‘‘సత్యతా మరియు పవిత్రతా శక్తిని స్వరూపములోకి
తీసుకువస్తూ బాలక్ మరియు మాలిక్ స్థితి యొక్క బ్యాలెన్స్
పెట్టండి’’
ఈ రోజు సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరియు సత్ గురువు
నలువైపులా ఉన్న తమ సత్యతా స్వరూపులు, శక్తి స్వరూపులు అయిన
పిల్లలను చూస్తున్నారు ఎందుకంటే సత్యతా శక్తి సర్వ
శ్రేష్ఠమైనది. ఈ సత్యతా శక్తికి ఆధారము - సంపూర్ణ పవిత్రత.
మనసా-వాచ-కర్మణా, సంబంధ-సంపర్కము, స్వప్నములో కూడా అపవిత్రత
యొక్క నామ-రూపాలు ఉండకూడదు. ఇటువంటి పవిత్రతకు ప్రత్యక్ష
స్వరూపముగా ఏమి కనిపిస్తుంది? ఇటువంటి పవిత్ర ఆత్మ యొక్క
నడవడికలో మరియు ముఖములో దివ్యత స్పష్టముగా కనిపిస్తుంది. వారి
నయనాలలో ఆత్మిక మెరుపు ఉంటుంది, ముఖములో సదా హర్షితముఖత ఉంటుంది
మరియు నడవడికలో ప్రతి అడుగులోనూ బాబా సమానముగా కర్మయోగిగా
ఉంటారు. ఇప్పుడు మీరందరూ సత్యమైన తండ్రి ద్వారా ఇటువంటి
సత్యవంతులుగా తయారవుతున్నారు. ప్రపంచములో కూడా ఎంతోమంది తమను
తాము సత్యవంతులుగా చెప్పుకుంటారు, సత్యము కూడా చెప్తారు కానీ
సంపూర్ణ పవిత్రతయే సత్యమైన సత్యతా శక్తి. ఈ విధముగా ఈ
సంగమయుగములో మీరందరూ తయారవుతున్నారు. ఈ సంగమయుగము యొక్క
శ్రేష్ఠమైన ప్రాప్తి - సత్యతా శక్తి మరియు పవిత్రతా శక్తి.
ఇందుకు ప్రాప్తిగా మీరందరూ సత్యయుగములో బ్రాహ్మణ సో దేవతలుగా
అయి ఆత్మ మరియు శరీరము, రెండింటి పరంగా పవిత్రమవుతారు. మొత్తము
సృష్టి చక్రములో మరెవ్వరూ ఆత్మ మరియు శరీరము, రెండింటి పరంగా
పవిత్రమవ్వరు. ఆత్మ పరంగా పవిత్రమవుతారు కానీ శరీరము
పవిత్రమైనది లభించదు. ఇటువంటి సంపూర్ణ పవిత్రతను ఈ సమయములో
మీరందరూ ధారణ చేస్తున్నారు. నషాతో చెప్తారు, నషాతో ఏమని
చెప్తారో గుర్తుందా? గుర్తు తెచ్చుకోండి. పవిత్రత మా జన్మ
సిద్ధ అధికారము అని అందరూ మనస్ఫూర్తిగా చెప్తారు, అనుభవముతో
చెప్తారు. జన్మ సిద్ధ అధికారము సహజముగా ప్రాప్తిస్తుంది
ఎందుకంటే పవిత్రతను మరియు సత్యతను ప్రాప్తి చేసుకోవడానికి
మీరందరూ ముందుగా మీ సత్య స్వరూపమైన ఆత్మను తెలుసుకున్నారు. మీ
సత్యమైన తండ్రిని, సత్యమైన శిక్షకుడిని మరియు సత్ గురువును
గుర్తించారు. గుర్తించారు మరియు పొందారు. ఎప్పటివరకైతే ఎవరైనా
తమ సత్య స్వరూపాన్ని మరియు సత్యమైన తండ్రిని తెలుసుకోరో,
అప్పటివరకు సంపూర్ణ పవిత్రత మరియు సత్యతా శక్తి రాదు.
మరి మీరందరూ సత్యతా మరియు పవిత్రతా శక్తి యొక్క అనుభవీలే కదా!
అనుభవీలేనా? అనుభవీలేనా? వారు ప్రయత్నిస్తున్నారు కానీ
యథార్థముగా తమ స్వరూపాన్ని గాని, సత్యమైన తండ్రి యొక్క యథార్థ
స్వరూపాన్ని గాని తెలుసుకోలేరు. మరి మీరందరూ ఈ సమయము యొక్క
అనుభవము ద్వారా పవిత్రతను ఎంత సహజముగా అలవరచుకున్నారంటే ఈ సమయపు
ప్రాప్తి యొక్క ప్రారబ్ధముగా దేవతలలో పవిత్రత నేచురల్ గా మరియు
నేచర్ గా ఉంటుంది. ఇటువంటి నేచురల్ నేచర్ యొక్క అనుభవాన్ని మీరే
ప్రాప్తి చేసుకుంటారు. కనుక చెక్ చేసుకోండి - పవిత్రతా మరియు
సత్యతా శక్తి నేచురల్ నేచర్ గా అయ్యాయా? మీరు ఏమని
భావిస్తున్నారు? పవిత్రత మా జన్మ సిద్ధ అధికారము అని ఎవరైతే
భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. జన్మ సిద్ధ అధికారముగా ఉందా
లేక కష్టపడవలసి వస్తుందా? కష్టపడవలసిన అవసరం రావడం లేదు కదా!
సహజమే కదా! ఎందుకంటే జన్మ సిద్ధ అధికారము అనేది సహజముగానే
ప్రాప్తిస్తుంది, కష్టపడవలసిన అవసరముండదు. ప్రపంచము వారు
అసంభవముగా భావిస్తున్నారు కానీ మీరు అసంభవాన్ని సంభవము మరియు
సహజము చేసారు.
కొత్త-కొత్త పిల్లలెవరైతే వచ్చారో, మొదటిసారిగా ఎవరైతే
వచ్చారో, వారు చేతులెత్తండి. అచ్ఛా, కొత్త-కొత్త పిల్లలకు,
కొత్తగా మొదటిసారిగా వచ్చినవారికి అభినందనలు ఎందుకంటే బాప్ దాదా
అంటారు, లేట్ గా (ఆలస్యముగా) వచ్చారు కానీ టూ లేట్ లో రాలేదు.
మరియు కొత్త పిల్లలకు బాప్ దాదా ఇస్తున్న వరదానము ఏమిటంటే -
లాస్ట్ వారు కూడా ఫాస్ట్ పురుషార్థము చేసి ఫస్ట్డివిజన్ లోకి
రావచ్చు. ఫస్ట్నంబరు కాదు కానీ ఫస్ట్డివిజన్ లోకి రావచ్చు. మరి
కొత్త పిల్లలకు అంతటి ధైర్యము ఉందా, ఫస్ట్వస్తాము అని అనేవారు
చేతులెత్తండి. చూడండి, టి.వి.లో మీ చేయి కనిపిస్తుంది. అచ్ఛా!
మీరు ధైర్యవంతులు. మీ ధైర్యానికి అభినందనలు. ధైర్యము ఉంటే
బాబా సహాయము ఉండనే ఉంటుంది, అంతేకాక సర్వ బ్రాహ్మణ పరివారము
యొక్క శుభ భావన, శుభ కామన కూడా మీ అందరితో పాటు ఉన్నాయి. అందుకే
కొత్తవారు ఎవరైతే మొదటిసారిగా వచ్చారో, వారందరికీ బాప్ దాదా
మరియు పరివారము తరఫున మరోసారి పదమాల రెట్ల అభినందనలు, అభినందనలు,
అభినందనలు. మొదటిసారిగా వచ్చిన వారిని చూసి మీ అందరికీ కూడా
సంతోషము కలుగుతుంది కదా! తప్పిపోయిన ఆత్మలు మళ్ళీ తమ
పరివారములోకి చేరుకున్నారు. కావున బాప్ దాదా కూడా
సంతోషిస్తున్నారు మరియు మీరందరూ కూడా సంతోషిస్తున్నారు.
బాప్ దాదా వతనములో దాదీతో కలిసి ఒక రిజల్ట్ ను చూసారు. ఏ
రిజల్ట్ ను చూసారు? మీరు మాలిక్ సో బాలక్ అని మీ అందరికీ తెలుసు
మరియు స్వీకరిస్తున్నారు. అవును కదా! మీరు యజమానులు కూడా మరియు
బాలకులు కూడా. అందరూనా? చేతులెత్తండి. ఆలోచించి ఎత్తండి, ఊరికే
అలా ఎత్తకండి. లెక్క తీసుకుంటాము కదా! అచ్ఛా, చేతులు దించండి.
బాప్ దాదా ఏమి చూసారంటే - బాలకులము అన్న నిశ్చయము మరియు నషా
సహజముగా ఉంటుంది ఎందుకంటే బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారి
అని అనబడుతున్నారంటే బాలకులే, అందుకే బ్రహ్మాకుమార్ మరియు
బ్రహ్మాకుమారి అని పిలువబడుతున్నారు. అలాగే రోజంతా నా బాబా, నా
బాబా అని ఇదే గుర్తు చేసుకుంటారు మరియు తర్వాత మర్చిపోతారు కూడా,
కానీ మళ్ళీ మధ్యమధ్యలో గుర్తుకు వస్తుంటుంది. సేవలో కూడా బాబా,
బాబా అన్న మాట సహజముగా మీ నోటి నుండి వస్తుంటుంది. ఒకవేళ బాబా
అన్న మాట రాకపోతే జ్ఞానము యొక్క ప్రభావము పడదు. మీరు ఏ సేవ
చేసినా, భాషణ ఇచ్చినా, కోర్స్ చెప్పినా, భిన్న-భిన్న టాపిక్స్
పై చెప్పినా, సత్యమైన సేవ యొక్క ప్రత్యక్ష స్వరూపము లేక
ప్రత్యక్ష ప్రమాణము ఏమిటంటే - నేను కూడా బాబాకు చెందినవాడినే
అని వినేవారు అనుభవము చెయ్యాలి. వారి నోటి నుండి కూడా బాబా,
బాబా అన్న మాట రావాలి. ఏదో శక్తి ఉంది అని అనడము కాదు. బాగుంది
అని అనడము కాదు. కానీ నా బాబా అన్నది అనుభవము చెయ్యాలి, దానినే
సేవ యొక్క ప్రత్యక్ష ఫలము అని అంటారు. అయితే, బాలకులము అన్న నషా
మరియు నిశ్చయము బాగానే ఉంటుంది, కానీ యజమానులము అన్న నిశ్చయము
మరియు నషా నంబరువారుగా ఉంటుంది. ప్రాక్టికల్ గా నడవడికలో మరియు
ముఖములో బాలకులము మరియు యజమానులము అన్న నషా ఒక్కోసారి
కనిపిస్తుంది, ఒక్కోసారి తక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి
మీరు డబుల్ యజమానులు - ఒకటి, తండ్రి ఖజానాలకు యజమానులు. అందరూ
ఈ ఖజానాలకు యజమానులే కదా? మరియు బాబా అందరికీ ఖజానాలను ఒకే
మోతాదులో ఇచ్చారు. కొందరికి లక్ష ఇచ్చారు, మరికొందరికి వెయ్యి
ఇచ్చారు అన్నట్లు లేదు. అందరికీ అన్ని ఖజానాలను అనంతముగా
ఇచ్చారు ఎందుకంటే బాబా వద్ద అనంతమైన ఖజానాలు ఉన్నాయి, తక్కువ
లేవు. బాప్ దాదా అందరికీ సర్వ ఖజానాలను ఇచ్చారు మరియు ఒకే
విధముగా, ఒకే మోతాదులో ఇచ్చారు. రెండవది - మీరు స్వరాజ్యానికి
యజమానులు. అందుకే, బాప్ దాదా గర్వముగా అంటారు - నా ఒక్కొక్క
బిడ్డ రాజా బిడ్డ. రాజా పిల్లలే కదా! ప్రజలైతే కాదు కదా? మీరు
రాజయోగులా లేక ప్రజాయోగులా? రాజయోగులు కదా! మీరు స్వరాజ్యానికి
యజమానులు. కానీ బాప్ దాదా దాదీతోపాటు ఏ రిజల్ట్ చూసారంటే -
ఎంతగా బాలకులము అన్న నషా ఉంటుందో, అంతగా యజమానులము అన్న నషా
తక్కువగా ఉంటుంది. ఎందుకని? ఒకవేళ స్వరాజ్యానికి యజమానిని అన్న
నషా సదా ఉన్నట్లయితే, అప్పుడు మధ్యమధ్యలో ఏవైతే సమస్యలు లేక
విఘ్నాలు వస్తాయో, అవి ఇక రాలేవు. నిజానికి చూస్తే, సమస్య లేక
విఘ్నము రావడానికి ఆధారము విశేషముగా మనసు. మనసే అలజడిలోకి
వస్తుంది, అందుకే బాప్ దాదా యొక్క మహామంత్రము - మన్మనాభవ. తన్
మనాభవ, ధన్ మనాభవ అని కాదు. మన్ మనాభవ. ఒకవేళ మీరు
స్వరాజ్యానికి యజమానులుగా ఉన్నట్లయితే మనసు యజమానిగా ఉండదు.
మనసు మీకు కర్మచారి, అంతేకానీ రాజు కాదు. రాజు అనగా అధికారి.
ఆధీనమై ఉండేవారిని రాజు అని అనరు. మరి రిజల్టులో ఏమి చూసాము?
నేను మనసు యొక్క యజమానిని, నేను రాజ్య అధికారిని, యజమానిని - ఈ
స్మృతి, ఈ ఆత్మిక స్థితి తక్కువగా ఉంటుంది, సదా ఉండటము లేదు.
వాస్తవానికి ఇది మొదటి పాఠము, మీరందరూ మొదటి పాఠము ఏమి
నేర్చుకున్నారు? నేను ఆత్మను. పరమాత్మ పాఠము రెండవది. కానీ
మొదటి పాఠము ఏమిటంటే - నేను యజమానిని, రాజును, ఈ
కర్మేంద్రియాలకు అధికారీ ఆత్మను, శక్తిశాలి ఆత్మను, సర్వ
శక్తులు ఆత్మ యొక్క నిజ గుణాలు. బాప్ దాదా ఏమి చూసారంటే - మీరు
ఎవరు, ఎలా ఉన్నారు, ఆ యొక్క నేచురల్ స్వరూపపు స్మృతిలో నడవడము,
ఉండడము, ముఖము ద్వారా అనుభవం కలగడము, సమస్యలను దాటడము, ఇందులో
ఇప్పుడు మరింత అటెన్షన్ కావాలి. కేవలం నేను ఆత్మను అనే కాదు,
కానీ ఎటువంటి ఆత్మను అన్నది స్మృతిలో ఉంచుకున్నట్లయితే మాస్టర్
సర్వశక్తివాన్ ఆత్మ ఎదురుగా ఏ సమస్యకు గాని, విఘ్నానికి గాని,
వచ్చేందుకు శక్తి ఉండదు. ఇప్పటికీ రిజల్ట్ లో ఏదో ఒక సమస్య లేక
విఘ్నము కనిపిస్తుంటుంది. తెలుసు, కానీ నిశ్చయానికి ప్రత్యక్ష
స్వరూపమైన ఆత్మిక నషా నడవడిక మరియు ముఖములో ఇంకా ఎక్కువగా
ప్రత్యక్షము కావాలి. దీని కోసం యజమాని స్థితి యొక్క నషాను
పదే-పదే చెక్ చేసుకోండి. చెక్ చేసుకోవడమనేది క్షణములో చేయగలిగే
విషయము. కర్మలు చేస్తున్నప్పుడు, ఏ కర్మను ఆరంభించినా సరే
ఆరంభము చేసే సమయములో చెక్ చేసుకోండి - యజమానిని అన్న అథారిటీతో
కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించే కంట్రోలింగ్ పవర్, రూలింగ్
పవర్ కల ఆత్మను అని భావిస్తూ కర్మను ప్రారంభించారా లేక
సాధారణముగానే కర్మ ప్రారంభమైందా? స్మృతి స్వరూపముతో కర్మను
ప్రారంభించడానికి మరియు సాధారణ స్థితితో కర్మను
ప్రారంభించడానికి చాలా వ్యత్యాసము ఉంది. ఏ విధముగా హద్దు యొక్క
పదవిలో ఉన్నవారు తమ కార్యాన్ని చేసేటప్పుడు ఆ కార్యము యొక్క
సీట్ పై సెట్ అయి ఆ కార్యాన్ని ప్రారంభిస్తారో, అలా మీ యజమాని
స్థితి యొక్క స్వరాజ్య అధికారీ సీట్ పై సెట్ అయి ప్రతి
కార్యాన్ని చెయ్యండి. యజమానిని అన్న అథారిటీ యొక్క చెకింగ్ ను
మరింతగా పెంచండి. యజమానిని అన్న అథారిటీకి గుర్తు ఏమిటంటే - సదా
ప్రతి కార్యములోనూ డబల్ లైట్ మరియు సంతోషము యొక్క అనుభూతి
కలుగుతుంది మరియు రిజల్ట్ లో సఫలత సహజముగా అనుభవమవుతుంది.
ఇప్పటికీ కూడా అక్కడక్కడ అధికారిని అన్నదానికి బదులుగా
ఆధీనులైపోతున్నారు. ఆధీనతకు ఏమి గుర్తు కనిపిస్తుంది? పదే-పదే
నా సంస్కారాలు అని అంటారు. అలా కోరుకోవటము లేదు కానీ అవి నా
సంస్కారాలు, అది నా నేచర్ అని అంటారు.
బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - ఏ సమయములోనైతే నా
సంస్కారాలు, నా నేచర్ అని అంటున్నారో, ఆ బలహీన సంస్కారాలు మీ
సంస్కారాలా? అవి మీవా? అవి మధ్యలో వచ్చిన రావణుడి సంస్కారాలు,
అవి రావణుడు ఇచ్చిన కానుక. వాటిని నావి అని అనడమే తప్పు. ఏవైతే
బాబా సంస్కారాలో, అవే మీ సంస్కారాలు. ఆ సమయములో ఆలోచించండి,
నావి-నావి అని అనగానే అవి అధికారిగా అయిపోతాయి మరియు మీరు
ఆధీనమైపోతారు. బాబా సమానముగా అవ్వాలి అంటే అవి నా సంస్కారాలు
కావు, ఏవైతే బాబా సంస్కారాలో అవే నా సంస్కారాలు. మరి బాబా
సంస్కారాలు ఏమిటి? విశ్వ కళ్యాణకారి, శుభ భావన, శుభ కామనాధారి.
కావున ఆ సమయములో బాబా సంస్కారాలను ఎదురుగా తెచ్చుకోండి.
లక్ష్యమేమో బాబా సమానముగా అవ్వడము కానీ లక్షణాలు రావణుడివి.
అందుకే మిక్స్అయిపోతాయి. కొన్ని మంచి సంస్కారాలు, బాబా
సంస్కారాలు, కొన్ని నా పాత సంస్కారాలు. ఆ రెండూ కలిసి ఉంటాయి
కదా, అందుకే అలజడి కలుగుతుంది. సంస్కారాలనేవి ఎలా తయారవుతాయి,
అదైతే అందరికీ తెలుసు కదా! మనసు మరియు బుద్ధి యొక్క సంకల్పాలు
మరియు కార్యముతో సంస్కారాలు తయారవుతాయి. ముందుగా మనసు సంకల్పము
చేస్తుంది, బుద్ధి సహయోగము ఇస్తుంది, అప్పుడు మంచి లేక చెడు
సంస్కారాలు తయారవుతాయి.
బాప్ దాదా దాదీతో పాటుగా రిజల్ట్ లో ఏమి చూసారంటే - యజమానిని
అన్న నషా న్యాచురల్ గా మరియు నేచర్ గా ఉండాలి, కానీ అది
బాలకుడిని అన్న నషాతో పోలిస్తే ఇప్పటికీ తక్కువగా ఉంది. అందుకే
- సమాధాన పరచడానికి యుద్ధము చెయ్యడం మొదలుపెడతారు అన్నది బాప్
దాదా గమనించారు. వాస్తవానికి మీరు బ్రాహ్మణులు కానీ మధ్యమధ్యలో
క్షత్రియులుగా అయిపోతారు. క్షత్రియులుగా అవ్వకండి. బ్రాహ్మణ సో
దేవతగా కావాలి. క్షత్రియులుగా అయ్యేవారైతే చాలా మంది
రాబోతున్నారు, వారు వెనుక వస్తారు. మీరైతే అధికారీ ఆత్మలు. మరి
రిజల్ట్ విన్నారా. అందుకే పదే-పదే నేను ఎవరిని అన్నది
స్మృతిలోకి తీసుకురండి. ఎలాగూ ఉన్నాను అని కాదు, స్మృతి
స్వరూపములోకి తీసుకురండి. సరే కదా. అచ్ఛా! రిజల్ట్ ను కూడా
వినిపించాము. ఇప్పుడిక సమస్య అన్న మాటను, విఘ్నము అన్న మాటను,
అలజడి అన్న మాటను, వ్యర్థ సంకల్పాలు అన్న మాటను, వ్యర్థ కర్మలు
అన్న మాటను, వ్యర్థ సంబంధాలు అన్న మాటను, వ్యర్థ స్మృతి అన్న
మాటను సమాప్తము చేయండి మరియు చేయించండి. సరేనా, చేస్తారా?
చేస్తామంటే దృఢ సంకల్పమనే చేతిని ఎత్తండి. ఈ చేతిని ఎత్తడమైతే
సాధారణమైపోయింది, అందుకే చేతులెత్తించడం లేదు. మనసులో దృఢ
సంకల్పమనే చేతిని ఎత్తండి. శరీరము యొక్క చేతిని కాదు, అది చాలా
చూసాము. ఎప్పుడైతే అందరూ కలిసి మనసుతో దృఢ సంకల్పమనే చేతిని
ఎత్తుతారో, అప్పుడే విశ్వములోని మూలములనా అందరూ - మా సుఖదాత,
శాంతిదాత అయిన తండ్రి వచ్చేసారు అని సంతోషముతో చేతులెత్తుతారు.
బాబాను ప్రత్యక్షము చేసే బాధ్యతను తీసుకున్నారు కదా?
తీసుకున్నారా? పక్కానా? టీచర్లు తీసుకున్నారా? పాండవులు
తీసుకున్నారా? పక్కానా? అచ్ఛా, డేట్ ను ఫిక్స్చేసారా? డేట్
ఫిక్స్అవ్వలేదా? ఎంత సమయము కావాలి? ఒక సంవత్సరము కావాలా, రెండు
సంవత్సరాలు కావాలా? ఎన్ని సంవత్సరాలు కావాలి? బాప్ దాదా
చెప్తున్నారు, ప్రతి ఒక్కరూ మీ పురుషార్థపు యథా శక్తి
అనుసారముగా, మీ నేచురల్ నడవడిక మరియు ఎగిరే విధి అనుసారముగా
సంపన్నముగా అయ్యే డేట్ ను మీకు మీరే ఫిక్స్చేసుకోండి. బాప్ దాదా
అయితే ‘ఇప్పుడే చెయ్యండి’ అని అంటారు కానీ యథా శక్తి మీ
పురుషార్థము అనుసారముగా మీ డేట్ ను ఫిక్స్చేసుకోండి మరియు
ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి - సమయమనుసారముగా మనసా యొక్క
స్థితిలో, వాచా యొక్క స్థితిలో, సంబంధ-సంపర్కము యొక్క స్థితిలో
ఉన్నతి జరుగుతుందా? ఎందుకంటే డేట్ ను ఫిక్స్చేసుకున్నట్లయితే
స్వతహాగానే అటెన్షన్ వెళ్తుంది.
అందరి నుండి, అన్ని వైపుల నుండి సందేశము కూడా అందింది. ఈ-మెయిల్స్కూడా
అందాయి. ఈ-మెయిల్ చేరుకునే లోపలే బాప్ దాదా వద్దకు సందేశము
చేరుకుంటుంది. మనసు యొక్క సంకల్పము అనే ఈ-మెయిల్ చాలా
వేగవంతమైనదిగా ఉంటుంది. అది ముందుగా చేరుకుంటుంది. కావున ఎవరైతే
ప్రియస్మృతులను, తమ స్థితి యొక్క సమాచారాన్ని, సేవ యొక్క
సమాచారాన్ని పంపారో, వాటన్నిటినీ బాప్ దాదా స్వీకరించారు.
ప్రియస్మృతులను అందరూ ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో కూడా పంపించారు.
కావున బాప్ దాదా వారందరికీ విదేశీయులైనా, దేశీయులైనా అందరికీ
రిటర్న్ లో ప్రియస్మృతులను మరియు హృదయపూర్వక ఆశీర్వాదాలను
ప్రేమ మరియు శక్తితో సకాష్ ను కూడా ఇస్తున్నారు. అచ్ఛా!
అంతా విన్నారు. ఏ విధముగా వినటము సహజమనిపిస్తుందో, అదే
విధముగా వినటము నుండి అతీతముగా స్వీట్ సైలెన్స్ యొక్క స్థితిని
కూడా, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయము కావాలంటే అంత సమయము,
యజమానులుగా అయ్యి అనుభవము చెయ్యాలి. మొదట విశేషముగా మనసుకు
యజమానులుగా అవ్వాలి, అందుకే - మనసును జయించినవారు జగత్తును
జయించినట్లు అని అంటారు. మరి ఇప్పుడు విన్నారు, చూసారు. ఆత్మ
రాజుగా అయ్యి మనసు, బుద్ధి, సంస్కారాలను తన ఆధీనములో
ఉంచుకోగలుగుతుందా? మనసు-బుద్ధి-సంస్కారాలు, ఈ మూడింటికి
యజమానులుగా అయ్యి స్వీట్ సైలెన్స్ అని ఆర్డర్ చెయ్యండి, అలా
ఆర్డర్ చెసినప్పుడు, అధికారిగా అవ్వటము ద్వారా మూడూ ఆర్డర్ లో
ఉంటున్నాయా అన్నది అనుభవము చేయండి. ఇప్పుడిప్పుడే అధికారీ
యొక్క స్టేజ్ పై స్థితులవ్వండి. (బాప్ దాదా డ్రిల్ చేయించారు)
అచ్ఛా!
నలువైపులా ఉన్న సదా స్వమానధారి, సత్యత యొక్క శక్తి
స్వరూపులు, పవిత్రత యొక్క సిద్ధి స్వరూపులు, సదా చలించని,
స్థిరమైన స్థితి యొక్క అనుభవీలైన స్వ పరివర్తకులు మరియు విశ్వ
పరివర్తకులు, సదా అధికారీ స్థితి ద్వారా సర్వ ఆత్మలకు తండ్రి
ద్వారా అధికారాన్ని ఇప్పించే నలువైపులా ఉన్న బాప్ దాదా యొక్క
లక్కీ మరియు లవ్లీ ఆత్మలు, పరమాత్ముని ప్రియస్మృతులను మరియు
హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి మరియు బాప్ దాదా
యొక్క మధురాతి మధురమైన పిల్లలకు నమస్తే.