ఓంశాంతి
తండ్రి నుండి ఇప్పుడు అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి అని ప్రదర్శనీలలో లేక మేళాలలో
షో చూపిస్తారు లేదా చిత్రాలపై మనుష్యులకు అర్థం చేయిస్తారని ఆత్మిక తండ్రి అర్థం
చేయిస్తున్నారు, ఇది ఆత్మిక పిల్లలకు తెలుసు. అది ఏ వారసత్వము? మనుష్యుల నుండి
దేవతలుగా ఎలా అవుతారు మరియు అర్ధకల్పము కోసం అనంతమైన తండ్రి నుండి స్వర్గ రాజ్యాన్ని
ఎలా తీసుకోవాలి అనేది అర్థం చేయించాలి. తండ్రి అయితే వ్యాపారస్థుడే, వారితో ఈ
ఒప్పందము చేసుకోవాలి. దేవీ-దేవతలు పవిత్రముగా ఉంటారు అన్నదైతే మనుష్యులకు తెలుసు.
భారత్ లో సత్యయుగము ఉన్నప్పుడు దేవీ-దేవతలు పవిత్రముగా ఉండేవారు. స్వర్గము కోసం
తప్పకుండా వారు ఏదో ప్రాప్తిని పొంది ఉంటారు. స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి తప్ప
ఇంకెవ్వరూ ప్రాప్తిని కలిగించలేరు. పతిత-పావనుడైన తండ్రియే పతితులను పావనముగా
తయారుచేసి పావన ప్రపంచము యొక్క రాజ్యాన్ని ఇచ్చేవారు. ఎంత సులువైన ఒప్పందము
అందిస్తున్నారు. ఇది మీ అంతిమ జన్మ అని కేవలం ఇదే చెప్తారు. ఎప్పటివరకైతే నేను
ఇక్కడ ఉంటానో, అప్పటివరకు పవిత్రముగా అవ్వండి. నేను పవిత్రముగా తయారుచేయడానికి
వచ్చాను. మీరు ఈ అంతిమ జన్మలో పావనముగా అయ్యే పురుషార్థము చేసినట్లయితే పావన
ప్రపంచము యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఇది చాలా సులువైన ఒప్పందము. కావున బాబాకు
ఆలోచన వచ్చింది, పవిత్రముగా అవ్వండి అనేది తండ్రి ఆజ్ఞ అని పిల్లలకు అర్థం చేయించాలి
అని. ఇది పవిత్రముగా తయారయ్యేందుకు పురుషోత్తమ సంగమయుగము. ఉత్తమోత్తమ పురుషులు
దేవతలే. లక్ష్మీ-నారాయణుల రాజ్యము నడిచింది కదా. తండ్రి మతముపై ఈ అంతిమ జన్మ
పవిత్రముగా అయినట్లయితే దేవతా ప్రపంచపు రాజ్యాధికారము మీకు తండ్రి నుండి వారసత్వముగా
లభించగలదు. యోగబలముతో స్వయాన్ని తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఎలా
తయారుచేసుకోవాలి అనే యుక్తిని కూడా తెలియజేస్తారు. పిల్లలు కళ్యాణము కోసం ఖర్చు
అయితే చేయవలసిందే. ఖర్చు లేకుండా రాజధాని స్థాపన అవ్వలేదు. ఇప్పుడు
లక్ష్మీ-నారాయణుల రాజధాని స్థాపనవుతోంది. పిల్లలు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి.
మనసా-వాచా-కర్మణా ఎటువంటి తప్పుడు కర్మలు చేయకూడదు. దేవతలకు ఎప్పుడూ ఎటువంటి చెడు
ఆలోచనలు కూడా రావు. నోటి నుండి అలాంటి, ఇలాంటి మాటలేవీ వెలువడవు. వారు ఉన్నదే
సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మర్యాదా పురుషోత్తములు... ఎవరైతే ఉండి
వెళ్తారో, వారి మహిమ గాయనము చేయబడుతుంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని కూడా అటువంటి
దేవీ-దేవతలుగా తయారుచేయడానికే వచ్చాను. కావున మనసా-వాచా-కర్మణా ఎటువంటి చెడు కర్మలు
చేయకూడదు. దేవతలు సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు, ఈ గుణాలను కూడా మీరు ఇప్పుడే
ధారణ చేయగలరు ఎందుకంటే ఈ మృత్యులోకములో మీకు ఇది అంతిమ జన్మ. పతిత ప్రపంచాన్ని
మృత్యులోకమని, పావన ప్రపంచాన్ని అమరలోకమని అంటారు. ఇప్పుడు మృత్యులోకము యొక్క
వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. తప్పకుండా అమరపురి యొక్క స్థాపన జరుగుతూ ఉండవచ్చు.
ఇది అదే మహాభారీ మహాభారత యుద్ధము, దీనినే శాస్త్రాలలో చూపించారు, దీనితో పాత వికారీ
ప్రపంచము సమాప్తమవుతుంది. కానీ ఈ జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. తండ్రి అంటారు, అందరూ
అజ్ఞాన నిద్రలో నిద్రపోతూ ఉన్నారు. 5 వికారాల నషా ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు,
పవిత్రముగా అవ్వండి. మాస్టర్ గాడ్ గా అయితే అవుతారు కదా. లక్ష్మీ-నారాయణులను
గాడ్-గాడెస్ అని అంటారు అంటే వారు గాడ్ ద్వారా ఈ వారసత్వాన్ని పొందారు. ఇప్పుడైతే
భారత్ పతితముగా ఉంది. మనసా-వాచా-కర్మణా కర్తవ్యాలు కూడా అలాగే ఉంటాయి. ఏ విషయమైనా
మొదట బుద్ధిలోకి వస్తుంది, ఆ తర్వాత నోటి నుండి వెలువడుతుంది. కర్మణాలోకి
వచ్చినట్లయితే అది వికర్మగా అవుతుంది. తండ్రి అంటారు, అక్కడ ఎటువంటి వికర్మలు జరగవు,
ఇక్కడ వికర్మలు జరుగుతాయి ఎందుకంటే ఇది రావణ రాజ్యము. ఇప్పుడు తండ్రి అంటారు,
మిగిలిన ఆయువు అంతా పవిత్రముగా ఉండండి. ప్రతిజ్ఞ చేయాలి, పవిత్రముగా అయ్యి నాతో
బుద్ధియోగాన్ని కూడా జోడించాలి, దీనితో మీ జన్మ-జన్మాంతరాల పాపాలు కూడా తొలగిపోతాయి,
అప్పుడే మీరు 21 జన్మల కొరకు స్వర్గానికి యజమానులుగా అవుతారు. బాబా ఆఫర్
చేస్తున్నారు. వీరి ద్వారా తండ్రి ఈ వారసత్వాన్ని ఇస్తున్నారని అర్థం చేయిస్తూ
ఉంటారు. వారు శివబాబా, వీరు దాదా, అందుకే సదా బాప్ దాదా అనే అంటారు. శివబాబా,
బ్రహ్మా దాదా. తండ్రి ఎంతటి ఒప్పందాన్ని అందిస్తున్నారు. మృత్యులోక వినాశనము ఎదురుగా
నిలబడి ఉంది. అమరలోక స్థాపన జరుగుతోంది. భారతవాసుల కళ్యాణము జరగాలనే ప్రదర్శనీలను
మరియు మేళాలను నిర్వహిస్తారు. తండ్రియే వచ్చి భారత్ ను రామ రాజ్యముగా తయారుచేస్తారు.
రామ రాజ్యములో తప్పకుండా పవిత్రమైనవారే ఉంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, కామము
మహాశత్రువు. ఈ 5 వికారాలనే మాయ అని అంటారు. వీటిపై విజయము పొందినట్లయితే మీరు జగత్
జీతులుగా అవుతారు. జగత్ జీతులు దేవీ-దేవతలే, ఇంకెవ్వరూ జగత్ జీతులుగా అవ్వలేరు. బాబా
అర్థం చేయించారు - క్రిస్టియన్లు ఒకవేళ పరస్పరములో ఒక్కటైతే మొత్తం సృష్టి యొక్క
రాజ్యాన్ని తీసుకోగలరు. కానీ నియమము లేదు. ఈ బాంబులు పాత ప్రపంచాన్ని సమాప్తము
చేసేందుకే ఉన్నాయి. కల్ప-కల్పము ఈ విధముగా కొత్త ప్రపంచము నుండి పాతదిగా, పాతదాని
నుండి కొత్తదిగా అవుతుంది. కొత్త ప్రపంచములో ఉన్నది ఈశ్వరీయ రాజ్యము, దానిని రామ
రాజ్యమని అంటారు. ఈశ్వరుడిని తెలుసుకోని కారణముగా రామ-రామ అని అలాగే జపిస్తూ ఉంటారు.
కనుక పిల్లలైన మీ లోపల ఈ విషయాలు ధారణ అవ్వాలి. తప్పకుండా మనము 84 జన్మలలో
సతోప్రధానము నుండి తమోప్రధాముగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా తప్పకుండా
అవ్వాలి. ఇది శివబాబా డైరెక్షన్, ఇప్పుడు దానిపై నడిచినట్లయితే 21 జన్మల కోసం
పవిత్ర ప్రపంచములో ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడిక పురుషార్థము చేస్తారా, చేయరా,
స్మృతిలో ఉంటూ ఇతరులకు మార్గాన్ని తెలియజేస్తారా, తెలియజేయరా, మీ ఇష్టము.
ప్రదర్శనీల ద్వారా పిల్లలు చాలామందికి మార్గాన్ని తెలియజేస్తున్నారు. స్వయము యొక్క
కళ్యాణము కూడా చేసుకోవాలి. ఇది చాలా సులువైన ఒప్పందము. కేవలం ఈ అంతిమ జన్మ
పవిత్రముగా ఉన్నట్లయితే, శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే మీరు తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అయిపోతారు. ఇది ఎంత సులువైన ఒప్పందము. జీవితమే పూర్తిగా పరివర్తన
అయిపోతుంది. ఈ విధముగా ఆలోచించాలి. బాబా వద్దకు సమాచారము వస్తూ ఉంటుంది - రాఖీ
కట్టడానికి వెళ్ళినప్పుడు కొంతమంది అన్నారు, ఈ సమయములో తమోప్రధాన ప్రపంచము
ఉన్నప్పుడు, ఇందులో పవిత్రముగా ఉండడము అసంభవము. ఇప్పుడిది సంగమయుగమని, తండ్రియే
పవిత్రముగా తయారుచేస్తారని, వీరికి సహాయకులు పరమపిత పరమాత్మ అని పాపం వారికి తెలియదు.
ఇక్కడ చాలా భారీ ఆకర్షణ ఉందని వారికి తెలియనే తెలియదు. పవిత్రముగా అయినట్లయితే
పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వడము జరుగుతుంది. తండ్రి అంటారు, ఈ మాయా రూపీ 5
వికారాలపై విజయము పొందినట్లయితే మీరు జగత్ జీతులుగా అవుతారు. కావున మనము పవిత్రముగా
ఎందుకు అవ్వము. ఇది ఫస్ట్ క్లాస్ ఒప్పందము. తండ్రి అంటారు, కామము మహాశత్రువు, దీనిపై
విజయము పొందినట్లయితే మీరు పవిత్రముగా అవుతారు. మాయాజీతులే జగత్ జీతులు. ఇది
యోగబలముతో మాయను జయించే విషయము. పరమపిత పరమాత్మయే వచ్చి ఆత్మలకు అర్థం
చేయిస్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది, మీరు
సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు. తండ్రి సంగమములో వారసత్వాన్ని ఇస్తారు.
అందరికన్నా ఉత్తమ పురుషులుగా ఈ లక్ష్మీ-నారాయణులు ఉండేవారు, వీరినే మర్యాదా
పురుషోత్తములని, దేవీ-దేవతా ధర్మానికి చెందినవారని అంటారు. వాస్తవానికి చాలా మంచి
రీతిలో అర్థం చేయించడము జరుగుతుంది కానీ అప్పుడప్పుడు ఈ పాయింట్లను మర్చిపోతారు.
భాషణలో ఫలానా పాయింట్లు అర్థం చేయించలేదే అని తర్వాత మళ్ళీ ఆలోచన వస్తుంది. అర్థం
చేయించవలసిన పాయింట్లు అయితే ఎన్నో ఉన్నాయి. ఈ విధముగా జరుగుతూ ఉంటుంది. న్యాయవాదులు
కూడా కొన్ని-కొన్ని పాయింట్లను మర్చిపోతారు. ఆ పాయింట్లు తర్వాత గుర్తుకొచ్చినప్పుడు
మళ్ళీ వాదిస్తారు. డాక్టర్ల విషయములో కూడా అలాగే జరుగుతుంది. ఈ వ్యాధికి ఈ మందు
సరైనదేనా అని ఆలోచన నడుస్తుంది. ఇక్కడ కూడా పాయింట్లు అయితే లెక్కలేనన్ని ఉన్నాయి.
బాబా అంటున్నారు, ఈ రోజు మీకు గుహ్యమైన పాయింట్లను అర్థం చేయిస్తాను. కానీ అర్థం
చేసుకునేవారంతా పతితులే. ఓ పతిత-పావనా... అని అంటారు కూడా. కానీ ఎవరినైనా పతితులు
అని అంటే డిస్టర్బ్ అవుతారు. ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని
ఈశ్వరుని ఎదురుగా సత్యము చెప్తారు. ఈశ్వరుడిని మర్చిపోతే మళ్ళీ అసత్యము చెప్తారు.
అందుకే చాలా యుక్తిగా అర్థం చేయించాలి, కర్ర విరగకూడదు కానీ పాము చనిపోవాలి. తండ్రి
అంటారు, ఎలుక నుండి గుణాన్ని గ్రహించండి. ఎలుక ఎంత యుక్తిగా కరుస్తుందంటే రక్తము
కూడా వస్తుంది కానీ అస్సలు తెలియదు. కావున పిల్లల బుద్ధిలో అన్ని పాయింట్లు ఉండాలి.
యోగములో ఉండేవారికి సమయానికి సహాయము లభిస్తుంది. వినిపించేవారి కన్నా వినేవారు
తండ్రికి ఎక్కువ ప్రియముగా ఉండవచ్చు. అప్పుడు తండ్రి స్వయంగా కూర్చునైనా అర్థం
చేయించేస్తారు. ఏ విధముగా అర్థం చేయించాలంటే - పవిత్రముగా అవ్వడమనేది చాలా మంచిదని
వారు అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క జన్మ పవిత్రముగా ఉన్నట్లయితే మనము 21 జన్మలకు పవిత్ర
ప్రపంచానికి యజమానులుగా అవుతాము. భగవానువాచ - ఈ అంతిమ జన్మ పవిత్రముగా అవ్వండి,
అప్పుడు నేను గ్యారెంటీ ఇస్తున్నాను - డ్రామా ప్లాన్ అనుసారముగా మీరు 21 జన్మల కొరకు
వారసత్వాన్ని పొందగలుగుతారు. మనము కల్ప-కల్పము వారసత్వాన్ని పొందుతూ ఉంటాము. సేవ
పట్ల ఎవరికైతే అభిరుచి ఉంటుందో, వారు - మేము వెళ్ళి అర్థం చేయించాలి అని భావిస్తారు.
పరుగెత్తవలసి ఉంటుంది. తండ్రి అయితే జ్ఞానసాగరుడు, వారు ఎంతగా జ్ఞాన వర్షాన్ని
కురిపిస్తూ ఉంటారు. ఎవరి ఆత్మ అయితే పవిత్రముగా ఉంటుందో, వారికి ధారణ కూడా
జరుగుతుంది. అటువంటి వారి పేర్లు ప్రఖ్యాతి చెందుతాయి. ఎవరు ఎలాంటి సేవ చేస్తున్నారు
అనేది ప్రదర్శనీలు మరియు మేళాల ద్వారా తెలిసిపోతుంది. ఎవరు ఎలా అర్థం చేయిస్తారు
అనేది టీచర్లు చెక్ చేయాలి. చాలా వరకు లక్ష్మీ-నారాయణుల చిత్రము మరియు మెట్ల వరుస
చిత్రముపై అర్థం చేయించడము మంచిది. యోగబలము ద్వారా మళ్ళీ ఈ విధముగా
లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. లక్ష్మీ-నారాయణులే ఆదిదేవ్, ఆదిదేవి. చతుర్భుజునిలో
లక్ష్మీ-నారాయణులు ఇరువురూ వచ్చేస్తారు. రెండు భుజాలు లక్ష్మివి, రెండు నారాయణునివి.
ఇది కూడా భారతవాసులకు తెలియదు. మహాలక్ష్మికి 4 భుజాలు ఉన్నాయి, దీని అర్థం వారు
యుగళ్ రూపమని. విష్ణువు చతుర్భుజుడు.
ప్రదర్శనీలోనైతే ప్రతి రోజు అర్థం చేయించడము జరుగుతుంది. రథాన్ని కూడా చూపించారు.
అర్జునుడు రథములో కూర్చున్నాడని, కృష్ణుడు రథాన్ని నడిపేవారని అంటారు. ఇవన్నీ కథలు.
ఇప్పుడు ఇవి జ్ఞానానికి సంబంధించిన విషయాలు. జ్ఞానామృత కలశాన్ని లక్ష్మి శిరస్సుపై
పెట్టినట్లుగా చూపిస్తారు. వాస్తవానికి కలశము జగదంబపై పెట్టారు, ఆమె తర్వాత
లక్ష్మిగా అవుతారు. ఇది కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే
మతముపై నడిచే మనుష్యులు ఉంటారు. దేవతలది ఒకే మతము. దేవతలనే శ్రీ అని అంటారు,
ఇతరులెవ్వరినీ అనరు. ఇతరులకు అర్థం చేయించేందుకు కొన్ని పదాలే ఉండాలని బాబాకు ఆలోచన
నడుస్తుంది. ఈ అంతిమ జన్మలో 5 వికారాలపై విజయము పొందినట్లయితే మీరు రామ రాజ్యానికి
యజమానులుగా అవుతారు. ఇది సులువైన ఒప్పందము. తండ్రి వచ్చి అవినాశీ జ్ఞాన రత్నాలను
దానము ఇస్తారు. తండ్రి జ్ఞానసాగరుడు. వారే జ్ఞాన రత్నాలను ఇస్తారు. ఇంద్రసభలో సబ్జ
పరి, పుఖరాజ పరి అని కొందరు దేవకన్యలు కూడా ఉన్నారు. అందరూ సహాయము చేసేవారే.
వజ్రాలలో రకరకాలవి ఉంటాయి కదా, అందుకే నవ రత్నాలను చూపించారు. ఎవరైతే మంచి రీతిలో
చదువుకుంటారో, పదవిని కూడా తప్పకుండా వారే పొందుతారు. నంబరువారుగానైతే ఉన్నారు కదా.
పురుషార్థము చేసే సమయమే ఇది. మనము తండ్రి మాలలోని మణులుగా అవుతాము అనైతే పిల్లలు
అర్థం చేసుకుంటారు. ఎంతగా శివాబాబాను స్మృతి చేస్తామో, అంతగా మనము స్మృతియాత్రలో
పరుగు తీసినట్లు. పాపాలు కూడా త్వరగా వినాశనమవుతాయి.
ఈ చదువు చాలా పెద్దగా ఏమీ లేదు, కేవలం పవిత్రముగా ఉండాలి. దైవీ గుణాలను కూడా
ధారణ చేయాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. రాళ్ళు విసిరేవారు రాతిబుద్ధి
కలవారిగానే అవుతారు. రత్నాలను అందించేవారే ఉన్నత పదవిని పొందుతారు. ఇది చాలా సహజము.
జిజ్ఞాసువులకు అర్థం చేయించండి - పతిత-పావనుడు, సర్వుల ముక్తి-జీవన్ముక్తిదాత అయిన
పరమపిత పరమాత్మ శివుడు చెప్తున్నారు - ఓ భారతవాసులైన ఆత్మిక పిల్లలూ, రావణ రాజ్యమైన
మృత్యులోకములో, ఈ కలియుగీ అంతిమ జన్మలో పవిత్రముగా ఉన్నట్లయితే మరియు పరమపిత
పరమాత్మ శివునితో బుద్ధియోగ బలము యొక్క యాత్రతో, తమోప్రధాన ఆత్మలు సతోప్రధాన
ఆత్మలుగా అయి సతోప్రధాన సత్యయుగీ విశ్వములో పవిత్రత, సుఖము, శాంతి, సంపదలతో
సంపన్నమైన, మర్యాదా పురుషోత్తమ దైవీ స్వరాజ్య పదవిని, 5 వేల సంవత్సరాల క్రితము వలె
మళ్ళీ పొందగలరు. కానీ జరగబోయే మహాభారీ వినాశనానికి ముందే తండ్రి మనకు వారసత్వాన్ని
ఇస్తారు, చదువును చదివిస్తారు. ఎంతగా చదువుకుంటారో, అంతటి పదవిని పొందుతారు. వారు
తప్పకుండా తోడుగానైతే తీసుకువెళ్తారు, మరి మనకు ఈ పాత శరీరము మరియు ఈ ప్రపంచము
యొక్క ఆలోచనలు ఎందుకు ఉండాలి. ఇది మీరు పాత ప్రపంచాన్ని వదిలిపెట్టే సమయము. బుద్ధిలో
ఇటువంటి విషయాల మంథనము జరుగుతూ ఉన్నా సరే చాలా మంచిది. మున్ముందు పురుషార్థము
చేస్తూ-చేస్తూ సమయము వస్తూ ఉంటుంది, అప్పుడిక గుటకలు మింగరు. ప్రపంచము కూడా ఇక కొంత
సమయమే ఉంటుందని చూస్తున్నారు కావున బుద్ధియోగాన్ని జోడించాలి. సేవ చేస్తే సహాయము
కూడా లభిస్తుంది. ఎంతగా ఎవరికైనా సుఖము యొక్క మార్గాన్ని తెలియజేస్తారో, అంతగా
సంతోషము కలుగుతుంది. పురుషార్థము కూడా నడుస్తుంది. భాగ్యము కనిపిస్తుంది. తండ్రి
అయితే పురుషార్థాన్ని నేర్పిస్తున్నారు. కొంతమంది అందులో నిమగ్నమైపోతారు, కొంతమంది
నిమగ్నమవ్వరు. కోటీశ్వరులు, పదమపతులు అందరూ అలానే సమాప్తమైపోతారని మీకు తెలుసు.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.