10-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ ఉన్నతి కొరకు ప్రతి రోజూ లెక్కాపత్రము వ్రాయండి, రోజంతటిలో నడవడిక ఎలా ఉంది, చెక్ చేసుకోండి - యజ్ఞము పట్ల నిజాయితీగా ఉన్నానా?’’

ప్రశ్న:-
ఏ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవము ఉంది? ఆ గౌరవానికి గుర్తు ఏమిటి?

జవాబు:-
ఏ పిల్లలైతే తండ్రితో సత్యముగా ఉన్నారో, యజ్ఞము పట్ల నిజాయితీగా ఉన్నారో, ఏదీ దాచి పెట్టరో, ఆ పిల్లల పట్ల తండ్రికి చాలా గౌరవము ఉంది. గౌరవము ఉన్న కారణముగా వారిని ప్రేమ చేసి నిలబెడుతూ ఉంటారు. వారిని సేవకు కూడా పంపిస్తారు. పిల్లలు సత్యము వినిపించి శ్రీమతము తీసుకునే తెలివి కలిగి ఉండాలి.

పాట:-
సభలో జ్యోతి వెలిగింది...

ఓంశాంతి
ఈ పాట సరైనది కాదు, ఎందుకంటే పరమాత్మ ఏమీ ఒక దీపము కాదు. పరమాత్మను వాస్తవానికి దీపము అని అనరు. భక్తులు అలా అనేక పేర్లు పెట్టేసారు. వారి గురించి తెలియని కారణముగా - మాకు తెలియదు, తెలియదు, మేము నాస్తికులము అని అంటూ ఉంటారు. అలా అంటారు కానీ మళ్ళీ ఏ పేరు తోస్తే ఆ పేరుతో పిలుస్తూ ఉంటారు. బ్రహ్మములో, దీపములో, రాయి-రప్పలలో కూడా పరమాత్మ ఉన్నారని అంటారు ఎందుకంటే భక్తి మార్గములో తండ్రిని ఎవ్వరూ యథార్థ రీతిగా గుర్తించలేరు. తండ్రియే వచ్చి తన పరిచయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. శాస్త్రాలు మొదలైనవాటిలో కూడా తండ్రి పరిచయము లేదు, అందుకే వారిని నాస్తికులు అని అంటారు. ఇప్పుడు పిల్లలకు తండ్రి పరిచయాన్ని ఇచ్చారు, కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము, ఇందులోనే ఎంతో బుద్ధిని ఉపయోగించవలసి వస్తుంది. ఈ సమయములో రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఆత్మలోనే బుద్ధి ఉంది. ఆత్మ బుద్ధి పారసము వలె ఉందా లేక రాయి వలె ఉందా అన్నది ఇంద్రియాల ద్వారా తెలుస్తుంది. మొత్తమంతా ఆత్మపైనే ఆధారపడి ఉంది. మనుష్యులైతే - ఆత్మయే పరమాత్మ, ఆత్మ నిర్లేపి, అందుకే ఏది కావాలంటే అది చేయవచ్చు అని అంటారు. మనుష్యులయ్యుండి తండ్రి గురించే తెలియదు. తండ్రి అంటారు, మాయా రావణుడు అందరి బుద్ధిని రాతిబుద్ధిగా చేసేశాడు. రోజురోజుకు ఇంకా ఎక్కువ తమోప్రధానముగా అవుతూ ఉంటారు. మాయ తీవ్రత ఎంతగానో ఉంది, ఇక ఎంతకీ బాగుపడరు. పిల్లలకు ఏమని అర్థం చేయించడం జరుగుతుందంటే రోజంతటిలో ఏమి చేసారు అని రాత్రివేళ మొత్తము లెక్కాపత్రాన్ని చూసుకోండి. నేను భోజనము దేవతల వలె భుజించానా? నడవడిక నియమానుసారముగా నడుచుకున్నానా లేక ఆటవికుల్లా ఉందా? ప్రతిరోజూ మీ లెక్కపత్రాన్ని సంభాళించుకోకపోతే ఇక మీ ఉన్నతి ఎప్పటికీ జరగదు. చాలామందికి మాయ చెంపదెబ్బ వేస్తూ ఉంటుంది. ఈ రోజు మా బుద్ధియోగము ఫలానా వ్యక్తి యొక్క నామ-రూపాలలోకి వెళ్ళింది, ఈ రోజు ఈ పాప కర్మ జరిగింది అని తండ్రికి వ్రాస్తారు. ఈ విధంగా సత్యము వ్రాసేవారు కోట్లలో కొందరే ఉన్నారు. తండ్రి అంటారు, నేను ఎవరినో, నేను ఎలా ఉన్నానో, నా గురించి అసలు ఏ మాత్రము తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే ఎంతోకొంత బుద్ధిలో కూర్చుంటుంది. తండ్రి అంటారు, కొందరు మంచి-మంచి పిల్లలు కూడా ఉన్నారు, వారు చాలా బాగా జ్ఞానాన్ని వినిపిస్తారు, యోగము ఏమాత్రము లేదు. పూర్తి పరిచయము లేదు, పూర్తిగా అర్థం చేసుకోలేదు, అందుకే ఎవరికీ అర్థం చేయించలేరు. మొత్తము ప్రపంచములోని మనుష్యమాత్రులెవ్వరికీ రచయిత మరియు రచన గురించి ఏ మాత్రమూ తెలియదు అనగా వారికి ఏమీ తెలియదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది మళ్ళీ జరుగుతుంది. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సమయము వస్తుంది మరియు నేను వచ్చి అర్థం చేయించవలసి వస్తుంది. రాజ్యపదవి తీసుకోవడము తక్కువ విషయము ఏమీ కాదు! ఇందులో చాలా శ్రమ ఉంది. మాయ బాగానే దాడి చేస్తుంది, పెద్ద యుద్ధము నడుస్తుంది. బాక్సింగ్ జరుగుతుంది కదా. చాలా తెలివైనవారు ఎవరైతే ఉంటారో, వారితోనే బాక్సింగ్ జరుగుతుంది. ఒకరినొకరు మూర్ఛితులుగా చేసుకుంటారు కదా. బాబా, మాయ తుఫానులు చాలా వస్తున్నాయి, ఇలా జరుగుతుంది అని అంటారు. అది కూడా చాలా కొద్దిమందే సత్యము వ్రాస్తారు. చాలామంది దాచిపెడతారు. నేను బాబాకు ఏ విధంగా సత్యము వినిపించాలి, ఏ శ్రీమతము తీసుకోవాలి అన్న తెలివి వారిలో లేదు. వారు వర్ణన చేయలేకపోతారు. మాయ చాలా ప్రబలమైనది అని తండ్రికి తెలుసు. సత్యము వినిపించేందుకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది, వారి ద్వారా ఎటువంటి కర్మలు జరుగుతాయి అంటే అవి చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది. తండ్రి అయితే చాలా గౌరవము ఇచ్చి పైకి ఎత్తుతారు. ఇతను చాలా మంచిగా ఉన్నారు, ఇతడిని ఆల్రౌండ్ సేవకు పంపిస్తాను అని తండ్రి అన్నట్లయితే ఇక అతనికి దేహ అహంకారము వస్తుంది, మాయ చెంపదెబ్బ తింటారు, ఇక పడిపోతారు. బాబా అయితే పైకి ఎత్తేందుకు వారి మహిమను కూడా చేస్తారు. నీవు చాలా మంచివాడివి, స్థూల సేవ కూడా బాగా చేస్తున్నావు అని నేను వారికి ప్రేమ చేసి పైకి ఎత్తుతాను. కానీ యథార్థ రీతిగా కూర్చుని తెలియజేస్తున్నారు, గమ్యము చాలా ఉన్నతమైనది. దేహము మరియు దేహ సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించడము, ఈ పురుషార్థము చేయడము బుద్ధితో చేసే పని. అందరూ పురుషార్థులే. ఎంత పెద్ద రాజ్యము స్థాపన అవుతోంది. తండ్రికి అందరూ పిల్లలు కూడా, అలాగే విద్యార్థులు కూడా మరియు అనుచరులు కూడా. వీరు మొత్తము ప్రపంచమంతటికీ తండ్రి. అందరూ ఆ ఒక్కరినే పిలుస్తూ ఉంటారు. వారు వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా కానీ తండ్రిపై అంత గౌరవము ఉంచరు. పెద్ద-పెద్దవారు ఎవరైనా వస్తే, వారిని ఎంత గౌరవముతో చూసుకుంటారు, ఎంత ఆర్భాటము చేస్తారు. ఈ సమయములోనైతే అందరూ పతితులే. కానీ ఎవరూ తమను తాము ఆ విధముగా భావించరు. మాయ పూర్తిగా తుచ్ఛ బుద్ధి కలవారిగా చేసేసింది. సత్యయుగ ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది అని వారు అంటే తండ్రి అంటారు, అది వంద శాతము బుద్ధి హీనులుగా అయినట్లు కదా. మనుష్యులయ్యుండి ఎలాంటి కర్మలు చేస్తూ ఉంటారు. 5000 సంవత్సరాల విషయాన్ని లక్షల సంవత్సరాలు అని అంటారు! ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. 5000 సంవత్సరాల క్రితము ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, వీరు దైవీ గుణాలు కలిగిన మనుష్యులుగా ఉండేవారు, అందుకే వారిని దేవతలు అని అంటారు, అలాగే ఆసురీ గుణాలు కలిగినవారిని అసురులు అని అంటారు. అసురులకు మరియు దేవతలకు మధ్యన రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎన్ని యుద్ధాలు, గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఈ యజ్ఞములో మొత్తము ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నది. దీని కొరకు ఈ ఏర్పాట్లన్నీ కావాలి కదా. బాంబులు తయారవుతూనే ఉన్నాయి, ఇక వాటిని ఆపడం జరగదు. కొద్ది సమయములోనే అందరి వద్ద ఎన్నో బాంబులు పెరిగిపోతాయి ఎందుకంటే వినాశనమైతే వెంట వెంటనే జరగాలి కదా. ఇక తర్వాత హాస్పిటళ్ళు మొదలైనవి ఉండవు. ఎవరికీ తెలియదు కూడా. ఇది సులభమైన విషయమేమీ కాదు. వినాశన సాక్షాత్కారము సులభమైన విషయమేమీ కాదు. మొత్తము ప్రపంచమంతటి అగ్నిని చూడగలుగుతారా! చుట్టూ అంతా అగ్నియే అంటుకుని ఉన్నట్లు సాక్షాత్కారము జరుగుతుంది. మొత్తము ప్రపంచమంతా అంతము అవ్వనున్నది. ఇది ఎంత పెద్ద ప్రపంచము. ఆకాశమైతే కాలదు. దాని కింద ఏదైతే ఉందో, అదంతా వినాశనము అవ్వనున్నది. సత్యయుగానికి మరియు కలియుగానికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఎంతమంది మనుష్యులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, ఎంత సామాగ్రి ఉంది. ఇది కూడా పిల్లల బుద్ధిలో కష్టము మీద కూర్చుంటుంది. ఆలోచించండి - ఇది 5000 సంవత్సరాల నాటి విషయము. దేవీ-దేవతల రాజ్యము ఉండేది కదా! ఎంత కొద్దిమంది మనుష్యులు ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది మనుష్యులు ఉన్నారు! ఇప్పుడు ఇది కలియుగము, ఇది తప్పకుండా వినాశనమవ్వవలసిందే.

ఇప్పుడు తండ్రి ఆత్మలకు చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. అది కూడా అర్థం చేసుకుని స్మృతి చేయాలి. ఊరికే అలా శివ శివ... అని చాలామంది అంటూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా అంటారు కానీ వారి బుద్ధిలో అర్థమేమీ లేదు. వారు ఒక బిందువు అని అనుభవముతో చెప్పరు. మనము కూడా ఇంతటి చిన్న బిందువే. ఈ విధముగా అర్థము తెలుసుకుని స్మృతి చేయాలి. మొదటైతే నేను ఆత్మను - ఈ విషయము పక్కా చేసుకోండి, ఆ తర్వాత తండ్రి పరిచయాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయండి. అంతర్ముఖులైన పిల్లలే - నేను ఆత్మను, ఒక బిందును అని బాగా అర్థం చేసుకోగలుగుతారు. మనలో 84 జన్మల పాత్ర ఏ విధముగా నిండి ఉంది, మళ్ళీ ఆత్మ ఏ విధముగా సతోప్రధానముగా అవుతుంది అని ఇప్పుడు మన ఆత్మకు జ్ఞానము లభిస్తోంది. ఇవన్నీ చాలా అంతర్ముఖులుగా ఉంటూ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇందులోనే సమయము పడుతుంది. పిల్లలకు తెలుసు - ఇది మన అంతిమ జన్మ, ఇప్పుడు మనము ఇంటికి వెళ్తాము. మనము ఒక ఆత్మ అన్న విషయము బుద్ధిలో పక్కాగా ఉండాలి. శరీర భానము తగ్గాలి, అప్పుడు మాట్లాడే తీరులో పరివర్తన వస్తుంది. లేదంటే నడవడిక పూర్తిగా పాడైపోతుంది ఎందుకంటే శరీరము నుండి వేరవ్వరు, దేహాభిమానములోకి వచ్చి ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు. యజ్ఞము పట్ల చాలా నిజాయితీపరులుగా ఉండాలి. ప్రస్తుతము చాలా నిర్లక్ష్యముగా ఉన్నారు. ఆహార-పానీయాలు, వాతావరణము ఏదీ బాగవ్వలేదు. ఇప్పుడు ఇంకా చాలా సమయము కావాలి. సేవాధారి పిల్లలనే తండ్రి తలచుకుంటూ ఉంటారు, పదవి కూడా వారే పొందగలరు. ఏమీ చేయకుండా ఊరికే అలా మిమ్మల్ని మీరు సంతృప్తి పరుచుకోవడమంటే శనగలు నమలడం వంటిదే. ఇందులో చాలా అంతర్ముఖత కావాలి. అర్థం చేయించేందుకు కూడా యుక్తి కావాలి. ప్రదర్శనీలో ఎవరూ అర్థం చేసుకోరు. కేవలము మీరు చెప్తున్న విషయాలు కరక్టు అని అంటారు, అంతే. ఇక్కడ కూడా నంబరువారుగా ఉన్నారు. మనము పిల్లలుగా అయ్యామని, తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుందని నిశ్చయము ఉంది. ఒకవేళ మనము తండ్రి సేవను పూర్తిగా చేస్తూ ఉన్నట్లయితే ఇదే మన వ్యాపారముగా అవుతుంది. రోజంతా విచార సాగర మంథనము జరుగుతూ ఉంటుంది. ఈ బాబా కూడా విచార సాగర మంథనము చేస్తూ ఉండవచ్చు కదా. లేకపోతే ఈ పదవిని ఎలా పొందుతారు! పిల్లలకు ఇరువురూ కలిసి అర్థం చేయిస్తూ ఉంటారు. చాలా ఎత్తుకు ఎక్కాలి కావున రెండు ఇంజన్లు లభించాయి. పర్వతాల పైకి వెళ్ళేటప్పుడు బండికి రెండు ఇంజన్లు పెడతారు. అప్పుడప్పుడూ పైకి వెళ్తూ-వెళ్తూ బండి ఆగిపోతే మెల్లగా జారిపోతూ కిందకు వచ్చేస్తుంది. నా పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. పైకి ఎక్కుతూ, ఎక్కుతూ కష్టపడుతూ, కష్టపడుతూ ఇక పైకి ఎక్కలేకపోతారు. మాయ గ్రహణము లేక తుఫాను ఏర్పడితే ఇక పూర్తిగా కింద పడిపోయి ముక్కలు-ముక్కలుగా అయిపోతారు. కాస్త సేవ చేయగానే అహంకారము వచ్చేస్తుంది, ఇక కింద పడిపోతారు. తండ్రి ఉన్నారు, వారితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు అని అర్థం చేసుకోరు. ఒకవేళ ఎవరన్నా ఇలా చేస్తే వారిపై చాలా ఎక్కువ శిక్ష పడుతుంది, దానికంటే బయట ఉండేవారి పరిస్థితి బాగుంటుంది. తండ్రికి చెందినవారిగా అయి వారసత్వాన్ని తీసుకోవడమనేది అంత సులభమైన విషయమేమీ కాదు. తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత మళ్ళీ అటువంటి పనులు ఏమైనా చేస్తే పేరును అప్రతిష్టపాలు చేస్తారు. దానితో చాలా దెబ్బ తగులుతుంది. వారసులుగా అవ్వడమనేది అంత సులభమైన విషయమేమీ కాదు. ప్రజలలో కొందరు ఎంత షావుకారులుగా అవుతారు అంటే ఇక అడగకండి. అజ్ఞాన కాలములో కొందరు బాగుంటారు, కొందరు ఇంకెలాగో ఉంటారు. అనర్హులైన పిల్లలనైతే - నా ముందు నుండి వెళ్ళిపో అని అంటారు. ఇక్కడ ఇది ఒకరిద్దరు పిల్లల విషయము కాదు. ఇక్కడ మాయ చాలా శక్తివంతముగా ఉంది. ఇందులో పిల్లలు చాలా అంతర్ముఖులుగా ఉండాలి, అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలుగుతారు. అప్పుడు మీపై బలిహారమవుతారు మరియు మేము తండ్రిని ఇంత కాలము నిందిస్తూ వచ్చాము అని పశ్చాత్తాప పడతారు. సర్వవ్యాపి అని అనడము లేక స్వయాన్ని ఈశ్వరుడు అని చెప్పుకోవడము, ఇలా చేసేవారికి తక్కువ శిక్షలు ఉండవు. వారు ఏ శిక్షలూ పొందకుండా ఊరికే అలా వెళ్ళిపోరు. వారికైతే ఇంకా ఎక్కువ కష్టాలు ఉంటాయి. సమయము వచ్చినప్పుడు తండ్రి వీరందరి నుండి లెక్క తీసుకుంటారు. వినాశన సమయములో అందరి లెక్కాచారాలు సమాప్తమవుతాయి కదా, ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి.

మనుష్యులు ఎవరెవరికి శాంతి బహుమతులు ఇస్తూ ఉంటారో చూడండి. ఇప్పుడు వాస్తవానికి శాంతిని స్థాపించేది ఒక్కరే కదా. ప్రపంచములో పవిత్రత, శాంతి, సంపన్నత భగవంతుని శ్రీమతము ద్వారా స్థాపన అవుతూ ఉన్నాయి అని పిల్లలు వ్రాయాలి. శ్రీమతమైతే ప్రసిద్ధమైనది. శ్రీమత్ భగవద్గీతా శాస్త్రానికి ఎంత గౌరవము ఇస్తారు. ఎవరైనా వాళ్ళ శాస్త్రాలను లేక మందిరాలను ఇతరులు ఏమైనా చేస్తే ఎంతగా గొడవ పడతారు. ఈ మొత్తము ప్రపంచమంతా కాలి భస్మమైపోతుంది అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ మందిరాలు, మసీదులు మొదలైనవాటినన్నింటినీ కాలుస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగేందుకు ముందే పవిత్రముగా అవ్వాలి. ఈ తపనతో కూడిన చింత ఉండాలి. ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళించాలి. ఇక్కడికైతే లెక్కలేనంత మంది వస్తారు. ఇక్కడ మేకల గుంపులానైతే ఉంచుకోవడము జరగదు కదా ఎందుకంటే ఇది అమూల్యమైన జీవితము, దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడికి పిల్లలను మొదలైనవారిని తీసుకురావడం మానివేయాల్సి ఉంటుంది. ఇంతమంది పిల్లలను ఎక్కడ కూర్చుని సంభాళిస్తారు. పిల్లలకు సెలవులు దొరికితే, ఎక్కడికో ఎందుకు వెళ్ళడము, బాబా వద్దకు మధుబన్ కు వెళ్దాము అని భావిస్తారు. అలా అయితే ఇది ఒక ధర్మశాలలా అయిపోతుంది, అప్పుడు ఇది విశ్వ విద్యాలయము ఎలా అవుతుంది! బాబా ప్రస్తుతము గమనిస్తూ ఉన్నారు, ఇక ఎప్పుడో అప్పుడు ఆర్డర్ చేస్తారు - పిల్లలెవరినీ తీసుకురాకూడదు అని. ఈ బంధనము కూడా తగ్గిపోతుంది. మాతలపై జాలి కలుగుతుంది. శివబాబా గుప్తమైనవారు అని కూడా పిల్లలకు తెలుసు. కొందరికి బ్రహ్మా పట్ల కూడా గౌరవము లేదు. మాకైతే శివబాబాతో కనెక్షన్ ఉంది అని భావిస్తారు. వీరి ద్వారా అర్థం చేయిస్తున్నది శివబాబాయే కదా అని ఈ మాత్రము కూడా అర్థం చేసుకోరు. మాయ ముక్కు పట్టుకుని తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది, అది వదలనే వదలదు. రాజధానిలోనైతే అందరూ కావాలి కదా. ఇవన్నీ అంతిమ సమయములో సాక్షాత్కారమవుతాయి. శిక్షలు కూడా సాక్షాత్కారమవుతాయి. పిల్లలకు మొదటిలో కూడా ఇవన్నీ సాక్షాత్కారమయ్యాయి. అయినా కానీ కొందరు పాపము చేయడం మానరు. కొంతమంది పిల్లలైతే - మేము థర్డ్ క్లాస్ వారిగానే అవ్వాలి అని కంకణం కట్టుకున్నట్లుగా ఉన్నారు, అందుకే పాపము చేయడం మానరు. తమ శిక్షలను ఇంకా బాగా తయారుచేసుకుంటూ ఉన్నారు. అర్థం చేయించవలసి అయితే ఉంటుంది కదా. మేమైతే థర్డ్ క్లాస్ వారిగానే అవ్వాలి అన్నట్లు కంకణం కట్టుకోకండి. మేము ఈ లక్ష్మీ-నారాయణుల వలె అవ్వాలి అని ఇప్పుడు ఈ కంకణం కట్టుకోండి. కొందరు చాలా బాగా కంకణం కట్టుకుంటారు, నేను ఈ రోజు చేయకూడనిది ఏమీ చేయలేదు కదా అని చార్టు వ్రాసుకుంటారు! ఇలా చార్టును కూడా ఎంతోమంది వ్రాసుకునేవారు, వారు ఈ రోజు లేరు. మాయ కింద పడిపోయేలా చేస్తుంది. అర్ధకల్పము నేను సుఖము ఇస్తాను, మళ్ళీ అర్ధకల్పము మాయ దుఃఖము ఇస్తుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అంతర్ముఖులుగా అయి శరీర భానము నుండి అతీతముగా ఉండే అభ్యాసము చేయాలి, ఆహార-పానీయాలను, నడత-నడవడికను తీర్చిదిద్దుకోవాలి, కేవలం స్వయాన్ని సంతోషపరచుకుంటూ నిర్లక్ష్యులుగా అవ్వకూడదు.

2. ఇక్కడ చాలా ఎత్తుకు ఎక్కాలి, అందుకే చాలా-చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఏ కర్మనైనా సరే జాగ్రత్తగా చేయాలి. అహంకారములోకి రాకూడదు. తప్పుడు కర్మలు చేసి శిక్షలను తయారుచేసుకోకూడదు. మేము ఈ లక్ష్మీ-నారాయణుల వలె తయారవ్వాల్సిందే అని కంకణం కట్టుకోవాలి.

వరదానము:-
ఆత్మికత యొక్క శ్రేష్ఠ స్థితి ద్వారా వాతావరణాన్ని ఆత్మికముగా తయారుచేసే సహజ పురుషార్థీ భవ

ఆత్మికత యొక్క స్థితి ద్వారా తమ సేవాకేంద్రము యొక్క వాతావరణాన్ని ఎంత ఆత్మికముగా తయారుచెయ్యండి అంటే దాని ద్వారా స్వయానికి మరియు వచ్చేటువంటి ఆత్మలకు సహజముగా ఉన్నతి జరగాలి ఎందుకంటే ఎవరైతే బయటి వాతావరణము నుండి అలసిపోయి వస్తారో, వారికి ఎక్స్ ట్రా సహయోగము యొక్క అవసరము ఉంటుంది, అందుకే వారికి ఆత్మిక వాయుమండలము యొక్క సహయోగాన్ని అందించండి. సహజ పురుషార్థులుగా అవ్వండి మరియు ఆ విధంగా తయారుచెయ్యండి. ఈ స్థానము సహజముగానే ఉన్నతిని ప్రాప్తి చేయిస్తుంది అని వచ్చేటువంటి ప్రతి ఆత్మ అనుభవము చెయ్యాలి.

స్లోగన్:-
వరదానీగా అయ్యి శుభ భావన మరియు శుభ కామనల వరదానాన్ని ఇస్తూ ఉండండి.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

తండ్రి కంబైండ్ గా ఉన్నారు, అందుకే ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళండి. బలహీనతలను, నిరాశలను తండ్రికి అప్పజెప్పేయ్యండి, మీ వద్ద పెట్టుకోకండి. మీ వద్ద కేవలము ఉల్లాస-ఉత్సాహాలను మాత్రమే పెట్టుకోండి. సదా ఉల్లాస-ఉత్సాహాలలో నాట్యము చేస్తూ ఉండండి, పాటలు పాడుతూ ఉండండి మరియు బ్రహ్మా భోజనము చేస్తూ ఉండండి.