10-12-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీ ఈ రికార్డులు (పాటలు) సంజీవనీ
మూలిక వంటివి, వీటిని మ్రోగించడము ద్వారా నిరుత్సాహము తొలగిపోతుంది’’
ప్రశ్న:-
అవస్థ
పాడవ్వడానికి కారణమేమిటి? ఏ యుక్తి ద్వారా అవస్థ చాలా బాగా ఉండగలదు?
జవాబు:-
1. జ్ఞాన
నాట్యము చేయరు, పరచింతన విషయాలు మాట్లాడటములో తమ సమయాన్ని వృధా చేసుకుంటారు, అందుకే
అవస్థ పాడైపోతుంది. 2. ఇతరులకు దుఃఖాన్ని ఇచ్చినా సరే, దాని ప్రభావము అవస్థపై
పడుతుంది. ఎప్పుడైతే మధురముగా నడుచుకుంటారో, స్మృతిపై పూర్తి అటెన్షన్ ఉంటుందో,
అప్పుడు అవస్థ బాగుంటుంది. రాత్రివేళ పడుకునే ముందు తక్కువలో తక్కువ అరగంట స్మృతిలో
కూర్చోండి మరియు ఉదయమే లేచి స్మృతి చేయండి, అప్పుడు అవస్థ బాగుంటుంది.
పాట:-
నా మనస్సు అనే
ద్వారములోకి ఎవరు వచ్చారు...
ఓంశాంతి
ఈ రికార్డులను (పాటలను) కూడా పిల్లల కోసం బాబా తయారుచేయించారు. వీటి అర్థాన్ని కూడా
పిల్లలు తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు. బాబా ఎన్నో సార్లు అర్థం చేయించారు - ఇటువంటి
మంచి-మంచి రికార్డులు ఇంట్లో ఉండాలి, ఎప్పుడైనా ఏదైనా నిరుత్సాహము కలిగితే ఈ
రికార్డులను మ్రోగించడము ద్వారా బుద్ధిలోకి వెంటనే దాని అర్థము వస్తుంది, అప్పుడు ఆ
నిరుత్సాహము తొలగిపోతుంది. ఈ రికార్డులు కూడా సంజీవనీ మూలిక వంటివి. బాబా
డైరెక్షన్లు అయితే ఇస్తారు కానీ వాటిని ఎవరైనా అమలులోకి తీసుకురావాలి కదా. మా
హృదయములోకి మరియు మీ అందరి హృదయములోకి ఎవరు వచ్చారు అని ఈ పాటలో ఎవరు అంటున్నారు!
ఎవరైతే వచ్చి జ్ఞాన నాట్యము చేస్తారో వారు అంటారు. గోపికలు కృష్ణునితో నాట్యం
చేయించేవారని అంటారు కానీ అదేమీ లేదు. ఇప్పుడు తండ్రి - ఓ సాలిగ్రామములైన పిల్లలూ
అని అంటారు, వారు ఇలా అందరినీ అంటారు కదా. స్కూలు అంటే స్కూలే, అక్కడ చదువుకోవడం
జరుగుతుంది, ఇది కూడా స్కూలే. మన హృదయములో ఎవరి స్మృతి కలుగుతుంది అన్నది పిల్లలైన
మీకు తెలుసు! ఇంకే మనుష్యమాత్రుల బుద్ధిలోనూ ఈ విషయాలు లేవు. పిల్లలైన మీకు వారి
స్మృతి ఉండే సమయము ఇదొక్కటే, ఇంకెవ్వరూ వారిని స్మృతి చేయరు. తండ్రి అంటారు, మీరు
రోజూ నన్ను స్మృతి చేసినట్లయితే ధారణ చాలా బాగా జరుగుతుంది. నేను ఎలా డైరెక్షన్
ఇస్తున్నానో మీరు అలా స్మృతి చేయడం లేదు. మాయ మిమ్మల్ని స్మృతి చేయనివ్వదు. నేను
చెప్పినట్లుగా మీరు చాలా తక్కువగా నడుచుకుంటారు మరియు మాయ చెప్పినట్లుగా చాలా
ఎక్కువగా నడుచుకుంటారు. ఎన్నో సార్లు చెప్పాను - రాత్రివేళలో పడుకునే ముందు అరగంట
తండ్రి స్మృతిలో కూర్చోవాలి అని. స్త్రీ పురుషులు ఉన్నా కలిసి కూర్చున్నా లేక
వేర్వేరుగా కూర్చున్నా పర్వాలేదు. బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. కానీ ఇలా ఏ
ఒక్కరో అరుదుగా స్మృతి చేస్తారు. మాయ మరపింపజేస్తుంది. ఆజ్ఞానుసారముగా నడుచుకోకపోతే
పదవిని ఎలా పొందగలరు? బాబాను ఎంతగానో స్మృతి చేయాలి. శివబాబా, మీరే ఆత్మలకు తండ్రి,
అందరికీ మీ నుండే వారసత్వము లభించనున్నది. ఎవరైతే పురుషార్థము చేయరో వారికి కూడా
వారసత్వము లభిస్తుంది, బ్రహ్మాండానికి యజమానులుగా అయితే అందరూ అవుతారు. ఆత్మలందరూ
ఏమీ చేయకపోయినా కానీ డ్రామానుసారముగా నిర్వాణధామములోకి వచ్చేస్తారు. అర్ధకల్పము
భక్తి చేస్తారు కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు, ఎప్పటివరకైతే నేను గైడ్ గా అయి రానో
అప్పటివరకూ ఎవరూ తిరిగి వెళ్ళలేరు. అసలు ఎవరూ ఆ దారిని చూడనే లేదు. ఒకవేళ ఎవరైనా
చూసి ఉన్నట్లయితే వారి వెనుక అందరూ దోమల గుంపులా వెళ్ళాలి. మూలవతనము అంటే ఏమిటి -
ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా అని, ఇదే రిపీట్ అయ్యేది
ఉంది అని మీకు తెలుసు. ఇప్పుడు పగలులోనైతే కర్మయోగులుగా అయి వ్యాపార-వ్యవహారాలలో
ఉండాలి. భోజనము తయారుచేయడము మొదలైన కర్మలన్నీ చేయాలి, వాస్తవానికి కర్మ సన్యాసము అని
అనడం కూడా తప్పే. కర్మ లేకుండానైతే ఎవరూ ఉండలేరు. కర్మ సన్యాసులు అని తప్పుడు పేరు
పెట్టుకున్నారు. కావున పగలు వ్యాపారాలు మొదలైనవి చేయండి కానీ రాత్రివేళలో మరియు
ఉదయముదయమే తండ్రిని బాగా స్మృతి చేయండి. ఎవరినైతే ఇప్పుడు మీ వారిగా చేసుకున్నారో
వారిని స్మృతి చేసినట్లయితే సహాయం కూడా లభిస్తుంది లేకపోతే లభించదు. షావుకారులకైతే
తండ్రికి చెందినవారిగా అవ్వడములో హృదయము విదీర్ణమవుతుంది, ఇక వారికి పదవి కూడా
లభించదు. ఈ స్మృతి చేయడమైతే చాలా సహజము. వారు మన తండ్రి, టీచర్, గురువు. ఈ ప్రపంచము
యొక్క చరిత్ర మరియు భౌగోళికము ఎలా రిపీట్ అవుతుంది అని వారు మనకు రహస్యమంతా
తెలియజేశారు. తండ్రిని స్మృతి చేయాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పాలి. అందరినీ
తిరిగి తీసుకువెళ్ళేవారైతే ఒక్క తండ్రే. కావున ఇటువంటి ఆలోచనలలో ఉండాలి. రాత్రివేళ
పడుకునే సమయములో కూడా ఈ జ్ఞానము బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. అలాగే ఉదయము లేస్తూ కూడా
ఇదే జ్ఞానము గుర్తుండాలి. మనమే బ్రాహ్మణుల నుండి దేవతలుగా, మళ్ళీ క్షత్రియులుగా,
వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము, ఆ తర్వాత బాబా వస్తారు, మళ్ళీ మనం శూద్రుల నుండి
బ్రాహ్మణులుగా అవుతాము. బాబా త్రిమూర్తి, త్రికాలదర్శి, త్రినేత్రి కూడా. వారు మన
బుద్ధిని తెరుస్తారు. జ్ఞానము యొక్క మూడవ నేత్రము కూడా లభిస్తుంది. ఇటువంటి తండ్రి
అయితే ఇంకెవరూ ఉండరు. తండ్రి రచనను రచిస్తారు, కావున వారు తల్లి కూడా అయ్యారు.
జగదంబను నిమిత్తము చేస్తారు. తండ్రి ఈ తనువులోకి వచ్చి బ్రహ్మా రూపము ద్వారా ఆట,
పాటలు కూడా ఆడతారు, విహరించేందుకు కూడా వెళ్తారు. మనం బాబాను స్మృతి అయితే చేస్తాము
కదా. వారు ఇతని రథములోకి వస్తారనైతే మీకు తెలుసు. బాప్ దాదా మాతో ఆడతారు అని మీరు
అంటారు. బాబా ఆటలో కూడా స్మృతి చేసే పురుషార్థము చేస్తారు. బాబా అంటారు, నేను ఇతని
ద్వారా ఆడుతున్నాను. నేను చైతన్యాన్ని కదా. కావున ఇటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి.
ఇటువంటి తండ్రిపై బలిహారమవ్వాలి కూడా. మేము బలిహారమవుతాము అని భక్తి మార్గములో మీరు
గానం చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను మీరు ఈ ఒక్క జన్మ మీ వారసునిగా
చేసుకున్నట్లయితే నేను మీకు 21 జన్మల కొరకు రాజ్యభాగ్యాన్ని ఇస్తాను. ఇప్పుడు వారు
ఈ ఆజ్ఞను ఇస్తున్నారంటే మరి ఆ డైరెక్షన్ పై నడవాలి. వారు కూడా వారు చూసినదానిని
బట్టి డైరెక్షన్లు ఇస్తారు. డైరెక్షన్లపై నడవడం ద్వారా మమకారము అంతమైపోతుంది, కానీ
భయపడతారు. బాబా అంటారు - మీరు బలిహారమవ్వకపోతే నేను వారసత్వాన్ని ఎలా ఇస్తాను? మీ
ధనాన్ని ఎవరూ తీసుకుపోరు. ఏమంటారంటే - అచ్ఛా, మీ వద్ద ధనముందా, ఉంటే లిటరేచర్ లో
పెట్టండి. మీరు ట్రస్టీలు కదా. బాబా సలహాలు ఇస్తూ ఉంటారు. బాబా సర్వస్వము అంతా
పిల్లల కొరకే. వారు పిల్లల నుండి ఏమీ తీసుకోరు. కేవలం మమకారం తొలగిపోవాలి అని
యుక్తిగా అర్థం చేయిస్తారు. మోహము కూడా చాలా కఠినమైనది (కోతి ఉదాహరణ). బాబా అంటారు
- మీరు కోతుల వలె వారి వెనుక మోహాన్ని ఎందుకు పెట్టుకుంటారు? మరి ఇంటింటిలోనూ
మందిరాలు ఎలా తయారవుతాయి. నేను మిమ్మల్ని వానరత్వము నుండి విడిపించి మందిరయోగ్యులుగా
తయారుచేస్తాను. మీరు ఈ చెత్తపై మమకారాన్ని ఎందుకు పెట్టుకుంటారు. బాబా ఎలా
సంభాళించాలి అని తమ సలహా ఇస్తారు, అయినా అది బుద్ధిలో కూర్చోదు. ఇదంతా బుద్ధితో పని.
అమృతవేళ కూడా బాబాతో ఎలా మాట్లాడాలి అని బాబా సలహా ఇస్తారు. బాబా, మీరు అనంతమైన
తండ్రి, టీచర్. మీరే అనంతమైన ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికములను గురించి
తెలియజేయగలరు. లక్ష్మీ-నారాయణుల 84 జన్మల కథ గురించి ప్రపంచములో ఎవరికీ తెలియదు.
జగదంబను మాత, మాత అని కూడా అంటారు. ఆమెవరు? ఆమె సత్యయుగములో అయితే ఉండరు. అక్కడి
మహారాణి-మహారాజు అయితే లక్ష్మీ-నారాయణులు. వారి తర్వాత సింహాసనముపై కూర్చునేందుకు
వారికి తమ కొడుకు ఉంటారు. మనము సింహాసనముపై కూర్చునేందుకు వారి పిల్లలుగా ఎలా
అవుతాము? ఈ జగదాంబ బ్రాహ్మణి అని, బ్రహ్మా కూతురు సరస్వతి అని ఇప్పుడు మనం
తెలుసుకున్నాము. మనుష్యులకు ఈ రహస్యాలు తెలియవు. రాత్రివేళ తండ్రి స్మృతిలో
కూర్చోవాలి అన్న నియమము పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. నియమము
తయారుచేసుకున్నట్లయితే మీకు సంతోషపు పాదరసము పైకి ఎక్కి ఉంటుంది, అప్పుడు ఇక ఎటువంటి
కష్టమూ ఉండదు. ఒక్క తండ్రి పిల్లలైన మనమంతా సోదరీ-సోదరులము అని అంటారు. మరి అశుద్ధ
దృష్టిని ఉంచడము హింసయే అవుతుంది. నషా కూడా సతో, రజో, తమోగుణీగా ఉంటుంది కదా.
తమోగుణీ నషా ఎక్కినట్లయితే చనిపోతారు. కొద్ది సమయమైనా బాబాను స్మృతి చేసి బాబా
సేవలోకి వెళ్ళండి, ఈ నియమము తయారుచేసుకోండి, అప్పుడిక మాయ తుఫానులు రావు. ఈ నషా
రోజంతా ఉంటుంది మరియు అవస్థ కూడా చాలా రిఫైన్ గా అవుతుంది. అలాగే యోగములో కూడా లైన్
క్లియర్ గా ఉంటుంది. ఇటువంటి రికార్డులు (పాటలు) కూడా చాలా బాగున్నాయి. రికార్డులు
వింటూ ఉన్నట్లయితే నాట్యం చేయడం మొదలుపెడతారు, రిఫ్రెష్ అయిపోతారు. రెండు, నాలుగు,
ఐదు రికార్డులు చాలా బాగున్నాయి. పేదవారు కూడా బాబా సేవలో నిమగ్నమైనట్లయితే వారికి
మహళ్ళు లభించగలవు. శివబాబా భాండాగారము నుండి అన్నీ లభించగలవు. సర్వీసబుల్ పిల్లలకు
బాబా ఎందుకు ఇవ్వరు. శివబాబా భాండాగారము నిండుగానే ఉంది.
(పాట) ఇది జ్ఞాన నాట్యము. తండ్రి వచ్చి గోప-గోపికల చేత జ్ఞాన నాట్యము చేయిస్తారు.
ఎక్కడ కూర్చున్నా సరే, తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అవస్థ చాలా బాగుంటుంది.
ఏ విధంగా బాబా జ్ఞాన-యోగాల నషాలో ఉంటారో, అలా పిల్లలైన మీకు కూడా నేర్పిస్తారు,
కావున సంతోషపు నషా ఉంటుంది. అలా కాకుండా పరచింతనా విషయాలను మాట్లాడటములోనే
ఉన్నట్లయితే ఇక అవస్థ కూడా పాడైపోతుంది. ఉదయాన్నే లేవడము అనేది చాలా మంచిది. బాబా
స్మృతిలో కూర్చుని బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడాలి. భాషణ చేసేవారైతే విచార
సాగర మంథనము చేయవలసి ఉంటుంది. ఈ రోజు ఈ-ఈ పాయింట్లపై అర్థం చేయిస్తాము, ఇలా అర్థం
చేయిస్తాము అని ఆలోచించాలి. మేము ఉద్యోగం వదిలేయాలా అని బాబాను చాలామంది పిల్లలు
అడుగుతారు. కానీ బాబా అంటారు, మొదట సేవ యొక్క ఋజువునైతే ఇవ్వండి. బాబా స్మృతి కోసం
యుక్తిని చాలా మంచిది తెలియజేశారు. కానీ ఇది అలవాటు చేసుకునేవారు కోట్లాదిమందిలో ఏ
ఒక్కరో వెలువడుతారు. కొందరికైతే కష్టం మీద స్మృతి ఉంటుంది. కుమారీలైన మీ పేరు
ప్రసిద్ధమైనది. అందరూ కుమారీల కాళ్ళకు నమస్కరిస్తారు. మీరు 21 జన్మల కొరకు భారత్ కు
స్వరాజ్యాన్ని ఇప్పిస్తారు. మీ స్మృతిచిహ్న మందిరాలు కూడా ఉన్నాయి. బ్రహ్మాకుమార,
కుమారీల పేరు కూడా ప్రసిద్ధమైపోయింది కదా. కుమారి అనగా 21 కులాలను ఉద్ధరించేవారు.
కావున ఆ అర్థాన్ని కూడా అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల రీల్ అని,
ఏదైతే గతించిందో అదంతా డ్రామాయేనని పిల్లలైన మీకు తెలుసు. పొరపాటు జరిగితే అది
డ్రామాయే. ఇక ముందు కోసం తమ రిజిస్టరును సరిచేసుకోవాలి. ఇక మళ్ళీ రిజిస్టర్
పాడవ్వకూడదు. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని, అప్పుడే అంతటి ఉన్నత పదవి లభిస్తుంది.
బాబాకు చెందినవారిగా అయిన తర్వాత బాబా వారసత్వాన్ని కూడా ఇస్తారు. సవతి పిల్లలకు
వారసత్వాన్ని ఇవ్వరు కదా. సహాయం చేయడం మీ కర్తవ్యము. వివేకవంతులైన పిల్లలు ఎవరైతే
ఉంటారో వారు ప్రతి విషయములోనూ సహాయం చేస్తారు. తండ్రి ఎంత సహాయం చేస్తారో చూడండి.
ధైర్యముంచే పిల్లలకు తండ్రి సహాయం చేస్తారు. మాయపై విజయాన్ని పొందడానికి కూడా శక్తి
కావాలి. ఒక్క ఆత్మిక తండ్రినే స్మృతి చేయాలి, ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి
ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించాలి. బాబా జ్ఞానసాగరుడు. వారు అంటారు, నేను ఇతనిలోకి
ప్రవేశిస్తాను, మాట్లాడతాను. ఇంకెవరూ ఇలా - నేను తండ్రిని, టీచరును, గురువును,
బ్రహ్మా, విష్ణు, శంకరులను రచించేవాడిని అని అనలేరు. ఈ విషయాలను ఇప్పుడు పిల్లలైన
మీరే అర్థం చేసుకోగలరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పాత చెత్త ప్రపంచముపై మమకారాన్ని పెట్టుకోకూడదు, తండ్రి డైరెక్షన్ పై నడుస్తూ
తమ మమకారాన్ని తొలగించివేయాలి, ట్రస్టీలుగా అయి ఉండాలి.
2. ఈ అంతిమ జన్మలో భగవంతుడిని మీ వారసునిగా చేసుకుని వారిపై బలిహారమవ్వాలి,
అప్పుడే 21 జన్మల రాజ్యభాగ్యము లభిస్తుంది. తండ్రిని స్మృతి చేసి సేవ చేయాలి, నషాలో
ఉండాలి, రిజిస్టర్ ఎప్పుడూ పాడవ్వకుండా ఉండేలా అటెన్షన్ పెట్టాలి.
వరదానము:-
ప్రత్యక్ష ఫలము ద్వారా అతీంద్రియ సుఖపు అనుభూతిని పొందే
నిస్వార్థ సేవాధారీ భవ
సత్యయుగములో సంగమయుగ కర్మలకు ఫలము లభిస్తుంది, కానీ ఇక్కడ
తండ్రికి చెందినవారిగా అవ్వటము ద్వారా ప్రత్యక్ష ఫలము వారసత్వ రూపములో లభిస్తుంది.
సేవ చేసారు మరియు సేవ చేయడముతోపాటు సంతోషము లభించింది. ఎవరైతే స్మృతిలో ఉంటూ
నిస్వార్థ భావముతో సేవ చేస్తారో వారికి సేవ యొక్క ప్రత్యక్ష ఫలము తప్పకుండా
లభిస్తుంది. ప్రత్యక్ష ఫలమే సదా ఆరోగ్యవంతులుగా చేసే తాజా ఫలము. యోగయుక్త, యథార్థ
సేవకు ఫలము సంతోషము, అతీంద్రియ సుఖము మరియు డబల్ లైట్ యొక్క అనుభూతి.
స్లోగన్:-
ఎవరైతే తమ నడవడిక ద్వారా
ఆత్మిక రాయల్టీ యొక్క ప్రకాశాన్ని మరియు నషాను అనుభవము చేయిస్తారో, వారే విశేష
ఆత్మలు.
| | |