10-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తనువు, మనసు, ధనముల ద్వారా మరియు మనసా-వాచా-కర్మణా ద్వారా ఏ విధముగా సేవ చేయండంటే, 21 జన్మల కొరకు తండ్రి నుండి ఫలితము లభించాలి, కానీ సేవలో ఎప్పుడూ పరస్పరములో మనస్పర్థలు ఉండకూడదు’’

ప్రశ్న:-
డ్రామానుసారముగా బాబా ఏదైతే సేవ చేయిస్తున్నారో, అందులో మరింత తీవ్రత తీసుకురావడానికి విధి ఏమిటి?

జవాబు:-
పరస్పరములో ఏకమతముగా ఉండాలి, ఎప్పుడూ ఎటువంటి ఘర్షణ ఉండకూడదు. ఒకవేళ ఘర్షణ ఉన్నట్లయితే సేవ ఏమి చేయగలరు, అందుకే పరస్పరములో కలుసుకుని సంగఠనను తయారుచేసి సలహాలు చర్చించుకోండి, ఒకరికొకరు సహాయకులుగా అవ్వండి. బాబా అయితే సహాయకులుగా ఉండనే ఉన్నారు కానీ ‘‘పిల్లలు ధైర్యము చేస్తే తండ్రి సహాయము చేస్తారు...’’, దీని అర్థాన్ని యథార్థముగా అర్థం చేసుకుని పెద్ద కార్యములో సహాయకులుగా అవ్వండి.

ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడికి అనగా ఆత్మిక తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. రిఫ్రెష్ అయ్యి తిరిగి వెళ్ళిన తర్వాత తప్పకుండా ఏదైనా చేసి చూపించాలి. ఒక్కొక్క బిడ్డ సేవకు ఋజువును ఇవ్వాలి. కొందరు పిల్లలు, మాకు సెంటర్ తెరవాలని అనిపిస్తుంది అని అంటారు. గ్రామాలలో కూడా సేవ చేస్తారు కదా. కనుక పిల్లలకు సదా ఈ ఆలోచన ఉండాలి - మేము మనసా, వాచా, కర్మణా, తనువు, మనసు, ధనముల ద్వారా ఎటువంటి సేవ చేయాలంటే భవిష్య 21 జన్మల కొరకు ఫలము తండ్రి నుండి లభించాలి. ఇదే చింత ఉంది. మేము ఏమైనా చేస్తున్నామా? ఎవరికైనా జ్ఞానాన్ని ఇస్తున్నామా? రోజంతా ఈ సంకల్పాలు వస్తూ ఉండాలి. సెంటర్ తెరుస్తే తెరవవచ్చు కానీ ఇంట్లో పతి, పత్నికి మధ్యన మనస్పర్థలు ఉండకూడదు. ఎటువంటి గొడవలు ఉండకూడదు. సన్యాసులు ఇంటి గొడవల నుండి బయటకు వెళ్ళిపోతారు. వాటిని ఖాతరు చేయకుండా వెళ్ళిపోతారు. కానీ గవర్నమెంట్ వారినేమైనా ఆపుతుందా? అక్కడైతే కేవలం పురుషులు మాత్రమే వెళ్ళిపోతారు. ఈ రోజుల్లో కొందరు మాతలు కూడా వెళ్తున్నారు. ఎవరికైతే నాథులెవరూ ఉండరో లేదా ఎవరికైతే వైరాగ్యము కలుగుతుందో, వారికి కూడా ఆ సన్యాసి పురుషులు కూర్చుని నేర్పిస్తారు. వారి ద్వారా తమ వ్యాపారాన్ని నడిపిస్తారు. ధనము మొదలైనవన్నీ వారి వద్దనే ఉంటాయి. వాస్తవానికి ఇళ్ళు-వాకిళ్ళను వదిలిన తర్వాత ఇక ధనము ఉంచుకోవలసిన అవసరముండదు. తండ్రి ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు. నేను తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి అని ప్రతి ఒక్కరి బుద్ధిలోకి రావాలి. మనుష్యులకైతే ఏమీ తెలియదు, తెలివితక్కువవారిగా ఉన్నారు. పిల్లలైన మీ కొరకు తండ్రి ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే - మధురాతి మధురమైన పిల్లలూ, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి, కేవలం పండితులుగా అవ్వకూడదు. స్వ కళ్యాణము కూడా చేసుకోవాలి. స్మృతి ద్వారా సతోప్రధానముగా అవ్వాలి. చాలా పురుషార్థము చేయాలి. లేకపోతే చాలా పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. ఏమంటారంటే - బాబా, మేము పదే-పదే మర్చిపోతున్నాము, ఇతర సంకల్పాలు వస్తున్నాయి. బాబా అంటారు, అవైతే వస్తాయి, మీరు తండ్రి స్మృతిలో ఉంటూ సతోప్రధానముగా అవ్వాలి. అపవిత్రముగా ఉన్న ఆత్మ పరమపిత పరమాత్మనే స్మృతి చేసి పవిత్రముగా అవ్వాలి. తండ్రియే పిల్లలకు డైరెక్షన్ ఇస్తున్నారు - ఓ ఆజ్ఞాకారీ పిల్లలూ, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి. మొట్టమొదట ఈ విషయాన్నే వినిపించండి - నిరాకార శివబాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, నేను పతిత-పావనుడను, నా స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, ఇంకే ఉపాయమూ లేదు, ఇంకే ఉపాయాన్ని ఎవ్వరూ చెప్పలేరు. చాలామంది సన్యాసులు మొదలైనవారు ఉన్నారు, వారు మిమ్మల్ని యోగ కాన్ఫరెన్స్ లకు వచ్చి పాల్గొనమని ఆహ్వానిస్తారు. వాస్తవానికి వారి హఠయోగముతోనైతే ఎవ్వరి కళ్యాణము జరగదు. అనేక యోగాశ్రమాలు ఉన్నాయి, వారికి ఈ రాజయోగము గురించి ఏ మాత్రమూ తెలియదు. తండ్రి గురించే తెలియదు. అనంతమైన తండ్రియే వచ్చి సత్యాతి-సత్యమైన యోగాన్ని నేర్పిస్తారు. తండ్రి తమ పిల్లలైన మిమ్మల్ని తమ సమానముగా తయారుచేస్తారు. నేను నిరాకారుడను. తాత్కాలికముగా ఈ శరీరములోకి వచ్చాను. భాగ్యశాలి రథమనేది తప్పకుండా మనుష్యులదే ఉంటుంది. ఎద్దునైతే అలా అనము. అలాగే గుర్రపు రథము మొదలైనవాటి విషయమూ లేదు, అలానే యుద్ధము విషయము కూడా లేదు. మనము మాయతోనే యుద్ధము చేయాలని మీకు తెలుసు. మాయతో ఓడిపోతే ఓటమి... అని అంటూ ఉంటారు కూడా. మీరు చాలా బాగా అర్థం చేయించగలరు, కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కొందరు నేర్చుకుంటూ-నేర్చుకుంటూ కూడా ఒక్కసారిగా నేలపై పడిపోతారు. ఏదో ఘర్షణ జరుగుతుంది. ఇద్దరు సోదరీలకు కూడా పరస్పరములో పడదు, ఉప్పునీరులా అయిపోతారు. మీకు పరస్పరములో ఎటువంటి ఘర్షణ ఉండకూడదు. ఒకవేళ ఘర్షణ ఉంటే, వీరేమి సేవ చేస్తారని తండ్రి అంటారు. చాలా మంచి-మంచి వారి పరిస్థితి కూడా ఇలా అవుతుంది. ఈ సమయములో మాలను తయారుచేసినట్లయితే దానిని డిఫెక్టెడ్ మాల అని అంటారు. పిల్లల్లో ఇంకా ఈ-ఈ అవగుణాలు ఉన్నాయి. డ్రామా ప్లాన్ అనుసారముగా బాబా సేవను కూడా చేయిస్తూ ఉంటారు. డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. ఢిల్లీని నలువైపులా సేవతో చుట్టుముట్టండి. ఇది కేవలం ఒక్కరు మాత్రమే చేయడము కాదు, పరస్పరములో కలుసుకుని సలహాలు చర్చించాలి. అందరూ ఏకమతముగా ఉండాలి. బాబా ఒక్కరే, కానీ సహాయకులైన పిల్లలు లేకుండా పని చేయరు. మీరు సెంటర్లు తెరిచి అభిప్రాయాలు తీసుకుంటారు. మీరు సహాయము చేసేవారేనా అని బాబా అడుగుతారు. అవును బాబా అని అంటారు. ఒకవేళ సహాయము చేసేవారు కాకపోతే ఏమీ చేయలేరు. ఇంటికి కూడా మిత్ర-సంబంధీకులు మొదలైనవారు వస్తారు కదా. వారు మిమ్మల్ని నిందించవచ్చు, వారు ఎత్తిపొడుస్తూ ఉంటారు. మీరు వాటిని లెక్క చేయకూడదు.

పిల్లలైన మీరు పరస్పరములో కూర్చుని చర్చించుకోవాలి. సెంటర్లు తెరిచినప్పుడు కూడా అందరూ కలిసి - బాబా, మేము బ్రాహ్మణి సలహాతో ఇదంతా చేస్తున్నామని వ్రాస్తారు. సింధీ భాషలో - బ త బారా (ఒకటితో రెండు కలిస్తే 12 అవుతుంది) అని అంటారు, 12 మంది ఉంటే ఇంకా మంచి సలహా వెలువడుతుంది. ఒక్కోచోట ఇతరుల నుండి సలహాలు తీసుకోరు. ఇలా అయితే ఏమైనా పని అవుతుందా? బాబా అంటారు, ఎప్పటివరకైతే పరస్పరములో మీ సంగఠన ఉండదో, అప్పటివరకు మీరు ఇంత పెద్ద కార్యాన్ని ఎలా చేయగలరు. చిన్న దుకాణాలు, పెద్ద దుకాణాలు ఉంటాయి కదా. వారు పరస్పరములో కలుసుకుని సంగఠనలు ఏర్పాటు చేసుకుంటారు. అంతేకానీ, బాబా, మీరు సహాయము చేయండి అని ఈ విధముగా ఎవరూ అడగరు. ముందైతే సహాయకులను తయారుచేయాలి, ఆ తర్వాత బాబా అంటారు - పిల్లలు ధైర్యము చేస్తే తండ్రి సహాయము చేస్తారు అని. మొదటైతే మీకు మీరు సహాయకులను తయారుచేయండి. బాబా, మేము ఇంత చేస్తున్నాము, మిగిలినది మీరు సహాయము చేయండి. అంతేకానీ, ముందు మీరు సహాయము చేయండి అని అనడము కాదు. ధైర్యము వహించేవారికి భగవంతుడు సహాయము చేస్తారు అన్నదాని అర్థము కూడా తెలుసుకోరు. మొదటైతే పిల్లలకు ధైర్యము ఉండాలి. ఎవరెవరు ఏమేమి సహాయము చేస్తారు? ఫలానావారు ఫలానా సహాయము చేస్తున్నారని లెక్కాపత్రమంతా వ్రాస్తారు. పద్ధతి ప్రకారముగా వ్రాసి ఇస్తారు. అంతేకానీ ఒక్కొక్కరూ - మేము సెంటరు తెరుస్తాము, మీరు సహాయము చేయండి అని ఈ విధముగా అనడము కాదు. అలాంటప్పుడు బాబా తెరవలేరా? కానీ అలా జరగదు. కమిటీవారు పరస్పరములో కలుసుకోవాలి. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు కదా. కొందరైతే ఏమీ అర్థం చేసుకోరు. కొందరు చాలా హర్షితముగా ఉంటారు. ఈ జ్ఞానములో చాలా సంతోషము ఉండాలి అని బాబా భావిస్తారు. ఒక్కరే తండ్రి, టీచర్, గురువుగా లభించినప్పుడు సంతోషముండాలి కదా. ప్రపంచములో ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. శివబాబాయే జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత. అందరి తండ్రి కూడా ఒక్కరే. ఇది ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - వారే నాలెడ్జ్ ఫుల్, ముక్తిప్రదాత మరియు మార్గదర్శకుడు. కావున తండ్రి మతముపై నడవాల్సి ఉంటుంది. పరస్పరములో కలుసుకుని చర్చించుకోవాలి, ఖర్చు చేయాలి, అంతేకానీ ఎవరో ఒక్కరి అభిప్రాయముపైనే నడవలేరు. అందరూ సహాయకులుగా ఉండాలి. ఈ బుద్ధి కూడా కావాలి కదా. పిల్లలైన మీరు ఇంటింటికీ సందేశాన్ని ఇవ్వాలి. వివాహానికి ఆహ్వానము లభించింది, వెళ్ళవచ్చా అని అడుగుతారు. బాబా అంటారు, ఎందుకు వెళ్ళకూడదు, వెళ్ళండి, వెళ్ళి మీ సేవను చేయండి. అనేకుల కళ్యాణము చేయండి. భాషణ కూడా చేయవచ్చు. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది, నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఇక్కడ అందరూ పాపాత్ములు. తండ్రిని నిందిస్తూ ఉంటారు. తండ్రి నుండి మిమ్మల్ని విముఖులుగా చేస్తారు. వినాశ కాలే విపరీత బుద్ధి అని గాయనము కూడా ఉంది. ఈ మాట ఎవరు అన్నారు? తండ్రి స్వయంగా అంటున్నారు - నా పట్ల ప్రీతి బుద్ధి లేదు. వినాశ కాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు. నా గురించి తెలియనే తెలియదు. ఎవరికైతే ప్రీతి బుద్ధి ఉందో, ఎవరైతే నన్ను స్మృతి చేస్తారో, వారే విజయము పొందుతారు. ప్రీతి ఉన్నా కానీ స్మృతి చేయకపోతే తక్కువ పదవిని పొందుతారు. తండ్రి పిల్లలకు డైరెక్షన్లు ఇస్తారు. ముఖ్యమైన విషయమేమిటంటే - అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనముగా అయి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. డ్రామానుసారముగా బాబా వృద్ధాప్యములో ఉన్న శరీరాన్నే తీసుకోవలసి ఉంటుంది. వానప్రస్థములో ప్రవేశిస్తారు. మనుష్యులు వానప్రస్థ అవస్థలోనే భగవంతుడిని కలుసుకోవడానికి కృషి చేస్తారు. భక్తిలోనైతే జపతపాదులు మొదలైనవన్నీ చేయడమనేది భగవంతుడిని కలుసుకునేందుకు మార్గాలని భావిస్తారు. ఎప్పుడు లభిస్తారు అనేది ఏమీ తెలియదు. జన్మ-జన్మాంతరాలుగా భక్తి చేస్తూ వచ్చారు. భగవంతుడైతే ఎవ్వరికీ లభించనే లభించరు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేయవలసి వచ్చినప్పుడే బాబా వస్తారని అర్థం చేసుకోరు. రచయిత తండ్రియే. చిత్రమైతే ఉంది కానీ త్రిమూర్తి చిత్రములో శివుడిని చూపించరు. శివబాబా లేకుండా బ్రహ్మా-విష్ణు-శంకరులను చూపించారు, తలను తీసేసినట్లు అయ్యింది. తండ్రి లేకపోతే అనాథలుగా అయిపోతారు. తండ్రి అంటారు, నేను వచ్చి మిమ్మల్ని ఆ నాథుడికి చెందినవారిగా చేస్తాను. 21 జన్మలు మీరు నాథుడికి చెందినవారిగా అవుతారు. ఎటువంటి కష్టమూ ఉండదు. మీరు కూడా అంటారు - బాబా లభించనంతవరకు, మేము కూడా పూర్తిగా అనాథలుగా, తుచ్ఛబుద్ధి కలవారిగా ఉండేవారము అని. పతిత-పావన అని అంటారు కానీ వారు ఎప్పుడు వస్తారు అన్నది తెలియదు. కొత్త ప్రపంచమే పావన ప్రపంచము. తండ్రి ఎంత సులువుగా అర్థం చేయిస్తున్నారు. మనము తండ్రికి చెందినవారిగా అయ్యామని, స్వర్గానికి యజమానులుగా తప్పకుండా అవుతామని మీకు కూడా అర్థమవుతుంది. శివబాబా అనంతమైన యజమాని. తండ్రియే వచ్చి సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇచ్చారు. సత్యయుగములో సుఖముండేది, మిగిలిన ఆత్మలంతా శాంతిధామములో ఉండేవారు. ఇప్పుడు ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. శివబాబా ఎందుకు వచ్చి ఉంటారు? తప్పకుండా కొత్త ప్రపంచాన్ని రచించేందుకు, పతితులను పావనముగా చేసేందుకు వచ్చి ఉంటారు, వారు ఉన్నతమైన కార్యాన్ని చేసి ఉంటారు. మనుష్యులు పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. తండ్రి అంటారు, ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పిల్లలైన మిమ్మల్ని తండ్రి కూర్చుని మేలుకొలుపుతారు. కొత్త ప్రపంచము మళ్ళీ పాతదిగా ఎలా అవుతుంది అని మీకు ఇప్పుడు ఈ మొత్తం డ్రామా గురించి తెలుసు. తండ్రి అంటారు, మిగిలినవన్నీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. మనకు ఎవ్వరి పట్ల ద్వేషము కలగదు. ఈ విషయాన్ని అర్థం చేయించవలసి ఉంటుంది. డ్రామానుసారముగా మాయా రాజ్యము కూడా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, ఇప్పుడు ఈ చక్రము పూర్తవుతుంది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది, దానిపై నడుచుకోవాలి. ఇప్పుడు పంచ వికారాల మతముపై నడవకూడదు. అర్ధకల్పము మీరు మాయ మతముపై నడిచి తమోప్రధానముగా అయ్యారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సతోప్రధానముగా తయారుచేసేందుకు వచ్చాను. ఇది సతోప్రధానము, తమోప్రధానము యొక్క ఆట. నింద యొక్క విషయమేమీ లేదు. భగవంతుడు ఈ రాకపోకల నాటకాన్ని అసలు ఎందుకు రచించారు అని అంటారు. ఎందుకు అనే ప్రశ్నే తలెత్తదు. ఇది డ్రామా చక్రము, ఇది మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. డ్రామా అనాది అయినది. ఇప్పుడు ఇది కలియుగము. సత్యయుగము గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. బాబా-బాబా అని అంటూ ఉన్నట్లయితే కళ్యాణము జరుగుతూ ఉంటుంది. తండ్రి అంటారు, ఇవి అతి గుహ్యమైన రమణీకమైన విషయాలు. పులి పాలు కోసం బంగారు పాత్ర కావాలని అంటారు. బంగారు బుద్ధి ఎలా తయారవుతుంది? ఆత్మలోనే బుద్ధి ఉంది కదా. ఆత్మ అంటుంది - నా బుద్ధి ఇప్పుడు బాబా వైపు ఉంది, నేను బాబాను చాలా స్మృతి చేస్తాను. కూర్చుని-కూర్చునే బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోతుంది కదా. బుద్ధిలో వ్యాపార వ్యవహారాలు గుర్తుకొస్తూ ఉంటాయి. కావున బుద్ధి మీ మాట విననట్లు ఉంటుంది. శ్రమ ఉంటుంది. ఎంతెంతగా మృత్యువు సమీపముగా వస్తూ ఉంటుందో, అంతగా మీరు స్మృతిలో చాలా ఉంటారు. మరణించే సమయములో అందరూ భగవంతుడిని స్మృతి చేయమని చెప్తారు. ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. ఇది మీ అందరి వానప్రస్థ అవస్థ, తిరిగి వెళ్ళాలి, అందుకే ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. వేరే విషయాలేవీ వినకండి. జన్మ-జన్మాంతరాల పాపాల భారము మీ తలపై ఉంది. శివబాబా అంటారు, ఈ సమయములో అందరూ అజామిళ్ వలె ఉన్నారు. ముఖ్యమైన విషయము స్మృతియాత్ర, దీని ద్వారా మీరు పావనముగా అవుతారు, అంతేకాక పరస్పరములో ప్రేమ కూడా ఉండాలి. ఇతరుల నుండి సలహాలను తీసుకోవాలి. తండ్రి ప్రేమ సాగరుడు కదా. కావున మీరు కూడా పరస్పరములో చాలా ప్రియముగా ఉండాలి. దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. సోదరీ-సోదరుల సంబంధాన్ని కూడా దాటి వెళ్ళవలసి ఉంటుంది. సోదరీ-సోదరులతో కూడా యోగము పెట్టుకోకండి. ఒక్క తండ్రితోనే యోగము పెట్టుకోండి. తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికారీ దృష్టి సమాప్తమైపోతుంది. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయకూడదు. మనసులో తుఫానులు తప్పకుండా వస్తాయి. ఇది పెద్ద గమ్యము. బాబా అంటారు - చూడండి, కర్మేంద్రియాలు మోసము చేస్తాయి కావున అప్రమత్తముగా ఉండండి. ఒకవేళ తప్పుడు పని చేసినట్లయితే ఇక సమాప్తము. ఎక్కితే వైకుంఠానికి యజమానులు... శ్రమ లేకుండా ఏమీ లభించదు. చాలా శ్రమ ఉంటుంది. దేహ సహితముగా దేహము యొక్క... కొందరికైతే బంధనాలు లేకపోయినా కూడా చిక్కుకుని ఉంటారు. తండ్రి శ్రీమతముపై నడవరు. ఒకటి రెండు లక్షలు ఉండవచ్చు, పెద్ద కుటుంబమైనా కూడా బాబా అంటారు, వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటిలో ఎక్కువగా చిక్కుకోకండి, వానప్రస్థులుగా అయిపోండి. ఖర్చులు మొదలైనవి తగ్గించండి. పేదవారు ఎంత సాధారణముగా ఉంటారు. ఇప్పుడు ఎలాంటి వస్తువులు వెలువడ్డాయంటే ఇక అడగకండి. షావుకార్లు ఖర్చులు చేస్తూనే ఉంటారు. లేదంటే వాస్తవానికి కడుపుకు ఏమి కావాలి? ఒక పావు కేజీ పిండి అంతే. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పరస్పరములో చాలా-చాలా ప్రియముగా అవ్వాలి కానీ సోదరీ-సోదరులతో యోగము పెట్టుకోకూడదు. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయకూడదు.

2. ఒక్క ఈశ్వరీయ మతముపై నడుచుకుని సతోప్రధానముగా అవ్వాలి. మాయ మతమును విడిచిపెట్టాలి. పరస్పరములో సంగఠనను శక్తివంతముగా చేసుకోవాలి, ఒకరికొకరు సహాయకులుగా అవ్వాలి.

వరదానము:-
లక్ష్యము అనుసారముగా లక్షణాలను బ్యాలెన్స్ చేసే కళ ద్వారా ఎక్కే కళను అనుభవము చేసే బాబా సమాన సంపన్న భవ

పిల్లల్లో విశ్వ కళ్యాణ కామన కూడా ఉంది, అలాగే బాబా సమానముగా అయ్యే శ్రేష్ఠమైన కోరిక కూడా ఉంది, కానీ లక్ష్యము అనుసారముగా ఏ లక్షణాలైతే స్వయానికి మరియు సర్వులకు కనిపిస్తాయో, వాటిలో తేడా ఉంది, అందుకే బ్యాలెన్స్ చేసే కళను ఇప్పుడు ఎక్కే కళలోకి తీసుకువచ్చి ఈ తేడాను తొలగించండి. సంకల్పము ఉంది కానీ దృఢతా సంపన్నమైన సంకల్పము ఉండాలి, అప్పుడు బాబా సమానముగా అయ్యే వరదానము ప్రాప్తిస్తుంది. ఇప్పుడు స్వదర్శనము మరియు పరదర్శనము, ఈ రెండు చక్రాలు తిరుగుతున్నాయి. వ్యర్థ విషయాలలో ఏదైతే త్రికాలదర్శులుగా అవుతారో, అది పరివర్తన చేసి స్వచింతకులుగా, స్వదర్శన చక్రధారులుగా అవ్వండి.

స్లోగన్:-
సేవా భాగ్యము ప్రాప్తించడమే అన్నింటికంటే గొప్ప భాగ్యము.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

ఇలా అభ్యాసము చెయ్యండి - దేహము మరియు దేహము యొక్క దేశాన్ని మర్చిపోయి అశరీరి పరంధామ నివాసిగా అవ్వండి, ఆ తర్వాత పరంధామ నివాసి నుండి అవ్యక్త స్థితిలో స్థితులవ్వండి, ఆ తర్వాత సేవ కోసం శబ్దములోకి రండి, సేవ చేస్తూ కూడా మీ స్వరూపపు స్మృతిలో ఉండండి, మీ బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ ఒక్క క్షణము కంటే కూడా తక్కువ సమయములో ఏకాగ్రము చెయ్యండి, అప్పుడు పాస్ విత్ ఆనర్ గా అవుతారు.