల సంపూర్ణులుగా ఉంటారు మరియు ఇక్కడ వీరు ఏ కళలూ లేనివారిగా ఉంటారు. అందరి ఆత్మ మరియు శరీరములోని విశేషతలు మరియు శక్తి అంతమైపోయాయి. ఇప్పుడు ఇది తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. పాత ఆసురీ ప్రపంచాన్ని మార్చేందుకే తండ్రి వస్తారు. రావణ రాజ్యమైన వేశ్యాలయాన్ని శివాలయముగా తయారుచేస్తారు. వారైతే త్రిమూర్తీ హౌస్, త్రిమూర్తి రోడ్ అని ఇక్కడే పేర్లు పెట్టేశారు. ఇంతకుముందు ఆ పేర్లు ఉండేవి కావు. వాస్తవానికి ఇప్పుడు ఏ పేరు ఉండాలి? ఈ ప్రపంచమంతా ఎవరిది? పరమాత్మది కదా. ఇది పరమాత్ముని ప్రపంచము, ఇది అర్ధకల్పము పవిత్రముగా, అర్ధకల్పము అపవిత్రముగా ఉంటుంది. రచయిత అని తండ్రినే అంటారు కదా. కావున ఇది వారి ప్రపంచమే కదా. తండ్రి అర్థం చేయిస్తారు, నేనే అధిపతిని, నేను బీజరూపుడను, చైతన్యమును, జ్ఞానసాగరుడను. నాలో మొత్తం జ్ఞానమంతా ఉంది, ఇది ఇంకెవ్వరిలోనూ లేదు. ఈ సృష్టి చక్రపు ఆదిమధ్యాంత జ్ఞానము కేవలం తండ్రిలోనే ఉంది అని మీరు అర్థం చేసుకోగలరు. మిగిలినవన్నీ కేవలం ప్రగల్భాలు మాత్రమే. ముఖ్యమైన ప్రగల్భము చాలా చెడ్డది, దాని గురించి తండ్రి ఫిర్యాదు చేస్తారు, అదేమిటంటే, మీరు నన్ను రాయిరప్పలలో, కుక్క-పిల్లిలో ఉన్నానని భావించారు, మీకు ఎటువంటి దుర్దశ ఏర్పడింది.

కొత్త ప్రపంచపు మనుష్యులకు మరియు పాత ప్రపంచపు మనుష్యులకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. అర్ధకల్పము నుండి మొదలుకుని అపవిత్ర మనుష్యులు పవిత్ర దేవతలకు నమస్కరిస్తారు. మొట్టమొదట శివబాబా పూజ జరుగుతుందని కూడా పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఆ శివబాబాయే మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారుచేస్తారు. రావణుడు మిమ్మల్ని పూజ్యుల నుండి పూజారులుగా చేస్తాడు. మళ్ళీ తండ్రి డ్రామా ప్లాన్ అనుసారంగా మిమ్మల్ని పూజ్యులుగా తయారుచేస్తారు. రావణుడు మొదలైన పేర్లన్నీ ఉన్నాయి కదా. దసరాను జరుపుకున్నప్పుడు ఎంతమంది వ్యక్తులను బైట నుండి పిలుస్తారు. కానీ దాని అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోరు. దేవతలను ఎంతగా నిందిస్తారు. వాస్తవానికి అటువంటి విషయాలేవీ లేవు. ఈశ్వరుడు నామ-రూపాలకు అతీతుడు అని అంటారు అనగా అతను లేనే లేరు అని. అలాగే వారు ఈ నాటకాలు మొదలైనవేవైతే తయారుచేస్తున్నారో వాస్తవానికి అవేవీ లేవు. ఇదంతా మనుష్యుల బుద్ధి. మనుష్య మతాన్ని ఆసురీ మతము అని అంటారు. యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ అలా అయిపోతారు. దీనిని ఆసురీ ప్రపంచము అనే అంటారు. అందరూ ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. కావున తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, మీరు కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మీరు అజ్ఞానములో ఉన్నప్పుడు పరమాత్మను పైన ఎక్కడో ఉన్నారు అని భావించేవారు. ఇప్పుడైతే తండ్రి ఇక్కడకు వచ్చి ఉన్నారు అని తెలుసు, కావున ఇప్పుడు మీరు వారు పైన ఉన్నారని భావించరు. మీరు తండ్రిని ఇక్కడకు, ఈ తనువులోకి పిలిచారు. మీరు మీ మీ సెంటర్లలో కూర్చున్నప్పుడు శివబాబా మధుబన్ లో వీరి తనువులో ఉన్నారు అని భావిస్తారు. భక్తి మార్గములోనైతే పరమాత్మను పైన ఉన్నారు అని భావించేవారు. ఓ భగవంతుడా... అని పిలిచేవారు. ఇప్పుడు మీరు తండ్రిని ఎక్కడ స్మృతి చేస్తారు? మీరు కూర్చుని ఏం చేస్తారు? వారు బ్రహ్మా తనువులో ఉన్నారు అని మీకు తెలుసు కావున తప్పకుండా ఇక్కడ స్మృతి చేయవలసి ఉంటుంది. వారు పైన అయితే లేరు. ఇప్పుడు ఇక్కడకు వచ్చి ఉన్నారు, పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. తండ్రి అంటారు, మిమ్మల్ని ఇంత ఉన్నతముగా చేయడానికి నేను ఇక్కడకు వచ్చాను. పిల్లలైన మీరు ఇక్కడ స్మృతి చేస్తారు, భక్తులు పైన స్మృతి చేస్తారు. మీరు విదేశాలలో ఉన్నా కానీ బ్రహ్మా తనువులో శివబాబా ఉన్నారు అనే అంటారు. తనువు అయితే తప్పకుండా కావాలి కదా. మీరు ఎక్కడ కూర్చుని ఉన్నా తప్పకుండా ఇక్కడే స్మృతి చేస్తారు. బ్రహ్మా తనువులోనే స్మృతి చేయవలసి ఉంటుంది. ఎందరో బుద్ధిహీనులు బ్రహ్మాను ఒప్పుకోరు. బాబా ఏమీ బ్రహ్మాను స్మృతి చేయకండి అని అనరు. బ్రహ్మా లేకుండా శివబాబా ఎలా గుర్తుకువస్తారు. తండ్రి అంటారు, నేను ఈ తనువులో ఉన్నాను, నన్ను ఈ తనువులో స్మృతి చేయండి అని, అందుకే మీరు తండ్రి మరియు దాదా, ఇరువురినీ స్మృతి చేస్తారు. బుద్ధిలో ఈ జ్ఞానము ఉంది, ఇతనిలో ఇతని ఆత్మ ఉంది. శివబాబాకైతే తమ శరీరము లేదు. నేను ఈ ప్రకృతి ఆధారాన్ని తీసుకుంటాను అని తండ్రి అన్నారు. తండ్రి కూర్చుని మొత్తం బ్రహ్మాండము మరియు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు, ఇంకెవ్వరికీ బ్రహ్మాండము గురించి తెలియనే తెలియదు. నేను మరియు పిల్లలైన మీరు ఉండే స్థానము బ్రహ్మాండము. సుప్రీమ్ తండ్రి మరియు నాన్-సుప్రీమ్ ఆత్మలు ఉండే ఆ బ్రహ్మలోకము శాంతిధామము. శాంతిధామము చాలా మధురమైన పేరు. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. మనం వాస్తవానికి బ్రహ్మా మహాతత్వపు నివాసులము, దానిని నిర్వాణధామము, వానప్రస్థము అని అంటారు. ఈ విషయాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. భక్తి ఉన్నప్పుడు జ్ఞానము అన్న మాటే ఉండదు. దీనిని పురుషోత్తమ సంగమయుగము అని అంటారు, ఇప్పుడు పరివర్తన జరుగుతుంది. పాత ప్రపంచములో అసురులు ఉంటారు, కొత్త ప్రపంచములో దేవతలు ఉంటారు, కావున దానిని పరివర్తన చేయడానికి తండ్రికి రావలసి ఉంటుంది. సత్యయుగములో మీకు ఏమీ తెలియదు, ఇప్పడు మీరు కలియుగములో ఉన్నప్పుడు కూడా మీకు ఏమీ తెలియదు. కొత్త ప్రపంచములో ఉన్నప్పుడు కూడా ఈ పాత ప్రపంచము గురించి ఏమీ తెలియదు. ఇప్పుడు పాత ప్రపంచములో ఉన్నారు కావున కొత్త ప్రపంచము గురించి ఏమీ తెలియదు. కొత్త ప్రపంచము ఎప్పుడు ఉండేదో తెలియదు. వారైతే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. తండ్రి కల్పకల్పము ఈ సంగమయుగములోనే వస్తారని పిల్లలైన మీకు తెలుసు, వారు వచ్చి ఈ వెరైటీ వృక్షము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు మరియు ఈ చక్రము ఎలా తిరుగుతుందో, అది కూడా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఇది అర్థం చేయించడమే మీ వ్యాపారము. ఇప్పుడు ఒక్కొక్కరికీ అర్థం చేయించడానికైతే ఎంతో సమయం పడుతుంది, అందుకే ఇప్పుడు మీరు అనేకులకు అర్థం చేయిస్తారు. ఎంతోమంది అర్థం చేసుకుంటారు. ఈ మధురాతి మధురమైన విషయాలను అనేకులకు అర్థం చేయించాలి. మీరు ప్రదర్శని మొదలైనవాటిలో అర్థం చేయిస్తారు కదా. ఇప్పుడు శివ జయంతి సమయములో ఇంకా ఎంతోమందిని బాగా పిలిచి అర్థం చేయించాలి. ఈ నాటకము యొక్క సమయ పరిధి ఎంత అనేది మీరు ఏక్యురేట్ గా తెలియజేస్తారు. ఇవన్నీ టాపిక్స్. మనం కూడా వీటిని అర్థం చేయిస్తాము. మీకు తండ్రి అర్థం చేయిస్తారు కదా, తద్వారా మీరు దేవతలుగా అవుతారు. ఏ విధంగా మీరు అర్థం చేసుకుని దేవతలుగా అవుతారో, అలా ఇతరులను కూడా తయారుచేస్తారు. మీరు ఇలా చెప్తారు - తండ్రి మాకు ఇది అర్థం చేయించారు, మేము ఎవరి గ్లానిని చేయడం లేదు, జ్ఞానాన్ని సద్గతి మార్గము అని అంటారని మేము చెప్తున్నాము, ఆవలి తీరానికి చేర్చేవారు ఒక్క సద్గురువే. ఇటువంటి ముఖ్యమైన పాయింట్లను తీసుకుని అర్థం చేయించండి. ఈ జ్ఞానమంతటినీ ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పూజారుల నుండి పూజ్యులుగా అయ్యేందుకు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. జ్ఞానవంతులుగా అయి స్వయాన్ని స్వయమే పరివర్తన చేసుకోవాలి. అల్పకాలికమైన సుఖాల వెనుక వెళ్ళకూడదు.

2. బాప్ మరియు దాదా, ఇరువురినీ స్మృతి చేయాలి. బ్రహ్మా లేకుండా శివబాబా గుర్తుకు రాలేరు. భక్తిలో వారిని పైన స్మృతి చేసారు, ఇప్పుడు వారు బ్రహ్మా తనువులోకి వచ్చారు, కావున ఇరువురూ గుర్తుకురావాలి.

వరదానము:-
ప్రతి కర్మలోనూ విజయము యొక్క ఎడతెగని నిశ్చయాన్ని మరియు నషాను ఉంచుకునే అధికారీ ఆత్మా భవ

విజయము మా జన్మ సిద్ధ అధికారము - ఈ స్మృతితో సదా ఎగురుతూ ఉండండి. ఏం జరిగినా కానీ - నేను సదా విజయీని అన్నది స్మృతిలోకి తీసుకురండి. ఏదేమైనా కానీ ఈ నిశ్చయము ఎడతెగనిదిగా ఉండాలి. నషాకు ఆధారమే నిశ్చయము. నిశ్చయము తక్కువుగా ఉంటే నషా కూడా తక్కువగా ఉంటుంది, అందుకే నిశ్చయబుద్ధి విజయీ అని అంటారు. నిశ్చయములో అప్పుడప్పుడూ నిశ్చయము ఉండేవారిగా అవ్వకండి. వీరు అవినాశీ తండ్రి కావున అవినాశీ ప్రాప్తికి అధికారులుగా అవ్వండి. ప్రతి కర్మలోనూ విజయము యొక్క నిశ్చయము మరియు నషా ఉండాలి.

స్లోగన్:-
తండ్రి స్నేహము అనే ఛత్రఛాయ కింద ఉన్నట్లయితే ఏ విఘ్నమూ నిలువలేదు.