ఓంశాంతి
జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని ఇచ్చే ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం
చేయిస్తారు. జ్ఞానము యొక్క మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు.
ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. ఈ పాత ప్రపంచము
మారనున్నదని ఇప్పుడు పిల్లలకు తెలుసు. దీనిని మార్చేవారు ఎవరు మరియు వారు ఎలా
మారుస్తారు అన్నది పాపం మనుష్యులకు తెలియదు! ఎందుకంటే వారికి జ్ఞానము యొక్క మూడవ
నేత్రమే లేదు. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. దీని
ద్వారా మీరు సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది జ్ఞానము అనే సాక్కిరిన్ (అత్యంత
మధురమైన రసము). సాక్కిరిన్ యొక్క ఒక్క చుక్క కూడా ఎంత మధురముగా ఉంటుంది. జ్ఞానములో
ఒకే మాట ఉంది - మన్మనాభవ. ఈ మాట ఎంత మధురమైనది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని
స్మృతి చెయ్యండి. తండ్రి శాంతిధామము మరియు సుఖధామములకు దారిని తెలియజేస్తున్నారు.
తండ్రి పిల్లలకు స్వర్గ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. కనుక పిల్లలకు ఎంత సంతోషము
ఉండాలి. సంతోషము వంటి ఔషధము లేదు అని అంటారు కూడా. ఎవరైతే సదా సంతోషములో, ఆనందములో
ఉంటారో వారికి ఇది ఔషధము వంటిది. 21 జన్మలు ఆనందములో ఉండేందుకు ఇది అద్భుతమైన ఔషధము.
ఈ ఔషధాన్ని సదా ఒకరికొకరు తినిపించుకుంటూ ఉండండి. ఇది ఒకరికొకరు చేసుకునే అద్భుతమైన
పాలన. ఇటువంటి పాలనను ఇతర మనుష్యులెవ్వరూ మనుష్యులకు చెయ్యలేరు.
పిల్లలైన మీరు శ్రీమతము ఆధారముగా అందరికీ ఆత్మిక పాలన చేస్తారు. సత్యాతి సత్యముగా
యోగక్షేమాలను అడగటమంటే వారికి తండ్రి పరిచయాన్ని ఇవ్వటమే. అనంతమైన తండ్రి ద్వారా
మనకు జీవన్ముక్తి అనే కానుక లభిస్తుంది అని మధురమైన పిల్లలకు తెలుసు. సత్యయుగములో
భారత్ జీవన్ముక్తిగా ఉండేది, పావనముగా ఉండేది. తండ్రి చాలా గొప్ప, ఉన్నతమైన ఔషధాన్ని
ఇస్తారు, అందుకే అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోప-గోపికలను అడగండి అన్న గాయనము
ఉంది. ఇది జ్ఞాన-యోగాలతో కూడిన ఎంతటి ఫస్ట్ క్లాస్ అద్భుతమైన ఔషధము మరియు ఈ ఔషధము
ఒక్క ఆత్మిక సర్జన్ వద్ద మాత్రమే ఉంది. ఇతరులెవ్వరికీ ఈ ఔషధము గురించి తెలియనే
తెలియదు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, మీ కొరకు అరచేతిపై కానుకను తీసుకువచ్చాను.
ముక్తి, జీవన్ముక్తి యొక్క ఈ కానుక నా వద్దనే ఉంటుంది. కల్ప-కల్పమూ నేనే వచ్చి మీకు
ఈ కానుకను ఇస్తాను, మళ్ళీ రావణుడు లాగేసుకుంటాడు. కనుక ఇప్పుడు పిల్లలైన మీకు
సంతోషపు పాదరసము ఎంతగా పైకెక్కి ఉండాలి. మీకు తెలుసు - మనకు తండ్రి, టీచరు మరియు
సత్యాతి సత్యమైన సద్గురువు ఒక్కరే, వారు మనల్ని తనతోపాటు తీసుకువెళ్తారు. అత్యంత
ప్రియమైన తండ్రి నుండి విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది. ఇదేమైనా తక్కువ విషయమా!
పిల్లలు ఎల్లప్పుడూ హర్షితముగా ఉండాలి. ఈశ్వరీయ విద్యార్థి జీవితము అత్యుత్తమమైనది.
ఇది ఇప్పటి గాయనమే కదా. మళ్ళీ కొత్త ప్రపంచములో మీరు సదా సంతోషాలు జరుపుకుంటూ ఉంటారు.
సత్యాతి సత్యమైన సంతోషాలను ఎప్పుడు జరుపుకుంటారు అన్నది ప్రపంచానికి తెలియదు.
మనుష్యులకైతే సత్యయుగము యొక్క జ్ఞానమే లేదు కనుక ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ
పాత తమోప్రధాన ప్రపంచములో సంతోషము ఎక్కడి నుండి వస్తుంది! ఇక్కడైతే దుఃఖములో రక్షణ
కొరకు అలమటిస్తూ ఉంటారు. ఇది ఎంతటి దుఃఖమయ ప్రపంచము.
తండ్రి పిల్లలైన మీకు ఎంత సహజ మార్గాన్ని తెలియజేస్తారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ
కమలపుష్ప సమానముగా ఉండండి. వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ కూడా నన్ను స్మృతి
చేస్తూ ఉండండి. ఏ విధంగా ప్రియుడు మరియు ప్రేయసి ఉంటారు కదా, వారు ఒకరినొకరు గుర్తు
చేసుకుంటూ ఉంటారు. ఆమె అతనికి ప్రేయసి, అతను ఆమెకు ప్రియునిగా ఉంటారు. ఇక్కడ అటువంటి
విషయము లేదు, ఇక్కడైతే మీరందరూ ఒక్క ప్రియునికి జన్మ-జన్మాంతరాల నుండి ప్రేయసులుగా
ఉన్నారు. తండ్రి ఎప్పుడూ మీకు ప్రేయసిగా అవ్వరు. ఆ ప్రియుడు రావాలని మీరు వారిని
తలచుకుంటూ వచ్చారు. దుఃఖము ఎక్కువైనప్పుడు ఎక్కువగా స్మరణ చేస్తారు, అందుకే దుఃఖములో
అందరూ స్మరిస్తారు, సుఖములో ఎవ్వరూ స్మరించరు అన్న గాయనము కూడా ఉంది. ఈ సమయములో
తండ్రి సర్వశక్తివంతుడు. రోజురోజుకు మాయ కూడా సర్వశక్తివంతముగా, తమోప్రధానముగా అవుతూ
ఉంటుంది, అందుకే ఇప్పుడు తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి.
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి మరియు దానితోపాటుగా దైవీ
గుణాలను కూడా ధారణ చెయ్యండి, అప్పుడు మీరు ఇలా (లక్ష్మి-నారాయణులు)గా అవుతారు. ఈ
చదువులో ముఖ్యమైన విషయమే స్మృతి. ఉన్నతోన్నతుడైన తండ్రిని చాలా ప్రేమతో, స్నేహముతో
స్మృతి చెయ్యాలి. ఆ ఉన్నతోన్నతుడైన తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేవారు.
తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేయడానికి వచ్చాను,
అందుకే ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ అనేక జన్మల పాపాలు అంతమైపోతాయి.
పతిత-పావనుడైన తండ్రి అంటారు - మీరు చాలా పతితముగా అయిపోయారు, అందుకే ఇప్పుడు మీరు
నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు.
పతిత-పావనుడు అయిన తండ్రినే పిలుస్తారు కదా. ఇప్పుడు తండ్రి వచ్చారు కనుక తప్పకుండా
పావనముగా అవ్వవలసి ఉంటుంది. తండ్రి దుఃఖహర్త-సుఖకర్త. తప్పకుండా సత్యయుగములో పావన
ప్రపంచము ఉండేది కనుక అందరూ సుఖముగానే ఉండేవారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ అంటున్నారు -
పిల్లలూ, శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని గుర్తు చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇది
సంగమయుగము. నావికుడు మిమ్మల్ని ఈ తీరము నుండి ఆ తీరానికి తీసుకువెళ్తారు. నావ అనేది
ఒకటి కాదు, మొత్తము ప్రపంచమే ఒక పెద్ద ఓడలా ఉంది. దానిని ఆవలి తీరానికి
తీసుకువెళ్తారు.
మధురమైన పిల్లలైన మీకు ఎన్ని సంతోషాలు ఉండాలి. మీ కొరకైతే సదా సంతోషమే సంతోషము.
అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు - వాహ్! ఈ విషయాన్ని అయితే ఎప్పుడూ వినలేదు,
చదవలేదు. భగవానువాచ - నేను ఆత్మిక పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను,
కనుక పూర్తిగా నేర్చుకోవాలి, ధారణ చెయ్యాలి. పూర్తిగా చదువుకోవాలి. చదువులో
నంబరువారుగా అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. స్వయాన్ని చూసుకోవాలి - నేను ఉత్తమముగా
ఉన్నానా, మధ్యమముగా ఉన్నానా లేక కనిష్ఠముగా ఉన్నానా? తండ్రి అంటారు, స్వయాన్ని
చూసుకోండి - నేను ఉన్నత పదవిని పొందేందుకు అర్హునిగా ఉన్నానా? ఆత్మిక సేవ
చేస్తున్నానా? ఎందుకంటే తండ్రి అంటారు - పిల్లలూ, సేవాయోగ్యులుగా అవ్వండి, ఫాలో
చెయ్యండి. నేను వచ్చిందే సేవ కొరకు. ప్రతిరోజూ సేవ చేస్తాను, అందుకే కదా ఈ రథాన్ని
తీసుకున్నాను. వీరి ఈ రథము అనారోగ్యముపాలైతే నేను వీరిలో కూర్చుని మురళిని
వ్రాస్తాను. అప్పుడు నోటి ద్వారా మాట్లాడలేను కనుక వ్రాస్తాను, తద్వారా పిల్లలకు
మురళి మిస్ అవ్వకుండా ఉంటుంది, కావున నేను కూడా సేవలోనే ఉన్నాను కదా. ఇది ఆత్మిక
సేవ. మరి పిల్లలైన మీరు కూడా తండ్రి సేవలో నిమగ్నమవ్వండి. ఆన్ గాడ్ ఫాదర్లీ సర్వీస్.
ఎవరైతే మంచి పురుషార్థము చేస్తారో, మంచి సేవ చేస్తారో, వారిని మహావీరులు అని అంటారు.
బాబా డైరెక్షన్లపై నడిచే మహావీరులు ఎవరూ అనేది చూడటం జరుగుతుంది. తండ్రి ఆజ్ఞ
ఏమిటంటే - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరస్పరం సోదరులను చూడండి. ఈ శరీరాన్ని
మర్చిపోండి. బాబా కూడా శరీరాన్ని చూడరు. తండ్రి అంటారు, నేను ఆత్మలను చూస్తాను.
ఇకపోతే, ఆత్మ శరీరము లేకుండా మాట్లాడలేదు అన్న జ్ఞానమైతే ఉంది. నేను కూడా ఈ
శరీరములోకి వచ్చాను, దీనిని లోన్ గా తీసుకున్నాను. శరీరముతోపాటుగానే ఆత్మ చదవగలదు.
బాబా కూర్చునేది ఇక్కడ (భృకుటిలో). ఇది అకాల సింహాసనము. ఆత్మ అకాలమూర్తి. ఆత్మ
ఎప్పుడూ చిన్నగా, పెద్దగా అవ్వదు. శరీరము చిన్నగా, పెద్దగా అవుతుంది. ఆత్మలంతా
ఎవరైతే ఉన్నారో, వారందరి సింహాసనము ఈ భృకుటి. శరీరాలైతే అందరివీ భిన్న-భిన్నముగా
ఉంటాయి. కొందరి అకాల సింహాసనము పురుషునిదైతే, కొందరి అకాల సింహాసనము స్త్రీది,
కొందరి అకాల సింహాసనము పిల్లలది. తండ్రి కూర్చుని పిల్లలకు ఆత్మిక డ్రిల్
నేర్పిస్తారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మొదట స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను
ఆత్మను, ఫలానా సోదరునితో మాట్లాడతాను. శివబాబాను స్మృతి చెయ్యండి అని తండ్రి
సందేశాన్ని ఇస్తాను. స్మృతి ద్వారానే తుప్పు వదలనున్నది. బంగారములో కల్తీ
కలిసినప్పుడు ఆ బంగారము విలువ తగ్గిపోతుంది. ఆత్మలైన మీలో కూడా తుప్పు చేరడముతో మీరు
విలువలేనివారిగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనముగా అవ్వాలి. ఆత్మలైన మీకు ఇప్పుడు
జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభించింది. ఆ నేత్రముతో మీ సోదరులను చూడండి. పరస్పరం
సోదరులుగా చూడటము వలన కర్మేంద్రియాలు చంచలమవ్వవు. రాజ్య భాగ్యాన్ని తీసుకోవాలంటే,
విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే ఈ శ్రమ చెయ్యండి. పరస్పరం సోదరులుగా భావిస్తూ
అందరికీ జ్ఞానాన్ని ఇవ్వండి. అప్పుడిక అది ఒక అలవాటుగా అయిపోతుంది. సత్యాతి-సత్యమైన
సోదరులు మీరందరే. తండ్రి కూడా పై నుండి వచ్చారు, మీరు కూడా పై నుండే వచ్చారు. తండ్రి
పిల్లలతో పాటు సేవ చేస్తున్నారు. సేవ చేయడానికి తండ్రి ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యము
నుంచే పిల్లలకు తండ్రి సహాయము చేస్తారు. కనుక ఈ ప్రాక్టీస్ చెయ్యాలి. నేను సోదర
ఆత్మకు చదివిస్తున్నాను. ఆత్మ చదువుతుంది కదా. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు,
ఇది ఆత్మిక తండ్రి నుండే లభిస్తుంది. సంగమములోనే తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు
- స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు వివస్త్రగా వచ్చారు, మళ్ళీ ఇక్కడ శరీరాన్ని
ధరించి మీరు 84 జన్మలు పాత్రను అభినయించారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి, అందుకే
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరస్పరం సోదర దృష్టితో చూడాలి. ఈ శ్రమ చెయ్యాలి. తమ
కృషిని తాము చేయాలి! దానము ఇంటి నుండే ప్రారంభమవుతుంది అనగా మొదట స్వయాన్ని ఆత్మగా
భావించి, ఆ తర్వాత సోదరులకు అర్థం చేయించండి. అప్పుడు బాగా గురి తగులుతుంది. ఈ
పదునును నింపుకోవాలి. కష్టపడినప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో కాస్త
సహించవలసి వస్తుంది కూడా. ఎవరైనా ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడితే మీరు మౌనముగా
ఉండండి. మీరు మౌనముగా ఉన్నట్లయితే ఇక ఇతరులు ఏం చేస్తారు! చప్పట్లు రెండు చేతులతోనే
మ్రోగుతాయి. ఒకరు నోటితో చప్పట్లు మ్రోగిస్తే, ఇతరులు మౌనముగా ఉంటే, అవతలివారు
తమంతట తామే మౌనమైపోతారు. ఒక చేతితో ఇంకొక చేతిని మ్రోగించటం వలన శబ్దమవుతుంది.
పిల్లలు ఇతరుల కళ్యాణము చెయ్యాలి. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, సదా సంతోషములో
ఉండాలంటే మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యండి. సోదరుల (ఆత్మల)
వైపుకు చూడండి. పిల్లలు ఆత్మిక యాత్రలో ఉండే అలవాటు చేసుకోవాలి. ఇది మీకు లాభము
చేకూర్చే విషయమే. తండ్రి శిక్షణలను సోదరులకు ఇవ్వాలి. తండ్రి అంటారు - నేను ఆత్మలైన
మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, ఆత్మనే చూస్తాను. మనుష్యులు మనుష్యులతో
మాట్లాడేటప్పుడు వారి ముఖాన్ని చూస్తారు. మీరు ఆత్మతో మాట్లాడుతారు కనుక ఆత్మనే
చూడాలి. శరీరము ద్వారా జ్ఞానాన్ని ఇచ్చినా కానీ ఇందులో శారీర భానాన్ని తెంచవలసి
ఉంటుంది. పరమాత్మ అయిన తండ్రి మాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మీ ఆత్మ భావిస్తుంది.
ఆత్మలనే చూస్తాను అని తండ్రి కూడా అంటారు. మేము పరమాత్మ తండ్రిని చూస్తున్నాము, వారి
నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము అని ఆత్మలు కూడా అంటారు. దీనినే ఆత్మ, ఆత్మతో
ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవటము అని అంటారు. ఆత్మలోనే జ్ఞానము ఉంది. ఆత్మకే
జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇది పదును వంటిది. మీ జ్ఞానములో ఈ పదును నిండిపోతుంది, అప్పుడు
మీరు ఎవరికి అర్థం చేయించినా సరే వెంటనే గురి తగులుతుంది. తండ్రి అంటారు -
ప్రాక్టీస్ చేసి చూడండి, గురి తగులుతుంది కదా. ఈ కొత్త అలవాటు చేసుకున్నట్లయితే ఇక
శరీర భానము తొలగిపోతుంది, మాయ తుఫానులు తక్కువ వస్తాయి, చెడు సంకల్పాలు రావు,
అశుద్ధ దృష్టి కూడా ఉండదు. ఆత్మయైన మనము 84 జన్మల చక్రము తిరిగాము. ఇప్పుడు నాటకము
పూర్తవుతుంది. ఇప్పుడు బాబా స్మృతిలో ఉండాలి. స్మృతి ద్వారానే తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అయ్యి, సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఎంత సహజము.
పిల్లలకు ఈ శిక్షణను ఇవ్వటము కూడా నా పాత్రనే అని తండ్రికి తెలుసు. ఇది కొత్త
విషయమేమీ కాదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను రావలసి ఉంటుంది. నేను బంధింపబడి
ఉన్నాను. మధురమైన పిల్లలూ, ఆత్మిక స్మృతియాత్రలో ఉన్నట్లయితే అంతిమ స్థితిని బట్టి
గతి ఉంటుంది అని నేను కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తాను. ఇది అంతిమ కాలము కదా!
నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ సద్గతి జరుగుతుంది. స్మృతియాత్ర ద్వారానే
స్తంభము దృఢముగా అవుతుంది. దేహీ-అభిమానులుగా అయ్యే ఈ శిక్షణ ఒక్కసారే పిల్లలైన మీకు
లభిస్తుంది. ఇది ఎంతటి అద్భుతమైన జ్ఞానము. బాబా అద్భుతమైనవారు కనుక బాబా జ్ఞానము
కూడా అద్భుతమైనది. దీనిని ఎప్పుడూ ఎవ్వరూ తెలియజేయలేరు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలి,
అందుకే తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఈ ప్రాక్టీస్ ను చెయ్యండి. స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ ఆత్మకు జ్ఞానాన్ని ఇవ్వండి. మూడవ నేత్రము ద్వారా సోదరులను చూడాలి.
ఇదే చాలా పెద్ద శ్రమ.
ఇది బ్రాహ్మణులైన మీ సర్వోత్తమమైన, ఉన్నతోన్నతమైన కులము. ఈ సమయములో మీ జీవితము
అమూల్యమైనది, అందుకే ఈ శరీరాన్ని కూడా సంభాళించాలి. తమోప్రధానముగా అయిన కారణముగా
శరీర ఆయుష్షు కూడా తక్కువైపోతూ వచ్చింది. ఇప్పుడు మీరు ఎంతగా యోగములో ఉంటారో, అంతగా
ఆయుష్షు పెరుగుతుంది. మీ ఆయుష్షు పెరుగుతూ, పెరుగుతూ సత్యయుగములో 150 సంవత్సరాలు
అవుతుంది. అందుకే శరీరాన్ని కూడా సంభాళించాలి. ఇదైతే మట్టిబొమ్మ కదా, ఎప్పుడైనా
అంతమైపోయేదే కదా అని ఇలా అనుకోకూడదు. దీనిని సజీవముగా ఉంచుకోవాలి. ఇది అమూల్య
జీవితము కదా! ఎవరైనా అనారోగ్యముపాలైతే వారితో విసిగిపోకూడదు. వారికి కూడా -
శివబాబాను స్మృతి చెయ్యమని చెప్పండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా వారి పాపాలు
అంతమవుతూ ఉంటాయి. వారి సేవ చెయ్యాలి. వారు జీవిస్తూ ఉండాలి, శివబాబాను స్మృతి చేస్తూ
ఉండాలి. నేను బాబాను స్మృతి చేస్తాను అన్న తెలివైతే ఉంటుంది కదా. తండ్రి నుండి
వారసత్వాన్ని పొందేందుకు ఆత్మ స్మృతి చేస్తుంది. అచ్ఛా.
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు నంబరువారు పురుషార్థానుసారముగా మాత-పిత బాప్
దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.