ఓంశాంతి
దీనిని స్మృతి అగ్ని అని అంటారు. యోగాగ్ని అనగా స్మృతి అగ్ని. అగ్ని అన్న పదాన్ని
ఎందుకు ఉపయోగించారు? ఎందుకంటే ఇందులో పాపాలు భస్మమైపోతాయి. మీరు తమోప్రధానము నుండి
సతోప్రధానముగా ఎలా అవుతారు అన్నది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. సతోప్రధానము
అనగా అర్థమే పుణ్యాత్మ మరియు తమోప్రధానము అనగా అర్థమే పాపాత్మ. ఇతను చాలా పుణ్యాత్మ,
ఇతను పాపాత్మ అని అంటారు కూడా. దీనితో ఆత్మయే సతోప్రధానముగా అవుతుందని, మళ్ళీ
పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ తమోప్రధానముగా అవుతుందని నిరూపణ అవుతుంది, అందుకే
వీరిని పాపాత్ములు అని అంటారు. పతిత-పావనుడైన తండ్రిని కూడా - మీరు వచ్చి మమ్మల్ని
పావన ఆత్మలుగా తయారుచేయండి అనే తలచుకుంటారు. పతితాత్మగా ఎవరు చేసారు? ఇది ఎవ్వరికీ
తెలియదు. పావన ఆత్మలు ఉన్నప్పుడు దానిని రామ రాజ్యము అని అనేవారని మీకు తెలుసు.
ఇప్పుడు పతితాత్మలు ఉన్నారు, అందుకే దీనిని రావణ రాజ్యము అని అంటారు. భారత్ యే
పావనముగా, భారత్ యే పతితముగా అవుతుంది. తండ్రియే వచ్చి భారత్ ను పావనముగా
తయారుచేస్తారు. మిగిలిన ఆత్మలన్నీ పావనమై శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు
ఉన్నది దుఃఖధామము. ఇంత సహజమైన విషయము కూడా బుద్ధిలో కూర్చోదు. ఎప్పుడైతే
హృదయపూర్వకముగా అర్థం చేసుకుంటారో, అప్పుడు సత్యమైన బ్రాహ్మణులుగా అవుతారు.
బ్రాహ్మణులుగా అవ్వకుండా తండ్రి నుండి వారసత్వము లభించదు.
ఇప్పుడు ఇది సంగమయుగము యొక్క యజ్ఞము. యజ్ఞము కోసమైతే బ్రాహ్మణులు తప్పకుండా
కావాలి. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇది మృత్యులోకము యొక్క అంతిమ యజ్ఞము
అని మీకు తెలుసు. మృత్యులోకములోనే యజ్ఞాలు జరుగుతాయి. అమరలోకములో యజ్ఞాలు జరగవు.
భక్తుల బుద్ధిలో ఈ విషయాలు యథార్థముగా కూర్చోవు. భక్తి పూర్తిగా వేరు, జ్ఞానము వేరు.
మనుష్యులేమో వేద-శాస్త్రాలనే జ్ఞానముగా భావిస్తారు. ఒకవేళ అందులో జ్ఞానము ఉంటే మరి
మనుష్యులు తిరిగి వెళ్ళిపోయి ఉండేవారు. కానీ డ్రామానుసారముగా ఎవ్వరూ తిరిగి వెళ్ళరు.
బాబా అర్థం చేయించారు - మొదటి నంబరువారే సతో, రజో, తమోలలోకి రావలసి ఉంటే మరి వేరే
వాళ్ళు కేవలం సతో పాత్రను అభినయించి తిరిగి ఎలా వెళ్ళగలరు, వారు మళ్ళీ
తమోప్రధానములోకి రావలసిందే, పాత్రను అభినయించవలసిందే. ప్రతీ ఒక్క పాత్రధారి శక్తి
ఎవరిది వారికి ఉంటుంది కదా. పెద్ద-పెద్ద పాత్రధారులు ఎంత ప్రసిద్ధమవుతారు.
అందరికన్నా ముఖ్యమైన రచయిత, డైరెక్టర్ మరియు ముఖ్యమైన యాక్టర్ ఎవరు? గాడ్ ఫాదర్
ముఖ్యమైనవారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఆ తర్వాత మళ్ళీ జగదంబ, జగత్పిత
ఉన్నారు. వారు జగత్తుకు అధిపతులుగా, విశ్వానికి అధిపతులుగా అవుతారు, వారి పాత్ర
తప్పకుండా ఉన్నతమైనది. కావున వారి జీతము కూడా ఉన్నతమైనదే. అందరికన్నా ఉన్నతమైనవారైన
తండ్రియే జీతమును ఇస్తారు. వారు అంటారు, మీరు నాకు ఇంత సహాయం చేస్తున్నారు కావున
మీకు జీతము కూడా తప్పకుండా అంతగా లభిస్తుంది. బ్యారిస్టర్ చదివిస్తే, నేను ఇంత
ఉన్నత పదవిని ప్రాప్తింపజేయిస్తాను అని అంటారు కదా, మరి ఈ చదువుపై పిల్లలు ఎంత
అటెన్షన్ పెట్టాలి. గృహస్థములో కూడా ఉండాలి, కర్మయోగ సన్యాసము కదా. గృహస్థ
వ్యవహారములో ఉంటూ, అన్నీ చేస్తూ తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థము
చేయవచ్చు, ఇందులో కష్టమేమీ లేదు. పనులు చేసుకుంటూ శివబాబా స్మృతిలో ఉండాలి.
జ్ఞానమైతే చాలా సహజమైనది. ఓ పతిత పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి
అని పాడుతారు కూడా. పావన ప్రపంచములోనైతే రాజధాని ఉంటుంది కావున తండ్రి ఆ రాజధానికి
కూడా యోగ్యులుగా తయారుచేస్తున్నారు.
ఈ జ్ఞానములో ముఖ్యముగా రెండు సబ్జెక్టులు ఉన్నాయి - భగవంతుడు మరియు రాజ్యాధికారము.
స్వదర్శన చక్రధారిగా అవ్వండి మరియు తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీరు సదా
ఆరోగ్యవంతులుగా మరియు ఐశ్వర్యవంతులుగా తయారవుతారు. తండ్రి అంటారు, నన్ను అక్కడ
స్మృతి చేయండి. ఇంటిని కూడా స్మృతి చేయండి. నన్ను స్మృతి చేయడం ద్వారా మీరు ఇంటికి
వెళ్ళిపోతారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వడముతో మీరు చక్రవర్తీ రాజులుగా అవుతారు.
ఇది బుద్ధిలో బాగా ఉండాలి. ఈ సమయములోనైతే అందరూ తమోప్రధానులుగా ఉన్నారు. సుఖధామములో
సుఖము, శాంతి, సంపద అన్నీ లభిస్తాయి. అక్కడ ఒకే ధర్మము ఉంటుంది. ఇప్పుడు చూడండి,
ఇంటింటిలో అశాంతి ఉంది. విద్యార్థులు ఎంతగా హంగామా చేస్తారో చూడండి. తమ కొత్త
రక్తాన్ని చూపిస్తారు. ఇది తమోప్రధాన ప్రపంచము, సత్యయుగము కొత్త ప్రపంచము. తండ్రి
సంగమములో వచ్చి ఉన్నారు. మహాభారత యుద్ధము కూడా ఈ సంగమయుగానిదే. ఇప్పుడు ఈ ప్రపంచము
మారనున్నది. తండ్రి కూడా అంటారు, నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి సంగమములో
వస్తాను, దీనినే పురుషోత్తమ సంగమయుగము అని అంటారు. పురుషోత్తమ మాసమును, పురుషోత్తమ
యుగాన్ని కూడా జరుపుకుంటారు. కానీ ఈ పురుషోత్తమ సంగమము గురించి ఎవ్వరికీ తెలియదు.
సంగమములోనే తండ్రి వచ్చి మిమ్మల్ని వజ్రసమానముగా తయారుచేస్తారు. మళ్ళీ ఇందులో కూడా
నంబరువారుగా ఉండనే ఉంటారు. వజ్ర సమానమైన రాజులుగా తయారవుతారు, ప్రజలేమో బంగారములా
తయారవుతారు. పిల్లలు పుట్టిన వెంటనే వారసత్వానికి అధికారులుగా అయిపోతారు. ఇప్పుడు
మీరు పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. మళ్ళీ అందులో ఉన్నత పదవిని పొందేందుకు
పురుషార్థము చేయాలి. ఈ సమయములోని మీ పురుషార్థము కల్ప-కల్పపు పురుషార్థముగా అవుతుంది.
కల్ప-కల్పము వీరు ఇలాగే పురుషార్థము చేస్తారని అర్థం చేసుకోవడం జరుగుతుంది. వీరి
ద్వారా ఇంకా ఎక్కువ పురుషార్థము జరగదు. జన్మ-జన్మాంతరాలు, కల్ప-కల్పాంతరాలు వీరు
ప్రజలలోకే వస్తారు. వీరు షావుకారు ప్రజలకు దాస-దాసీలుగా అవుతారు. నంబరువారుగా అయితే
ఉంటారు కదా. చదువు ఆధారముగా అంతా తెలిసిపోతుంది. రేపు మీరు శరీరము వదిలిస్తే ఈ
పరిస్థితిలో మీరు వెళ్ళి ఏమవుతారు అన్నది బాబా వెంటనే చెప్పగలరు. రోజురోజుకు సమయము
తగ్గిపోతూ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా శరీరము వదిలితే ఇక చదవలేరు, కేవలం కొద్దిగా
బుద్ధిలోకి వస్తుంది, శివబాబాను స్మృతి చేస్తారు. ఉదాహరణకు చిన్న పిల్లలకు కూడా మీరు
గుర్తు చేయిస్తూ ఉంటే శివబాబా, శివబాబా అని అంటూ ఉంటారు, దాని వలన కూడా కొద్దిగా
లభించవచ్చు. చిన్న పిల్లలైతే మహాత్ముల వంటివారు, వారికి వికారాల గురించి తెలియదు.
ఎంతెంతగా పెద్దగా అవుతూ ఉంటారో, అంతగా వికారాల ప్రభావము పడుతూ ఉంటుంది, క్రోధము
వస్తుంది, మోహము వస్తుంది... ఇప్పుడు మీకైతే అర్థం చేయించబడుతుంది - ఈ ప్రపంచములో ఈ
కళ్ళ ద్వారా మీరు ఏవైతే చూస్తారో వాటి నుండి మమకారాన్ని తొలగించివేయాలి. ఇదంతా
శ్మశానగ్రస్తముగా అవ్వనున్నది అని ఆత్మకు తెలుసు. ఇవన్నీ తమోప్రధానమైన వస్తువులు.
మనుష్యులు మరణిస్తే పాత వస్తువులన్నింటినీ కాటికాపరికి ఇచ్చేస్తారు. తండ్రి అయితే
అనంతమైన కాటికాపరి, అలాగే చాకలి కూడా. మీ నుండి తీసుకునేది ఏమిటి మరియు మీకు ఇచ్చేది
ఏమిటి? మీరు ఏదైతే కొద్ది ధనము ఇస్తారో, అది కూడా సమాప్తము అవ్వవలసిందే. అయినా
తండ్రి అంటారు, ఈ ధనాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. కేవలం దాని నుండి మమకారాన్ని
తొలగించండి. లెక్కలను తండ్రికి ఇస్తూ ఉండండి. అప్పుడు మీకు డైరెక్షన్లు లభిస్తూ
ఉంటాయి. మీ వద్ద ఈ విలువలేనివన్నీ ఏవైతే ఉన్నాయో, వీటిని విశ్వవిద్యాలయములో మరియు
హాస్పిటల్ లో, ఆరోగ్యము మరియు సంపద కొరకు ఉపయోగిస్తారు. హాస్పిటళ్ళు రోగుల
కోసముంటాయి, విశ్వవిద్యాలయాలు చదివించడం కోసముంటాయి. ఇక్కడైతే కాలేజీ మరియు
హాస్పిటల్, రెండూ కలిసి ఉన్నాయి. దీని కోసమైతే కేవలం మూడు అడుగుల భూమి కావాలి. ఎవరి
వద్దనైతే ఇంకేమీ లేదో, వారు కేవలం మూడు అడుగుల భూమి ఇవ్వండి. అందులో క్లాస్ పెట్టండి.
మూడు అడుగుల భూమి అంటే అది కేవలం కూర్చునే స్థలము కదా, ఆసనము మూడు అడుగులే ఉంటుంది.
మూడు అడుగుల భూమిపై ఎవరు వచ్చినా, వారు చక్కగా అర్థం చేసుకుని వెళ్తారు. ఎవరైనా
వస్తే, వారిని ఆసనముపై కూర్చోబెట్టి తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. సేవ కోసము
బ్యాడ్జీలు కూడా చాలా తయారుచేయిస్తున్నారు. ఇది చాలా సహజము. చిత్రాలు కూడా
బాగున్నాయి, అందులో పూర్తిగా వివరణ వ్రాసి ఉంది. వీటితో ఎంతో సేవ జరుగుతుంది.
రోజురోజుకు ఎంతగా ఆపదలు వస్తూ ఉంటాయో, అంతగా మనుష్యులకు కూడా వైరాగ్యము కలుగుతుంది
మరియు తండ్రిని స్మృతి చేయడం మొదలుపెడతారు - ఆత్మ అయిన మనము అవినాశీ, మన అవినాశీ
తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి స్వయం అంటారు - నన్ను స్మృతి చేస్తే మీ
జన్మ-జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిపై పూర్తి
ప్రేమ ఉంచాలి. దేహాభిమానములోకి రాకండి. అయితే, బాహ్యమైన ప్రేమను పిల్లలు
మొదలైనవారిపై ఉంచండి కానీ ఆత్మ యొక్క సత్యమైన ప్రేమను ఆత్మిక తండ్రితోనే ఉంచండి.
వారి స్మృతితోనే వికర్మలు వినాశనమవుతాయి. మిత్ర-సంబంధీకులు, పిల్లలు మొదలైన వారిని
చూస్తూ కూడా బుద్ధి తండ్రి స్మృతిలో వేలాడుతూ ఉండాలి. పిల్లలైన మీరు స్మృతి అనే
ఉరితాడుకు వేలాడుతున్నట్లుగా ఉన్నారు. ఆత్మ తన తండ్రి అయిన పరమాత్ముడినే స్మృతి
చేయాలి. బుద్ధి పైన వేలాడుతూ ఉండాలి. తండ్రి ఇల్లు కూడా పైనే ఉంది కదా. మూలవతనము,
సూక్ష్మవతనము మరియు ఇది స్థూలవతనము. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి.
ఇప్పుడు మీ యాత్ర పూర్తి అయ్యింది. మీరు ఇప్పుడు యాత్ర నుండి తిరిగి వస్తున్నారు.
కావున మీ ఇల్లు ఎంత ప్రియమనిపిస్తుంది. అది అనంతమైన ఇల్లు. తిరిగి మన ఇంటికి
వెళ్ళాలి. మనుష్యులు ఇంటికి వెళ్ళేందుకు భక్తి చేస్తారు, కానీ జ్ఞానము పూర్తిగా
లేకపోతే ఇంటికి వెళ్ళలేరు. భగవంతుని వద్దకు వెళ్ళేందుకు మరియు నిర్వాణధామానికి
వెళ్ళేందుకు ఎన్ని తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు, కష్టపడతారు. సన్యాసులు కేవలం
శాంతి మార్గాన్నే తెలియజేస్తారు. వారికి సుఖధామము గురించైతే తెలియనే తెలియదు.
సుఖధామము యొక్క మార్గాన్ని కేవలం తండ్రే తెలియజేస్తారు. మొదట తప్పకుండా
నిర్వాణధామములోకి, వానప్రస్థములోకి వెళ్ళాలి, దానిని బ్రహ్మాండము అని కూడా అంటారు.
వారేమో బ్రహ్మమును ఈశ్వరునిగా భావిస్తూ కూర్చున్నారు. ఆత్మ అయిన మనము బిందువు, మన
నివాస స్థానము బ్రహ్మాండము. మీ పూజ కూడా జరుగుతుంది కదా. ఇప్పుడు బిందువుకు ఎలా పూజ
చేస్తారు. ఎప్పుడైతే పూజ చేస్తారో అప్పుడు సాలిగ్రామాలను తయారుచేసి ఒక్కొక్క ఆత్మను
పూజిస్తారు. బిందువుకు పూజ ఎలా జరుగుతుంది - అందుకే పెద్ద-పెద్దగా తయారుచేస్తారు.
తండ్రికి కూడా తన శరీరమైతే లేదు. ఈ విషయాలు ఇప్పుడు మీకు తెలుసు. చిత్రాలలో కూడా
మీరు పెద్ద రూపాలను చూపించవలసి ఉంటుంది. బిందువు ద్వారా ఎలా అర్థం చేసుకుంటారు?
వాస్తవానికి నక్షత్రములా తయారుచేయాలి. ఇలాంటి ఎన్నో రకాల తిలకాలు కూడా మాతలు
పెట్టుకుంటారు, తయారైనవి తెల్లవి దొరుకుతాయి. ఆత్మ కూడా తెల్లగా ఉంటుంది కదా,
నక్షత్రములా ఉంటుంది. ఇది కూడా ఒక గుర్తు. భృకుటి మధ్యలో ఆత్మ ఉంటుంది. దాని అర్థము
గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇంత చిన ఆత్మలో ఎంత
జ్ఞానము ఉంది. ఎన్ని బాంబులు మొదలైనవి తయారుచేస్తూ ఉంటారు. ఆత్మలో ఇంత పాత్ర నిండి
ఉంది, ఇది ఒక అద్భుతము. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. ఇంత చిన్న ఆత్మ శరీరముతో ఎంత పని
చేస్తుంది. ఆత్మ అవినాశీ, దాని పాత్ర ఎప్పుడూ వినాశనము కాదు, అలాగే పాత్ర మారదు కూడా.
ఇప్పుడు ఇది చాలా పెద్ద వృక్షము. సత్యయుగములో ఎంత చిన్న వృక్షము ఉంటుంది. పాతదైతే
ఉండదు. ఆ మధురమైన చిన్న వృక్షము యొక్క అంటు ఇప్పుడు కట్టబడుతుంది. మీరు పతితముగా
అయ్యారు, ఇప్పుడు మళ్ళీ పావనముగా తయారవుతున్నారు. చిన్న ఆత్మలో ఎంత పాత్ర ఉంది. ఇది
సృష్టి అద్భుతము, అవినాశీ పాత్ర నడుస్తూ ఉంటుంది. ఇది ఎన్నటికీ ఆగదు. అవినాశీ ఆత్మ,
అందులో అవినాశీ పాత్ర నిండి ఉంది. ఇది అద్భుతము కదా. తండ్రి అర్థం చేయిస్తారు -
పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి
చేయండి, ఇందులోనే శ్రమ ఉంది. మీ పాత్రయే ఎక్కువగా ఉంది. బాబాకు మీకు ఉన్నంత పాత్ర
లేదు.
తండ్రి అంటారు, మీరు స్వర్గములో సుఖవంతులుగా తయారయ్యాక నేను విశ్రాంతిలో
కూర్చుంటాను. ఇక నా పాత్ర ఏమీ ఉండదు. ఈ సమయములో ఇంత సేవ చేస్తాను కదా. ఈ జ్ఞానము
ఎంత అద్భుతమైనదంటే ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ కొద్దిగా కూడా తెలియదు. తండ్రి
స్మృతిలో ఉండకపోతే ధారణ కూడా జరగదు. ఆహార-పానీయాలు మొదలైన విషయాలలో తేడా వచ్చినా
కూడా ధారణలో తేడా వచ్చేస్తుంది, ఇందులో పవిత్రత చాలా బాగుండాలి. తండ్రిని స్మృతి
చేయడం చాలా సహజము. తండ్రిని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని పొందాలి, అందుకే బాబా
అన్నారు, మీరు మీ వద్ద కూడా చిత్రాలు పెట్టుకోండి. యోగము మరియు వారసత్వము యొక్క
చిత్రాలను తయారుచేస్తే నషా ఉంటుంది. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారవుతున్నాము,
మళ్ళీ మనమే దేవతల నుండి క్షత్రియులుగా అవుతాము. బ్రాహ్మణులు పురుషోత్తమ సంగమయుగ
వాసులు. మీరు పురుషోత్తములుగా అవుతారు కదా. మనుష్యులకు ఈ విషయాలను బుద్ధిలో
కూర్చోబెట్టడానికి ఎంతగా కష్టపడవలసి వస్తుంది. రోజురోజుకు ఎంతగా జ్ఞానాన్ని అర్థం
చేసుకుంటూ ఉంటారో, అంతగా సంతోషము కూడా పెరుగుతుంది.
బాబా మనకు ఎంతో కళ్యాణము చేస్తారని పిల్లలైన మీకు తెలుసు. కల్ప-కల్పమూ మనది పైకి
ఎక్కే కళ ఉంటుంది. ఇక్కడ ఉంటూ శరీర నిర్వహణార్థము అన్నీ చేయవలసి ఉంటుంది. మేము
శివబాబా భండారా నుండి తింటున్నాము అని బుద్ధిలో ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తూ
ఉన్నట్లయితే కష్టాలు, దుఃఖాలు అన్నీ దూరమైపోతాయి. ఆ తర్వాత ఈ పాత శరీరాన్ని వదలి
వెళ్ళిపోతారు. బాబా ఏమీ తీసుకోరు అని పిల్లలకు తెలుసు. వారు దాత. తండ్రి అంటారు, నా
శ్రీమతముపై నడవండి. మీరు ధనాన్ని ఎవరికి దానము ఇవ్వాలి అన్న విషయముపై పూర్తిగా
అటెన్షన్ ఉంచాలి. ఒకవేళ ఎవరికైనా ధనమిస్తే, వారు వెళ్ళి మద్యం మొదలైనవి త్రాగితే,
చెడు పనులు చేస్తే, దాని పాపము మీపైకి వచ్చేస్తుంది. పాపాత్ములతో
ఇచ్చి-పుచ్చుకోవడాలు చేస్తూ పాపాత్ములుగా అయిపోతారు. ఎంత తేడా ఉంది. పాపాత్ములు,
పాపాత్ములతోనే ఇచ్చి-పుచ్చుకోవడాలు చేసి పాపాత్ములుగా అయిపోతారు. ఇక్కడైతే మీరు
పుణ్యాత్ములుగా తయారవ్వాలి, అందుకే పాపాత్ములతో ఇచ్చి-పుచ్చుకోవడాలు చేయకూడదు.
తండ్రి అంటారు, ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకూడదు, ఎవరిపైనా మోహము పెట్టుకోకూడదు. తండ్రి
కూడా సాక్కిరిన్ (మధురమైన రసము) వలె వస్తారు. పాత విలువలేనివి తీసుకుంటారు, దానికి
ఎంత వడ్డీ ఇస్తారో చూడండి. చాలా భారీ వడ్డీ లభిస్తుంది. తండ్రి ఎంత భోళా, రెండు
పిడికిళ్ళకు బదులుగా మహళ్ళు ఇచ్చేస్తారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.