10-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31.10.2006


‘‘సదా స్నేహీలుగా ఉండటముతోపాటు అఖండ మహాదానులుగా అయినట్లయితే విఘ్న-వినాశకులుగా, సమాధాన స్వరూపులుగా అవుతారు’’

ఈ రోజు ప్రేమ సాగరుడు, పరమాత్మ ప్రేమకు పాత్రులైన తన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా స్నేహమనే అలౌకిక విమానములో ఇక్కడకు చేరుకున్నారు కదా! సాధారణ విమానములో వచ్చారా లేక స్నేహమనే విమానములో ఎగురుతూ చేరుకున్నారా? అందరి మనసులలో స్నేహపు అలలు వస్తూ ఉన్నాయి మరియు స్నేహమే ఈ బ్రాహ్మణ జీవితము యొక్క పునాది. మరి మీరందరూ కూడా ఇక్కడకు వచ్చారంటే స్నేహమే లాక్కుని వచ్చింది కదా! జ్ఞానాన్ని అయితే తర్వాత విన్నారు, కానీ స్నేహమే పరమాత్మ స్నేహీలుగా తయారుచేసింది. మేము పరమాత్ముని స్నేహానికి పాత్రులుగా అవుతాము అన్నది ఎప్పుడూ స్వప్నములో కూడా ఉండి ఉండదు. కానీ ఇప్పుడేమంటారు? స్నేహీలుగా అయిపోయారు. ఆ స్నేహము కూడా సాధారణమైన స్నేహము కాదు, అది హృదయపూర్వకమైన స్నేహము. అది ఆత్మిక స్నేహము, సత్యమైన స్నేహము, నిస్వార్థ స్నేహము. ఈ పరమాత్మ స్నేహము చాలా సహజముగా స్మృతిని అనుభవము చేయిస్తుంది. స్నేహీ అయినవారిని గుర్తు చేసుకోవటము కష్టము కాదు, మర్చిపోవటమే కష్టమవుతుంది. స్నేహము ఒక అలౌకిక అయస్కాంతము. స్నేహము సహజయోగిగా తయారుచేస్తుంది, శ్రమ నుండి విడిపిస్తుంది. స్నేహముతో గుర్తు చేయడములో శ్రమ అనిపించదు. ప్రేమ యొక్క ఫలాన్ని తింటారు. స్నేహానికి చిహ్నముగా విశేషముగా నలువైపులా ఉన్న పిల్లలు ఎలాగూ ఉన్నారు, కానీ డబుల్ విదేశీయులు స్నేహము కారణముగా పరుగుపరుగున చేరుకున్నారు. చూడండి, 90 దేశాల నుండి ఎలా పరుగెత్తుకుని చేరుకున్నారు! భారత్ లోని పిల్లలైతే ప్రభు ప్రేమకు పాత్రులుగా ఉండనే ఉన్నారు, కానీ ఈ రోజు విశేషముగా డబుల్ విదేశీయులకు సువర్ణావకాశము. మీ అందరికీ కూడా విశేషమైన ప్రేమ ఉంది కదా! స్నేహము ఉంది కదా! ఎంత స్నేహము ఉంది? దేనితోనైనా పోల్చగలరా? దేనితోనూ పోల్చలేరు. మీ అందరిదీ ఒక పాట ఉంది కదా - పోల్చటానికి ఆకాశములోని నక్షత్రాలు చాలవు, సాగరములోని నీరు చాలదు... అని! ఇది అనంతమైన ప్రేమ, అనంతమైన స్నేహము.

బాప్ దాదా కూడా స్నేహీ పిల్లలను కలుసుకునేందుకు చేరుకున్నారు. పిల్లలైన మీరందరూ స్నేహముతో గుర్తు చేసారు మరియు బాప్ దాదా మీ ప్రేమకు చేరుకున్నారు. ఎలా అయితే ఈ సమయములో ప్రతి ఒక్కరి ముఖముపై స్నేహపు రేఖ మెరుస్తూ ఉందో, అలాగే ఇప్పుడు దానికి ఇంకేమి చేర్చాలి? స్నేహమైతే ఉంది, ఇది పక్కా. స్నేహము ఉంది అని బాప్ దాదా కూడా సర్టిఫికేట్ ఇస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అర్థమైపోయింది కదా. ఇప్పుడు కేవలము అండర్ లైన్ చెయ్యాల్సింది ఏమిటంటే - సదా స్నేహీలుగా ఉండాలి, సదా. అప్పుడప్పుడూ కాదు. స్నేహము ఎడతెగనిదిగానే ఉంది కానీ శాతములో తేడా వచ్చేస్తుంది. మరి ఈ తేడాను తొలగించేందుకు మంత్రమేమిటి? అదేమిటంటే - ప్రతి సమయము మహాదానులుగా, అఖండదానులుగా అవ్వండి. సదా దాతా పిల్లలుగా, విశ్వ సేవాధారుల సమానముగా ఉండండి. ఏ సమయములోనూ మాస్టర్ దాతలుగా అవ్వకుండా ఉండకూడదు ఎందుకంటే విశ్వ కళ్యాణ కార్యము కొరకు బాబాతోపాటుగా మీరు కూడా సహాయకులుగా అయ్యే సంకల్పము చేసారు. మనసా ద్వారా శక్తుల దానాన్ని మరియు సహయోగాన్ని ఇవ్వండి. వాచా ద్వారా జ్ఞాన దానాన్ని ఇవ్వండి, సహయోగాన్ని ఇవ్వండి. కర్మల ద్వారా గుణాల దానాన్ని ఇవ్వండి మరియు స్నేహ సంపర్కము ద్వారా సంతోషము యొక్క దానాన్ని ఇవ్వండి. మీరు ఎన్ని అఖండ ఖజానాలకు యజమానులు, రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచములోనే అత్యంత సంపన్నులు). తరగని మరియు అఖండమైన ఖజానాలు ఉన్నాయి. వాటిని ఎంతగా ఇస్తూ ఉంటారో, అంతగా పెరుగుతూ ఉంటాయి. తక్కువ అవ్వవు, పెరుగుతాయి... ఎందుకంటే వర్తమాన సమయములో ఈ ఖజానాల కోసమని మెజారిటీ మీ అందరి ఆత్మిక సోదరులు మరియు సోదరీలు దాహముతో ఉన్నారు. మరి మీ సోదరీ-సోదరులపై దయ కలగటము లేదా! దాహముతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చరా? ‘ఓ మా దేవీ-దేవతలారా, మాకు శక్తిని ఇవ్వండి, సత్యమైన ప్రేమను ఇవ్వండి’ అన్న శబ్దము మీ చెవులకు చేరటం లేదా? మీ భక్తులు మరియు దుఃఖముతో ఉన్న ఆత్మలు, ఇరువురు కూడా - దయ చూపించండి, కృప చూపించండి, ఓ కృపా దేవీ-దేవతలారా! అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు. సమయము యొక్క పిలుపు వినిపిస్తుంది కదా! అంతేకాక ఇచ్చే సమయము కూడా ఇప్పుడే ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇస్తారు? మీ వద్ద ఇంతటి తరగని అఖండ ఖజానాలు జమ అయ్యి ఉన్నాయి, మరి వాటిని ఎప్పుడు ఇస్తారు? చివరి సమయములో, అంతిమ సమయములో ఇస్తారా ఏమిటి? ఆ సమయములో కేవలము దోసిలి అంత మాత్రమే ఇవ్వగలరు. మరి జమ అయి ఉన్న మీ ఖజానాలను కార్యములో ఎప్పుడు పెడతారు? చెక్ చేసుకోండి - ప్రతి సమయము ఏదో ఒక ఖజానాను సఫలము చేస్తున్నారా! ఇందులో డబుల్ లాభము ఉంది, ఖజానాలను సఫలము చేసుకోవటము వలన ఆత్మల కళ్యాణము కూడా జరుగుతుంది, అంతేకాక మీరందరూ కూడా మహాదానులుగా అయిన కారణముగా విఘ్న వినాశకులుగా సహజముగానే అవుతారు, అలాగే సమస్యా స్వరూపులుగా కాకుండా సమాధాన స్వరూపులుగా సహజముగానే అవుతారు. డబుల్ లాభము ఉంది. ఈ రోజు ఇది వచ్చింది, నిన్న అది వచ్చింది, ఈ రోజు ఇది జరిగింది, నిన్న అది జరిగింది అని అనరు. విఘ్నముక్తులుగా, సమస్యాముక్తులుగా సదాకాలము కొరకు అవుతారు. సమస్య వెనుక ఏదైతే సమయాన్ని వెచ్చిస్తారో, కష్టపడతారో, ఒక్కోసారి ఉదాసీనులుగా అవుతారో మరియు ఒక్కోసారి ఉల్లాసములోకి వస్తారో, వాటన్నింటి నుండి రక్షించబడతారు ఎందుకంటే బాప్ దాదాకు కూడా పిల్లలు శ్రమ పడటము మంచిగా అనిపించదు. పిల్లలు శ్రమ పడటాన్ని బాప్ దాదా చూసినప్పుడు పిల్లల యొక్క ఆ శ్రమను బాబా చూడలేకపోతారు. కావున శ్రమ పడటము నుండి ముక్తులుగా అవ్వండి. పురుషార్థము చెయ్యాలి కానీ ఏ పురుషార్థము? ఇప్పటివరకు కూడా మీ చిన్న-చిన్న సమస్యలకే పురుషార్థము చేసేవారిగా ఉంటారా! ఇప్పుడు అఖండ మహాదానులుగా, అఖండ సహయోగులుగా అయ్యే పురుషార్థము చెయ్యండి. బ్రాహ్మణుల కొరకు సహయోగులుగా అవ్వండి మరియు దుఃఖిత ఆత్మలు, దాహముతో ఉన్న ఆత్మల కొరకు మహాదానులుగా అవ్వండి. ఇప్పుడు ఈ పురుషార్థము యొక్క అవసరముంది. ఇష్టమే కదా! ఇష్టమేనా? వెనుక ఉన్నవారు, ఇష్టమేనా? మరి ఇప్పుడు కొంచెము మార్పు కూడా చేసుకోవాలి కదా! చాలాకాలముగా స్వయము కొరకు పురుషార్థము చేసారు. ఏమంటారు పాండవులు, ఇష్టమేనా? మరి రేపటి నుండి ఏం చేస్తారు? రేపటి నుండే ప్రారంభిస్తారా లేక ఇప్పటి నుండే ప్రారంభిస్తారా? ఇప్పటి నుండే సంకల్పము చెయ్యండి - నా సమయము, సంకల్పాలు విశ్వ సేవ కోసమే. ఇందులో స్వయము యొక్క కళ్యాణము ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, అది ఆగదు, పెరుగుతుంది. ఎందుకని? మీరు ఎవరి ఆశలనైనా పూర్తి చేస్తే, దుఃఖానికి బదులుగా వారికి సుఖాన్ని ఇస్తే, నిర్బల ఆత్మలకు శక్తిని ఇస్తే, గుణాలను ఇస్తే వారు మీకు ఎన్ని ఆశీర్వాదాలను ఇస్తారు. మరియు అందరి నుండి ఆశీర్వాదాలను తీసుకోవటము, ఇదే ముందుకు వెళ్ళేందుకు అన్నింటికంటే సహజ సాధనము. భాషణ చెయ్యకపోయినా కానీ, ఎక్కువ ప్రోగ్రాములను చెయ్యలేకపోయినా కానీ ఏం పర్వాలేదు, చెయ్యగలిగితే ఇంకా ఎక్కువ చెయ్యండి, కానీ చెయ్యలేకపోయినా కూడా ఏం పర్వాలేదు, కానీ ఖజానాలను సఫలము చెయ్యండి. వినిపించాము కదా - మనసా ద్వారా శక్తుల ఖజానాను ఇస్తూ వెళ్ళండి, వాణి ద్వారా జ్ఞాన ఖజానాను, కర్మల ద్వారా గుణాల ఖజానాను మరియు బుద్ధి ద్వారా సమయమనే ఖజానాను, సంబంధ-సంపర్కముల ద్వారా సంతోషమనే ఖజానాను సఫలము చెయ్యండి. సఫలము చెయ్యటము ద్వారా సహజముగా సఫలతామూర్తులుగా తప్పకుండా అవుతారు. సహజముగా ఎగురుతూ ఉంటారు ఎందుకంటే ఆశీర్వాదాలు ఒక లిఫ్ట్ వలె పని చేస్తాయి, అంతేకానీ మెట్ల వలె కాదు. సమస్య వచ్చిందంటే దానిని తొలగించడానికి మీకు ఒక్కోసారి రెండు రోజులు పట్టవచ్చు, ఒక్కోసారి రెండు గంటలు పట్టవచ్చు, ఇది మెట్లు ఎక్కడం లాంటిది. సఫలము చెయ్యండి, సఫలతామూర్తులుగా అవ్వండి, అప్పుడు ఆశీర్వాదాలనే లిఫ్ట్ ద్వారా ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణములో చేరుకుంటారు. సూక్ష్మవతనానికైనా చేరుకోండి లేక పరంధామానికైనా చేరుకోండి లేక మీ రాజ్యానికైనా చేరుకోండి. క్షణములో చేరుకోండి. లండన్ లో ‘వన్ మినిట్ (ఒక్క నిమిషము)’ అన్న ప్రోగ్రామ్ చేసారు కదా. కానీ బాప్ దాదా అయితే ‘వన్ సెకండ్ (ఒక్క క్షణము)’ అని అంటారు. ఒక్క క్షణములో ఆశీర్వాదాలనే లిఫ్ట్ లో ఎక్కండి. కేవలం స్మృతి అనే స్విచ్ ను నొక్కండి, అంతే, శ్రమ నుండి విముక్తులైపోతారు.

ఈ రోజు డబుల్ విదేశీయుల రోజు కదా. మరి బాప్ దాదా ముందుగా డబుల్ విదేశీయులను ఏ స్వరూపములో చూడాలనుకుంటున్నారు? శ్రమ నుండి ముక్తులుగా, సఫలతా మూర్తులుగా, ఆశీర్వాదాలకు పాత్రులుగా. అలా అవుతారు కదా? ఎందుకంటే డబుల్ విదేశీయులకు బాబాపై ప్రేమ బాగుంది. శక్తి కావాలి కానీ ప్రేమ బాగుంది. అద్భుతమైతే చేసారు కదా? చూడండి, 90 దేశాల నుండి, వేరు వేరు దేశాల నుండి, వేరు వేరు ఆచార పద్ధతుల నుండి వచ్చారు, కానీ 5 ఖండాలూ కలిసిపోయి ఒక చందన వృక్షముగా అయ్యింది. ఒక్క వృక్షములోకి వచ్చేసారు. ఒకటే బ్రాహ్మణ కల్చర్ (సంస్కృతి) అయ్యింది, ఇప్పుడు ఇంగ్లీష్ కల్చర్ ఉందా? మాది ఇంగ్లీష్ కల్చర్... అని అనరు కదా! బ్రాహ్మణులు కదా? ఇప్పుడైతే మాది బ్రాహ్మణ కల్చర్ అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. బ్రాహ్మణ కల్చర్, ఇది తప్ప మరేదీ లేదు. ఒక్కరిగా అయిపోయారు కదా! అందరూ ఒకే వృక్షానికి చెందినవారిగా అయిపోయినందుకు బాప్ దాదా అభినందిస్తున్నారు. ఎంత బాగా అనిపిస్తుంది! మీరు ఎవరినైనా అడగండి, అమెరికావారినైనా, యూరప్ వారినైనా - మీరు ఎవరు అని అడిగితే వారు ఏమంటారు? బ్రాహ్మణులే కదా! లేదా యు.కే.కు చెందినవారము, ఆఫ్రికాకు చెందినవారము, అమెరికాకు చెందినవారము అని అంటారా, అలా అనరు కదా! అందరూ ఒకే బ్రాహ్మణులుగా అయిపోయారు, ఏకమతము వారిగా అయిపోయారు, ఏక స్వరూపానికి చెందినవారిగా అయిపోయారు. బ్రాహ్మణులు మరియు ఏకమతము శ్రీమతము. ఇందులో మజా వస్తుంది కదా! మజా ఉందా లేక కష్టమనిపిస్తుందా? కష్టమైతే లేదు కదా! తల ఊపుతున్నారు. మంచిది.

బాప్ దాదా సేవలో ఏ నవీనతను కోరుకుంటున్నారు? ఏ సేవలనైతే చేస్తున్నారో, వాటిని చాలా, చాలా, చాలా బాగా చేస్తున్నారు, అందుకైతే అభినందనలు ఉండనే ఉన్నాయి. కానీ ఇకముందు కోసం ఏమి చేర్చాలి? ఏదైనా నవీనత కావాలి అని మీ అందరి మనసులలో ఉంది కదా. బాప్ దాదా చూసారు, ఏవైతే ప్రోగ్రామ్ లు చేసారో, వాటి కోసము సమయాన్ని కూడా వెచ్చించారు మరియు వాటిని ప్రేమతోనే చేసారు, శ్రమ పడటము కూడా ప్రేమతోనే చేసారు, అంతేకాక ఒకవేళ స్థూల ధనాన్ని కూడా వెచ్చించినా, అది పదమాలు రెట్లుగా అయ్యి మీ పరమాత్మ బ్యాంక్ లో జమ అయిపోయింది. దానిని వెచ్చించారు అని కాదు, వాస్తవానికి జమ చేసుకున్నారు. రిజల్టులో ఏం చూడడం జరిగిందంటే, సందేశము ఇచ్చే కార్యాన్ని, పరిచయాన్ని ఇచ్చే కార్యాన్ని అందరూ చాలా బాగా చేసారు. ఎక్కడ చేసినా కానీ, ఇప్పుడు ఢిల్లీలో జరుగుతూ ఉంది, లండన్ లో జరిగింది మరియు డబుల్ విదేశీయులు కాల్ ఆఫ్ టైమ్ (సమయపు పిలుపు) మరియు పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రామ్ లు ఏవైతే చేస్తుంటారో, ఆ ప్రోగ్రామ్ లన్నీ బాప్ దాదాకు చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా ఏమేమి చెయ్యగలిగితే అది చేస్తూ ఉండండి. సందేశమైతే లభిస్తుంది, స్నేహీలుగా కూడా అవుతారు, సహయోగులుగా కూడా అవుతారు, సంబంధములోకి కూడా కొందరు వస్తారు, కానీ ఇప్పుడు దీనికి మించి ఏమి జరగాలంటే - ఎప్పుడైనా ఏదైనా పెద్ద ప్రోగ్రామ్ చేస్తే, అందులో సందేశమైతే లభిస్తుంది, కానీ ఏదైనా అనుభవము చేసి వెళ్ళాలి, ఆ అనుభవము చాలా త్వరగా ముందుకు తీసుకువెళ్తుంది. ఉదాహరణకు ఈ కాల్ ఆఫ్ టైమ్ ప్రోగ్రామ్ లో లేక పీస్ ఆఫ్ మైండ్ ప్రోగ్రామ్ లో కాస్త ఎక్కువ అనుభవము చేస్తారు, కానీ పెద్ద ప్రోగ్రామ్ లు ఏవైతే జరుగుతాయో, వాటిలో సందేశమైతే బాగా లభిస్తుంది, కానీ ఎవరు వచ్చినా సరే వారిని ఫాలో అప్ చేసి మళ్ళీ సంపర్కములోకి తీసుకువస్తూ వారికి అనుభవము చేయించాలన్న లక్ష్యము పెట్టుకోండి, వారు ఏదో ఒక అనుభవాన్ని చెయ్యాలి, ఎందుకంటే అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోరు. అంతేకాక అనుభవము ఎటువంటి విషయమంటే అది వద్దనుకున్నా కానీ దానివైపుకు లాగుతుంది. కనుక బాప్ దాదా అడుగుతున్నారు - ముందుగా బ్రాహ్మణులంతా ఎవరైతే ఉన్నారో, వారు జ్ఞానములోని పాయింట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో స్వయం అనుభవజ్ఞులుగా అయ్యారా? ప్రతి శక్తిని అనుభవము చేసారా? ప్రతి గుణాన్ని అనుభవము చేసారా? ఆత్మిక స్థితిని అనుభవము చేసారా? పరమాత్మ ప్రేమను అనుభవము చేసారా? జ్ఞానాన్ని అర్థం చేసుకోవటము - ఇందులో అయితే పాస్ అయ్యారు, నాలెడ్జ్ ఫుల్ గా అయితే అయ్యారు, దీనికి బాప్ దాదా కూడా చెప్తున్నారు, బాగానే ఉన్నారు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, డ్రామా అంటే ఏమిటి అన్న జ్ఞానమైతే అర్థం చేసుకున్నారు, కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయము కావాలంటే అంత సమయము, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ, ఆ పరిస్థితిలో ఆత్మిక బలము అనుభవము అవ్వాలి, పరమాత్మ శక్తి అనుభవము అవ్వాలి, అది జరుగుతుందా? ఏ సమయములో, ఎంత సమయము, ఎలా అనుభవము చెయ్యాలనుకుంటే అలా అనుభవము అవుతుందా? లేక ఒక్కోసారి ఒక్కోలా ఉంటుందా? నేను ఆత్మను అని భావిస్తున్నప్పుడు, ఒకవేళ పదే-పదే దేహ భానము వస్తుందంటే, మరి అనుభవం పనికొచ్చిన్నట్లా? అనుభవీ మూర్తులు ప్రతి సబ్జెక్ట్ యొక్క అనుభవీ మూర్తులుగా, ప్రతి శక్తిలో అనుభవీ మూర్తులుగా ఉంటారు. కనుక స్వయములో కూడా అనుభవాన్ని ఇంకా పెంచండి. అనుభవమైతే ఉంది, లేదని కాదు, కానీ అప్పుడప్పుడు ఉంటుంది, అప్పుడప్పుడే. బాప్ దాదా అప్పుడప్పుడే ఉండటాన్ని కోరుకోవటం లేదు. ఏదైనా జరిగిందంటే అది అప్పుడప్పుడూ లోకి మారిపోతుంది, ఎందుకంటే మీ అందరి లక్ష్యము ఏమిటంటే, ఎలా అవ్వాలన్నది మీ లక్ష్యము అని మిమ్మల్ని అడిగితే, బాబా సమానముగా అవ్వాలి అన్నది మా లక్ష్యము అని అంటారు. అందరూ ఒకే సమాధానాన్ని ఇస్తారు. బాబా సమానముగా అవ్వాలి అంటే మరి బాబా అయితే ఎప్పుడూ కొంచెము సమయము లేక అప్పుడప్పుడు అన్నట్లు లేరు కదా. బ్రహ్మాబాబా ఎల్లప్పుడూ రాజయుక్తముగా, యోగయుక్తముగా ఉండేవారు, ప్రతి శక్తిలో అప్పుడప్పుడు అన్నట్లు కాకుండా సదా అన్నట్లు ఉండేవారు. అనుభవమనేది సదాకాలము నడుస్తుంది. అది కొద్ది సమయము కొరకే ఉండదు. కనుక స్వయం అనుభవీ మూర్తులుగా అయ్యి ప్రతి విషయములోనూ, ప్రతి సబ్జెక్ట్ లోనూ అనుభవజ్ఞులుగా అవ్వాలి, జ్ఞాన స్వరూపములో అనుభవజ్ఞులుగా, యోగయుక్తముగా ఉండటములో అనుభవజ్ఞులుగా, ధారణా స్వరూపములో అనుభవజ్ఞులుగా ఉండాలి. ఆల్రౌండ్ సేవలో అనుభవజ్ఞులుగా అవ్వాలి, మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కము అన్నింటిలోనూ అనుభవజ్ఞులుగా అవ్వాలి, అప్పుడే పాస్ విత్ ఆనర్ అని అంటారు. మరి ఎలా అవ్వాలనుకుంటున్నారు? పాస్ అవ్వాలని అనుకుంటున్నారా లేక పాస్ విత్ ఆనర్ అవ్వాలనుకుంటున్నారా? పాస్ అయ్యే వాళ్ళు అయితే వెనుక కూడా వస్తారు. మీరైతే టూ లేట్ (చాలా ఆలస్యమైంది) అన్న బోర్డు పెట్టకముందే వచ్చేసారు, ఇప్పుడు కొత్తవారు కూడా వచ్చినా కానీ టూ లేట్ అన్న బోర్డు పెట్టబడలేదు. లేట్ బోర్డు పెట్టారు కానీ టూ లేట్ బోర్డు పెట్టలేదు. అందుకే ఎవరైనా కొత్తవారైనా కానీ, ఇప్పుడు కూడా తీవ్ర పురుషార్థము చేసి, పురుషార్థము కాదు, తీవ్ర పురుషార్థము చేసినట్లయితే ముందుకు వెళ్ళగలరు ఎందుకంటే ఇప్పుడింకా నంబర్ ప్రకటించలేదు. కేవలం రెండు నంబర్లు ప్రకటించబడ్డాయి, బాబా మరియు మమ్మా. ప్రస్తుతము ఇంకా సోదరీ-సోదరులు ఎవరిదీ మూడవ నంబరు ప్రకటించలేదు. దాదీలంటే చాలా ప్రేమ ఉంది అని మీరు అంటారు. బాబాకు కూడా దాదీలంటే ప్రేమ ఉంది కానీ నంబర్ ఇంకా ప్రకటించబడలేదు. అందుకే మీరు చాలా-చాలా సికీలధే, ప్రియమైన, భాగ్యశాలి పిల్లలు, మీరు ఎంతగా ఎగరాలనుకుంటే అంతగా ఎగరండి, ఎందుకంటే చూడండి, చిన్న పిల్లలు ఉంటారు కదా, వారిని తమ తండ్రి వేలు పట్టుకుని నడిపిస్తాడు, ఎక్స్ ట్రా ప్రేమను ఇస్తారు, కానీ పెద్దవారిని వేలు పట్టుకుని నడిపించరు. వారు తమ కాళ్ళపై తాము నడుస్తారు. కనుక ఎవరైనా కొత్తవారైనా సరే, వారు ఆ లోటును భర్తీ చేసుకోవచ్చు. సువర్ణావకాశము ఉంది. కానీ చాలా త్వరలోనే టూ లేట్ బోర్డు పెట్టడం జరుగుతుంది, అందుకే ముందుగానే చెయ్యండి. కొత్తవారు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. అచ్ఛా. అభినందనలు. మొదటిసారి మీ ఇల్లు అయిన మధుబన్ కు చేరుకున్నారు, అందుకే బాప్ దాదా మరియు మొత్తము పరివారమందరి తరఫున, భారత్ వారి తరఫున మరియు విదేశాలవారి తరఫున, అందరి తరఫు నుండి పదమాల, పదమాల రెట్లు అభినందనలు. అచ్ఛా - ఇప్పుడు క్షణములో బాప్ దాదా ఏ స్థితిలో స్థితులవ్వమని డైరెక్షన్ ఇస్తే ఆ స్థితికి క్షణములో చేరుకోగలరా! లేక పురుషార్థములోనే సమయము గడిచిపోతుందా? ఇప్పుడు క్షణములో చేయగలిగే ప్రాక్టీస్ కావాలి ఎందుకంటే మున్ముందు ఫైనల్ సమయము ఏదైతే వచ్చేదుందో, అందులో పాస్ విత్ ఆనర్ సర్టిఫికేట్ లభించాలంటే, దాని కోసం అభ్యాసము ఇప్పటి నుండే చెయ్యాలి. క్షణములో ఎక్కడకు కావాలంటే అక్కడకు వెళ్ళగలగాలి, ఏ స్థితి కావాలంటే ఆ స్థితిలో స్థితులైపోవాలి. కావున ఎవర్రెడీగా ఉండండి. రెడీ అయిపోయారా?

ఇప్పుడు ముందుగా ఒక్క క్షణములో - నేను పురుషోత్తమ సంగమయుగీ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మను, ఈ స్థితిలో స్థితులవ్వండి... ఇప్పుడు నేను ఫరిశ్తా రూపాన్ని, డబుల్ లైట్ ను... ఇప్పుడు విశ్వకళ్యాకారిగా అయ్యి మనసా ద్వారా నలువైపులా శక్తి కిరణాలను ఇచ్చే అనుభవము చెయ్యండి. ఇలా మొత్తము రోజులో క్షణములో స్థితులైపోగలరా! ఈ అనుభవము చేస్తూ ఉండండి ఎందుకంటే అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. ఎక్కువ సమయము లభించదు. అలజడిలో క్షణములో అచలముగా అవ్వగలగాలి, ఈ అభ్యాసాన్ని స్వయానికి స్వయమే తమ సమయాన్ని కేటాయించి మధ్యమధ్యలో చేస్తూ ఉండండి. దీని ద్వారా మనసును కంట్రోల్ చేయటము సహజమైపోతుంది. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ (నియంత్రణ చేసే శక్తి, పరిపాలించే శక్తి) పెరుగుతూ ఉంటాయి. అచ్ఛా!

నలువైపులా ఉన్న పిల్లల యొక్క ఉత్తరాలు కూడా ఎన్నో వచ్చాయి. అనుభవాలు కూడా ఎన్నో వచ్చాయి. బాప్ దాదా పిల్లలకు రిటర్నులో చాలా-చాలా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను మరియు హృదయపూర్వకమైన ప్రియస్మృతులను పదమాల, పదమాల రెట్లు ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు వింటున్నారు కూడా, చూస్తున్నారు కూడా అన్నది బాప్ దాదా చూస్తున్నారు. ఎవరైతే చూడటము లేదో, వారు కూడా స్మృతిలో అయితే ఉన్నారు. అందరి బుద్ధి ఈ సమయములో మధుబన్ లోనే ఉంది. కనుక నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరూ పేరు సహితముగా ప్రియస్మృతులను స్వీకరించండి.

సదా ఉల్లాస-ఉత్సాహాలు అనే రెక్కల ద్వారా ఉన్నత స్థితిలో ఎగురుతూ ఉండే శ్రేష్ఠ ఆత్మలందరికీ, సదా స్నేహములో లవలీనులై ఉండే, ఇమిడిపోయే పిల్లలకు, సదా శ్రమ నుండి ముక్తులుగా, సమస్యల నుండి ముక్తులుగా, విఘ్నాల నుండి ముక్తులుగా ఉండే, యోగయుక్తులైన, రాజయుక్తులైన పిల్లలకు, సదా ప్రతి పరిస్థితిలో క్షణములో పాస్ అయ్యేవారికి, అన్ని వేళలా సర్వశక్తి స్వరూపులుగా ఉండే మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
స్వర్ణిమ యుగపు స్వభావము ద్వారా స్వర్ణిమ యుగపు సేవను చేసే శ్రేష్ఠ పురుషార్థీ భవ

ఏ పిల్లల స్వభావములో ఈర్ష్య, నిరూపించడము మరియు మొండితనము యొక్క భావాలు లేక ఎటువంటి పాత సంస్కారాల యొక్క లోహము కలవకుండా ఉంటుందో, వారే స్వర్ణిమ యుగపు స్వభావము కలవారు. ఇటువంటి స్వర్ణిమ యుగపు స్వభావము మరియు సదా హాజీ అనే సంస్కారాన్ని తయారుచేసుకునే శ్రేష్ఠ పురుషార్థీ పిల్లలు, సమయమనుసారముగా మరియు సేవ అనుసారముగా స్వయాన్ని మలచుకుని రియల్ గోల్డ్ గా అవుతారు. సేవలో కూడా అభిమానము లేక అవమానము అనే లోహము కలవకూడదు, అప్పుడే స్వర్ణిమ యుగపు సేవను చేసేవారు అని అంటారు.

స్లోగన్:-
ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలను సమాప్తము చేసి సదా ప్రసన్నచిత్తులుగా ఉండండి.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

లవలీన స్థితి కలిగిన సమాన ఆత్మలు సదాకాలపు యోగులుగా ఉంటారు. వారు యోగాన్ని జోడించవలసినవారిగా ఉండరు, వారు లవలీనులుగానే ఉంటారు. అసలు వేరవ్వనే అవ్వనప్పుడు ఇక వేరేగా స్మృతి ఏం చేస్తారు! స్వతహాగానే స్మృతి ఉంటుంది. ఎవరైతే తోడుగా ఉంటారో, వారి స్మృతి స్వతహాగానే ఉంటుంది. సమాన ఆత్మల స్థితి తోడు ఉండేదిగా ఉంటుంది, ఇమిడిపోయి ఉండేదిగా ఉంటుంది.