10-11-2024 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా'
14.11.2002
‘‘బ్రాహ్మణ జీవితానికి పునాది మరియు సఫలతకు ఆధారము
- నిశ్చయబుద్ధి’’
ఈ రోజు సమర్థుడైన బాబా నలువైపులా ఉన్న తమ సమర్థులైన పిల్లలను
చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ సమర్థులుగా అయ్యి బాబా
సమానంగా అయ్యే శ్రేష్ఠ పురుషార్థములో నిమగ్నమై ఉన్నారు. పిల్లల
ఈ లగనమును చూసి బాప్ దాదా కూడా హర్షిస్తూ ఉంటారు. పిల్లల ఈ దృఢ
సంకల్పము బాప్ దాదాకు కూడా ప్రియమనిపిస్తుంది. బాప్ దాదా
పిల్లలతో ఇదే చెప్తారు - మీరు తండ్రి కంటే కూడా ముందుకు
వెళ్ళగలరు ఎందుకంటే స్మృతిచిహ్నములో కూడా బాబాకు సింగల్ పూజ
జరిగితే, పిల్లలైన మీకు డబుల్ పూజ జరుగుతుంది. మీరు బాప్ దాదా
యొక్క శిరో కిరీటాలు. బాప్ దాదా పిల్లల స్వమానాన్ని చూసి సదా
ఇదే అంటారు - వాహ్ శ్రేష్ఠ స్వమానధారీ, స్వరాజ్యధారీ పిల్లలూ
వాహ్! పిల్లలు ప్రతి ఒక్కరిలోని విశేషత ప్రతి ఒక్కరి మస్తకములో
మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు కూడా మీ విశేషతను
తెలుసుకుని, గుర్తించి విశ్వ సేవలో పెడుతూ వెళ్ళండి. చెక్
చేసుకోండి - నేను ప్రభువుకు ఇష్టమైనవానిగా, పరివారానికి
ఇష్టమైనవానిగా ఎంతవరకు అయ్యాను? ఎందుకంటే సంగమయుగములో బాబా
బ్రాహ్మణ పరివారాన్ని రచిస్తారు, కనుక ప్రభువుకు ఇష్టమైనవారిగా
అవ్వడము, పరివారానికి ఇష్టమైనవారిగా అవ్వడము, రెండూ అవసరము.
ఈ రోజు బాప్ దాదా పిల్లలందరి బ్రాహ్మణ జీవితపు పునాదిని
చూస్తున్నారు. పునాది నిశ్చయబుద్ధి, అందుకే ఎక్కడైతే ప్రతి
సంకల్పములో, ప్రతి కార్యములో నిశ్చయము ఉంటుందో అక్కడ విజయము
తప్పకుండా లభించి తీరుతుంది. సఫలత జన్మసిద్ధ అధికారము రూపములో
స్వతహాగా మరియు సహజముగా ప్రాప్తిస్తుంది. జన్మసిద్ధ అధికారము
కొరకు కష్టపడవలసిన అవసరము ఉండదు. సఫలత బ్రాహ్మణ జీవితానికి కంఠ
హారము. బ్రాహ్మణ జీవితము ఉన్నదే సఫలతా స్వరూపముగా. సఫలత ఉంటుందా,
ఉండదా అన్నది బ్రాహ్మణ జీవితము యొక్క ప్రశ్నే కాదు.
నిశ్చయబుద్ధి కలవారు సదా బాబాతో కంబైండుగా ఉంటారు, మరి ఎక్కడైతే
బాబా కంబైండుగా ఉంటారో అక్కడ సఫలత సదా ప్రాప్తిస్తుంది. కనుక
చెక్ చేసుకోండి - సఫలతా స్వరూపులుగా ఎంతవరకు అయ్యారు? ఒకవేళ
సఫలతలో పర్సెంటేజ్ ఉన్నట్లయితే అందుకు కారణము నిశ్చయములో
పర్సెంటేజ్ ఉండటము. నిశ్చయము కేవలం బాబాపై ఉండటమనేది చాలా
మంచిది. కానీ నిశ్చయము - బాబాపై నిశ్చయము, స్వయముపై నిశ్చయము,
డ్రామాపై నిశ్చయము మరియు దానితోపాటు పరివారముపై నిశ్చయము. ఈ
నాలుగు నిశ్చయాల ఆధారముగా సఫలత సహజముగా మరియు స్వతహాగా
లభిస్తుంది.
బాబాపై అయితే పిల్లలందరికీ నిశ్చయము ఉంది, అందుకే ఇక్కడకు
వచ్చారు. బాబాకు కూడా మీ అందరిపై నిశ్చయము ఉంది, అందుకే
తమవారిగా చేసుకున్నారు. కానీ బ్రాహ్మణ జీవితములో సంపన్నంగా
మరియు సంపూర్ణంగా అయ్యేందుకు స్వయముపై కూడా నిశ్చయము
తప్పనిసరిగా ఉండాలి. బాప్ దాదా ద్వారా ప్రాప్తించిన శ్రేష్ఠ
ఆత్మ అనే స్వమానము సదా స్మృతిలో ఉండాలి - నేను పరమాత్మ ద్వారా
స్వమానము అందుకున్న శ్రేష్ఠ ఆత్మను. సాధారణ ఆత్మ కాదు, పరమాత్మ
ద్వారా స్వమానము అందుకున్న ఆత్మ. కనుక స్వమానము ప్రతి
సంకల్పములో, ప్రతి కర్మలో సఫలతను తప్పకుండా అందిస్తుంది. నేను
సాధారణ కర్మ చేసే ఆత్మను కాను, నేను స్వమానధారీ ఆత్మను. ప్రతి
కర్మలో స్వమానమనేది మీకు సఫలతను సహజముగానే ఇప్పిస్తుంది. కనుక
స్వయముపై నిశ్చయబుద్ధికి గుర్తు - సఫలత లేక విజయము. అలాగే
బాబాపైనైతే పక్కా నిశ్చయము ఉంది, దాని విశేషత ఏమిటంటే -
‘‘నిరంతరము నేను బాబాకు చెందినవాడిని మరియు బాబా నా వారు’’. ఇది
నిరంతర విజయానికి ఆధారము. ‘‘మేరా బాబా (నా బాబా)’’, కేవలము బాబా
కాదు, నా బాబా. నాది అన్నదానిపై అధికారము ఉంటుంది. కనుక నా బాబా,
ఇటువంటి నిశ్చయబుద్ధి ఆత్మ సఫలతకు, విజయానికి సదా అధికారిగా
ఉంటుంది. అలాగే డ్రామాపై కూడా పూర్తి నిశ్చయము ఉండాలి. సఫలత
మరియు సమస్య, ఈ రెండు రకాల విషయాలు డ్రామాలో వస్తాయి కానీ
సమస్య వచ్చిన సమయములో నిశ్చయబుద్ధికి గుర్తు - సమాధాన స్వరూపము.
సమస్యను క్షణములో సమాధాన స్వరూపము ద్వారా పరివర్తన చేసెయ్యండి.
సమస్య పని రావటము, నిశ్చయబుద్ధి ఆత్మ పని సమాధాన స్వరూపముతో
సమస్యను పరివర్తన చెయ్యటము. ఎందుకని? బ్రాహ్మణ ఆత్మలైన మీరు
ప్రతి ఒక్కరూ బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే మాయకు ఛాలెంజ్ చేసారు.
చేసారు కదా లేక మర్చిపోయారా? మేము మాయాజీతులుగా అయ్యేవారము
అన్నది మీ ఛాలెంజ్. మరి సమస్య స్వరూపమే మాయ స్వరూపము. ఛాలెంజ్
చేసినప్పుడు మరి మాయ కూడా ఎదుర్కొంటుంది కదా! అది రకరకాల
సమస్యల రూపములో మీ ఛాలెంజ్ ను పూర్తి చేయడానికి వస్తుంది. మీరు
నిశ్చయబుద్ధి విజయీ స్వరూపముతో దాటాలి, ఎందుకని? నథింగ్ న్యూ (కొత్తేమీ
కాదు). ఎన్ని సార్లు విజయులుగా అయ్యారు? ఇప్పుడు సంగమయుగములో ఈ
ఒక్క సారే విజయులుగా అవుతున్నారా లేక అనేక సార్లు విజయులుగా
అయినదానిని రిపీట్ చేస్తున్నారా? అందుకే సమస్య అనేది మీ కొరకు
కొత్త విషయమేమీ కాదు, నథింగ్ న్యూ. అనేక సార్లు విజయులుగా
అయ్యారు, అవుతున్నారు మరియు ఇకముందు కూడా అవుతూ ఉంటారు. ఇది
డ్రామాపై నిశ్చయబుద్ధి విజయీ. మరొకటి, బ్రాహ్మణ పరివారముపై
నిశ్చయము, ఎందుకని? బ్రాహ్మణ పరివారము అంటే అర్థమే సంగఠన. ఇది
చిన్న పరివారము కాదు, బ్రహ్మాబాబా యొక్క బ్రాహ్మణ పరివారము
అన్ని పరివారాలలో కల్లా శ్రేష్ఠమైనది మరియు పెద్దది. కనుక
పరివారము మధ్యలో, పరివారము పట్ల ప్రీతి యొక్క రీతిని
నిర్వర్తించటములో కూడా విజయీ. అంతేకానీ బాబా నా వారు, నేను బాబా
వాడిని, అంతా ఇందులోనే అయిపోతుంది, బాబాతోనే పని ఉంది,
పరివారముతో పనేముంది అని అనుకోకూడదు! ఇది కూడా నిశ్చయము యొక్క
విశేషత. నాలుగు విషయాలలోనూ నిశ్చయము, విజయము తప్పనిసరి.
పరివారము కూడా అందరినీ చాలా విషయాలలో దృఢంగా చేస్తుంది.
పరివారములో కేవలము ఈ స్మృతి ఉండాలి - అందరూ ఎవరికి వారు
నంబరువారు ధారణా స్వరూపులు, వెరైటీవారు. దీని స్మృతిచిహ్నము
108 మాల. ఆలోచించండి - ఎక్కడ మొదటి నంబరు, ఎక్కడ 108వ నంబరు,
ఇలా ఎందుకు తయారైంది? అందరూ మొదటి నంబరువారుగా ఎందుకు అవ్వలేదు?
16000 ఎందుకు తయారైంది? కారణమేమిటి? వెరైటీ సంస్కారాలను అర్థం
చేసుకుని నాలెడ్జ్ ఫుల్ గా అయ్యి నడుచుకోవడము, నిర్వర్తించడము,
ఇదే విజయీ స్థితి. నడుచుకోవాల్సి అయితే ఉంటుంది. పరివారాన్ని
వదిలి ఎక్కడికి వెళ్తారు. మాది ఇంత పెద్ద పరివారము అన్న నషా
కూడా ఉంది కదా. కనుక పెద్ద పరివారములో పెద్ద మనసుతో ప్రతి
ఒక్కరి సంస్కారాలను తెలుసుకుని నడుచుకోవటము, నిర్మానచిత్తులుగా
అయి నడుచుకోవటము, శుభ భావన మరియు శుభ కామనల వృత్తితో
నడుచుకోవటము... ఇదే పరివారములో నిశ్చయబుద్ధి విజయీకి గుర్తు.
మరి అందరూ విజయులే కదా? విజయులేనా?
డబుల్ విదేశీయులు విజయులేనా? చేతినైతే చాలా బాగా ఊపుతున్నారు.
చాలా మంచిది. బాప్ దాదాకు సంతోషముగా ఉంది. అచ్ఛా - టీచర్లు
విజయులేనా? లేక కొంచెం-కొంచెం అవుతుందా? ‘ఏం చెయ్యాలి’ అన్నదైతే
లేదు కదా. ‘ఎలా’ అనేదానికి బదులుగా ‘ఇలా’ అన్న మాటను
ఉపయోగించండి. ఎలా చెయ్యాలి అని అనటం కాదు, ఇలా చెయ్యాలి. 21
జన్మల కనెక్షన్ పరివారముతో ఉంది, అందుకే ఎవరైతే పరివారములో పాస్
అవుతారో (ఉత్తీర్ణులవుతారో), వారు అన్నింటిలో పాస్ అవుతారు.
కనుక నాలుగు రకాల నిశ్చయాలను చెక్ చేసుకోండి ఎందుకంటే
ప్రభువుకు ఇష్టమైనవారిగా అవ్వడముతో పాటుగా పరివారానికి
ఇష్టమైనవారిగా అవ్వటము కూడా చాలా అవసరము. ఈ నాలుగు నిశ్చయాల
పర్సెంటేజ్ అనుసారంగానే నంబరు లభించనున్నది. నేను బాబా వాడిని,
బాబా నా వారు, అయిపోయింది కదా... అని ఇలా అనుకోవటము కాదు. ఇలా
కాదు. నా బాబా అని అయితే చాలా బాగా అంటారు మరియు సదా ఈ
నిశ్చయములో స్థిరముగా కూడా ఉన్నారు, ఇందుకు అభినందనలు, కానీ
మిగిలిన మూడు కూడా ఉన్నాయి. టీచర్లూ, నాలుగూ అవసరమేనా, కాదా?
మూడు అవసరము, ఒకటి కాదు అనైతే కాదు కదా. ఎవరైతే నాలుగు
నిశ్చయాలూ అవసరము అని భావిస్తారో వారు ఒక చేతిని ఎత్తండి.
అందరికీ నాలుగు విషయాలూ ఇష్టమేనా? ఎవరికైతే మూడు విషయాలు ఇష్టమో
వారు చేతిని ఎత్తండి. ఎవ్వరూ లేరు. నిలబెట్టుకోవటం కష్టము కాదా?
చాలా మంచిది. ఒకవేళ మనస్ఫూర్తిగా చేతిని ఎత్తినట్లయితే అందరూ
పాస్ అయిపోయినట్లే. అచ్ఛా.
చూడండి, ఎక్కడెక్కడి నుండో, వేరు-వేరు దేశాల కొమ్మలన్నీ
కలిసి మధుబన్ లో ఒక వృక్షములా అవుతాయి. నేను ఢిల్లీకి
చెందినవాడిని, నేను కర్నాటకకు చెందినవాడిని, నేను గుజరాత్ కు
చెందినవాడిని అని ఇలా మధుబన్ లో ఉన్నప్పుడు గుర్తుంటుందా ఏమిటి?
అందరూ మధుబన్ నివాసులే. కనుక ఒకే వృక్షమైనట్లు కదా. ఈ సమయములో
అందరూ ఏమని భావిస్తున్నారు, మధుబన్ నివాసులా లేక తమ-తమ దేశ
నివాసులా? మధుబన్ నివాసులేనా? అందరూ మధుబన్ నివాసులే, చాలా
మంచిది. మామూలుగా కూడా బ్రాహ్మణులు ప్రతి ఒక్కరి పర్మనెంట్
అడ్రస్ మధుబన్ యే. మీ పర్మనెంట్ అడ్రస్ ఏమిటి? బాంబేనా?
ఢిల్లీనా? పంజాబా? మధుబన్ పర్మనెంట్ అడ్రస్. సేవ కోసమని
సేవాకేంద్రాలకు పంపించటం జరిగింది. అవి సేవా స్థానాలు, మీ ఇల్లు
మధుబన్. చివరికి ఆశ్రయ స్థానము ఎక్కడ లభిస్తుంది? మధుబన్ లోనే
లభించనున్నది, అందుకే పెద్ద-పెద్ద స్థానాలను తయారుచేస్తున్నారు
కదా!
అందరి లక్ష్యము బాబా సమానముగా అవ్వాలి అన్నదే. మొత్తము
రోజంతటిలో ఈ డ్రిల్ చెయ్యండి - మనసు డ్రిల్. శారీరక డ్రిల్
అయితే శారీరక ఆరోగ్యము కోసం చేస్తారు, చేస్తూ ఉండండి ఎందుకంటే
ఈ రోజుల్లో మందులకంటే కూడా ఎక్సర్ సైజ్ అవసరము. అదైతే చెయ్యండి
మరియు సమయానికి బాగా చెయ్యండి. సేవా సమయములో ఎక్సర్ సైజ్ చేస్తూ
ఉండకండి. మిగిలిన సమయములో ఎక్సర్ సైజ్ చెయ్యటము మంచిది. కానీ
దీనితోపాటుగా మనసు ఎక్సర్ సైజ్ ను పదే-పదే చెయ్యండి. బాబా
సమానముగా అవ్వాలి అన్నప్పుడు ఒకటేమో నిరాకార మరియు రెండవది
అవ్యక్త ఫరిశ్తా. కనుక ఎప్పుడు సమయము లభిస్తే అప్పుడు క్షణములో
బాబా సమానముగా నిరాకారీ స్థితిలో స్థితులైపోండి, బాబా సమానముగా
అవ్వాలంటే, నిరాకారీ స్థితి బాబా సమానమైనది. కార్యము
చేసేటప్పుడు ఫరిశ్తాగా అయ్యి కర్మలు చెయ్యండి, ఫరిశ్తా అనగా
డబుల్ లైట్. కార్యము యొక్క భారము ఉండకూడదు. కార్య భారము
అవ్యక్త ఫరిశ్తాగా అవ్వనివ్వదు. కనుక మధ్యమధ్యలో నిరాకారీ మరియు
ఫరిశ్తా స్వరూపమునకు చెందిన మనసు ఎక్సర్ సైజ్ ను చేయండి,
అప్పుడు అలసట ఉండదు. బ్రహ్మాబాబాను సాకార రూపములో చూసారు కదా -
డబుల్ లైట్. సేవకు సంబంధించిన భారము కూడా ఉండేది కాదు. అవ్యక్త
ఫరిశ్తా రూపము. అప్పుడు సహజముగానే బాబా సమానంగా అయిపోతారు.
ఆత్మ కూడా నిరాకారియే మరియు ఆత్మ నిరాకారీ స్థితిలో స్థితి
అయితే నిరాకార బాబా స్మృతి సహజముగా సమానముగా చేస్తుంది.
ఇప్పుడిప్పుడే ఒక్క క్షణములో నిరాకారీ స్థితిలో స్థితులవ్వగలరా?
అవ్వగలరా? (బాప్ దాదా డ్రిల్ చేయించారు) ఈ అభ్యాసాన్ని మరియు
అటెన్షన్ ను నడుస్తూ-తిరుగుతూ, కర్మలు చేస్తూ మధ్యమధ్యలో చేస్తూ
ఉండండి. ఈ ప్రాక్టీస్ మనసా సేవ చెయ్యటములో కూడా సహయోగాన్ని
ఇస్తుంది మరియు శక్తిశాలీ యోగ స్థితిలో కూడా చాలా సహాయము
లభిస్తుంది. అచ్ఛా.
డబుల్ విదేశీయులతో:-
చూడండి, డబుల్ విదేశీయులకు ఈ సీజనులో
కారణముగానో, అకారణముగానో అన్ని గ్రూపులలో అవకాశము లభించింది.
మీరు ప్రతి గ్రూపులో రావచ్చు, ఆ స్వతంత్రత ఉంది. మరి ఇది
భాగ్యము కదా, డబుల్ భాగ్యము. ఈ గ్రూప్ లో కూడా బాప్ దాదా
చూస్తున్నారు - కొంతమంది మొదటిసారి కూడా వచ్చారు, కొంతమంది మందు
వచ్చినవారు కూడా వచ్చారు. బాప్ దాదా దృష్టి విదేశీయులందరిపై
ఉంది. మీకు బాబాపై ఎంత ప్రేమ ఉందో, అంతకు పదమాల రెట్లు బాబాకు
మీపై ప్రేమ ఉంది. అవును కదా! పదమాల రెట్లు ఉందా? మీకు కూడా
ప్రేమ ఉంది, మనస్ఫూర్వకమైన ప్రేమ ఉంది, అందుకే ఇక్కడకు
చేరుకున్నారు. డబుల్ విదేశీయులు ఈ బ్రాహ్మణ పరివారానికి అలంకరణ.
మీరు విశేష అలంకరణ. ప్రతి దేశములోనూ బాప్ దాదా చూస్తున్నారు -
స్మృతిలో కూర్చుని ఉన్నారు, వింటున్నారు కూడా మరియు స్మృతిలో
కూడా కూర్చున్నారు. చాలా మంచిది.
టీచర్లు:-
టీచర్ల గుంపు కూడా చాలా పెద్దది. బాప్ దాదా టీచర్లకు ఒక టైటిల్
ను ఇస్తారు. ఏ టైటిల్ ఇస్తారు? (ఫ్రెండ్స్) అందరూ ఫ్రెండ్సే.
డబుల్ విదేశీయులు మొదటి ఫ్రెండ్స్. వీరికి ఫ్రెండ్ సంబంధము
మంచిగా అనిపిస్తుంది. టీచర్లు ఎవరైతే యోగ్యులో, అందరినీ కాదు,
యోగ్యులైన టీచర్లను బాప్ దాదా - వీరు గురుభాయి (ఒకే గురువుకు
శిష్యులు గురువు అడుగుజాడలలో నడుస్తూ గురువు సమానముగా అయ్యేవారు)
అని అంటారు. ఎలా అయితే పెద్ద కొడుకు తండ్రి సమానముగా అయిపోతాడు
కదా, అలా టీచర్లు కూడా గురుభాయీలు ఎందుకంటే సదా బాబా సేవకు
నిమిత్తులుగా అయ్యారు. బాబా సమానముగా సేవాధారులు. చూడండి,
టీచర్లకు మురళిని వినిపించేందుకు బాబా సింహాసనము లభిస్తుంది.
గురువు యొక్క ఆసనము లభిస్తుంది కదా! అందుకే టీచర్లు అనగా
నిరంతర సేవాధారులు. మనసా ద్వారా అయినా, వాచా ద్వారా అయినా,
సంబంధ-సంపర్కము ద్వారా అయినా, కర్మణా ద్వారా అయినా - సదా
సేవాధారులు. అటువంటివారే కదా! విశ్రాంతి ప్రియులైతే కాదు కదా!
సేవాధారులు. సేవ, సేవ మరియు సేవ. సరేనా? అచ్ఛా.
సేవలో ఢిల్లీ, ఆగ్రా వారి టర్న్:-
ఆగ్రా వారు సహచరులు. ఢిల్లీ సైన్యమైతే చాలా పెద్దది. అచ్ఛా -
ఢిల్లీలో స్థాపనకు పునాది పడింది, ఇది చాలా మంచిది. ఇప్పుడు
బాబాను ప్రత్యక్షము చేయడానికి పునాది ఎక్కడ నుండి పడుతుంది?
ఢిల్లీ నుండా లేక మహారాష్ట్ర నుండా? కర్నాటక నుండా, లండన్ నుండా...
ఎక్కడి నుండి అవుతుంది? ఢిల్లీ నుండి అవుతుందా? నిరంతర సేవ
మరియు తపస్య చెయ్యండి. సేవ మరియు తపస్య, ఈ రెండింటి బ్యాలెన్స్
తో ప్రత్యక్షత జరుగుతుంది. ఎలా అయితే సేవ యొక్క డైలాగ్ ను
తయారుచేసారో, అలా ఢిల్లీలో తపస్యను వర్ణన చేసే డైలాగ్ ను
తయారుచెయ్యండి, అప్పుడు ఢిల్లీ అంటే ఢిల్లీయే అని అంటారు.
ఢిల్లీ అయితే బాబా హృదయము కానీ బాబా మనసుకు ఇష్టమైన కార్యాన్ని
చేసి కూడా చూపిస్తారు. పాండవులు, చెయ్యాలి కదా? చేస్తారు,
తప్పకుండా చేస్తారు. తపస్య ఎలా చెయ్యండంటే అన్ని దీపపు పురుగులూ
బాబా-బాబా అని అంటూ ఢిల్లీలోని విశేష స్థానాలకు చేరుకోవాలి.
దీపపు పురుగులు బాబా-బాబా అని అంటూ రావాలి, అప్పుడు ప్రత్యక్షత
అని అంటారు. కనుక ఇది చెయ్యాలి, రాబోయే సంవత్సరము ఈ డైలాగ్ ను
చెయ్యండి, ఎన్ని దీపపు పురుగులు బాబా-బాబా అని అంటూ స్వాహా
అయ్యాయి అన్న రిజల్టును వినిపించాలి. సరేనా? చాలా మంచిది, మాతలు
కూడా చాలామంది ఉన్నారు.
కుమారులు-కుమారీలు:-
కుమారులు మరియు కుమారీలు, సగం హాలంతా
కుమార, కుమారీలే. కుమార, కుమారీలకు శభాష్. కుమార, కుమారీలు
జ్వాలా రూపులుగా అయ్యి ఆత్మలను పావనంగా తయారుచేస్తారు. కుమారులు
మరియు కుమారీలకు నేటి కుమారులు మరియు కుమారీలపై దయ కలగాలి, వారు
ఎంతగా భ్రమిస్తూ ఉన్నారు. భ్రమిస్తున్న తోటివారిని దారిలో
పెట్టండి. అచ్ఛా, కుమారులు మరియు కుమారీలు ఎవరైతే వచ్చారో,
వారిలో ఎవరైతే ఈ మొత్తం సంవత్సరములో సేవలో ఆత్మలను తమ సమానముగా
తయారుచేసారో వారు పెద్దగా చేతిని ఎత్తండి. కుమారీలు తమ సమానముగా
తయారుచేసారా? మంచి ప్లాన్ ను తయారుచేస్తున్నారు. హాస్టల్
కుమారీలు చేతులెత్తుతున్నారు. ఇప్పుడు సేవా ఋజువును
తీసుకురాలేదు. కనుక కుమారులు మరియు కుమారీలు సేవకు ఋజువును
తీసుకురావాలి. సరేనా! అచ్ఛా.
నలువైపులా ఉన్న విజయీ రత్నాలకు, సదా
నిశ్చయబుద్ధి సహజ సఫలతామూర్త పిల్లలకు, సదా నా బాబా అనే
అధికారముతో ప్రతి సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతామూర్త
పిల్లలకు, సదా సమాధాన స్వరూపులై సమస్యను పరివర్తన చేసే
పరివర్తక ఆత్మలకు, అటువంటి శ్రేష్ఠమైన పిల్లలకు, సదా బాబాను
ప్రత్యక్షము చేసే ప్లాన్ ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చే
పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు, అభినందనలు, అనేకానేక సార్లు
అభినందనలు మరియు నమస్తే.
దాదీజీతో:-
అందరికీ మీపై ప్రేమ ఉంది, బాబాకు కూడా మీపై ప్రేమ ఉంది. (రతన్
మోహిని దాదీజీతో) సహయోగిగా అవ్వటము ద్వారా సూక్ష్మములో చాలా
ప్రాప్తిస్తుంది. అంతే కదా! ఆది రత్నము. ఆది రత్నము ఇప్పటివరకు
కూడా నిమిత్తముగా ఉన్నారు. అచ్ఛా. ఓం శాంతి.
వరదానము:-
అన్నింటినీ నీవిగా చేసి నాది అన్నదాని
అంశమాత్రాన్ని కూడా సమాప్తము చేసే డబుల్ లైట్ భవ
ఏ విధమైన నాది అన్న భావమైనా - నా
స్వభావము, నా సంస్కారము, నా నేచర్... ఏ విధమైన నాది అన్నది
ఉన్నా భారము ఉన్నట్లు మరియు భారము ఉన్నవారు ఎగరలేరు. ఈ
నాది-నాది అనేదే మురికిగా చేసేటువంటిది, అందుకే ఇప్పుడు
నీది-నీది అంటూ స్వచ్ఛముగా అవ్వండి. ఫరిశ్తా అంటేనే నాది అనేది
అంశమాత్రము కూడా ఉండకపోవటము. సంకల్పములోనైనా నాది అన్న భానము
వచ్చిందంటే మురికిగా అయినట్లు అర్థము. కావున ఈ మురికి యొక్క
భారాన్ని సమాప్తము చేసి డబుల్ లైట్ గా అవ్వండి.
స్లోగన్:-
విశ్వానికి ప్రకాశాన్ని అందించేవారు ఎవరంటే ఎవరైతే బాప్ దాదాను
తమ నయనాలలో ఇముడ్చుకుంటారో వారు.
|
|
|