11-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు, మీ వద్ద జ్ఞాన రత్నాలు ఉన్నాయి, ఈ రత్నాలతోనే మీరు వ్యాపారాన్ని చేయాలి, మీరు ఇక్కడ జ్ఞానాన్ని నేర్చుకుంటారు, భక్తిని కాదు’’

ప్రశ్న:-
మనుష్యులు డ్రామా యొక్క ఏ అద్భుత నిశ్చితాన్ని భగవంతుని లీలగా భావించి వారి మహిమను చేస్తారు?

జవాబు:-
ఎవరు ఎవరి పట్ల భావనను పెట్టుకుంటారో, వారికి వారి యొక్క సాక్షాత్కారము జరుగుతుంది, అప్పుడు - ఇది భగవంతుడు సాక్షాత్కారము చేయించారని వారు భావిస్తారు కానీ జరిగేది అంతా డ్రామానుసారముగానే జరుగుతుంది. ఒకవైపు భగవంతుని మహిమను చేస్తారు, ఇంకొకవైపు సర్వవ్యాపి అంటూ వారిని నిందిస్తారు.

ఓంశాంతి
భగవానువాచ - పిల్లలకు ఇదైతే అర్థం చేయించడం జరిగింది, మనుష్యులను కానీ లేక దేవతలను కానీ భగవంతుడు అని అనరు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అని గాయనం చేస్తారు, ఆ తరువాత శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఇది కూడా మీకు తెలుసు, శివునికి తమదంటూ శరీరము లేదు. మూలవతనములో శివబాబా మరియు సాలిగ్రామాలు ఉంటారు. పిల్లలకు తెలుసు - ఇప్పుడు ఆత్మలైన మనకు తండ్రి చదివిస్తున్నారు, మిగిలిన సత్సంగాలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి అదేమీ సత్యమైన సాంగత్యము కాదు. తండ్రి అంటారు - అదైతే మాయ యొక్క సాంగత్యము. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని అక్కడ ఈ విధంగా ఎవరూ భావించరు. గీతను విన్నప్పుడు కూడా శ్రీకృష్ణ భగవానువాచ అని భావిస్తారు. రోజురోజుకూ గీతా అభ్యాసము తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే తమ ధర్మము గురించే తెలియదు. శ్రీకృష్ణుని పట్ల అందరికీ ప్రేమ ఉంది, శ్రీకృష్ణుడినే ఊయలలో ఊపుతారు. మేము ఎవరిని ఊపుతున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పిల్లలను ఊయలలో ఊపడం జరుగుతుంది, తండ్రినైతే ఊపలేరు. మీరు శివబాబాను ఊయలలో ఊపుతారా? వారు చిన్న బాలకునిగా అయితే అవ్వరు, పునర్జన్మలలోకి రారు. వారైతే బిందువు, వారినేమి ఊపుతారు. శ్రీకృష్ణుని సాక్షాత్కారము చాలా మందికి జరుగుతుంది. శ్రీకృష్ణుడి నోటిలోనైతే పూర్తి విశ్వం ఉంది ఎందుకంటే వారు విశ్వానికి యజమానిగా అవుతారు. అంటే విశ్వము అనే వెన్న ఉంది. పరస్పరంలో వారు ఎవరైతే కోట్లాడుకుంటారో, వారు కూడా సృష్టి రూపీ వెన్న కొరకు కోట్లాడుకుంటారు. మేము విజయం పొందాలని భావిస్తారు. శ్రీకృష్ణుని నోటిలో వెన్న యొక్క గోళాన్ని చూపిస్తారు, ఈ విధంగా కూడా అనేక రకాల సాక్షాత్కారాలు జరుగుతాయి. కానీ అర్థాన్ని ఏమీ కూడా తెలుసుకోరు. ఇక్కడ మీకు సాక్షాత్కారము యొక్క అర్థాన్ని అర్థం చేయించడం జరిగింది. మనుష్యులు - మాకు భగవంతుడే సాక్షాత్కారము చేయిస్తారు అని భావిస్తారు. ఇది కూడా తండ్రి అర్థం చేయిస్తారు - ఎవరినైతే స్మృతి చేస్తారో, ఉదాహరణకు ఎవరైనా శ్రీకృష్ణుని నవ విధ భక్తిని చేసినట్లయితే అల్పకాలికంగా వారి మనోకామన పూర్తవుతాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అంతేకానీ భగవంతుడే సాక్షాత్కారము చేయించారు అని అనరు. ఎవరు ఎవరిని ఏ భావనతో పూజిస్తారో, వారికి వారి యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. భగవంతుడు సాక్షాత్కారము చేయిస్తారు అని ఈ విధంగా వారి మహిమ చేయడం జరిగింది. ఒకవైపు ఇంతగా మహిమ కూడా చేస్తారు, ఇంకొకవైపు రాళ్ళలో-రప్పలలో భగవంతుడు ఉన్నారని అంటారు. ఎంతటి అంధ శ్రద్ధతో కూడిన భక్తిని చేస్తారు. వారు ఏమని భావిస్తారంటే - శ్రీకృష్ణుని సాక్షాత్కారము జరిగింది, ఇక శ్రీకృష్ణపురిలోకి మేము తప్పకుండా వెళ్తాము అని. కానీ శ్రీకృష్ణపురి ఎక్కడి నుండి వచ్చింది? ఈ రహస్యాలన్నీ తండ్రి పిల్లలైన మీకు ఇప్పుడు అర్థం చేయిస్తారు. శ్రీకృష్ణపురి యొక్క స్థాపన జరుగుతోంది. ఇది కంసపురి. కంసుడు, అకాసురుడు, బకాసురుడు, కుంభకర్ణుడు, రావణుడు ఇవన్నీ అసురుల పేర్లు. శాస్త్రాలలో ఏమేమి కూర్చుని వ్రాసారు.

ఇది కూడా అర్థం చేయించాలి - గురువులు రెండు రకాల వారు ఉన్నారు. ఒకరు భక్తి మార్గపు గురువులు, వారు భక్తినే నేర్పిస్తారు. ఈ తండ్రి అయితే జ్ఞానసాగరుడు, వీరిని సద్గురువు అని అంటారు. వీరు ఎప్పుడూ భక్తిని నేర్పించరు, జ్ఞానాన్నే నేర్పిస్తారు. మనుష్యులైతే భక్తిలో ఎంతగా సంతోషిస్తారు, తాళాలు వాయిస్తారు, బెనారస్ లో మీరు చూస్తే - దేవతలందరి యొక్క మందిరాలను తయారుచేసారు. ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించిన దుకాణాలు, భక్తి యొక్క వ్యాపారము. పిల్లలైన మీ వ్యాపారము జ్ఞాన రత్నాలకు సంబంధించినది, దీనిని కూడా వ్యాపారము అని అంటారు. తండ్రి కూడా రత్నాల వ్యాపారియే. ఈ రత్నాలు ఏమిటి అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఈ విషయాలను ఎవరైతే కల్పపూర్వము అర్థం చేసుకున్నారో, వారే అర్థం చేసుకుంటారు, ఇతరులు అర్థమే చేసుకోలేరు. పెద్ద-పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారు చివర్లో వచ్చి అర్థం చేసుకుంటారు. కన్వర్ట్ (బదిలీ) కూడా అయ్యారు కదా. జనక మహారాజు కథ ఒకటి వినిపిస్తారు. జనకుడు మళ్ళీ అను జనకునిగా అయ్యారు. ఏ విధంగానైతే ఎవరిదైనా శ్రీకృష్ణ అని పేరు ఉంటే, మీరు అను దైవీ శ్రీకృష్ణుడిగా అవుతారు అని అంటారు. ఆ సర్వగుణ సంపన్నుడైన శ్రీకృష్ణుడు ఎక్కడ, వీరు ఎక్కడ! ఎవరిదైనా లక్ష్మి అన్న పేరు ఉంటుంది, ఆమె ఈ లక్ష్మీ-నారాయణుల ఎదురుగా వెళ్ళి మహిమ చేస్తారు. వీరిలో మరియు నాలో తేడా ఎందుకు ఉంది అన్నదైతే అర్థం చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు - ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానము లభించింది. మీరే 84 జన్మలు తీసుకుంటారు. ఈ చక్రము అనేక సార్లు తిరుగుతూ వచ్చింది. ఇది ఎప్పటికీ ఆగిపోదు. మీరు ఈ నాటకంలోని పాత్రధారులు. మేము ఈ నాటకంలో పాత్రను అభినయించడానికి వచ్చాము అని మనుష్యులు ఇంతైతే తప్పకుండా అర్థం చేసుకుంటారు. కానీ డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలియదు.

పిల్లలైన మీకు తెలుసు - ఆత్మలమైన మేము నివసించే స్థానము అన్నింటికన్నా అతీతమైనది. అక్కడ సూర్య-చంద్రాదుల ప్రకాశము కూడా ఉండదు. ఇవన్నీ అర్థం చేసుకునే పిల్లలు కూడా ఎక్కువగా సాధారణమైనవారు, పేదవారే అవుతారు ఎందుకంటే భారత్ యే అన్నింటికన్నా షావుకారుగా ఉండేది, ఇప్పుడు భారత్ యే అన్నింటికన్నా నిరుపేదగా అయిపోయింది. మొత్తం ఆట అంతా భారత్ కు సంబంధించినదే. భారత్ వంటి పావన ఖండము ఇంకొకటి ఉండదు. పావన ప్రపంచములో పావన ఖండము ఉంటుంది, ఇతర ఖండాలేవీ అక్కడ ఉండవు. బాబా అర్థం చేయించారు - ఈ ప్రపంచమంతా ఒక అనంతమైన ద్వీపము. ఏ విధంగా లంక ఒక ద్వీపము. రావణుడు లంకలో ఉన్నట్లుగా చూపిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు - రావణ రాజ్యము మొత్తం ఈ అనంతమైన లంకపై ఉంది. ఈ సృష్టి అంతా సముద్రముపై నిలబడి ఉంది. ఇది ద్వీపము. దీనిపై రావణ రాజ్యము ఉంది. ఈ సీతలందరూ రావణుడి జైలులో ఉన్నారు. వారైతే హద్దులోని కథలను తయారుచేసారు. కానీ ఇదంతా అనంతమైన విషయము. ఇది అనంతమైన నాటకము, ఇందులోనే మళ్ళీ చిన్న-చిన్న నాటకాలను కూర్చొని తయారుచేసారు. ఈ సినిమాలు మొదలైనవి కూడా ఇప్పుడే తయారయ్యాయి, కావున తండ్రికి కూడా అర్థం చేయించడం సహజమవుతుంది. అనంతమైన డ్రామా అంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మూలవతనము, సూక్ష్మవతనము ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మీకు తెలుసు - ఆత్మలమైన మనము మూలవతన నివాసులము. దేవతలు సూక్ష్మవతన వాసులు, వారిని ఫరిశ్తా అని కూడా అంటారు. అక్కడ ఎముకలు, మాంసము యొక్క పంజరము ఉండదు. ఈ సూక్ష్మవతనము యొక్క పాత్ర కూడా కొద్ది సమయము కొరకే ఉంది. ఇప్పుడు మీరు వస్తూ-వెళ్తూ ఉంటారు, ఆ తరువాత ఇంకెప్పుడూ వెళ్ళరు. ఆత్మలైన మీరు మూలవతనము నుండి వచ్చేటప్పుడు సూక్ష్మవతనము మీదుగా రారు, నేరుగా వస్తారు. ఇప్పుడు సూక్ష్మవతనము మీదుగా వెళ్తారు. ఇప్పుడు సూక్ష్మవతనము యొక్క పాత్ర ఉంది. ఈ రహస్యాలన్నీ పిల్లలకు అర్థం చేయిస్తారు. నేను ఆత్మలకు అర్థం చేయిస్తున్నాను అని తండ్రికి తెలుసు. సాధువులు-సన్యాసులు మొదలైన వారెవ్వరికీ కూడా ఈ విషయాల గురించి తెలియదు. వారెప్పుడూ ఇటువంటి మాటలు మాట్లాడలేరు. తండ్రియే పిల్లలతో మాట్లాడుతారు. ఇంద్రియాలు లేకుండానైతే మాట్లాడలేరు. వారు అంటారు - నేను ఈ శరీరం యొక్క ఆధారాన్ని తీసుకొని పిల్లలైన మిమ్మల్ని చదివిస్తాను. ఆత్మలైన మీ దృష్టి కూడా తండ్రి వైపుకు వెళ్తుంది. ఇవన్నీ కొత్త విషయాలు. నిరాకారుడైన తండ్రి, వారి పేరు శివబాబా. ఆత్మలైన మీ పేరైతే ఆత్మనే. మీ శరీరాల పేర్లు మారుతాయి. మనుష్యులు అంటారు - పరమాత్మ నామ-రూపాలకు అతీతుడు అని, కానీ వారి పేరైతే శివ అనే అంటారు కదా. శివుని యొక్క పూజను కూడా చేస్తారు. ఒకటి అనుకుంటారు, ఇంకొకటి చేస్తారు. ఇప్పుడు మీరు తండ్రి యొక్క నామ, రూప, దేశ, కాలాల గురించి కూడా అర్థం చేసుకున్నారు. మీకు తెలుసు - ఏ వస్తువు కూడా నామ-రూపాలు లేకుండా ఉండదు. ఇది కూడా చాలా లోతుగా అర్థం చేసుకోవలసిన విషయము. తండ్రి అర్థం చేయిస్తారు - క్షణములో జీవన్ముక్తి అనగా మనుష్యులు నరుని నుండి నారాయణునిగా అవ్వగలరు అన్న గాయనం కూడా ఉంది. తండ్రి హెవెన్లీ గాడ్ ఫాదర్ అన్నప్పుడు, మనము వారికి పిల్లలుగా అయ్యాము అంటే స్వర్గానికి యజమానులుగా అయినట్లే. కానీ ఇది కూడా అర్థం చేసుకోరు. తండ్రి అంటారు - పిల్లలూ, మీ లక్ష్యము-ఉద్దేశ్యమే ఇది, నరుని నుండి నారాయణునిగా అవ్వడము. ఇది రాజయోగము కదా. ఎంతో మందికి చతుర్భుజుని సాక్షాత్కారము జరుగుతుంది, దీనితో - మనము విష్ణుపురికి యజమానులుగా అవ్వనున్నాము అని నిరూపణ అవుతుంది. మీకు తెలుసు - స్వర్గములో కూడా లక్ష్మీ-నారాయణుల సింహాసనము వెనుక విష్ణువు చిత్రాన్ని పెడతారు అనగా విష్ణుపురిలో వీరి రాజ్యము ఉంది అని. ఈ లక్ష్మీ-నారాయణులు విష్ణుపురికి యజమానులు. అది శ్రీకృష్ణపురి, ఇది కంసపురి. డ్రామానుసారముగా ఈ పేర్లు కూడా పెట్టడం జరిగింది. తండ్రి అర్థం చేయిస్తారు - నా రూపము చాలా సూక్ష్మమైనది. ఎవ్వరూ తెలుసుకోలేరు. ఆత్మ ఒక నక్షత్రము అని అంటారు కానీ మళ్ళీ లింగాన్ని తయారుచేస్తారు. లేకపోతే పూజ ఎలా జరుగుతుంది. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు అంగుష్ట రూపంలో సాలిగ్రామాలను తయారుచేస్తారు. ఇంకొకవైపు వారిని అద్భుతమైన నక్షత్రము అని అంటారు. ఆత్మను చూసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తారు కానీ ఎవ్వరూ కూడా చూడలేరు. రామకృష్ణ, వివేకానంద గురించి కూడా చూపిస్తారు కదా, వివేకానందుడు చూసారు - ఆత్మ వారి నుండి (రామకృష్ణుడి నుండి) బయటికి వచ్చి అతనిలో కలిసిపోయింది. ఇప్పుడు అతనికి ఎవరి సాక్షాత్కారము జరిగి ఉంటుంది? ఆత్మ పరమాత్మల రూపమైతే ఒకటే. బిందువును చూస్తారు, ఏమీ అర్థం చేసుకోరు. ఆత్మ సాక్షాత్కారాన్ని ఎవ్వరూ కోరుకోరు. పరమాత్ముని సాక్షాత్కారము జరగాలని కోరుకుంటారు. గురువు ద్వారా పరమాత్ముని సాక్షాత్కారము జరగాలని అతను కూర్చున్నారు. అంతే, ఒక జ్యోతి ఉంది, అది నాలో కలిసిపోయింది అని అన్నారు. ఇందులోనే అతను ఎంతో సంతోషించారు. ఇదే పరమాత్ముని రూపము అని భావించారు. భగవంతుని సాక్షాత్కారము కలగాలని గురువు పట్ల భావన ఉంటుంది. కానీ ఏమి అర్థమే చేసుకోరు. భక్తి మార్గములో ఎవరు అర్థం చేయించాలి? ఇప్పుడు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు - ఏయే రూపాలలో ఏ విధమైన భావనను పెట్టుకుంటారో, ఏ ముఖాన్ని చూస్తారో, ఆ సాక్షాత్కారము జరుగుతుంది. ఉదాహరణకు ఎవరైనా గణేశుడిని ఎక్కువగా పూజిస్తే, అప్పుడు వారు చైతన్య రూపములో సాక్షాత్కారమవుతారు. లేకపోతే వారికి నిశ్చయము ఎలా ఏర్పడుతుంది? తేజోమయ రూపాన్ని చూసి, మేము భగవంతుని సాక్షాత్కారము చేసుకున్నాము అని భావిస్తారు. అందులోనే సంతోషిస్తారు. ఇదంతా భక్తి మార్గము, దిగే కళ. మొదటి జన్మ బాగుంటుంది, ఆ తరువాత కళలు తగ్గుతూ-తగ్గుతూ సమాప్తమవుతాయి. పిల్లలే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు, ఎవరికైతే కల్ప పూర్వము జ్ఞానాన్ని అర్థం చేయించానో, వారికే ఇప్పుడు అర్థం చేయిస్తున్నాను. కల్ప పూర్వము వారే వస్తారు, ఇక మిగిలిన వారి ధర్మాలే వేరు. తండ్రి అర్థం చేయిస్తారు - ఒక్కొక్క చిత్రములో భగవానువాచ అని వ్రాయండి. చాలా యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది. భగవానువాచ ఉంది కదా - యాదవులు, కౌరవులు మరియు పాండవులు ఏమేమి చేసి వెళ్ళారు, వారిదే ఈ చిత్రము. ఇలా అడగండి - మీరు చెప్పండి, మీ తండ్రి గురించి తెలుసా? తెలియకపోతే తండ్రి పట్ల ప్రీతి లేనట్లే కదా, అంటే విపరీత బుద్ధి కలవారిగా అయినట్లు. తండ్రి పట్ల ప్రీతి లేకపోతే వినాశనమైపోతారు. ప్రీతి బుద్ధి విజయంతి, సత్యమేవ జయతే - దీని అర్థము కూడా సరైనది. తండ్రి స్మృతియే లేకపోతే విజయాన్ని పొందలేరు.

ఇప్పుడు మీరు నిరూపించి తెలియజేస్తారు - గీత శివ భగవానుడు వినిపించారు. వారే బ్రహ్మా ద్వారా రాజయోగాన్ని నేర్పించారు. ఇక్కడ, గీత శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించినదిగా భావించి ప్రమాణం చేస్తారు. వారిని అడగాలి - శ్రీకృష్ణుడిని సాక్షిగా భావించాలా లేక భగవంతుడినా? ఈశ్వరుడిని సాక్షిగా భావించి సత్యము చెప్పండి అని అంటారు. ఇది గందరగోళం అయింది కదా. కావున ప్రతిజ్ఞ కూడా అసత్యము అయిపోతుంది. సేవ చేసే పిల్లలకు గుప్తమైన నషా ఉండాలి. నషాతో అర్థం చేయిస్తే సఫలత ఉంటుంది. మీ ఈ చదువు కూడా గుప్తమైనది, చదివించేవారు కూడా గుప్తమైనవారు. మీకు తెలుసు - మేము కొత్త ప్రపంచములోకి వెళ్ళి ఈ విధంగా తయారవుతాము. మహాభారత యుద్ధము తరువాత కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. పిల్లలకు ఇప్పుడు జ్ఞానము లభించింది. అది కూడా నంబరువారుగా ధారణ చేస్తారు. యోగములో కూడా నంబరువారుగా ఉంటారు. ఇది కూడా పరిశీలించుకోవాలి - నేను ఎంతగా స్మృతిలో ఉంటున్నాను? తండ్రి అంటారు - ఇప్పటి మీ ఈ పురుషార్థము భవిష్య 21 జన్మల కొరకు ఉంటుంది. ఇప్పుడు ఫెయిల్ అయితే కల్ప-కల్పాంతరాలూ ఫెయిల్ అవుతూ ఉంటారు, ఉన్నత పదవిని పొందలేరు. ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థము చేయాలి. ఇటువంటి వారు కూడా కొందరు సెంటర్లకు వస్తారు, వారు వికారాలలోకి వెళ్తూ ఉంటారు మరియు సెంటర్లకు కూడా వస్తూ ఉంటారు. ఈశ్వరుడైతే అన్నీ చూస్తారు, వారికి అంతా తెలుసు అని భావిస్తారు. ఇది కూర్చొని చూసేందుకు ఇప్పుడు తండ్రికేమి అవసరము ఉంది. మీరు అబద్ధాలు చెప్తే, వికర్మలు చేస్తే స్వయాన్నే నష్టపరుచుకుంటారు. నల్ల ముఖం చేసుకున్నట్లయితే ఉన్నత పదవిని పొందలేను అనైతే మీరు కూడా అర్థం చేసుకుంటారు. కావున తండ్రికి తెలిసినా కూడా విషయమైతే ఒక్కటే. వారికేమి అవసరము. మీ మనసు తినాలి - నేను ఇటువంటి కర్మలు చేయడం వలన దుర్గతిని పొందుతాను అని. బాబా ఎందుకు చెప్పాలి? ఒకవేళ డ్రామాలో ఉంటే చెప్తారు కూడా. బాబా నుండి దాచి పెట్టడం అనగా స్వయాన్ని సర్వనాశనం చేసుకోవడము. పావనంగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి, మీకు ఇదే చింత ఉండాలి - మేము మంచి రీతిలో చదువుకొని ఉన్నత పదవి పొందాలి. ఎవరైనా చనిపోయారా లేక బ్రతికి ఉన్నారా, వారి గురించి చింతించకూడదు. తండ్రి నుండి వారసత్వాన్ని ఎలా తీసుకోవాలి అన్న చింత పెట్టుకోవాలి. కావున ఎవరికైనా క్లుప్తంగా అర్థం చేయించాలి. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. గుప్తమైన నషాలో ఉంటూ సేవ చేయాలి. మనసు తింటూ ఉండేటువంటి కర్మలేవీ చేయకూడదు. స్వయాన్ని పరిశీలించుకోవాలి - నేను ఎంతగా స్మృతిలో ఉంటున్నాను?

2. సదా ఇదే చింత ఉండాలి - మేము మంచి రీతిలో చదువుకుని ఉన్నత పదవిని పొందాలి. ఏవైనా వికర్మలు చేసి లేక అబద్ధాలు చెప్పి స్వయాన్ని నష్టపరచుకోకూడదు.

వరదానము:-
మన్మనాభవ అనే మహామంత్రం ద్వారా సర్వ దుఃఖాల నుండి అతీతంగా ఉండే సదా సుఖ స్వరూప భవ

ఎప్పుడైనా ఏ రకమైన దుఃఖం వచ్చినా, మంత్రాన్ని తీసుకోండి, దానితో దుఃఖం పారిపోతుంది. స్వప్నంలో కూడా ఏ మాత్రమూ దుఃఖం అనుభవమవ్వకూడదు, తనువు అనారోగ్యంతో ఉన్నా, ధనం కిందా-మీదా అయినా, ఏమి జరిగినా కానీ దుఃఖపు అల లోపలకి రాకూడదు. ఏ విధంగా సాగరంలో అలలు వస్తాయి మరియు వెళ్ళిపోతాయి కానీ ఎవరికైతే ఆ అలలలో తేలియాడడం వస్తుందో, వారు అందులో సుఖాన్ని అనుభవం చేస్తారు, అలను జంప్ చేసి ఎలా దాటేస్తారు అంటే, ఆట ఆడుతున్నట్లుగా ఉంటారు. కావున సాగరుని పిల్లలైన మీరు సుఖ స్వరూపులు, దుఃఖపు అల కూడా రాకూడదు.

స్లోగన్:-
ప్రతి సంకల్పంలో దృఢత యొక్క విశేషతను ప్రాక్టికల్ లోకి తీసుకురండి, అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది.

అవ్యక్త సూచనలు: ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

స్వ ఉన్నతిలో, సేవా ఉన్నతిలో ఒకరు చెప్పారు, ఇంకొకరు హాజీ అన్నారు, ఇలా సదా ఏకత మరియు దృఢతతో ముందుకు వెళ్తూ ఉండండి. ఏ విధంగానైతే దాదీల ఏకత మరియు దృఢతతో కూడిన సంగఠన పక్కాగా ఉందో, అలా ఆది సేవా రత్నాల సంగఠన పక్కాగా ఉండాలి, ఇది చాలా-చాలా అవసరము.