ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రతి రోజూ తప్పకుండా అటెన్షన్ ను ఇప్పించవలసి
ఉంటుంది. ఏ అటెన్షన్? సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ ఏమిటి? స్మృతియాత్రతో మీరు చాలా-చాలా
సురక్షితముగా ఉంటారు. పిల్లల కొరకు ముఖ్యమైన విషయము ఇదే. తండ్రి అర్థం చేయించారు -
పిల్లలైన మీరు ఎంతగా స్మృతియాత్రలో తత్పరులై ఉంటారో అంతగా సంతోషము కూడా ఉంటుంది
మరియు మ్యానర్స్ కూడా సరిగ్గా ఉంటాయి ఎందుకంటే పావనంగా కూడా అవ్వాలి, క్యారెక్టర్స్
కూడా తీర్చిదిద్దుకోవాలి. స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నా క్యారెక్టర్ ఎవరికీ
దుఃఖాన్ని ఇచ్చేదిగా లేదు కదా! నాకు దేహాభిమానం ఏమీ రావడం లేదు కదా? ఈ విధంగా చాలా
బాగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తారు. పిల్లలైన
మీరు చదువుతారు కూడా, అలాగే చదివిస్తారు కూడా. అనంతమైన తండ్రి కేవలం చదివిస్తారు.
మిగిలినవారంతా దేహధారులే. ఇందులో మొత్తం ప్రపంచమంతా వచ్చేస్తుంది. ఒక్క తండ్రే
విదేహీ. వారు పిల్లలైన మీకు - మీరు కూడా విదేహులుగా అవ్వాలి అని చెప్తారు. నేను
మిమ్మల్ని విదేహులుగా చేయడానికి వచ్చాను. పవిత్రముగా అయ్యే అక్కడకు వెళ్తారు.
అశుద్ధముగా ఉన్నవారినైతే తమతోపాటు తీసుకువెళ్ళరు, అందుకే మొట్టమొదట ఇదే మంత్రాన్ని
ఇస్తారు. మాయను వశం చేసుకునే మంత్రము ఇది. పవిత్రముగా అయ్యే మంత్రము ఇది. ఈ
మంత్రములో ఎన్నో విశేషతలు నిండి ఉన్నాయి, దీని ద్వారానే పవిత్రముగా అవ్వాలి.
మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. తప్పకుండా మనమే దేవతలుగా ఉండేవారము, అందుకే తండ్రి
అంటారు - మీ సేఫ్టీని (రక్షణను) కోరుకుంటే, దృఢముగా, మహావీరులుగా అవ్వాలనుకుంటే ఈ
పురుషార్థము చేయండి. తండ్రి అయితే శిక్షణను ఇస్తూ ఉంటారు. అలాగే డ్రామా అని కూడా
అంటూ ఉంటారు. డ్రామానుసారంగా అంతా సరిగ్గానే నడుస్తోంది, కానీ భవిష్యత్తు కొరకు కూడా
అర్థం చేయిస్తూ ఉంటారు. స్మృతియాత్రలో బలహీనంగా అవ్వకూడదు. బయట ఉండే బంధనములో ఉన్న
గోపికలు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సమ్ముఖముగా ఉండేవారు కూడా స్మృతి చేయరు
ఎందుకంటే వారికి శివబాబాను కలుసుకోవాలి అన్న తపన ఉంటుంది. ఎవరైతే కలుసుకున్నారో
వారికి కడుపు నిండినట్లు అయిపోతుంది. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారు ఉన్నత పదవిని
పొందగలుగుతారు. మంచి-మంచి, పెద్ద-పెద్ద సెంటర్లను సంభాళించే ముఖ్యులు కూడా
స్మృతియాత్రలో బలహీనంగా ఉన్నారు అన్నది గమనించడం జరిగింది. స్మృతి యొక్క పదును చాలా
బాగుండాలి. జ్ఞాన ఖడ్గములో స్మృతి యొక్క పదును లేని కారణంగా ఎవరికీ బాణము తగలనే
తగలదు, వారు పూర్తిగా మరణించరు. జ్ఞాన బాణాలను వేసి తండ్రికి చెందినవారిగా చేయాలి
లేక మరజీవులుగా చేయాలి అని పిల్లలు ప్రయత్నిస్తారు, కానీ వారు మరణించరు అనగా
తప్పకుండా జ్ఞాన ఖడ్గములో ఏదో గడబిడ ఉంది. డ్రామా పూర్తిగా ఏక్యురేట్ గా నడుస్తోంది
అని బాబాకు తెలిసినా కానీ భవిష్యత్తు కొరకు అయితే అర్థం చేయిస్తూ ఉంటారు కదా. ప్రతి
ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎంతవరకు స్మృతి చేస్తున్నాను? స్మృతి
ద్వారానే బలము వస్తుంది. అందుకే జ్ఞాన ఖడ్గములో పదును కావాలి అని అంటారు. జ్ఞానాన్ని
అయితే చాలా సహజ రీతిగా అర్థం చేయించవచ్చు.
ఎంతెంతగా స్మృతిలో ఉంటారో అంతంతగా చాలా మధురముగా అవుతూ ఉంటారు. మీరు
సతోప్రధానముగా ఉన్నప్పుడు చాలా మధురముగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా
అవ్వాలి. మీ స్వభావం కూడా చాలా మధురముగా ఉండాలి. ఎప్పుడూ అసంతుష్టులుగా అవ్వకూడదు.
ఇతరులు అసంతుష్టులుగా అయ్యే వాతావరణము ఉండకూడదు. అటువంటి ప్రయత్నము చేయాలి. ఎందుకంటే
ఈ ఈశ్వరీయ కాలేజీని స్థాపన చేసే సేవ చాలా ఉన్నతమైనది. విశ్వవిద్యాలయాలైతే భారత్ లో
ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి అవేవీ విశ్వవిద్యాలయాలు కావు. విశ్వవిద్యాలయమైతే ఒక్కటే
ఉంటుంది. తండ్రి వచ్చి అందరికీ ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు. మొత్తం ప్రపంచములోని
మనుష్యమాత్రులెవరైతే ఉన్నారో, వారందరూ అంతమవ్వనున్నారని తండ్రికి తెలుసు. ఈ ఛీ-ఛీ
ప్రపంచము యొక్క వినాశనాన్ని మరియు కొత్త ప్రపంచము యొక్క స్థాపనను చేయండి అనే
తండ్రిని పిలిచారు. తప్పకుండా తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలు కూడా అర్థం
చేసుకున్నారు. ఇప్పుడు మాయ పాంప్ (షో) ఎంతగా ఉంది. ఫాల్ ఆఫ్ పాంపే... అనే ఒక
నాటకాన్ని కూడా చూపిస్తారు. పెద్ద-పెద్ద ఇళ్ళు మొదలైనవాటిని నిర్మిస్తున్నారు -
ఇదంతా ఆర్భాటమే. సత్యయుగములో ఇన్ని అంతస్థుల భవనాలు తయారవ్వవు. ఇక్కడ అవి తయారవుతాయి
ఎందుకంటే నివసించేందుకు భూమి తక్కువగా ఉంది. వినాశనం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు
పెద్ద-పెద్ద ఇళ్ళు అన్నీ కూడా పడిపోతాయి. ఇంతకుముందు ఇంత పెద్ద-పెద్ద భవంతులు
తయారయ్యేవి కావు. ఎప్పుడైతే బాంబులు వేస్తారో అప్పుడు అవి పేకమేడల్లా కూలిపోతాయి.
అలాగని కేవలం వారు మాత్రమే మరణించి మిగిలినవారు బతికిపోతారని కాదు. అలా కాదు. ఎవరు
ఎక్కడ ఉన్నా, సముద్రములో ఉన్నా, భూమిపై ఉన్నా, ఆకాశంలో ఉన్నా, పర్వతాలపై ఉన్నా,
ఎగురుతూ ఉన్నా... అందరూ అంతమైపోతారు. ఇది పాత ప్రపంచము కదా. 84 లక్షల యోనులేవైతే
ఉన్నాయో అవన్నీ అంతమైపోనున్నాయి. అక్కడ కొత్త ప్రపంచములో ఇవేవీ ఉండవు. ఇంతమంది
మనుష్యులూ ఉండరు, ఈ దోమలు, జీవ-జంతువులు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడైతే లెక్కలేనన్ని
ఉన్నాయి. ఇప్పుడు పిల్లలైన మీరు కూడా దేవతలుగా అవుతారు కావున అక్కడ ప్రతి వస్తువూ
సతోప్రధానముగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎవరైనా గొప్ప వ్యక్తుల ఇళ్ళకు వెళ్తే ఎంతో
శుభ్రత ఉంటుంది. మీరైతే అందరికన్నా గొప్ప దేవతలుగా అవుతారు. గొప్ప వ్యక్తులు అని
కూడా అనరు, మీరు చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతారు. ఇది కొత్త విషయమేమీ కాదు. 5000
సంవత్సరాల క్రితం కూడా మీరు నంబరువారుగా ఇలా అయ్యారు. ఇంతటి చెత్త మొదలైనదేదీ అక్కడ
ఉండదు. మేము చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతాము అని పిల్లలకు ఎంతో సంతోషము ఉంటుంది.
మనల్ని చదివించేవారు ఒక్క తండ్రే, వారు మనల్ని చాలా ఉన్నతముగా తయారుచేస్తారు.
చదువులో ఎల్లప్పుడూ నంబరువారు పొజిషన్ వారు ఉంటారు. కొందరు తక్కువగా చదువుకుంటారు,
కొందరు ఎక్కువగా చదువుకుంటారు. ఇప్పుడు పిల్లలు పురుషార్థము చేస్తున్నారు,
గొప్ప-గొప్ప వ్యక్తులకు తెలియాలి అని పెద్ద-పెద్ద సెంటర్లను తెరుస్తున్నారు. భారత్
యొక్క ప్రాచీన రాజయోగము కూడా ఎంతో మహిమ చేయబడింది. విశేషముగా విదేశీయులకు
రాజయోగాన్ని నేర్చుకోవాలి అనే అభిరుచి ఎక్కువ ఉంటుంది. భారతవాసులైతే తమోప్రధానబుద్ధి
కలవారు. విదేశీయులు ఎంతైనా తమోబుద్ధి కలవారు, అందుకే వారికి భారత్ యొక్క ప్రాచీన
రాజయోగాన్ని నేర్చుకోవాలి అన్న అభిరుచి ఉంటుంది. భారత్ యొక్క ప్రాచీన రాజయోగము ఎంతో
ప్రసిద్ధమైనది, దాని ద్వారానే భారత్ స్వర్గముగా అయ్యింది. పూర్తిగా అర్థం
చేసుకునేవారు చాలా కొద్దిమందే వస్తారు. స్వర్గము, హెవెన్ గతించిపోయింది, అది మళ్ళీ
తప్పకుండా వస్తుంది. హెవెన్ లేక ప్యారడైజ్ అన్నింటికన్నా గొప్ప ప్రపంచ అద్భుతము.
స్వర్గము పేరు ఎంత ప్రసిద్ధమైనది. స్వర్గము మరియు నరకము, శివాలయము మరియు వేశ్యాలయము.
ఇప్పుడు మనము శివాలయములోకి వెళ్ళాలి అని పిల్లలకు నంబరువారుగా గుర్తుంది. అక్కడకు
వెళ్ళేందుకు శివబాబాను స్మృతి చేయాలి. అందరినీ తీసుకువెళ్ళే పండా (మార్గదర్శకుడు)
వారొక్కరే. భక్తిని రాత్రి అని అంటారు. జ్ఞానాన్ని పగలు అని అంటారు. ఇది అనంతమైన
విషయము. కొత్త వస్తువుకు మరియు పాత వస్తువుకు ఎంతో తేడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకు
మనసుకు అనిపిస్తుంది - ఇంత ఉన్నతోన్నతమైన చదువును ఉన్నతోన్నతమైన భవనములో మేము
చదివించినట్లయితే గొప్ప-గొప్పవారు వస్తారు అని. ఒక్కొక్కరికి కూర్చొని అర్థం
చేయించవలసి ఉంటుంది. వాస్తవానికి చదువు లేక శిక్షణ కొరకు ఏకాంత స్థానాలు ఉంటాయి.
బ్రహ్మజ్ఞానుల ఆశ్రమాలు కూడా నగరం నుండి దూరదూరాల్లో ఉంటాయి మరియు అవి కిందే ఉంటాయి.
అవి ఎత్తయిన అంతస్థుల్లో ఉండవు. ఇప్పుడు తమోప్రధానముగా అయిన కారణముగా నగరాలలోకి
దూరిపోయారు, ఆ శక్తి అంతమైపోయింది. ఈ సమయములో అందరి బ్యాటరీ ఖాళీగా ఉంది. ఇప్పుడు
బ్యాటరీని ఎలా నింపాలి - తండ్రి తప్ప ఇంకెవ్వరూ బ్యాటరీని చార్జ్ చేయలేరు. పిల్లలకు
బ్యాటరీని చార్జ్ చేయడంతోనే శక్తి వస్తుంది. దాని కొరకు ముఖ్యమైనది స్మృతి. అందులోనే
మాయ విఘ్నాలు వస్తాయి. కొందరైతే సర్జన్ ముందు నిజం చెప్తారు, కొందరు దాచిపెడతారు.
లోపల ఏ లోపాలైతే ఉన్నాయో వాటిని తండ్రికి తెలియజేయవలసి ఉంటుంది. ఈ జన్మలో ఏ
పాపాలనైతే చేసారో వాటిని అవినాశీ సర్జన్ ముందు వర్ణించాలి లేకపోతే లోలోపల మనస్సు
తింటూ ఉంటుంది. వారికి వినిపించేసిన తర్వాత ఇక మనస్సు తినదు. లోపల ఉంచుకోవడం కూడా
నష్టదాయకమే. ఎవరైతే సత్యాతి-సత్యమైన పిల్లలుగా అవుతారో వారు - ఈ జన్మలో ఈ-ఈ పాపాలు
చేసాము అని పూర్తిగా తండ్రికి చెప్పేస్తారు. రోజురోజుకు తండ్రి దృఢంగా చెప్తూ ఉంటారు,
ఇది మీ అంతిమ జన్మ. తమోప్రధానుల ద్వారా పాపాలైతే తప్పకుండా జరుగుతూ ఉంటాయి కదా.
తండ్రి అంటారు, నేను అనేక జన్మల అంతిమములో ఎవరైతే నంబరు వన్ పతితునిగా అయ్యారో,
వారిలోకే ప్రవేశిస్తాను, ఎందుకంటే వారే మళ్ళీ నంబరు వన్ లోకి వెళ్ళాలి. ఎంతో
శ్రమించవలసి ఉంటుంది. ఈ జన్మలో పాపాలైతే జరిగాయి కదా. తాము అసలు ఏం చేస్తున్నారు
అన్నది కూడా కొందరికి తెలియనే తెలియదు. నిజం చెప్పరు. కొంతమంది నిజం చెప్పేస్తారు.
తండ్రి అర్థం చేయించారు - పిల్లలూ, ఎప్పుడైతే కర్మాతీత అవస్థ తయారవుతుందో అప్పుడు
మీ కర్మేంద్రియాలు శాంతిస్తాయి. మనుష్యులు వృద్ధులుగా అయితే కర్మేంద్రియాలు
ఆటోమేటిక్ గా శాంతిస్తాయి. ఇక్కడైతే చిన్నతనములోనే అన్నీ శాంతించాలి. యోగబలములో బాగా
ఉన్నట్లయితే ఈ విషయాలన్నీ అంతమైపోతాయి. అక్కడ ఎటువంటి అశుద్ధమైన రోగాలు, చెత్త
మొదలైనవి ఉండవు. మనుష్యులు చాలా శుభ్రంగా, శుద్ధంగా ఉంటారు. అక్కడ అది రామ రాజ్యము.
ఇది రావణ రాజ్యము, అందుకే అనేక రకాల అశుద్ధమైన రోగాలు మొదలైనవి ఉన్నాయి. సత్యయుగములో
ఇవేవీ ఉండవు. అసలు ఇక అడగకండి. పేరే ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంది - స్వర్గము, కొత్త
ప్రపంచము. అక్కడ ఎంతో శుభ్రత ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తారు - ఈ పురుషోత్తమ
సంగమయుగములోనే మీరు ఈ విషయాలన్నింటినీ వింటారు. నిన్న మీరు వీటిని వినేవారు కాదు,
నిన్న మృత్యులోకపు యజమానులుగా ఉండేవారు, ఈ రోజు అమరలోకపు యజమానులుగా అవుతారు. నిన్న
మృత్యులోకములో ఉండేవారని, ఇప్పుడు సంగమయుగములోకి రావడంతో అమరలోకములోకి వెళ్ళేందుకు
మీరు పురుషార్థము చేస్తున్నారు అని మీకు నిశ్చయం ఏర్పడింది. చదివించేవారు కూడా
ఇప్పుడు లభించారు. ఎవరైతే బాగా చదువుతారో వారు ధనం మొదలైనవాటిని కూడా బాగా
సంపాదిస్తారు. గొప్పతనమంతా చదువుదే అని అంటారు. ఇక్కడ కూడా అంతే. ఈ చదువుతో మీరు
చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు ప్రకాశములో ఉన్నారు. ఇది కూడా
పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మీరు కూడా మళ్ళీ ఘడియ-ఘడియ మర్చిపోతారు.
మర్చిపోవడం అనగా పాత ప్రపంచములోకి వెళ్ళిపోవడము.
మనం కలియుగములో లేమని ఇప్పుడు సంగమయుగీ బ్రాహ్మణులైన మీకు తెలుసు. మనం కొత్త
విశ్వానికి యజమానులుగా అవుతున్నామని సదా గుర్తుంచుకోవాలి. తండ్రి మనల్ని కొత్త
ప్రపంచములోకి వెళ్ళేందుకే చదివిస్తారు. ఇది శుద్ధ అహంకారము. అక్కడ అది అశుద్ధ
అహంకారము. పిల్లలైన మీకైతే ఎప్పుడూ అశుద్ధమైన ఆలోచనలు కూడా రాకూడదు. పురుషార్థం
చేస్తూ-చేస్తూ చివరిలో రిజల్టు వెలువడుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, ఈ సమయము వరకు
అందరూ పురుషార్థులే. ఎప్పుడైతే పరీక్ష జరుగుతుందో అప్పుడు నంబరువారుగా పాస్ అయి ఇక
ట్రాన్స్ఫర్ అయిపోతారు. మీది అనంతమైన చదువు. దీని గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు.
మీరు ఎంతగా అర్థం చేయిస్తారు. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు
కొత్త-కొత్తవారు వస్తూ ఉంటారు. దూరంగా ఉన్నా కానీ వింటూ, వింటూ నిశ్చయబుద్ధి
కలవారిగా అయిపోతారు - ఇటువంటి బాబా యొక్క సమ్ముఖములోకి కూడా వెళ్ళాలి అని అనుకుంటారు.
ఏ తండ్రి అయితే పిల్లలను చదివించారో అటువంటి తండ్రిని సమ్ముఖముగా తప్పకుండా
కలుసుకోవాలి అని అనుకుంటారు. అర్థం చేసుకునే ఇక్కడకు వస్తారు. ఎవరైనా అర్థం
చేసుకోనివారు ఉన్నా, వారు కూడా ఇక్కడకు రావడంతో అర్థం చేసుకుంటారు. తండ్రి అంటారు,
మీ మనసులో ఏదైనా విషయం ఉంటే, ఏదైనా అర్థం కాకపోతే అడగండి. తండ్రి అయితే అయస్కాంతము
కదా. ఎవరి భాగ్యములోనైతే ఉంటుందో, వారు బాగా పట్టుకోగలుగుతారు. భాగ్యములో లేకపోతే
ఇక సమాప్తము, వినీ విననట్లు వదిలివేస్తారు. ఇక్కడ ఎవరు చదివిస్తున్నారు? భగవంతుడు.
వారి పేరు శివ. శివబాబాయే మనకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు. మరి ఏ చదువు మంచిది?
మీరు అంటారు, మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు, దాని ద్వారా మాకు 21 జన్మల
రాజ్యాధికారం లభిస్తుంది. ఈ విధంగా అర్థం చేయిస్తూ, చేయిస్తూ తీసుకువెళ్తారు.
కొందరైతే పూర్తిగా అర్థం చేసుకోని కారణంగా అంతటి సేవను చేయలేరు, బంధనాల సంకెళ్ళలో
చిక్కుకొని ఉంటారు. ప్రారంభములో మీరు ఏ విధంగా స్వయాన్ని సంకెళ్ళ నుండి
విడిపించుకుని వచ్చారు. ఆత్మిక నషాలో ఉన్నట్లుగా ఉండేవారు. ఈ పాత్ర కూడా డ్రామాలో
ఉంది కావుననే ఆకర్షణ కలిగింది. డ్రామాలో భట్టీ తయారవ్వవలసి ఉంది, జీవిస్తూనే
మరణించారు, కానీ కొందరు మాయ వైపుకు వెళ్ళిపోయారు. యుద్ధమైతే జరుగుతుంది కదా. మాయ
చూస్తుంది - ఫలానావారు చాలా ధైర్యాన్ని చూపించారు, కావున ఇప్పుడు పక్కాగా ఉన్నారా
లేదా అని నేను కూడా ఒక దెబ్బ వేసి చూస్తాను. పిల్లలను ఎంతగా సంభాళించేవారు. అన్నీ
నేర్పించేవారు. పిల్లలైన మీరు ఆల్బమ్ మొదలైనవి చూస్తారు కానీ కేవలం చిత్రాలను
చూసినంత మాత్రాన అర్థం చేసుకోలేరు. ఏమేమి జరిగేదో ఎవరైనా కూర్చొని అర్థం చేయించాలి.
భట్టీలోకి ఎలా వచ్చారు, ఆ తర్వాత ఒక్కొక్కరూ ఒక్కొక్కలా అందులో నుండి ఎలా
వెలువడ్డారు. ఉదాహరణకు రూపాయలను ముద్రించేటప్పుడు కూడా కొన్ని పాడైపోతాయి, అలాగే ఇది
కూడా ఈశ్వరీయ మెషినరీ. ఈశ్వరుడు కూర్చొని ధర్మ స్థాపనను చేస్తారు. ఈ విషయము ఎవరికీ
తెలియదు. తండ్రిని పిలుస్తారు కూడా కానీ వెర్రివారి వలె ఏమీ అర్థం చేసుకోరు. ఇది ఎలా
సాధ్యము అని అంటారు. మాయా రావణుడు పూర్తిగా అలా తయారుచేసేస్తాడు. శివబాబాకు పూజ కూడా
చేస్తారు, మళ్ళీ ఇంకొకవైపు వారు సర్వవ్యాపి అని అనేస్తారు. శివబాబా అని అంటారు, మరి
వారు సర్వవ్యాపి ఎలా అవుతారు. పూజ చేస్తారు, లింగాన్ని శివ అని అంటారు. కానీ వీరిలో
శివుడు కూర్చున్నారు అని అనరు. భగవంతుడు రాయి-రప్పలలో ఉన్నారు అని అంటారు, మరి అంతా
భగవంతులే భగవంతులా? భగవంతులు లెక్కలేనంత మంది అయితే ఉండరు కదా. కావున తండ్రి
పిల్లలకు అర్థం చేయిస్తారు, కల్పక్రితము కూడా ఇలా అర్థం చేయించారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.