09-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించండి, అప్పుడు ఉన్నత పదవి లభించగలదు’’

ప్రశ్న:-
రాజయోగీ విద్యార్థులకు తండ్రి డైరెక్షన్ ఏమిటి?

జవాబు:-
మీకు ఇచ్చిన డైరెక్షన్ ఏమిటంటే - ఒక్క తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత ఇక ఇతరులపై మనస్సు పెట్టుకోకూడదు. ప్రతిజ్ఞ చేసిన తర్వాత మళ్ళీ పతితులుగా అవ్వకూడదు. మీరు ఎటువంటి సంపూర్ణ పావనులుగా అవ్వండంటే, మీకు తండ్రి మరియు టీచర్ యొక్క స్మృతి నిరంతరమూ స్వతహాగానే ఉండాలి. ఒక్క తండ్రినే ప్రేమించండి, వారినే స్మృతి చేయండి, తద్వారా మీకు ఎంతో శక్తి లభిస్తూ ఉంటుంది.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎప్పుడైతే ఈ శరీరము ఉంటుందో, అప్పుడే అర్థం చేయిస్తారు. సమ్ముఖముగానే అర్థం చేయించవలసి ఉంటుంది. ఏదైతే సమ్ముఖముగా అర్థం చేయించబడుతుందో అది మళ్ళీ లిఖితపూర్వకముగా కూడా అందరి వద్దకూ వెళ్తుంది. మీరు ఇక్కడకు సమ్ముఖముగా వినేందుకు వస్తారు. అనంతమైన తండ్రి ఆత్మలకు వినిపిస్తారు. ఆత్మయే వింటుంది. అంతా ఆత్మయే చేస్తుంది - ఈ శరీరము ద్వారా, అందుకే మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా తప్పకుండా భావించాలి. ఆత్మలు, పరమాత్మ ఎంతోకాలం వేరుగా ఉన్నారు... అన్న గాయనము ఉంది. ఇక్కడ పాత్రను అభినయించడానికి అందరికంటే ముందుగా తండ్రి నుండి ఎవరు విడిపోయి వస్తారు? మీరు ఎంత సమయం తండ్రి నుండి వేరుగా ఉన్నారు అని మిమ్మల్ని అడిగితే, మీరు 5000 సంవత్సరాలు అని అంటారు. పూర్తి లెక్క అయితే ఉంది కదా. ఏ విధముగా నంబరువారుగా వస్తారు అనేది పిల్లలైన మీకు తెలుసు. తండ్రి పైన ఉండేవారు, వారు కూడా ఇప్పుడు మీ అందరి బ్యాటరీని చార్జ్ చేయడానికి కిందకు వచ్చేశారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. ఇప్పుడైతే తండ్రి సమ్ముఖముగా ఉన్నారు కదా. భక్తి మార్గములోనైతే తండ్రి కర్తవ్యము గురించి తెలియనే తెలియదు, అక్కడ వారి నామ, రూప, దేశ, కాలాలను గురించి తెలియనే తెలియదు. మీకైతే నామ, రూప, దేశ, కాలాలన్నింటి గురించి తెలుసు. ఈ రథము ద్వారా తండ్రి మనకు అన్ని రహస్యాలనూ అర్థం చేయిస్తారని మీకు తెలుసు. రచయిత మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు. ఇది ఎంత సూక్ష్మమైన విషయము. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము యొక్క బీజరూపుడు తండ్రే. వారు ఇక్కడకు తప్పకుండా వస్తారు. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడం వారి పనే. అక్కడ కూర్చునే వారు స్థాపన చేస్తారని కాదు. బాబా ఈ తనువు ద్వారా మనకు సమ్ముఖముగా అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది కూడా తండ్రి ప్రేమే కదా. ఇంకెవరికీ వారి చరిత్ర గురించి తెలియదు. గీత ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క శాస్త్రము. ఈ జ్ఞానము తర్వాత వినాశనం జరుగుతుందని కూడా మీకు తెలుసు. వినాశనం తప్పకుండా జరగనున్నది. ఇతర ధర్మ స్థాపకులు ఎవరైతే వస్తారో, వారు వచ్చినప్పుడు వినాశనం జరగదు. వినాశన సమయమే ఇది, అందుకే మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అది మళ్ళీ అంతమైపోతుంది. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మీరు రచయిత మరియు రచనలను తెలుసుకున్నారు. వాస్తవానికి రెండూ అనాదియే, అవి నడుస్తూనే ఉంటాయి. సంగమములో రావడమే తండ్రి పాత్ర. భక్తి అర్ధకల్పము నడుస్తుంది, జ్ఞానము అలా నడవదు. జ్ఞాన వారసత్వము అర్ధకల్పము కొరకు లభిస్తుంది. జ్ఞానమైతే ఒకేసారి, కేవలం సంగమములోనే లభిస్తుంది. మీ ఈ క్లాస్ ఒకేసారి జరుగుతుంది. ఈ విషయాలను బాగా అర్థం చేసుకుని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి కూడా. పదవి ఆధారమంతా సేవ పైనే ఉంది. పురుషార్థము చేసి ఇప్పుడిక కొత్త ప్రపంచములోకి వెళ్ళాలని మీకు తెలుసు. ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి, దీని పైనే మీ పదవి ఆధారపడి ఉంది. వినాశనము జరిగే కంటే ముందే అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల పరిచయాన్ని ఇవ్వాలి. జన్మ-జన్మాంతరాల పాపాలు అంతమైపోవాలని మీరు కూడా తండ్రిని స్మృతి చేస్తారు. ఎప్పటివరకైతే తండ్రి చదివిస్తూ ఉంటారో, అప్పటివరకూ స్మృతి తప్పకుండా చేయాలి. చదివించేవారితో యోగమైతే ఉంటుంది కదా. టీచర్ చదివిస్తారు కావున అతనితో యోగము ఉంటుంది. యోగము లేకుండా ఎలా చదవగలరు? యోగము అనగా చదివించేవారి యొక్క స్మృతి. వీరు తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా. మూడు రూపాలలోనూ పూర్తిగా స్మృతి చేయవలసి ఉంటుంది. ఈ సద్గురువు మీకు ఒకేసారి లభిస్తారు. జ్ఞానముతో సద్గతి లభించింది, దానితో ఇక గురువుల ఆచారమే సమాప్తమైపోతుంది. తండ్రి, టీచరు యొక్క ఆచారము నడుస్తుంది, గురువు యొక్క ఆచారము సమాప్తమైపోతుంది. సద్గతి లభించేసింది కదా. నిర్వాణధామములోకి మీరు ప్రాక్టికల్ గా వెళ్తారు, మళ్ళీ మీ సమయమనుసారముగా పాత్రను అభినయించడానికి వస్తారు. ముక్తి-జీవన్ముక్తి, రెండూ మీకు లభిస్తాయి. ముక్తి కూడా తప్పకుండా లభిస్తుంది. కొద్ది సమయము కొరకు ఇంటికి వెళ్ళి ఉంటారు. ఇక్కడైతే శరీరముతో పాత్ర అభినయించవలసి ఉంటుంది. చివరిలో పాత్రధారులందరూ వచ్చేస్తారు. నాటకము ఎప్పుడైతే పూర్తవుతుందో, అప్పుడు పాత్రధారులందరూ స్టేజి పైకి వచ్చేస్తారు. ఇప్పుడు కూడా పాత్రధారులందరూ స్టేజి పైకి వచ్చి ఉన్నారు. ఎంత ఘోరమైన గందరగోళం ఉంది. సత్యయుగము ఆదిలో ఇటువంటి ఘోరమైన గందరగోళం ఉండేది కాదు. ఇప్పుడైతే ఎంతటి అశాంతి ఉంది. ఇప్పుడు ఏ విధముగా తండ్రికి సృష్టి చక్రము యొక్క జ్ఞానము ఉందో, అలాగే పిల్లలకు కూడా జ్ఞానము ఉంది. బీజానికి తన వృక్షము ఎలా వృద్ధి చెంది అంతమవుతుంది అన్న జ్ఞానము ఉంది కదా. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచము యొక్క అంటును కట్టేందుకు లేక ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క అంటును కట్టేందుకు కూర్చుని ఉన్నారు. ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యాన్ని ఎలా పొందారు అన్నది మీకు తెలుసు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచము యొక్క యువరాజులుగా అవుతామని మీకు తెలుసు. ఆ ప్రపంచములో ఉండేవారందరూ స్వయాన్ని యజమానులుగానే పిలుచుకుంటారు కదా. ఏ విధముగా ఇప్పుడు కూడా అందరూ - భారత్ మా దేశము అని అంటారు కదా. ఇప్పుడు మనము సంగమములో నిలబడి ఉన్నామని, శివాలయములోకి వెళ్ళనున్నామని మీరు భావిస్తారు. ఇప్పుడిక అక్కడికి వెళ్ళిపోనున్నాము. మనము వెళ్ళి శివాలయానికి యజమానులుగా అవుతాము. మీ లక్ష్యము-ఉద్దేశ్యమే ఇది. యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ శివాలయానికి యజమానులుగా అవుతారు. ఇకపోతే రాజధానిలో భిన్న-భిన్న పదవులైతే ఉండనే ఉంటాయి. అక్కడ మంత్రులు ఎవరూ ఉండనే ఉండరు. ఎప్పుడైతే పతితులుగా అవుతారో, అప్పుడే మంత్రులు ఉంటారు. లక్ష్మీ-నారాయణులు లేక సీతా-రాముల యొక్క మంత్రులు అని మీరు విని ఉండరు ఎందుకంటే వారు స్వయం సతోప్రధానమైన పావన బుద్ధి కలవారు. మళ్ళీ ఎప్పుడైతే పతితులుగా అవుతారో, అప్పుడు రాజు, రాణులు సలహాలు తీసుకునేందుకు ఒక మంత్రిని పెట్టుకుంటారు. ఇప్పుడైతే చూడండి, అనేకానేకమంది మంత్రులు ఉన్నారు.

ఇది చాలా ఆనందకరమైన నాటకము అని పిల్లలైన మీకు తెలుసు. నాటకము ఎప్పుడూ ఆనందాన్ని కలిగించేదిగానే ఉంటుంది. సుఖము కూడా ఉంటుంది, దుఃఖము కూడా ఉంటుంది. ఈ అనంతమైన నాటకము గురించి పిల్లలైన మీకే తెలుసు. ఇందులో ఏడవవలసిన, పెడబొబ్బలు పెట్టవలసిన విషయమే లేదు. గతించినదానిని గతంగానే చూడండి... ఈ సృష్టి నాటకము తయారై సిద్ధముగా ఉన్నది, అదే ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు, జరగరానిది ఏమైనా జరిగినా చింతించాల్సిన అవసరమేమీ లేదు. ఈ నాటకము మీ బుద్ధిలో ఉంది. మనము ఇందులోని పాత్రధారులము. మన 84 జన్మల పాత్ర ఏక్యురేట్ అయినది మరియు అవినాశీ అయినది. ఎవరు ఏ జన్మలో ఏ పాత్రను అభినయిస్తూ వచ్చారో, అదే అభినయిస్తూ ఉంటారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం కూడా మీతో స్వయాన్ని ఆత్మగా భావించండి అనే చెప్పాను. గీతలో కూడా ఈ పదాలు ఉన్నాయి. మీకు తెలుసు - తప్పకుండా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఎప్పుడైతే స్థాపన అయిందో, అప్పుడు తండ్రి అన్నారు - దేహపు సర్వ ధర్మాలనూ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. మన్మనాభవ అన్న పదము యొక్క అర్థాన్ని అయితే తండ్రి బాగా అర్థం చేయించారు. భాష కూడా ఇదే. ఇక్కడ ఎన్ని భాషలు ఉన్నాయో చూడండి. భాషల విషయములో కూడా ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. భాష లేకుండానైతే పని నడవదు. ఎటువంటి భాషలు నేర్చుకుని వస్తారంటే ఇక మాతృభాష అంతమైపోతుంది. ఎవరైతే ఎక్కువ భాషలు నేర్చుకుంటారో వారికి బహుమతి లభిస్తుంది. ఎన్ని ధర్మాలుంటే అన్ని భాషలు ఉంటాయి. అక్కడైతే మీకు తెలుసు - మన రాజ్యమే ఉంటుంది, అలాగే భాష కూడా ఒక్కటే ఉంటుంది. ఇక్కడైతే 100 మైళ్ళకు ఒక భాష ఉంది. అక్కడైతే ఒకే భాష ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు కావున ఆ తండ్రినే స్మృతి చేస్తూ ఉండండి. శివబాబా బ్రహ్మా ద్వారా అర్థం చేయిస్తారు. రథమైతే తప్పకుండా కావాలి కదా. శివబాబా మన తండ్రి. నాకైతే లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నారు అని బాబా అంటారు. బాబా ఇతని ద్వారా చదివిస్తారు కదా. టీచరును ఎప్పుడూ ఆలింగనం చేసుకోరు కదా. తండ్రి అయితే మిమ్మల్ని చదివించడానికి వచ్చారు. వారు రాజయోగాన్ని నేర్పిస్తారు కావున వారు టీచరు అయినట్లు కదా. మీరు విద్యార్థులు. విద్యార్థులు ఎప్పుడైనా టీచరును ఆలింగనం చేసుకుంటారా? ఒక్క తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత ఇక ఇతరులపై మనస్సు పెట్టుకోకూడదు.

తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించడానికి వచ్చాను కదా. మీరు శరీరధారులు, నేను అశరీరిని, పైన ఉండేవాడిని. ఏమంటారంటే - బాబా, మీరు పావనముగా చేయడానికి రండి అని పిలుస్తారు అనగా మీరు పతితులుగా ఉన్నట్లే కదా? మరి నన్ను ఎలా ఆలింగనం చేసుకోగలరు? ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అయిపోతారు. ఎప్పుడైతే పూర్తిగా పావనముగా అవుతారో అప్పుడు ఇక చివరిలో స్మృతిలో కూడా ఉంటారు, టీచరును, గురువును స్మృతి చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఛీ-ఛీగా అయి పడిపోతారు, ఇంకా 100 రెట్ల దండన లభిస్తుంది. ఇతను మధ్యలో మధ్యవర్తి రూపములో లభించారు, స్మృతి చేయవలసింది వారిని. బాబా అంటారు, నేను కూడా వారి అతి ప్రియమైన బిడ్డను, మరి నేను ఎలా ఆలింగనం చేసుకోగలను! మీరైతే కనీసం ఈ శరీరము ద్వారానైనా కలుసుకుంటారు, కానీ నేను వారిని ఎలా ఆలింగనం చేసుకోగలను? తండ్రి అయితే అంటారు - పిల్లలూ, మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయండి, ప్రేమించండి. స్మృతి ద్వారా ఎంతో శక్తి లభిస్తుంది. తండ్రి సర్వశక్తివంతుడు. తండ్రి నుండే మీకు ఇంతటి శక్తి లభిస్తుంది. మీరు ఎంత శక్తివంతులుగా అవుతారు. మీ రాజధానిపై ఎవరూ విజయాన్ని పొందలేరు. రావణ రాజ్యమే అంతమైపోతుంది. దుఃఖాన్ని ఇచ్చేవారు ఎవరూ మిగిలి ఉండరు. దానిని సుఖధామము అని అంటారు. రావణుడు మొత్తం విశ్వమంతటిలో అందరికీ దుఃఖాన్ని ఇస్తారు. జంతువులు కూడా దుఃఖితమవుతాయి. అక్కడైతే జంతువులు కూడా పరస్పరం ప్రేమగా ఉంటాయి. ఇక్కడైతే అసలు ప్రేమే లేదు.

ఈ డ్రామా ఎలా తిరుగుతుంది అనేది పిల్లలైన మీకు తెలుసు. దీని ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తండ్రే అర్థం చేయిస్తారు. కొందరు బాగా చదువుకుంటారు, కొందరు తక్కువగా చదువుకుంటారు, కానీ చదవడమైతే అందరూ చదువుకుంటారు కదా. మొత్తం ప్రపంచమంతా కూడా చదువుతుంది అనగా తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రిని స్మృతి చేయడము - ఇది కూడా చదువే కదా. ఆ తండ్రిని అందరూ స్మృతి చేస్తారు, వారు సర్వుల సద్గతిదాత, సర్వులకూ సుఖాన్ని ఇచ్చేవారు. మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని అంటున్నారంటే తప్పకుండా పతితులుగా ఉన్నట్లే. వారు వికారులను నిర్వికారులుగా తయారుచేసేందుకే వస్తారు. హే అల్లా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని పిలుస్తారు కూడా. వారి పనే ఇది, అందుకే పిలుస్తారు.

మీ భాష కూడా కరక్టుగా ఉండాలి. వారు ఒకరు అల్లాహ్ అంటే ఇంకొకరు గాడ్ అని అంటారు. గాడ్ ఫాదర్ అని కూడా అంటారు. చివరిలో వచ్చేవారి బుద్ధి కొంత మంచిగానే ఉంటుంది. వారు అంత దుఃఖితులు అవ్వరు. ఇప్పుడు మీరు సమ్ముఖముగా కూర్చున్నారు, మీరు ఏమి చేస్తారు? బాబాను ఈ భృకుటిలో చూస్తారు. బాబా మళ్ళీ మీ భృకుటిలో చూస్తారు. నేను ఎవరిలోకి అయితే ప్రవేశిస్తానో అతడిని చూడగలనా? అతను అయితే నా పక్కనే కూర్చున్నారు, ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయము. నేను ఇతని పక్కనే కూర్చున్నాను. వీరు నా పక్కన కూర్చున్నారు అని ఇతను కూడా భావిస్తారు. మేము మా ముందు ఇద్దరినీ చూస్తున్నాము అని మీరు అంటారు. తండ్రి మరియు దాదా, రెండు ఆత్మలనూ మీరు చూస్తారు. బాప్ దాదా అని ఎవరిని అంటారు అనే జ్ఞానము మీలో ఉంది. ఆత్మ ఎదురుగా కూర్చుని ఉంది. భక్తి మార్గములోనైతే కళ్ళు మూసుకుని వింటారు. చదువు ఎప్పుడూ అలా చదువుకోబడదు. టీచరునైతే చూడవలసి ఉంటుంది కదా. ఇక్కడైతే వీరు తండ్రి కూడా, టీచర్ కూడా, కావున ఎదురుగా చూడవలసి ఉంటుంది. వారు ఎదురుగా కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకుని ఉండడము, కునికిపాట్లు పడుతూ ఉండడము... ఇలా అయితే చదువుకోలేరు. విద్యార్థి టీచరును తప్పకుండా చూస్తూ ఉంటారు. లేకపోతే టీచర్ అంటారు - ఇతనైతే కునికిపాట్లు పడుతూ ఉంటాడు, ఇతనేమైనా తాగి వచ్చాడా. బాబా ఈ తనువులో ఉన్నారని, నేను బాబాను చూస్తున్నానని మీ బుద్ధిలో ఉంది. తండ్రి అర్థం చేయిస్తారు, కళ్ళు మూసుకుని కూర్చునేందుకు ఇది సామాన్యమైన క్లాస్ ఏమీ కాదు. స్కూల్లో ఎప్పుడైనా ఎవరైనా కళ్ళు మూసుకుని కూర్చుంటారా? ఇతర సత్సంగాలను స్కూలు అని అనరు. గీతను వినిపించినా కానీ దానిని స్కూలు అని అనరు. వారిని చూసేందుకు వారేమైనా తండ్రా? కొందరు శివుని భక్తులు ఉంటారు, వారు శివుడినే తలచుకుంటూ ఉంటారు, చెవుల ద్వారా కథను వింటూ ఉంటారు. శివుని భక్తి చేసేవారు శివుడినే స్మృతి చేయవలసి ఉంటుంది. ఏ సత్సంగాలలోనూ ప్రశ్నోత్తరాలు ఉండవు, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మీ సంపాదన ఎంతో ఉంది. సంపాదనలో ఎప్పుడూ ఆవలింతలు రావు. ధనము లభిస్తుంది కదా కావున సంతోషము ఉంటుంది. ఆవలింతలు దుఃఖానికి గుర్తు. రోగగ్రస్థులుగా ఉంటే లేక దివాలా తీసి ఉంటే ఆవలింతలు వస్తూ ఉంటాయి. ధనము లభిస్తూ ఉంటే ఎప్పుడూ ఆవలింతలు రావు. బాబా వ్యాపారి కూడా. రాత్రివేళలో స్టీమర్లు వచ్చినప్పుడు రాత్రి మేల్కొని ఉండవలసి వచ్చేది. కొందరు బేగంలు రాత్రివేళలో వచ్చేవారు, అప్పుడు కేవలం స్త్రీల కొరకు మాత్రమే తెరిచి ఉండేది. తండ్రి కూడా అంటారు, ప్రదర్శని మొదలైనవాటిలో స్త్రీల కొరకు విశేషముగా ఒక రోజును ఉంచినట్లయితే ఎంతోమంది వస్తారు. పరదా ధరించేవారు కూడా వస్తారు. అలా పరదా ధరించేవారు ఎందరో ఉంటారు. వారు కార్లలో ఉన్నప్పుడు కూడా పరదా ఉంటుంది. ఇక్కడైతే ఇది ఆత్మ విషయము. జ్ఞానము లభిస్తే పరదా కూడా తెరుచుకుంటుంది. సత్యయుగములో పరదా మొదలైనవి ఉండవు. ఇది ప్రవృత్తి మార్గానికి సంబంధించిన జ్ఞానము కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ నాటకము ఎంతో ఆనందకరముగా తయారుచేయబడి ఉంది, ఇందులో సుఖము మరియు దుఃఖము యొక్క పాత్ర నిశ్చితమై ఉంది, అందుకే ఏడవవలసిన, పెడబొబ్బలు పెట్టవలసిన విషయమేదీ లేదు. ఇది తయారై, తయారుచేయబడిన, తయారవుతూ ఉన్న నాటకము అని బుద్ధిలో ఉండాలి, గతించినదాని గురించి చింతన చేయకూడదు.

2. ఇది సామాన్యమైన క్లాస్ కాదు, ఇందులో కళ్ళు మూసుకుని కూర్చోకూడదు. టీచరును ఎదురుగా చూడాలి. ఆవలింతలు మొదలైనవి రాకూడదు. ఆవలింతలు దుఃఖానికి గుర్తు.

వరదానము:-

సంతుష్టత యొక్క మూడు సర్టిఫికెట్లను తీసుకుని తమ యోగీ జీవితము యొక్క ప్రభావాన్ని వేసే సహజయోగీ భవ

సంతుష్టత యోగీ జీవితము యొక్క విశేష లక్ష్యము, ఎవరైతే సదా సంతుష్టముగా ఉంటారో మరియు సర్వులను సంతుష్టపరుస్తారో అటువంటివారి యోగీ జీవితము యొక్క ప్రభావము ఇతరులపై స్వతహాగా పడుతుంది. ఏ విధంగా సైన్సు సాధనాల యొక్క ప్రభావము వాయుమండలముపై పడుతుందో, అలా సహజయోగీ జీవితము యొక్క ప్రభావము కూడా ఉంటుంది. యోగీ జీవితానికి సంబంధించి మూడు సర్టిఫికేట్లు ఉంటాయి - 1. స్వయము యొక్క సంతుష్టత, 2. తండ్రి యొక్క సంతుష్టత, 3. లౌకిక-అలౌకిక పరివారము యొక్క సంతుష్టత.

స్లోగన్:-

స్వరాజ్యము అనే తిలకము, విశ్వ కళ్యాణము అనే కిరీటము మరియు స్థితి అనే సింహాసనముపై విరాజమానమై ఉండేవారే రాజయోగులు.