10-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఖుదా (భగవంతుడు) మీ స్నేహితుడు,
రావణుడు మీ శత్రువు, అందుకే మీరు ఖుదాను ప్రేమిస్తారు, రావణుడిని కాలుస్తారు’’
ప్రశ్న:-
ఎటువంటి
పిల్లలకు అనేకుల ఆశీర్వాదాలు స్వతహాగా లభిస్తూ ఉంటాయి?
జవాబు:-
ఏ పిల్లలైతే
స్మృతిలో ఉంటూ స్వయము కూడా పవిత్రముగా అవుతారో మరియు ఇతరులను కూడా తమ సమానముగా
తయారుచేస్తారో, వారికి అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి, వారు చాలా ఉన్నతమైన పదవిని
పొందుతారు. తండ్రి పిల్లలైన మీకు శ్రేష్ఠముగా అయ్యేందుకు ఒకే ఒక శ్రీమతాన్ని
ఇస్తున్నారు - పిల్లలూ, ఏ దేహధారినీ స్మృతి చేయకుండా నన్ను స్మృతి చేయండి.
పాట:-
చివరికి ఆ రోజు
నేడు రానే వచ్చింది...
ఓంశాంతి
ఓం శాంతి యొక్క అర్థమునైతే ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయించారు. ఓం అనగా
నేను ఆత్మను మరియు ఇది నా శరీరము. ఆత్మ అయితే చూడడానికి కనిపించదు. ఆత్మలోనే మంచి
మరియు చెడు సంస్కారాలు ఉంటాయి. ఆత్మలోనే మనసు-బుద్ధి ఉన్నాయి. శరీరములో బుద్ధి లేదు.
ముఖ్యమైనది ఆత్మ. శరీరము అనేది నాది. ఆత్మను ఎవరూ చూడలేరు. శరీరాన్ని ఆత్మ చూస్తుంది.
ఆత్మను శరీరము చూడలేదు. ఆత్మ వెళ్ళిపోతే శరీరము జడమైపోతుంది. ఆత్మను చూడలేము.
శరీరాన్ని చూడగలము. అదే విధముగా ఆత్మల తండ్రి, ఎవరినైతే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారో,
వారు కూడా చూడటానికి కనిపించరు, వారిని అర్థం చేసుకోవడము జరుగుతుంది, తెలుసుకోవడము
జరుగుతుంది. ఆత్మలమైన మనమంతా సోదరులము. శరీరములోకి వచ్చినప్పుడు - వీరు పరస్పరము
సోదరులు, వీరు సోదరీ-సోదరులు అని అంటారు. ఆత్మలైతే పరస్పరములో అందరూ సోదరులే. ఆత్మల
తండ్రి పరమపిత పరమాత్మ. దైహిక సోదరీ-సోదరులు ఒకరినొకరు చూడగలరు. ఆత్మలందరి తండ్రి
ఒక్కరే, వారిని చూడలేము. ఇప్పుడు పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేయడానికి తండ్రి
వచ్చారు. సత్యయుగము కొత్త ప్రపంచముగా ఉండేది. ఇప్పుడిది కలియుగ పాత ప్రపంచము,
ఇప్పుడిది పరివర్తన అవ్వనున్నది. పాత ప్రపంచమైతే సమాప్తమవ్వాలి కదా. పాత ఇల్లు
సమాప్తమైతే కొత్త ఇల్లు తయారవుతుంది కదా, అదే విధముగా ఈ పాత ప్రపంచము కూడా సమాప్తము
అవ్వనున్నది. సత్యయుగము తర్వాత త్రేతా, ద్వాపర, కలియుగాలు, మళ్ళీ సత్యయుగము
తప్పకుండా వస్తుంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవ్వనున్నాయి. సత్యయుగములో
దేవీ-దేవతల రాజ్యముంటుంది. సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు ఉంటారు. వారిని
లక్ష్మీ-నారాయణుల వంశావళి, సీతా-రాముల వంశావళి అని అంటారు. ఇది సహజమే కదా. ఆ తర్వాత
ద్వాపర, కలియుగాలలో ఇతర ధర్మాలు వస్తాయి. అప్పుడు అప్పటివరకు పవిత్రముగా ఉన్న దేవతలు
అపవిత్రమవుతారు, దానిని రావణ రాజ్యమని అంటారు. రావణుడిని ప్రతి సంవత్సరము కాలుస్తూ
ఉంటారు కానీ కాలనే కాలడు, మళ్ళీ-మళ్ళీ కాలుస్తూనే ఉంటారు. రావణుడు అందరికీ పెద్ద
శత్రువు, అందుకే అతడిని కాల్చే ఆచారము ఏర్పడింది. భారత్ కు నంబర్ వన్ శత్రువు ఎవరు?
నంబర్ వన్ మిత్రుడు, సదా సుఖాన్ని ఇచ్చేవారు ఖుదా. ఖుదాను స్నేహితుడని అంటారు కదా.
దీని గురించి ఒక కథ కూడా ఉంది. కావున ఖుదా స్నేహితుడు, రావణుడు శత్రువు.
స్నేహితుడైన ఖుదాను ఎప్పుడూ కాల్చరు. రావణుడు శత్రువు, అందుకే పది తలల రావణుడిని
తయారుచేసి అతడిని ప్రతి సంవత్సరము కాలుస్తారు. మాకు రామ రాజ్యము కావాలి అని గాంధీజీ
కూడా అనేవారు. రామ రాజ్యములో సుఖము ఉంటుంది, రావణ రాజ్యములో దుఃఖము ఉంటుంది.
ఇప్పుడిది ఎవరు కూర్చుని అర్థం చేయిస్తున్నారు? పతిత-పావనుడైన తండ్రి. శివబాబా,
బ్రహ్మా ఏమో దాదా. బాబా సదా ‘‘బాప్ దాదా’’ అని సంతకము చేస్తారు. ప్రజాపిత బ్రహ్మా
కూడా అందరికీ చెందినవారు. వారిని ఆడమ్ అని కూడా అనడము జరుగుతుంది. వారిని
గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అనడము జరుగుతుంది. మనుష్య సృష్టికి వారు ప్రజాపిత.
ప్రజాపిత బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు రచింపబడతారు, మళ్ళీ బ్రాహ్మణులే దేవతలుగా
అవుతారు. దేవతలు మళ్ళీ క్షత్రియలుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. వీరిని
ప్రజాపిత బ్రహ్మా అని అంటారు, వీరు మనుష్య సృష్టికి పెద్దవారు. ప్రజాపిత బ్రహ్మాకు
ఎంతమంది పిల్లలు ఉన్నారు. బాబా-బాబా అని అంటూ ఉంటారు. వీరు సాకార బాబా. శివబాబా
నిరాకార బాబా. ప్రజాపిత బ్రహ్మా ద్వారా కొత్త మనుష్య సృష్టిని రచిస్తారని అంటూ
ఉంటారు కూడా. ఇప్పుడిది మీ పాత చర్మము. ఇది ఉన్నదే పతిత ప్రపంచము, రావణ రాజ్యము.
ఇప్పుడు రావణుడి ఆసురీ ప్రపంచము సమాప్తమైపోతుంది. అందుకోసమే ఈ మహాభారత యుద్ధము
ఉన్నది. ఆ తర్వాత సత్యయుగములో శత్రువైన ఈ రావణుడిని ఎవరూ కాల్చనే కాల్చరు. రావణుడు
ఉండనే ఉండడు. రావణుడే దుఃఖపు ప్రపంచాన్ని తయారుచేసాడు. ఎవరి వద్దనైతే ధనము ఎంతో ఉందో,
పెద్ద-పెద్ద మహళ్ళు ఉన్నాయో, వారు స్వర్గములో ఉన్నారని కాదు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, కొందరి వద్ద కోట్లు ఉన్నా కానీ అదంతా మట్టిలో
కలిసిపోనున్నది. కొత్త ప్రపంచములో మళ్ళీ కొత్త గనులు వెలువడుతాయి, వాటి ద్వారా
కొత్త ప్రపంచము యొక్క మహళ్ళు మొదలైనవన్నీ తయారుచేయబడతాయి. ఈ పాత ప్రపంచము ఇప్పుడు
సమాప్తమవ్వనున్నది. మనుష్యులు భక్తి చేసేది సద్గతి కోసమే. అలాగే, మమ్మల్ని పావనముగా
చేయండి, మేము వికారులుగా అయిపోయాము అని అంటారు. వికారులను పతితులని అంటారు.
సత్యయుగములో ఉన్నది నిర్వికారులు, వారు సంపూర్ణ నిర్వికారులు. అక్కడ పిల్లలు
యోగబలముతో జన్మిస్తారు, వికారాలు అక్కడ ఉండనే ఉండవు. దేహాభిమానము ఉండదు, కామము,
క్రోధము, లోభము... 5 వికారాలు ఉండవు, అందుకే అక్కడ ఎప్పుడూ రావణుడిని కాల్చనే
కాల్చరు. ఇక్కడైతే రావణ రాజ్యముంది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు పవిత్రముగా అవ్వండి.
ఈ పతిత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. ఎవరైతే శ్రీమతాన్ని అనుసరించి పవిత్రముగా ఉంటారో,
వారే తండ్రి మతముపై నడుస్తూ విశ్వ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని పొందుతారు. ఈ
లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది కదా. ఇప్పుడు రావణ రాజ్యము ఉంది, ఇది
సమాప్తమవ్వనున్నది. సత్యయుగీ రామ రాజ్యము స్థాపనవ్వనున్నది. సత్యయుగములో చాలా
కొద్దిమంది మనుష్యులు ఉంటారు. రాజధానిగా ఢిల్లీయే ఉంటుంది. అక్కడ లక్ష్మీ-నారాయణుల
రాజ్యముంటుంది. ఢిల్లీ సత్యయుగములో పరిస్తాన్ గా ఉండేది. ఢిల్లీయే సింహాసనముగా
ఉండేది. రావణ రాజ్యములో కూడా ఢిల్లీయే రాజధాని, రామ రాజ్యములో కూడా ఢిల్లీయే
రాజధానిగా ఉంటుంది. కానీ రామ రాజ్యములోనైతే వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. అపారమైన
సుఖముండేది. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు విశ్వ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, నేను
మీకు మళ్ళీ ఇస్తాను. మీరు నా మతముపై నడవండి. శ్రేష్ఠముగా అవ్వాలంటే కేవలం
నన్నొక్కరినే స్మృతి చేయండి, ఇంకే దేహధారినీ స్మృతి చేయకండి. స్వయాన్ని ఆత్మగా
భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే తమోప్రధానము నుండి సతోప్రధానముగా
అయిపోతారు. మీరు నా వద్దకు వచ్చేస్తారు. నా మెడలోని మాలగా అయి ఆ తర్వాత విష్ణు మాలగా
అవుతారు. మాలలో పైన నేను ఉన్నాను, ఆ తర్వాత బ్రహ్మా-సరస్వతులు ఇరువురూ ఉన్నారు. వారే
సత్యయుగములో మహారాజా, మహారాణులుగా అవుతారు. ఆ తర్వాత నంబరువారుగా సింహాసనముపై
కూర్చునే వారి మాల అంతా ఉంది. నేను ఈ భారత్ ను ఈ బ్రహ్మా-సరస్వతులు మరియు
బ్రాహ్మణుల ద్వారా స్వర్గముగా తయారుచేస్తాను. ఎవరైతే కృషి చేస్తారో, వారిదే
స్మృతిచిహ్నము తయారవుతుంది. అది రుద్రమాల, మరొకటి విష్ణుమాల. రుద్రమాల ఆత్మలది మరియు
విష్ణుమాల మనుష్యులది. ఆత్మలు నివసించే స్థానము ఆ నిరాకార పరంధామము, దానిని
బ్రహ్మాండమని కూడా అంటారు. ఆత్మ ఏమీ అండాకారములో ఉండదు, ఆత్మ అయితే ఒక బిందువు వలె
ఉంటుంది. ఆత్మలమైన మనమందరమూ అక్కడ స్వీట్ హోమ్ లో నివసించేవారము. తండ్రితో పాటు
ఆత్మలమైన మనము ఉంటాము. అది ముక్తిధామము. ముక్తిధామానికి వెళ్ళాలని మనుష్యులందరూ
కోరుకుంటారు కానీ ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అందరూ పాత్రను అభినయించడానికి
రావలసిందే, అప్పటివరకు తండ్రి మిమ్మల్ని తయారుచేస్తూ ఉంటారు. మీరు తయారైపోతే, ఇక
మిగిలిన ఆత్మలెవరైతే ఉన్నారో, వారంతా వచ్చేస్తారు. ఇక తర్వాత అంతా సమాప్తమైపోతుంది.
మీరు వెళ్ళి కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు, ఆ తర్వాత నంబరువారుగా చక్రము
తిరుగుతుంది. చివరికి ఆ రోజు నేడు రానే వచ్చింది... అని పాటలో విన్నారు కదా. ఏ
భారతవాసులైతే ఇప్పుడు నరకవాసులుగా ఉన్నారో, వారు మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు అని
మీకు తెలుసు. మిగిలిన ఆత్మలంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. చాలా కొద్దిగా అర్థం
చేయించాలి. అల్ఫ్ అంటే బాబా, బే అంటే రాజ్యాధికారము. అల్ఫ్ కు (మొదటివారికి)
రాజ్యాధికారము లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు, నేను అదే రాజ్యాన్ని మళ్ళీ
స్థాపన చేస్తాను. మీరు 84 జన్మలను అనుభవించి ఇప్పుడు పతితముగా అయిపోయారు. పతితముగా
తయారుచేసింది రావణుడు. మళ్ళీ పావనముగా ఎవరు తయారుచేస్తారు? భగవంతుడు, వారిని
పతిత-పావనుడు అని అంటారు. మీరు పతితము నుండి పావనముగా, పావనము నుండి పతితముగా ఏ
విధముగా అవుతారు, ఆ చరిత్ర-భౌగోళికమంతా రిపీట్ అవుతుంది. ఈ వినాశనము ఉన్నది దీని
కోసమే. బ్రహ్మా ఆయువు శాస్త్రాలలో 100 సంవత్సరాలని ఉంది అని అంటారు. ఇప్పుడు ఈ
బ్రహ్మా, ఎవరిలోనైతే తండ్రి కూర్చుని వారసత్వాన్ని ఇస్తారో, వీరు కూడా శరీరాన్ని
వదిలేస్తారు. ఆత్మలకు ఆత్మల తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మనుష్యులు మనుష్యులను
పావనముగా చేయలేరు. దేవతలు ఎప్పుడూ వికారాల ద్వారా జన్మించరు. పునర్జన్మలనైతే అందరూ
తీసుకుంటూ ఉంటారు కదా. భాగ్యము మేలుకునే విధముగా తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు.
తండ్రి వచ్చేదే మనుష్యమాత్రుల భాగ్యాన్ని మేలుకొలిపేందుకు. అందరూ పతితముగా,
దుఃఖితులుగా ఉన్నారు కదా. ఆర్తనాదాలు చేస్తూ వినాశనమైపోతారు, అందుకే తండ్రి అంటారు,
ఆర్తనాదాలు చేసే కంటే ముందే అనంతమైన తండ్రినైన నా నుండి వారసత్వము తీసుకోండి. ఈ
ప్రపంచములో మీరు ఏదైతే చూస్తున్నారో, ఇదంతా సమాప్తమవ్వనున్నది. ఫాల్ ఆఫ్ భారత్, రైజ్
ఆఫ్ భారత్ (భారత్ యొక్క పతనము, భారత్ యొక్క ఉన్నతి), ఆట అంతా దీనికి సంబంధించినదే.
రైజ్ ఆఫ్ వరల్డ్ (ప్రపంచము యొక్క ఉన్నతి జరుగనున్నది). స్వర్గములో ఎవరెవరు రాజ్యము
చేస్తారు, ఇది తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. రైజ్ ఆఫ్ భారత్ అంటే దేవతల
రాజ్యము, ఫాల్ ఆఫ్ భారత్ అంటే రావణ రాజ్యము. ఇప్పుడు కొత్త ప్రపంచము తయారవుతూ ఉంది.
కొత్త ప్రపంచము యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి నుండి చదువుకుంటున్నారు.
ఇది ఎంత సహజము. ఇది మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే చదువు. ఇది కూడా బాగా అర్థం
చేసుకోవాలి. ఏయే ధర్మాలు ఎప్పుడు వస్తాయి, ద్వాపరము తర్వాతనే ఇతర ధర్మాలు వస్తాయి.
వారు మొదట సుఖాన్ని అనుభవిస్తారు, ఆ తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తారు. ఈ మొత్తము
చక్రమంతటినీ బుద్ధిలో కూర్చోబెట్టుకోవలసి ఉంటుంది. దీని ద్వారా మీరు చక్రవర్తి
మహారాజా-మహారాణులుగా అవుతారు. కేవలం భగవంతుడిని మరియు రాజ్యాధికారాన్ని అర్థం
చేసుకోవాలి. ఇప్పుడు వినాశనమైతే జరిగేదే ఉంది. ఎంతగా గొడవలు జరుగుతాయంటే, ఇక
విదేశాల నుండి తిరిగి రాలేకపోతారు కూడా, అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు,
భారతభూమి అన్నింటికంటే ఉత్తమమైనది. చాలా తీవ్రమైన యుద్ధము మొదలవుతుంది, అప్పుడిక
ఎక్కడివారు అక్కడే ఉండిపోతారు. 50-60 లక్షలు ఇచ్చినా సరే, అతి కష్టము మీద
రాగలుగుతారు. భారతభూమి అన్నింటికంటే ఉత్తమమైనది. ఇక్కడకు తండ్రి వచ్చి అవతరిస్తారు.
శివజయంతి కూడా ఇక్కడే జరుపుకోవడము జరుగుతుంది. కేవలం శ్రీకృష్ణుని పేరు వేసినందుకు
మహిమ అంతా సమాప్తమైపోయింది. మనుష్యమాత్రులందరి ముక్తిదాత ఇక్కడికే వచ్చి అవతరిస్తారు.
శివజయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. గాడ్ ఫాదరే వచ్చి విముక్తులుగా చేస్తారు. మరి
అటువంటి తండ్రినే నమస్కరించాలి, వారి జయంతినే జరుపుకోవాలి. ఆ తండ్రి ఇక్కడ భారత్
లోకి వచ్చి అందరినీ పావనముగా తయారుచేస్తారు. కావున ఇది అన్నింటికంటే గొప్ప తీర్థ
స్థానము అయినట్లు. అందరినీ దుర్గతి నుండి విడిపించి సద్గతిని ఇస్తారు, ఈ డ్రామా
తయారై ఉంది. మన బాబా మనకు ఈ శరీరము ద్వారా ఈ రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని,
ఆత్మలమైన మనము ఈ శరీరము ద్వారా వింటున్నామని ఇప్పుడు ఆత్మలైన మీకు తెలుసు.
ఆత్మాభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే
తుప్పు వదులుతూ ఉంటుంది మరియు పవిత్రముగా అయి మీరు తండ్రి వద్దకు వచ్చేస్తారు. ఎంతగా
స్మృతి చేస్తారో, అంతగా పవిత్రముగా అవుతారు. ఇతరులను కూడా మీ సమానముగా తయారుచేస్తే
అనేకుల ఆశీర్వాదాలు లభిస్తాయి, ఉన్నత పదవిని పొందుతారు, అందుకే క్షణములో జీవన్ముక్తి
అని అంటూ ఉంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శ్రీమతమనుసారముగా పవిత్రముగా అయి ప్రతి అడుగు తండ్రి మతముపై నడుస్తూ విశ్వ
రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. తండ్రి సమానముగా దుఃఖహర్త-సుఖకర్తగా అవ్వాలి.
2. మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే ఈ చదువును సదా చదువుతూ ఉండాలి. అందరినీ తమ
సమానముగా తయారుచేసే సేవను చేస్తూ ఆశీర్వాదాలను ప్రాప్తి చేసుకోవాలి.
వరదానము:-
కళ్యాణ వృత్తి మరియు శుభచింతక భావము ద్వారా విశ్వ కళ్యాణానికి
నిమిత్తముగా అయ్యే తీవ్ర పురుషార్థీ భవ
ఎవరైతే సర్వుల పట్ల కళ్యాణ వృత్తిని మరియు శుభచింతక
భావాన్ని ఉంచుతారో వారే తీవ్ర పురుషార్థులు. ఎవరైనా పదే-పదే కింద పడేసేందుకు
ప్రయత్నించినా కానీ, మనసును విచలితము చేసినా కానీ, విఘ్నరూపముగా అయినా కానీ, మీకు
వారి పట్ల సదా శుభచింతక వృత్తితో కూడిన స్థిరమైన భావము ఉండాలి. విషయము కారణముగా
భావము మారకూడదు. ప్రతి పరిస్థితిలోనూ వృత్తి మరియు భావము యథార్థముగా ఉండాలి, అప్పుడు
మీపై దాని ప్రభావము పడదు. అప్పుడిక ఎటువంటి వ్యర్థమైన విషయాలు మీకు కనే కనిపించవు,
సమయము పొదుపు అవుతుంది, ఇదే విశ్వ కళ్యాణకారీ స్థితి.
స్లోగన్:-
సంతుష్టత జీవితము యొక్క అలంకరణ, అందుకే సంతుష్టమణులుగా అయి సంతుష్టముగా ఉండండి మరియు
సర్వులను సంతుష్టపరచండి.
అవ్యక్త ప్రేరణలు -
ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి
ఏకమతము అనగా ఏకత
యొక్క వాతావరణాన్ని తయారుచేయడానికి ఇముడ్చుకునే శక్తిని ధారణ చేయండి. భిన్నత్వాన్ని
ఇముడ్చుకోండి. ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడండి, లోపాలనైతే అసలు చూడనే చూడకూడదు.
ఏ విధముగా చంద్రునికి లేక సూర్యునికి గ్రహణము పడితే, చూడకూడదు అని అంటారు కదా,
చూస్తే గ్రహచారము పట్టుకుంటుంది అని అంటారు, అదే విధముగా ఇతరులలోని లోపాలు కూడా
గ్రహణము వంటివే, వాటిని ఎప్పుడూ చూడకండి.
| | | |